చెల్లింపు వార్తల సమయంలో మీరు ఏమయ్యారు...?
ఆ సమయంలో నోటికి గుడ్డకట్టుకుంటే బాగుండేది...!!
తెలుగు జర్నలిజానికి చెల్లింపు వార్తల చెదలు పట్టినప్పుడు జర్నలిజాన్ని రక్షించండి బాబోయి అంటూ మీరు ఎందుకు ప్రశ్నించలేదు... నేరం చేస్తున్న యాజమాన్యాలది ఎంత తప్పో ఆ నేరానికి సహకరించినా లేదా నేరాన్ని చూస్తూ ఊరుకోవడమూ అంతే తప్పు కాదా...? చెల్లింపు వార్తల చీడపీడ నుంచి ఈ మీడియా రక్షించండని మీరు గొంతెత్తి ఉంటే ఇప్పుడు జనం మీ వెంట నిలిచేవారు కదా....!
ప్రపంచ జీవ వైవిధ్య సదస్సు పాసుల పంపకంలో, అసెంబ్లీ పాసుల విషయంలో టీ న్యూస్, వీ6 ఛానెళ్ల విలేకరులకు పాసులు నిరాకరించినప్పుడు మీరు ఎందుకు నిరసన తెలపలేదు.... జర్నలిస్టులంతా ఒకే కులం కదా... కనీసం మీ కులమైన విలేకరులపై వివక్షపై నోరు మెదపలేదు ఎందుకు? కనీసం ఒక కాకి ఆపదలో ఉంటే పది కాకులు చేరి రక్షించాలని చూస్తాయి కదా.. మరి మీ జర్నలిస్టులపై ఆ సమయంలో జరిగిన పక్షపాతంపై గర్జించలేదు ఎందుకు? ఆ సమయంలో జర్నలిజాన్ని బతికించుకోవాలని, విలువలను కాపాడుకోవాలని మీకు అనిపించలేదా?
స్టూడియో-ఎన్‌లో విలేకరులను 70 మందిని అకారణంగా తొలగించినప్పుడు మీరంతా ఎందుకు వారి పక్షాన నిలబడలేదు... వారి కోసం ఆందోళన
ఎందుకు చేయలేదు...? రోడ్డున పడ్డ వారంతా మీ జర్నలిస్టు కులం వాళ్లే కదా... ఆ సమయంలో జర్నలిజాన్ని, జర్నలిస్టులను కాపాడుకోవడానికి ధర్నాలు చేయలేదు ఎందుకు?
వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం అనంతరం టీవీ5, సాక్షి టీవీలో వచ్చిన కథనాలపై ప్రభుత్వం స్పందించి విలేకరులను అరెస్టు చేసినప్పుడు ఇది తప్పుడు చర్య అని ఎందుకు ఖండించలేదు.... వాళ్లు జర్నలిస్టులు, వాళ్లకు స్వేచ్ఛ ఉంటుంది, వారిని నిర్బంధించడం అన్యాయం అనలేదు ఎందుకు?
సాక్షి ఆస్తులను స్తంభింపజేసినప్పుడు వందల మంది జర్నలిస్టులు రోడ్డున పడతారని తెలిసినా... వారిని ఆదుకోవాలంటూ ఎందుకు గళం విప్పలేదు..? వాళ్లు మీలాంటి జర్నలిస్టులే కదా... !
ఆంధ్రా ప్రాంతంలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన టీవీ ఛానెళ్ల ప్రసారాలు ఎన్నేళ్లుగానో రాకపోయినా మీకు తప్పుగా కనిపించలేదు ఎందుకు?
అయ్యా... ఆంధ్రా ఎంఎస్‌వోలు... మీరు చేస్తున్నది తప్పుడు చర్య అని ఎందుకు పల్లెత్తు మాట అనలేదు మీరు?
నమస్తే తెలంగాణ పేపర్లను ఆంధ్రాలో పంచితే దాడులు జరిగినప్పుడు కనీసం మీ ఛానెల్‌లో ఒక బ్రేకింగ్ న్యూస్ వేయలేదు ఎందుకు?
ఆ సమయంలో సాటి మీడియా సంస్థపై దాడి జరిగిందన్న విషయాన్ని మరచిపోయారా?
మీ మీడియా ఛానెల్‌లో ఒక ప్రాంత ప్రజాప్రతినిధులను కించపరుస్తూ కార్యక్రమం వస్తే... ఇది తప్పు.. అని రోడ్డు మీదకు వచ్చి అని ఉంటే బాగుండేది కదా... జర్నలిజం విలువలకు కట్టుబడి ఉందాం అని సూచించి ఉంటే బాగుండేది కదా....
నిజామాబాద్ ఉప ఎన్నికలో డి.శ్రీనివాస్ ను గెలిపించేందుకు తప్పుడు వార్తా ప్రసారాలను చేస్తున్నప్పుడు.. మీరు నల్ల గుడ్డలు కట్టుకుని
నిరసన తెలిపి ఉంటే తెలంగాణ జనం హర్షించేవాళ్లు కదా...
గుజరాత్‌లో సెన్సేషన్ కోసం టీవీ9 విలేకరి ఒకతన్ని ఆత్మహుతికి ప్రోత్సహించి... అతడి మరణానికి కారణం అయినప్పుడు మీరు స్పందించలేదు ఎందుకు? ఇదేం పాత్రికేయమని నిరసించలేదు ఎందుకు?
చెప్పుకుంటూపోతే గుండెకోతను మిగిత్చే చేదు జ్ఞాపకాల్లెన్నో ఉన్నాయి....మీ మీడియా సంస్థ చేసిన గాయాలు ఇప్పట్లో మానవు... పది మంది కోసం కోట్ల మంది ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలకు మద్దతు ఇచ్చే వాళ్లు ఎవరూ ఉండరని నా నమ్మకం..!!

No comments:
Post a Comment