1

1

Wednesday, 10 September 2014

ఓ అర్నాబ్ గోస్వామి... టైమ్స్ నౌ ఛానెల్‌.... వంద కోట్ల ప‌రువు న‌ష్టం కేసు....!!

తెలంగాణ వాంట్స్ టూ నో...!!!

ఓ అర్నాబ్ గోస్వామి... టైమ్స్ నౌ ఛానెల్‌.... వంద కోట్ల ప‌రువు న‌ష్టం కేసు....!!

అర్నాబ్ గారి ఆప‌రేష‌న్ క‌థ‌...


మీడియా ముసుగులో ఏమైనా చేయొచ్చు... బ్రేకింగ్ న్యూస్‌ల పేరిట  త‌ప్పు ఒప్పుల‌ను స‌రిచూసుకోకుండా  న‌చ్చిన‌ తీర్పులు ఇవ్వొచ్చు అనుకునే సోకాల్డ్ మీడియా మేధావుల‌కు టైమ్స్ నౌ ప‌రువు న‌ష్టం కేసు గురించి తెలియ‌దు కావొచ్చు.. తెలిసినా దాని గురించి మాట్లాడుకోవ‌డానికి సిగ్గుగా అనిపిస్తుందేమో...!!



కానీ తెలంగాణ స‌మాజానికి టైమ్స్ నౌ ఛానెల్ కు సంబంధించి ఒక విష‌యాన్ని చెప్ప‌ద‌ల‌చుకున్నా.... దేశంలో అతి ఎక్కువ ప‌రువు న‌ష్టం దావా(రూ.100 కోట్లు)ను ఎదుర్కొన్న ఛానెల్ ఏదైనా ఉందా?   అంటే అది టైమ్స్ నౌ మాత్రామే.. ఈ కేసులో బాంబే హైకోర్టు రూ.100 కోట్లు క‌ట్ట‌మ‌ని ఆదేశం ఇస్తే... గిల‌గిల కొట్టుకుంది ఆ ఛానెల్‌...  చివ‌ర‌కు చిన్న త‌ప్పున‌కు పెద్ద శిక్షా అంటూ సానుభూతిని పెంచుకునేందుకు ప్ర‌య‌త్నించింది... ఈ కేసు చివ‌ర‌కు ఏమైందో నేను ఫాలో కాలేదు...



పూర్వాపరాలు ఇవి....


సెప్టెంబ‌రు 10, 2008లో ఘ‌జియాబాద్‌లో జ‌రిగిన భ‌విష్య నిధి కుంభ‌కోణానికి సంబంధించిన కేసులో  ఒక సుప్రీంకోర్టు మాజీ న్యాయ‌మూర్తి సావంత్‌ ఫొటోను వేసి ఆయ‌న‌ను దోషి అని ప్ర‌చారం చేసింది... వాస్త‌వానికి ఆయ‌న దోషి కాదు... త‌ప్పుడు ఫొటోతో క‌థ‌నాన్ని ప్ర‌సారం చేసింది టైమ్స్ నౌ ఛానెల్‌... అప్పుడు సో కాల్డ్ మేధావి, స్వ‌యం ప్ర‌క‌టిత మీడియా న్యాయ‌మూర్తి అర్నాబ్ గోస్వామి గారు అదే ఛానెల్‌లో ఉన్నారు... త‌ప్పు జ‌రిగింద‌ని తెలిసిన త‌ర్వాత క‌నీసం క్ష‌మాప‌ణ కోర‌లేదు..   చివ‌ర‌కు 2008, సెప్టెంబ‌రు 15న‌ మాజీ న్యాయ‌మూర్తి కోర్టు ద్వారా రూ.100 కోట్ల‌కు ప‌రువు న‌ష్టం దావా నోటీసు పంపిన వెంట‌నే టైమ్స్ నౌ ఛానెల్, అర్నాబ్ గోస్వామి ఉలిక్కి ప‌డ్డారు...


2008 సెప్టెంబ‌రు 23వ తేదీ నుంచి క్ష‌మాప‌ణ కోరుతున్న‌ట్లు టీవీలో స్క్రోలింగ్ వేశారు.. త‌ప్పు జ‌రిగిన త‌ర్వాత స్పందించ‌కుండా లీగ‌ల్ నోటీస్ ఇచ్చాక ఎలా స్పందిస్తార‌ని  ఆ మాజీ న్యాయ‌మూర్తిగా అస‌హ‌నం వ్య‌క్తం చేశారు... దీంతో మ‌న సోకాల్డ్ జ‌ర్న‌లిస్టు, టైమ్స్ నౌ ఎడిట‌ర్ ఇన్ చీఫ్‌ మేథావి అర్నాబ్ గారు ఆ మాజీ న్యాయ‌మూర్తికి ఒక లేఖ రాసి.. అపాయింట్‌మెంట్ ఇస్తే వ‌చ్చి క‌లుస్తాన‌ని అడిగారు.. పాపం పెద్ద మ‌న‌సుతో ఆ మాజీ న్యాయ‌మూర్తిగా అపాయింట్ మెంట్ ఇచ్చారు...  కానీ అర్నాబ్ గోస్వామి గారు ఆ రోజున ఆ పెద్దాయ‌న‌ను క‌ల‌వ‌లేదు... ఫోన్ చేసి త‌న‌కు ఆప‌రేష‌న్ ఉంద‌ని చెప్పాడు... విచిత్రం ఏంటంటే అదే రోజు సాయంత్రం పాపం ఆ మాజీ న్యాయ‌మూర్తిగా టీవీ పెట్టుకుని చూస్తే లైవ్ ప్రొగ్రామ్‌లో
మ‌న ఆర్నాబ్ గోస్వామి గారు రెచ్చిపోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే ఈయ‌నకు కోపం వ‌చ్చింది...
మీడియా ఆగ‌డాల‌కు అడ్డుకట్ట వేయాల‌ని.. ఎట్టి ప‌రిస్థితుల్లోనైనా ఆ ఛానెల్‌కు బుద్ది చెప్పాల‌ని రూ.100 కోట్ల‌ ప‌రువు న‌ష్టం కేసును కొన‌సాగించారు.. బాంబే హైకోర్టు కూడా ఆయ‌న‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది...
త‌ర్వాత ఏం జ‌రిగింది... అర్నాబ్ గోస్వామి ఎవ‌రి వ‌ద్ద‌కు వెళ్లాడు..!!  లేదా టైమ్స్ నౌ ఛానెల్ ఆ డ‌బ్బు క‌ట్టి త‌ప్పించుకుందా అన్న‌ది నేను ఫాలో కాలేదు...


పాపం ఇప్పుడు కూడా శ్రీ అర్నాబ్ గోస్వామి గారు రెచ్చిపోయి కేసీఆర్ విష‌యంలో మాట్లాడుతున్నారు... వాస్త‌వాలు తెలుసుకోకుండా తీర్పులు చెబుతున్నారు.. ఇలాగే కొన‌సాగితే తెలంగాణ ప్ర‌జ‌లంతా క‌లిసి రూ.వెయ్యి కోట్ల ప‌రువు న‌ష్టం దావా వేస్తే ఆయ‌న గారు ఏం చేస్తారో మ‌రి...!!

2 comments:

  1. నాలుగో స్తంభాలు నిజ్జంగా మార్తాయంటారా???

    ReplyDelete