1

1

Saturday 28 February 2015

నిన్న ఉత్త‌ర, ద‌క్షిణ ధృవాలు ఏక‌మ‌య్యాయి...

నిన్న ఉత్త‌ర, ద‌క్షిణ ధృవాలు ఏక‌మ‌య్యాయి... మ‌రి మ‌హా ప్ర‌ళ‌యం వ‌స్తుందా?
మోడీ-ముఫ్తీ మ‌హ్మ‌ద్ స‌యీద్‌ల భేటీ... ఇద్ద‌రి ఆలింగ‌నం... 

సారు లేనిలోటు నాకు స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది..

తెలంగాణ పున‌ర్నిర్మాణ ప్ర‌క్రియ‌లో జ‌య‌శంక‌ర్ సారు ఉండి ఉంటే బాగుండేది... పున‌ర్నిర్మాణంలో సారు ఆలోచ‌న‌లు ఎలా ఉండేవో?
కేసీఆర్ వెంట సారు లేనిలోటు నాకు స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది..
సారు కేసీఆర్ కంబినేష‌న్ పీవీ న‌ర‌సింహారావు-మ‌న్మోహ‌న్‌సింగ్‌లాగా ఉండేద‌ని నా న‌మ్మ‌కం.. అస్త‌వ్య‌స్తంగా ఉన్న భార‌త ఆర్థిక ముఖ‌చిత్రాన్ని వాళ్లు ఎలాగైతే మార్చారో అలాగే వీళ్లిద్ద‌రూ మార్చేవార‌ని ప్ర‌గాఢంగా విశ్వ‌సించాను..

రైత‌న్న‌ల‌ను ప్ర‌త్యేకంగా ఆదుకుంటే బాగుంటుందేమో...!!

విద్యుత్ కొర‌త‌లు చాలా మేర‌కు త‌గ్గ‌డానికి కార‌ణ‌మైన మ‌న రైత‌న్న‌ల‌కు మ‌నం అభినంద‌న‌లు తెలపాలి.. పాపం వారు ర‌బీలో సాగు మానుకోవ‌డం వ‌ల్లే కొంత మేర‌కు డిమాండ్ త‌గ్గింది... పాపం ఆ రైత‌న్న‌ల‌కు ఉపాధి వ్య‌వ‌సాయ‌మే.. మ‌రి ఆరుత‌డి పంట‌ల‌తో వారికి ఎంత లాభం ఉంటుందో.. వారి కుటుంబాలు ఎలా గ‌డుస్తాయో... ఆ రైత‌న్న‌ల‌ను ప్ర‌త్యేకంగా ఆదుకుంటే బాగుంటుందేమో...!!

Friday 27 February 2015

పొన్నాల‌ నిమ్స్‌లో చేరుతారా?

పొన్నాల‌కు ఘోర అవ‌మానం... ప‌ద‌వి నుంచి తొల‌గించ‌డ‌మా?
ఇది బ‌ర్త‌ర‌ఫ్ చేసినంత ప‌నే క‌దా...
మొన్న‌టి దాకా ఆయ‌న ఒక‌రి మీద సానుభూతి చూపిండు..
ఇప్పుడు అంద‌రూ ఆయ‌న‌కు సానుభూతి చూపాల్సిన ప‌రిస్థితి వ‌చ్చే...
మ‌రి ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఆయ‌న నిమ్స్‌లో చేరుతారా?
కాంగ్రెస్‌లో ఉంటారా?  లేక టీఆర్ఎస్ లేదా బీజేపీలోకి జంప్ అవుతారా?

ఇద్ద‌రు కృష్ణ‌న్న‌లు లొల్లి చేస్తారా?

బీసీలు ఏక‌మ‌వుతారా?
పొన్నాల‌ను ప‌ద‌వి నుంచి త‌ప్పించ‌డం బీసీల ఆత్మ‌గౌర‌వాన్ని దెబ్బ‌తీయ‌డ‌మేనా?
ఇద్ద‌రు కృష్ణ‌న్న‌లు లొల్లి చేస్తారా?

కిష‌న్‌రెడ్డి క‌య్యిమంటారా?!!

హైద‌రాబాద్‌లోని కుతుబ్ షాహీ స‌మాధుల‌కు వార‌స‌త్వ గుర్తింపు ఇచ్చారు క‌దా.. మ‌రి స్థానిక‌ బీజేపీ నేత‌లు మండిప‌డ‌తారేమో... కిష‌న్‌రెడ్డి క‌య్యిమంటారా?!!

మ‌న‌ది ధ‌నిక రాష్ట్రం కాబ‌ట్టి ఇక కేంద్రం చుట్టూ చ‌క్కెర్లు కొట్ట‌డం ఎందుకు?

మ‌న‌ది ధ‌నిక రాష్ట్రం కాబ‌ట్టి ఇక కేంద్రం చుట్టూ చ‌క్కెర్లు కొట్ట‌డం ఎందుకు?
దేహి అని అర్థించ‌డం ఎందుకు?
పొరుగు రాష్ట్రాల‌ను ఆదుకుందాం...
డ‌బ్బులున్న అంబానీలు, అదానీలు కూడా మేం ధ‌న‌వంతుల‌మ‌ని చెప్పుకోరు క‌దా... కంపెనీలు లాభాల్లో ఉన్నా న‌ష్టాల‌ను చూప‌డానికి ప్ర‌య‌త్నిస్తారు క‌దా... మ‌న ఇళ్లు పైకి ప‌టారం.. లోన లొటారం అన్న‌ట్లు ఉంటే.. ఎందుకు లేని గాంభీరాలు ప‌లక‌డం... ఈ స్టేట్‌మెంట్ ను చూస్తే ఎవ‌ర‌న్నా ఆర్థిక సాయం చేస్తారా?

కార్పోరెట్ల‌కు పెద్ద‌పీట‌

కార్పొరేట్లను మురిపించారు..
ఆమ్ ఆద్మీని విస్మ‌రించారు..!!

బ‌కాయిలు క‌ట్ట‌కుండా కోర్టుకెక్కిన పెద్ద‌మ‌నిషి...!!




బాగా డ‌బ్బున్న పెద్దోళ్లు బ‌కాయిలు క‌ట్ట‌రు.. క‌ట్ట‌క‌పోతే చెత్త డ‌బ్బాలు వాళ్ల ఇంటి ముందు పెడితే వాళ్లు హైకోర్టు వెళ‌తారు...  బ‌కాయిలు క‌ట్ట‌క‌పోవ‌డం హైకోర్టుకు అనాగ‌రికంగా క‌నిపించ‌దు కానీ చెత్త‌డ‌బ్బాలు పెట్ట‌డం అనాగ‌రికం అవుతుంది.. రేపు బ‌కాయిలు క‌ట్ట‌ని వారికి నీళ్లు స‌ర‌ఫ‌రా చేయ‌క‌పోయినా, విద్యుత్ నిలిపివేసినా కూడా ఇది అనాగ‌రిక‌మ‌ని అంటారేమో... అయినా బ‌కాయిలు క‌ట్ట‌కుండా హైకోర్టుకు వెళ్లే వారిని ఏమ‌నాలి.. మేం త‌ప్పు చేస్తాం మా త‌ప్పున‌కు ర‌క్ష‌ణ క‌ల్పించండి అన్న‌ట్లుగా హైకోర్టుకు ఎక్కిన వాడిని ఏం చేయాలో?
ఇక హైకోర్టు జీహెచ్‌ఎంసీపై మండిప‌డుతుంద‌ట‌.. అలాగే బ‌కాయిలు క‌ట్ట‌ని వ్య‌క్తిని బ‌కాయిలు క‌ట్ట‌మ‌ని సూచించింద‌ట‌... సూచించ‌డం ఏంటి... మీరు బ‌కాయిలు క‌ట్ట‌కుండా కోర్టుకు వ‌చ్చినందుకు జ‌రిమానా విధిస్తున్నాం అని చెబితే ఎంత బాగుండేది...!!

నిజంగా ఈ పెద్దోళ్లు మ‌హా ముదుర్లుగా క‌నిపిస్తున్నారు... వీళ్లకు గుణ‌పాఠం చెప్పాల్సిందే.!!

ప‌క్క‌లో బ‌ల్లెంలు పెట్టుకొని జ‌ర్న‌లిస్టుల జీవితాల్లో వెలుగు ఎలా?!

తెలంగాణ ఏర్ప‌డినా తెలంగాణ జ‌ర్న‌లిస్టుల జీవితాల్లో కించిత్తు మార్పు లేదు. ఉద్య‌మ నాయ‌కుడు సీఎం అయ్యారు, ఆయ‌న ఫాలోవ‌ర్స్... ఎంత చెట్టుకు అంత గాలి అన్న‌ట్లు ఆస్వాదిస్తున్నారు. ఉద్యోగులు క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో 43 శాతం ఫిట్‌మెంట్‌తో ఆనంద‌ప‌డుతున్నారు. విద్యార్థి నాయ‌కులు కొంద‌రు చ‌ట్ట‌స‌భ‌ల్లో కొలువుదీరితే మ‌రికొంద‌రు బ్యాంకు బ్యాలెన్సుల‌తో అల‌రారుతున్నారు. కానీ ఆ ఉద్య‌మాన్ని, ఉద్యోగుల స‌క‌ల‌జ‌నుల స‌మ్మెను, చివ‌ర‌కు ఓయూలో పోలీసుల లాఠీదెబ్బ‌లు తిని విద్యార్థి నాయ‌కుల‌ను త‌యారుచేసిన జ‌ర్న‌లిస్టులు ఎక్క‌డ ఉన్నారు?. భాష్ప‌వాయు గోళాల ఘాటు వాస‌న‌లు పీల్చిన అక్ష‌ర‌యోధులు ఏ అర‌ణ్య‌వాసంలో ఉన్నారు?. తెలంగాణ వార్త‌ల కోసం యాజ‌మాన్యాల‌తో కంట‌యి బాధ‌లు ప‌డుతున్న‌వారు ఎక్క‌డున్నారు?. అవే ముఖాలు... న‌ల‌గ‌ని బ‌ట్ట‌లు, పెన్నులు ప‌ట్ట‌ని చేతులు మ‌ళ్లీ గొంతెత్తుతున్నాయి. నాయ‌కుల‌మంటూ హూంక‌రిస్తున్నాయి. కానీ కేసీఆర్ ముందు మా జ‌ర్న‌లిస్టుల జీవితాల్లో అంద‌రిలాగే వెలుగు రావాలి. అది మా హ‌క్కు అని ఎందుకు పిడికిలి బిగించ‌డంలేదు. ఎందుకంటే ఆ ముఖాల వెన‌క అస‌లు ర‌హ‌స్యాల‌న్నీ కేసీఆర్‌కు తెలుసు. అందుకే ఆయ‌న వీళ్ల‌ని లెక్క చేయ‌రు, వీళ్లు ఆయ‌న్ని నిల‌దీయ‌లేరు. ఇద్ద‌రూ బాగానే ఉన్నారు. కానీ నిజ‌మైన సామాన్య జ‌ర్న‌లిస్టు గోస ప‌డుతున్నాడు. చాలీచాల‌నీ జీతాల‌తో, ద‌శాబ్దంన‌ర‌గా కిరాయి ఇండ్ల‌లో హ‌రిగోస తీస్తున్నాడు. అయినా... మొన్న అక్రిడేష‌న్ల విధి విధానాల కోసం జ‌రిగిన క‌మిటీ స‌మావేశంలో ఒక జ‌ర్న‌లిస్టు (ఆంధ్ర ప్రాంతానికి చెందిన‌) మాట్లాడిన తీరు విడ్డూరం. మ‌న‌కు సామాజిక బాధ్య‌త ఉంది. అందుకే అన్‌లిమిటెడ్ హెల్్త కార్డు కాకుండా మ‌నం కొన్ని డ‌బ్బ‌లు క‌ట్టి, ల‌క్ష‌, రెండు ల‌క్ష‌ల హెల్్త పాల‌సీ తీసుకుంటే స‌రిపోతుంద‌ట‌. ఇందుకు మ‌రో ఆంధ్ర జ‌ర్న‌లిస్టు కూడా వంత పాడారు. నిజ‌మే... మ‌న‌కు సామాజిక బాధ్య‌త ఉంది. కానీ జేబుల ద‌మ్మిడీ లేదు. ల‌క్ష‌ల జీతాలు తీసుకునేవారికి ఏం తెలుస్తుంది... స‌గ‌టు జ‌ర్న‌లిస్టులు ప‌డే బాధ‌లు. క‌మిటీ అన్న‌పుడు అందులో ఉండే ప్ర‌తినిధులు సాధార‌ణ జ‌ర్న‌లిస్టు కోణంలో ఆలోచించాలి. కానీ అదేదో కిరీటం పెట్టుకున్న‌ట్లు ప్ర‌వ‌ర్తిస్తే ఎలా?.
ఇంత‌కీ ఆ క‌మిటీ మీటింగులో తేల్చింది లేదు... పాడు లేదు. ఎందుకంటే ప‌దో త‌ర‌గ‌తి మెమో ఆధారంగా స్థానికత నిర్ధారిద్దామ‌ని తెలంగాణ జ‌ర్న‌లిస్టులు ప్ర‌తిపాదిస్తే... క‌మిటీలోని ఆంధ్ర జ‌ర్న‌లిస్టులు అదెలా కుదురుతుంది?. అని మోకాలు అడ్డుపెట్టార‌ట‌. పేరుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన క‌మిటీనేగానీ... మ‌న వార‌స‌త్వం, బానిస‌త్వం ఎక్క‌డ పోతుంది?. వాళ్లు చెప్పిన అభ్యంత‌రాల‌తో దిక్కుతోచ‌క త‌ర్వాత నిర్ణ‌యిద్దాం అని వాయిదా వేసుకున్నార‌ట‌. ఇంకా వెయ్యి సార్లు ఆ క‌మిటీ మీటింగు పెట్టినా ఆంధ్ర జ‌ర్న‌లిస్టుల‌ను కాద‌ని, కేవ‌లం తెలంగాణ జ‌ర్న‌లిస్టులకు మాత్ర‌మే న్యాయం జ‌రిగేలా నిర్ణ‌యం తీసుకోగ‌ల‌రా?. ప‌క్క‌లో బ‌ల్లెంలు పెట్టుకొని ఎలా ముందుకు సాగేది?. నిజంగా ఇది సిగ్గుచేటు... చంద్ర‌బాబు ద‌గ్గ‌రికి పోయి నేను ఆంధ్ర‌వాడిని అని క్లెయిమ్ చేసుకున్న వ్య‌క్తికి తెలంగాణ క‌మిటీలో చోటు క‌ల్పించిన ఈ స‌ర్కారు, జ‌ర్న‌లిస్టు సంఘాల పెద్ద‌ల‌కు హాట్సాఫ్‌!!

అంబానీల ఆకాంక్ష‌లే మాకు ముఖ్య‌మ‌ని చెప్ప‌డానికి మోడీ గారికి ధైర్యం రాలేదు..!!

భూసేక‌ర‌ణ చట్టంపై ర‌క్ష‌ణ శాఖ వాళ్లు ఆందోళ‌న చెందార‌ట‌... కొత్త ప్రాజెక్టులు చేయ‌డానికి ఇబ్బందిగా ఉంద‌న్నార‌ట‌... ముఖ్య‌మంత్రులు మొత్తుకున్నార‌ట‌... అస‌లు పెట్టుబ‌డిదారులు ఆందోళ‌న చెందార‌ని నేరుగా చెప్పొచ్చు క‌దా.. ఎందుకు ర‌క్ష‌ణ శాఖ వాళ్ల‌ను తీసుకురావ‌డం...  ముఖ్యమంత్రి లు చెప్పిన‌ట్లే అన్నీ చేస్తే.. ఈ దేశంలోని ముఖ్య‌మంత్రులు చాలా డిమాండ్లు ముందు ఉంచారు క‌దా... వాటిని ప‌రిష్క‌రించ‌లేదు ఎందుకో?
పాపం.. పెట్టుబ‌డిదారుల ప్ర‌యోజ‌నాలు, అంబానీల ఆకాంక్ష‌లే మాకు ముఖ్య‌మ‌ని చెప్ప‌డానికి మోడీ గారికి ధైర్యం రాలేదు..!!

ఈ ముచ్చ‌ట‌ను బీజేపీ నేత‌ల‌కు చెప్పండి సార్‌...

9 నెల‌ల్లో అన్నీ చేయ‌లేం. ఎన్నిక‌ల గెలుపోట‌ముల‌తో మా ప‌నితీరును జ‌డ్జి చేయొద్దు..:  పార్ల‌మెంట్‌లో న‌రేంద్ర మోడీ గారు..
-------------
ఈ ముచ్చ‌ట‌ను తెలంగాణ‌లో ఉన్న బీజేపీ నేత‌ల‌కు, ఇత‌ర రాష్ట్రాల్లో విప‌క్షంగా ఉన్న బీజేపీ నేత‌ల‌కు చెప్పండి సార్‌...

Thursday 26 February 2015

మ‌రి ఆయ‌న ఏడాదిలో ఎంత మారుస్తారో వేచిచూడాలి...!!

నిజంగా బ‌డ్జెట్‌లో ఏమీ ఇవ్వ‌క‌పోయినా స‌రే గానీ రైల్వేల‌ను స్వ‌చ్ఛంగా మార్చుస్తామ‌న్న ఒక్క ల‌క్ష్యాన్ని చేరుకుంటే సురేశ్ ప్ర‌భు విజ‌యం సాధించిన‌ట్లేన‌ని నేను అంగీక‌రిస్తా.. మ‌రి ఆయ‌న ఏడాదిలో ఎంత మారుస్తారో వేచిచూడాలి...!!

మ‌రి సాధార‌ణ బ‌డ్జెట్ ఏం చేస్తుందో..?

రైల్వే బ‌డ్జెట్ ద‌లాల్ స్ట్రీట్‌ను నిరాశ ప‌రిచింద‌ట‌...
మ‌రి సాధార‌ణ బ‌డ్జెట్ ఏం చేస్తుందో..?
నాకు తెలిసి శ‌నివారం సాధార‌ణ‌ బడ్జెట్ పెట్టింది కూడా స్టాక్ మార్కెట్ కుదుపున‌కు లోనుకాకుండా చూసేందుకేమో అనిపిస్తుంది..

జ‌నం మ‌ధ్య‌లో ఉండి కూడా క‌ష్టాలు తీర్చ‌క‌పోతే తాట‌తీస్తారు..!!

ముఖ్య‌మంత్రి ప్ర‌జ‌ల‌కు ఫోన్ చేయ‌డం, ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు పోవ‌డం, రోడ్డుపై సాధార‌ణ వ్య‌క్తిలాగా వెళ్ల‌డం, ప్ర‌జ‌ల‌తో సెల్ఫీలు దిగ‌డం ఇవ‌న్నీ కొంత‌కాలం వ‌ర‌కే న‌డుస్తాయి.. గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు పాల‌న అని నానా హంగామా చేసినా జ‌నం ఛీ కొట్టారు.. కేసీఆర్ అయినా, కేజ్రీవాల్ అయినా చంద్ర‌బాబైనా స‌రే ఇవ‌న్నీ గుర్తుంచుకోవాలి.. సీఎం ఏసీ రూంలో కూర్చుని ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను తొల‌గిస్తే ఆద‌రిస్తారు.. జ‌నం మ‌ధ్య‌లో ఉండి కూడా క‌ష్టాలు తీర్చ‌క‌పోతే తాట‌తీస్తారు..!!

Wednesday 25 February 2015

ఆ మూడు రాష్ట్రాల‌కు ఏమిచ్చింది?

2000 సంవ‌త్స‌రంలో ఎన్డీయే మూడు కొత్త రాష్ట్రాల‌ను ఏర్పాటు చేసింది క‌దా.. ఆ స‌మ‌యంలో ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఉన్న ఖ‌నిజ సంప‌ద‌ను కోల్పోయి ఇబ్బందులు ప‌డిన మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, జార్ఖండ్‌లోని ప‌రిశ్ర‌మ‌ల‌ను కోల్పోయి న‌ష్ట‌పోయిన బీహార్‌కు కేంద్రం సాయం చేసిందా? లేక కొత్త‌గా ఏర్పాటైన రాష్ట్రాల‌కు సాయం చేసిందా?

కేసీఆర్ మౌనం వెన‌క ఆంత‌ర్యం ఏమిటి?

వాళ్లేమో ఎన్ని నిధులు వ‌చ్చినా మాకు అన్యాయ‌మే జ‌రిగిందంటారు.. ఇక్క‌డేమో అన్యాయం జ‌రిగినా నోరు తెర‌వ‌డం లేదు... ఎందుకిలా?
14వ ఆర్థిక సంఘానికి ఫ‌ల‌క్‌నుమా ప్యాలెస్‌లో బిర్యానీ తినిపించినా మ‌న‌కు న్యాయం చేయ‌లేదు క‌దా.. మ‌రి దీనిపై కేసీఆర్ మౌనం వెన‌క ఆంత‌ర్యం ఏమిటి?

ఈ మిత్రుత్వం తెలంగాణ‌కు ఏమైనా ప్ర‌యోజ‌నాన్ని చేకూర్చుతుందా? ఆలోచించండి...

మోడీ గారు కేసీఆర్‌ను ప‌క్క‌న నిల‌బెట్టుకున్నారు.. కేసీఆర్ ప్ర‌ణాళిక‌లు భేష్ అన్నారు.. రాజ‌గురువుకు కేసీఆర్ గారు స‌న్నిహిత‌మ‌య్యారు.. వెంక‌య్య గారు కేసీఆర్‌ను తెగ‌పొగిడారు.. అన్నీ జ‌రిగాయి... కానీ తెలంగాణ‌కు 14వ ఆర్థిక సంఘం విదిల్చింది మాత్రం త‌క్కువే.. మ‌రి వ‌డ్డించేవాడు మ‌న‌వాడు అయితే ఎక్క‌డ నిల‌బెట్టినా స‌రే నిధులొస్తాయ‌న్న‌ట్లుగా బాబుగారు సీఎంల మీటింగ్‌లో మోడీ వెన‌క వ‌రుస‌లో ఉన్నా స‌రే నిధులు మాత్రం తెచ్చుకున్నారు...!!
మ‌రి కేసీఆర్ వేస్తున్న‌ ఎత్తుల‌న్నీ క‌రెక్టే.. రాజ‌గురువుతో దోస్తీ మంచిదే, వెంక‌య్య‌తో మిలాఖ‌త్ మంచిదే, మోడీని కీర్తించ‌డ‌మూ భేషే... రామానాయ‌డికి అధికారిక నివాళి గొప్ప విష‌య‌మే అనే మిత్రులారా... ఈ మిత్రుత్వం తెలంగాణ‌కు ఏమైనా ప్ర‌యోజ‌నాన్ని చేకూర్చుతుందా?  ఆలోచించండి... ఇప్ప‌టికైనా 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల్లో మ‌న‌కు జ‌రిగిన అన్యాయంపై  కేంద్రాన్ని నిల‌దీయాలి..
మ‌నం మ‌నలాగే ఉందాం.. మ‌న‌కు మిగులు బ‌డ్జెట్ ఉంద‌ని.. మీ చావు మీరు చావండి అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న కేంద్రంతో స‌ఖ్య‌త‌గా ఉన్నా ఉండ‌క‌పోయినా వ‌చ్చే నిధులు(అర‌కొరే) వ‌స్తాయి..  అన‌వ‌స‌రంగా వారి వ‌ద్ద‌కు వెళ్లి దేహి అన‌డం ఎందుకు భంగ‌పాటుకు గురి కావ‌డం ఎందుకు?

Tuesday 24 February 2015

భ‌విష్య‌త్తులో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ- ఎంఐఎం పొత్తు...?

రేప‌టి చిత్రం...
-------------
భ‌విష్య‌త్తులో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ- ఎంఐఎం పొత్తు...
ముఖ్య‌మంత్రిగా అక్బ‌రుద్దీన్‌... ఉప ముఖ్య‌మంత్రిగా కిష‌న్‌రెడ్డి (లేదా వైస్‌వ‌ర్సా)...
సాధ్య‌మే క‌దా... !!
-------------
నోట్‌: హిందూ ముస్లింల ఐక్య‌త‌కు మా పొత్తే గొప్ప నిద‌ర్శ‌నం అన్నా మ‌నం ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు..

భ‌విష్య‌త్తులో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ- ఎంఐఎం పొత్తు...?

రేప‌టి చిత్రం...
-------------
భ‌విష్య‌త్తులో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ- ఎంఐఎం పొత్తు...
ముఖ్య‌మంత్రిగా అక్బ‌రుద్దీన్‌... ఉప ముఖ్య‌మంత్రిగా కిష‌న్‌రెడ్డి (లేదా వైస్‌వ‌ర్సా)...
సాధ్య‌మే క‌దా... !!
-------------
నోట్‌: హిందూ ముస్లింల ఐక్య‌త‌కు మా పొత్తే గొప్ప నిద‌ర్శ‌నం అన్నా మ‌నం ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు..

మ‌రి ఆ ముదుర్లు ఇప్పుడు ఎక్క‌డ ఉన్నారో జ‌ర్న‌లిస్టు సంఘాల్లో ప‌నిచేస్తున్న వారే చెప్పాలి...

తెలంగాణ ఉద్య‌మం వ‌ల్ల ఆర్టీసీలో ఏళ్ల త‌ర‌బ‌డి పాతుకుపోయిన మ‌హ‌మూద్‌, నాగేశ్వ‌ర్‌ల ఆధిప‌త్యానికి గండిప‌డింది..
ఇక సింగ‌రేణిలోనూ అలాగే జ‌రిగింది..
మ‌రి జ‌ర్న‌లిస్టుల సంఘంలో ఏళ్ల త‌ర‌బ‌డి పాతుకుపోయిన వ్య‌క్తుల ఆధిపత్యానికి గండిప‌డిందా?
ఇంకా ఆ ఊస‌ర‌వెల్లులు రంగులు మార్చుకుని కొత్త స‌ర్కారు పంచ‌న చేరారా?
ఆ ఊస‌ర‌వెల్లులు మ‌ళ్లా కేసీఆర్ ప‌క్క‌న చేరితే కొత్త‌త‌రం జ‌ర్న‌లిస్టుల‌కు తీర‌ని న‌ష్ట‌మే ఉంటుంది..
మ‌రి ఆ ముదుర్లు ఇప్పుడు ఎక్క‌డ ఉన్నారో జ‌ర్న‌లిస్టు సంఘాల్లో ప‌నిచేస్తున్న వారే చెప్పాలి...

జ‌ర్న‌లిస్టుల‌ అక్రిడియేష‌న్ల విధివిధానాల్లో ఆధార్‌నూ త‌ప్ప‌నిస‌రి చేయాలి...

అక్రిడియేష‌న్ల విధివిధానాల్లో ఆధార్‌నూ త‌ప్ప‌నిస‌రి చేయాలి...
త‌ప్పుడు వ్య‌క్తులు అక్రిడియేష‌న్ పొందితే క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేసేలా చూడాలి...

---------------------------------

అక్రిడియేష‌న్ల విధి విధానాల రూప‌క‌ల్ప‌న‌పై తెలంగాణ ప్ర‌భుత్వం ఓ క‌మిటీ వేసింది..
ఇందులో తెలంగాణ జ‌ర్న‌లిస్టుల‌కు(విలేక‌రులు, ఉప సంపాదకులకు)  ముమ్మాటికీ అక్రిడియేష‌న్లు ఇవ్వాలి..
ఐదేళ్లు లేదా మూడేళ్ల అనుభ‌వాన్ని ప్రాతిప‌దిక‌న తీసుకోవాలి..
ఇక తెలంగాణ‌లో ఉంటూ ఆంధ్రా ఎడిష‌న్ల‌కు ప‌నిచేస్తున్న జ‌ర్న‌లిస్టుల‌కు ఆంధ్రా ప్ర‌భుత్వం అక్రిడియేష‌న్లు ఇచ్చేలా చూడాలి..
అంద‌రినీ తెలంగాణ‌కు అంట‌గ‌ట్టోద్దు...
ఇక్క‌డ కూడా ఆధార్ కార్డుల‌ను జ‌త‌ప‌ర‌చాల‌న్న కండీష‌న్‌ను ముమ్మాటికీ పెట్టాలి...
లేక‌పోతే జ‌ర్న‌లిజం రంగంలో లేని వాళ్లు కూడా డ‌మ్మీ ప‌త్రిక‌ల్లో ప‌నిచేస్తున్న‌ట్లుగా అక్రిడియేష‌న్ కార్డులు తీసుకునే అవ‌కాశం లేక‌పోలేదు..
ఓ జ‌ర్న‌లిస్టు సంఘం నాయ‌కుడు త‌న ప‌త్రిక‌లో చాలామంది ప‌నిచేస్తున్న‌ట్లుగా వాళ్లంద‌రి పేరిట ఇళ్ల స్థ‌లాల‌కు ద‌ర‌ఖాస్తు చేయించాడు..
వాస్త‌వానికి అంత మంది ఉద్యోగులు ఆ చిన్న‌, ఎక్క‌డో స‌చివాల‌యంలో త‌ప్ప క‌నిపించ‌ని ప‌త్రిక‌లో లేర‌న్న‌ది నిష్టూర వాస్త‌వం...
అందుకే క‌మిటీ క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ప‌నిచేయాలి...
డెస్కు జ‌ర్న‌లిస్టులు, విలేక‌రులు మ‌ధ్య‌న చిచ్చు పెట్టేరీతిలో, వారి మ‌ధ్య విభ‌జ‌న తెచ్చే ప‌ద్ధ‌తిలో విధివిధానాలు రూపొందించొద్ద‌ని మ‌న‌వి...!!

కృష్ణ‌మ కంట త‌డి అంటూ హెడ్డింగ్‌లు పెడ‌తాయేమో..!!


మొన్న శ్రీ‌శైలంలో నీళ్లు లేవుర మొర్రో అని అన్న‌ప్ప‌టికీ ఆంధ్రాకు అద‌నంగా నీటిని తీసుకెళ్లారు.. ఆ స‌మ‌యంలో  ఆంధ్రా ఎడిష‌న్లో వేసిన హెడ్డింగ్‌ను చూస్తే అర్థం అవుతుంది ఈ ప‌త్రిక‌లు ఎవ‌రి ప‌క్ష‌మో... కృష్ణ‌మ బిర‌బిరా ఆంధ్రాకు ప‌రుగులెత్తుతోంద‌న్న‌ట్లు హెడ్డింగ్ పెట్టాయి..
-----------------------------------
ఇక ఈ రోజు రెండు ప‌త్రిక‌ల్లో శ్రీ‌శైలం అడుగంటింది... తెలంగాణ ప్ర‌భుత్వం విద్యుత్ ఉత్ప‌త్తి చేయ‌డం వ‌ల్ల‌నే ఈ ప‌రిస్థితి దాపురించింది.. ఇక ఆంధ్రాకు తాగు, సాగు నీటికి క‌ట‌క‌టే అంటూ వార్త‌లు వ‌స్తున్నాయి...
------------------------
రేపు తెలంగాణ‌కు తాగు నీటి అవ‌స‌రాల‌కు నీళ్లు తీసుకెళితే ఈ ప‌త్రిక‌లు కృష్ణ‌మ కంట త‌డి అంటూ హెడ్డింగ్‌లు పెడ‌తాయేమో..!!

ఎఫ్‌డీఐ అంటే స్వ‌దేశీ... బీజేపీ కొత్త భాష్యం...

బీజేపీ కొత్త భాష్యాలు...
----------------

దేశంలో కొత్త పెట్టుబ‌డుల‌కు వీలుగా కాంగ్రెస్ వాళ్లు విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డుల‌కు అనుమ‌తిస్తే.. అది దేశాన్ని తాక‌ట్టు పెట్ట‌డం అవుతుంది...
అదే బీజేపీ వాళ్లు ఎఫ్ డీఐల‌ను అనుమ‌తిస్తే అది స‌రికొత్త స్వేదేశీ నినాదం అవుతుంద‌ట‌....
-------------
ఇక ఎంఐఎం అనే పార్టీ టీఆర్ఎస్‌కు అసెంబ్లీలో కొన్ని అంశాల్లో మ‌ద్ద‌తు ఇస్తే  నిజాం పాల‌న‌, ర‌జాకార్ల రాజ్యం అయిపోతుంది...
కానీ పాకిస్థాన్‌కు మ‌ద్ద‌తుగా మాట్లాడిన పార్టీతో కాశ్మీర్‌లో బీజేపీ జ‌త‌క‌డితే అది దేశ‌భ‌క్తుల రాజ్యం, దేశ‌భ‌క్తుల పాల‌న అయిపోతుందేమో..
Note: ఈ లెక్క‌న ఈస్టిండియా కంపెనీ మ‌న దేశంలోకి వ‌చ్చి వ‌స్తువుల‌ను త‌యారు చేయ‌డం కూడా స్వ‌దేశీ కింది వ‌స్తుందేమో!!

తెలంగాణ‌కు భారీగా ఉన్న విద్యుత్ లోటును ఎవ‌రు తీర్చుతారు...!!

ఆంధ్రాకు రెవెన్యూ లోటు ఉందంటూ భారీగా నిధులిచ్చారు స‌రే.. మ‌రి తెలంగాణ‌కు భారీగా ఉన్న విద్యుత్ లోటును ఎవ‌రు తీర్చుతారు...!!
రెవెన్యూ లోటు తీరేలా ఆంధ్రాను కేంద్రం ఆదుకుంటున్న‌ట్లే... విద్యుత్ లోటు తీరేలా తెలంగాణ‌ను కేంద్రం ఆదుకోవాల‌ని విజ్ఞ‌ప్తి...

రాజ‌కీయాల‌కు బీజేపీ స‌రికొత్త భాష్యం

మొత్తానికి ఎంఐఎంతో టీఆర్ఎస్ జ‌త క‌ట్ట‌క‌ముందే కాశ్మీర్‌లో పీడీపీతో బీజేపీ జ‌త క‌ట్టి రాజ‌కీయాల‌కు స‌రికొత్త భాష్యం చెప్పింది... హ్యాట్సాఫ్‌... 
ఆర్టిక‌ల్ 370, ఉమ్మ‌డి పౌర స్మృతులు, ఇంకా ఏవేవో ఆరేళ్ల‌పాటు(జ‌మ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఆరేళ్లు క‌దా) శీత‌ల పెట్టె(కోల్డ్ స్టోరేజీ) లో ప‌డుకుంటాయి... 
ఒక‌వేళ పొత్తు పెటాకులైతే మ‌ధ్య‌లోనే అవి నిద్ర‌లేస్తాయి...!!

అమ‌ర్ గారి క‌లం నుంచి ఎన్ని వ్యాసాలు జాలువారాయో ఎవ‌రైనా సెల‌విస్తారా?

దేవుల ప‌ల్లి అమ‌ర్ గారు సాక్షి ప‌త్రిక‌లో పార‌ద‌ర్శ‌క‌త‌కు పాత‌ర‌.. మీడియా స్వేచ్ఛ విష‌యంలో కేజ్రీవాల్‌, కేసీఆర్‌, జ‌య‌ల‌లిత‌, మ‌మ‌త తీరు ప్ర‌జాస్వామ్యానికి చేటు అంటూ ఓ వ్యాసం రాశారు.. బ‌హుషా అమ‌ర్ గారి దృష్టిలో మీడియా స్వేచ్ఛ‌ను కాపాడిన అతిపెద్ద ర‌క్ష‌కుడు వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి, జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిలు మాత్ర‌మే కావొచ్చు... అందుకే వైఎస్ హ‌యాంలో మీడియా స్వేచ్ఛ గురించి అమ‌ర్ గారి క‌లం నుంచి ఎన్ని వ్యాసాలు జాలువారాయో ఎవ‌రైనా సెల‌విస్తారా?

నిధుల కేటాయింపులో ప్రాంతీయ కోణం ఉంటుందా?

చిన్న సందేహం...!!
---------------
14 ఆర్థిక సంఘం తెలంగాణ‌కు త‌గినంత‌గా నిధుల కేటాయింపు చేయ‌లేద‌ని అర్థం అవుతోంది... కేసీఆర్ రాజ‌గురువుకు స‌న్నిహితంగా ఉన్నా, మోడీకి స‌న్నిహితంగా మారినా స‌రే నిధులు మాత్రం అర‌కొరే ఇచ్చార‌ని తెలుస్తోంది... కొంప‌దీసి ఇందులోనూ ప్రాంతీయ కోణం ఏమైనా ఉందా?   ఆ సంఘం ఛైర్మ‌న్ మ‌న తెలుగోడేన‌ట క‌దా.. ఆయ‌న‌ది క‌డ‌ప జిల్లాన‌ట క‌దా... మ‌రి ప్రాంతీయ ప‌క్ష‌పాతాన్ని చూపేందుకు ఏమైనా అవ‌కాశాలు ఉంటాయా?   ఈరోజు ఈనాడు ప‌త్రిక‌లో మ‌న తెలుగు ఘ‌న కీర్తి అంటూ ఆయ‌న గురించి చిన్న వార్త కూడా రాశారు.. అందుకే ఈ అనుమానాలు...!!

అన్నా హ‌జారేకు త‌గ్గిన ఆద‌ర‌ణ‌..

పాపం అప్ప‌ట్లో అన్నా హ‌జారే ఢిల్లీలో ఆందోళ‌న చేస్తే రాష్ట్రంలోని అని ప‌త్రికల అధిప‌తులు అన్నాకు లేఖ రాశారు. హజారే వెంట మేం ఉన్నాం అంటూ భ‌రోసా ఇచ్చారు.. ఇప్పుడేమో ఆయ‌న ధ‌ర్నా చేసినా ప‌ట్టించుకుంటున్న పాపాన పోలేదు... అప్ప‌ట్లో వారికి న‌చ్చ‌ని పాల‌కులు ఉన్నారు కాబ‌ట్టి వాళ్ల‌ను దెబ్బ‌తీసే ఎత్తుగ‌డ‌.. అందుకోసం అన్నా హ‌జారేల‌ను భుజానికి ఎత్తుకున్నారు.. ఇప్పుడేమో వారు మెచ్చిన పాల‌కులు పీఠంపై ఉన్నారాయె.. ఆ పీఠం క‌ద‌ల కుండా కాపాడాల్సిన బాధ్య‌త వీరిపై ఉందాయె.. ఇంక హ‌జారే ఏం గుర్తొస్తాడు.. ఆయ‌న ధ‌ర్నాలు ఎక్క‌డ క‌నిపిస్తాయి.. పాపం హ‌జారే గారు..!!
నోట్:  అప్ప‌టి హ‌జారే దీక్ష‌తో ఓ కేజ్రీవాల్‌, ఓ బేడీ, ఓ సిసోడియా, ఓ రాందేవ్‌లు ప్ర‌ముఖంగా క‌నిపించారు. ఇప్పుడు హ‌జారే ధ‌ర్నాలు, దీక్ష‌ల‌తో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మ‌రో ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి త‌యారు అవుతాడా వేచిచూడాలి...!!

మీ సేవ‌ల ప‌ర‌మార్థం ఏంటో?

మ‌ద‌ర్ థెరిసా సేవ‌ల వెన‌క ప‌ర‌మార్థం మాత‌మార్పిడే  అని ఆర్ఎస్ఎస్ స‌ర్ సంఘ్ చాల‌క్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ గారు అంటున్నారు..
--------
మ‌రి గ‌త 80 ఏళ్లుగా మీరూ సంఘం ద్వారా సేవ చేస్తున్నారు క‌దా.. మీ సేవ‌ల ప‌ర‌మార్థ‌మూ మ‌త‌మార్పిడేనా?
మ‌ద‌ర్ థెరిసా మ‌న దేశంలోకి రాక‌ముందే మీ సంఘం మొద‌లైంది క‌దా.. అంటే మ‌ద‌ర్ థెరిసా క‌న్నా మీరే ఎక్కువ మందిని మ‌తం మార్చి ఉంటారా?



తెలంగాణ ఉద్య‌మంలో డెస్కు జ‌ర్న‌లిస్టుల పాత్ర కూడా అద్వితీయం...!

తెలంగాణ ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి..
*****
తెలంగాణ ఉద్య‌మంలో డెస్కు జ‌ర్న‌లిస్టుల పాత్ర  కూడా అద్వితీయం...!
సోష‌ల్ మీడియా అక్ష‌ర సైనికుల పాత్ర అనిర్వ‌చ‌నీయం..!!!
-----------------------
తెలంగాణ ఉద్య‌మంలో తెలంగాణ జ‌ర్న‌లిస్టులు అద్భుతంగా ప‌నిచేశారు. యాజ‌మాన్యాల ఒత్తిళ్లు ఉన్నా స‌రే త‌మ‌కు చేత‌నైనంత‌గా ఉద్య‌మంలో తోడ్పాటునందించారు. కొంద‌రు ఉద్య‌మ‌కారుల‌కు సూచ‌న‌లు, స‌ల‌హాలు అందించ‌గా మ‌రికొంద‌రు త‌మ రాత‌ల ద్వారా ఉద్య‌మానికి ఉత‌మిచ్చారు. అయితే జ‌ర్న‌లిస్టు అంటే కేవ‌లం క్షేత్ర స్థాయిలో ఉండే వారే అన్న భావ‌న తొల‌గిపోవాలి. ఎందుకంటే క్షేత్ర స్థాయిలో అర‌కొర స‌మాచారంలో, ఆద‌రాబాద‌ర‌గా ఇచ్చే వార్త‌ల‌ను డెస్కులో ప‌నిచేసే ఉప సంపాద‌కులు ఓ అంద‌మైన వార్త‌గా తీర్చిదిద్దుతారు. సామాన్య పాఠ‌కుల‌కు అర్థ‌మ‌య్యే రీతిలో దాన్ని మార్చుతారు.. అలాంటి ఉప సంపాద‌కులు లేకుండా విలేక‌రి పంపిన వార్త‌లు య‌థాత‌థంగా ముద్రిస్తే  పాఠ‌కులు ఆ వార్త‌ప‌త్రికపై దండ‌యాత్ర చేసినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌ర‌సం లేదు.. ఇంకా చెప్పాలంటే విలేక‌రి కొన్ని సంద‌ర్భాల్లో అవినీతికి గురికావొచ్చు కానీ ఉప సంపాద‌కుడు జీతాన్ని న‌మ్ముకుని జీవితాన్ని మొత్తం వృత్తికే అంకితం చేస్తాడు..విలేక‌రి ఉషోద‌యాన్ని, సూర్యాస్త‌మ‌యాన్ని చూస్తాడేమో కానీ.. ఉప సంపాద‌కుడి జీవితంలో ఆ రెండు ఉండ‌వు.. సాయంత్రం ఆఫీసుకెళ్తే నిషాచ‌రిలా ప‌నిచేసి అర్ధ‌రాత్రో అప‌రాత్రో ఇంటికి చేరుతాడు.. అనారోగ్యం వెంటాడుతున్నా వృత్తికి అంకిత‌మై జీవితాన్ని త్యాగం చేస్తాడు.. అలాంటి డెస్కు మిత్రుల‌ను జ‌ర్న‌లిస్టులే కాద‌నే వాడు మ‌నిషే కాదు. అస‌లు వాడు జ‌ర్న‌లిస్టే కాదు, వాడికి జ‌ర్న‌లిజం ఓన‌మాలే తెలియ‌వు అన్న‌ది నా నిశ్చితాభిప్రాయం.
----------------------
తెలంగాణ ఉద్య‌మంలో కొంద‌రు విలేక‌రులు ఆంధ్రా యాజ‌మాన్యాలు చెప్పిన‌ట్లు ఉద్య‌మాన్ని దెబ్బ‌తీసే రాత‌లు రాసినా.. డెస్కులో ఉన్న తెలంగాణ ప్రాంత ఉప సంపాద‌కులు వాటి తీవ్ర‌త‌ను త‌గ్గించే హెడ్డింగ్‌లు పెట్ట‌డం, ముఖ్యంగా యువ‌త ఎలాంటి ఆత్మాహుతి చేసుకోకుండా చూసేలా వార్తా శైలిని మార్చిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి.. యాజ‌మాన్యం ఎలాంటి కుట్ర‌లు చేస్తోంది టీఆర్ఎస్ అధినాయ‌క‌త్వానికి వేగుల్లా చేర‌వేసిన ఉప సంపాద‌కులు కోకొల్ల‌లు. అలాంటి వారిని జ‌ర్న‌లిస్టులుగా చూడ‌లేని వారిని ఏమ‌నాలో మాట‌లు రావ‌డం లేదు. తెలంగాణ ఉద్య‌మంలో విలేక‌రులు, ఉప సంపాద‌కుల భాగ‌స్వామ్యం స‌రిస‌మానం.. !
---------------
ఇంకా చెప్పాలంటే సోష‌ల్ మీడియాలో న‌యా పైసా ఆశించ‌కుండా రాత్ర‌న‌కా ప‌గ‌ల‌న‌కా రాత‌లు రాసిన నెటిజ‌న్లు కూడా అక్రిడియేష‌న్ లేని జ‌ర్న‌లిస్టులే.. నాకు తెలిసి విలేక‌రుల‌కు, ఉప సంపాద‌కులకు, సోష‌ల్ మీడియాలో విస్తృతంగా రాస్తున్న మిత్రుల‌ను కూడా జ‌ర్న‌లిస్టులుగా గుర్తించి వారికి అక్రిడియేష‌న్ ఇవ్వాల‌ని విజ్ఞ‌ప్తి.. !!
----------------
నోట్‌:  అక్రిడియేష‌న్లు  ఇవ్వ‌డం వ‌ల్ల పెద్ద న‌ష్టం ఉండ‌దు.. వీలైతే విలేక‌రులు బ‌స్సుల్లో ఎన్నిసార్లైయినా ప్ర‌యాణించ‌డానికి అవ‌కాశం ఇవ్వ‌డం, అలాగే డెస్కు జ‌ర్న‌లిస్టులు  నెల‌లో రెండుసార్లు అక్రిడియేష‌న్ కార్డును ఉప‌యోగించుకొనే నిబంధ‌న పెట్టాలి. సోష‌ల్ మీడియాలో ఎలాంటి పైసా
ఆశించ‌ని వారి సేవ‌ల‌ను గుర్తిస్తే స‌రిపోతుంది.. వారికి అక్రిడియేష‌న్ ఇచ్చి ప్ర‌భుత్వ ప్ర‌యోజ‌నాలు అందించ‌కున్నా వాళ్లు ఎంతో సంతోషిస్తార‌ని నా నా న‌మ్మ‌కం...

Monday 23 February 2015

జ‌ర్న‌లిస్టులంటే ఎవ‌రు?

జ‌ర్న‌లిస్టులంటే ఎవ‌రు?
----------------
ఉగాదులు లేకుండా ఉష‌స్సులు లేకుండా ప్ర‌జల కోసం ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం నిఖార్సైన‌, నిజాయ‌తీతో కూడిన వార్త‌లు రాసేవాళ్లా?
లేక పాత్రికేయం ముసుగులో పైరేవీలు, లాబీయింగ్‌లు, సెటిల్‌మెంట్లు, వ‌సూళ్లు, దందాలు చేసేవాళ్లా?
స్వ‌చ్ఛ భార‌త్‌ను ప్రారంభించినట్లే.. స్వ‌చ్ఛ‌మైన జ‌ర్న‌లిజాన్ని ప్రోత్స‌హించండి... 

మీడియా సిబ్బందికీ సంద‌ర్శ‌న వేళ‌లుండాలి..

కొత్త‌గా క‌ట్టే స‌చివాల‌యంలో మీడియా వాళ్ల కోసం ఓ ఛాంబ‌ర్‌ను ఏర్పాటు చేయాలి.. వాళ్ల‌కు ఆ ఛాంబ‌ర్‌లో పేప‌ర్లు, టీవీలు, కంప్యూట‌ర్లు, ఇంట‌ర్నెట్  సౌక‌ర్యాలు క‌ల్పించాలి... ప‌దేప‌దే మంత్రుల ఛాంబ‌ర్ల‌కు చొర‌బ‌డ‌టం ఉండ‌కూడదు.. స‌చివాల‌యంలోకి సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు ఎలాగైతే విజిట‌ర్స్ అవ‌ర్స్ ఉంటాయో.. ఈ మీడియా వారికి కూడా పాత్రికేయుల సంద‌ర్శ‌న వేళ‌లు ఉండాలి.. ఆ స‌మ‌యంలో మాత్ర‌మే వీళ్లు మంత్రుల ఛాంబ‌ర్‌లోకి వెళ్ల‌డం వారితో మాట్లాడ‌టం చేయాలి... 

లాభాల సంస్థ‌లు మాకు.. న‌ష్టాలు సంస్థ‌లు మీకు.. ఆహా ఏమి తెలివి!!

రాష్ట్ర విభ‌జ‌న 10వ షెడ్యూల్‌లో ఓ వంద‌కు పైగా సంస్థ‌ల‌ను ఉమ్మ‌డి జాబితాలో చేర్చారు క‌దా..
అయితే అందులో న‌ష్టాల్లో ఉన్న‌, అప్పుల భారం ఉన్న సంస్థ‌ల‌ను వ‌దిలించుకొని తెలంగాణ‌కే వ‌దిలేయాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ భావిస్తోంద‌ట‌..
లాభాలొచ్చే సంస్థలుంటే మాత్రం లాభాల‌ను పంచుకొని అప్పుల‌ను తెలంగాణ‌కు వ‌దిలేస్తారేమో...
మ‌రి ఈ వార్త నిజ‌మే అయితే తెలంగాణ స‌ర్కారు ఎలా ఎదుర్కొంటుందో చూడాలి..

Friday 20 February 2015

ఆరు నెల‌లు సావాసం చేస్తే వీళ్లు వాళ్ల‌య్యారు.. వాళ్లు వాళ్ల‌లాగే ఉన్నారు..

తెలంగాణ‌లో ఆంధ్రా పార్టీలు, ఆంధ్రాకు వ‌త్తాసు ప‌లికే పార్టీలు ఉండొద్దు అన్నారు... అరే చాలా మంచిగా చెప్పిండు సార్ అని అంద‌రూ స‌క్క‌లు గుద్దుకున్నారు..
తీరా తొమ్మిది నెల‌లు తిరిగి చూస్తే మ‌నం గెలిపించింది తెలంగాణ పార్టీనా.. లేక ఆంధ్రా పార్టీనా?  అన్న అనుమానం క‌లుగుతోంది.. ముఖ్యంగా చిత్ర న‌గ‌రిలో డ్రామోజీని క‌లిసిన త‌ర్వాత ప‌రిస్థితి మ‌రీ మారిపోయింది...
ఆరు నెల‌లు సావాసం చేస్తే వాళ్లు వీళ్ల‌వుతారు.. వీళ్లు వాళ్ల‌వుతారు అని నానుడి విన్నాను.. వాళ్లు వీళ్ల‌య్యారో లేదో తెలియ‌దు కానీ.. వీళ్లు వాళ్ల‌వుతున్న‌ట్లు క‌నిపిస్తుంది... హ‌త విధి...!!

ఆ ప‌రిస్థితి రావొద్దు..

గ‌తంలో ఉద్య‌మ సంద‌ర్భంగా కొన్ని త‌ప్పిదాలు చేశాం.. అవి మ‌న‌సులో పెట్టుకోవ‌ద్దు అంటూ కేసీఆర్ గారు తెలంగాణ‌లో స్థిర‌ప‌డిన ఆంధ్రా ప్రాంతీయుల‌ను ఉద్దేశించి అంటున్నారు..
రేపు పొద్దున ఎన్నిక‌ల స‌మ‌యంలో తెలంగాణ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి గ‌తంలో అధికారంలో ఉండ‌టం వ‌ల్ల‌ తెలిసీ తెలియ‌క త‌ప్పులు చేసిన మ‌న‌సులో పెట్టుకోవ‌ద్దు అన్న మాట‌లు అనే ప‌రిస్థితి తెచ్చుకోవ‌ద్దు అనేదే మా ఉద్దేశం... మీ నోట ఆ మాట వ‌స్తే త‌ట్టుకోలేం.. !!

స‌చివాల‌యంలోకి జ‌ర్న‌లిస్టుల ప్ర‌వేశంపై విధించిన ఆంక్ష‌లు మాత్రం ముమ్మాటికీ స‌బ‌బే...

స‌చివాల‌యంలోకి జ‌ర్న‌లిస్టుల ప్ర‌వేశంపై విధించిన ఆంక్ష‌లు మాత్రం ముమ్మాటికీ స‌బ‌బే...  ఇది జ‌ర్న‌లిజానికి చీక‌టి రోజు కాదు. జ‌ర్న‌లిస్టుల చేతుల‌ను క‌ట్టేసిన‌ట్టు కాదు.. ఎందుకంటే జ‌ర్న‌లిస్టులు స‌మాచారం కావాలంటే స‌చివాల‌యానికి వెళ్లే తెలుసుకోవాల‌ని ఏముంది.. ఫోన్లున్నాయి, ఇంటర్నెట్ ఉంది..ఎంద‌రో ప్ర‌జా వేగులున్నారు.. స‌చివాల‌యంలో ఒక‌వేళ ఏదైనా త‌ప్పు జ‌రుగుతుంటే ఉప్పందించ‌డానికి కిందిస్థాయి నుంచి పైస్థాయి వ‌ర‌కు సోర్సులు ప‌దిలంగా ఉంటారు క‌దా...
ఎంత‌మంది సీనియ‌ర్లు టేబుల్ జ‌ర్న‌లిజం చేయ‌డం లేదు చెప్పండి.. నాకు తెలిసి ఈ స‌చివాల‌యం బీట్ ఎత్తేయ‌డం మేలేమో..!!
నేను స‌చివాలయం బీట్ చూస్తాను తెలుసా?  అని ఏదో గొప్ప‌గా చెప్పుకుంటారు కొంద‌రు... ఏ బీట్ అయినా జ‌నం కోస‌మే అన్న‌ది విస్మ‌రిస్తున్న వారికి ఇప్పుడు ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం ఓ చెంప‌పెట్టుటాంటిందే..!!
నోట్‌:  పాత్రికేయ‌మే ఊపిరిగా జీవించే నిఖార్స‌యిన జ‌ర్న‌లిస్టుల‌కు ఈ నిర్ణ‌యం బాధ క‌లిగించొచ్చు.. 

Thursday 19 February 2015

హైద‌రాబాద్‌లో ఆంధ్రా భ‌వ‌నం...!!

నా అంచ‌నా నిజ‌మైతే..
హైద‌రాబాద్‌లో ఆంధ్రా భ‌వ‌నం...!!
ట్యాంక్‌బండ్‌పై విగ్ర‌హాలు వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కూ అలాగే ఉండే అవ‌కాశం..?
----------------
హైద‌రాబాద్‌లో గిరిజ‌నులు, ఆదివాసీలు, బీసీల కోసం ప్ర‌త్యేక భ‌వ‌నాలు నిర్మించేందుకు కేసీఆర్ గారు సుముఖ‌త వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే.. మొన్నామ‌ధ్య హైద‌రాబాద్‌లో స్థిర‌ప‌డ్డ కేర‌ళ వాసులు నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో పాల్గొంటూ మీరు మా సంస్కృతిలో మ‌మేకం అయ్యారు.. అందుకే మీకు కేర‌ళ భ‌వ‌న్ నిర్మించుకోవాడానికి ఎక‌రం స్థ‌లం ఇస్తామ‌ని హామీ ఇచ్చారు.. ఇక తెలంగాణ‌లోనూ ఏళ్ల త‌ర‌బ‌డి నివ‌సిస్తున్న ఆంధ్రా వారు కూడా ఏదైనా కార్య‌క్ర‌మాన్ని పెట్టి వ‌రం కోరితే స‌రిపోతుంది... వెంట‌నే ఆంధ్రా భ‌వ‌న‌మో లేక క‌మ్మ భ‌వ‌న‌మో లేక రెండూనూ మంజూర‌య్యే  అవ‌కాశాలు ఇప్పుడు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి...  తెలంగాణ ఉద్య‌మంలోనూ కేర‌ళ వాళ్ల క‌న్నా ఎక్కువ‌గా ఆంధ్రులు పాల్గొన్నార‌న్న ప్ర‌శంస‌ల‌ను మూట‌గ‌ట్టుకోవ‌చ్చు... మ‌రి ఆంధ్ర భ‌వ‌నానికి ఎన్ని ఎక‌రాలు కేటాయిస్తారో?
అప్ప‌ట్లో ట్యాంక్‌బండ్‌పై ఉన్న ఆంధ్రా విగ్ర‌హాలు వెన‌క్కి పంపిస్తామ‌ని కేసీఆర్‌గారు అన్నారు.. బ‌హుషా అప్పుడున్న ప‌రిస్థితుల వ‌ల్ల అలా అని ఉండొచ్చు.. ఇప్ప‌డు జ‌రుగుతున్న ప‌రిణామాలు చూస్తుంటే ఆ విగ్ర‌హాల జోలికి ప్ర‌భుత్వం వెళ్లక‌పోవ‌చ్చు.. ఇత‌ర రాష్ట్రాల మ‌హ‌నీయుల‌ను పూజించే మ‌హోన్న‌త సంస్కృతి మాకుంద‌ని చాటేందుకు వాటిని అక్క‌డే ఉంచుతారేమో...!!
---------------
నోట్‌:  వ‌చ్చే నాలుగేళ్ల‌లో అభివృద్ధి అంశంపై ఎన్నిక‌ల‌కు వెళ్లే అవ‌కాశాలు లేక‌పోతే మాత్రం మ‌ళ్లా ఆంధ్రా విగ్ర‌హాలు, ఆంధ్రా పార్టీలు బాగో అంటారేమో..!!

మ‌థ‌న ప‌డుతున్న తెలంగాణ జ‌నం...

కేసీఆర్ వాట‌ర్ గ్రిడ్ అంటే ఆంధ్రా మీడియా పేలియో ఛానెల్ అన్నాయి..
కేసీఆర్ స‌మ‌గ్ర స‌ర్వే అంటే వ‌ద్దు వ‌ద్దు అన్నాయి..
మిష‌న్ కాక‌తీయ అంటే... క‌మిష‌న్ల కాక‌తీయ అన్నాయి..
హుస్సేన్‌సాగ‌ర్ ప్ర‌క్షాళ‌న అంటే... వ‌ద్దే వ‌ద్దు అంటున్నాయి...
స‌చివాల‌యం మారుస్తామంటే స‌సేమిరా అన్నాయి...
సాగ‌ర్ నీళ్లు వ‌ద‌ల‌బోమంటే... అయ్యో ఇంత అన్యాయ‌మా?  అన్న‌ట్లు మాట్లాడాయి...
విద్యుత్ క‌ష్టాల‌కు బాబే కార‌ణం అంటే.. లేదు లేదు.. ప్ర‌భుత్వానిదే త‌ప్ప‌న్నాయి...
----------
ఇంకా అనేక విష‌యాల్లో కేసీఆర్‌ను వ్య‌తిరేకించాయి... ఇవ‌న్నీ తెలంగాణ ప్ర‌యోజ‌నంతో ముడిప‌డిన అంశాలు కాబ‌ట్టి అవి వ్య‌తిరేకించాయి..
తెలంగాణ‌లోని విప‌క్షాలు కూడా ఈ నిర్ణ‌యాల‌ను వ్య‌తిరేకించాయి.. కానీ తెలంగాణ ప్ర‌జ‌లు మాత్రం ప్ర‌భుత్వానికి పూర్తి అండ‌గా ఉన్నారు..
----------
కానీ  డ్రామోజీని క‌లిసినా, ఆంధ్రా పెట్టుబ‌డిదారుల‌ను పొగిడినా, సాగ‌ర్ నీళ్లు వ‌దిలినా... సైలెంట్‌గా సంబ‌రాలు చేసుకుంటున్నాయి.. తెలంగాణ ప్ర‌జ‌లు మాత్రం లోలోన ఎంతో మ‌థ‌న ప‌డుతున్నారు...!!

వారిని త‌ల‌పై పెట్టుకుంటే అది భ‌స్మాసుర హ‌స్తం కావ‌డం ముమ్మాటికీ త‌థ్య‌మే...!

మాయావ‌తి ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ద‌ళిత‌, బ‌హుజ‌న‌, క్ష‌త్రియ‌, బ్రాహ్మ‌ణుల‌తో చెలిమి చేసింది.. అంతేకాని ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు పొరుగు రాష్ట్రాలైన బీహార్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ నుంచి వ‌చ్చి స్థిర‌ప‌డిన‌ వారితో మాత్రం కాద‌న్న విష‌యాన్ని గుర్తుంచుకోవాలి .. కేసీఆర్ మాయావ‌తి లెక్క‌పోతుండు అనే వారు ఈ విష‌యాన్ని గుర్తుంచుకోవాలి...  సోష‌ల్ ఇంజినీరింగ్ తెలంగాణ‌లో అవ‌స‌రం అనుకుంటే ఇక్క‌డి బీసీ, ద‌ళిత‌, గిరిజ‌న‌, రెడ్డి, వెల‌మ‌ల‌తో క‌లిసి చేయొచ్చు... అంతేకాని ఇక్క‌డి వాళ్ల‌ను సైడ్‌లైన్ చేసి పొరుగు నుంచి వ‌చ్చిన వారిని  త‌ల‌పై పెట్టుకుంటే అది భ‌స్మాసుర హ‌స్తం కావ‌డం ముమ్మాటికీ త‌థ్య‌మే...!
--------------------
నోట్‌:  శివ‌సేన‌, ఎంఎన్ఎస్‌లు మూల సిద్ధాంతాన్ని వ‌దిలి బీహారీల‌తో చెట్ట‌ప‌ట్టాలు వేసుకుంటే ఆ పార్టీల అస్థిత్వం ఎప్పుడో మంట‌గ‌లిసేది...మూల సిద్ధాంతానికి క‌ట్టుబ‌డి ఉంది కాబ‌ట్టే శివ‌సేన మ‌నుగ‌డ సాగిస్తోంది.. మ‌రాఠీ హక్కుల‌ను ప‌రిర‌క్షిస్తోంది... !!

గిది ఫైన‌ల్‌..నో కాంప్ర‌మైజ్‌..!!!



తెలంగాణ‌లో స్థిర‌ప‌డ్డా ఆంధ్రా సెటిల‌ర్ల కాలికి ముళ్లు గుచ్చితే మీ నోటితో తీస్తామంటే ఆమోదిస్తాం కానీ... తెలంగాణ వ‌న‌రులు దోచుకునే పెట్టుబ‌డిదారుల కాలికి ముళ్లు గుచ్చ‌కుండా కాపాడుతామ‌ని ప్ర‌క‌టిస్తే మాత్రం స‌హించేది లేదండి.. ఇది ఫైన‌ల్‌... నో కాంప్ర‌మైజ్‌..!!

తెలంగాణ ప్ర‌జ‌ల‌ను మ‌న్నించాలి...

చ‌క్రి, తెలంగాణ శ‌కుంత‌ల‌, ఎమ్మెస్ నారాయ‌ణ‌లు తెలంగాణ ప్ర‌జ‌ల‌ను మ‌న్నించాలి... మీ  అంత్య‌క్రియ‌ల‌ను అధికార లాంఛ‌నాల‌తో చేయించ‌లేక‌పోయాం...!!

సినీ ప‌రిజ్ఞానం ఉన్న‌వాళ్లు చెప్పండి..

ఆయ‌న తీసిన 155 సినిమాల్లో మా భూమి, దాసి, కొమ‌రం భీం, జై భోలో తెలంగాణ‌, పోరు తెలంగాణ‌, వీర తెలంగాణ లాంటివి ఏమైనా ఉన్నాయా?
సినీ ప‌రిజ్ఞానం ఉన్న‌వాళ్లు చెప్పండి.. తెలుసుకోవాల‌ని ఉంది...

ఇక్క‌డైతే అన్నీ అధికార లాంఛ‌నాలే క‌దా..

గుస‌గుస‌...
వ‌య‌సు మ‌ళ్లిన ప్ర‌ముఖ సినీ తార‌లంతా హైద‌రాబాద్‌లోనే ఆఖ‌రి శ్వాస విడువాల‌ని భావిస్తున్నార‌ట‌... ఇక్క‌డైతే  అన్నీ అధికార లాంఛ‌నాలే క‌దా..

తెలంగాన‌లో పారిశ్రామిక‌వేత్త‌లు రావాలి..

మోడీ పెట్టుబ‌డిదారుల ప‌క్ష‌మే.. అయితే ఆ పెట్టుబ‌డిదారుల్లో ప్ర‌ధానులైన అంబానీ, అదానీలు ఏ రాష్ట్రం వారు?
ఎంత దేశానికి ప్ర‌ధాని అయినా రాష్ట్రానికి చెందిన పారిశ్రామిక‌వేత్త‌ల‌కు పెద్ద‌పీట వేస్తున్నాడు క‌దా...
క‌నీసం తెలంగాణ‌లో అంబానీ, అదానీల‌ను త‌యారు చేయాలి... అంతేకాని ఎక్కువ అర‌వుతెచ్చుకుంటే లాభం ఉంటుందా?

ఇప్పుడు మీరు చేస్తున్న ప‌నుల‌నే కాంగ్రెస్ చేసుంటే స్వాగ‌తించే వాళ్లా?

నాదో ప్ర‌శ్న‌...
ఆత్మ విమ‌ర్శ చేసుకోండి..
----------------------
తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత మ‌న తెలంగాణ పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చి జానారెడ్డో, పొన్నాలో ఇంకెవ‌రో ముఖ్య‌మంత్రి అయి రామోజీరావుతో స‌ఖ్యంగా ఉంటే, ఆంధ్రా పెట్టుబ‌డిదారుల‌కు, తెలంగాణ‌లోని సెటిల‌ర్ల‌కు పెద్ద పీట వేస్తుంటే... ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంలో ఉండే టీఆర్ఎస్ ఏమ‌నేది... ముమ్మాటికీ ఉద్య‌మం చేసేదా?  కాదా?   తెలంగాణ వ‌చ్చినా ఆంధ్రా దోపిడీ ఆగ‌లేద‌ని ఆందోళ‌న చేసేదే కాదా?
రామోజీ తెలంగాణ వ‌న‌రుల‌ను దోచుకున్నాడు అలాంటి వారితో స్నేహం మంచిది కాద‌ని ప్ర‌శ్నించేదా?  లేదా?   తెలంగాణ‌లో వ‌న‌రుల‌ను కొల్ల‌గొట్టే ఆంధ్రా పెట్టుబ‌డిదారుల‌కు కొమ్ముకాస్తున్న కాంగ్రెస్‌ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో  వెయ్యి అడుగుల  లోతున గొయ్యి తీసి పాతిపెడ‌తామ‌ని అనేదా ?  అన‌క‌పోయేదా?   గురుకుల్ భూముల‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రిస్తే  వ్య‌తిరేకించేవారా?  కాదా?  అక్కినేని నాగార్జున మంచోడ‌ని స‌ర్టిఫికేట్ ఇస్తే  లేదు క‌బ్జాకోరు అని మీరు మండిప‌డేవారా?  కాదా?   ప‌ద్మాల‌యా భూములు స‌క్ర‌మ‌మే అని కాంగ్రెస్ అంటే  లేదు లేదు అక్ర‌మం అని హైకోర్టుకు వెళ్లేవారా?  కాదా? మ‌న ఆత్మ‌గౌర‌వ‌న్ని తాక‌ట్టు పెడుతున్న కాంగ్రెస్‌ను ఖ‌తం చేయాల‌ని టీఆర్ఎస్‌ పిలుపు ఇచ్చేదా?  ఇవ్వ‌క‌పోయేదా?

----------------------------
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే పైన చెప్పిన ప‌నుల‌న్నీ చేస్తుంద‌నే భ‌యం, మీ 14 ఏళ్ల ఉద్య‌మ నేప‌థ్యాన్ని గుర్తించే మ‌న పార్టీ, మ‌న పాల‌న అంటూ నిఖార్సైయిన తెలంగాణ యోధులంతా రాత్ర‌న‌కా ప‌గ‌ల‌న‌కా భావ జాల వ్యాప్తి కోసం త‌మ విలువైన స‌మ‌యాన్ని వెచ్చించారు... ప్ర‌జ‌లంద‌రి కాళ్లావేళ్లా ప‌డి ఇంటి పార్టీని గెలిపించారు.. ఇప్పుడు గ్రేట‌ర్ ఎన్నిక‌ల కోస‌మ‌నో, ఇంకేదో కార‌ణం చేత‌నో మీ  ప్ర‌ధాన సిద్ధాంతాల‌కు తిలోద‌కాలు ఇస్తే భ‌విష్య‌త్తులో న‌ష్ట‌పోయేది మీతోపాటు తెలంగాణ స‌మాజం కూడా..  మీరు పెట్టుబ‌డిదారుల‌పై చూపే అతిప్రేమ ప్ర‌జ‌లలో మీపై విశ్వాసాన్ని దెబ్బ‌తీస్తున్న విష‌యాన్ని మ‌ర‌చిపోవ‌ద్దు.. 14 ఏళ్లుగా సంపాదించుకున్న విశ్వ‌స‌నీయ‌త దెబ్బ‌తింటే తిరిగి సంపాదించుకునేందుకు చాలా స‌మ‌య‌మే ప‌డుతుంది... ప్ర‌త్యామ్నాయాలు లేనంత వ‌ర‌కూ ప్ర‌జలంతా మీవెంటే ఉంటారు.. ప్ర‌త్యామ్నాయం వ‌స్తే అస్థిత్వానికే విఘాతం క‌లుగుతుంది త‌స్మాత్ జాగ్ర‌త్త‌... ఈ విష‌యాన్ని ఇంటి పార్టీ గుర్తుంచుకోవాల‌ని విజ్ఞ‌ప్తి...  !!
-------------------------------

మ‌హ‌నీయులు మ‌హ‌నీయులే.. కానీ క‌వ‌రేజీలో తేడాలేంటో అర్థం కావ‌డం లేదు...

తెలంగాణ ఉద్య‌మంలో, స్వాతంత్ర్య పోరాటంలో కొట్లాడిన తెలంగాణ గాంధీగా గుర్తింపు పొందిన‌ భూప‌తి కృష్ణ‌మూర్తి అంతిమ‌యాత్ర‌ను ఎవ‌ర‌న్నా ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారం చేశారా?  ఎన్ని నిమిషాలు ప్ర‌సారం చేశారు.. ఆయ‌న జీవిత చ‌రిత్ర‌ను ఎవ‌ర‌న్నా టీవీల్లో చెప్పారా?
స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుల క‌న్నా సినీ తార‌ల‌కే మీడియాలో పెద్ద‌పీట ల‌భిస్తున్న రోజులివి.. రేప‌టి రోజుల్లో రామానాయుడు ఎవ‌రంటే నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్(వెంక‌టేశ్ న‌టించిన సినిమా పేరు) తండ్రి అని పిల్ల‌లు చెప్పుకుంటారేమో.. చ‌రిత్ర విజ్ఞానం లోపిస్తుందో లేక పెట్టుబ‌డిదారుల‌కు ప్రాధాన్య‌త పెరుగుతుందో అర్థం కావ‌డం లేదు..
----------------------
నోట్‌:  మ‌హ‌నీయులు మ‌హ‌నీయులే.. కానీ క‌వ‌రేజీలో తేడాలేంటో అర్థం కావ‌డం లేదు...

మ‌న పార్టీ, మ‌న పాల‌న అంటూ మ‌నం ప‌ది మందితో చెప్పి ఓట్లేయించాలంతే...!!!

పొట్ట కూటికోసం వ‌చ్చిన వారితో పంచాయితీ లేదు.. పొట్ట కొట్టే వారితోనే పంచాయితీ...  ఈ మాట‌ల‌న్నీ మ‌నం మ‌ర‌చిపోవాలి.. ఎవ‌రూ అన‌లేదు.. మ‌నం విన‌లేదు.. అంతే కదా...!!
రేపు డ్రామోజీ పోయినా అధికార లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు జ‌ర‌గ‌డం ఖాయం.. మ‌నం ప్రేక్ష‌కులుగా చూస్తూ ఉండిపోవాలంతే..  మ‌న పార్టీ, మ‌న పాల‌న అంటూ మ‌నం ప‌ది మందితో చెప్పి ఓట్లేయించాలంతే...!!!

Tuesday 17 February 2015

హుస్సేన్ సాగ‌ర్ ప్ర‌క్షాళ‌న‌ను ఆప‌క‌పోతే కోర్టుకు పోతార‌ట‌...!





సాగ‌ర్ నీళ్ల‌ను కింద‌కు వ‌దిలితే 80 ల‌క్ష‌ల ఎక‌రాల ఆయ‌క‌ట్టుపై ప్ర‌భావం ప‌డుతుంద‌ట‌...!!

కొంద‌రి ఆందోళ‌న‌..
---------------------
గంగాన‌ది ప్ర‌క్షాళ‌న పూర్త‌వుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది కానీ.. హుస్సేన్ సాగ‌ర్ ప్ర‌క్షాళ‌న క‌ష్ట‌మే అనిపిస్తోంది.. మొన్న‌టి దాకా హుస్సేన్ సాగ‌ర్‌ను ప్ర‌క్షాళ‌న చేయాల‌ని కోర్టుల‌ను ఆశ్ర‌యించారు కొంద‌రు.. ఇప్పుడు అశాస్త్రీయంగా ప్ర‌క్షాళ‌న చేస్తున్నారంటూ కోర్టుకు వెళ‌తామ‌ని హెచ్చ‌రిస్తున్నారు మ‌రికొంద‌రు.. ఈ లెక్క‌న మిష‌న్ కాక‌తీయ‌, మిష‌న్ మూసీ ప్రక్షాళ‌న‌లు ఈ జ‌న్మ‌లో జ‌రుగుతాయా?  
ఎడ్డెం అంటే తెడ్డం తెడ్డం అంటే ఎడ్డెం అన్న‌ట్లు ఉంది వీరి య‌వ్వారం..  
ఆంధ్ర‌జ్యోతిలో అయితే హుస్సేన్ సాగ‌ర్‌లో ఉన్న అర టీఎంసీ నీటిని కింద‌కు వ‌దిలితే  80 ల‌క్ష‌ల ఎక‌రాల సాగు భూమిపై ప్ర‌భావం ప‌డుతుంద‌ట‌... నిజంగా హుస్సేన్ సాగ‌ర్ నీళ్ల‌తో అంత ప్ర‌భావం ఉంటుందా?   ఈ లెక్క‌న హుస్సేన్ సాగ‌ర్ ప‌క్క‌న బోర్లు వేసుకున్న వాళ్లు ఎప్పుడో పైకి పోవాలి క‌దా...?   ఇక మూసీ న‌ది జోలికి కూడా మ‌నం వెళ్లొద్దు అన్న మాటే క‌దా...!! చేతులు క‌ట్టుకు కూర్చోవాల్సిందేనా..?
క‌నీసం ఈ ప‌త్రిక‌లైనా ప్ర‌క్షాళ‌న ఇలా చేయాలి అలా చేయాల‌ని రాయొచ్చు క‌దా... రాయ‌వు... స్వ‌చ్ఛ భార‌త్ కావాలంటూ భారీ స్టేట్‌మెంట్లు ఇస్తాయి..  మ‌రోవైపు ప్ర‌క్షాళ‌న ప‌ర్వాన్ని అడ్డుకునేలా కొంద‌రి ప్ర‌క‌ట‌న‌లకు భారీ ప్రాధాన్యం ఇస్తాయి... జీవితాంతం హుస్సేన్‌సాగ‌ర్ కాలుష్య‌కాసారంగా ఉన్నా భ‌రిస్తారు కానీ.. పూర్తి ప్ర‌క్షాళ‌న చేస్తామంటే అందులో రియ‌ల్ ఎస్టేట్ కోణాలు వెతుకుతారు... ఎలాగూ ప్ర‌క్షాళ‌న వ‌ద్దంటున్నారు కాబ‌ట్టి గ‌ణేశ్ నిమ‌జ్జ‌నాల కోసం హుస్సేన్‌సాగ‌ర్‌ను శాశ్వ‌తంగా వాడుదామా?  అని ప్ర‌తిపాదిస్తే మ‌ళ్లా భ‌గ్గుమంటారు.. సాగ‌ర్ ను నాశ‌నం చేస్తారా అంటూ మండిప‌డ‌తారు..  ఎందుకో?

క్రీడ‌ల్లో మెరిసిన తెలంగాణ‌.. చ‌దువుల్లో మురిసిన తెలంగాణ‌..!!


మొన్న కేర‌ళ‌లో జ‌రిగిన జాతీయ క్రీడ‌ల్లో తెలంగాణ అత్య‌ద్భుతంగా ప్ర‌తిభ క‌న‌బ‌రిచింది. మొత్తం 33 ప‌త‌కాలు సాధించింది. అందులో ఎనిమిది స్వ‌ర్ణ ప‌తకాలు ఉన్నాయి.. ప‌త‌కాల ప‌ట్టిక‌లో 12వ స్థానంలో నిలిచింది.. ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం కేవం 16 ప‌త‌కాలు సాధించి 18వ స్థానంలో ఉంది.. క్రీడ‌ల‌కు మ‌రింత‌గా ప్రోత్సాహ‌కాలు ఉంటే తెలంగాణే మొద‌టి స్థానంలో నిలిచినా ఆశ్చ‌ర్య పోన‌వ‌స‌రం లేదు. తెలంగాణ విడిపోతే ఏ రంగంలోనైనా వెన‌క‌బ‌డుతుంద‌ని ప‌నిగ‌ట్టుకు ప్ర‌చారం చేసిన వారంద‌రికీ ఇది ఓ చెంప‌పెట్టులాంటిదే..
ఇక చ‌దువుల్లోనూ తెలంగాణ విద్యార్థులు రాణిస్తున్నారు.. మొన్నామ‌ధ్య అంత‌ర్జాతీయ కార్పొరేట్ సంస్థ‌ల్లో ల‌క్ష‌ల వేత‌నంతో కూడిన కొలువులు పొందారు తెలంగాణ యువ మేధావులు.. ఇక నిన్న‌టికి నిన్న అజిం ప్రేమ్‌జీ యూనివ‌ర్సిటీలో 30 ఫ్రీ సీట్ల‌లో 22 ఫ్రీ సీట్ల‌ను తెలంగాణ విద్యార్థులే కైవ‌సం చేసుకోవ‌డం విద్యారంగంలోనూ మ‌న‌వారు ప్ర‌తిభ‌కు నిద‌ర్శ‌నంగా నిలుస్తోంది...
-----------
క్రీడ‌లు, సంస్కృతికం, విద్యా, ఆరోగ్యం, ప‌ర్యాట‌కం ఇలా అన్ని రంగాల్లోనూ ముందుండాలి..  తెలంగాణ ఏర్ప‌డిన ఏడాదిలోపే ఇలాంటి విజ‌యాలు న‌మోదు కావ‌డం నిజంగా గొప్ప విష‌య‌మే.. 

Monday 16 February 2015

తెలంగాణ పుర జ‌నుల‌కు విజ్ఞ‌ప్తి... మీరు ప‌న్నులు కట్ట‌కండి .. ఆంధ్రా ప‌త్రిక‌లు మీ వెంటే ఉంటాయి... మీకు అండ‌గా ఉంటాయి!!


మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో వృద్ధాప్య పింఛ‌న్ డ‌బ్బుల‌ను ఇంటి ప‌న్ను కింద జ‌మ చేసుకుంటున్నార‌ని వార్త వ‌చ్చింది కొన్ని ప‌త్రిక‌ల్లో.. వెయ్యి రూపాయ‌ల పింఛ‌న్‌లో 850 తీసుకొని రూ.150 చేతులో పెట్టి పంపుతున్నార‌ని వార్త సారాంశం.. ఇంటి ప‌న్ను ఏడాదికి ఒక‌సారి వ‌స్తుందా?  నెల‌కు వ‌స్తుందా?  ప‌న్నులు క‌ట్ట‌కుండా పంచాయ‌తీలు ఎలా ప‌నిచేస్తాయో?  ఒక‌వేళ పంచాయ‌తీలో అభివృద్ధి జ‌ర‌గ‌క‌పోయినా, వ్యాధులు ప్ర‌బ‌లితే మ‌ళ్లా అవే ప‌త్రిక‌లు ప‌డ‌కేసిన పారిశుద్ధ్యం, పంచాయ‌తీల‌కు నిధుల గండం అంటూ వార్త‌లు రాస్తాయి...?
----------------------
జీహెచ్ఎంసీలో మొండి బ‌కాయిల వ‌సూలుకు పూనుకున్నా ఇదే ర‌కం లొల్లి... మ‌రి మొండి బ‌కాయిదారుల గురించి ప‌త్రిక‌ల్లో రాయ‌రెందుకు?  మొండి బ‌కాయిలు క‌డితే అభివృద్ధి ప‌నులు నిరాటంకంగా సాగుతాయ‌ని చెప్పొచ్చు క‌దా..
రాజ‌కీయ నాయ‌కులు ఉచిత హామీల పేరిట ఓ విధంగా ప్ర‌జ‌ల‌ను సోమ‌రులుగా మార్చుతుంటే ప‌త్రిక‌లు ప్ర‌జ‌ల‌ను ఇంకా బాధ్య‌తర‌హితులుగా మార్చేందుకు పూనుకుంటున్నాయేమో అనిపిస్తుంది...!!
---------------------------
నోట్‌:  ఇవే ప‌త్రిక‌లు పొరుగు రాష్ట్రంలో రైతుల పొలాల‌ను ప్ర‌భుత్వం  రాబంధువులా క‌బ్జా చేస్తుంటే, అక్క‌డి రైతులు త‌మ పొలాల్లో పంట‌లు వేసుకోవ‌డ‌మూ నిషేధించినా స‌రే  క‌ళ్లుండీ చూడ‌లేం అన్న‌ట్లుగా ప్ర‌వ‌ర్తిస్తాయి.. !!

కేసీఆర్ బాట‌లో కేజ్రీవాల్‌...!!



ఢిల్లీ ఎన్నిక‌ల్లో బీజేపీని మ‌ట్టి క‌రిపించిన ఆమ్ ఆద్మీ పార్టీ క‌న్వీన‌ర్ కేజ్రీవాల్ ఇప్పుడు పాల‌న‌లోనూ త‌న‌దైన ముద్ర వేసేందుకు ప్రయ‌త్నిస్తున్నారు.  వివిధ రంగాల‌కు చెందిన నిపుణుల‌ను స‌ల‌హాదారులుగా నియ‌మించుకోవ‌డం, అలాగే ఎమ్మెల్యేల‌కు పార్ల‌మెంటరీ సెక్ర‌టరీలుగా హోదా క‌ల్పించి  ఆయా మంత్రిత్వ శాఖ‌ల నిర్వ‌హ‌ణ భారాన్ని అప్ప‌గించేలా ఆదేశాలు ఇవ్వాల‌ని ఆయ‌న చూస్తున్నారు. ఈ పార్ల‌మెంట‌రీ సెక్ర‌ట‌రీలు ముఖ్య‌మంత్రికి స‌హాయ స‌హ‌కారాలు అందిస్తారు. అలాగే మంత్రివ‌ర్గంలోనూ మ‌హిళ‌ల‌కు ప్రాతినిధ్యం క‌ల్పించ‌క‌పోవ‌డంపై విమ‌ర్శ‌లు వ‌స్తుండ‌టంతో సీఎంవోలోకి నిపుణులైన మ‌హిళ‌ల‌ను తీసుకోవాల‌ని యోచిస్తున్న‌ట్లు మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి... మ‌రోవైపు ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఆరోవేలుతో స‌మానం అని అంద‌రూ అంటుంటే కేజ్రీవాల్ మాత్రం ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌విని త‌న స‌న్నిహితుడు సిసోడియాకు క‌ట్ట‌బెట్టారు. అవినీతిపై టోల్ ఫ్రీ నెంబ‌ర్ కూడా త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తాన‌న్నాడు..
---------------------
ఏది ఏమైనా మ‌హిళ‌ల‌ను క్యాబినెట్‌లోకి తీసుకోక‌పోవ‌డం, ఎమ్మెల్యేల‌కు పార్ల‌మెంట‌రీ సెక్ర‌ట‌రీల హోదా క‌ల్పించ‌డం, ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వి, అవినీతిపై ఫిర్యాదు చేయ‌డానికి టోల్ ఫ్రీ నెంబ‌ర్‌ త‌దిత‌ర‌  నిర్ణ‌యాలు వింటుంటే కేసీఆర్ బాట‌లోనే కేజ్రీవాల్ న‌డుస్తున్నాడ‌న్న అనుమానం వ‌స్తోంది...
70 మంది ఎమ్మెల్యేలున్న ఢిల్లీ లో పార్ల‌మెంట‌రీ సెక్ర‌ట‌రీలు ఉన్నా త‌ప్పుప‌ట్ట‌రు కానీ 100 మందికి పైగా ఎమ్మెల్యేలున్న తెలంగాణ‌లో చేస్తే త‌ప్పుగా క‌నిపిస్తుంది... కేసీఆర్ ఈ నిర్ణ‌యాలు తీసుకుంటే టీవీల్లో చ‌ర్చ‌లు, విప‌క్షాల విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సి ఉంటుంది.. కేజ్రీవాల్ తీసుకుంటే అదో విప్ల‌వాత్మ‌క చ‌ర్య‌గా ఇక్క‌డి మీడియా కూడా ప్ర‌శంసిస్తుంది.. ఇదే తెలుగు జ‌ర్న‌లిజం దౌర్భాగ్యం..!!!

ఎలాంటి ఫొటో వేస్తారో?

నిన్న చంద్ర‌బాబు మోడీతో భేటీ అయితే మోడీ చేతులు క‌ట్టుకుని వింటున్న‌ట్లు పేప‌ర్లో ఫొటో వేశారు..
మ‌రి ఈ రోజు కేసీఆర్ మోడీతో భేటీ అయ్యాడు.. ఎలాంటి ఫొటో వేస్తారో?

కేసీఆర్ ఢిల్లీ వెళ్ల‌కుంటే ఆ మాట‌.. వెళితే ఈ మాట‌...!!

ఇదీ సంగ‌తి...
--
--
కేసీఆర్ ఢిల్లీకి వెళ్ల‌క‌పోతే... తెలంగాణ‌లో ప‌నులు ఎట్లా అవుతాయి.. దొర‌లాగా ఇక్క‌డ కూర్చుంటే నిధులొస్తాయా అంటారు..
---------------------------
కేసీఆర్ ఢిల్లీకి పోతే.. కుమార్తెకు ప‌ద‌వి ఇప్పించుకోవ‌డానికి పోయాడు అంటారు... మోడీతో కాళ్ల బేరానికి వెళ్లాడ‌ని అంటారు..
----------------

గుజ‌రాత్ మోడ‌ల్ విద్యుత్ ఛార్జీల పెంపు ఉంటే బీజేపీకి న‌చ్చుతుందా..?

ఉచిత విద్యుత్ హామీల‌పై ప్ర‌ధాని మోడీ భ‌గ్గుమంటారు...
గుజ‌రాత్‌లో విద్యుత్ బిల్లుల మోత మోగుతుంటుంది..
మ‌న వ‌ద్ద‌కు వ‌స్తే మాత్రం ప‌ది పైస‌లు పెంచితే చాలు బీజేపీ వాళ్లు భ‌గ్గుమంటారు..
గుజ‌రాత్ మోడ‌ల్ అభివృద్ధే ఆద‌ర్శం కావాలంటారు..
అదే రీతిలో ఛార్జీల పెంపు చేద్దామా?  అంటే నోరు మెద‌ప‌రు...

సాగ‌ర్ ప్ర‌క్షాళ‌న భ‌గీర‌థ ప్ర‌య‌త్న‌మే..

నిజంగా హుస్సేన్ సాగ‌ర్ శుద్ధి ఈ ఏడాది జ‌రిగితే అది ముమ్మాటికీ ప్ర‌భుత్వ విజ‌యంగా నిలుస్తుంది. మ‌రో వారం రోజుల్లో ప‌నులు మొద‌ల‌వుతాయ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.. ఎన్ని రాజ‌కీయ ఒత్తిళ్లు వ‌చ్చినా బేఖాత‌రు చేయ‌కుండా ఈ ల‌క్ష్యాన్ని సాకారం చేస్తే ముమ్మాటికీ అది జంట న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు మేలు చేకూరుస్తుంది. ఇదే స్ఫూర్తితో మూసీ న‌ది ప్ర‌క్షాళ‌న‌కు న‌డుం క‌ట్ట‌డానికి ఊత‌మిస్తుంద‌ని న‌మ్ముతున్నాను. ఈ బృహ‌త్ కార్య‌క్ర‌మం చేప‌ట్టిన స‌మ‌యంలో కొంత అసౌక‌ర్యం క‌ల‌గ‌డం స‌హ‌జం.. ముఖ్యంగా దుర్గందం వ్యాపించ‌వ‌చ్చు.. ప్ర‌జ‌ల ఆరోగ్యానికి న‌ష్టం క‌ల‌గ‌ని రీతిలో చ‌ర్య‌లు తీసుకొని ప్ర‌క్షాళ‌న‌ను ప్రారంభించాలి.. వీలైనంత ఎక్కువ యంత్రాల‌ను ఉప‌యోగిస్తే అంత త్వ‌ర‌గా ప‌నిని పూర్త‌వుతుంది... ఒక‌వేళ నిర్దిష్ట గ‌డువులోగా ప‌ని పూర్తి చేస్తే... ఏడాది కాలంలో టీఆర్ఎస్ సాధించిన విజ‌యాల్లో హుస్సేన్ సాగ‌ర్ ప్ర‌క్షాళ‌న‌కే మొద‌టి స్థానం ద‌క్క‌డం ఖాయం.. అంతా సాఫీగా సాగాల‌ని ఆకాంక్షిస్తున్నా..!!

ఆమ్ ఆద్మీ పార్టీ క్ష‌మాప‌ణ చెబితే బాగుండేది...

ఈవీఎంల‌పై సందేహాలు వ్య‌క్తం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత‌లు క‌నీసం తాము గెలిచిన త‌ర్వాతైనా త‌మ వ్యాఖ్య‌ల‌పై క్ష‌మాప‌ణ కోరితే బాగుండేదేమో..
ఇది ఒక్క ఆమ్ ఆద్మీ పార్టీకే కాకుండా అన్ని రాజ‌కీయ పార్టీల‌కు వ‌ర్తిస్తుంది... 

మ‌రో సినీ తార‌ను ముందే చంపేసిన మీడియా..!!

మ‌రో సినీ తార‌ను ముందే చంపేసిన మీడియా..!!

రేపో మాపో ఆమె నిజంగానే చ‌నిపోతే.. ముందే చెప్పిన ఫ‌లానా డాష్ ఛానెల్ అని కూడా అంటారేమో అన్న భ‌యం వేస్తోంది..
-------------
టీవీ ఛానెళ్లు రేటింగ్‌ల వేట‌లో విశ్వ‌స‌నీయ‌త‌ను కోల్పోతున్నాయి.. స‌మాచారాన్ని ముందే ఇచ్చామ‌న్న క్రెడిట్‌ను సాధించాల‌నే తొంద‌ర‌లో వార్త‌లోని నిజానిజాల‌ను ప‌ట్టించుకోవ‌డం మానేశాయి.. ఇటీవ‌ల కాలంలో ఎమ్మెస్ నారాయ‌ణ చ‌నిపోక ముందే చ‌నిపోయిన‌ట్లు బ్రేకింగ్ న్యూస్ వేసి ఆ త‌ర్వాత నాలుక క‌రుచుకున్నాయి.. క‌నీసం క్ష‌మాప‌ణ కూడా కోర‌లేదు.. ఇక ఈ రోజు త‌మిళ న‌టి మ‌నోర‌మ చ‌నిపోయిన‌ట్లుగా ప్ర‌చారం చేశాయి.. ఆమె ఆ వార్త‌ల‌ను ఖండించారు. బ్రేకింగ్‌లు, రేటింగ్‌లు ప‌క్క‌న పెట్టి విశ్వ‌స‌నీయ‌త‌ను పెంచుకోవ‌డానికి కృషి చేయాల‌ని విజ్ఞ‌ప్తి...
---------------------
ఇక ప‌త్రిక‌లు కూడా కొన్ని క‌ల్పిత క‌థ‌నాలు రాస్తూ  విశ్వ‌స‌నీయ వ‌ర్గాల భోగ‌ట్టా అన‌డం ప‌రిపాటిగా మారింది.. ఒక‌వేళ ఆ ప‌త్రిక ఇచ్చిన స‌మాచారం త‌ప్ప‌యితే క‌నీసం త‌ప్పు రాశామ‌ని చెప్పుకోవ‌డం లేదు.. ఇది జ‌ర్న‌లిజానికి తీర‌ని న‌ష్టాన్ని తెచ్చిపెడుతుంది.. జ‌ర్న‌లిస్టుల విలువ‌ను త‌గ్గిస్తుంది.. నిజాయ‌తీతో కూడిన నిజాల‌ను రాయాల‌ని విజ్ఞ‌ప్తి..!!

జ‌య‌ల‌లిత‌కు త‌గ్గ‌ని జ‌నాద‌ర‌ణ‌...

శ్రీ‌రంగం నియోజ‌క‌వ‌ర్గంలో భారీ ఆధిక్యంలో అన్నాడీఎంకే అభ్య‌ర్థి..
---------------
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్ష‌కు గురై అన‌ర్హ‌త వేటు ప‌డిన త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత‌కు అక్క‌డి ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ త‌గ్గ‌లేదు.. ఆమెపై అన‌ర్హ‌త ప‌డ‌టంతో ఆమె ప్రాతినిథ్యం వ‌హిస్తున్న శ్రీ‌రంగం నియోజ‌క‌వ‌ర్గాన్ని ఉప ఎన్నిక మొన్న జ‌ర‌గింది.. ఈ రోజు జ‌రుగుతున్న కౌంటింగ్‌లో ఇప్ప‌టికే 50 వేలకు పైగా ఆధిక్యంలో అన్నాడీఎంకే పార్టీ అభ్య‌ర్థి ఉన్నారు.. ఇంకా కొన్ని రౌండ్ల లెక్కింపు జ‌ర‌గాల్సి ఉంది.. ఆధిక్యం పెర‌గొచ్చు కూడా.. గ‌త ఎన్నిక‌ల్లో జ‌య‌ల‌లిత‌కు వ‌చ్చిన ఆధిక్యాన్ని ఇప్ప‌టికీ దాట‌డం విశేషం.. ఈ ఎన్నిక‌ను డీఎంకే, బీజేపీ, ఇత‌ర పార్టీలు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుని ప్ర‌చారం చేశాయి..  హామీల వ‌ర్షం కురిపించాయి... ఈ ఎన్నిక‌ల్లో తానే పోటీ చేస్తున్న‌ట్లుగా భావించి ఓటేయాల‌ని జ‌య‌ల‌లిత విజ్ఞ‌ప్తి చేశారు.. జ‌నం ఆమెపై ఆద‌ర‌ణ చూపిన‌ట్లు ఫ‌లితాల స‌ర‌ళిని బ‌ట్టి అర్థం అవుతోంది... ఇక ద‌క్షిణాదిలో పాగా వేయాల‌నుకుంటున్న బీజేపీకి కేవ‌లం 3 వేల ఓట్లు వ‌చ్చాయి...

అప్పుడు హైకోర్టులో మ‌న‌కు ఎదురుదెబ్బ తాకింది వాస్త‌వం కాదా?

ఛాతి ఆసుప‌త్రి త‌ర‌లింపుపై విప‌క్షాల‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తాకింద‌ని సంబ‌ర ప‌డుతున్నాం క‌రెక్టే..
కానీ ఫాస్టు ప‌థ‌కంపై తెలంగాణ స‌ర్కారుకు ఎదురు దెబ్బ తాకింది క‌దా..
కోర్టు ఆదేశాల వ‌ల్ల‌నే ఆ ప‌థకాన్ని ర‌ద్దు చేయాల్సి వ‌చ్చింది క‌దా...
ఇప్పుడు హైకోర్టు న్యాయ‌మైన తీర్పు ఇచ్చింద‌ని భావిస్తే ఫాస్టు ప‌థ‌కంపైనా న్యాయ‌మైన ఆదేశాలు ఇచ్చిన‌ట్లే భావించాలి..
అందుకే ఉమ్మ‌డి హైకోర్టులో తెలంగాణ‌కు అనుకూలంగా, ప్ర‌తికూలంగా వ‌చ్చే ఆదేశాల‌ను అంత‌గా ప‌ట్టించుకోలేను..

-----------------------------------------
నోట్‌:  వీలైనంత త్వ‌ర‌గా తెలంగాణ‌కు ప్ర‌త్యేక హైకోర్టు ఏర్ప‌డాలి... ఇదే నా కోరిక‌.. 

నిగ్గినంటుతోన్న నిత్యావ‌స‌ర ధ‌ర‌లు...!!


మేం అధికారంలోకి వ‌స్తే నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు త‌గ్గిస్తామంటూ అధికారంలోకి వ‌చ్చిన వాళ్లు ఏం చేస్తున్నారో అర్థం కావ‌డం లేదు..
ఓ వైపు అంత‌ర్జాతీయంగా చ‌మురు ధ‌ర‌లు గ‌ణ‌నీయంగా త‌గ్గితే ఇక్క‌డ మాత్రం సుంకాలు వేస్తూ ఖ‌జానాను నింపుకుంటున్నారు..
నాలుగు నెల‌ల్లోనే 25-30 రూపాయాలు పెరిగాయ‌ట‌.. ఈ లెక్క‌న ఇంకా నాలుగేళ్ల‌లో ఎంత పెరుగుతాయో...?
కార్పొరేట్‌ల‌కు రాయితీలు ఇచ్చే ప్ర‌భుత్వాలు మ‌రి నిత్యావ‌స‌ర భారం మోయ‌లేక స‌త‌మ‌తం అవుతున్న మ‌ధ్య‌త‌ర‌గ‌తికి రాయితీలు ఇవ్వ‌దా?
పాల‌కులు మారినా ఫ‌లితం శూన్యంగా క‌నిపిస్తోంది...


Sunday 15 February 2015

ఒకే వార్త‌, ఒకే మ్యాట‌ర్ కానీ ఆంధ్రాఎడిష‌న్లో మాత్రం హెడ్డింగ్ చూస్తే ఇట్టే అర్థం అవుతుంది... ఈ ప‌త్రిక ఎవ‌రి ప‌క్ష‌మో...!!


ఒకే వార్త‌, ఒకే మ్యాట‌ర్ కానీ ఆంధ్రాఎడిష‌న్లో మాత్రం హెడ్డింగ్ చూస్తే ఇట్టే అర్థం అవుతుంది... ఈ ప‌త్రిక ఎవ‌రి ప‌క్ష‌మో...!!

Friday 13 February 2015

జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ సోమేశ్ కుమార్ అంటే ఆంధ్ర‌జ్యోతికి ఎందుకంత ప్రేమ‌...

------------
జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ సోమేశ్ కుమార్‌ను ఆంధ్ర‌జ్యోతి గ‌త కొద్ది నెల‌లుగా టార్గెట్ చేసుకొని వార్త‌లు రాస్తోంది...  మొన్న ఆయ‌న‌ను ఆంధ్రాకు కేటాయించ‌డంతో అనుకున్న‌ది ఒక్క‌టి అయింది ఒక‌టి.. సోమేశ్‌కు భంగ‌పాటు అంటూ వార్త‌లు రాసింది.. ఇక ఇప్పుడేమో ఆయ‌న తీసుకునే ప్ర‌తీ నిర్ణ‌యాన్ని త‌ప్పుప‌డుతూ రాస్తోంది... సోమేశ్ కుమార్ పెద్ద చండ‌శాస‌నుడు అంటూ రాస్తోంది... సోమేశ్ కుమార్ అవినీతిప‌రుడ‌ని, ఇంత డ‌బ్బు తీసుకున్నాడ‌ని రాసి ఉంటే జ‌నం ఏమైనా ఆలోచించే వారేమో.. మొన్న‌టికి మొన్న సీఎం చెబితే త‌ప్ప విన‌డు అని రాసింది... ఈ రోజేమో సీఎం కార్యాల‌యం బ‌దిలీ చేసినా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని రాస్తోంది.. ఏంటో రాత‌ల్లో ఈ వైవిధ్యాలు.. నాకైతే సోమేశ్ కుమార్ అవినీతిప‌రుడా, ప‌ని రాక్ష‌సుడా తెలియ‌దు కానీ.. ఆంధ్ర‌జ్యోతి వాడు ప‌దేప‌దే ఆయ‌న‌ను టార్గెట్ చేసుకొని వార్త‌లు రాస్తుంటే ముమ్మాటికీ సోమేశ్ కుమార్ తెలంగాణ ప్ర‌యోజ‌నాల‌ను కాపాడే వ్య‌క్తేమో అన్న న‌మ్మ‌కం బ‌ల‌ప‌డుతోంది..!!!

దేశ ర‌క్ష‌ణ‌లో ప్రాణాలు కోల్పోయిన మ‌రో భాగ్య‌న‌గ‌ర్ బిడ్డ‌...


దేశ ర‌క్ష‌ణ‌లో ప్రాణాలు కోల్పోయిన మ‌రో భాగ్య‌న‌గ‌ర్ బిడ్డ‌...
మేజ‌ర్ తాహెర్ హుస్సేన్ ఖాన్‌కు అశ్రునివాళి..
------------------------
మొన్న కాశ్మీర్‌లో రాత్రి స‌మ‌యంలో విధి నిర్వ‌హిస్తుండ‌గా హెలికాప్ట‌ర్ కూలిన ఘ‌ట‌న‌లో అమ‌రుడైన మేజ‌ర్ తాహెర్ హుస్సేన్ ఖాన్ అంతి సంస్కారాలు ఈ రోజు ముగిశాయి.. దేశ ర‌క్ష‌ణ కోసం సైన్యంలో చేరి చివ‌ర‌కు దేశం కోస‌మే విధి నిర్వ‌హ‌ణ‌లో అమ‌రుడైన ఆయ‌న త్యాగం వెల‌క‌ట్ట‌లేనిది.. ప్ర‌తీ భార‌తీయుడు గ‌ర్వించ‌ద‌గిన వ్య‌క్తి మేజ‌ర్ తాహెర్ హుస్సేన్ ఖాన్‌.. అలాంటి ధీశాలిని దేశానికి అందించిన ఆయ‌న త‌ల్లిదండ్రుల‌కు పాదాభివంద‌నాలు చేస్తున్నా.. జోహార్ మేజ‌ర్ తాహెర్ హుస్సేన్ ఖాన్‌...!!

Thursday 12 February 2015

సాగర్ గేట్లు పగలగొడతారట...


మొన్న ఖరీఫ్లో తెలంగాణలో పంటలు సాగు చేస్తున్న సమయంలో శ్రీశైలంలో నీళ్లు లేవు, సాగర్లో నీళ్లు లేవంటూ వార్తలు రాశారు... విద్యుత్ లేక పంటలు ఎండిపోతుంటే శ్రీశైలం ఖాళీ అవుతోందని గగ్గోలు పెట్టారు.. ఆ సమయంలో నీళ్లు అందక పంటలు ఎండుతున్నాయి.. విద్యుత్ ఉత్పత్తి తెలంగాణకు ఎంతో అవసరం అన్న రీతిలో వార్తలు రాయలేదు.. ఇప్పుడు మాత్రం పక్క రాష్ట్రంలో 3 లక్షల ఎకరాలకు నీళ్లు కావాలంటూ ప్రతీ ఆంధ్ర పత్రికా కూడా తెలంగాణ ఎడిషన్కు భారీ భారీ వార్తలు రాస్తున్నాయి... తెలంగాణ అవసరాలపై ఆంధ్రాకు వార్తలు రాయనప్పుడు అక్కడి ఇబ్బందులపై ఇక్కడ వార్తలు ఎందుకు వేస్తున్నట్లు..ఈ వార్తలు చూస్తుంటే ఇప్పటికీ మనం సమైక్య రాష్ట్రంలోనే ఉన్నామా?  అన్నంత భావన కలుగుతోంది...
కనీసం ఆంధ్రా వాళ్లు వాటాకు మించి నీరు వాడుకున్నారన్న విషయాన్ని కూడా చెప్పడానికి ఇష్టపడటం లేదు.. 44 టీఎంసీలు అధికంగా వినియోగించుకొని మళ్లా నీళ్లు కావాలంటే ఎక్కడి నుంచి ఇస్తారో కనీసం ఆలోచించుకోరా? నీళ్లు కావాలి.. నీళ్లు కావాలి... వీలైతే శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలను కేంద్రం ఆధీనంలోకి తీసుకోవాలంటూ డిమాండ్లు, హెచ్చరికలు, బెదిరింపులు చేస్తున్నారే తప్ప న్యాయంగా మాట్లాడటం లేదు... రబీలో ఆరు తడి పంటలు వేసుకోమని రైతులకు ఎందుకు చెప్పలేదు... నీళ్లు లేనప్పుడు మార్చి వరకూ నీళ్లిస్తామని ఉత్తర కుమార ప్రగల్బాలు ఎందుకు పలికారు..?  డెడ్ స్టోరేజీకి డ్యాంలు చేరాయన్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా పత్రికలు చెప్పకుండా ఎందుకీ నాటకాలు?

గుర్తింపు కార్డుల‌ను చూపించ‌డం అవ‌మానం అవుతుందా?

ఏదో బ‌ట్ట‌లు విప్పి మ‌రీ ప‌రిశీలించార‌న్నంత‌గా రాధాకృష్ణ ప‌త్రిక ఆవేద‌న వ్య‌క్తం చేస్తోంది...
పార్ల‌మెంట్‌లో కూడా సెక్యూరిటీ సిబ్బంది ఐడీ కార్డు చూప‌మంటే ఎంపీలు చూపిస్తారు క‌దా...
ఎంపీల క‌న్నా ఐఏఎస్‌లు ఎక్కువ కాదు క‌దా...
రేపు స‌చివాల‌యంలో ఏదైనా భ‌ద్ర‌తా ప‌ర‌మైన స‌మ‌స్య‌లు వ‌స్తే సెక్యూరిటీ వైఫ‌ల్యం అని రాయ‌డంలో మాత్రం ముందుంటాడు...

తెలంగాణ‌లో మొండి బ‌కాయిలు వ‌సూలు కావడం ఆంధ్ర‌జ్యోతికి ఇష్టం లేన‌ట్లు ఉంది..

జీహెచ్ ఎంసీలో మొండి బ‌కాయిదారులైన వ్యాపార స‌ముదాయాల ముందు చెత్త డ‌బ్బాల‌ను ఏర్పాటు చేస్తే ఆంధ్ర‌జ్యోతి వాడికి న‌చ్చ‌డం లేదు..
మొండి బ‌కాయిదారుల ప‌క్షంగా ఉంటూ వార్త‌లు రాయ‌డం ఎందుకో?
కొంప‌దీసి మొండి బ‌కాయిదారుల జాబితాలో వీళ్లు కూడా ఉన్నారేమో...
నిన్న జీహెచ్ ఎంసీ ఇలా చెత్త డ‌బ్బాల‌ను ఏర్పాటు చేయ‌డంతో కొంద‌రు మొండి బ‌కాయిదారులు హుటాహుటిన వెళ్లి  బ‌కాయిల‌ను చెల్లించార‌ట‌...
అదంతా ఎందుకు బ్యాంకు లోన్లు తీసుకున్న వారి ఇంటి ముందు బ్యాంక్ ఉద్యోగులు ధ‌ర్నాలు చేయ‌డం, చాటింపులు వేయ‌డం ఆంధ్ర‌జ్యోతికి ఎప్పుడూ త‌ప్పుగా అనిపించ‌లేదు... ఉద్యోగులు వారి ప‌ని వారు చేసుకోవాలి కానీ ఇలా రోడ్లు ఎక్క‌డం ఏంటని ప్ర‌శ్నించ‌లేదు..?
ఇక్క‌డ తెలంగాణ ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం అమ‌లు చేస్తోండ‌టం... అందులోనూ ఆంధ్ర‌జ్యోతికి అస‌లే గిట్ట‌ని క‌మిష‌న‌ర్ సోమేశ్ కుమార్ ఇలా చేస్తుండ‌ట‌మే కంట‌గింపుగా మారింది....
-------------------
నోట్‌:  ఇదే ప‌నిని ఆంధ్రా ప్ర‌భుత్వం చేస్తే... త‌ప్ప‌దు మ‌రీ... మొండి బ‌కాయిదారుల‌కు గుణ‌పాఠం చెప్పాలి క‌దా.. వీలైతే మీరూ సూచ‌న‌లు స‌ల‌హాలు ఇవ్వండి అంటూ రోత రాత‌లు రాసేదే క‌దా...

మెద‌క్‌లో ఓడిపోయి ఉంటే రెఫ‌రెండ‌మ్ అయ్యేదే క‌దా..

మ‌న‌లో మాట‌...
---------------------
మొన్న మెద‌క్ ఉప ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఓడిపోయినా, మెజారిటీ త‌గ్గిపోయి ఉంటే అది కేసీఆర్ ప్ర‌భుత్వ ప‌నితీరుకు రెఫ‌రెండ‌మే అని బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ నేత‌లు అనేవారా? కాదా?
అదంతా ఎందుకు రేపు జ‌ర‌గ‌బోయే రెండు ఎమ్మెల్సీ ఎన్నిక‌లు, గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌కు కొంత ప్ర‌తికూల ఫ‌లితాలు వ‌చ్చినా అవి కేసీఆర్ ప‌నితీరుకు రెఫ‌రెండం అని బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నేత‌లు అంటారా? అన‌రా?
---------------------------

కాళోజీ, జ‌య‌శంక‌ర్ సారు చ‌రిత్ర‌ను సాటి తెలుగు రాష్ట్ర‌మైన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పాఠ్యాంశాలుగా పెడ‌తారా బాబుగారు...?

స‌మైక్య రాష్ట్రంలో ఏ ఒక్క రోజూ కాళోజీని త‌ల‌చుకోలేదు.. జ‌య‌శంక‌ర్ సార్ పేరు ఉచ్ఛ‌రించ‌లేదు..
ఇప్పుడు గ‌త్యంత‌రం లేక‌పోయే... చ‌చ్చిన‌ట్లు వాళ్ల‌ను త‌ల‌చుకోవాలి.. అమ‌రుల‌కు నివాళుల‌ల‌ర్పించాలి..
తెలంగాణ రాక‌పోతే వీళ్ల పేర్లను నిషేధిత జాబితాలో చేర్చినా ఆశ్చ‌ర్యం లేదు..
మ‌రి కాళోజీ, జ‌య‌శంక‌ర్ సారు చ‌రిత్ర‌ను సాటి తెలుగు రాష్ట్ర‌మైన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పాఠ్యాంశాలుగా పెడ‌తారా బాబుగారు...?
ఏదో వ‌రంగ‌ల్‌కు వ‌చ్చాను.. రేపు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో నాలుగు ఓట్లు రావాల‌ని వాళ్ల పేర్లు త‌ల‌చుకున్నారా?

ఓరుగ‌ల్లులో తూళ్లూరు దొంగ‌లు..!!

పారా హ‌షార్‌..
ఓరుగ‌ల్లులో తూళ్లూరు దొంగ‌లు..!!
అక్క‌డ పంట‌లు త‌గ‌ల బెట్టిన చందంగా ఇక్క‌డ వేదిక ద‌హ‌నం చేసే ప్ర‌య‌త్నం..
సానుభూతి కోస‌మే అని స్థానికుల గుస‌గుస‌లు..
-------------------
మొన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌ధానిగా ఎంపికైన తూళ్లూరులో భూములు ఇవ్వ‌ని రైతుల పొలాల‌ను రాత్రి పూట గుర్తు తెలియ‌ని దుండగులు త‌గ‌ల‌పెట్టార‌ని విన్నాం క‌దా.. ఆ దొంగ‌లు దొర‌క‌లేదు.. అక్క‌డ బ‌ల‌వంతంగా రైతుల నుంచి భూముల‌ను స్వాధీనం చేసుకోవ‌డానికి పొలాల‌ను త‌గ‌ల‌బెట్టారు.. ఒక‌ర‌కంగా రైతుల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురిచేయ‌డం ఆంధ్రాలో వారి ఎత్తుగ‌డ‌...
----------
ఇక బాబు గారు వ‌రంగ‌ల్‌కు వ‌స్తున్న సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన సభా వేదిక‌ను ఎవ‌రో పాక్షికంగా త‌గ‌ల పెట్టినట్లు విన్నాను... తెలంగాణ‌లో బాబు గారిపైన పీక‌ల లోతు కోపంలో జ‌నం ఉన్నారు.. ఈ నేప‌థ్యంలో పాపం బాబు గారి రాక‌ను టీఆర్ఎస్ వాళ్లు అడ్డ‌కుంటే క‌నీసం సానుభూతి అయినా వ‌చ్చేది.. వాళ్లు అడ్డుకోబోమ‌న‌డంతో ఏం చేయాలో పాలుపోక జ‌నంలో సానుభూతి వ‌చ్చేలా చేయ‌డం కోస‌మే తూళ్లూరులో పొలాల‌ను త‌గ‌ల‌పెట్టిన మ‌న‌నుషుల‌ను ర‌ప్పించి వ‌రంగ‌ల్ స‌భా వేదిక‌ను పాక్షికంగా త‌గ‌ల‌బెట్టించుకుని ఉంటార‌ని స్థానికులు చెవులు కొరుక్కుంటున్నారు..
ఆంధ్రాలో ప్ర‌జ‌ల‌ను భ‌య‌పెట్ట‌డానికి.. తెలంగాన‌లో ప్ర‌జ‌ల సానుభూతి కోసం ఈ ఎత్తుగ‌డ‌ల‌ని వారు అంటున్నారు..

తెలంగాణ మిగులు బ‌డ్జెట్ క్రెడిట్ నీదైతే.. క‌రెంట్ క‌ష్టాల క్రెడిట్ ఎవ‌రిది బాబు...?

తెలంగాణ మిగులు బ‌డ్జెట్ ఉన్న రాష్ట్రంగా మార‌డానికి నా పాల‌నే కార‌ణం...
---------------------
---------------------
మ‌రి తెలంగాణ‌లో క‌రెంట్ క‌ష్టాలు, సాగు, తాగు నీటి క‌ష్టాలకు ఎవ‌రి పాల‌న కార‌ణ‌మో?
-----------------
----------------
నిజంగా మీ పాల‌నలోనే లోటు బ‌డ్జెట్‌గా ఉన్న తెలంగాణ మిగులు బ‌డ్జెట్‌గా మారి ఉంటే.. మ‌రి ఆంధ్రాను కూడా మిగులు బ‌డ్జెట్ ఉన్న రాష్ట్రంగా మార్చ‌డానికి ఇబ్బంది ఏముంది..?
కేంద్రంను జోలె ప‌ట్టుకొని అడ‌గ‌డం ఎందుకో?

విడివిడిగా ఉంటున్న భార్యాభ‌ర్త‌ల‌ను క‌లిపి భార‌త సంస్కృతిని కాపాడొచ్చు క‌దా..

ప్రేమికుల రోజున‌ ప్రేమికులు జంట‌గా క‌నిపిస్తే పెళ్లి చేద్దాం అనుకుంటున్న పెద్ద‌మ‌నుషుల‌కు ఓ విజ్ఞ‌ప్తి... భార‌త సంస్కృతి ప్ర‌కారం అగ్ని సాక్షిగా పెళ్లాడిన భార్యాభ‌ర్త‌లు వేరువేరుగా ఉండ‌టం స‌బ‌బేనా.. ప్రేమికుల‌కు బ‌లవంతంగా పెళ్లి చేసి న్యాయం చేసే మీరు వేరువేరుఆ కాపురాలు చేస్తున్న భార్యాభ‌ర్త‌ల‌ను బ‌ల‌వంతంగానైనా క‌లుపొచ్చు క‌దా.. దాంప‌త్య జీవితం గురించి భార‌త సంస్కృతి ఏం చెబుతుందో మీకు ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేద‌నుకుంటా..!!

అధికారం ఉండ‌గా ప‌క్క చూపులు ఎందుకు?

అప్ప‌ట్లో వైఎస్‌, య‌డ్యూర‌ప్ప‌లు త‌మ‌కు పూర్తి సంఖ్యా బ‌లం ఉన్నా ఇత‌ర పార్టీల ఎమ్మెల్యేల‌ను త‌మ పార్టీలోకి లాక్కున్నారు.. ఇక తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ కేసీఆర్‌, చంద్ర‌బాబులు ఇదే వ్యూహాన్ని అనుస‌రిస్తున్నారు... ఒక రకంగా రాజ్యాంగం అప‌హాస్యం పాల‌వుతోంది.. ఇక నిన్న జార్ఖండ్‌లో జార్ఖండ్ వికాస్ మోర్చాకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు.. వీరిలో ఒక‌రిద్ద‌రికి మంత్రివర్గంలో చోటు క‌ల్పించాల‌ని యోచిస్తున్నార‌ట‌... మ‌రి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇదే పంథాను కొన‌సాగిస్తుందా?  సంప్ర‌దాయ రాజ‌కీయ ప‌క్షాల మాదిరిగా ఫ‌క్తు రాజ‌కీయ పార్టీగా మారుతుందా?   ఢిల్లీలో గెలిచిన ముగ్గురు బీజేపీ వాళ్ల‌ను లాక్కుంటుందా?  వేచిచూడాలి.. ఏది ఏమైనా ప్ర‌జ‌లు అధికారం ఇచ్చిన త‌ర్వాత ఇలా ప‌క్క చూపులు చూడ‌టం మంచి ప‌రిణామం కాదు..

. మ‌న చంద్రుడు ఆంధ్రాకు పోయేది ఎప్పుడో?

ఆంధ్రా చంద్రుడు మ‌న వ‌ద్దుకు వ‌చ్చాడు.. మ‌న చంద్రుడు ఆంధ్రాకు పోయేది ఎప్పుడో?
---------------------------
అదే తెలంగాణ  మొక్కులు తీర్చుకునేందుకు తిరుప‌తి, విజ‌య‌వాడ‌కు ఎప్పుడు పోతాడో?

ఇప్పుడు ద‌య‌త‌ల‌చి సాగు నీరిస్తే.. రేపు తాగునీరు ఎవ‌రిస్తారో..?


నాగార్జున సాగ‌ర్ డెడ్ స్టోరేజీకి చేరుకుంటుంటే నీటి విడుద‌ల‌ను నిలిపివేశారు...
డెడ్ స్టోరేజీకి చేరుకున్న జ‌లాశ‌యం నుంచి ఒక‌వేళ తెలంగాణ వాళ్లు సాగు నీరు కోరితే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఇస్తుందా?
జ‌లాశ‌యం ఫుల్లుగా ఉన్నా కూడా ఇవ్వ‌దు.. అలాంటిది కేటాయించిన నీరు క‌న్నా 44 టీఎంసీలు ఎక్కువ‌గా వాడుకుంది..
మ‌ళ్లా నీళ్లు కావాలంటూ లొల్లి చేస్తోంది... తెలంగాణ‌లో విద్యుత్ కొర‌త ఉంది.. ర‌బీలో పంట‌లు వేసుకోవ‌ద్దు.. జ‌లాశ‌యాల్లోనూ నీళ్లు లేవ‌ని
కేసీఆర్ ధైర్యంగా రైతుల‌కు చెప్పాల‌ని ఇక్క‌డి టీడీపీ నేత‌లు, బీజేపీ నేత‌లు తెగ సూచ‌న‌లు ఇచ్చారు..
వాళ్ల మాట విని కేసీఆర్ నిజంగానే ర‌బీ వ‌ద్ద‌న్నాడు.. మ‌రి సాగ‌ర్‌, శ్రీ‌శైలంలో ఈసారి నీళ్లు లేవు.. ర‌బీలో వ‌రి వేసుకోవ‌ద్ద‌ని ఆంధ్రా రైతుల‌కు ఎందుకు చెప్ప‌లేదు.. ఉల్టా మార్చి వ‌ర‌కు సాగు నీరు ఇస్తామ‌ని స్వ‌యాన అక్క‌డి మంత్రి దేవినేని ఉమా  ఎందుకు మ‌భ్య‌పెట్టే హామీ ఇచ్చారు..?
నీళ్లు లేవు.. ఆరుత‌డి పంట‌లు వేసుకోమ‌ని చెబితే ఈ స‌మ‌స్య ఉండ‌దు క‌దా..!!



----------------------------
ఇప్పుడు ద‌య త‌ల‌చి నీళ్లు ఇస్తే... మ‌న కొంప కొల్లేరే...!!
మొన్న‌టి దాకా సాగు నీరులేక మ‌న రైతులు చ‌చ్చారు..
ఇక వేస‌విలో తాగు నీరు దొర‌క్క జ‌నం చ‌స్తారు..
ఆంధ్రా ఒత్తిళ్ల‌కు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ లొంగొద్దు...
-------------------------------------
 ఓసారి ఢ్యాంను కేంద్రం తీసుకోవాలంటుంది.. ఓసారి తెలంగాణ ఇంజినీర్ల‌పై అక్క‌డి నేత‌ల‌తో దాడి చేయిస్తుంది.. తెలంగాణే ఎక్కువ నీరు వాడుకుంది అంటూ కేంద్రానికి ఫిర్యాదులు చేయ‌డం, అనుకూల ప‌త్రిక‌ల్లో వార్త‌లు రాయించ‌డం చేస్తుంది.. ఇవ‌న్నీ వ‌ర్క‌వుట్ కాక‌పోయే స‌రికి కాళ్ల బేరానికి రావ‌డం.. తెలంగాణ తాగు నీటి అవ‌స‌రాల‌ను విస్మ‌రించి ఇప్ప‌డు నీళ్లు ఇస్తే రేపు వేస‌విలో తాగు నీరు లేక తెలంగాణ‌లో ప్ర‌జ‌లు చ‌చ్చిపోతున్నార‌ని వార్త‌లు రాయించి బ‌ద్నాం చేస్తారు.. సాగు నీరు ఇవ్వ‌లేక‌పోయారు. క‌నీసం తాగునీరైనా ఇవ్వ‌లేరా అంటూ విమ‌ర్శ‌లు చేయిస్తారు.. అందుకే తెలంగాణ స‌ర్కారు ఆంధ్రా విజ్ఞ‌ప్తుల‌ను ప‌ట్టించుకోవ‌ద్దు..
--------------------------
నోట్‌:  ఆల్మ‌ట్టి మ‌న‌కు నీటి విడుద‌ల‌ను ఆపేస్తే.. అక్క‌డి ప‌త్రిక‌లు మ‌న ప్ర‌భుత్వాలు ఏం ఆలోచిస్తున్నాయ‌ని వార్త‌లు రాస్తాయా?
కానీ ఈనాడు ప‌త్రిక మాత్రం తెలంగాణ ప్ర‌భుత్వం నీటి విడుద‌ల‌ను ఆపేస్తే.. ఆంధ్రా ప్ర‌భుత్వం ఎంత మ‌థ‌న‌ప‌డుతోందో రాస్తోంది..
పాపం ఏక‌కాలంలో ఇద్ద‌రు చంద్రుల‌ను సంతృప్తి ప‌రిచేందుకు ఆ ప‌త్రిక ప‌డుతున్న తాప‌త్ర‌యం చూస్తుంటే న‌వ్వొస్తుంది..

వారి దృష్టిలో ఆంధ్రాలో ఉన్న మ‌న వాళ్లు విదేశీయులేమో! మ‌న‌మూ వాళ్ల‌ను అలాగే చూస్తే మ‌న ప్ర‌తిప‌క్షాలు ఊరుకుంటాయా?

వారి దృష్టిలో ఆంధ్రాలో ఉన్న మ‌న వాళ్లు విదేశీయులేమో!
మ‌న‌మూ అలాగే చూస్తే మ‌న ప్ర‌తిప‌క్షాలు ఊరుకుంటాయా?
----------------------
తెలంగాణ‌లో ఉన్న ఓ ఒక్క ప్ర‌జాప్ర‌తినిధి అయినా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం మొన్న‌టి డీఎస్సీ నియామ‌కాల స‌మ‌యంలో ఇచ్చిన ఈ మార్గ‌ద‌ర్శ‌కాల‌పై నోరు మెద‌ప‌లేదు..
కానీ ఇలాంటి నిబంధ‌న‌లు తెలంగాణ‌లో పెడితే మాత్రం ప్ర‌తీ ఒక్క‌రి గొంతూ లేస్తుంది...
ఇప్పుడు విడుద‌ల అవుతున్న ప్ర‌తీ ఉద్యోగ నియామ‌కాల్లోనూ మొత్తం తెలంగాణ వారికే అవ‌కాశం క‌ల్పించాల‌ని ప్ర‌భుత్వాన్ని వేడుకుంటున్నాను..
ఆయా జోన్ల‌కు చెందిన నిరుద్యోగుల‌ను లోక‌ల్ అభ్య‌ర్థులుగా, తెలంగాణ‌లోని ఇత‌ర జోన్‌కు చెందిన వారిని నాన్ లోక‌ల్ అభ్య‌ర్థులుగా ప‌రిగ‌ణించి మొత్తం ఖాళీల‌ను భ‌ర్తీ చేయాలి... నాన్ లోకల్ కేటగిరీలో 15 శాతం ఉద్యోగాల‌ను ఆంధ్ర‌రాష్ట్రం వారికి ఇవ్వ‌కూడ‌దు..
ఈ మేర‌కు నిబంధ‌న‌లు రూపొందించాలి..
----------------
నోట్‌:  ఇది గ‌త ఏడాది డిసెంబ‌రులో వ‌చ్చిన‌ వార్తా క్లిప్పింగ్‌...

ఆంధ్రాలో ప్ర‌తిప‌క్షం చ‌చ్చిపోయిందా? లేక తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్షం ఆంధ్రా ప‌క్షంగా మారిందా?

తెలంగాణ‌లో ఏ నిర్ణ‌యం తీసుకున్నా విప‌క్షాలు కోర్టుకు వెళ‌తాయి, విమ‌ర్శ‌లు చేస్తాయి...
ఫాస్టు ప‌థ‌కంపై కోర్టు వెళ్లారు..
స‌చివాల‌యం మార్చుతామంటే కోర్టు వెళుతున్నారు..
పార్టీ మారిన నేత‌ల‌పై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని కోర్టు వెళుతున్నారు..
మంచిదే.. అలా వెళుతున్న వాళ్లంతా బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ నేత‌లే..
-------------------
ఈ  పార్టీల‌కు చెందిన ఆంధ్రా నేత‌లు చంద్ర‌బాబు నిర్ణ‌యాల‌పై కోర్టుకు వెళుతున్నారా?
బ‌ల‌వంతపు భూ స‌మీక‌ర‌ణ‌పై హైకోర్టును ఆశ్ర‌యించారా?
విప‌క్షాల ఎమ్మెల్యేల‌ను, ఎమ్మెల్సీల‌ను టీడీపీలో చేర్చుకున్న‌దానిపై కోర్టుకు వెళ్లారా?
హైద‌రాబాద్‌లో ఆధార్ కార్డు ఉన్న రైతుల‌కు రుణ మాఫీ ఇవ్వ‌బోమంటే కోర్టుకు వెళ్లారా?
ఆంధ్రాకు కోడలుగా వెళ్లి అక్క‌డే ఏళ్ల త‌ర‌బ‌డి ఉన్న వారిని స్థానికేత‌రులుగా గుర్తించి ప్ర‌వేశ ప‌రీక్ష‌ల్లో అనుమ‌తి ఇవ్వ‌కుంటే ఎవ‌రైనా కోర్టుకు వెళ్లారా?
-----------------------
మీరు కోర్టుకు కొన్ని విష‌యాల్లో వెళితే మంచిదే.. కానీ త‌ప్పులు ఒక్క ద‌గ్గ‌రే క‌నిపిస్తున్న‌ట్లుగా ప్ర‌వ‌ర్తిస్తుంటే మీ విశ్వ‌స‌నీయ‌త‌పైనే సందేహాలు మొద‌ల‌వుతాయి..

నోట్‌:  విద్యుత్ ఛార్జీలు పెంచితే ఆంధ్రాలో బీజేపీ, కాంగ్రెస్ ఎంత తీవ్రంగా స్పందించాయో ఎవ‌రైనా చూశారా?   ఇక్క‌డ మాత్రం తెగ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.. ఆంధ్రాలో ప్ర‌తిప‌క్షం చ‌చ్చిపోయిందా?  లేక తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్షం ఆంధ్రా ప‌క్షంగా మారిందా?  ఏమీ అర్థం కావ‌డం లేదు.. 

371-డీతో పాటు ఆధార్ కార్డు తెలంగాణ‌లో ఉన్న వారికే ఈ ప‌థ‌కాన్ని వ‌ర్తింప‌జేయాలి..

బోధ‌న రుసుం ప‌థ‌కాన్ని స్థానిక కోటాలో చేరిన వారికే వ‌ర్తింప‌జేయాల‌న్న నిర్ణ‌యం మంచిదే..
నాన్ లోక‌ల్ కోటా చేరిన వారికీ వ‌ర్తింప‌జేయాల‌ని ప్ర‌తిప‌క్షాలు గొడ‌వ చేస్తాయేమో...
నాకు తెలిసి 371-డీతో పాటు ఆధార్ కార్డు తెలంగాణ‌లో ఉన్న వారికే ఈ ప‌థ‌కాన్ని వ‌ర్తింప‌జేయాలి..
------------
అయితే ల‌క్ష ర్యాంకు, ఆ పై ర్యాంకు వ‌ర‌కు వ‌చ్చిన వారికి ఈ ప‌థ‌కాన్ని వ‌ర్తింప‌జేయ‌డం ప్ర‌యోజ‌న‌క‌ర‌మా?
అలాగే ఒక పీజీ కోర్సు చేసిన త‌ర్వాత మ‌రో పీజీ చేరే వారికి ఇది ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వ‌ర్తింప‌జేయ‌కూడ‌దు..
పేద విద్యార్థుల్లో నిజ‌మైన ల‌బ్ధిదారుల‌కు ఇది అందితే బాగుంటుంది..
లేనిప‌క్షంలో కళాశాల‌లను పోషించ‌డానికే ప‌థ‌కం ఉప‌యోగ‌ప‌డుతుంది..
ఇంజినీరింగ్ చ‌దివేంత నైపుణ్యం లేద‌ని తెలిసిన విద్యార్థులు కూడా ప్ర‌భుత్వ‌మే ఫీజు క‌డుతుంది క‌దా?  చేరితే పోయేదేముంది అన్న‌ట్లుగా మార‌డానికి ఆస్కారం క‌ల్పిస్తోంది.. ఫ‌లితంగా ఇది నిరుద్యోగ తెలంగాణ‌ను పెంచుతోంది..
నాణ్య‌త ప్ర‌మాణాలు లేని కాలేజీల‌ను ఏరిపారేయ‌డ‌మే ఉత్తమం.. ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా స‌రే ప్ర‌భుత్వం క‌ఠినంగానే వ్య‌వ‌హ‌రించాలి..

Wednesday 11 February 2015

ఆప్‌, కాంగ్రెస్‌కు ఐటీ నోటీసులు..


ఎన్నిక‌ల్లో వివిధ కంపెనీల నుంచి వ‌చ్చిన విరాళాల‌పై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌ల‌కు ఆదాయ‌పు ప‌న్ను శాఖ నోటీసులు జారీ చేసింది.. ఎప్పుడైనా స‌రే అధికార పార్టీ విరాళాల‌పై ఐటీ శాఖ‌లు నోటీసులు జారీ చేయ‌వు క‌దా.. గ‌తంలో యూపీఏ హ‌యాంలో గ‌డ్క‌రీ సంస్థ‌ల్లో పెట్టుబ‌డుల‌పై ఐటీ విచార‌ణ జ‌రిగింది... ఐటీ, సీబీఐలు ఎప్పుడు కూడా అధికార ప‌క్ష‌మే... మొత్తానికి ఆమ్ ఆద్మీ పార్టీకి కేంద్రానికి మ‌ధ్య మ‌రో దీర్ఘ కాలిక యుద్ధం జ‌ర‌గ‌డం త‌థ్యంగానే క‌నిపిస్తోంది..
ఇప్ప‌టికే శార‌ద‌ స్కాం పేరు, బుర్ద్వాన్ పేలుళ్ల పేరుతో మ‌మ‌తా స‌ర్కారుతో కేంద్రానికి పెద్ద పంచాయితీ జ‌రుగుతోంది.. ఇక బీహార్‌లో రాజ‌కీయ సంక్షోభం క‌ళ్ల ముందు క‌నిపిస్తోంది.. ఇవ‌న్నీ స‌మాఖ్య స్ఫూర్తికి విఘాతం క‌లిగించే ప‌రిణామాలే అవుతాయి..
మొన్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీకి విరాళం ఇచ్చిన కంపెనీల పేర్లు న‌ల్ల‌ధ‌నం జాబితాలో ఉన్నాయి.. మ‌రి దీనిపైనా విచార‌ణ జ‌రగాలి క‌దా.. న‌ల్ల‌ధ‌నం కంపెనీల‌కు బీజేపీతో సంబంధం ఏంట‌న్న విచార‌ణ చేసే ధైర్యం విచార‌ణ సంస్థ‌ల‌కు ఉందా?

మ‌నోళ్లు పోలీసు వాళ్లు క‌నిపిస్తే వాళ్ల ఐడీ కార్డు అడుగుతారా?

ఇది మంచి నిర్ణ‌య‌మే... కానీ
మ‌నోళ్లు పోలీసు వాళ్లు క‌నిపిస్తే వాళ్ల ఐడీ కార్డు అడుగుతారా?
వాళ్ల హోదా అడుగుతారా?   ప‌ర్సు తీసి ఇది ఉంచండి సార్ అని ఓ 50 రూపాయాలు ఇచ్చి త‌ప్పించుకుంటారు..
స‌గం పోలీసుల‌ను వాహ‌న‌దారులే లంచ‌గొండులుగా త‌యారుచేస్తున్నారు..
ఫైన్ రాయించుకుంటే రూ.300 అవుతుంద‌ని పోలీసు చేతిలో రూ.100 పెట్టి త‌ప్పించుకునే వాహ‌న చోద‌కుల‌ను ఏమ‌నాలి...
క‌నీసం ఫైన్ క‌డితే ప్ర‌భుత్వానికి వెళుతుంది... లంచం ఇస్తే అధికారి జేబులోకి వెళుతుంద‌న్న విష‌యాన్ని అర్థం చేసుకుంటే బాగుంటుంది...

విద్యా సంస్థ‌ల్లో అందాల పోటీలు వ‌ద్దు

విద్యా సంస్థ‌ల్లో అందాల పోటీలు పెట్టొద్ద‌ని ఇటీవ‌ల మ‌ద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చింది.. నాకైతే మంచి తీర్పుగానే అనిపించింది.. మ‌న వ‌ద్ద కూడా ఈ అందాల పోటీల‌ను విద్యాసంస్థ‌ల్లో పెట్ట‌కుండా ఉంటేనే బాగుంటుంద‌ని అనిపిస్తుంది.. ఇటీవ‌ల ఒక‌టి రెండు వ‌స్త్ర దుకాణం వాళ్లు వాళ్ల దుస్తువుల ప్ర‌మోష‌న్ కోసం ఓ విద్యాసంస్థ‌లో క్యాట్ వాక్‌లు నిర్వ‌హించ‌డం చేశారు.. మ‌ళ్లా ఆ షోల‌ను వాళ్ల టీవీ ఛానెళ్ల‌లో వేసుకున్నారు...

http://www.indiatimes.com/news/india/no-fancy-madras-high-court-bans-beauty-contests-in-tamil-nadu-colleges-230053.html

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల న‌గారా మోగింది...

తెలంగాణ‌లో రెండు స్థానాల‌కు(Mahaboobnagar-Ranga Reddy-Hyderabad Graduates’, Warangal-Khammam-Nalgonda Graduates’), ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రెండు స్థానాల‌కు(East-West Godavari Teachers’, Krishna-Guntur Teachers’) మార్చి 16వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నిక జ‌ర‌గ‌నుంది.. మార్చి 19వ తేదీన ఫ‌లితాలు విడుద‌ల అవుతాయి..ఈ నెల 19వ తేదీ నుంచి 26 వ తేదీ వ‌ర‌కు నామినేష‌న్ల ప‌రిశీల‌న జ‌ర‌గ‌నుంది..

ఢిల్లీకి కేంద్రం నిధులివ్వ‌కుంటే కేజ్రీవాల్ ఏం చేస్తాడో తెలుసా..?

ప్ర‌ధాని ఇంటి ముందు ముఖ్య‌మంత్రి ధ‌ర్నా?
ఇది రేప‌టి రోజుల్లో ఢిల్లీ పేప‌ర్ల‌లో ప‌తాక శీర్షిక వార్త కావొచ్చేమో..!!
---------------------
కేంద్ర ప్ర‌భుత్వం ఢిల్లీలో త‌మ ప్ర‌త్య‌ర్థి అయిన ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింద‌ని ఒక‌వేళ క‌క్ష సాధింపుగా నిధులు ఇవ్వ‌కుండా వివ‌క్ష చూపినా, స‌హ‌కారం అందించ‌క‌పోతే ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ ఎలా ఎదుర్కొంటాడు..?  తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు రావాల్సిన నిధులు రాక‌పోతే ఇక్క‌డి సీఎంలు వెళ్లి కాళ్లా వేళ్లా ప‌డి వేడుకుంటున్నారు.. నిధులివ్వండి, జీతాలు ఇవ్వ‌లేని ప‌రిస్థితి, ప్రాజెక్టులు పూర్తి చేయ‌లేమ‌ని మొర పెట్టుకుంటున్నారు.. మ‌రి కేజ్రీవాల్ ఏం చేస్తాడు?   అని అంద‌రూ ఆలోచిస్తున్నారు..
-----------------------------
కేంద్రంతో అన‌వ‌స‌రంగా జ‌గ‌డాలు పెట్టుకోబోమ‌ని మొన్న ఓ ఇంట‌ర్వ్యులో కేజ్రీవాల్‌ తేల్చిచెప్పాడు.. ఆరోగ్య‌వంత‌మైన ప్ర‌జాస్వామ్యంలో నాలుగు డీ ల‌కు ప్రాధాన్యం ఉంద‌ని.. అవే త‌న విధానం అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.. డిబేట్, డిస్క‌ష‌న్, డిసెంట్, ధ‌ర్నా.. మొద‌టి మూడింటితో ప‌నికాక‌పోతే  చివ‌ర‌గా ధ‌ర్నా అస్త్రాన్ని ప్ర‌యోగిస్తాన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.. ఈ లెక్క‌న కేంద్రం వివ‌క్ష చూపితే ప్ర‌ధాన మంత్రి ఇళ్లు, కార్యాల‌యం, పార్ల‌మెంట్ ముందు ముఖ్య‌మంత్రి ధ‌ర్నాల‌ను మ‌నం త్వ‌ర‌లో చూడొచ్చ‌న్న మాట‌... తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి జ‌నాన్ని పోగేసుకెళ్లి ధ‌ర్నా చేయ‌డం క‌ష్టం కానీ ఢిల్లీ ముఖ్య‌మంత్రి.. ఢిల్లీలోని ప్ర‌ధాని ఇంటి ముందు ధ‌ర్నా చేయ‌డం పెద్ద క‌ష్ట‌మైన ప‌నేం కాదు..
నోట్‌: అయితే కేంద్రం త‌ర‌ఫున ఢిల్లీకి స‌హాయ‌క స‌హాకారాలు అందిస్తామ‌న్న మోడీ గారు మాట మీద నిల‌బ‌డితే ఈ ధ‌ర్నాలు చూసే అవ‌కాశం మ‌న‌కు రాదు.. కేంద్రం అన్ని రాష్ట్రాల‌ను స‌మానంగా చూడాల‌ని ఆకాంక్షిస్తున్నా !!


అన్ని పిచ్‌లు బీజేపీకి అనుకూలంగా లేవు..

దేశంలోని అన్ని పిచ్‌లు బీజేపీకి అనుకూలంగా లేవ‌ని అర్థం అయింది.. ప‌సికూన జ‌ట్టు అని కేజ్రీవాల్‌ను తీసిపారేస్తే  ప‌ట్ట‌ప‌గ‌లే చుక్క‌లు చూపించారు.. ఇక ముందు బీజేపీ వాళ్లు ఎలాంటి పిచ్‌ల‌పైనైనా ఆడేలా స‌న్న‌ద్ధం అవుతారో లేదో వేచిచూడాలి... ప‌సికూన‌ల( ప్రాంతీయ పార్టీ)ల‌ను తేలిగ్గా తీసుకుంటే భ‌విష్య‌త్తులో డ‌కౌట్ కూడా అవుతారు... మోడీ గారూ జ‌ర భ‌ద్రం.. !!

Tuesday 10 February 2015

ఇలా అంటున్నందుకు ఫీల్ కావొద్దు...

------------
ఊళ్లో పెళ్లికి అవేవో హ‌డావుడి  చేస్తాయన్న‌ట్లుగా ఉంది వామ‌ప‌క్షాల తీరు.. లేక‌పోతే బెంగాల్‌లో ఘోర ప‌రాభ‌వం, కేర‌ళ‌లో ఓట‌ములు.. అనైక్య‌త‌ల‌తో కొట్టుమిట్టాడుతున్న వామ‌ప‌క్ష పార్టీల నేత‌లు ఢిల్లీ ఎన్నిక‌ల్లో కేజ్రీవాల్ గెలిస్తే.. వీళ్ల పార్టీ ఏదో గెలిచిన‌ట్లుగా తెగ సంబ‌ర‌ప‌డిపోతున్నారు.. అస‌లు వాళ్లు ఢిల్లీలో పోటీ చేసిన స్థానాల్లో డిపాజిట్టు కూడా ద‌క్క‌లేద‌న్న చేదు వాస్త‌వాన్ని మ‌ర‌చిపోయారు.. క్షేత్ర‌స్థాయిలో వామ‌ప‌క్షాలు బ‌ల‌హీన ప‌డుతున్నాయ‌న్న విష‌యాన్ని గుర్తించి దానిపై దృష్టి సారిస్తే బాగుంటుంది.. అంతేకానీ మోడీ ఓడిపోయాడ‌నో, కాంగ్రెస్‌ ఓడిపోయింద‌నో సంబ‌రాల్లో ఉంటే భ‌విష్య‌త్తులో దేశంలో వామ‌ప‌క్ష పార్టీల అస్తిత్వ‌మే లేకుండా పోతుంది.. మ‌రిన్ని ఆమ్ ఆద్మీ పార్టీలు పుట్టుకొస్తాయి.. మీ స్థానాల‌ను భ‌ర్తీ చేస్తాయి.. ప్ర‌జా ఉద్య‌మాల మ‌ర‌చి మీలో మీరే కీచులాడుకుంటూ ప‌దిమందికి వినోదం పంచే పార్టీలుగా మారాయ‌న్న‌ది మీరు జీర్ణించుకోలేని వాస్త‌వం..!!

శ్రీ‌శైలాన్ని ఖాళీ చేయాల‌ని యోచిస్తోన్న ఆంధ్రా స‌ర్కారు..

వీళ్ల అవ‌స‌రాల కోసం ఏం చేసినా చెల్లుతుంది..
శ్రీ‌శైలాన్ని ఖాళీ చేయాల‌ని యోచిస్తోన్న ఆంధ్రా స‌ర్కారు..
800 అడుగుల వ‌ర‌కు నీటి వినియోగంపై యోచ‌న‌..

--------------------------
మొన్న తెలంగాణ‌లో పంట‌లు ఎండిపోతున్నాయి.. వాటిని కాపాడ‌టానికి విద్యుత్ అవ‌స‌రం ఉండి శ్రీ‌శైలంలో విద్యుత్ ఉత్ప‌త్తి చేస్తే ఆంధ్రా ప్రాంతా నేత‌లు, ఈనాడు ప‌త్రిక ఎంత గ‌గ్గోలు పెట్టింది... శ్రీ‌శైలం అడుగంటుతోంది అని తెగ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.. 854 అడుగుల వ‌ర‌కు వాడుకుంటామంటే కుద‌ర‌నే కుద‌ర‌ద‌ని పెద్ద పంచాయితీ పెట్టింది.. చివ‌రికి కృష్ణా బోర్డుతో ఆదేశాలు ఇప్పించి మ‌రీ నీటి వినియోగాన్ని అడ్డుకున్నారు...
ఇక ఇప్పుడు ఆంధ్రాలో ర‌బీలో పంట‌ల కోసం నీళ్లు కావాలట‌.. కేంద్రం ద్వారా ఒత్తిడి తెప్పించి నీళ్ల‌ను దోచుకెళ్లాల‌ని చూశారు.. కేంద్రం జోక్యం చేసుకోబోమ‌ని తేల్చిచెప్ప‌డంతో ఇక కుయుక్తులు ప‌న్నుతున్నారు.. అందుకోసం శ్రీ‌శైలాన్ని పూర్తిగా ఖాళీ చేసే ఆలోచ‌న చేస్తున్నారు.. 800 అడుగుల వ‌ర‌కు సాగు నీటి కోసం నీటిని వాడుకుంటే 65 టీఎంసీలు అందుబాటులో ఉంటాయ‌ట‌... 800 అడుగుల క‌న్నా కింద ఉన్న నీటిని తాగునీటి కోసం వాడుకునే ఆలోచ‌న చేస్తున్నార‌ట‌...
ఎంత దారుణం ఇది... అంటే పంట‌లు వారికే ఉన్న‌ట్లా... తెలంగాణ రైతుల కోసం విద్యుత్ ఉత్ప‌త్తికి నీటిని న్యాయ‌ప‌రంగా వాడుకుంటే చెల్ల‌ద‌న్న వాళ్లు ఇప్పుడు శ్రీ‌శైలాన్ని ఖాళీ చేసి ఆంధ్రాకు త‌ర‌లించుకుపోయే ఆలోచ‌న‌లు చేయ‌డాన్ని తెలంగాణ ప్ర‌భుత్వం అడ్డుకోవాలి... లేక‌పోతే వేస‌విలో తాగునీటి ఇబ్బందులు త‌ప్ప‌వు... ఈ విష‌యంలో ప‌చ్చ ప‌త్రిక‌ల ఎత్తుగ‌డ‌ల‌ను తిప్పికొట్టాల్సిందే..!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో, తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెరిగాయి... ప‌త్రిక‌ల్లో వార్తా శైలిలో మారాయి...






ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో, తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెరిగాయి... 
అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ, తెలంగాణ‌లోనూ పేదోడిపై భారం ప‌డ‌కుండా విద్యుత్ ఛార్జీలు పెంచార‌న్న‌ది వాస్త‌వం..
మ‌రి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విద్యుత్ ఛార్జీలు పెంచిన‌ప్పుడు ఆంధ్ర‌జ్యోతి, ఈనాడు వాళ్లు సామాన్యుల‌కు అవ‌గ‌తం అయ్యే రీతిలో వార్త‌ల‌ను రాశారు..
పేదోళ్ల‌పై ఎలాంటి భారం ఉండ‌బోద‌ని రాశారు.. మ‌రి తెలంగాణ ప్ర‌భుత్వం విద్యుత్ ఛార్జీల‌ను పెంచ‌బోతున్న‌ప్పుడు మాత్రం... వాడే కొద్దీ మోత అని ఒక‌డు... మ‌రొక‌డైతే తెలంగాణ జ‌నులారా.. బీ రెడీ... మీపై విద్యుత్ భారం మోప‌బోతున్నారు.. ప్ర‌త్యామ్నాయ ఆదాయ అవ‌కాశాల‌ను అన్వేషించ‌కుండా విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపుతున్నారంటూ ఆంధ్ర‌జ్యోతి లో రాశారు...
ఎందుకిలా?
తెలంగాణ పాఠ‌కుల‌ను గంద‌ర‌గోళానికి గురి చేయ‌డం ఎందుకు?  70 శాతం మందిపై భారం ఉండ‌బోద‌ని బాక్స్‌లోనో, డెక్ లోనో పెట్టవ‌చ్చు కదా.. వాటిని హైలెట్ చేయ‌డం ఇష్టం లేదా...?
----------------

నోట్‌: ఇంకో విచిత్రం ఏంటంటే 100 యూనిట్ల లోపు వినియోగించే వారికి రెండు రాష్ట్రాల్లోనూ ఛార్జీలు పెంచ‌లేదు..
అయితే 200లోపు వినియోగించే వారికి ఆంధ్రాలోనే అధికంగా ఛార్జీలు పెంచారు.. ఈ విష‌యాన్ని ఛార్జీల ప‌ట్టిక‌లోనూ చూస్తే అర్థం అవుతుంది..