1

1

Wednesday 16 March 2016

భూ క‌బ్జాదారులైన కార్పోరేట‌ర్ల భ‌ర‌తం ప‌ట్టాలి...

కార్పోరేట‌ర్లు భూ దందాలు, అక్ర‌మాల‌ జోలికి వెళ్లొద్ద‌ని హిత‌వు చెబుతున్నారు డిప్యూటీ సీఎం గారు.. అస‌లు భూ దందాలే జీవితంగా బ‌తుకుతున్న కార్పోరేట‌ర్లు ఈ మాట‌ల‌ను ప‌ట్టించుకుంటారా? వారు నీతి వాక్యాల‌తో మారుతార‌నుకోవ‌డం అత్యాశే.. సీఎం గారు నీతి వాక్యాలు చెప్పినా ప‌ట్టించుకునే స్థితిలో వారు లేరు.. క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటే త‌ప్ప దారికొచ్చే ర‌కం కాదు.. కొంద‌రు కార్పోరేట‌ర్ల తీరును స్వ‌యంగా చూశాను కాబ‌ట్టే ఈ మాట‌లు చెబుతున్నాను.. అధికార పార్టీలో ఉన్న వాళ్లంతా కేసీఆర్ మాదిరిగా నిజాయ‌తీగా ఉండాల‌నే నిబంధ‌న లేదు..
ఇత‌ర పార్టీల నుంచి వ‌స్తున్న వారంద‌రినీ చేర్చుకున్నాం.. కానీ వారికి అల‌వాటైన అవ‌ల‌క్ష‌ణాలు అంత త్వ‌ర‌గా పోయే అవ‌కాశం లేదు క‌దా.. దానికి తోడు అధికార పార్టీ లో చేర‌డంతో క‌లిసొచ్చిన అధికార ద‌ర్పం.. వెర‌సి ఇక కొంద‌రు కార్పోరేట‌ర్ల‌కు అడ్డూ అదుపూ లేకుండా పోయింది... ఇలాంటి అవినీతి కార్పోరేట‌ర్ల తీరు మార‌కుంటే భ‌విష్య‌త్ లో పార్టీకి తీర‌ని న‌ష్టం జ‌రిగే అవ‌కాశం లేక‌పోలేదు.. త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. !!

ఈ ఆర్థిక ఉగ్ర‌వాదుల అప్ప‌గింత‌కు ఒప్పందాలు చేసుకోవాలి...!


ఈ ఆర్థిక ఉగ్ర‌వాదుల అప్ప‌గింత‌కు ఒప్పందాలు చేసుకోవాలి...!
*****
చోటా రాజ‌న్‌, చోటా ష‌కీల్ లాంటి నిందితుల‌ను మ‌న దేశానికి అప్ప‌గించేలా వివిధ దేశాల‌తో ఒప్పందాలు చేసుకున్నాం స‌రే..
మ‌రి ల‌లిత్ మోడీ, విజ‌య్ మాల్యా లాంటి నిందితుల‌ను కూడా అప్ప‌గించేలా ఒప్పందాలు చేసుకుంటారా?
లేక వీళ్లు కూడా దావూద్ ఇబ్ర‌హీం మాదిరిగానే ఇక ప‌త్తా లేకుండా పోతారా?
నోట్ : నా దృష్టిలో దావూద్ కు, విజ‌య్ మాల్యాకు పెద్ద తేడా లేద‌నిపిస్తుంది.. ఎందుకంటే ఇద్ద‌రూ ప‌రారీలో ఉన్న నిందితులే...!!

ఈ స్ఫూర్తి కొనసాగాలి..






రాజ‌కీయాల్లో వాళ్లు ప్ర‌త్య‌ర్థులు.. ఒక‌రి రాజ‌కీయ భ‌విష్య‌త్ ను మ‌రొక‌రు దెబ్బ తీశారు.. అయినా స‌రే రాజ‌కీయాలు రాజ‌కీయాలే.. స్వ‌రాష్ట్ర ప్ర‌యోజ‌నాల విష‌యంలో మేమంతా ఒక‌టే.. మ‌న తెలంగాణ స‌స్య‌శ్యామ‌లం కావాల్సిందే అన్నదే వారి ఆకాంక్ష‌. రాజ‌కీయాల‌కు అతీతంగా, పార్టీల‌కు అతీతంగా తెలంగాణ ప్ర‌యోజ‌న‌మే ప‌ర‌మావ‌ధిగా ముంద‌డుగు వేశారు. మ‌హారాష్ట్ర‌ను ఒప్పించి జ‌ల వివాదాల‌ను ప‌రిష్క‌రించుకుంటూ చ‌రిత్రాత్మ‌క ముంద‌డుగు వేశారు. ఈ విష‌యంలో కేసీఆర్ ఎంత చొర‌వ తీసుకున్నారో.. అదే స్థాయిలో మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావు గారు చొర‌వ తీసుకున్నారు. ఇద్ద‌రు క‌లిసి తెలంగాణ‌కు మేలు చేకూర్చారు. వారిద్ద‌రికీ హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు.
వీళ్లిద్ద‌రే కాకుండా హ‌రీశ్ రావు, ఢిల్లీలో ఉన్న తెలంగాణ బిడ్డ శ్రీ‌రాం వెదిరె, మ‌న జ‌ల వ‌న‌రుల నిపుణులు విద్యాసాగ‌ర్ రావు గారికి హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు. ఇక మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌విస్ పేరును మ‌ర‌చిపోతే ఈ పోస్టుకు అర్థం ఉండ‌దు. ఈ ఒప్పందానికి సుముఖ‌త తెలియ‌జేసిన ఆయ‌న‌కు తెలంగాణ ప్ర‌జానీకం త‌ర‌ఫున కృత‌జ్ఞ‌త‌లు..
****
మ‌నం ఏ పార్టీలో ఉన్నా స‌రే మ‌న తెలంగాణ ప్ర‌యోజ‌నాల విష‌యంలో ఏకం కావాల్సిందే. ఈ స్ఫూర్తి నిరంత‌రం కొన‌సాగాలి. మిగిలిన పార్టీల నేత‌లు కూడా సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడు సంఘ‌టితంగా ముందుకు సాగాలి. మ‌న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ‌గా మార్చాలి. జై తెలంగాణ‌.. జై జై తెలంగాణ‌..!!
*****
నోట్ : మ‌హారాష్ట్ర‌లో కాంగ్రెస్‌, ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు కూడా ఇలాంటి చ‌రిత్రాత్మ‌క ఒప్పందాలు జ‌ర‌గ‌లేదు.. కార‌ణం ఒక్క‌టే.. తెలంగాణ‌ను స‌స్య‌శ్యామ‌లం చేయాల‌న్న చిత్త‌శుద్ధి అప్ప‌టి పాల‌కుల‌కు లోపించ‌డ‌మే.. పాలించిన వాడు మ‌నోడు అయితే మ‌న గురించి ఆలోచిస్తాడు.. కాక‌పోవ‌డం వ‌ల్లే దాదాపు 60 ఏళ్లు తండ్లాట ప‌డ్డాం. అప్ప‌టికీ ఇప్ప‌టికీ పాల‌న‌లో తేడా సుస్ప‌ష్టంగా క‌నిపిస్తుంది.

రాజ‌గురువు ప‌త్రికే సెల‌వివ్వాలి...

రింగు రోడ్డు చుట్టూ అప్ప‌ట్లో కాంగ్రెస్ నేత‌లు భూములు కొనుగోలు చేస్తే పెద్ద‌లా గ‌ద్ద‌లా? అంటూ క‌థ‌నాలు వ‌చ్చాయి...
మ‌రి ఇప్పుడు అమ‌రావ‌తి చుట్టూ వాలిని వారిని ఏమ‌నాలో? రాజ‌గురువు ప‌త్రికే సెల‌వివ్వాలి...

వీణ‌వంక అత్యాచార ఘ‌ట‌న‌లో ముగ్గురు నిందితుల కు ఎలాంటి శిక్ష ప‌డుతుంది..?

వీణ‌వంక అత్యాచార ఘ‌ట‌న‌లో ముగ్గురు నిందితుల కు ఎలాంటి శిక్ష ప‌డుతుంది..?
నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డ‌మే కాకుండా బాధ్య‌తార‌హితంగా వ్య‌వ‌హ‌రించిన పోలీసుల‌ పై ఎలాంటి చ‌ర్య‌లుంటాయి.. ?
షీ టీమ్స్ తో మ‌హిళ‌ల‌కు అండ‌గా నిలుస్తున్న రాష్ట్రంగా గుర్తింపు పొందిన తెలంగాణ‌కు వీణ‌వంక పోలీసులు క‌ళంకం తెచ్చారా?
నిందితుల‌ను జువైన‌ల్ హోమ్స్ కు త‌ర‌లించార‌ని వార్త‌లు వ‌చ్చాయి.. అది నిజ‌మేనా... జువైన‌ల్ చ‌ట్టంలో మార్పులు చేశారు క‌దా.. వారిని క‌ఠినంగా శిక్షించేందుకు ఇప్పుడు ఆస్కారం ఉంటుంది క‌దా.. మ‌రి పోలీసులు ద‌ర్యాప్తును నిజాయ‌తీగా చేస్తారా?

Friday 19 February 2016

ఫొటో గ్రాఫ‌ర్ల‌కు విజ్ఞ‌ప్తి..

ఫొటో గ్రాఫ‌ర్ల‌కు విజ్ఞ‌ప్తి..
***
మేడారంలో మ‌హిళా భ‌క్తుల పుణ్య స్నానాల ఫొటోల‌కు బ‌దులుగా భ‌క్తులు స‌మ‌ర్పించే నిలువు బంగారం ఫొటోను తీసి ప్ర‌చురిస్తే బాగుంటుంది.. ఇది మ‌న‌వి మాత్ర‌మే..
ప‌త్రికా స్వేచ్ఛ‌ను హ‌రించ‌డం కాదు.. జ‌ర్న‌లిస్టుల హ‌క్కుల‌ను కాల‌రాయ‌డం అంత‌క‌న్నా కాదు.. అర్థం చేసుకుంటార‌న్న చిన్న ఆశ మాత్ర‌మే..
Note : ఒక‌వేళ పుణ్య స్నానాల ఫొటోలు వాడాల‌నుకుంటే లాంగ్ షాట్ ఫొటోలు వాడండి.. క్లోజ‌ప్ లో వాడొద్దు ప్లీజ్‌..

స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ‌ల‌కు మొక్కు చెల్లించుకున్న బాల‌కృష్ణ‌

మేడారం జాత‌ర‌లో స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ‌ల‌ను ద‌ర్శించుకొని నిలువెత్తు బంగారాన్ని స‌మ‌ర్పిస్తున్న హిందూపురం (ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం, అనంత‌పురం జిల్లా) ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ‌.

హోట‌ల్ శంక‌ర‌మ్మ‌ను ఆదుకోండి ముఖ్య‌మంత్రి గారూ..

ముఖ్య‌మంత్రి గారికి విజ్ఞ‌ప్తి.
********
తోట శంక‌ర‌మ్మ అలియాస్ హోట‌ల్ శంక‌ర‌మ్మ‌. టీఆర్ఎస్ మ‌హిళా నేత‌గా ప‌నిచేశార‌ట‌.
ఈమెకు ప‌క్ష‌వాతం వ‌చ్చింద‌ట‌.
చ‌నిపోయేలోగా ఒక్క‌సారైనా కేసీఆర్ ను క‌ల‌వాల‌నుకుంటున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ కోసం చాలా ఈమె క‌ష్ట‌ప‌డిన‌ట్లు వార్త‌లో రాశారు.
టీఆర్ఎస్ పార్టీ జిల్లాలో బ‌లంగా లేన‌ప్పుడు తొలి బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించిన వ్య‌క్తి హోట‌ల్ శంక‌ర‌మ్మ అని పేర్కొన్నారు.
ముఖ్య‌మంత్రి గారు ఈమెతో ఒక సారి మాట్లాడితే బాగుంటుంది..
ఈ మహిళా నేత‌ను ఆదుకునేలా జిల్లా నాయ‌కుల‌ కు ఆదేశాలు ఇస్తే బాగుంటుంది.
మొద‌టి నుంచి పార్టీకి సేవ‌లు అందిస్తున్న వారి కోసం ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూపొందించాలి.
వారిని పార్టీ త‌ర‌ఫున ఆదుకోవాలి. ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు చేసినా ప‌ట్టించుకోకుండా పార్టీ అధినేత‌కు, పార్టీకి క‌ష్ట‌కాలంలో అండ‌గా నిలిచిన వారంద‌రినీ స‌ముచితంగా గౌర‌వించుకోవాలి.

ఈ నెల‌లో రెండు వీడియోలు న‌న్ను అత్యంత క‌ల‌చివేశాయి..


ఈ నెల‌లో రెండు వీడియోలు న‌న్ను అత్యంత క‌ల‌చివేశాయి.. 
ఈ దేశ భ‌క్తుల‌ మ‌నో ధైర్యానికి నిజంగా హ్యాట్సాఫ్‌..!!
*********
ఎండ‌లో గంట సేపు ఉండ‌లేం. చ‌లికాలం అస‌లు భ‌రించ‌లేం. అలాంటిది మంచు కింద ఆరు రోజులు కూరుకుపోయినా స‌రే ప్రాణాల‌తో క‌నిపించిన దివంగ‌త లాన్స్ నాయ‌క్ హ‌నుమంత‌ప్ప వీడియో క‌న్నీళ్లు తెప్పించింది. ఈ వీడియో ఎంద‌రిలోనో దేశ భ‌క్తిని ప్రేరేపించింది. కుల మ‌తాల‌క‌తీతంగా అంద‌రం ప్రార్థించినా, వైద్యులు శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నించినా స‌రే దుర‌దృష్ట‌వ‌శాత్తూ ఆయ‌నను మ‌నం బ‌తికించుకోలేక‌పోయాం.. కానీ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లోనూ మ‌నో ధైర్యాన్ని కోల్పోకుండా ఉండాల‌న్న సందేశాన్ని ఇచ్చి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు వీర సైనికుడు లాన్స్ నాయ‌క్ హ‌నుమంత‌ప్ప‌.. ఆ వీరుడికి జోహారు..!!
****
చిన్న ముల్లు గుచ్చుకుంటే త‌ట్టుకోలేం. కాలికి దెబ్బ త‌గిలితేనే అల్లాడిపోతాం. కానీ శ‌రీరం ఛిద్ర‌మైనా, మృత్యువు క‌ళ్ల ముందు క‌నిపిస్తున్నా స‌రే.. మ‌నో నిబ్బ‌రం ప్ర‌ద‌ర్శించి ఛిద్ర‌మైన త‌న శ‌రీరంలో ప‌నికొచ్చే అవ‌య‌వాల‌ను దానం చేయాల‌నే సంక‌ల్ప‌న్ని చాటిన హ‌రీశ్ నంజ‌ప్ప వీడియో చూసి ఏడ‌వ‌కుండా ఉండ‌లేక‌పోయాను. ఆ యువ‌కుడిలోని సామాజిక స్పృహ‌, సామాజిక బాధ్య‌త చూస్తుంటే దేశం మ‌రో బాధ్య‌తాయుత‌మైన పౌరుడిని కోల్పోయింద‌న్న భావ‌న క‌లిగింది.
హ‌రీశ్‌ కుటుంబ ప‌రిస్థితి గురించి ఇంట‌ర్నెట్ లో చ‌దివితే.. ఎనిమిదో ఏట‌నే తండ్రిని కోల్పోయాడు హ‌రీశ్ నంజ‌ప్ప‌. చిన్న త‌నం నుంచి త‌మ కోసం త‌ల్లి క‌ష్ట‌ప‌డ‌టం చూడ‌లేక బెంగ‌ళూరులో లాజిస్టిక్ కంపెనీలో ప‌నిచేస్తున్నాడు. కుటుంబ బాధ్య‌త‌ను మోస్తున్నాడ‌ట‌. ఇక ఆయ‌న స్వ‌గ్రామానికి వెళ్లింది కూడా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఓటేయ‌డానికి. ఉన్న‌త కొలువులు చేస్తూ, సంప‌న్న కుటుంబాల్లో పుట్టిన కొంద‌రు ఓట్ల పండ‌గ రోజు సెల‌వు దొరికితే సినిమాల‌కు పోతున్న రోజులివి. కానీ వారంద‌రికీ భిన్నంగా హ‌రీశ్ నంజ‌ప్ప ఓటేసి వ‌స్తూ ప్ర‌మాదానికి గురి కావ‌డం, శ‌రీరం ఛిద్ర‌మైనా స‌రే నా వాళ్ల‌కు స‌మాచారం ఇవ్వ‌మ‌ని అడ‌గ‌కుండా, నా అవ‌య‌వాల‌ను దానం చేయ‌మ‌ని ప‌దేప‌దే కోర‌డం ఆయ‌న‌లోని సేవా గుణానికి నిలువెత్తు నిద‌ర్శ‌నం. స‌మాజంలో బాధ్య‌తాయువ‌తంగా మెల‌గ‌డం ఎలాగో అత‌డిని చూసి నేర్చుకోవ‌చ్చు.
త‌న క‌ళ్ల‌తో ఓ అంధుడికి చూపు ప్ర‌సాదిస్తున్న హ‌రీశ్ నంజ‌ప్ప ఈ స‌మాజాన్ని నిరంత‌రం చూస్తూనే ఉంటాడు. మ‌న‌తో జీవిస్తూ ఉంటారు.
అవ‌య‌వ దానంతో అమ‌రుడైన హ‌రీశ్ నంజ‌ప్ప‌ హ్యాట్సాఫ్‌..
***********
నోట్ : విచిత్రం ఏంటో గాని ఈ ఇద్ద‌రు యువ‌కులూ క‌ర్ణాట‌కకు చెందిన వారు కావ‌డం విశేషం. ఇక వీరి పేర్లు హెచ్ తో మొద‌లు కావ‌డం గ‌మనార్హం.

52 ఏళ్లు ఆరెస్సెస్ ఆఫీసుపై జెండా ఎగ‌రేయ‌లేద‌ట‌...


http://timesofindia.indiatimes.com/city/pune/Tri-colour-hoisted-at-RSS-HQ-after-52-yrs/articleshow/1561733136.cms

దాదాపు 52 ఏళ్ల త‌ర్వాత తొలిసారిగా 2002 లో నాగ్ పూర్ లోని ఆరెస్సెస్ ప్ర‌ధాన కార్యాల‌యంలో జ‌న‌వ‌రి 26 సంద‌ర్భంగా జాతీయ ప‌తాకాన్ని ఎగ‌ర‌వేశార‌ట‌.. తొలిసారి 1947 ఆగ‌స్టు 15 న‌, త‌ర్వాత 1950 జ‌న‌వ‌రి 26న ఎగ‌ర‌వేశార‌ట‌... 
***
ఇప్పుడే గూగుల్ లో త‌వ్వ‌కాలు జ‌రిపితే హిందూ ప‌త్రిక‌, టైమ్స్ ఆఫ్ ఇండియా ప‌త్రిక‌లో ఈ వార్త వ‌చ్చిన‌ట్లు ఉంది.. మ‌రి 52 ఏళ్లు వీళ్లు జాతీయ జెండా ఎగ‌ర‌వేయ‌కుండా దేశ భ‌క్తులుగా చెలామ‌ణీ అయ్యారా?

జెండా అంటే అది కాదు ఇది...

మిత్రులారా.. జెండా వంద‌నం అంటే త్రివ‌ర్ణ ప‌తాకానికి వంద‌నం చేయాలి.. కొంప‌దీసి ఆరెస్సెస్ వాళ్ల భ‌గ‌వ‌త్ ధ్వ‌జ్ అనుకోకండి...!!

జెండా ఊంఛా ర‌హే హ‌మారా..!!

జెండా ఊంఛా ర‌హే హ‌మారా..!!
********
ఈ దేశంలో జాతి జెండా కున్న ప్రాధాన్యం తెలియ‌ని వాళ్లు ఎంద‌రో ఉన్నారు.. ఇందులో విద్యార్థుల‌నే కాదు చాలా మంది ప్ర‌ముఖులు కూడా ఉన్నారు. ఈ కోవ లోకే ఈ దేశ ప్ర‌ధాన మంత్రి సైతం వ‌స్తారు.. పాపం ఆయ‌న విదేశీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా కొన్ని సార్లు జాతీయ జెండాకు తెలిసో తెలియ‌కో అగౌర‌వం క‌లిగించారు. జెండా త‌ల కిందులుగా ఎగురుతున్నా ప‌ట్టించుకోలేదు.
ఇక ఉప రాష్ట్ర‌ప‌తి గారు జెండాకు వంద‌నం చేయలేద‌ని కొంద‌రు తెగ హ‌డావుడి చేశారు. తీరా ప్రోటోకాల్ ప్ర‌కార‌మే ఆయ‌న ప్ర‌వ‌ర్తించార‌ని తెలిసి ముక్కున వేలేసుకున్నారు. ఇలాంటి నియ‌మాలు తెలియ‌ని మూర్ఖులంతా తామే దేశ భ‌క్తులం.. మిగిలిన వారంతా దేశ ద్రోహుల‌నే దుస్థితి దాపురించింది.
************
ఈ దేశాన్ని పాలించే ప్ర‌ముఖుల‌కే లేని సామాజిక‌ స్పృహ సామాన్యుల‌కు ఎలా ఉంటుంది. ఏదో పంద్రాగ‌స్టు, జ‌న‌వ‌రి 26కు ముందు రెండు మూడు ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చి జాతీయ జెండాను గౌర‌వించాల‌ని అంటే స‌రిపోదు.
ఏది ఏమైతేనేం కేంద్రీయ విశ్వ‌విద్యాల‌యాల్లో జాతీయ జెండాను ఎగ‌ర‌వేయాల‌న్న నిర్ణ‌యం చాలా మంచిది. ఎందుకంటే ఈ దేశానికి అత్య‌ధికంగా రాజ‌కీయ నేత‌ల‌ను పంపుతున్న సంస్థ‌ల్లో కేంద్రీయ‌ విశ్వ‌విద్యాల‌యాలు కూడా ఉన్నాయి. జేఎన్‌యూ నుంచి ఎంద‌రో నేత‌లు పుట్టుకొచ్చారు. జాతీయ జెండాను ఎలా గౌర‌వించాలో, దానికి ఉన్న ప్రాధాన్యం ఏంటో భావి రాజ‌కీయ నేత‌ల‌కు తెలియ‌జెప్ప‌డం మంచి విష‌య‌మే. అయితే జాతీయ జెండాను ఎలా గౌర‌వించాలి. దానికున్న నియ‌మ నిబంధ‌న‌లు ఏమిటో కూడా స్ప‌ష్టంగా తెలియ‌జేయాలి.
ఢిల్లీ లోని చ‌రిత్రాత్మ‌క‌ క‌నాట్ ప్లేస్ లోని సెంట్ర‌ల్ పార్కులో ఎగురుతున్న రీతిలో ప్ర‌తీ గ్రామంలో, మండ‌లంలో, ప‌ట్ట‌ణంలో, న‌గ‌రంలో చ‌రిత్రాత్మ‌క ప్రాంతంలో భారీ మువ్వ‌న్నెల జెండా రెప‌రెప‌లాడాలి. ఈ దిశ‌గా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు చ‌ర్య‌లు తీసుకుంటే ఇంకా బాగుంటుంది.
*********
నోట్ : ప్ర‌భుత్వాలు ఆదేశాలు ఇవ్వ‌క‌ముందే, జేఎన్‌యూ వివాదాలు మొద‌లు కాక‌ముందే గ‌త నాలుగేళ్లుగా నా ఫేసుబుక్ వాల్‌పై మువ్వ‌న్నెల జెండా రెప‌రెప లాడుతూనే ఉంది... అయినా కూడా కొంద‌రు భ‌క్తులు న‌న్ను దేశ ద్రోహి అంటుంటే ఏమ‌నాలో అర్థం కావ‌డం లేదు. !!

కంచె మంచిదే...

ప్ర‌భుత్వ స్థ‌లాల ప‌రిర‌క్ష‌ణ‌కు వాటి చుట్టూ ప్ర‌హ‌రీలు క‌ట్ట‌డ‌మో , కంచెలు వేయ‌డమో చేయాల‌న్న నిర్ణ‌యం బాగుంది. దీన్ని తెలంగాణ వ్యాప్తంగా అమ‌లు చేయాలి. వేల ఎక‌రాల విలువైన ప్ర‌భుత్వ భూముల‌ను కాపాడుకోవాలి. ప్ర‌భుత్వ భూముల ప‌రిర‌క్ష‌ణ‌కు పాటు ప‌డిన అధికారుల‌కు ప్రోత్సాహ‌కాలు కూడా ఇచ్చినా త‌ప్పు లేదు..
అలాగే ప్ర‌భుత్వం వివిధ సంస్థ‌ల‌కు లీజుకు ఇచ్చిన స్థ‌లాల వ‌ద్ద కూడా లీజు ఒప్పందాన్ని తెలిపేలా బోర్డులు పెడితే బాగుంటుంది. ఎన్నేళ్ల‌కు లీజుకు ఇచ్చారు, ఎలాంటి ష‌ర‌తులు ఉన్నాయి త‌దిత‌ర విష‌యాలు అక్క‌డ స్థానికుల‌కు కూడా తెలిసేలా బోర్డులు ఉంచాలి. ఎందుకంటే ఓ వందేళ్ల త‌ర్వాత ఆ భూమి అన్యాక్రాంతం కాకుండా చూడ‌టంలో స్థానికులు తోడ్ప‌డుతారు.
***********
నోట్ : మిత్రులారా... మీకు సొంత ఊళ్ల‌లో స్థ‌లాలు, పొలాలు ఏమైనా ఉన్నాయా? అయితే వాటి చుట్టూ కూడా అర్జెంట్‌గా కంచెలు వేయించుకొని ప్ర‌హ‌రీలు క‌ట్టుకోండి. నిర్ల‌క్ష్యంగా మాత్రం ఉండొద్దు. భూములు క‌బ్జాల‌కు గురైతే తీర‌ని ఆర్థిక‌, మాన‌సిక ఇబ్బందులు మిగల‌డం త‌ప్ప చేసేది ఏమీ ఉండ‌దు..

ఐ ల‌వ్ మై ఇండియా..

ఐ ల‌వ్ మై ఇండియా..
*************
ఎల్టీటీఈ ప్ర‌భాక‌ర‌న్ కూడా త‌మిళుల‌కు న‌చ్చుతాడు.. వారి దృష్టిలో అత‌డు దేశ భ‌క్తుడు.. ఈ దేశంలో అఫ్జ‌ల్ గురు కొంద‌రికి న‌చ్చుతున్నాడు.. పంజాబ్ లోని ఖ‌లిస్థాన్ ఉగ్ర‌వాదులు మ‌రికొంద‌రికి న‌చ్చుతున్నారు.. జాతి పిత‌ను హ‌త‌మార్చిన గాడ్సే మ‌రికొంద‌రికి న‌చ్చుతున్నాడు.. ఇక ఈశాన్య రాష్ట్రాల ముక్క‌లు చేయాల‌నుకునే ఎన్ఎస్‌సీఎన్ ముయివా ఇంకొంద‌రికి ప్రీతిపాత్రుడు.. ఇక రాజీవ్ గాంధీని పాశ‌వికంగా చంపిన కిరాత‌కుల కోసం కొట్లాడే మ‌నుషులు ఉన్నారు.. ఎల్టీటీఈ ప్ర‌భాక‌ర‌న్ ను త‌మ‌కు ఆరాధ్యుడిగా చెప్పుకునే ప్ర‌జ‌లున్నారు.. మ‌న దేశంలో ఒక‌రి దృష్టిలో మ‌రొక‌రు దేశ ద్రోహులుగా క‌నిపిస్తున్నారు..!!
ఇదేందో గాని ఏ విష‌యంలోనైనా స‌రే భార‌త దేశం భిన్న‌త్వంలో ఏక‌త్వం కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంది... ఐ ల‌వ్ మై ఇండియా..!!
నోట్ : ఏక‌త్వం ఎక్క‌డ ఉంద‌ని కొంద‌రు అడ‌గొచ్చు.. కానీ ఇంతగా మాట‌ల యుద్ధం చేసుకునే నేతలు, నాయ‌కులు మ‌ళ్లా త్వ‌ర‌గానే క‌ల‌సి పోవ‌డం ఎన్నిసార్లు చూడ‌లేదు.. దేశంలో ఏదైనా ప్ర‌కృతి విప‌త్తో, యుద్ధ‌మో వ‌స్తే వీళ్లంతా క‌ల‌సి ప‌నిచేయ‌డం ఎన్నిసార్లు వీక్షించ‌లేదు... ఇది కాదా ఏక‌త్వం..!!
జై భార‌త్‌, జై తెలంగాణ‌.

ఆ రోజు వ‌చ్చిన ప్పుడు మ‌న వాళ్ల రియాక్ష‌న్ ఎలా ఉంటుంది?

భార‌త సంత‌తి వాళ్లు అమెరికాలో న్యాయ‌మూర్తి అయ్యారు.. గ‌వ‌ర్న‌ర్ అయ్యారు..క్రికెట‌ర్ అయ్యారు... ఇంకేదో అయ్యారు అని నిత్యం చ‌దువుతున్నాం.. అవ‌కాశం ఉంటే అమెరికా అధ్య‌క్షుడు కూడా కావొచ్చేమో... ఇవ‌న్నీ విని మ‌నం చాలా గ‌ర్విస్తున్నాం... ఇది మంచి విష‌య‌మే. మ‌రి అలాగే అమెరిక‌న్ సంత‌తి వాళ్లో లేక ఇత‌ర దేశాల్లో పుట్టి మ‌న దేశంలో స్థిర‌ప‌డిన వారు భార‌త్ లో న్యాయ‌మూర్తి అయ్యే రోజు, గ‌వ‌ర్న‌రో, ఎమ్మెల్యేనో లేక మంత్రి అయ్యే రోజును మ‌నం చూస్తామా? ఆ రోజు వ‌స్తుందా? ఆ రోజు వ‌చ్చిన ప్పుడు మ‌న వాళ్ల రియాక్ష‌న్ ఎలా ఉంటుంది?
*************
బ్రిట‌న్ కో లేదా ఇంకో దేశానికో మ‌న ప్ర‌ధాని గారు వెళితే భార‌తీయ ప‌ద్ధ‌తుల్లో స్వాగ‌త ఏర్పాట్లు చేసినట్లు మ‌నం చూస్తున్నాం.. గీతా శ్లోకాల ప‌ఠ‌నమో లేక ఇంకేదైనా వైదిక కార్య‌క్ర‌మ నిర్వ‌హ‌ణ జ‌రుగుతున్న‌ట్లు చూస్తున్నాం... మ‌రి అదే బ్రిట‌న్ ప్ర‌ధానో ఇంకెవ‌రో మ‌న దేశానికి వ‌స్తే వాళ్ల ప‌ద్ధ‌తుల్లో (బ్రిట‌న్ ప‌ద్ధతిలో) స్వాగ‌తం ఏర్పాటు చేస్తామా? బైబిల్ ప‌ఠ‌న‌మో లేక ఇంకేదైనా వారి ప‌ద్ధ‌తిలో స్వాగ‌త కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేస్తామా?

ఆర్థిక ఉగ్ర‌వాదుల‌ను వ‌దిలేస్తారా?

దేశ‌ద్రోహులుగా కొంద‌రిపై ముద్రలు వేసి దాడులు చేస్తూ శిక్ష‌లు విధిస్తున్న పెద్ద మ‌నుషులారా...!!
మీకో విజ్ఞ‌ప్తి... ఈ దేశానికి నిజ‌మైన దేశ ద్రోహులు ఎవ‌రైనా ఉన్నారా? అంటే అది కార్పోరేట్ ప‌న్ను ఎగ‌వేత‌దారులే..
బ్యాంకుల నుంచి అక్ష‌రాల రూ.3 ల‌క్ష‌ల కోట్లకు పైగా రుణాలు తీసుకొని క‌ట్ట‌కుండా ఎగ‌వేస్తున్న బ‌డా పారిశ్రామిక వేత్త‌లే సిస‌లైన దేశ‌ద్రోహులు..
ఇక విదేశాల్లో న‌ల్ల‌ధ‌నం దాచుకున్న కుబేరులే అస‌లైన క‌ర‌డు గ‌ట్టిన‌ ఉగ్ర‌వాదులు...
ముందు ఈ ఆర్థిక ఉగ్ర‌వాదుల ఇళ్ల‌పై దాడులు చేయండి... వారి ఆస్తుల‌ను లాగేసుకోండి...
వారిని క‌ఠినంగా శిక్షించండి.. మీలోని నిజ‌మైన దేశ భ‌క్తిని చాటుకోండి..
ఈ పోరాటంలో దేశం మొత్తం మీకు అండ‌గా నిలుస్తుంది.. !!

Tuesday 16 February 2016

హ్యాపీ బ‌ర్త్ డే కేసీఆర్ గారు...

అస్థిత్వ పోరును విజ‌య తీరాల‌కు చేర్చిన సేనానీ..
ఆంక్ష‌ల తెలంగాణ‌ను అభివృద్ధి దిశ‌గా ప‌రుగులు పెట్టిస్తున్న శ్రామికుడా..
నిన్ను చూసి పొంగిపోతోంది త‌ల్లి భార‌తి..
నిన్ను చూసి మురిసిపోతోంది త‌ల్లి తెలంగాణ‌...
ప్ర‌తీ తెలంగాణ‌వాది హృద‌యంలో క‌నిపించేది నీ రూపే..
ప్ర‌తీ తెలంగాణ పిల్లాడి గొంతు నుంచి వినిపించేది నీ స్వ‌ర‌మే..
తెలంగాణ ఉచ్వాస‌, నిశ్వాస నీవే..
మీరు నిండు నూరేళ్లు వ‌ర్థిల్లాలి..
మాలో నిరంత‌ర స్ఫూర్తిని ర‌గిలించాలి..
హ్యాపీ బ‌ర్త్ డే కేసీఆర్ గారు... 

ఈవీఎంల‌ను ట్యాంప‌రింగ్ చేస్తున్నార‌ని అనుమానించే వారికి ఓ విజ్ఞ‌ప్తి..

ఈవీఎంల‌ను ట్యాంప‌రింగ్ చేస్తున్నార‌ని అనుమానించే వారికి ఓ విజ్ఞ‌ప్తి..
*******
నిజంగానే ఈవీఎంల‌ ట్యాంప‌రింగ్ జ‌రుగుతుందా? లేదా అన్న‌ది మీరే స్వ‌యంగా నిర్ధ‌రించుకోవ‌చ్చు..
ఇక‌పై తెలంగాణ‌లో జ‌రిగే ఏ ఎన్నిక‌లోనైనా స‌రే కొన్నిస్థానాల్లో కాంగ్రెస్ త‌ర‌ఫున‌, టీడీపీ త‌ర‌ఫున ఓ 65 మంది చొప్పున అభ్య‌ర్థులను బ‌రిలో నిల‌పండి..
అప్పుడు బ్యాలెట్ ప‌ద్ధ‌తిలో ఆ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతాయి..
కొన్ని చోట్ల ఈవీఎంల ద్వారా ఎన్నిక‌లు జ‌రుగుతాయి...
బ్యాలెట్ ప‌ద్ధ‌తిలో మీరు బ‌రిలో నిలిపిన అభ్య‌ర్థులంద‌రికీ క‌లిపి డిపాజిట్ ద‌క్కితే ఈవీఎంలు క‌రెక్టు అని నిర్ధ‌రించుకోవ‌చ్చు..
**
నోట్ : బ్యాలెట్ లో చెల్ల‌ని ఓట్లు ఎక్కువైతే కొన్ని సార్లు డిపాజిట్ స్థాయి ఓట్లు కూడా ద‌క్క‌క‌పోవ‌చ్చు.. అప్పుడు ఈవీఎంల‌ను అనొద్దు ప్లీజ్‌..

బిగ్‌ బ్రేకింగ్ న్యూస్‌...

బిగ్‌ బ్రేకింగ్ న్యూస్‌...
****
నారాయ‌ణ్ ఖేడ్ ఉప ఎన్నిక‌లో డిపాజిట్ ద‌క్కించుకున్న కాంగ్రెస్‌... !

ముస్తాక్ అహ్మ‌ద్ కు జోహార్లు..


సియాచిన్ లో దేశం కోసం అమ‌రుడైన తెలుగు తేజం ముస్తాక్ అహ్మ‌ద్ కు జోహార్లు..

వీళ్ల‌కు నిజంగా దిమాగ్ లేదు..

వీళ్ల‌కు నిజంగా దిమాగ్ లేదు..
******
అఖండ భార‌త్ జిందా బాద్ అంటే స‌రిపోయేది క‌దా... !
నాథూరాం గాడ్సే అమ‌ర్ ర‌హే అంటే బాగుండేది క‌దా.. !!

ఇదేం పురుషాధిక్యం...

మ‌హిళా కార్పోరేట‌ర్ల పేర్ల వెన‌క భ‌ర్త‌ల పేర్ల‌ను పెట్టుకున్నారు.. మ‌రి పురుష కార్పోరేట‌ర్ల పేర్ల వెన‌క వాళ్ల భార్య‌ల పేర్ల‌ను ఎందుకు పెట్టుకోవ‌డం లేదు?  ప్ర‌తీ పురుషుడి విజ‌యం వెన‌క మ‌హిళ ఉంటుందంటారు.. మ‌రి పేరు వెన‌క ఉండ‌క‌పోవ‌డానికి కార‌ణం ఏంటో...

అమ‌రావ‌తి ప‌నులు ఇస్తే ఇలా జ‌రిగేది కాదు క‌దా...

క‌నీసం ఆంధ్రా రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌నుల కాంట్రాక్టో, ఇంకో కాంట్రాక్టో ఇస్తే ఈ నేత‌లంతా ఇలా వ‌ల‌స బాట ప‌ట్టే వారు కాదు క‌దా.... ఒక‌వేళ ఆంధ్రాలో టీడీపీకి అధికారం ద‌క్క‌కుండా, తెలంగాణ‌లో టీడీపీకి అధికారం ద‌క్కి ఉంటే ఆంధ్రా నేత‌ల‌కు తెలంగాణ లో వివిధ ప్రాజెక్టుల కాంట్రాక్టుల‌ను చంద్ర‌బాబు నాయుడు అప్ప‌గించే వారే క‌దా... బ‌హుషా నామా నాగేశ్వ‌ర రావు గారికి మాత్రం ఒక‌టి రెండు ప్రాజెక్టులు ద‌క్కిన‌ట్లు ఉన్నాయి.. అందుకే ఆయ‌న వ్యాపార ప‌నుల్లో బిజీగా ఉండి మీడియాలో క‌నిపించ‌డం లేద‌నుకుంటా..!!

వీళ్ల‌ను పూర్తిగా న‌మ్మ‌లేం...!

వీళ్ల‌ను పూర్తిగా న‌మ్మ‌లేం...!
గ‌తంలో పార్టీలు మారిన వారు అధినాయ‌కుల‌పై తీవ్ర విమ‌ర్శలు చేసి బ‌య‌ట‌కు వ‌చ్చే వారు..
కానీ ఇటీవ‌ల కాలంలో కొంద‌రు నేత‌లు వారు ప‌నిచేసిన పార్టీని, దాని అధిప‌తిని ప్ర‌శంసిస్తూ బ‌య‌ట‌కు వ‌స్తున్నారు..
ఒక‌వేళ చేరిన పార్టీలో కాలం క‌లిసి రాక‌పోతే భ‌విష్య‌త్ లో మాతృ పార్టీలో చేరేందుకు వీలుగానే వీరి ప్ర‌సంగాలు సాగుతున్నాయి... ఇది గ‌మ‌నించాల్సిన విష‌యం..
ఎవ‌రైనా స‌రే మారేందుకు ఒక అవ‌కాశం ఇవ్వ‌డంలో త‌ప్పు లేదు కానీ.. వీళ్లు నిల‌బెట్టుకుంటారా? అన్న అనుమాన‌మే అనుక్ష‌ణం నీడ‌లా వెంటాడుతోంది...
ఇక నారాయ‌ణ్ ఖేడ్ త‌ర్వాత ఇంకెంత మంది వ‌స్తారో వేచిచూడాల్సిందే..!!
మొద‌టి నుంచీ అంకిత భావంతో ప‌నిచేస్తున్న నేత‌లంద‌రికీ స‌ముచిత గౌర‌వం ద‌క్కాలి.. !!!

అన్నం పెట్టే రైత‌న్న చ‌ల్ల‌గుండాలంటే ఈ రాజీ త‌ప్ప‌దు మ‌రి.

రాజ‌కీయాలు ఎలా ఉన్నా... నేత‌లు ఏం తిట్టుకున్నా... డొక్క ఎండిన రైత‌న్న బాగుప‌డాలంటే ఈ బ్లూ ప్రింట్ సాకారం కావాల్సిందే. ఇదేదో రాత్రికి రాత్రి జ‌రిగేది కాదు. 2-3 ఏళ్ల‌లో పూర్త‌వుతుంది అనుకున్నా అది అత్యాశే. ఈ ట‌ర్మ్ కాదు.. 10 సంవ‌త్స‌రాల‌కు ఇది సంపూర్ణ‌మైనా అది అద్భుత‌మే. అద్భుత‌మ‌నేది సాధార‌ణ అంచ‌నాల‌కు అతీతంగా ఉంటుంది. కాక‌పోతే అప్ప‌టివ‌ర‌కు అడుగులు ** స‌రిగా ** ప‌డుతున్నాయా లేదా అనేది మాత్ర‌మే ప్ర‌ధానం. అనుమానాలు... ఆరోప‌ణ‌లు... విమ‌ర్శ‌లు... కోట్ల‌ల్లో ఉండొచ్చు. కానీ అడుగులు ముందుకు ప‌డ‌నిద్దాం. అదే కోవ‌లో తెలంగాణ సాగునీటి రంగంలో అద్భుతాలు జ‌రిగితే భావి త‌రాల‌కు అది శ్రీ‌రామ‌ర‌క్ష‌. న‌వ్వే వాళ్ల ముందు జారిప‌డొద్దంటే *** చేస్తామంటున్న‌, చేస్తున్న*** వాళ్ల కాళ్లు ప‌ట్టి గుంజ‌డం బంజేయాలి. అది మేధావులు, మీడియా, రాజ‌కీయ నాయ‌కులు ఎవ‌రైనా కావ‌చ్చు. అంతిమంగా ప్ర‌జ‌ల శ్రేయ‌స్సు దృష్ట్యా ఇలాంటి అంశాల్లో పంచాయితీలు మానుకోవాలి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బ‌య‌టికి ఎంత రాజ‌కీయ ర‌చ్చ జ‌రిగినా ప‌ట్టిసీమ విష‌యంలో అన్ని పార్టీలు ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రించాయి. అందుకే అక్క‌డి ప్ర‌భుత్వం దానిని వెంట‌నే పూర్తి చేయ‌గ‌లుగుతుంది. తెలంగాణ‌లో కూడా రాజ‌కీయ కొట్లాట‌లు ఎలా ఉన్నా... సాగునీటి ప్రాజెక్టుల విష‌యంలో అంద‌రూ ఏక‌తాటిపై ఉండాల్సిందే. ఇది తెలంగాణ ప్ర‌జ‌లు రాజ‌కీయ పార్టీల‌కు జారీ చేస్తున్న ఫ‌త్వా అనుకోండి, జ‌డ్జిమెంట్ అనుకోండి!. ఇంకేదైనా అనుకోండి. అన్నం పెట్టే రైత‌న్న చ‌ల్ల‌గుండాలంటే ఈ రాజీ త‌ప్ప‌దు మ‌రి.

ఈ రోజు పొద్దుగాల ఇలాంటి స్వ‌ప్నాలే వ‌చ్చి ఉంటాయి...

ఎన్టీఆర్ స్టేడియంలో కాళోజీ క‌ళా క్షేత్రాన్ని నిర్మించిన‌ట్లు, 
హైద‌రాబాద్ లో స్కై వేలు క‌ట్టిన‌ట్లు, 
పేద‌లు డ‌బుల్ బెడ్రూం ఇళ్ల‌లో హాయిగా ఉన్న‌ట్లు, 
హుస్సేన్‌ సాగ‌ర్ మంచి నీటి స‌ర‌స్సుగా మారిన‌ట్లు ఈ రోజు తెల్ల‌వారుజామున మంచి క‌ల వ‌చ్చింది..
బ‌హుషా తెలంగాణ ప్ర‌జ‌లంద‌రికీ, భాగ్య‌న‌గ‌ర్ వాసులంద‌రికీ ఈ రోజు పొద్దుగాల ఇలాంటి స్వ‌ప్నాలే వ‌చ్చి ఉంటాయి...

హ్యాండిచ్చిన బోగ‌స్ ఓట‌ర్లు

బోగ‌స్ ఓట‌ర్లు కూడా మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డికి హ్యాండిచ్చిన‌ట్లు ఉన్నారు.. 
మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి ఢిల్లీ చుట్టూ తిరిగి క‌ష్ట‌ప‌డి వాళ్లంద‌రికీ తిరిగి ఓటు హ‌క్కు ద‌క్కేలా చూస్తే వాళ్లేమో కాంగ్రెసు ను 100
అడుగుల లోతులో పాతిపెట్టారు...
బ‌హుషా ఈ దెబ్బ‌తో ఇక స‌న‌త్ న‌గర్ ఉప ఎన్నిక ఊసెత్త‌డేమో...
సంక్రాంతి సెల‌వుల్లో ఎన్నిక‌లు పెట్టి ఉంటే విప‌క్షాల‌కు పాపం ఐదారు సీట్లు కూడా వ‌చ్చేవి కావేమో.. !!
మొత్తానికి దీన్ని స్వ‌చ్ఛ హైద‌రాబాద్ అని అనుకోవ‌చ్చేమో..

ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ బెట‌ర్‌..

వీళ్లంద‌రి క‌న్నా ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ బెట‌ర్‌.. చేసిన స‌వాల్ మీద నిల‌బ‌డి రాజ‌కీయాల‌కు దూర‌మ‌య్యాడు.. వీళ్లకు మాత్రం స‌వాళ్లు చేయ‌డం త‌ప్ప క‌ట్టుబ‌డి ఉండ‌టం తెలియ‌ద‌నుకుంటా..

తెలంగాణ ప్ర‌జ‌ల గుండెల్లో చిర‌కాలం స్థానం నిలుపుకోవాలి..






అన్ని కులాల వారికీ సీట్లు ఇచ్చి.. అన్ని మ‌తాల వారికి గౌర‌వం స‌ముచిత గౌర‌వం ఇచ్చి పూర్తి స‌మ‌తూల్యంతో అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డ‌మే కాకుండా వివాదాల‌కు దూరంగా ప్ర‌చారం సాగిస్తూ పార్టీని విజ‌య ప‌థంలో నిలిపిన విజ‌య సార‌థులంద‌రికీ అభినంద‌న‌లు.. 2014 ఎన్నిక‌ల్లో కేసీఆర్ అన్నీ తానై చేసిన త‌ర‌హాలో ఈ సారి కేటీఆర్ ప్ర‌చార ప‌ర్వాన్ని భుజానికి ఎత్తుకున్నాడు. గ్రేట‌ర్ ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొందాడు. భారీ విజ‌యం కీల‌క పాత్ర పోషించాడు.
ఈ విజ‌యంలో ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థ‌ల ప్ర‌జా ప్ర‌తినిధులు, మేయ‌ర్లు, డిప్యూటీ మేయ‌ర్లు అంద‌రూ కూడా భాగ‌స్వాములే.. వివిధ జిల్లాల నుంచి వ‌చ్చి అభ్యర్థులంద‌రి త‌ర‌ఫున ప్ర‌చారం సాగించారు.. వారంద‌రి ప్ర‌చారం వ‌ల్ల నేడు హైద‌రాబాద్ లో తెలంగాణ‌ జెండా స‌గ‌ర్వంగా ఎగ‌ర‌బోతోంది.. తెలంగాణ గుండెకాయంలో తెలంగాణం వినిపించింది.. బంగారు తెలంగాణ సాకారం దిశ‌గా కేసీఆర్ చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌కు ప్ర‌జ‌లు సంపూర్ణ ఆమోదం తెలిపారు. ప్ర‌భుత్వం మరింత అంకిత భావంతో ఇచ్చిన వాగ్దానాల‌ను నెర‌వేర్చాలి. తెలంగాణ ప్ర‌జ‌ల గుండెల్లో చిర‌కాలం స్థానం నిలుపుకోవాలి.. జై తెలంగాణ‌.. జై జై తెలంగాణ‌.

థాంక్యూ దానం నాగేంద‌ర్‌..

థాంక్యూ దానం నాగేంద‌ర్‌..
నువ్వు అప్ప‌ట్లో టీడీపీలో చేరితే కాంగ్రెస్‌కు అధికారం ద‌క్కింది..
ఈ మ‌ధ్య ఎన్నిక‌ల ముందుకు టీఆర్ఎస్ లో చేర‌డానికి క‌స‌ర‌త్తు చేశావు..
మొత్తానికి కాంగ్రెస్ లోనే ఉండి పోయిన‌వు..
కొంప‌దీసి టీఆర్ఎస్ లో చేరి ఉంటే సెంటిమెంట్ ప్ర‌కారం ఏదైనా త‌ల‌కిందులు అయ్యేదేమో..
ఏదైతేనేం నువ్వు రాలేదు.. టీఆర్ఎస్‌కు మాత్రం బ‌ల్దియా పీఠం ద‌క్కింది..

రికార్డులు సృష్టించ‌డం.. వాటిని బ‌ద్ధ‌లు కొట్ట‌డం టీఆర్ఎస్ కే చెల్లుతుందేమో... !

రికార్డులు సృష్టించ‌డం.. వాటిని బ‌ద్ధ‌లు కొట్ట‌డం టీఆర్ఎస్ కే చెల్లుతుందేమో... !
భారీ మెజారిటీలు.. బంప‌ర్ విజ‌యాలు.. అన్నీ వారి ఖాతాలోకి..!!
కేసీఆర్ ప్ర‌చారం లేకుండానే ఇన్ని సీట్లు వ‌స్తే.. ఇక కేసీఆర్ కూడా తిరిగి ఉంటే హైద‌రాబాద్ పాత న‌గ‌రంలోనూ ఎంఐఎం దుకాణం ఖాళీ అయ్యేదేమో..
ఇదే స్ఫూర్తితో భ‌విష్య‌త్ లో పాత న‌గ‌రంపైనా ప‌ట్టు సాధించాలి..
మొన్నామ‌ధ్య ఒక్క ఎమ్మెల్సీ సీటు(రామచంద్రరావు) గెల‌వ‌డంతో తెగ హ‌డావుడి చేసిన బీజేపీ-టీడీపీకి కూట‌మికి గ‌ట్టి ఎదురుదెబ్బ..
ఇక స‌వాళ్లు చేసిన పెద్ద మ‌నుషులు మాట మీద నిల‌బ‌డ‌తారో? లేక త‌ప్పు చేశామ‌ని లెంప‌లు వేసుకుంటారో వేచిచూడాలి...
ఇక టీఆర్ఎస్ ప్ర‌భంజ‌నాన్ని అడ్డుకోవ‌డానికి భ‌విష్య‌త్ లో కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ, ఎంఐఎంలు ఏక‌మైనా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదేమో...
నోట్ : పాపం ప్ర‌తిప‌క్షాలు.. మెద‌క్‌, వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యాన్ని మ‌ర‌వ‌క‌ముందే మ‌రో భారీ ప‌రాజ‌యం.. ఈ ఎన్నిక ప‌రాజ‌యాన్ని జీర్ణించుకోక‌ముందే నారాయ‌ణ ఖేడ్ ఎన్నిక, దాని ఫ‌లితం వ‌స్తుంది.. పాపం దాని ఫ‌లితాన్ని ఎలా త‌ట్టుకుంటారో?
స‌వాళ్లు చేసిన ఆ నేత‌ల కోసం రెడ్ కార్న‌ర్ నోటీసులు ఇవ్వాలేమో..

Friday 5 February 2016

వికీలీక్స్‌ జూలియ‌న్ అసాంజేకి స్వేచ్ఛ‌

వికీలీక్స్‌ జూలియ‌న్ అసాంజేకి స్వేచ్ఛ‌
*************
వికీలీక్స్ వ్య‌వ‌స్థాప‌కుడు, నిర్భ‌య, ప‌క్ష‌పాత ర‌హిత‌ పాత్రికేయానికి నిలువుట‌ద్దంగా నిలిచి అగ్ర‌దేశాల ద్వంద్వ నీతిని ఎండ‌గ‌ట్టిన పోరాట యోధుడు జూలియ‌న్ అసాంజే కి స్వేచ్ఛ ల‌భించింది. ఐక్య రాజ్య స‌మితి ప్యానెల్‌ అసాంజేకు అనుకూలంగా తీర్పును వెలువ‌రించింది.. ఆయ‌న స్వేచ్ఛ ను దూరం చేసిన నేరానికి ప‌రిహారం కూడా చెల్లించాల‌ని స్ప‌ష్టం చేసింది.. ఈ రోజు చ‌రిత్రాత్మ‌క రోజు.. నిర్బంధ‌పు సంకెళ్లు తెగిన రోజు.. దాదాపు మూడేన్న‌రేళ్లుగా బ్రిట‌న్ లోని ఈక్వెడార్ రాయ‌బార కార్యాల‌యంలో ఆశ్ర‌యం పొందుతున్న అసాంజే సాగించిన పోరాటం
ఎట్ట‌కేల‌కు విజ‌య‌తీరాల‌కు చేరింది.. దీన్ని నెటిజ‌న్లంద‌రూ విజ‌య దినంగానే ప‌రిగ‌ణించాలి. నీతి, నిజాయ‌తీతో పాత్రికేయ వృత్తిలో కొన‌సాగుతున్న జ‌ర్న‌లిస్టులంద‌రికీ ఇది ప‌ర్వ‌దిన‌మే.. అసాంజే స్వేచ్ఛ‌గా మ‌రిన్ని దేశాల అరాచ‌క‌త్వాన్ని, కుటిల దౌత్య విధానాల‌ను వికీలీక్స్ కేబుల్స్ ద్వారా ఎండ‌గ‌ట్టాల‌ని ఆకాంక్షిస్తున్నా.. గ‌తంలో మాదిరిగానే తెలంగాణ‌కు సంబంధించిన ప‌లు కేబుల్స్ ను అసాంజే వెలుగులోకి తేవాల‌ని కోరుకుంటున్నా.. ఆల్ ద బెస్టు జూలియ‌న్‌ అసాంజే.. !!
***************
నోట్ : తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో నా సొంత పేరుతో పోస్టులు రాయ‌డం వ‌ల్ల వ్య‌క్తిగ‌తంగా త‌లెత్తిన ఇబ్బందుల మూలంగా అనివార్యంగా పేరు మార్చుకోవాల్సిన పరిస్థితి త‌లెత్తింది. ఆ స‌మ‌యంలోనే(2012 మే నెల‌లో) నేను అత్యంత అభిమానించే అసాంజే ను అరెస్టు చేయ‌డానికి బ్రిట‌న్ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నించింది. అప్పుడే ఈక్వెడార్ రాయ‌బార కార్యాల‌యంలో ఆయ‌న‌కు ఆశ్ర‌యం దొరికింది. దీంతో ఫేసుబుక్ లో రాయ‌డానికి వీలుగా తెలంగాణ అసాంజేగా పేరును మార్చుకున్నా.. ఆయ‌న బొమ్మ‌ను వాడుకున్నా.. ఈ విష‌యంలో జూలియ‌న్ అసాంజేకి స‌దా రుణ‌ప‌డి ఉంటా.. ఎందుకంటే ఆయ‌న పేరుతో నిర్భ‌యంగా తెలంగాణ ఉద్య‌మం కోసం నా వంతుగా భావ‌జాల వ్యాప్తికి, ఆంధ్రా మీడియా అరాచ‌కాల‌ను ఎండ‌గ‌ట్టే భాగ్యం ల‌భించింది. ఎంద‌రో ముఖ‌ప‌రిచయం లేని ముఖ పుస్త‌కం(ఫేసుబుక్‌) మిత్రులు దొరికారు..!!
***********
ఒక్క జూలియ‌న్‌ అసాంజే ఎంద‌రో అసాంజేలను త‌యారు చేయ‌గ‌ల‌డని నిరూపిత‌మైంది.. ఈ రోజు తెలంగాణ అసాంజే, క‌ల్వ‌కుర్తి అసాంజే, వేముల‌వాడ అసాంజే అంటూ ప్ర‌తీ ఊరికి ఒక అసాంజే పుట్టుకొచ్చాడు. ఐ యామ్ వెరీ హ్యాపీ.. !!

పి.వి.కి భార‌త ర‌త్న ఇవ్వాల్సిందే..

ఈ దేశంలో ఐటీ విప్ల‌వానికి పితామ‌హుడు మ‌న దివంగ‌త ప్ర‌ధాని పి.వి.న‌ర‌సింహారావే.. ప్ర‌ధానిగా ఆయ‌న తీసుకొచ్చిన‌ విధానాల ఫ‌లిత‌మే మ‌న‌కు ఈ రోజు అంత‌ర్జాతీయ గుర్తింపు.. ఆయ‌న ప్రోద్బ‌లంతోనే నేదురు మ‌ల్లి జ‌నార్ధ‌న్ రెడ్డి ఇక్క‌డ సైబ‌ర్ ట‌వ‌ర్స్ కు శంకుస్థాప‌న చేశారు.. 
ఇటీవ‌ల కాంలో కొంద‌రు అనామ‌కులకు ప్ర‌తిష్ఠాత్మ‌క‌ అవార్డులు ఇస్తున్నారు.. కానీ దేశాన్ని ప్ర‌గ‌తి బాట‌లో న‌డిపిన తెలంగాణ బిడ్డ పి.వి. న‌ర‌సింహారావుకు గుర్తింపు ద‌క్క‌డం లేదు.. ర‌త్న గ‌ర్భ‌గా పేరున్న భార‌త దేశం బిచ్చ‌మెత్తుకునే ద‌య‌నీయ ప‌రిస్థితిలో ఉన్న‌ త‌రుణంలో ఈ దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బ‌య‌ట‌ప‌డేసిన‌ మ‌హా మేధావి ఆయ‌న‌.. ఆయ‌న‌కు భార‌త ర‌త్న‌ను ఇవ్వాల్సిందే.. !!

అప్పుడు హైద‌రాబాద్ లో శాంతి భ‌ద్ర‌త‌ల‌పై ఈ కాంగ్రెస్ పెద్ద మ‌నుషులు నోరు తెర‌వ‌లేదు ఎందుకు?


హైద‌రాబాద్ లో మొన్నామ‌ధ్య కాంగ్రెస్ నేత‌లే కొంద‌రు మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియ‌ర్‌నేత దానం నాగేంద‌ర్‌పై, ఆయ‌న అనుచ‌రుల‌పై న‌డి రోడ్డుపై ప‌ట్ట‌ప‌గ‌లు బీభ‌త్సంగా దాడులు చేసిన‌ట్లు పేప‌ర్ల‌లో, టీవీల్లో చూశాను. కోడి గుడ్ల కూడా విసిరిన‌ట్లు చూశాను.. మ‌రి అప్పుడు హైద‌రాబాద్ లో శాంతి భ‌ద్ర‌త‌ల‌పై ఈ కాంగ్రెస్ పెద్ద మ‌నుషులు నోరు తెర‌వ‌లేదు ఎందుకు?

https://www.youtube.com/watch?v=qsMtwNbUVc0

మ‌రి టీడీపీ నేత‌ల‌పై ఎందుకు వదిలేసినట్టు ?...

నిన్న ఎంఐఎం నేత‌లు
కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌, బీజేపీ, ఎంబీటీ నేత‌ల‌పై దాడులు చేసిన‌ట్లు వార్త‌లు చూశాను..
మ‌రి టీడీపీ నేత‌ల‌పై ఎందుకు వదిలేసినట్టు ?... 
కొంప‌దీసి టీడీపీ-ఎంఐఎం మ‌ధ్య‌ లోపాయికారీ ఒప్పందం ఏమైనా జ‌రిగిందా ఏంది?

45 శాతం పోలింగ్ నాట్ బ్యాడ్‌..

45 శాతం పోలింగ్ నాట్ బ్యాడ్‌..
*************
హైద‌రాబాద్ లో ఉన్న వారిలో చాలా మందికి వారి స్వ‌గ్రామాలు, స్వ‌స్థ‌లాల్లోనూ ఓటు హ‌క్కులు ఉంటున్నాయి.. ఇప్పుడు హైద‌రాబాద్ లో ఓటేసి, వ‌చ్చే ఎన్నిక‌ల్లో స్వ‌స్థ‌లాల్లో ఓటేస్తే ప్ర‌జ‌ల దృష్టిలో దోషులుగా మిగులుతామ‌న్న భ‌యంతోనూ కొంద‌రు ఓటేయ‌లేదు.. ఇక కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు నిన్న సెల‌వు ప్ర‌క‌టించ‌లేదు.. దాంతో వారు కూడా ఓటింగ్ కు దూర‌మ‌య్యారు.. ఇక ప్రైవేటులోనూ కొన్ని సంస్థ‌లు సెల‌వును ప్ర‌క‌టించ‌క‌పోవ‌డంతో ఆయా సంస్థ‌ల ఉద్యోగులు దూరంగా ఉన్నారు. ఇక హైద‌రాబాద్ లో స్థిర‌ప‌డిన ఆంధ్రా ఉద్యోగులు, సెటిల‌ర్లు ఇక్క‌డ ఓటేయాలా? వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఎక్క‌డ ఉంటామో తెలియ‌క ఓటింగ్‌కు దూరంగా ఉండొచ్చు.. వీట‌న్నింటినీ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే 45 శాతం పోలింగ్ నాట్ బ్యాడ్‌..
***********
ఈ ఎన్నిక‌ల విష‌యంలో గ‌త క‌మిష‌న‌ర్ సోమేశ్ కుమార్‌ను ప్ర‌తీ తెలంగాణ‌వాది అభినందించాల్సిందే.. బోగ‌స్ ఓట‌ర్ల‌ను ఏరిపారేయ‌డంలో స‌మ‌ర్థంగా వ్య‌వ‌హరించాడు.. వివిధ ప్రాంతాల్లో ఓట్లు క‌లిగిన వారు ఓటేయాల‌న్నా జ‌డుసుకునే ప‌రిస్థితిని తీసుకొచ్చాడు.. పాపం కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీలు బోగ‌స్ ఓట‌ర్ల కోసం కొట్లాడినా ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది.. హ్యాట్సాఫ్ సోమేశ్ కుమార్‌.. హుస్సేన్ సాగ‌ర్ ను శుద్ధి ప్ర‌క్రియ‌లో, వామ‌ప‌క్షాల ప్రోద్బ‌లంతో జ‌రిగిన స‌మ్మెను క‌ట్ట‌డి చేయ‌డంలో, మొండి బ‌కాయిదారుల నుంచి ఆస్తి ప‌న్ను వ‌సూలు, ఐదు రూపాయ‌ల భోజ‌న కార్య‌క్ర‌మ విస్త‌ర‌ణ ఇలా అనేక వినూత్న కార్య‌క్ర‌మాల‌కు ఆయ‌న శ్రీ‌కారం చుట్టారు.. పైర‌వీల‌కు తొలొగ్గ‌కుండా నీతిగా ప‌నిచేశారు.. హైద‌రాబాద్ ను గాడిలో పెట్టాలంటే అలాంటి అధికారి ఉండాల్సిందే..!!

జానా రెడ్డే కొంత బెట‌ర్ అంటున్న పాత్రికేయ లోకం..

జానా రెడ్డి అవ‌తారంలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌...!!
ఇంకా జానా రెడ్డే కొంత బెట‌ర్ అంటున్న పాత్రికేయ లోకం..!!

వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఇక హైదరాబాదీ ఓట‌ర్‌ను అవుతాను..

ఏడాది క్రితం లోక్ స‌భ‌, అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఓటు క‌రీంన‌గ‌ర్ లో ఉంచుకోవాలా? లేక హైద‌రాబాద్ లో న‌మోదు చేయించుకోవాలా? అన్న డైల‌మా(సందిగ్ధ అవ‌స్థ‌) ఉండేది.. హైద‌రాబాద్ లో ఓటు ఉన్నా టీఆర్ఎస్ కు వేసినా గెలిచే అవ‌కాశాలు త‌క్కువే.. దీంతో నా ఓటు వృథా అయ్యే ప్ర‌మాదం ఉంది అన్న భావ‌న‌తో క‌రీంన‌గ‌ర్ లోని ఓటును య‌థాత‌థంగా ఉంచేశాను. ఎన్నిక‌ల స‌మ‌యంలో కుటుంబ స‌మేతంగా అక్క‌డి వెళ్లి ఓటేసి వ‌చ్చా.. 
****
ఇప్పుడు దాదాపు 18 నెల‌ల త‌ర్వాత జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల‌ను చూస్తుంటే ఇక భ‌విష్య‌త్ లో హైద‌రాబాద్ లోనే ఓటు హ‌క్కును ఉంచుకున్నా ఇబ్బంది లేద‌న్న ధీమా పెరిగింది.. ఇక క‌రీంన‌గ‌ర్ ఓటును తీసేసి హైద‌రాబాద్ లో ఓటుకు ద‌ర‌ఖాస్తు చేసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఇక హైదరాబాదీ ఓట‌ర్‌ను అవుతాను..

ఇద్ద‌రికీ ఎలా న్యాయం చేస్తాడో వేచిచూడాల్సిందే...

కాపులు, బీసీలు నాకు రెండు క‌ళ్లు... ఇది ఎవ‌రి డైలాగో మీకు అర్థం అయి ఉంటుంది..
*************
మ‌రి రెండు క‌ళ్ల సిద్ధాంత క‌ర్త ఇప్పుడు ఇద్ద‌రికీ ఎలా న్యాయం చేస్తాడో వేచిచూడాల్సిందే...

ఇదేం ఉన్మాదం..

* మా క‌డుపులు మాడ్చుకొని రైలు రోకోలు చేశాం.. కానీ రైళ్ల‌ లో ఉండే ప్ర‌యాణికులు అవ‌స్థ‌లు ప‌డ‌కుండా అన్న పానీయాలు అందించాం..
* లాఠీ దెబ్బ‌లు తింటూనే మిలియ‌న్ మార్చ్ లు చేశాం.. సాగ‌ర హారాల్లో పాల్గొన్నాం.. సాధార‌ణ ప్ర‌యాణికుడిని ఎప్పుడూ టార్గెట్‌గా చేసుకోలేదు..
* స‌క‌ల జ‌నుల స‌మ్మె అంటూ మాకు మేమే శిక్ష విధించుకుంటూ నిర‌శ‌న తెలిపాం.. ఉద్యోగుల‌కు జీతాలు రాకున్నా, పిల్ల‌లు చ‌దువుల‌కు దూరం అవుతున్నా జై తెలంగాణ అంటూ నిన‌దించాం.. 
* రోడ్డుపైనే వంటా వార్పు చేశాం.. కానీ ట్రాఫిక్ క‌ష్టాలు త‌లెత్త‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డాం...
* చ‌లో అసెంబ్లీలు చేశాం.. బాష్ప‌వాయువు గోళాలు తిన్నాం.. కానీ ఏ ఒక్క పోలీసును గాయ‌ప‌ర‌చ‌లేదు.. ఏ ఒక్క పోలీసు స్టేష‌న్ ను త‌గ‌ల‌బెట్ట‌లేదు..
* చ‌ట్టాన్ని ప‌రిర‌క్షించే పోలీసన్న‌ల‌ను గౌర‌విస్తూనే నిర‌శ‌న‌లు కొన‌సాగించాం...
* మా నాయ‌కుల‌ను నిర్బంధించి, మా పోరాటంపై ఉక్కు పాదం మోపాల‌ని చూపిన‌ప్పుడు ట్యాంకుబండ్‌పై ధ‌ర్మాగ్ర‌హాన్ని ప్ర‌ద‌ర్శించాం..
* హింసాత్మ‌క ఆందోళ‌న‌కు పిలుపునిచ్చే స‌త్తా కేసీఆర్ కు లేకా కాదు.. అలాంటి ఆందోళ‌న‌లు చేసే ధైర్యం తెలంగాణ జ‌నానికి లేకా కాదు..
* 2009లో తెలంగాణ ఏర్పాటుకు పార్ల‌మెంట్ లో హామీ ఇచ్చి అమ‌లు చేయ‌క‌పోయినా ఓపిక‌గా నాలుగేళ్లు స‌హించాం.. పోరాటాన్ని కొన‌సాగించాం...
****
నోట్ : మ‌రి 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ కాపు రిజ‌ర్వేష‌న్ల‌కు హామీ ఇచ్చింద‌ని.. వెంట‌నే అమ‌లు చేయాల‌ని ఇంత విధ్వంసం కొన‌సాగించ‌డం స‌బ‌బు కాదు.. ఓపిక‌గా హ‌క్కుల సాధ‌న‌కు ఉద్య‌మించాలి.. వీలైతే తెలంగాణ ఉద్య‌మాన్ని స్ఫూర్తిగా తీసుకోండి.. హామీల అమ‌లుకు ప్ర‌శాంతంగా పోరాటం సాగించండి..

అక్క‌డ హింస జ‌రిగినా పెట్టుబ‌డులొస్తాయ‌ట‌...

మొన్న రిజ‌ర్వేష‌న్ల కోసం గుజ‌రాత్ లో ప‌టేళ్ల ఆందోళ‌న ఎంత హింసాత్మ‌కం అయిందో చూశాం.. నిన్న రిజ‌ర్వేష‌న్ల కోసం కాపుల నిర‌స‌న ఎంత విధ్వంసం సృష్టించిందో చూశాం.. అయినా స‌రే ఆ రాష్ట్రాల‌కు పెట్టుబ‌డుల వ‌రద వ‌స్తోంద‌ని రాస్తాయి ప‌త్రిక‌లు...
**********
తెలంగాణ‌లో ఏ అల‌జ‌డి లేక‌పోయినా స‌రే ఇక్క‌డకు రావ‌డానికి వ్యాపార వేత్త‌లు భ‌య‌ప‌డుతున్నార‌న్న‌ట్లు కుట్ర క‌థ‌నాలు అల్లుతాయి.. ఎంత దారుణ‌మైన పాత్రికేయం...

బీఫ్ రాజ‌కీయాలు ఎందుకు ఓవైసీ గారు..!!

బీఫ్ రాజ‌కీయాలు ఎందుకు ఓవైసీ గారు..!!
తెలంగాణ‌ను క‌ల్లోలితంగా మార్చుతారా? ఏంటి
****
తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత ఎంతో ప్ర‌శాంతంగా ఉన్న భాగ్య న‌గ‌రంలో బీఫ్ రాజ‌కీయాలు ఎందుకు? ఇక్క‌డ కూడా అశాంతి రాజేయాల‌ని అనుకుంటున్నారా? ముంబ‌యిలో శివ‌సేన‌- బీజేపీ అధికారంలోకి వ‌చ్చాక వారం రోజుల పాటు బీఫ్ పై నిషేధం విధించాయ‌ని అంటున్నారు.. ఇక్క‌డ కూడా బీజేపీకి ఓటేస్తే ఇక బీఫ్ ను మ‌ర‌చిపోవాల్సిందే అంటూ మాట్లాడం దేనికి సంకేతం... మ‌హారాష్ట్ర‌లో మీ పార్టీ కి త‌గిన ప్రాధాన్య‌మే లేక‌పోయినా వారం త‌ర్వాత మ‌ళ్లా అమ్మ‌కాలు జ‌రుగుతున్నాయి క‌దా.. తినే వాళ్లు తింటున్నారు క‌దా.. మ‌రి ఇప్పుడు ఏం క‌ష్టం వ‌చ్చింద‌ని ఈ వివాదాస్ప‌ద ప్ర‌క‌ట‌న చేశారు..? ద‌య చేసి ప్ర‌శాంత భాగ్య‌న‌గ‌రంలో అశాంతి రేకెత్తించొద్దు.. ఏ పార్టీ గెలిచినా స‌రే ఎవ‌రి ఆహార అల‌వాట్ల‌పై ఆంక్ష‌లు విధించే సాహ‌సం చేయ‌రు.. ఒక‌వేళ అలా చేసినా కోర్టులు జోక్యం చేసుకుంటాయి. మీరు మాత్రం ఓట్ల కోసం రెచ్చ‌గొట్టే ప్ర‌క‌ట‌న చేయొద్దు... భాగ్య‌న‌గ‌రాన్ని అశాంతిమ‌యం చేయొద్దు ప్లీజ్‌...!!

ఇది ముమ్మాటికీ క్విడ్ ప్రో కోనే అంటున్న రెండు రాష్ట్రాల తెలుగు ప్ర‌జ‌లు..

ఇది ముమ్మాటికీ క్విడ్ ప్రో కోనే అంటున్న రెండు రాష్ట్రాల తెలుగు ప్ర‌జ‌లు..
***
చెల్లింపు వార్త‌ల‌కు(పెయిడ్ న్యూస్‌) పితా మ‌హులు... చెల్లింపు పుర‌స్కారాల‌కూ పితామ‌హుల‌వుతార‌ని అనుకోలేదు..
****
జ‌గ‌న్ కేసు లాంటి క్విడ్ ప్రో కో.. అంటే నీ కిది.. నా క‌ది కోణం క‌నిపిస్తోంది క‌దా...
****
దీనిపై సీబీఐ ల‌క్ష్మి నారాయ‌ణే తేల్చాలి..

ఎన్ని మెట్లు ఎక్కారో? ఎందరి వ‌ద్ద పైర‌వీ చేయించుకున్నారో?

అల‌నాటి బాలీవుడ్ తార ఆశా పారేఖ్ త‌న పేరును ప‌ద్మ భూష‌ణ్ కు సిఫార్సు చేయాల‌ని లాబీ చేయ‌డం కోసం 12 అంత‌స్తులు ఎక్కి వ‌చ్చార‌ని మొన్నా మ‌ధ్య కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ సెల‌విచ్చారు...
ఆమె వ‌చ్చిన స‌మ‌యంలో త‌న అపార్ట్ మెంట్ లిఫ్ట్ పాడైంద‌ని, అయితే వ‌యోవృద్ధురాలైన ఆమె 12 అంత‌స్తులు ఎక్కి మ‌రీ త‌న‌ను క‌లిశార‌ని చెప్పారు..
****
గ‌త ఏడాది కాలంలో ఎంత మంది ఎన్నిసార్లు ఢిల్లీ చుట్టూ చ‌క్క‌ర్లు కొట్టారో పాపం... ఎన్నిసార్లు మోడీ గారిని క‌లిశారో? 
ఓ సారి ఇప్పుడు పుర‌స్కారాలు పొందిన వారి ఢిల్లీ ప్ర‌యాణ వివ‌రాలు లేక కేంద్ర మంత్రుల‌తో అపాయింట్ మెంట్లు చూస్తే తెలిసిపోతుందేమో.. నిజంగా పైర‌వీ లేకుండా పుర‌స్కారం పొందింది ఎవ‌రో? పైర‌వీల‌తో పొందింది ఎవ‌రు?

అప్పుడు రాజ‌కీయ ప‌ద్మాలు విక‌సించాయ‌న్నారు.. ఇప్పుడు కూడా అలాగే అనుకోవ‌చ్చా?

అప్పుడు రాజ‌కీయ ప‌ద్మాలు విక‌సించాయ‌న్నారు.. ఇప్పుడు కూడా అలాగే అనుకోవ‌చ్చా?
**
I think few year's back.. When Padma Awards were announced then the leading daily wrote the title with RAJAKEEYA PADMA lu.. This title is common whenever the Awards were announced. Thank god From tomorrow onwards the Headline will change for sure..

సానియా మీర్జాకు అవార్డుపై భ‌క్తులు ఏమంటారో?

అరే.. భ‌క్తులేమో ఆమె పై దేశ ద్రోహి అని ముద్ర వేశారు.. ఆమె పాకిస్థానీ అంటూ తేల్చిపారేశారు... మ‌రి ఇదేంది భార‌త ప్ర‌భుత్వం ఆమెకు ప‌ద్మ భూష‌ణ్ ఇచ్చింది.. ఇంత‌కీ ఆమెను ఇప్ప‌టికైనా భార‌తీయురాల‌ని అంగీక‌రిస్తారా? లేక ప‌దేప‌దే ఆమె త‌న జాతీయ‌త‌ను రుజువు చేసుకోవాలా?

స‌హారా అధిప‌తి సుబ్ర‌తో రాయ్ కి కూడా ప‌ద్మ భూష‌ణ్ లు ద‌క్కుతాయ‌ని అనిపిస్తుంది..

కార్మిక చ‌ట్టాల ఉల్లంఘ‌న‌కు, చిట్ ఫండ్ మోసాల‌కు, భూ క‌బ్జా చేసిన వారికి గుర్తింపు ల‌భిస్తోందోచ్‌...!!
వ‌చ్చే ఏడాది భార‌త ర‌త్న.. ఆ త‌ర్వాత భార‌త రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి ఇస్తారేమో.. !!
ఈ లెక్క‌న రానున్న రోజుల్లో స‌హారా అధిప‌తి సుబ్ర‌తో రాయ్ కి కూడా ప‌ద్మ భూష‌ణ్ లు ద‌క్కుతాయ‌ని అనిపిస్తుంది..

అంద‌రూ దేశ భ‌క్తులేనండి...

తెలంగాణ రాక‌పోతే ఈ దేశం నుంచే విడిపోతామ‌న్న వాళ్లు.. 
తెలంగాణ ఇవ్వ‌క‌పోతే అంత‌ర్యుద్ధం వ‌స్తుంది అన్న వాళ్లు.. 
తెలంగాణ ఇస్తే తాము ఈ దేశంలోనే ఉండం అన్న మాట‌లు అన్న వాళ్లు..
తెలంగాణ ఇస్తే బాంబు దాడులు చేస్తామ‌ని అన్న వాళ్లు..
తెలంగాణ కోసం ఆత్మ హ‌త్య‌లు చేసుకున్న వారిని అమ‌ర వీరుల‌ని కీర్తించిన వాళ్లు..
అంద‌రూ దేశ భ‌క్తులేనండి...

కుల‌మా.. నీకు స‌లాం...!!!

కుల‌మా.. నీకు స‌లాం...!!!
****
ఈ మ‌ధ్య రోహిత్ ఆత్మ‌హ‌త్య త‌ర్వాత ప‌రిణామాల‌ను చూస్తే...
ప్రేమ వివాహం..
కులాంత‌ర వివాహం..
మ‌తాంత‌ర వివాహాల పై ఆలోచించాలంటే భ‌యం వేస్తోంది..
బాగా స్థిర‌ప‌డిన‌, సెల‌బ్రిటీలు అయిన వారికి మాత్ర‌మే ఇవి వ‌ర్తిస్తాయ‌న్న న‌మ్మ‌కం క‌లుగుతోంది..
మ‌ధ్య త‌ర‌గ‌తి, దిగువ మ‌ధ్య త‌ర‌గ‌తి వారికి ఇవి సూట్ కావ‌నిపిస్తుంది.
భ‌విష్య‌త్ లో ఏమైనా స‌మ‌స్య‌లు వ‌స్తే ప‌రిస్థితులు ఎంత తీవ్రంగా ఉంటాయో? స‌మాజం ఎంత‌గా ప్ర‌శ్న‌ల‌తో వేధిస్తుందో అవ‌గ‌తం అవుతోంది.
కులాలు లేని స‌మాజ నిర్మాణం, మ‌తాలు లేని భార‌తావ‌ని నిర్మాణం అసాధ్యం..
మ‌నం అంగార‌క గ్ర‌హం మీద‌కు మ‌నుషుల‌ను పంపే రోజు వ‌చ్చినా స‌రే ఈ కులాలు ఇక్క‌డ వ‌ర్థిల్లుతాయి.
అందుకే ఏ కులం అబ్బాయి ఆ కులం వారినే పెళ్లి చేసుకోవాలి.. వీలైతే ప్ర‌తీ కులం వారు వారి కులం పిల్ల‌లు చ‌దివేలా పాఠ‌శాల‌ల‌ను ఏర్పాటు చేసుకోవాలి.. హాస్ట‌ళ్లు పెట్టుకోవాలి. వీలైతే కులం కాలేజీలు, కులం యూనివ‌ర్సిటీలు ఏర్పాటు చేసుకునేలా భార‌త ప్ర‌భుత్వం చ‌ట్టం చేయాలి..

ఈనాడు బాధిత ఉద్యోగుల గురించి ఎందుకు ప‌ట్టించుకోలేదు ద‌త్త‌త్రేయ గారు...?

ద‌త్తాత్రేయ గారు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ఏ విజ్ఞ‌ప్తులు వ‌చ్చినా లేఖ‌లు రాస్త‌రు.. మ‌రి ఈనాడులో కార్మిక చ‌ట్టాల‌ను ఉల్లంఘిస్తూ 1200 మంది ఉద్యోగుల‌ను తొల‌గించిన‌ప్పుడు, మ‌జీథియా వేత‌న స‌వ‌ర‌ణ సంఘం సిఫార్సుల‌ను అమ‌లు చేయ‌ని స‌మ‌యంలో జోక్యం చేసుకొని త‌న ప‌రిధిలో ఏమైనా చ‌ర్య‌లు తీసుకున్నారా?
క‌నీసం అప్పుడు ఈనాడు బాధిత ఉద్యోగులు త‌న‌ను క‌లిస్తే ఎందుకు ప‌ట్టించుకోలేదు?

ఆ భ‌క్తులు త‌మ అభిప్రాయం మార్చుకుంటారో వేచిచూడాలి...

దేశం ఓ ముద్దు బిడ్డ‌ను కోల్పోయింద‌ని స్వ‌యంగా దేశ ప్ర‌ధానే అంటుంటే...
ఆయ‌న భ‌క్తులేమో దేశ ద్రోహి అని స‌దరు విద్యార్థిపై ముద్ర వేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు..
బ‌హుషా ప్ర‌ధాని ప్ర‌క‌ట‌న త‌ర్వాత అయినా స‌రే ఆ భ‌క్తులు త‌మ అభిప్రాయం మార్చుకుంటారో వేచిచూడాలి...

రైతుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై రాజ‌కీయాలు చేయొచ్చంటారా?

విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌పై రాజ‌కీయాలు చేయొద్దు.. 
మ‌రి రైతుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై రాజ‌కీయాలు చేయొచ్చంటారా? కిష‌న్ రెడ్డి గారూ...

ఏమైనా కుట్ర కోణం ఉంద‌నుకోవాలా?

వ‌చ్చిన విజ్ఞ‌ప్తిని వ‌చ్చిన‌ట్లు ఫార్వ‌ర్డు చేయ‌డం త‌ప్ప నేను చేసిన త‌ప్పేం లేదంటున్న ద‌త్త‌న్న గారి తాజా వివ‌ర‌ణ‌...
పాపం తెలంగాణ‌కు చెందిన ఏకైక బీసీ కేంద్ర మంత్రిని బ‌లి చేయ‌డంలో వెన‌క ఉన్న పెద్ద మ‌నుషులు ఎవ‌రో?
ఆ వ్య‌క్తులే నేరుగా కేంద్రానికి లేఖ‌లు రాయొచ్చు క‌దా.. లేక‌పోతే బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడితో రాయించి ఉండొచ్చు క‌దా..
పెద్దాయ‌న‌ను అడ్డంగా బుక్ చేయ‌డం వెన‌కాల ఏమైనా కుట్ర కోణం ఉంద‌నుకోవాలా?
ఏది ఏమైనా ద‌త్తాత్రేయ మంత్రి హోదాలో వ‌చ్చిన‌వాటిని ప‌రిశీలించి త‌ర్వాత వాటిని ఫార్వ‌ర్డు చేయాలా? చెత్త‌బుట్ట‌లో వేయాలా ఆలోచించుకోవాలి..