1

1

Monday, 13 October 2014

ఆర్కే త‌ప్పుడు ప‌లుకులు

నిన్న ఆదివారం ఎడిష‌న్‌లోని ఆర్కే త‌ప్పుడు ప‌లుకులు చ‌దివాను. ఆద్యంతం ప‌రిశీలిస్తే అర్థ‌మైందేందంటే... మీరు, మీ తెలంగాణ స‌మాజం, మీ రాష్ట్రం... అంటూ ఆర్కే ఏదో పక్క రాష్ట్రం వాళ్ల‌ను ప‌ల‌క‌రించిన‌ట్లు ఉంది. నీ రాత‌ల్లోనే నా తెలంగాణ‌, నా తెలంగాణ స‌మాజం అని రాయ‌లేని, చేతులురాని బ‌ట్టెబాజివి నీ మాట‌ల‌ను న‌మ్మేదెవ‌డు?. నిన్న‌టిదాకా ఒక్క ప్యాకేజీతో వార్త‌లు వ‌చ్చేవి. ఇప్పుడు డ‌బుల్ ద‌మాకా ఉన్న‌ట్లుంది. ఒకే ఆర్టిక‌ల్‌లో చంద్ర‌బాబును పొగ‌డాలి... కేసీఆర్‌ను తిట్టాలి. ఎన్ని కోట్ల‌కు ఈ ప్యాకేజీ?. లేకుంటె... చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకారం చేయ‌గానే ఒక్క‌రోజు కూడా ఇక్క‌డ ఉండొద్దు... ఉద్యోగులు ఇబ్బంది ప‌డినా స‌రే మ‌న రాజ‌ధానికి మ‌నం వెళ‌దాం... అని సీఎస్‌తో అన్న‌ట్లు నీ ప‌త్రిక‌ల్నె గొప్ప‌గ రాసిన‌వు. మ‌రి ఏమైంది?. అస‌లు రాజ‌ధాని ఉందా?. నాలుగు నెల‌ల‌వుతున్నా... రాజ‌ధానికి ఒక రూపు ఇచ్చిండా?. తెలంగాణ‌ల రాజ‌ధాని ఉంది.. ప్ర‌పంచ న‌గ‌రాల‌ను త‌ల‌ద‌న్నె హైద‌రాబాద్ ఉంది. ఇప్పుడు కాకుంటె కాస్త ఆల‌స్యంగ‌నైనా అనుకున్న‌దాని కంటే ఎక్కువ వేగంతో అభివృద్ధిని చేసుకునే ఆస్కారం ఉంది. మ‌రి అక్క‌డేముంది?.. అస‌లు చంద్ర‌బాబు నాలుగు నెల‌ల చేసిందేంది?. అస‌లు రాష్ట్ర విభ‌జ‌న తెర‌పైకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి సీమాంధ్రులు కోరుకున్న‌ది రాజ‌ధాని. ఆ ఒక్క ప‌ని చేయ‌లేని చంద్ర‌బాబును నీలాంటి బ‌ట్టెబాజ్‌గాండ్లు ఎంత‌మంది పొడిగినా జ‌నాలు న‌మ్ముతారా?. 
నీవో జ‌ర్న‌లిస్టువా?. నీవో ప‌త్రికాధిప‌తివా?. ఏం రాత‌లు?. చంద్ర‌బాబు, మోడీని పొడిగిండు... నువ్వెందుకు పొగుడ్త‌లేవ్ కేసీఆర్ అంటున్న‌వ్‌. నువ్వు బ్రోక‌రువా?. రాజ‌కీయంగా చూస్తే... బీజేపీ మిత్ర‌ప‌క్షం టీడీపీ. చంద్ర‌బాబు ఎన్డీయే క‌న్వీన‌ర్‌. ఎటొచ్చి కాస్త కేంద్రంలో చంద్ర‌బాబుకు వెసులుబాటు ఉంది. రాజ‌కీయంగా ఇది ఎవ‌రూ కాద‌న‌లేని స‌త్యం. అంత‌మాత్రాన అన్ని రాష్ట్రాల్లో చంద్ర‌బాబు పార్టీ, లేక‌పోతే బీజేపీ అధికారంల ఉండాలె. లేక‌పోతే ఇత‌ర పార్టీల సీఎంలు మ‌నుగ‌డ సాధించ‌లేరా?. మోడీ గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగ ఉన్న‌పుడు మ‌న్మోహ‌న్‌సింగ్‌, సోనియాను పొగిడిండా?. అస‌లు ఎందుకు పొగ‌డాలి. రాజ్యాంగం ప్ర‌కారం కేంద్రం అన్ని రాష్ర్టాల‌కు ఇచ్చే నిధులు, ప్రాధాన్యం తెలంగాణ‌కు ఇస్తుంది. అంత‌కంటే మంచి తెలంగాణ స‌మాజం కూడా ఎక్కువ కోరుకోవ‌డం లేదు. ఎందుకంటే కేంద్రంల ఉన్న ప్ర‌భుత్వ‌మే ఇక్క‌డ ఉండాల‌నే నీ బ‌ట్టెబాజ్ అభిప్రాయం తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఉండి ఉంటె బీజేపీనో, కాంగ్రెస్‌నో గెలిపించుకునే వాళ్లు. నువ్వు చెబుతున్న లాబీయింంగ్‌, పొడ‌డ్త‌లు, బ్రోక‌ర్ ప‌నులు తెలంగాణ వాళ్ల‌కు అవ‌స‌రం లేదు. మా మేథ‌స్సు, సొంత శ‌క్తిపై రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ‌తం. కానీ మోడీ గ‌డ్డం పెంచుకుంటే ఇక్క‌డ సీఎం గ‌డ్డం పెంచుకొని, ఆయ‌న పొర‌క ప‌డితె ఇక్క‌డ పొర‌క ప‌ట్టి కాకా ప‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. నీలాంటి సీమాంధ్ర తొత్తుల‌కు అది అల‌వాటు. అంత‌మాత్రాన కేసీఆర్‌ను కూడా ఆ చెంచా ప‌ని చేయ‌మ‌ని బాజాప్తా రాయ‌డానికి సిగ్గుండాలి.
-ఇంకోటి... అస‌లు కేంద్రం నుంచి తెలంగాణ‌కు వ‌చ్చేది రాకుండా ఏమి ఆగింది?. అస‌లు అలాంటిది జ‌రిగితే ఒక ప‌త్రికాధిప‌తిగా, ఈ నేల మీద ఉన్నోడివిగా నీ బాధ్య‌త‌గా కేంద్రాన్ని వేలెత్తిచూపాలి. ఎండ‌గ‌ట్టాలి. కొత్త‌గా ఏర్ప‌డిన తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా విస్మ‌రిస్తారంటూ కేంద్రాన్ని, ఇక్క‌డున్న ఆ పార్టీ నాయ‌కుల‌ను అక్ష‌రాల ద్వారా చీల్చి చెండాడాలి. కానీ చంద్ర‌బాబు మోడీని ఇంద్రుడు, చంద్రుడు అని పొగుడుతుండు... నువ్వెందుకు పొగ‌డ్త‌లేవు అని కేసీఆర్‌ను నిందిస్తున్నావంటే నీవో బ్రోక‌ర్ అని అర్థ‌మైతుంది. అక్ష‌రాల ద్వారా స‌మాజాన్ని చైత‌న్యం చేయాల్సిన నీవు ఓ సీఎంను ఢిల్లీకి పోయి లాబీయింగ్ చెయి... గ‌డ్డం ప‌ట్టుకో... ఆయ‌న కాళ్లు ప‌ట్టుకో అని ఒక సీఎంను అంటున్నావంటే నీకు సామాజిక బాధ్య‌త ఉందా?. రాజ్యాంగం మీద గౌర‌వం ఉందా?. క‌రెంటుల తెలంగాణ వాటా ఇవ్వ‌కుండా ఎగ్గొడుతున్న చంద్ర‌బాబును నిల‌దీయాల్సిన నీవు... ఆంధ్ర ప్ర‌యోజ‌నాల‌కు కోసం రాజ‌కీయ చ‌తుర‌త ప్ర‌ద‌ర్శించిన‌ట్లు పొగుడుతున్నావ్‌. అంటె రాజ్యాంగ‌బ‌ద్దంగా పార్ల‌మెంటులో చేసిన చ‌ట్టం మీద నీకు గౌర‌వం లేన‌ట్లా?. కొంత‌మంది ఆంధ్ర విద్యార్థుల‌కు ఉప‌కారం వేత‌నం ఇయ్య‌నంటె తెలుగువారు ఇచ్చిపుచ్చుకోవాలి అని శ్రీ‌రంగ‌నీతులు చెప్పిన‌వే. మ‌రి ఆ నీతులు ఇప్పుడు చంద్ర‌బాబుకు ఎందుకు చెప్త‌లేవు. అప్ప‌డు కేసీఆర్ చేసింది రాజ‌కీయ చ‌తుర‌త‌కాదు... విద్వేషాలు రెచ్చ‌గొట్ట‌డం... ఇప్పుడు చంద్ర‌బాబు పున‌ర్విభ‌జ‌న చ‌ట్టాన్ని ఉల్లంఘిస్తె రాజ‌కీయ చ‌తుర‌త‌. అస‌లు నీకు ఈ గ‌డ్డ మీద ఉండే హ‌క్కుందా.. రాధాకృష్ణ‌. ఏబీఎన్ ఛానెల్‌ను కాదు నిన్ను ఈ రాష్ట్రం నుంచి బ‌హిష్క‌రించాలి. .... జైతెలంగాణ‌.

No comments:

Post a Comment