1

1

Monday 16 February 2015

జ‌య‌ల‌లిత‌కు త‌గ్గ‌ని జ‌నాద‌ర‌ణ‌...

శ్రీ‌రంగం నియోజ‌క‌వ‌ర్గంలో భారీ ఆధిక్యంలో అన్నాడీఎంకే అభ్య‌ర్థి..
---------------
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్ష‌కు గురై అన‌ర్హ‌త వేటు ప‌డిన త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత‌కు అక్క‌డి ప్ర‌జ‌ల్లో ఆద‌ర‌ణ త‌గ్గ‌లేదు.. ఆమెపై అన‌ర్హ‌త ప‌డ‌టంతో ఆమె ప్రాతినిథ్యం వ‌హిస్తున్న శ్రీ‌రంగం నియోజ‌క‌వ‌ర్గాన్ని ఉప ఎన్నిక మొన్న జ‌ర‌గింది.. ఈ రోజు జ‌రుగుతున్న కౌంటింగ్‌లో ఇప్ప‌టికే 50 వేలకు పైగా ఆధిక్యంలో అన్నాడీఎంకే పార్టీ అభ్య‌ర్థి ఉన్నారు.. ఇంకా కొన్ని రౌండ్ల లెక్కింపు జ‌ర‌గాల్సి ఉంది.. ఆధిక్యం పెర‌గొచ్చు కూడా.. గ‌త ఎన్నిక‌ల్లో జ‌య‌ల‌లిత‌కు వ‌చ్చిన ఆధిక్యాన్ని ఇప్ప‌టికీ దాట‌డం విశేషం.. ఈ ఎన్నిక‌ను డీఎంకే, బీజేపీ, ఇత‌ర పార్టీలు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుని ప్ర‌చారం చేశాయి..  హామీల వ‌ర్షం కురిపించాయి... ఈ ఎన్నిక‌ల్లో తానే పోటీ చేస్తున్న‌ట్లుగా భావించి ఓటేయాల‌ని జ‌య‌ల‌లిత విజ్ఞ‌ప్తి చేశారు.. జ‌నం ఆమెపై ఆద‌ర‌ణ చూపిన‌ట్లు ఫ‌లితాల స‌ర‌ళిని బ‌ట్టి అర్థం అవుతోంది... ఇక ద‌క్షిణాదిలో పాగా వేయాల‌నుకుంటున్న బీజేపీకి కేవ‌లం 3 వేల ఓట్లు వ‌చ్చాయి...

1 comment: