1

1

Friday 31 October 2014

యూపీఏ ఎంతో ఇష్టంగా చేప‌ట్టిన ప‌థ‌కాల‌కు, కార్య‌క్ర‌మాల్లో మోడీ గారు పాల్గొన్నారా?

మోడీ గారు ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు
యూపీఏ ఎంతో ఇష్టంగా చేప‌ట్టిన ప‌థ‌కాల‌కు, కార్య‌క్ర‌మాల్లో మోడీ గారు పాల్గొన్నారా?
-------------------------
అదంతా ఎందుకు 2012లో అనుకుంటా మోడీ గారు మూడోసారి ప‌గ్గాలు చేప‌డుతున్న స‌మ‌యంలో రావాల్సిందిగా చంద్ర‌బాబునాయుడు, ఆయ‌న బావ‌మ‌రిది బాల‌కృష్ణ‌కు ఆహ్వానం పంపితే... వెళ్ల‌కుండా తిర‌స్క‌రించింది ఎవ‌రు?

-----------------------------

ఆ విలేక‌రి ల‌క్ష్యం నెర‌వేరింది..



అది ఓ వ‌ర్గానికి కొమ్ముకాసే ప్ర‌ధాన‌ ప‌త్రిక‌...

దాని తెలంగాణ బ్యూరో చీఫ్ మ‌నోడు కాదు ..


ఇంకేముంది మ‌న ప్ర‌యోజ‌నాల‌కు సంబంధించిన వార్త‌లు వ‌స్తాయా?  మ‌నం  చ‌చ్చినా రావు..


ఇక్క‌డ ఉంటూ అడుగ‌డుగునా ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు, రైతుల‌కు వెన్నుపోటు పొడిచే రాత‌లు...


మొన్న సాగ‌ర్‌లో డెడ్ స్టోరేజీ ఉన్న స‌మ‌యంలో కృష్ణా డెల్టాలో సాగు క‌ష్టాలు, తాగు క‌ష్టాలు అంటూ వార్త‌లు రాశాడు..

అంతే ప‌చ్చ పార్టీ రంగంలోకి దిగింది... గ‌గ్గోలు పెట్టింది... కృష్ణాబోర్డు మీటింగ్ పెట్టించింది... ఫ‌లితంగా డెడ్ స్టోరేజీ ఉన్నా 10 టీఎంసీలు త‌ర‌లించుకున్నారు...


ఇక నిన్న‌టికి నిన్న శ్రీ‌శైలంలో నిండుగా నీళ్లున్నా.. అడుగంటిన శ్రీ‌శైలం అంటూ కుట్ర క‌థ‌నం రాశాడు..

అంతే ఇక ప‌చ్చ పార్టీ డ్రామాలు మొద‌ల‌య్యాయి... వ‌ర‌సగా కుట్ర క‌థ‌నాలు రాయ‌డం.. ఆ వెంట‌నే మ‌ళ్లా కృష్ణా బోర్డు స‌మావేశం జ‌ర‌గ‌డం వెంట‌వెంట‌నే జ‌రిగిపోయాయి...


ఇప్పుడు ఇక తెలంగాణ రైతుల‌కు విద్యుత్ అంద‌కుండా నీటి విడుద‌ల‌ను ఆపించేలా ఆదేశాలు ఇప్పించుకోవ‌డం అయిపోయింది...

-------------------------
అస‌లు తెలంగాణ ప‌త్రిక‌ల ఆవ‌శ్య‌క‌త ఇక్క‌డే ఏర్ప‌డుతుంది... మ‌న రైతుల‌కు విద్యుత్ కావాల‌న్న స‌మ‌యంలో మ‌న ప‌త్రిక అయి ఉంటే శ్రీ‌శైలంలో ఉత్ప‌త్తి చేసుకోవ‌చ్చు అని రాసేది... కానీ ఆ ప‌త్రిక మ‌న‌ది కాదు.. రాసేవాడు మ‌న‌వాడు కాదు.. వాళ్ల ప్రాంతం, వాళ్ల ప్ర‌యోజ‌నాలు ముఖ్యం...

క‌నీసం న్యాయాన్యాయాల విచ‌క్ష‌ణ లేని రాత‌లివి...

ఇది మారాలి.... తెలంగాణ‌లో మీడియా సంస్థ‌లు మ‌రిన్ని రావాలి...
ఆంధ్రా ప‌త్రిక‌ల్లో బ్యూరో చీఫ్ ల‌ను మ‌న వారినే ఉంచాలి..


నోట్‌:  ఇక్క‌డ ఆ విలేక‌రి ల‌క్ష్యం నెర‌వేరింది.. త‌న ప్రాంతం అవ‌స‌రాల‌కు నీటిని కాపాడుకోవాల‌ని చూశాడు... ఆంధ్రా స‌ర్కారును అప్ర‌మ‌త్తం చేసే
వార్త‌ను రాశాడు...  ఆ వెంట‌నే లాబీయింగ్ మొద‌లైంది.. కృష్ణా బోర్డు నిర్ణ‌యం వ‌చ్చింది...

మీడియాలో మూడో ప్ర‌పంచ యుద్ధ‌మే క‌దా....

నిన్న‌ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టీడీపీ ఎమ్మెల్యే కుమారుడు ఏదో బైక్ ప్ర‌మాదం చేసి ఒక‌రిద్ద‌రి మ‌ర‌ణానికి కార‌ణం అయ్యాడ‌ట‌...

మొన్నామ‌ధ్య టీడీపీ నేత కోడ‌లు ఏకంగా హైకోర్టుకు వెళ్లింద‌ట‌...


ఈ సంఘ‌ట‌న‌ల క‌వ‌రేజీలో ఆంధ్రా మీడియా రియాక్ష‌న్ మ‌నంద‌రం చూశాం...
--------------------------------
మ‌రి అదే టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొడుకు కేసులో ఇరుక్కుంటే...

టీఆర్ఎస్ నేత‌పై కోడ‌లు కేసు పెడితే....


అమ్మో... ఏమైనా ఉందా?   మీడియాలో మూడో ప్ర‌పంచ యుద్ధ‌మే క‌దా....

ర‌వికృష్ణ‌, రాధాకృష్ణ‌లు నేరుగా రంగంలోకి దిగేవారే క‌దా.. !!

మ‌రి ఇప్పుడెందుకు ఆ వార్త‌లకు ప్రాధాన్యం ల‌భించ‌డం లేదు...?


మీరే ఆలోచించి చెప్పండి...

ఏంటో ఈ జ‌ర్న‌లిజం... ?

అమ‌రుల జాబితాలో భ‌ర్త పేరు లేద‌ని ఒక మ‌హిళ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేస్తే అది ప్ర‌ధాన ప‌త్రిక‌లో వార్త‌...

అమ్మా.. అమ‌రుల‌ మొద‌టి జాబితాలో ఐదో పేరు నీ భ‌ర్త‌దే.. నువ్వు పొర‌పాటున చూడ‌లేద‌ని మంత్రులు చెప్పిన వార్త మినీ ఎడిష‌న్లో...

ఏంటో ఈ జ‌ర్న‌లిజం... ?

ఏమిటీ విచిత్రం...

ఏమిటీ విచిత్రం...

ఇంట్లో చిన్న బిడ్డ‌పై, కొడుకుపై గారాబం చేస్తార‌ట‌.. అడిగిన‌వ‌న్నీ కొనిస్తార‌ట‌...

మ‌రి ఏంటో నా భ‌ర‌త మాత చిన్న బిడ్డ‌పై ఇంత వివ‌క్ష ఎందుకో?
అడిగిన‌వి ఇవ్వ‌క‌పోగా..ఉన్న‌వి గుంజుకుంటున్నారు...
ఇప్పుడే పుట్టింది క‌దా నోరు లేద‌ని అనుకుంటున్నారా?!!!

పీవీ గారి జ‌యంతిని జాతీయ సంస్క‌ర‌ణ‌ల దినోత్స‌వంగా జ‌ర‌పండి..

మోడీ గారికి విజ్ఞ‌ప్తి...
--------------------
పీవీ గారి జ‌యంతిని జాతీయ సంస్క‌ర‌ణ‌ల దినోత్స‌వంగా జ‌ర‌పండి..
--------------------------

కాంగ్రెస్‌లో మ‌రుగున ప‌డేయ‌బ‌డిన గొప్ప ప్ర‌ధానుల్లో పీవీ న‌ర‌సింహారావు ఒక‌రు... లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి మ‌రొక‌రు... గ‌త ఎన్నిక‌ల్లోనూ మీరు పీవీ న‌ర‌సింహారావుకు జ‌రిగిన అన్యాయంపై, తెలుగు వాళ్ల‌కు జ‌రిగిన అవ‌మానంపై తీవ్ర ఆవేధ‌న వ్య‌క్తం చేశారు..  తొక్కి పెట్టేయ‌బ‌డిన మ‌హ‌నీయుల‌కు ఇప్పుడు మీరు ఇస్తున్న ప్రాధాన్యం బాగుంది.. మొన్న మ‌హాత్మాగాంధీ గారి జ‌యంతిని బాగా జ‌రిపించారు.. నేడు స‌ర్దార్ ప‌టేల్ జ‌యంతిని జాతీయ ఐక్య‌తా దినంగా పాటించేలా చేశారు... ఇద్ద‌రూ గుజ‌రాత్ నేత‌లే కాబ‌ట్టి వాళ్లిద్ద‌రికే ప్రాధాన్యం ఇచ్చారేమో అన్న అనుమానాల‌ను నివృత్తి చేసేలా వ‌చ్చే ఏడాది నుంచి పీవీ న‌ర‌సింహారావు జ‌యంతిని జాతీయ సంస్క‌ర‌ణ‌ల దినంగానో ఇంకేదైనా మంచి పేరుతోనో జ‌ర‌పండి..సంక్షోభ స‌మ‌యంలో దేశాన్ని కాపాడిన యుగ పురుషుడు పీవీ న‌ర‌సింహారావు...  ఆయ‌న‌కు జ‌రిగిన అవ‌మానాన్ని స‌రిదిద్దండి.. స‌ముచిత ప్రాధాన్యం ఇవ్వండి.. ఈ ఏడాది పీవీ న‌ర‌సింహారావు జ‌యంతిని తెలంగాణ ప్ర‌భుత్వం అధికారికంగా జ‌రిపింది.. బ‌హుషా ఆ స‌మ‌యంలో మీరూ పీవీ జ‌యంతిని ప్ర‌త్యేకంగా నిర్వ‌హించాల‌ని ఆలోచించి ఉండ‌క‌పోవ‌చ్చు... కానీ వ‌చ్చే ఏడాదైనా మా పీవీని గౌర‌వించండి సార్‌... అలా కాకుండా 2019 వ‌ర‌కు ఆగుదాం అంటే త‌ప్పుడు సంకేతాలు వెళ‌తాయి...
-------------------------
లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి జ‌యంతి కూడా అక్టోబ‌రు 2నే ఉంది.. పాపం అందుకే ఆయ‌న‌కు త‌గిన గుర్తింపు రావ‌డం లేదు... జై జ‌వాన్‌, జై కిసాన్ పిలుపునిచ్చి దేశాన్ని కాపాడిన గొప్ప వ్య‌క్తి.. మ‌రి ఆయ‌న జ‌యంతికీ ప్రాధాన్య‌త‌ల ల‌భించే కార్య‌క్ర‌మానికి రూప‌క‌ల్ప‌న చేయండి...

దేవేంద్ర ఫ‌డ్న‌విస్ కుటుంబం పూర్తిగా బీజేపీకి అంకితం అయింది..

దేవేంద్ర ఫ‌డ్న‌విస్ కుటుంబం పూర్తిగా బీజేపీకి అంకితం అయింది..
ఇది మంచి వార్తే... లేక‌పోతే ఒక‌రు ఒక పార్టీలో, ఇంకొక‌రు ఇంకో పార్టీలో ఉండ‌టం మంచి ప‌రిణామం కాదు..
వాళ్ల నాన్న గారు జ‌న‌సంఘ్‌, జ‌న‌తా పార్టీ, బీజేపీ త‌ర‌ఫున చ‌ట్ట‌స‌భ‌ల‌కు ఎన్నిక‌య్యార‌ట‌..
ఇక అన్న‌య్య అఖిల భార‌త విద్యార్థి ప‌రిష‌త్‌లో ప‌నిచేశార‌ట‌..
ఇక ఆంటీ గ‌తంలో మంత్రిగా ప‌నిచేశార‌ట‌.....
కుటుంబానికి రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న‌ప్ప‌టికీ త‌న సొంత ఇమేజ్‌ను ఏర్పాటు చేసుకోవ‌డంలో దేవంద్ర ఫ‌డ్న‌విస్ స‌ఫ‌లీకృతుల‌య్యారు..
అంచెలంచెలుగా ఎదగడ‌మే కాకుండా నిజాయ‌తీగా ఉండ‌ట‌మూ ఆయ‌న విజ‌య ర‌హ‌స్య‌మే...

-------------------------------------------

దేవేంద్ర ఫ‌డ్న‌విస్ గారు బ‌తికి పోయారు...

దేవేంద్ర ఫ‌డ్న‌విస్ గారు బ‌తికి పోయారు...
మ‌హారాష్ట్ర‌లో ఆంధ్ర‌జ్యోతి పేప‌ర్ లేదు క‌దా...
లేక‌పోతే దేశంలోనే అత్య‌ధిక సంఖ్య‌లో రైతుల ఆత్మ‌హ‌త్య‌లు జ‌రిగే విద‌ర్భ గురించి ఎలా రాసేదో ఆ ప‌త్రిక‌..
ముఖ్య‌మంత్రి ఇలాకా(దేవంద్ర ఫ‌డ్న‌విస్ విద‌ర్భ వారే)లో  గంట‌ల వ్య‌వ‌ధిలో రైతు మ‌ర‌ణాలంటూ రాసేదేమో..!!
------------------------------
నోట్‌: విద‌ర్భ‌, తెలంగాణ రైతులు ఆత్మ‌హ‌త్య‌లు జాతీయ‌, అంత‌ర్జాతీయ మీడియాలో ప్ర‌ముఖంగా వ‌స్తున్న‌ప్పుడు కేంద్రం ప్ర‌త్యేక చొర‌వ తీసుకోవాలి.. ప్ర‌త్యేక ప్యాకేజీ ప్ర‌క‌టించాలి.. విద‌ర్భ‌, తెలంగాణ‌ను ఆదుకోవాలి...

మ‌రి గుజ‌రాత్ అభివృద్ధి మంత్రం ఏంటి?

గుజ‌రాత్  ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన స‌మ‌యంలో మోడీ గారు ఎందరు కేంద్ర మంత్రుల చుట్టూ తిరిగారు...
కేంద్ర మంత్రుల చుట్టూ ముఖ్య‌మంత్రులు ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తేగాని ప‌నులు కావా?
మ‌రి గుజ‌రాత్ అభివృద్ధి మంత్రం ఏంటి?

ఎందుక‌బ్బా..

ఎవ‌రైనా పార్టీ బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రిని క‌లిస్తే... కేంద్ర మంత్రి మాట‌ల‌ను హైలెట్ చేస్తారు.. కానీ ఆ ప‌చ్చ ప‌త్రిక‌ల్లో ప‌చ్చ బాబులు చెప్పిన విష‌యాన్ని మాత్రం రాశారు...
బ‌హుషా ఎంత క‌ష్ట‌ప‌డినా విద్యుత్ లైన్లు వేయ‌డానికి 30 నెల‌లు ప‌డుతుంద‌ని ఆయ‌న అన్న మాట‌లు వారికి మింగుడు ప‌డ‌లేదేమో...  !!

బోర్డు నిర్ణ‌యాన్ని గౌరవించ‌డం అవ‌స‌ర‌మా?

నాగార్జున సాగ‌ర్‌లో డెడ్‌స్టోరేజీ ప‌రిస్థితి ఉన్న‌ప్పుడు
కృష్ణా డెల్టా ప‌రిధిలో ప్ర‌జ‌లు, రైతుల కోసం 10 టీఎంసీలు ఇవ్వాల‌న్న‌ది ఈ బోర్డే..
ఇప్పుడు శ్రీ‌శైలంలో 100 టీఎంసీల‌కు పైగా నీళ్లు ఉన్నా విద్యుత్ ఉత్ప‌త్తిపై ఆంక్ష‌లు విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది ఈ బోర్డే...
ఏక‌ప‌క్షంగా తెలంగాణ ప్ర‌యోజ‌నాల‌ను దెబ్బ‌తీసేలా ఆదేశాలు ఇచ్చిన బోర్డు నిర్ణ‌యాన్ని గౌరవించ‌డం అవ‌స‌ర‌మా?

అంత ధైర్యం దానికి ఉందంటారా?

యాజ‌మాన్యాల కాళ్ల కింద న‌లిగిపోతున్న జ‌ర్న‌లిస్టుల స్థితిగ‌తుల‌పై అధ్య‌య‌నానికి ప్రెస్ కౌన్సిల్ ఏమైనా క‌మిటీని ఏర్పాటు చేస్తే బాగుండు...
అంత ధైర్యం దానికి ఉందంటారా?

ఆ ఆట‌గాళ్ల‌పై దేశ భ‌క్తిపై రాయ‌రేం? ఒక్క సానియాపైనే అక్క‌సు ఎందుకో?

ఆ ఆట‌గాళ్ల‌పై దేశ భ‌క్తిపై రాయ‌రేం?
ఒక్క సానియాపైనే అక్క‌సు ఎందుకో?
దేశం కోసం ఆసియా క్రీడ‌ల్లో పాల్గొన్న క్రీడాకారిణి రోజూ తన దేశ‌భ‌క్తిని నిరూపించుకోవాల‌న్న‌ట్లు మాట్ల‌డ‌టం స‌రికాదు..
------------------------------
మొన్న ఆసియా క్రీడ‌లు జ‌రిగాయి.. అందులో టెన్నిస్‌లో భార‌త్ త‌ర‌ఫున అగ్ర‌శ్రేణి ఆట‌గాళ్లు పాల్గొన‌లేదు.. వాళ్లు ర్యాంకింగ్ కోసం ఆ టోర్నీకి డుమ్మా కొట్టారు.. ఇందులో లియాండ‌ర్ పేస్‌, సోమ్‌దేవ్ త‌దిత‌రులు ఉన్నారు... మ‌రి సానియా మీర్జా మాత్రం దేశం త‌ర‌ఫున పాల్గొన్న‌ది... ఆమె దేశ‌భ‌క్తిని ప‌దేప‌దే శంకించే మ‌నుషుల‌కు ఆమె టోర్నీలో పాల్గొని మిగ‌తా వారు పాల్గొన‌ని విష‌యం క‌నిపించ‌లేదు ఎందుకు?
ఆసియా క్రీడ‌ల్లో దేశం త‌ర‌ఫున కొంద‌రు క్రీడాకారులు పాల్గొన‌క‌పోవ‌డంపై క్రీడాశాఖ కూడా సీరియ‌స్ అయింది... అలాంటి క్రీడాకారుల‌కు ఎలాంటి న‌జ‌రానాలు, సాయం చేయ‌బోమ‌ని హెచ్చరిక‌లు చేసింది... ఇక కేంద్రం ఇచ్చే డ‌బ్బులు ఎందుకు?  మ‌న వ‌ద్ద కోట్లు ఉన్నాయి క‌దా అని చెప్పి వ‌రుస‌గా రెండో ఏడాది కూడా బీసీసీఐ క్రికెట్ జ‌ట్టును ఆసియా క్రీడ‌ల‌కు పంప‌లేదు.. అంటే డ‌బ్బుల కోస‌మే క్రికెట్ ఉంది... క్రికెట‌ర్లు డ‌బ్బులు వ‌చ్చే టోర్నీలు ఆడుతున్నారు... సానియా మిర్జాలాంటి వాళ్లు దేశం కోసం ఆసియా క్రీడ‌ల్లోపాల్గొని రెండు ప‌త‌కాలు తెచ్చింది.. అయినా ఆమె దేశ‌భ‌క్తిపై అంద‌రికీ రోజూ అనుమానాలేదు.. కార‌ణం మ‌త‌మా?   ఇంకేంటి...
మ‌రి క్రికెట‌ర్ల దేశ‌భ‌క్తి, ఇత‌ర ఆట‌గాళ్ల దేశ‌భ‌క్తి గురించి ఆలోచించ‌రా?

-------------------------
ఏది ఏమైనా భార‌త్ త‌ర‌ఫున ఆడ‌ని క్రికెట‌ర్లు, క్రీడాకారుల‌కు అవార్డులు ఇవ్వొద్ద‌ని కేంద్రం యోచిస్తోంది.. ఇది మంచి ప‌రిణామం...

మీడియా సంస్థ‌ల్లో కార్మిక చ‌ట్టాల ఉల్లంఘ‌న‌...

మీడియా సంస్థ‌ల్లో కార్మిక చ‌ట్టాల ఉల్లంఘ‌న‌...
20-50 వేల మ‌ధ్య‌న వ‌చ్చే వారి జీతం 20 వేలు మాత్ర‌మే..
ఇక 50-ల‌క్ష రూపాయాలు వ‌చ్చే వారికి రూ.30 వేలు మాత్ర‌మే చెల్లింపు...

ఉద్యోగుల జీతాల్లో ఇష్టారీతిన కోత‌లు...

అది పేరు మోసిన ఛానెల్‌.. ఆ ఛానెల్ కోసం ఉద్యోగులు ఏళ్ల త‌ర‌బ‌డి త‌మ జీవితాల‌ను ధార‌పోశారు.. కొంద‌రైతే పోలీసు కేసుల‌కు భ‌య‌ప‌డ‌కుండా ఆ సంస్థ కోసం కొట్లాడారు.. ఇందుకు ప్ర‌తిఫ‌లంగా ఆ సంస్థ వారికి ఇస్తున్న న‌జ‌రానా ఏంటో తెలుసా... ?  జీతాల్లో కోత‌... అవును.. న‌వంబ‌రు 1 నుంచి వారికి అందే జీతాల్లో కోత విధిస్తోంది.. ఉద్యోగి జీతం 20 వేల నుంచి 50 వేల వ‌ర‌కు ఉంటే వారంద‌రికీ 20 వేల‌ను మాత్ర‌మే చెల్లిస్తున్నారు.. అంటే 50 వేలు వ‌చ్చే వాడికి ఇప్పుడు 20 వేలే వ‌స్తాయి..  ఇక 50వేల నుంచి ల‌క్ష వ‌ర‌కు జీతం ఉన్న వారికి 30 వేలే ఇస్తున్నారు.. అంటే ల‌క్ష వ‌చ్చే వాడికి ఇక‌పై 30 వేలే వ‌స్తుంద‌న్న మాట‌.... మొన్న ప‌చ్చ ప‌త్రిక‌ల్లో ఇష్టారీతిన ఉద్యోగుల‌ను తొల‌గించారు.. ఇప్పుడు ఇష్టారీతిన జీతాల్లో కోత‌లు పెడుతున్నారు... అవ‌స‌రంఉన్న‌న్ని రోజులు వాడుకొని ఆ త‌ర్వాత ఉద్యోగుల‌ను క‌రివేపాకుల్లాగా తీసేస్తున్నారు..

ఇదే ప‌నిని ఏదైనా ప్రైవేటు సంస్థ చేస్తే మీడియా వాళ్లు దాన్ని త‌ప్పుగా చూపేవారు.. మ‌రి ఇప్పుడు మీడియా యాజ‌మాన్య‌మే త‌ప్పు చేస్తోంది... మ‌రి మీడియా యాజ‌మాన్యాన్ని ప్ర‌శ్నించేది ఎవ‌రు?

అస‌లు కార్మిక చ‌ట్టాల‌ను బ‌ల‌హీనం చేస్తున్న‌ది ఎవ‌రు?   క‌నీసం  కార్మికులైనా అన్యాయంపై గొంతెత్తుతారు... కానీ జ‌ర్న‌లిస్టుల‌కు ఆ స్వేచ్ఛ కూడా లేకుండా పోయింది... వీళ్ల జీవితాలు వెట్టి చాకిరిగా మారిపోయాయి.... ఈ ప‌ద్ధ‌తి మార‌కుంటే అన్ని ప్రైవేటు సంస్థ‌లు, మీడియా యాజ‌మాన్యాలు ఇలాగే చేస్తాయి... మీడియా ముసుగులో కోట్లు సంపాదించిన వారి ఆస్తుల‌ను అమ్మి జీతాల‌ను చెల్లించ‌డానికి చేతులు ఎందుకు రావ‌డం లేదు...?

నోట్‌:  జీతాల్లో కోత విష‌యంలో తెలంగాణ‌, ఆంధ్రా జ‌ర్న‌లిస్టుల ప‌ట్ల స‌మ‌న్యాయం పాటించిన‌ట్లు తెలిసింది...

ఇక ప్ర‌భుత్వ ఉద్యోగాల నోటిఫికేష‌న్లు రావ‌న్న మాటే...

కేంద్ర ప్ర‌భుత్వం పొదుపు మంత్రాలు పాటిస్తోంది...
ఇందులో భాగంగా నూత‌న ఉద్యోగాల నియామ‌కాలు చేప‌ట్టొద్ద‌ని నిర్ణ‌యించింది(పొదుపు చ‌ర్య‌ల్లో ఇదీ ఒక‌టి)...
ఇక ప్ర‌భుత్వ ఉద్యోగాల నోటిఫికేష‌న్లు రావ‌న్న మాటే...
-----------------
2012, 2013లోనూ యూపీఏ ప్ర‌భుత్వం ఇలాగే పొదుపు చ‌ర్య‌ల పేరిట ఉద్యోగ నియామ‌కాల‌కు స్వ‌స్తి ప‌లికింది...
ఖాళీలు భ‌ర్తీ చేయ‌కుండా ప‌నులు ఎలా సాగుతాయో ఈ ప్ర‌భుత్వాల‌కే తెలియాలి..

-------------------
కేంద్రాన్ని ఆద‌ర్శంగా తీసుకొని రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా పొదుపు చ‌ర్య‌ల్లో భాగంగా నూత‌న నియామకాలు చేప‌ట్ట‌క‌పోతే నిరుద్యోగుల ప‌రిస్థితి ఏంటి?
ఇది మంచి సంప్ర‌దాయం కాదు...
పొదుపు చ‌ర్య‌లంటే ఉద్యోగాల భ‌ర్తీని ఆప‌డం కాదు... ద‌య‌చేసి ప్ర‌భుత్వాలు దీన్ని ప‌ట్టించుకోవాలి... నిరుద్యోగుల కోసం కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు నోటిఫికేష‌న్లు జారీ చేయాలి...

అజీర్తి ప్ర‌మాద‌క‌రం!

టీఆరెస్ పార్టీలోకి వ‌ల‌స‌ల‌ను చూస్తున్నాం. సాధార‌ణ ప్ర‌జ‌లు దీనిపై విసుక్కుంటున్నారు. ఇదేంది?... అన్ని పార్టీల నుంచి ఇలా క్యూ క‌డుతున్నారు. చేరేవాళ్లు అభివృద్ధి, బంగారు తెలంగాణ అంటున్నారు. బాగానే ఉంది. కానీ వాస్త‌వంగా వారి మ‌న‌సులో అధికారం అనేది ఆయా పార్టీల్లో కుదురుగా ఉండ‌నీయ‌క టీఆరెస్‌లో చేరేలా చేస్తుంద‌నేది బ‌హిరంగ ర‌హ‌స్యం. అయితే టీఆరెస్ అధిష్ఠానం ఈ విష‌యాన్ని గుర్తించాలి. వ‌స్తుంటె ఎలా కాద‌న‌గ‌లం... అనేది పాత మాట‌. కొత్త రాష్ట్రం, ప్ర‌జ‌ల అండ‌తో గెలిచిన పార్టీ వినూత్నంగా అడుగులు ఉండాలి. కానీ గ‌తంలో ఇత‌ర సంప్ర‌దాయ పార్టీలు చేసిన‌ట్లు వ‌రుస‌గా వ‌చ్చే వారిని చేర్చుకొని ప్ర‌జ‌ల‌కు ఎలాంటి సంకేతాలు పంపుతున్నాం? అనేది మాత్రం ఒక‌సారి అంత‌ర్మ‌థ‌నం చేసుకోవాల్సిన అవ‌స‌ర‌ముంది. ముఖ్యంగా రాజ‌కీయ పార్టీలో చేరిక‌లు అనేది ఆ పార్టీ సొంత అంశం. కానీ టీఆరెస్‌ను జ‌నం అలా చూడ‌లేదు. కేసీఆర్ మాది ఫ‌క్తు రాజ‌కీయ పార్టీ అని ప్ర‌క‌టించ‌వ‌చ్చు. కానీ జ‌నం మొన్న‌టి ఎన్నిక‌ల్లో నిల‌బ‌డిన నాయ‌కులు, వారి ఆర్థిక ప‌రిపుష్టి, అహ‌ర్యం చూసి ఓటేయ‌లేదు. మొక్క‌వోని దీక్ష‌తో 14 ఏండ్లు కేసీఆర్ అనే వ్య‌క్తి తెలంగాణ కోసం నిల‌బ‌డ్డాడు, విజ‌న్ ఉంది, ఆంధ్ర కుట్ర‌ల‌ను ఎదుర్కొనే మొండిత‌నం ఉంది అనే అర్హ‌త‌ల‌ను చూసి... అభ్య‌ర్థుల‌తో నిమిత్తం లేకుండా ఓటేశారు. నాలాంటి వారు ఆనందించేలా అటు ఎక్కువ కాకుండా, ఇటు తిరిగి టీఆరెస్‌ను ఇబ్బందిలోకి నెట్టేవిధంగా కాకుండా 63 సీట్లు వ‌చ్చాయి. ప్ర‌జాస్వామ్యంలో ఇంత‌కంటే మెజార్టీ ఆశించ‌డం, అవ‌స‌రం అనుకోవ‌డం కూడా అత్యాశ అవుతుందేమో. కేసీఆర్ ఈ ఐదేండ్ల పాల‌న త‌ర్వాత 63 కంటే ఎక్కువ సీట్లు రావాల‌ని ల‌క్ష్యంగా ఎంచుకోవ‌డం ఒక ప‌టిష్ట నాయ‌కుడి ల‌క్ష‌ణం. కానీ ఇత‌రుల‌కు ఇప్ప‌ట్లో ఎన్నిక‌లు లేవ‌ని చెబుతూ... మ‌రోవైపు ఇలా చేయ‌డం ద్వంద్వ వైఖ‌రి అవుతుంది. వ‌రుస చేరిక‌ల‌తో వ‌చ్చే లాభం, అవి లేకుంటే క‌లిగే న‌ష్టం ఏమిటో సాధార‌ణ జ‌నానికి మాత్రం అర్థం కావ‌డం లేదు. మ‌ళ్లోసారి చెబుతున్నా... చేరిక‌లు ఆయా పార్టీల వ్య‌క్తిగ‌త విష‌యం కావ‌చ్చు. కానీ టీఆరెస్ సాంకేతికంగా రాజ‌కీయ పార్టీ కావ‌చ్చుగానీ అధికారంలోకి రావ‌డానికి ఆ రాజ‌కీయానికి అతీతంగా మ‌రెన్నో న‌మ్మ‌కాలు, ఆశ‌లు, ఆకాంక్ష‌లు ఆశీర్వ‌దించాయ‌నే విష‌యాన్ని మాత్రం టీఆరెస్ పెద్ద‌లు గుర్తించాలి.

ఇవేం ప‌త్రిక‌లో.... వీటి రాత‌ల ప‌ర‌మార్థ‌మే వేర‌యా?

ఇవేం ప‌త్రిక‌లో....
వీటి రాత‌ల ప‌ర‌మార్థ‌మే వేర‌యా?

------------------
---------------------

స‌మ‌గ్ర స‌ర్వే చేయాల‌నుకుంటున్నాం...

అబ్బే.. ఇవ‌న్నీ ఎందుకండీ అంటారు..
-----------------------

వాటర్ గ్రిడ్ ప్రారంభించాల‌ని అనుకుంటున్నాం...

అయ్యో.. ఇది తెలంగాణకు త‌గ‌దు అంటారు...
------------------------

పాఠ‌శాల‌ల హేతుబ‌ద్ధీకర‌ణ చేయాల‌నుకుంటున్నాం..

అయ్య‌య్యో... నిరుద్యోగుల నోట్లో మ‌ట్టి కొడ‌తారా?  అని ప్ర‌శ్నిస్తారు
-----------------------------

బ‌ట్టి చ‌ద‌వుల‌కు స్వ‌స్తి ప‌ల‌క‌డానికి కొత్త విధానం తెస్తున్నాం...

అయ్యో... గురువుల‌తో చెల‌గాటం.. విద్యార్థుల‌కు సంక‌ట‌మంటారు....
-----------------------------
విద్యుత్ కొర‌త‌ను తీర్చేందుకు ప్రాజెక్టులు ప్రారంభించ‌బోతున్నాం...

అయ్యో... థ‌ర్మ‌ల్ ప్రాజెక్టుల‌తో తెలంగాణ ప్ర‌జ‌ల్ని కాలుశ్యం కోర‌ల్లో నెట్టేస్తారా?  అని కూడా అడుగుతారు..
--------------------------------
ఛ‌త్తీస్‌గ‌ఢ్ నుంచి విద్యుత్ లైన్ వేస్తున్నాం...

అయ్య‌య్యో... ప‌చ్చ‌ని అడ‌వుల‌ను న‌రికేస్తారా? అని కూడా విమ‌ర్శిస్తారు..
----------------
----------------
అస‌లు స‌ర్కారు ఏం చేసినా అది త‌ప్పు అంటారు... ఇవే ప‌నులు ఇతర రాష్ట్రాలు, కేంద్రం చేస్తే ఒప్పంటారా?

అప్పుడు మీ పెన్నులు క‌ద‌ల‌లేదు ఎందుకు?

రైతుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై ఆంధ్ర‌జ్యోతి రోజూ మొద‌టి పేజీలో  రాస్తోంది... రోజూ చ‌నిపోయిన రైతు గురించి, ఆయన కుటుంబ ప‌రిస్థితిని హృద‌యాల‌ను హ‌త్తుకునేలా రాస్తున్నారు..
------------------
మ‌రి తెలంగాణ ఉద్య‌మంలో వంద‌ల మంది యువ‌త లేఖ‌లు రాసి ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న‌ప్పుడు వారి కుటుంబ ప‌రిస్థితిని... వారి మ‌నోవేధ‌న‌ను... చంద్ర‌బాబును, కిర‌ణ్ కుమార్ రెడ్డిని, సీమాంధ్ర నేత‌ల‌ను ఎలా తిడుతూ లేఖ‌లు రాశారో ఆ లేఖ‌ల‌ను ప్ర‌చురించ‌లేదు ఎందుకు?
అప్పుడు మీ పెన్నులు క‌ద‌ల‌లేదు ఎందుకు?  మెద‌డులు మొద్దు బారాయా?
----------------------
ఈ రెండు సంఘ‌ట‌న‌ల‌ను బేరీజు వేసుకుంటే చాలు మీ రాత‌ల మ‌త‌ల‌బు ఏంటో తెలుస్తుంది...!!

న‌ల్ల ధ‌నంలో కేవ‌లం 600 పేర్లే ఉన్నాయా?

న‌ల్ల ధ‌నంలో కేవ‌లం 600 పేర్లే ఉన్నాయా?   అంటే గ‌త ప్ర‌భుత్వం వ‌ద్ద ఉన్న జాబితానే ఉందా?   మ‌రి మిగిలిన దొంగ‌ల జాబితాపై విచార‌ణ ఎప్పుడు జరుగుతుంది...  100 రోజుల్లో ఒక్క కొత్త పేరు కూడా వెలుగులోకి రాలేదా?

Wednesday 29 October 2014

ఇప్పుడు ఎవ‌రూ మాట్లాడ‌టం లేదు ఎందుకు?

ఆర్టిక‌ల్ 370, ఉమ్మ‌డి పౌర స్మృతి( కామ‌న్ సివిల్ కోడ్) అట‌, రామ మందిర‌మ‌ట‌... ఇంకా చాలా విన్నాను... అవ‌న్నీ మాట‌లు ఇప్పుడు ఎవ‌రూ మాట్లాడ‌టం లేదు ఎందుకు?

ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ గారు ప‌ద‌వికి రాజీనామా చేసిన త‌ర్వాతే బీజేపీలో పార్టీలో చేరారా...?

ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ గారు ప‌ద‌వికి రాజీనామా చేసిన త‌ర్వాతే బీజేపీలో పార్టీలో చేరారా...?
త‌ల‌సాని ప‌ద‌వికి రాజీనామా చేసి త‌ర్వాతే టీఆర్ఎస్‌లో చేరారా? 
ఇక టీడీపీలో చేరుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేశారా?

మ‌రి ఈయ‌న ఏంది విదేశీ బ్యాంకును న‌మ్ముకున్నాడు....

డాబ‌ర్ అంటే స్వ‌దేశీ వ‌స్తువ‌ని అని న‌మ్మాను... స్వ‌దేశీ అంటే దేశ‌భ‌క్తికి ప్ర‌తిరూపం అనుకున్నాను...
మ‌రి ఈయ‌న ఏంది విదేశీ బ్యాంకును న‌మ్ముకున్నాడు....

-------------------------
నేను నా చిన్న‌ప్ప‌టి నుంచీ డాబ‌ర్ లాల్ దంత్ మంజ‌న్‌, డాబ‌ర్ పేస్టు, డాబ‌ర్ చ‌వ‌న్‌ప్రాష్ త‌దిత‌ర ఉత్ప‌త్తుల‌నే వాడాను.. ఇప్పుడూ వాడుతున్నాను..
విదేశీ వ‌స్తువులు వాడితే ఆ సొమ్ము ఇత‌ర దేశాల‌కు వెళ్తుంద‌ని చిన్న‌ప్పుడు స్వ‌దేశీ జాగ‌ర‌ణ్ మంచ్ వాళ్లు నూరిపోశారు..
వాళ్లు ఇచ్చిన చిన్న క‌ర‌ప‌త్రంలో ఉన్న వ‌స్తువుల‌ను వెతికి మ‌రీ కొనుగోలు చేశాను..
చిన్న‌ప్ప‌టి నుంచీ ఇప్ప‌టి వ‌ర‌కూ డాబ‌ర్ ఉత్ప‌త్తుల‌ను మాత్రం విస్మ‌రించ‌లేదు..
మ‌రి మ‌న సొమ్ము ఇక్క‌డే ఉండాలి.. దేశ‌భ‌క్తికి మారుపేరు స్వ‌దేశీ వ‌స్తువుల వినియోగం అని అనుకుంటే.. వీళ్లు నా లాంటి అమాయ‌కుడిని ఇంత‌గా వంచించారు...
ఇక్క‌డి సొమ్మును అదేదో విదేశీ బ్యాంకులో దాచుకుంటారా?
వీళ్ల‌కు బ్రిటీష్ వాళ్ల‌కు తేడా ఏముందో నాకు అర్థం కావ‌డం లేదు......

---------------------------
దేశాన్ని ఇంత‌గా వంచించినా వీళ్ల ఉత్ప‌త్తుల‌నే వాడుతాను.. ఎందుకంటే వాళ్లు దేశ‌ద్రోహం చేశార‌ని నేనూ అదే పంథాలో వెళ్ల‌లేను క‌దా...!!!

నోట్‌:  ఇంకెన్ని స్వదేశీ సంస్థ‌లు, స్వ‌దేశీ మ‌నుషులు మ‌న‌ల్ని వంచించారో ముందుముందు తెలుస్తుంది.. కొంత గుండె నిబ్బ‌రం చేసుకోవాల్సిందే..!!!!

రాత్రంతా నేత‌ల‌ ఫోన్లు బిజీ బిజీ అట‌....

గుస గుస‌..
రాత్రంతా నేత‌ల‌ ఫోన్లు బిజీ బిజీ అట‌....

ఈ రోజు రాత్రి అన్నీ రాజ‌కీయ పార్టీల ఫోన్ల డాటా స‌మాచారం నాకు కావాలి... ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి ఫోన్లు వెళ్లాయి అన్న‌ది నాకు తెలియాలి?
ఈ రోజు నేత‌లంద‌రి ఫోన్లు బిజీబిజీగా వ‌స్తున్నాయ‌ట‌... ఎందుకో మ‌రి... స‌మాచార హ‌క్కు చ‌ట్టం కింద దీన్ని ఇస్తే బాగుండు... ఈ దాగుడు మూత‌లు అన్నీ బ‌య‌ట‌ప‌డేవి...!!!

ఆప‌రేష‌న్ ఆక‌ర్ష‌లు ఎప్పుడూ మంచివి కావు...

ఆప‌రేష‌న్ ఆక‌ర్ష‌లు ఎప్పుడూ మంచివి కావు...
దాని వల్ల  స్వ‌ల్ప ప్ర‌యోజ‌నం చేకూరినా దీర్ఘ‌కాలిక న‌ష్ట‌మే ఉంటుంది...
ఇందుకు అతి ఉత్త‌మ‌మైన ఉదాహ‌ర‌ణ బీజేపీ చేసిన ఆప‌రేష‌న్ క‌మ‌ల‌మే..
2009లో అధికారంలోకి వ‌చ్చాక కాంగ్రెస్‌ను, జేడీఎస్‌ను బ‌ల‌హీనం చేయ‌డానికి య‌డ్యూర‌ప్ప ఇది చేశాడు..
అధిష్ఠానం అండ‌దండ‌లు ల‌భించ‌డంతో ఎంపీలు, ఎమ్మెల్యేలు, స‌ర్పంచిలంద‌రినీ బీజేపీలోకి చేర్చుకున్నాడు..
కానీ ఆ త‌ప్పిదం ఫ‌లితంగా బీజేపీకి పూడ్చుకోలేని న‌ష్టం వాటిల్లింది...
మొన్న‌టి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘోరంగా భంగ‌పాటుకు గురైంది...

అందుకే ఈ ఆప‌రేష‌న్లు ఎప్ప‌టికీ మంచివి కావు..

కేసీఆర్ ఏమైనా ప్ర‌ధాన‌మంత్రా? ఎప్పుడూ ఢిల్లీలోనే ఉండ‌టానికి.

గ‌త 100 రోజుల్లో కేసీఆర్ రెండుసార్లు మాత్ర‌మే ఢిల్లీ వెళ్లాడ‌ట‌...  కాబోయే తెలుగుదేశం తెలంగాణ అధ్య‌క్షుడు లోకేశ్ బాబు అంటున్నాడు...
-----------------------------------------
కేసీఆర్ ఏమైనా ప్ర‌ధాన‌మంత్రా?  ఎప్పుడూ ఢిల్లీలోనే ఉండ‌టానికి..  ఈ దేశంలో కేవ‌లం ఒక్క చంద్ర‌బాబునాయుడు త‌ప్ప ఢిల్లీకి ఎక్కువ‌సార్లు చ‌క్క‌ర్లు కొట్టే ముఖ్య‌మంత్రి  ఎవ‌రైనా ఉన్నారా?
మోడీ సీఎంగా ఉన్న‌ప్పుడు కూడా ఢిల్లీకి ఎక్కువ సార్లు వెళ్లిన దాఖ‌లాలు లేవు..

దావూద్ కూడా భార‌త్‌లో మీడియా ఛానెల్ పెడ‌తాడ‌ట‌...

గుస‌గుస‌...

దావూద్  కూడా భార‌త్‌లో మీడియా ఛానెల్ పెడ‌తాడ‌ట‌...

ఛానెల్ పెట్టి ఇక్క‌డి ప్ర‌భుత్వాల‌ను తిట్టిపోస్తాడ‌ట‌... ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీస్తాడ‌ట‌... కారుకూత‌లు కూస్తాడ‌ట‌.. ఇష్టం ఉన్న‌ట్లు రాయిస్తాడ‌ట‌...

ఏమ‌న్నా అంటే మీడియా స్వేచ్ఛ అంటాడ‌ట‌....

ఇదో ర‌కం ఉగ్ర‌వాద‌మ‌ట‌....!!

తాజాగా భార‌తలోని కొన్ని సైకో మీడియా సంస్థ‌ల‌ను తీరు చూసి దావూద్‌ అనుచ‌రుడు ఈ ఐడియా ఇచ్చాడ‌ట‌....

దీనిపైనా ద‌ర్యాప్తు చేయాలి..

స్విస్ బ్యాంకుల్లోనే న‌ల్ల‌కుబేరుల‌కు ఖాతాలున్నాయా?
ఇత‌ర దేశాల్లో ఏమైనా ఖాతాలు తెరిచారా?
దీనిపైనా ద‌ర్యాప్తు చేయాలి..
కొంచెం సుప్రీంకోర్టే ఆదేశాలు ఇవ్వాలి...

కాళోజీ గారి మాట‌ల‌ను సీమాంధ్ర మీడియా వ‌క్రీక‌రిస్తే ఎలా ఉంటుంది... ?

'దోపిడి చేసే ప్రాంతేతరులను
దూరం దాకా తన్ని తరుముతం
ప్రాంతం వాడే దోపిడి చేస్తే
ప్రాణంతోనే పాతర వేస్తం *  అన్న కాళోజీ గారి మాట‌ల‌ను సీమాంధ్ర మీడియా వ‌క్రీక‌రిస్తే ఎలా ఉంటుంది... ?   దానిపైన ఒక‌వేళ ప్రెస్ కౌన్సిల్ క‌మిటీని ఏర్పాటు చేస్తే ఆ క‌మిటీ ఏమ‌ని నివేదిక ఇచ్చి ఉండేది...  ?

ఈ శ‌తాబ్ద‌పు అత్య‌త్త‌మ జోక్‌...

తెలంగాణ ప్ర‌భుత్వాన్ని చూసి సీమాంధ్ర మీడియా భ‌య‌ప‌డిపోతోంద‌ట‌... ఈ శ‌తాబ్ద‌పు అత్య‌త్త‌మ జోక్‌...  ఈ జోక్ వేసిన ప్రెస్ కౌన్సిల్ క‌మిటీకి అవార్డు ఇవ్వాల్సిందే...  ఇంకా న‌య్యం ఉచ్చ పోసుకుంటుంద‌ని కూడా రాయ‌లేదు...!!!
నిజంగా వీరికి భ‌యం, జ‌ర్న‌లిజం విలువ‌లు ఉన్నాయా?  అన్న‌ది ఇక్క‌డి ప్ర‌జ‌ల‌ను అడిగిన త‌ర్వాత నిర్ధారించుకుంటే బాగుండేది...

ప్రెస్ కౌన్సిల్ క‌మిటీ నివేదిక‌లపై ప‌చ్చ ప‌త్రిక‌ల వార్త‌లు చూసి బేజారు కావొద్దు..

ప్రెస్ కౌన్సిల్ క‌మిటీ నివేదిక‌లపై ప‌చ్చ ప‌త్రిక‌ల వార్త‌లు చూసి బేజారు కావొద్దు..
ఎందుకంటే అందులో మీడియాకూ కూడా చుర‌కలు అంటించే వ్యాఖ్య‌లు ఉండి ఉండొచ్చు..
కానీ వాటిని అవి ప్ర‌చురించుకోవు క‌దా.. ఎందుకంటే అది వాటి నైజం..

ఇక ఈ క‌మిటీ నివేదిక‌తో ఒరిగేది ఏమీ ఉండదు.. ఎందుకంటే..
 ప్రెస్ కౌన్సిల్‌కు మంద‌లించే అధికారం మాత్ర‌మే ఉంటుంది... ఈ  మంద‌లింపుల‌ను ఎవ‌రూ ప‌ట్టించుకునే స్థితిలో లేరు.. ఇవి నా మాట‌లు కాదు ప్రెస్ కౌన్సిల్ ఛైర్మ‌న్ జ‌స్టిస్‌ మార్కండేయ క‌ట్జూ మొన్న స్వ‌యంగా సెల‌విచ్చారు... మొన్నా మ‌ధ్య రాధాకృష్ణ కు కూడా ఈయ‌న చాలా చీవాట్లు పెట్టాడు.. పాపం రాధాకృష్ణ ప‌ట్టించుకున్న పాపాన పోలేదు... ! మ‌నం అన‌వ‌స‌రంగా ఆందోళ‌న చెందొద్దు..

అక్టోబ‌రు 31కు రెండు ప్రాధాన్యాలు..

అక్టోబ‌రు 31కు రెండు ప్రాధాన్యాలు..
ఆ రోజున ఇద్దరు కాంగ్రెస్ నేత‌ల జ‌యంతి, వ‌ర్దంతి ఉంది..
తొలి హోంమంత్రి  స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ జ‌యంతి ఉంది..
అదే స‌మ‌యంలో తొలి మ‌హిళా ప్ర‌ధాని ఇందిరాగాంధీ వ‌ర్ధంతి ఉంది.. ఈ రోజున ఆమె హ‌త్య‌కు గుర‌య్యారు..
గ‌తంలో ఇందిరా గాంధీ వ‌ర్ధంతిని జాతీయ సంక‌ల్ప దివ‌స్‌గా(నేష‌న‌ల్ ఇంటిగ్రేష‌న్ డే) జ‌రిపే వారు..
ఇప్పుడు స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ జ‌యంతిని జాతీయ ఐక్య‌తా దినంగా(నేష‌న‌ల్ యూనిటీ డే) జ‌ర‌పాల‌ని ఎన్డీయే ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది..

నాకు తెలిసి ఇద్ద‌రు నేత‌లు కూడా దేశం కోసం కృషి చేసిన వారే..  ఇద్ద‌రూ దేశాన్ని ఏకం చేసేందుకు ప్ర‌య‌త్నించారు... ఇద్ద‌రినీ గౌర‌వించుకోవాల్సిందే...

రాంజెఠ్మ‌లానీ అండ్ అద‌ర్స్‌కు నా అభినంద‌న‌లు..

న‌ల్ల  ధ‌నం విష‌యంలో సుప్రీంకోర్టులో కేసు వేసిన రాంజెఠ్మ‌లానీ అండ్ అద‌ర్స్‌కు నా అభినంద‌న‌లు..
మొత్తానికి స్వ‌తంత్ర భార‌త చ‌రిత్ర‌లో న‌ల్ల‌ధ‌నం కేసులో కొంద‌రి పేర్ల‌ను క‌క్కించ‌గ‌లిగారు..
సుప్రీంకోర్టు మెట్టికాయలు వేస్తే గానీ ప్ర‌భుత్వాలు స్పందించ‌ని ప‌రిస్థితి...
సిట్ ఏర్పాటు చేసి ద‌ర్యాప్తు చేయ‌మ‌ని సుప్రీంకోర్టే ఆదేశించాలి...
జాబితా విడుద‌ల చేయ‌మ‌ని సుప్రీంకోర్టే ఆదేశించాలి..
అన్నీ సుప్రీంకోర్టే చెబితే ఇక ప్ర‌భుత్వాలుఎందుకు?
అస‌లు న‌ల్ల‌ధ‌నం జాబితాలో సోనియా గాంధీ లేరా? రాబ‌ర్ట్ వాద్రా లేడా?  రాజీవ్ గాంధీ పేరు లేదా?
అస‌లు రాజ‌కీయ నాయ‌కులంతా స‌చ్ఛీలురేనా?
న‌ల్ల ధ‌నాన్ని వెన‌క్కి తెప్పించి దేశంలోని అప్పుల‌ను తీర్చ‌డం ఎప్పుడు...
ఆ అప్పుల‌న్నీ తీరిపోగా త‌లా ఒక ల‌క్ష రూపాయ‌లు పంచొచ్చ‌ని చెప్పారు.. నా ల‌క్ష ఎప్పుడొస్తుందో?  అస‌లు వ‌స్తుందా?

ఆ క‌మిటీ నివేదిక వ‌స్తే ఇంతేస్థాయిలో ఆంధ్ర‌జ్యోతి, ఈనాడులు వేసుకుంటాయా?

ప్రెస్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన ఒక నివేదిక వ‌చ్చింది..
మ‌రి చంద్ర‌బాబునాయుడు మీడియా ప్ర‌తినిధుల‌పై నిషేధం విధించ‌డంపై నియ‌మించిన క‌మిటీ నివేదిక వ‌చ్చిందా?
లేక ఆ క‌మిటీని మేనేజ్ చేసేశారా?
ఆ క‌మిటీ నివేదిక‌లో చంద్ర‌బాబునాయుడికి చీవాట్లు పెడుతూ నివేదిక వ‌స్తే ఇంతేస్థాయిలో ఆంధ్ర‌జ్యోతి, ఈనాడులు వేసుకుంటాయా?

Sunday 26 October 2014

ప్రెస్ కౌన్సిల్ రెండు క‌మిటీల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు గుర్తు...మ‌రి నివేదిక‌లు ఏమ‌య్యాయి....?

ప్రెస్ కౌన్సిల్ రెండు క‌మిటీల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు గుర్తు...
ఒక‌టేమో మీడియాపై కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై విచార‌ణ కోసం..
ఇంకోటేమో కొన్ని మీడియా సంస్థ‌ల ప్ర‌తినిధుల‌ను చంద్ర‌బాబు త‌న ప్రెస్‌మీట్ల‌కు అనుమ‌తించ‌క‌పోవ‌డంపై..
-----------------------------
మ‌రి ఒక విచార‌ణ జ‌రిగింది..
ఇంకోటి జ‌రిగిందా?
-----------------------
మ‌రి నివేదిక‌లు ఏమ‌య్యాయి....?

గాలి జ‌నార్ద‌న్‌రెడ్డిపై కేసు ఏమైంది...

గాలి జ‌నార్ద‌న్‌రెడ్డిపై కేసు ఏమైంది...
జ‌గ‌న్‌పై వార్త‌లు ఏమ‌య్యాయి...
అల్లుడి గారి గిల్లుడు ఏమైంది...?
అన్నీ మాయ‌మ‌య్యాయా?
కేసులు ర‌ద్దు అయ్యాయా?
ఏం జ‌రుగుతోంది?
అనంత‌పురంను దోచుకున్న బ‌ళ్లారి బ్ర‌ద‌ర్స్‌పై చ‌ర్య‌లు ఉంటాయా?

ఈ వ‌ర్షం మంచిదేనా...?

భారీ వ‌ర్షాలు ప‌డ‌టం లేదు క‌దా పంట‌ల‌కు న‌ష్టం ఏమీ ఉండ‌ద‌నుకుంటాం.. కానీ వాతావ‌ర‌ణం పూర్తిగా మ‌బ్బుప‌ట్టి ఉండ‌టం కూడా మంచిది కాదు.. పంట చేతి కొచ్చే స‌మ‌యంలో ఎండ ఉండాలంటారు... ఈ విష‌యంలో వ్య‌వ‌సాయ శాస్త్ర‌వేత్త‌లే చెప్పాలి... పంట‌లు ఏ ద‌శ‌లో ఉన్నాయి.. ఎప్పుడు చేతికి వ‌స్తాయి అన్న విష‌యాన్ని...

కృష్ణ జ‌లాల వివాదంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వంత పాడుతున్నారు.. రేపు మ‌హారాష్ట్ర‌తో గోదావ‌రి జ‌లాల వివాదం వ‌స్తే...?

కృష్ణ జ‌లాల వివాదంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వంత పాడుతున్నారు..
రేపు మ‌హారాష్ట్ర‌తో గోదావ‌రి జ‌లాల వివాదం వ‌స్తే...?
అక్క‌డ బీజేపీదే అధికారం... ఎలా స్పందిస్తారో..?
------------------------------
మ‌హారాష్ట్ర‌లో బీజేపీ అధికారంలోకి వ‌స్తోంది...
ఇక మ‌హారాష్ట్రలో గ‌త కాంగ్రెస్ ప్ర‌భుత్వం గోదావ‌రిపై చేప‌ట్టిన 12కు పైగా అక్ర‌మ ప్రాజెక్టులు ఆగుతాయా?
గ‌తంలో తెలంగాణ బీజేపీ నేత‌లు ఈ విష‌యంపై పెద్ద ఎత్తున ఉద్య‌మాలు చేశారు...
ఇప్పుడు కూడా చేస్తారా?
రేపు జ‌ల వ‌న‌రుల విష‌యంలో వివాదాలు వ‌స్తే మ‌హారాష్ట్ర ప‌క్ష‌మే ఉంటారా?
ఇప్ప‌టికీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వంత పాడుతున్న తెలంగాణ టీడీపీ అండ్ కో..
ఇక రేప‌టి నుంచి మ‌హారాష్ట్ర‌కు వంత పాడే పార్టీ వ‌స్తుందా?
--------------------------
ఇక్క‌డే స్థానిక పార్టీల అవ‌స‌రాలు వ‌స్తాయి..
జాతీయ పార్టీలైతే ఏమీ మాట్లాడ‌లేవు..
అదే తెలంగాణ‌లో ఓ నాలుగు ప్రాంతీయ పార్టీలు ఉంటే కేంద్రంతో కొట్లాడొచ్చు.
మ‌న స‌మ‌స్య‌ల‌పై తీవ్ర రూపంలో ఆందోళ‌న చేయొచ్చు...

ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ ఉంటేనే వార‌సుల‌కు, బంధువుల‌కు రాజ‌కీయ‌ భ‌విష్య‌త్తు..

ప్ర‌ముఖ నేత‌ల‌ వార‌సులు, బంధువులు అయినంత మాత్రాన ఎన్నిక‌ల్లో గెల‌వాల‌ని లేదు...
ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ ఉంటేనే వార‌సుల‌కు, బంధువుల‌కు రాజ‌కీయ‌ భ‌విష్య‌త్తు..
హ‌ర్యానాలో సుష్మ స్వ‌రాజ్ సోద‌రి పోటీ చేశారు..
ఆమెకు సుష్మ స్వ‌రాజ్ మ‌ద్ద‌తు ఉంది...
అయినా ఆమె ఎన్నిక‌ల్లో స్వ‌తంత్ర అభ్య‌ర్థి చేతిలో ఓడిపోయారు..
-----------------------
అయితే మ‌హారాష్ట్ర‌లో గోపీనాథ్ ముండే ఇద్ద‌రు కుమార్తెలు స‌త్తా చాటారు.
ఒక‌రు ఎంపీగా రికార్డు స్థాయి మెజారిటీతో గెలిస్తే.. మ‌రొక‌రు ఎమ్మెల్యేగా గెలిచారు..
తండ్రి వార‌సురాళ్లుగా నిరూపించుకున్నారు.. జ‌నం మ‌న‌సును గెలుచుకున్నారు..
అయితే ఇది క‌ల‌క‌లాం క‌ల‌సిరాదు..
ప‌ని చేయ‌కుంటే జ‌నం తిర‌స్క‌రిస్తారు....
--------------------------
వార‌స‌త్వం వ‌ల్ల ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు సీటు సులువుగా దొరుకుతుంది కావొచ్చు..
కానీ జ‌నం ఆమోదం పొందే ఓటు దొర‌క‌దు అన్న‌ది గుర్తుంచుకోవాలి...
---------------------------
ఇది సినిమా వార‌స‌త్వం లాంటిది కాదు... ప్ర‌జ‌లు చూడ‌కున్నా కూడా త‌మ థియేట‌ర్ల‌లో 100 రోజులు ఆడించ‌డానికి...
రాజ‌కీయ చ‌ద‌రంగం.. ప్ర‌తి ఎత్తూ కీల‌క‌మే... !!!

2001 నుంచీ ఈ మాట‌లు వింటూ వ‌స్తున్నాను....

సినీ న‌టుడు నాగార్జున‌కు చెందిన ఎన్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ పై నివేదిక పూర్త‌యింది... మ‌రి నివేదిక‌ను అమ‌లు చేస్తే అరిచి గీ పెడ‌తారు... అమ‌లు చేయ‌కుంటే కూడా అర‌చి గీ పెడ‌తారు...
---------------------
నివేదిక‌ను అమ‌లు చేసి క‌ట్ట‌డాలు కూల్చితే నాగార్జున కేసీఆర్‌కు డ‌బ్బు ఇవ్వ‌లేదు.. అందుకే ఈ కూల్చివేత‌లు అంటారు..
అమ‌లు చేయ‌క‌పోతే నాగార్జున‌కు అమ్ముడుపోయిన కేసీఆర్ అంటారు....
--------------
2001 నుంచీ ఈ మాట‌లు వింటూ వ‌స్తున్నాను....

లోక‌ల్ పార్టీలు ఉండొద్దు అని కొంద‌రు అంటున్నారు..

లోక‌ల్ పార్టీలు ఉండొద్దు అని కొంద‌రు అంటున్నారు.. మ‌రి ఈ జాతీయ పార్టీలు లోక‌ల్ పార్టీల‌తో పొత్తు లేకుండా ఎన్ని సీట్లు తెచ్చుకుంటాయి... ప్ర‌తి రాష్ట్రంలోనూ లోక‌ల్ పార్టీల‌తో జాతీయ పార్టీల‌ పొత్తులు... కూట‌మిగా పోటీ.. ఇది సొంత గెలుపా? కూట‌మి గెలుపా తెలియ‌ని ప‌రిస్థితులు... !!
మ‌హారాష్ట్రంలోనూ బీజేపీ ఆరు చిన్నా చిత‌క పార్టీల‌తో పొత్తు పెట్టుకుంది... మ‌రి సొంతంగా బ‌లం ఉంటే ధైర్యంగా పోటీ చేయొచ్చు క‌దా...
టీడీపీతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో, ఎండీఎంకేతో త‌మిళ‌నాడులో.. ఇంకా ఎన్ని పార్టీల‌తో పొత్తులు ఉన్నాయో ? ఆకాలీల‌తో పంజాబ్‌లో...
------------------------------------------------
ఇవ‌న్నీ ప్రాంతీయ పార్టీలే... దేశాన్ని విభ‌జించే ఈ పార్టీల‌తో(కొంద‌రు వ్య‌క్తులు లోక‌ల్ పార్టీలు దేశాన్ని విభ‌జిస్తున్నాయ‌ని అంటున్నారు) పొత్తు పెట్టుకుంటే వాళ్ల‌ను కూడా విభ‌జ‌న కారులే అంటారా? ఇంకా ఏమైనా అంటారా?

బిల్లులో ఉన్న‌వి అమ‌లు చేసే విష‌యంలో ఇంత వివ‌క్ష ఎందుకో?

పోల‌వ‌రం ముంపు మండ‌లాల‌ను ఆంధ్రాలో క‌ల‌ప‌డం యూపీఏ నిర్ణ‌యం కాబ‌ట్టే మేం దాన్ని బ‌ల‌వంతంగా అమలు చేశాం...
మ‌రి తెలంగాణ‌కు 53.7 శాతం విద్యుత్ ఇవ్వాల‌న్న‌ది కూడా యూపీఏ నిర్ణ‌యం కదా.. దాన్ని బ‌ల‌వంతంగా అమ‌లు చేయొచ్చు క‌దా...
----------------------------
ఏం చంద్ర‌బాబునాయుడంటే భ‌య‌మా?
బిల్లులో ఉన్న‌వి అమ‌లు చేసే విష‌యంలో ఇంత వివ‌క్ష ఎందుకో?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ ప్రాంతీయ పార్టీల‌దే హ‌వా...మ‌రి మ‌న వ‌ద్ద‌నో...!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ ప్రాంతీయ పార్టీల‌దే హ‌వా...
ఆ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల విష‌యానికి వ‌స్తే టీడీపీ, వైసీపీ రెండూ ఒక్క‌టే..
శ్రీ‌శైలం నీటి విష‌యంలోనే ఇది రుజువైంది..
తుపాన్ స‌మ‌యంలోనూ ఇద్ద‌రూ క‌లిసి కేంద్రం నుంచి ప‌రిహారానికి డిమాండ్ చేశారు..
--------------
మ‌రి మ‌న వ‌ద్ద‌నో...!!

నోట్‌: మొన్న కృష్ణ జిల్లా ఉప ఎన్నిక‌లో, నేడు క‌ర్నూల్ జిల్లా ఉప ఎన్నిక‌ల్లోనూ టీడీపీ, వైసీపీలు ప‌ర‌స్ప‌రం పోటీ చేసుకోలేదు...

త‌మిళ‌నాడుకు మ‌న‌కు ఉన్న తేడా ఒక్క‌టే..

--------------------
అక్క‌డ ఉన్నవ‌న్నీ లోక‌ల్ పార్టీలు..
జాతీయ పార్టీల‌కు, క‌మ్యూనిస్టుల‌కు చోటు లేనేలేదు..
త‌మిళ‌నాడు ప్ర‌యోజ‌నాలకు సంబంధించిన అంశాలు వ‌స్తే అంద‌రూ ఒక్క‌ట‌వుతారు..
కేంద్రంపైనే కొట్లాడుతారు...
మ‌న తెలంగాణ‌కు ఉన్న‌ది ఒక‌టే లోక‌ల్ పార్టీ...
ఇంకా లోక‌ల్ పార్టీలు రావాల్సిన అవ‌స‌రం ఉంది..
తెలంగాణ‌లో ఎన్ని స్థానిక పార్టీలు వచ్చినా నేను స్వాగ‌తిస్తాను..
అలాగే తెలంగాణ ప్ర‌యోజ‌నాల‌కు సంబంధించిన విష‌యాల్లో అవ‌న్నీ ఏక‌తాటిపై ఉండి కొట్లాడాలి..
అంతే కానీ ప‌క్క రాష్ట్రం వాళ్ల కోసం కొట్లాడితే వాళ్ల‌ను బొంద పెట్టాల్సిందే...

రైతుల్లో ఆత్మ స్థైర్యాన్ని నింపాలి...

http://www.dnaindia.com/mumbai/report-six-farmer-suicides-ushers-in-black-diwali-for-vidarbha-2028709
విజ్ఞ‌ప్తి...
విద‌ర్భ అయినా తెలంగాణ అయినా స‌రే నేల‌రాలుతున్న రైతుల్లో ఆత్మ స్థైర్యాన్ని నింపాలి... వాళ్ల మ‌ర‌ణాల‌పై రాజ‌కీయాలు చేయొద్దు.. వ్య‌వ‌సాయాన్ని లాభ‌సాటి చేయ‌డంపై దృష్టి పెట్టాలి... అంతే కానీ చ‌నిపోతున్న వారి సంఖ్య‌ను లెక్కిస్తూ కూర్చోవ‌ద్దు...

ఈ రోజు ప‌త్రిక‌లు లేవు.. అందుకే నాకు ప‌ని లేదు..

ఈ రోజు ప‌త్రిక‌లు లేవు.. అందుకే నాకు ప‌ని లేదు.. నా వార్త‌లు-వాస్త‌వాల‌కూ సెల‌వు దొరికింది... ప‌త్రికా ప‌ఠ‌నం అనే వ్య‌స‌నాన్ని అల‌వాటు చేశారు.. ఇది మంచి వ్య‌స‌న‌మే కానీ ఈ వ్య‌స‌నాన్ని ఆసరాగా చేసుకొని కొన్ని మీడియా సంస్థ‌లు విషం నిండిన వార్త‌ల‌ను మ‌న‌పైకి చిమ్ముతున్నాయి.. మ‌న‌కు స్లోపాయిజ‌న్ ఎక్కిస్తున్నాయి... అందుకే ఈ వ్య‌స‌నానికి దూరమ‌య్యాను... ఇప్పుడు మ‌న‌సు ప్ర‌శాంతంగా ఉంటోంది... మ‌రో ప‌ది మందిని కూడా ఈ విషప్ర‌భావం నుంచి బ‌య‌ట‌కు తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాను...!!!

ఆరోగ్య తెలంగాణ మ‌న ఆశయం కావాలి

- ఉద్యోగుల‌కు ఆంక్ష‌లులేని ఆరోగ్య బీమా కార్డులు జారీ చేశారు. బాగానే ఉంది. ప్ర‌భుత్వానికి కృత‌జ్ఙ‌త‌లు. నిరుపేద‌కు ఆరోగ్య‌శ్రీ కార్డు ఉంది. ఉన్నోళ్లు ఎలాగూ డ‌బ్బుల‌తో కార్పొరేట్ వైద్యం అందుకుంటాడు. జ‌ర్న‌లిస్టులు, ఇత‌ర‌త్రా రంగాల వారు ఎలాగో ప్ర‌భుత్వం నుంచి సంస్థ‌ల నుంచి బీమా కార్డులు పొందుతున్నారు. కానీ సామాన్య జ‌నం ప‌రిస్థితి ఏమిటి? అటు ఆరోగ్య‌శ్రీ అర్హుల కంటె కాస్త ఎక్కువ‌, ఉన్నోళ్ల‌కు చాలాదూరంలో ఉన్న ఒక వ‌ర్గం స‌మాజంలో అత్య‌ధికంగా ఉంది. ముఖ్యంగా 2004 త‌ర్వాత (యాదృశ్చిక‌మో, విధానాల ఫ‌లిత‌మో వైఎస్ హ‌యాంలో) అటు పేద‌, ఇటు ధ‌నిక మ‌ధ్య అంత‌రం విప‌రీతంగా పెరిగి ఈ మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గం ఎక్కువైంది. మ‌రి వీరి ఆరోగ్యం ప‌రిస్థితి ఎలా?. ముఖ్యంగా రూ.15వేల నుంచి రూ.25వేల మ‌ధ్య ప్రైవేటు రంగంలో ప‌ని చేస్తున్న వారు కుటుంబంలో ఎవ‌రికైనా అనారో్గ్య స‌మ‌స్య వ‌స్తే క‌నీసంగా రూ.20-30వేలు పెట్టాల‌న్నా అప్పుల పాల‌వుతున్నారు. ఆ వ‌డ్డీలు క‌ట్ట‌లేక‌, ఇటు కుటుంబాన్ని పోషించ‌లేక మ‌ధ‌న‌ప‌డుతున్నారు. అందుకే వీరిపై దృష్టి సారించాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఉంది. అయితే అంద‌రికీ ప్ర‌భుత్వం పూర్తి స‌హ‌కారం చేయ‌డం సాధ్యం కాదు. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ పాల‌సీల‌పై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంచాలి. అవ‌స‌ర‌మైతే నిర్బంధ‌ విద్య మాదిరిగా నిర్బంధ హెల్త్ పాల‌సీని రూపొందించాలి. చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో పేద నుంచి ధ‌నికుడి వ‌ర‌కు వైద్యం కోసం ఒక్క పైసా ఖ‌ర్చు చేయ‌రు. అంతా బీమామీద‌నే ఆధార‌ప‌డ‌తారు. కొన్ని చోట్ల దీన్ని మ్యాండేట‌రీ చేశారు. అలాగే తెలంగాణ‌లో కూడా హెల్త్ ఇన్సూరెన్స్‌ను మ్యాండేట‌రీ చేయాలి. వీలైతే ప్ర‌భుత్వం కొంత వాటా భ‌రించేందుకుగానీ త‌క్క‌వ మొత్తంలో అన్ని ర‌కాల సేవ‌లు అందించే కంపెనీల‌ను ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకురావ‌డంగానీ చేయాలి. లేక‌పోతే ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌ను ఇన్సూరెన్స్ కంపెనీల‌తో టైఅప్ చేసి అంతిమంగా ఇన్సూరెన్స్ ఉన్న వారు న‌యాపైసా లేకుండా ల‌క్ష‌ల వైద్య సేవ‌లు అందుకునేలా చ‌ర్య‌లు తీసుకోవాలి. దీని ద్వారా ప్ర‌భుత్వంపై ఆర్థికంగా భారం లేకుండానే సామాన్యుడికి ఆరోగ్య భ‌ద్ర‌త ల‌భిస్తుంది. అంద‌రం ఆశించే ఆరోగ్య తెలంగాణ సాధ్య‌మ‌వుతుంది. మిత్రులంద‌రూ ఒక్క‌సారి ఆలోచించండి. ప్ర‌ధానంగా ఎన్నారైలు దీనిపై కాస్త ధ్యాస పెట్టినా మంచి ప్రాజెక్టుగా మారి, తెలంగాణ‌లో సామాన్యుడి ఆరోగ్యానికి భ‌ద్ర‌త ల‌భిస్తుంది. ఆరోగ్య తెలంగాణ‌లో దీపావళి వెలుగులు మ‌రింత శోభ‌ను పంచుతాయి. జై తెలంగాణ‌, మీ అసాంజే.

చిన్న విజ్ఞ‌ప్తి.. ఒక్క‌ యూనిట్ విద్యుత్‌ను ఆదా చేయండి..


తెలంగాణ‌లో మొత్తం కోటి కుటుంబాలున్నాయి... అందులో ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లో 50 నుంచి 60 ల‌క్ష‌ల కుటుంబాలు ఉంటాయి.. కుటుంబానికి రోజుకు ఒక్క యూనిట్ విద్యుత్‌ను రోజూ ఆదా చేయండి చాలు... విద్యుత్ కొర‌త‌ను అధిగ‌మించొచ్చు... రైతుల‌కు విద్యుత్ ఇవ్వొచ్చు... విద్యుత్ సంక్షోభాన్ని కొంత వ‌ర‌కు అధిగమించొచ్చు..

Monday 20 October 2014

అస‌లు వీళ్లు కార్పొరేట్ మ‌నుషులా? ప్ర‌జా మ‌నుషులా?

అస‌లు వీళ్లు కార్పొరేట్ మ‌నుషులా? ప్ర‌జా మ‌నుషులా?
రెండు ఛానెళ్ల ప్ర‌సారాల కోసం ఇంత‌గా ధ‌ర్నాల్లో పాలుపంచుకుంటున్నారు..
మ‌రి మీడియా ఛానెళ్ల‌లో అక్ర‌మ తొలగింపులు, కార్మిక చ‌ట్టాల ఉల్లంఘ‌న‌పై ఏ నాడైనా ధ‌ర్నా చేశారా?
క‌నీసం మీడియా ఛానెళ్ల‌లో జీతాల కుంభ‌కోణం గురించి ఆలోచించారా?

కేవ‌లం యాజ‌మాన్యాల కోస‌మే ధ‌ర్నా చేస్తారా?
ఉద్యోగుల వెత‌ల‌ను ప‌ట్టించుకోరా?
ఇలాంటి వాళ్ల‌ను ఏమంటారో నాకు తెలియ‌దు..

కాంగ్రెస్ ముక్త్ భార‌త్‌లో బీజేపీకి స‌హ‌క‌రిస్తున్న ఎంఐఎం...!!

ఈ వ్యాఖ్య చాలా మందికి కోపం తెప్పించొచ్చు.. కానీ ఒక‌టి మాత్రం నిజం... ఎంఐఎం ఎక్క‌డ పోటీ చేస్తుందో అక్క‌డ కాంగ్రెస్‌కు న‌ష్టం త‌ప్ప లాభం లేద‌న్న‌ది సుస్ప‌ష్టం... మైనారిటీల్లో చాలామంది కాంగ్రెస్ వైపున‌కు మొగ్గుచూపుతారు.. అయితే ఎంఐఎం స్వ‌యంగా పోటీ చేస్తే ఆ ఓట్లు ఆ పార్టీ వైపున‌కు మ‌ళ్లుతున్నాయి.. ఈ ఫ‌లితాల‌ను ఇటీవ‌ల మ‌నం తెలంగాణ‌లోనూ చూశాం... నిజామాబాద్ అర్బ‌న్‌, జూబ్లీహిల్స్‌, సికింద్రాబాద్ తదిత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకును కొల్ల‌గొట్ట‌డంలో ఎంఐఎం స‌ఫ‌లీకృత‌మైంది.... ఫ‌లితంగా కాంగ్రెస్‌కు కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఘోర ప‌రాభ‌వం త‌ప్ప‌డం లేదు...
అలాగ‌ని ఎంఐఎం-బీజేపీ మ‌ధ్య ఒప్పందం ఉంద‌ని నా ఉద్దేశం కాదు.. కానీ ఎంఐఎం ఎంత పుంజుకుంటే కాంగ్రెస్‌కు అంత‌క‌న్నా ఎక్కువ న‌ష్టం.. బీజేపీ నినాదాన్ని చేరుకోవ‌డం అంతే సులువు...
---------------------------------
ఏది ఏమైనా ముంబ‌యిలో పాగా వేసిన ఎంఐఎంకు అభినంద‌న‌లు... మీరు కేవ‌లం మ‌తం ఆధారంగా రాజ‌కీయాలు చేస్తే సుదీర్ఘ‌కాలం ఉండ‌లేరు.. ద‌ళిత‌, మైనారిటీ, బీసీల‌తోపాటు అగ్ర‌వ‌ర్ణాల‌ను క‌లుపుకుపోండి... ఊహించ‌ని రీతిలో ఫ‌లితాలు ఉంటాయి.. మ‌త రాజ‌కీయాలు, మందిరాల‌పై రాజ‌కీయాలకు కాలం చెల్లింది... ఈ విజ్ఞ‌ప్తిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోండి...

యాజ‌మాన్యాల‌కు త‌గిన శిక్ష వేయించేలా చూడాలి...

బియాస్ ఘ‌ట‌న‌లో వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కాలేజీ నిర్ల‌క్ష్యాన్ని, బాధితుల‌కు త‌గిన ప‌రిహారం ఇవ్వ‌ని వైనాన్ని కూడా ఈ క‌మిటీ వెలికి తీయాలి... అలాగే గ‌తంలో పులిచింత‌ల‌కు వెళ్లిన స‌మ‌యంలో ఇద్ద‌రు విద్యార్థులు చ‌నిపోతే ఆ విష‌యాన్ని మీడియాలో పెద్ద‌గా రానివ్వ‌కుండా చేసిన ఉదంతంపైనా బాధిత త‌ల్లిదండ్రుల అభిప్రాయాల‌ను సేక‌రించాలి... విజ్ఞాన యాత్ర‌ల పేరిట విహార యాత్ర‌ల‌కు తీసుకెళుతూ.. రానివారిని బెదిరించే యాజ‌మాన్యాల‌కు త‌గిన శిక్ష వేయించేలా చూడాలి... నివేదిక పార‌ద‌ర్శ‌కంగా ఉండాలి... కార్పొరేట్ కాలేజీ మాఫియాల భ‌ర‌తం ప‌ట్టేదిగా ఉండాలి..

ఆ ధైర్యం ఉందా? ఆ ధైర్యం ఉంటేనే స్వేచ్ఛ గురించి ప్ర‌సంగాలు ఇవ్వండి...

ఇందిరాపార్కు ధ‌ర్నా బాగుంది... ఆ ప‌క్క‌నే వీ6, టీ న్యూస్‌ల‌ను ఆంధ్రాలోనూ ప్ర‌సారం చేయాల‌ని ఓ రెండు ఫ్లెక్సీలు పెట్టి దానిపైన కూడా మాట్లాడితే బాగుంటుంది....ఆ ధైర్యం ఉందా? ఆ ధైర్యం ఉంటేనే స్వేచ్ఛ గురించి ప్ర‌సంగాలు ఇవ్వండి...

ఈ సంక్షోభ ప‌రిస్థితుల్లో లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి పిలుపే మ‌న‌కు ఆద‌ర్శం కావాలి..



విజ్ఞ‌ప్తి...
-----------------------
ఈ సంక్షోభ ప‌రిస్థితుల్లో
లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి పిలుపే మ‌న‌కు ఆద‌ర్శం కావాలి..
ఆయ‌న‌ ఒక రోజు ఉప‌వాసానికి పిలుపునిచ్చారు..
---------------------
మ‌నం ఏసీలు, కూల‌ర్లు, ఫ్రిడ్జిల వాడ‌కాన్ని ఆపేద్దాం..
మ‌నం ఫ్యాన్లు లేకున్నా బ‌తుకుతాం...
కానీ విద్యుత్ లేక రైతు చ‌స్తున్నాడు.. ఆయ‌న‌ను బ‌తికించేందుకు మ‌నం కృషి చేద్దాం...
ప‌ల్లెల్లో వెలుగు నింపుదాం...
ఈ విష‌యంలో నాయ‌కులు ఆద‌ర్శంగా నిల‌వాలి...
అవ‌స‌ర‌మైతే ఆరు బ‌య‌ట స‌మావేశాలు పెట్టుకోండి... విద్యుత్ పొదుపునకు కృషి చేయండి......
-------------------------
1965 ప్రాంతంలో దేశంలో ఆహార కొర‌త‌, మ‌రోవైపు పాకిస్థాన్ యుద్ధం సంభ‌వించింది... ఈ స‌మ‌యంలో దేశం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఆ స‌మ‌యంలో అప్ప‌టి ప్ర‌ధాని లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి గారు ఇచ్చిన పిలుపు దేశాన్ని సంక్షోభం నుంచి గ‌ట్టెక్కించింది.. ఆహార దిగుమ‌తులు స‌రిప‌డ‌ని ప‌రిస్థితులు ఉన్న స‌మ‌యంలో ఆయ‌న ఆహార భారాన్ని త‌గ్గించేందుకు వారంలో ఒక రోజు ఉప‌వాసం ఉండాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చాడు.. అది సోమ‌వార‌మైనా, మంగ‌ళ‌వార‌మైనా స‌రే అని సూచించారు...ఇది చేస్తూనే ఆహార సమృద్ధ దేశంగా మార్చ‌డానికి ఆయ‌న‌ ప్ర‌ణాళిక‌లు రూపొందించారు.. ఆ రోజుల్లో దేశ‌ ప్ర‌జ‌లు దాన్ని తూచా త‌ప్ప‌కుండా పాటించారు.. క‌ఠోర ఉప‌వాసాన్ని చేశారు... విచిత్రం ఏంటంటే దేశం ఇప్పుడు ఆహార స‌మృద్ధిని సాధించిన‌ప్ప‌టికీ ఉత్త‌ర భార‌త దేశంలోని కొన్ని ప్రాంతాల్లో దేశం కోసం ఒక రోజు ఉప వాసాన్ని కొన‌సాగిస్తున్నారు.. లాల్ బ‌హ‌దూర్ శాస్త్రిగారి పిలుపును, స్ఫూర్తిని కొన‌సాగిస్తున్నారు..
1965లో లాల్‌బ‌హ‌దూర్ శాస్త్రిగారు క‌ర్ష‌కుల్లో ప్రేర‌ణ కోసం జై కిసాన్‌ నినాదాన్ని ఇచ్చారు.. ఇక యుద్ధంలో సైనికుల‌కు ఉత్తేజాన్ని నింపేలా జై జ‌వాన్ నినాదాన్ని ఇచ్చారు...
-------------------------------------
ఇప్పుడు మ‌న తెలంగాణ సంక్షోభంలో ఉంది..తీవ్ర‌మైన‌ విద్యుత్ సంక్షోభంలో ఉంది.. ఈ స‌మ‌యంలోనూ మ‌న‌కు లాల్ బ‌హ‌దూర్ శాస్త్రిలా పిలుపునిచ్చేవారు కావాలి.... ముఖ్య‌మంత్రి కేసీఆర్ గారే ఆ బాధ్య‌త‌ను తీసుకోవాలి... విద్యుత్ డిమాండ్‌ను త‌గ్గించేందుకు ప్ర‌జ‌లంద‌రూ త‌మ‌వంతుగా విద్యుత్ పొదుపును పాటించాల‌ని సూచించాలి.... ప్ర‌భుత్వ‌, ప్రైవేటు, గృహాల‌లో ఏసీల వాడాకాన్ని పూర్తిగా నిషేధించాలి.... ఇంకా సౌర విద్యుత్ వినియోగం సాధ్య‌మ‌య్యే చోట దాన్ని ప్రోత్స‌హించాలి...
మొన్న మోడీ గారు చెప్పిన‌ట్లు పౌర్ణ‌మి రోజున వీధి దీపాలు ఆపేయ‌డం చేయాలి....
గ్లోబ‌ల్ వార్మింగ్‌ను త‌గ్గించేందుకు ఎర్త్ అవ‌ర్‌ను నిర్వ‌హిస్తారు.. అలాంటి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాలి.... దుబారాను అరిక‌ట్ట‌డ‌మూ.. స్వ‌చ్ఛందంగా ఏసీలు, కూల‌ర్లు, ఫ్రిడ్జిల వాడాకాన్ని ఈ సంక్షోభ స‌మ‌యంలో నిలిపేయ‌డం ఉత్త‌మం...
------------------------------
క‌రెంట్ లేక రైతులు చ‌నిపోతున్నారు... ఈ స‌మ‌యంలో మ‌న ఫ్రిడ్జిలు పెట్టుకొని చ‌ల్ల‌ని నీళ్లు తాగ‌క‌పోతే చ‌చ్చిపోం క‌దా... ఇక ఏసీలు లేక‌పోతే చ‌చ్చిపోయే ప‌రిస్థితి లేదుక‌దా... ఆలోచించండి... ఇది ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లో ఉన్న ప్ర‌జ‌లు మాత్ర‌మే చేయ‌గ‌లిగిన ప‌నులు... ఎందుకంటే గ్రామాల్లో అస‌లే క‌రెంట్ ఉండ‌టం లేదు కాబ‌ట్టి... సంక్షోభ స‌మ‌యంలో తిట్టుకోవ‌డాలు చేయ‌డం క‌న్నా నిర్మాణాత్మ‌క సూచ‌న‌లు ఇస్తే బాగుంటుంది... ఆ సూచ‌న‌లు ఎవ‌రు ఇచ్చిన ప్ర‌భుత్వం స్వీక‌రించాలి... ఇది నా విజ్ఞ‌ప్తి..
నోట్: ప్ర‌భుత్వ పెద్ద‌లు త‌మ ఇళ్ల‌లోనూ ఏసీల వినియోగాన్ని పూర్తిగా నిలిపేయాలి... ప్ర‌జ‌ల‌కు ఆద‌ర్శంగా నిల‌వాలి...

బ‌ల‌వంత‌పు విరాళాలు

హుదూద్ బాధితుల కోసం రూ.3 కోట్ల‌తో స‌హాయ నిధి మొద‌లుపెట్టిన డ్రామోజీ... త‌న సంస్థ‌లోని ఉద్యోగుల ఒక‌రోజు వేత‌నాన్ని దానికి ప్ర‌క‌టించాల‌నే యోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలిసింది. దీంతో సంస్థ‌లోని ఉద్యోగులు ఆందోళ‌న చెందుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉద్యోగుల ప‌రిస్థితి క‌క్క‌లేక‌.. మింగ‌లేక‌.. అన్న‌ట్లుగా త‌యారైంది. మా ప్రాంతంలో ఎన్ని బాధ‌లొచ్చినా ఒక్క‌నాడు ఒక్క పైస కూడా ఇవ్వ‌లేని త‌మ‌ను బ‌ల‌వంతంగా మ‌రోసారి విరాళాల జాబితాలోకి గుంజుతున్న వైనాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఆప‌ద‌లో ఉన్న వారికి సాయం చేయ‌డం మంచిదేగానీ... అది రెండువైపులా ఉంటే బాగుంటుంద‌నేదే స‌గ‌టు తెలంగాణ‌వాది ఆవేద‌న‌.

తెలంగాణ వాట‌ర్ గ్రిడ్‌కు సూచ‌న‌లిచ్చే మీ విజ్ఙానం... పోల‌వ‌రం విష‌యంలో వీరికి ఎందుకు ప‌నికి వ‌స్త‌లేదు?.

ప్ర‌ముఖ ఇంజినీర్ హ‌నుమంత‌రావు గారికి కృత‌జ్ఙ‌త‌లు. మంచో చెడో... తెలంగాణ వాట‌ర్ గ్రిడ్‌పై మీ అభిప్రాయాన్ని చెప్పారు. దానిని మేం సానుకూలంగా చూస్తాం. మీరు నిపుణులు కాబ‌ట్టి మీ కోణంలో ఏదైనా మంచి ఉందా అని ఆలోచిస్తాం. కానీ సీమాంధ్రోళ్ల లెక్క పోల‌వ‌రం డిజైన్ మార్చాల‌నే మీ ప్ర‌తిపాద‌న‌ను బుట్ట దాఖ‌లు చేసిన‌ట్లు... అప్ప‌టిదాకా మిమ్మ‌ల్ని ఆకాశానికి ఎత్తి, ఆ ప్ర‌తిపాద‌న చేయ‌గానే మిమ్మ‌ల్ని ప్ర‌చారానికి దూరం చేసిన సీమాంధ్ర మీడియా లెక్క మేం విస్మ‌రించం. కాక‌పో్తే మా బాధ‌ల్ల‌... పోల‌వ‌రంపై మీరు గొంతెత్తి అరిచినా ప‌ట్టించుకోని ఈ సీమాంధ్ర మీడియా తెలంగాణ వాట‌ర్ గ్రిడ్‌పై మీరిచ్చే సూచ‌న‌ల‌ను (ముందు ఆంధ్ర‌జ్యోతి, ఇప్పుడు సాక్షి, రేపు ఈనాడు?) ప‌తాక శీర్షిక‌లో ఇస్తుంది. కానీ పోల‌వ‌రం ఇప్ప‌టికీ బ‌ర్నింగ్ ఇష్యూగా ఉన్నా ఎందుకు మీ ప్ర‌తిపాద‌న‌ను ఒక్క‌సారైనా తెర‌పైకి తేవ‌డం లేదు?. సాధ్యాసాధ్యాల‌పై టీవీల్లో ఎందుకు చ‌ర్చ‌లు పెట్ట‌డం లేదు?. క‌నీసం పోల‌వ‌రం అంశం వ‌చ్చిన‌పుడు మిమ్మ‌ల్ని ఈ మీడియా ఎందుకు విస్మ‌రిస్తుంది?. తెలంగాణ వాట‌ర్ గ్రిడ్‌కు సూచ‌న‌లిచ్చే మీ విజ్ఙానం... పోల‌వ‌రం విష‌యంలో వీరికి ఎందుకు ప‌నికి వ‌స్త‌లేదు?. ఇదే మా బాధ‌.
---
ఇక్క‌డ తెలంగాణ వాట‌ర్ గ్రిడ్‌లో వ్య‌యం ప్ర‌ధానం కాదు. శాశ్వ‌త నీటి ల‌భ్య‌త ముఖ్యం. అందుకే కృష్ణా, గోదావ‌రి నీటిని మ‌ళ్లించ‌డ‌మే శ‌ర‌ణ్యం. పైగా అస‌లు తెలంగాణ వాటాను స‌క్ర‌మంగా వాడుకునే భాగ్య‌మే క‌ల‌గ‌డం లేదు. ఈరూపంలోనైనా కొంత వాడుకునే వెసులుబాటు ఉంటుంది. పైగా తెలంగాణ‌లోని న‌ల్లొండ లాంటి జిల్లాల భూగ‌ర్భ‌జ‌లాలు చాలాచోట్ల విష‌తుల్యంగా... ఫ్లోరైడ్ భూతంలో చిక్కుకున్నాయి. అందుకే భూగ‌ర్భ‌జ‌లాల కంటే న‌దుల నీరే శ్రేయ‌స్క‌రం అనేది ఇక్క‌డి నిపుణుల అభిప్రాయం.

సందేహం...

సందేహం...
ఒక జ‌ర్న‌లిస్టు ఏదైనా పార్టీలో చేరి ఆ పార్టీ ప‌ద‌వి అనుభ‌విస్తూ ప‌త్రిక‌ల్లో వ్యాసాలు రాస్తే సీనియ‌ర్ సంపాద‌కులు అనే రాస్తారా? లేక ఆ పార్టీలో అనుభ‌విస్తున్న ప‌ద‌విని కూడా ప్ర‌స్తావిస్తారా?

Sunday 19 October 2014

మోడీ గారికి అభినంద‌న‌లు...

--------------------------
హ‌ర్యానాలో బీజేపీ అధికారంలోకి రావ‌డానికి, మ‌హారాష్ట్ర‌లో అతిపెద్ద పార్టీగా అవ‌త‌రించ‌డానికి ఆయ‌న ముమ్మ‌ర ప్ర‌చార‌మే దోహ‌ద‌ప‌డింది.. అన్నీ తానై బీజేపీని ముందు నిలిపాడు. మ‌హారాష్ట్ర‌లో మెరుగైన ఫ‌లితాలు వ‌చ్చిన‌ప్ప‌టికీ సంకీర్ణ ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌నుంది... బీజేపీకి ఒకే విజ్ఞ‌ప్తి... శివ‌సేన‌తో పొత్తు పెట్టుకోవ‌డం ఉత్త‌మం.. ఎన్సీపీ వైపు చూడ‌టం వ‌ల్ల త‌ప్పుడు సంకేతాలు వెళ‌తాయి...

రాజ‌గురువు తెలంగాణ‌కు ఏం చేశాడు?

------------------
మ‌న వ‌ద్ద స‌ర్క్యులేష‌న్ ఎక్కువ‌గా ఉంటుంది..
మ‌న వ‌ద్ద లాభాలు ఆర్జిస్తారు..
మ‌న ఉద్యోగుల‌ను ఉద్యోగాల నుంచి నిర్దాక్ష్యిణ్యంగా తొల‌గిస్తారు..
ఆ ఉద్యోగులు మనో వేధ‌న‌తో చ‌నిపోతే చిల్లి గ‌వ్వ ఇవ్వ‌డానికి చేతులు రాలేదు...
తుపాన్లు వ‌స్తే మాత్రం ఆంధ్రా కోసం మ‌న నుంచి విరాళాలు సేక‌రిస్తారు...?
ఒక్క‌సారి కాదు రెండుసార్లు కాదు ఏడాదికోసారి ఇలా సేక‌రిస్తూనే ఉంటారు...
మ‌రి తెలంగాన‌లో క‌ర‌వు వ‌చ్చిన‌ప్పుడు... రైతులు పిట్ట‌ల్లా చ‌నిపోతున్న‌ప్పుడు ఆంధ్రా నుంచి మ‌న‌కు విర‌ళాలు తీసుకురారు ఎందుకు?
మేధావుల‌రా.. ప్ర‌జ‌లారా ఆలోచించండి... గుంట‌న‌క్క‌ల భ‌ర‌తం ప‌ట్టండి...
ముందు మ‌న రైతుల‌ను ఆదుకుందాం...
------------------------------

మ‌న‌దీ ఒక బ‌తుకేనా?..ప్రాంతాన్ని బ‌ట్టి మాన‌వ‌త్వం మారుతుందా?


మ‌న క‌ష్టాలు క‌ష్టాలుకావా?
తెలంగాణ వాదుల్లారా ఒక్కసారి ఆలోచించండి...
---------------------------------
ఈ గ‌డ్డ‌పై వ్యాపారం మొద‌లుపెట్టారు... ఈ నీటిని తాగారు.. ఈ నేల‌ను వాడుకున్నారు.. వేల కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తారు.. క‌లిసున్న‌ప్పుడు వంచించారు.. చివ‌ర‌కు రాజ్యాంగ‌బ‌ద్ధంగా విడిపోయిన త‌ర్వాత కూడా ఆంధ్ర పాట పాడుతున్నారు. నిన్న రాధాకృష్ణ‌, కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు నిర్మించాల్సిన రాజ‌ధాని కోసం విరాళాల కోసం త‌న ప‌త్రిక‌ను వినియోగించాడు. ఇప్పుడు రామోజీరావు మూడు జిల్లాలు న‌ష్ట‌పోయాయ‌ని ఏకంగా రూ.3 కోట్ల‌తో స‌హాయ నిధిని ఏర్పాటు చేశాడు.
కానీ, ఏ నాడు క‌ర‌వు కోర‌ల్లో చిక్కుకున్న తెలంగాణ కోసం, కాలం క‌ల‌సి రాక అప్పుల బాధ‌తో బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్పుడుతున్న రైతాంగం కోసం, ఫ్లోరైడ్ బాధితుల కోసం, వ‌ల‌స పోతున్న పాల‌మూరు జ‌నం కోసం, చివ‌ర‌కు నిస్వార్థంగా తెలంగాణ ఉద్య‌మంలో అసువులు బాసిన అమ‌రుల‌ కుటుంబీల కోసం విరాళాలు సేక‌రించ‌లేదు. స‌హాయ నిధులు ప్రారంభించ‌లేదు.. నాడైనా, నేడైనా సీమాంధ్ర వాసుల‌కు చీమ కుట్టినా దాన్ని ప్ర‌పంచ బాధ‌ను చేసి జోలె ప‌ట్టారు.
మ‌న బాధ‌ను ప‌ట్టించుకోకుండా, మ‌న క‌ష్టాల్లో పాలుపంచుకోకుండా ఏమీ ప‌ట్ట‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్న వీరి ప‌త్రిక‌ల‌ను కొనాలా? ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వాలా? వాళ్ల వ్యాపార ఎదుగుద‌ల‌కు స‌హ‌క‌రించాలా? మ‌న‌దీ ఒక బ‌తుకేనా?
మానవ‌త్వం అన్న‌ది ప్రాంతాన్ని బ‌ట్టి మారుతుందా? అంటే వీళ్ల దృష్టిలో తెలంగాణ ప్ర‌జ‌లు మ‌నుషులు కాదా? వాళ్ల బాధ‌లు బాధ‌లు కావా? వాళ్ల క‌ష్టాలు క‌ష్టాలు కావా? వాళ్ల క‌న్నీళ్ల‌ను తుడిచే బాధ్య‌త వీరికి లేదా?
మీరే ఆలోచించండి... !!!

Saturday 18 October 2014

మేక్ ఏ విష్ సంస్థ‌కు కృత‌జ్ఞ‌త‌లు..



కేసీఆర్‌, తెలంగాణ పోలీసుల‌కు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు కృత‌జ్ఞ‌త‌లు...
-----------------
ప్ర‌ముఖుల‌ను మృత్యువుతో పోరాడుతున్న‌ చిన్నారుల‌ వ‌ద్ద‌కు తీసుకెళ్తున్నందుకు ధ‌న్య‌వాదాలు..
మొన్న కేసీఆర్‌, నిన్న ఓ చిన్న బాబును సీపీగా చేయ‌డం.. నేడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఖ‌మ్మం ర‌ప్పించ‌డం అన్ని మంచి విష‌యాలు...
అలాగే ప్ర‌ముఖులు కూడా త‌మ విలువైన స‌మ‌యాన్ని కేటాయిస్తుండ‌టం గొప్ప విష‌య‌మే..
ఇది ఇలాగే కొన‌సాగాలి.... ఈ మ‌హోన్న‌త ఆశ‌యంలో పాలుపంచుకున్న అంద‌రికీ నా హృద‌య పూర్వ‌క కృత‌జ్ఞ‌తలు..

న‌గ‌దు బ‌దిలీ మ‌ళ్లా షూరు...

న‌గ‌దు బ‌దిలీ మ‌ళ్లా షూరు... గ్యాస్ సిలిండ‌ర్ డ‌బ్బులు మ‌ళ్లా ఖ‌తాల్లో జ‌మ అవుతాయి... ఇంకా అనేక ప‌థ‌కాల‌కు ఇది వ‌ర్తించే అవ‌కాశం ఉంది..
డీజిల్ ధ‌ర‌ల‌పై నియంత్ర‌ణ ఎత్తేశారట‌.... ఇక అంత‌ర్జాతీయ ధ‌ర‌ల‌కు అనుగుణంగా ధ‌ర‌ల పెరుగుద‌ల‌/త‌గ్గుద‌ల ఉంటుంది..
-----------------------------------------
యూపీఏ నిర్ణ‌యాల మాదిరిగా ఉన్నాయ‌ని వ్య‌తిరేకించొద్దు...

గుజ‌రాత్ మోడ‌ల్ అభివృద్ధి జాతీయ స్థాయికి రావ‌డానికి ఎన్నేళ్లు ప‌ట్టింది...?

మోడీ గారు రాక‌ముందే గుజ‌రాత్‌లో విద్యుత్‌, అభివృద్ధి, ప‌రిశ్ర‌మ‌లు అన్నీ వ‌చ్చాయా?
మోడీ గారు గుజ‌రాత్‌ను దాదాపు 13 ఏళ్లు పాలించాడు క‌దా... మ‌రి అన్ని గ్రామాల‌కు విద్యుత్ ఎప్పుడు ఇచ్చారు?
విద్యుదీక‌ర‌ణ పూర్తి కావ‌డానికి ఎన్ని ఏళ్లు ప‌ట్టింది...
విద్యుత్ సంక్షోభం నుంచి ఎలా రాష్ట్రాన్ని బ‌య‌ట ప‌డేశారు...?
గుజ‌రాత్ మోడ‌ల్ అభివృద్ధి జాతీయ స్థాయికి రావ‌డానికి ఎన్నేళ్లు ప‌ట్టింది...?

లారీల్లో దిగుమ‌తి చేసుకోవ‌డానికి అది బొగ్గు, ట‌మోటాలు, ఆలుగ‌డ్డ‌లు కాదు..

కొర‌త ఉంటే రైళ్ల‌లో, లారీల్లో దిగుమ‌తి చేసుకోవ‌డానికి అది బొగ్గు, ట‌మోటాలు, ఆలుగ‌డ్డ‌లు కాదు... క‌రెంట్‌.... రాత్రికి రాత్రే లారీల్లో, రైళ్ల‌లో ఉత్త‌ర భార‌తం నుంచి దిగుమ‌తి చేసుకోలేం... అలా చేసుకునే అవ‌కాశం ఉంటే ఉత్త‌రాఖండ్ నుంచో, ఛ‌త్తీస్ గ‌ఢ్ నుంచో నాలుగు లారీల‌ల్లా ఓ 2 వేల మెగావాట్ల‌ను త‌ర‌లించుకొని వ‌చ్చే వాళ్లు...!!!

వంద రోజుల్లో తెలంగాణ‌లో అన్నీ జ‌రిగిపోవాలి....!!

వంద రోజుల్లో న‌ల్ల ధ‌నం రాలేదు... వంద రోజుల్లో ధ‌రల నియంత్ర‌ణ కాలేదు... వంద రోజుల్లో తెలంగాణ‌లో అన్నీ జ‌రిగిపోవాలి....!!

ఇది నేటి జ‌ర్న‌లిజం...

-------------------------
రేపు ఓటేసేందుకు వెళ్లి లైన్లో నిల‌బ‌డి గుండెపోటుతో చ‌నిపోయినా ఓటేసేందుకు వెళ్లి తిరిగి వ‌స్తుంటే రోడ్డు ప్ర‌మాదంలో చ‌నిపోయినా స‌రే ఈ ఎన్నిక‌లు అవ‌స‌ర‌మా?
అస‌లు ఈ ప్ర‌జాస్వామ్యం అవ‌స‌ర‌మా? ఎన్నిక‌ల సంఘంపై హ‌త్యాభియోగం న‌మోదు చేస్తారా? అని కూడా ప్ర‌శ్నించే రోజు వ‌స్తుంది...
-------------------
నోట్‌: వాళ్ల‌కు న‌చ్చ‌ని పార్టీలు ఉంటేనే ఇలాంటి వార్త‌లు వ‌స్తాయి... అదే న‌చ్చిన పార్టీలు ఉంటే ఇలా జ‌ర‌గ‌దు... అంతా ఫీల్ గుడ్ వార్త‌లే ఉంటాయి...

Friday 17 October 2014

తుపాన్లు వ‌చ్చినా వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ డ్యామేజీ కాదు.... ఎందుకు?

తెలంగాణ‌లో ఉద్య‌మం జ‌రిగితే హైద‌రాబాద్ బ్రాండ్ ఇమేజ్ డ్యామేజీ అవుతుంది...
--------------
తుపాన్లు వ‌చ్చినా వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ డ్యామేజీ కాదు.... ఎందుకు?

ల‌క్ష్యం నిర్దేశించుకుంటేనే స‌రిపోదు క‌దా...

స్వ‌చ్ఛ భార‌త్ ల‌క్ష్యం 2019...
స్వ‌చ్ఛ తెలంగాణ ల‌క్ష్యం 2017....
మ‌రి ఆ దిశ‌గా అంద‌రూ క‌ద‌లాలి... ల‌క్ష్యం నిర్దేశించుకుంటేనే స‌రిపోదు క‌దా... సాధించేందుకు ప్రేర‌ణ క‌లిగించాలి...

హైద‌రాబాద్‌లో రోజు 4 గంట‌లు క‌రెంట్ కోత‌లు ఉంటేనే ప‌రిశ్ర‌మ‌లు త‌ర‌లిపోతాయ‌ట‌....

హైద‌రాబాద్‌లో రోజు 4 గంట‌లు క‌రెంట్ కోత‌లు ఉంటేనే ప‌రిశ్ర‌మ‌లు త‌ర‌లిపోతాయ‌ట‌....
-------------
మ‌రి వారం రోజులు...ప‌ది రోజులు క‌రెంటే లేకుండా స్వాతంత్ర్యానికి పూర్వ‌పు రోజులను త‌ల‌పిస్తున్న చోట‌కు ప‌రిశ్ర‌మ‌లు క్యూ క‌డ‌తాయ‌ట‌....
ప‌త్రిక‌లు చేతిలో ఉంటే ఏదైనా చెబుతారు... ప్ర‌చారం చేస్తారు...

రూ.70 వేల కోట్లు, 80 వేల కోట్ల న‌ష్టం అంటూ లెక్క‌లు క‌డుతున్నారు.. ఎందుకిలా?

ఇన్నేళ్లు రాష్ట్రం విడిపోతే మాకేం ఉంది... విశాఖ నుంచి నెల్లూరు దాక ఉప్పునీరే త‌ప్ప‌...అంటూ వ్యాఖ్యానించారు... ఏ ప్రాంతాన్నైనా పునాదుల నుంచి నిర్మించుకోవాల‌న్నారు.. అస‌లు విశాఖ‌ను న‌గ‌రంగానే గుర్తించ‌లేదు....
--------------
ఇప్పుడేమో రూ.70 వేల కోట్లు, 80 వేల కోట్ల న‌ష్టం అంటూ లెక్క‌లు క‌డుతున్నారు.. అప్పుడు విశాఖ‌లో ఏముంది అంటూ త‌క్కువ చేసి చూపారు.. ఇప్పుడేమో హైద‌రాబాద్‌తో స‌రిస‌మాన‌మైన సిటీగా కేంద్రానికి ప్రొజెక్ష‌న్లు ఇస్తున్నారు.... ఎందుకిలా?

కొంద‌రు ఆటోవాలాల‌కు విజ్ఞ‌ప్తి....

మీట‌ర్ పై ఆటోల‌ను న‌డిపించండి..
---------------------
మొన్న ఎన్నిక‌ల్లో ప్ర‌క‌టించిన‌ట్లుగానే తెలంగాణ ప్ర‌భుత్వం మీకు ర‌వాణా ప‌న్నును మాఫీ చేసింది... వేధింపులు లేకుండా చూస్తామ‌ని హామీ ఇచ్చింది... మీరు చెప్పిన‌ట్లే మీట‌ర్ రేట్ల‌ను నిర్ధారించుకున్నారు... అన్నీ మీరు కోరిన‌ట్లే జ‌రుగుతాయి.. అయినా కూడా మీరు నిర్ధారించుకున్న మీట‌ర్ మీద మీరు వెళ్ల‌డానికి ఎందుకు ఇబ్బంది...?   అలాంట‌ప్పుడు మీట‌ర్లు ఎందుకు?  పీకి ప‌డేయొచ్చు క‌దా... మీట‌ర్లు ఉంటాయి.. అయినా వేయ‌రు..  ఇది స‌బ‌బేనా...  ఒక‌వేళ మీరు దుకాణంలోకి వెళ్లి ఏదైనా కొనుగోలు చేసిన‌ప్పుడు అందులో నిర్ధారించిన రుసుము కంటే ఎక్కువ చెల్లించ‌మ‌ని ఎవ‌రైనా అడిగితే మీకు ఎలా ఉంటుంది...?  వారితో గొడ‌వ ప‌డుతారా లేదా?  అలాంట‌ప్పుడు మీరు పెట్టుకున్న మీట‌ర్ ఛార్జీలపై రావ‌డానికి నిరాక‌రించ‌డం న్యాయ‌మో.. అన్యాయ‌మో మీరే ఆలోచించాలి....  !!

త్వ‌ర‌లోనే న‌గ‌దు బ‌దిలీ మ‌ళ్లా జ‌రిగే అవ‌కాశం ఉంది..

ఆధార్‌
న‌గ‌దు బ‌దిలీ
పెట్రోల్ ధ‌ర‌ల నిర్ధార‌ణ‌ను చ‌మురు కంపెనీల‌కు ఇవ్వ‌డం ఇవ‌న్నీ కొన‌సాగుతాయి.
త్వ‌ర‌లోనే న‌గ‌దు బ‌దిలీ మ‌ళ్లా జ‌రిగే అవ‌కాశం ఉంది..
ఆధార్ నెంబ‌ర్ లేని వాళ్లు తీసుకోవ‌డ‌మే ఉత్తమం....

న‌ల్ల‌ధ‌నంపై అప్పుడేమ‌న్నారు..

న‌ల్ల‌ధ‌నంపై అప్పుడేమ‌న్నారు.. ఇప్పుడేమంటున్నారు.. రేపు ఈనాడు, ఆంద్ర‌జ్యోతి పేప‌ర్ల‌లో ఇవ‌న్నీ వ‌స్తాయా?
అప్ప‌టి క‌థ‌నాలు వ‌స్తాయా? ఎడిటోరియ‌ళ్లు వ‌స్తాయా?
ఛ‌త్తీస్‌గ‌ఢ్ లైన్‌పై తెగ హ‌డావుడి చేసిన ఆంధ్ర‌జ్యోతి రాధాకృష్ణ గారి ప‌త్రిక రాత‌లు ఎలా ఉంటాయో... లేక‌పోతే రేపు తెలంగాణ స‌మ‌స్య‌ల‌నో.. ఇత‌ర అంశాల‌నో ప్రాధాన్య వార్త‌లుగా వేస్తారా?
ఏది ఏమైనా ఈ న‌ల్ల‌ధ‌నం రావ‌డం అసాధ్య‌మే.. ఆ డ‌బ్బు వ‌స్తే మ‌న అప్పులు తీరి త‌లా ఒక‌రికి డ‌బ్బును పంచొచ్చ‌ని చేసిన ప్ర‌చారం అంతా ఉత్తుత్తిదే....
కేవ‌లం కాంగ్రెస్‌,, బీజేపీ పార్టీల‌కు మాత్రమే పేర్లు తెలుస్తాయి... అవ‌స‌ర‌మున్న‌ప్పుడు ఆ పేర్లు వారికి ప‌నికొస్తాయి... రేపు కేంద్రంలో ఇంకో పార్టీ వ‌స్తే వాళ్ల‌కు న‌ల్లధ‌న కుబేరుల పేర్లు తెలుస్తాయి... వాళ్లూ ఆ పేర్ల‌ను వాడుకుంటారు... ప్ర‌జ‌ల‌కు తెలియవు... ఎవ‌రెంత దోచుకొని దాచుకున్నారో అస‌లే తెలియ‌దు...

Thursday 16 October 2014

సిగ్గుమాలిన జ‌ర్న‌లిజం... ఎన్ని త‌ప్పులు చేస్తుందో...

సిగ్గుమాలిన జ‌ర్న‌లిజం...
ఎన్ని త‌ప్పులు చేస్తుందో...
క‌నీసం పొర‌పాట్ల‌ను ప్ర‌ముఖంగా వేసుకోవ‌డానికి సిగ్గుప‌డుతుంది...
------------------------
తాటికాయ అంత అక్ష‌రాల‌తో త‌ప్పుడు క‌థ‌నాలు రాస్తారు.. జ‌నంలో త‌ప్పుల‌ను జొప్పించాల‌ని చూస్తారు... పొర‌పాట్ల‌ను మాత్రం క‌నిపించీ క‌నిపించ‌న‌ట్లు వేసుకుంటారు... ఇదేం పైత్యం రాధాకృష్ణ గారూ... మొన్న సినీ న‌టుడు చ‌ల‌ప‌తిరావు ఇంట‌ర్వ్యూలో రేపుల గురించి ప్ర‌ముఖంగా వార్త వేసుకొని... క్ష‌మించండి అంటూ చిన్న‌గా వేసుకుంటారా...? ఎంత పెద్ద వార్త రాశారో.. ఏ పేజీలో రాశారో.. అదే పేజీతో ఈ పొర‌పాటు జ‌రిగిన విష‌యాన్ని అంగీక‌రించాలి....

వీళ్లేం డాక్ట‌ర్లో ఏమో....!!!

జూనియ‌ర్ డాక్ట‌ర్లు గ్రామీణ ప్రాంతాల్లో త‌ప్ప‌నిస‌రిగా ఏడాది ప‌ని చేయాల‌న్న నిబంధ‌న తొల‌గించాలా?
మూడేళ్లు ప‌నిచేయాల‌న్న నిబంధ‌న‌ను ప్ర‌భుత్వం ఏడాదికి త‌గ్గించింది... అయినా ప‌ట్టువీడ‌టం లేదా?
వీళ్లేం డాక్ట‌ర్లో ఏమో....!!!
-----------------------------
నా మిత్రుడి అనుభ‌వం చెబుతాను..
------------------
ఆయ‌న డాక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు... న‌గ‌రంలో ఆయ‌న‌కు ఉద్యోగం వ‌చ్చింది.. గ్రామీణ ప్రాంత‌ల్లో మూడేళ్లు ప‌నిచేస్తే 30 శాతం కోటా ఉంటుంద‌ట‌... అదే న‌గ‌రాల్లో ఆరేళ్లు ప‌నిచేస్తే ఆ కోటా ల‌భిస్తుంద‌ట‌... పాపం మా మిత్రుడికి న‌గ‌రంలో పోస్టింగ్ వ‌చ్చింది... ఆరేళ్ల‌పాటు ప‌నిచేస్తేనే 30 శాతం పీజీ కోటాలో సీటు పొందొచ్చు.. అయితే న‌గ‌రంలో ఓ 15 రోజులు ప‌నిచేశాడో లేదో ఇయ‌న‌ను ఇక గ్రామీణ ప్రాంతాల‌కు డిప్యుటేష‌న్‌పై పంపార‌ట‌... దాదాపు 14 నెల‌లుగా గ్రామాల్లోనే ఆయ‌న డిప్యుటేష‌న్ మీద ప‌నిచేస్తున్నాడు.. ఎందుకిలా డిప్యుటేష‌న్ల‌పై పంపుతున్నార‌ని ఆరా తీస్తే ఆస‌క్తిక‌ర విష‌యం వెల్ల‌డైంద‌ట‌.... గ్రామాల్లో పోస్టింగ్‌లు తీసుకుంటున్న వారు లంచాలు ఇచ్చి డిప్యుటేష‌న్ల‌పై న‌గ‌రాల‌కు వ‌స్తున్నార‌ట‌... అంటే వాళ్లు న‌గ‌రాల్లో ఉంటూ గ్రామీణ కోటా కింద పీజీ సీట్లు కొట్టేసేందుకు ఈ ఎత్తుగ‌డ‌లు చేస్తున్నారు.. ఇక ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లో ప‌నిచేసే వాళ్లు డిప్యుటేష‌న్ల పేరిట‌ గ్రామాల‌కు వెళ్తున్నారు... క‌నీసం నేను గ్రామంలోనే ప‌నిచేస్తాను... అక్క‌డే పోస్టింగ్ ఇవ్వండ‌ని అడిగినా ఇవ్వ‌డం లేద‌ట‌...
-------------------------------------
ఏమో అనుకున్నా కానీ.... రాజ‌కీయాలు చేయ‌డంలో కొంద‌రు డాక్ట‌ర్లు కూడా ఎవ‌రికీ తీసుపోయేలా లేరు... లేక‌పోతే గ్రామీణ ప్రాంతాల్లో ప‌నిచేయ‌డానికి వీళ్ల‌కు అభ్యంత‌రం ఏంటి? కొంత‌కాలం ప‌నిచేస్తే ఏమైనా కొంప‌లు మునుగుతాయా?

ఇందుమూలంగా తెలియ‌జేయున‌ది ఏమ‌న‌గా...

-------------------
రాధాకృష్ణ గారి ప‌త్రిక‌లో గ‌మ‌నించండి... అంటూ ఏదో చెబుతున్నారు.. కాస్త చ‌ద‌వండి.... నిన్న రూ.250 కోట్ల‌కే మంచినీళ్లు వ‌స్తాయ‌ట అంటూ హ‌డావుడి చేసిన మిత్రులు మ‌రీ చ‌ద‌వాలి... !!!

హుస్సేన్‌సాగ‌ర్ ప‌రిర‌క్ష‌ణ ఉద్య‌మంలో అంద‌రూ పాలుపంచుకోవాలి..


ఇది కూడా ఓ స్వ‌చ్ఛ భార‌త ఉద్య‌మ‌మే...
అంద‌రూ క‌ల‌సి రావాలి...
----------------------------------
హుస్సేన్‌సాగ‌ర్ ప‌రిర‌క్ష‌ణ ఉద్య‌మంలో అంద‌రూ పాలుపంచుకోవాలి..
రాజ‌కీయాల‌ను ప‌క్క‌న‌పెట్టాలి...
సుంద‌ర స‌ర‌స్సుగా మారితే ప‌ర్యాట‌కంగా ప్రాచుర్యం పొందుతుంది..
సెయిలింగ్ పోటీలు నిర్వ‌హించుకోవ‌చ్చు...
కేర‌ళా మాదిరిగా ప‌డ‌వ పోటీలు పెట్టొచ్చు...
--------------------------------
కేసీఆర్ ప్ర‌తిపాదించాడు కాబ‌ట్టి ముమ్మాటికీ వ్య‌తిరేకిస్తాం అని అనుకోవ‌డం మూర్ఖ‌త్వం అవుతుంది..
మోడీ చెప్పిన స్వ‌చ్ఛ భార‌త్‌ను అంద‌రూ ఆమోదించారు... పాలుపంచుకుంటున్నారు..
ఇందులోనూ పాలుపంచుకుంటే మంచిది...
ఇక మీడియా ధోర‌ణి ఎలా ఉంటుందో... వేచిచూడాలి...
ఇన్నాళ్లు వినాయ‌క విగ్ర‌హాల నిమ‌జ్జనం వ‌ల్ల స‌ర‌స్సును పాడుచేస్తున్నార‌న్న మేధావులు, మీడియా లోకం ఇప్పుడు ప్ర‌భుత్వానికి అండ‌గా ఉంటుందో... వ్య‌తిరేకంగా ఉంటుందో... కాల‌మే స‌మాధానం చెబుతుంది...
అప్ప‌ట్లో హుస్సేన్‌సాగ‌ర్‌ను కాపాడ‌మ‌ని హైకోర్టుల‌ను ఆశ్ర‌యించిన వారు ఇప్పుడు కూడా ఈ ఉద్య‌మంలో పాలుపంచుకోవాలని విజ్ఞ‌ప్తి...

ఒక చిత్తూరుకే తాగునీరు అందించేందుకు 6 వేల కోట్లు కేటాయిస్తే...

ఒక చిత్తూరుకే తాగునీరు అందించేందుకు 6 వేల కోట్లు కేటాయిస్తే... అప్పుడు రాధాకృష్ణ‌గారి ప‌త్రిక చ‌లించ‌లేదు...
న‌ల్లారి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి కి ఉచిత స‌ల‌హాలు ఇవ్వ‌లేదు....
ఒక జిల్లాకు రూ.6 వేల కోట్లు ర‌క్షిత మంచినీటికి కేటాయిస్తే... మ‌రి 10 జిల్లాలున్న తెలంగాణ‌కు ఎన్ని వేల కోట్లు ఖ‌ర్చ‌వుతాయి....?

ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌తూల్య‌త‌ను కాపాడుకోకుండా తుపాన్లు వ‌స్తాయి..

ఈసారి వాతావ‌ర‌ణం కూడా అనుకూలంగా లేదు.. అందుకే ఈ డిమాండ్‌... వేస‌విలాంటి ప‌రిస్థితులు ఉన్నాయి.. అస‌లు చ‌లికాలం వ‌స్తుంద‌న్న సంకేతాలే లేవు.... భూతాపం పెరుగుతోందేమో.... హ‌రిత హారంతోనే దీనికి విరుగుడు... ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌తూల్య‌త‌ను కాపాడుకోకుండా తుపాన్లు వ‌స్తాయి...వ‌ర‌ద‌లు వ‌స్తాయి... క‌ర‌వులు కాటేస్తాయి... జాగ్ర‌త్త‌గా మ‌స‌లు కోవాలి....

తెలంగాణ మ‌ట్టిలో మాణిక్యం..శంక‌ర‌న్న‌


కార్టూన్ ప్ర‌పంచంలో ఆస్కార్ లాంటి పుర‌స్కారం మ‌న శంక‌ర‌న్న‌ను వ‌రించింది...
64 దేశాల కార్టూనిస్టుల్లో మేటి మ‌న తెలంగాణ వాసి కావ‌డం గ‌ర్వ‌కార‌ణం.
ఇలాంటి కార్టూనిస్టుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రింత ప్రోత్సాహం ఇవ్వాలి..
అంత‌ర్జాతీయ య‌వ‌నిక‌పై తెలంగాణ కీర్తి ప‌తాకను రెప‌రెప‌లాడించిన శంక‌ర‌న్న‌కు అభినంద‌న‌లు...
----------------------------
తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన‌ప్పటి నుంచి క‌ళారంగంలో అన్నీ శుభ‌ప‌రిణామ‌లే ఎదుర‌వుతున్నాయి... ఇందులో భాగంగా తెలంగాణ ప్ర‌భుత్వం దాశ‌ర‌థి, కాళోజీ వంటి తెలంగాణ క‌ళారంగానికి వెన్నెముఖ‌లైన వారి జ‌న్న‌దినాల‌ను అధికారికంగా నిర్వ‌హించింది.. మ‌రోవైపు ఇంజినీర్ న‌వాజ్ జంగ్ జ‌న్మ దినాన్ని ఇంజినీరింగ్ దినోత్స‌వంగా జ‌రిపింది... అలాగే మెట్రో పాలిట‌న్ స‌ద‌స్సు సంద‌ర్భంగా న‌గ‌రానికి వ‌చ్చిన మాజీ రాష్ట్ర‌ప‌తి అబ్దుల్ క‌లాం మ‌న తెలంగాణ ఆర్టిస్టు గుండా ఆంజ‌నేయులు పెయింటింగ్‌ను ఆకాశానికి ఎత్తాడు... త‌న ప్ర‌సంగంలో ప్ర‌పంచానికి చాటాడు..
తాజాగా మ‌న తెలంగాణలో విప్ల‌వాల గ‌డ్డ అయిన న‌ల్ల‌గొండ జిల్లా ముద్దుబిడ్డ, కార్టూనిస్టు శంక‌ర‌న్న కెరీర్‌లో మ‌రోదైన అరుదైన గౌర‌వం ద‌క్కింది. ఇది ఒక‌విధంగా ఆయ‌న‌కే కాదు తెలంగాణ మ‌ట్టికి, భార‌త కార్టూనిస్టుల‌కు ప్ర‌పంచంలో అరుదైన గౌర‌వంగా భావించొచ్చు.. ఈ గ్రాండ్ ప్రి అవార్డు ఆసియా ఖండానికి ద‌క్క‌డం ఇదే తొలిసారి కావ‌డం మ‌రో విశేషం... ఈ అవార్డును ఆయ‌న పొంద‌డం ద్వారా తెలంగాణ పేరు మ‌రోమారు అంత‌ర్జాతీయంగా మారుమోగిన‌ట్లైంది.. శంక‌ర‌న్న ఇంకా మ‌రెన్నో కీర్తి ప్ర‌తిష్ట‌లు సాధించాల‌ని, తెలంగాణ పేరును నిల‌బెట్టాల‌ని తెలంగాణ ప్ర‌జ‌ల త‌ర‌ఫున కోరుకుంటున్నా... క‌ళారంగంలోని పెద్ద‌లు, ప్ర‌తినిధులు ఈ ఖ్యాతిని మ‌రింత విస్తృతం చేసేందుకు ప‌లు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించి శంక‌ర‌న్న‌కు మ‌రింత ప్రోత్సాహాన్ని క‌ల్పించాల‌ని కోరుతూ...
తెలంగాణ అసాంజే...

Wednesday 15 October 2014

పోల‌వ‌రంపైనా హ‌నుమంత‌రావు గారి వాద‌న రాయండి...?

------------------------------
రాధాకృష్ణ గారూ... పోల‌వ‌రంపై ప్ర‌స్తుత డిజైన్ స‌రికాద‌న్న ఇదే హ‌నుమంత‌రావు గారి వాద‌న‌తో మీరు క‌థ‌నం రాయ‌గ‌ల‌రా?
మ‌న‌కు పోల‌వ‌రం అవ‌స‌ర‌మా? అంటూ రాయించ‌గ‌ల‌రా?
ఆంధ్ర‌ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌మెంట్ చేసే ప‌నుల‌న్నీ క‌రెక్టే... తెలంగాణ ప్ర‌భుత్వం చేసేవి త‌ప్పు అన్న రీతిలో మీరు రాస్తున్నారు..
వాట‌ర్ గ్రిడ్ విష‌యంలో హ‌నుమంత‌రావు గారి సూచ‌న‌ను తెలంగాణ ప్ర‌భుత్వం ప‌రిశీలించింద‌నుకోండి... అలాగే పోల‌వ‌రంపైనా ఆయ‌న చేసే సూచ‌న‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప‌రిశీలించేలా మీరు ఒప్పించ‌గ‌ల‌రా?
మేధావిగా, నిపుణుడిగా ఆయ‌న చెప్పిన అన్ని విష‌యాల‌ను స్వీక‌రించే గుణం మీకు ఉన్న‌ప్పుడే ఇలాంటివి రాయించండి...
లేదు ఆంధ్ర‌ప్ర‌దేశ్ నిర్మించే పోల‌వ‌రం విష‌యానికి మాత్రం హ‌నుమంత‌రావు గారి సూచ‌న ప‌నికిరాద‌నుకుంటే.. మీ క‌థ‌నాలు మాకు అన‌వ‌స‌ర‌మే....
ఇక అన్నింటిలోనూ గుజ‌రాత్ న‌మూనా అని పైకి ఎత్తే మీరు.. గుజ‌రాత్ న‌మూనాను అనుస‌రించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యిస్తే మాత్రం అది మ‌న‌కు అవ‌స‌ర‌మా? అన‌డంలోని ఆంత‌ర్యం ఏంటో?
ఇదే వాట‌ర్ గ్రిడ్‌ను దేశ‌మంతా విస్త‌రించాల‌ని మోడీ అంటున్న‌ప్పుడు కూడా మీరు త‌ప్పుప‌ట్ట‌లేదు ఎందుకు?