1

1

Saturday 29 November 2014

ఓట‌ర్లుగా న‌మోదు చేయించుకోండి..


ప‌ట్ట భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గ ఎన్నిక‌ల కోసం ఓట‌ర్లుగా న‌మోదు చేయించుకోండి.. అస‌లే ఖ‌మ్మం, వ‌రంగ‌ల్‌, న‌ల్ల‌గొండ నియోజ‌క‌వ‌ర్గాల స్థానానికి ఎన్నిక‌ల జ‌ర‌గ‌నుంది.. గ‌తంలో టీఆర్ఎస్ త‌ర‌ఫున పోటీ చేసిన దిలీప్ కుమార్ స్థానం ఇదే.  ఈ ఎమ్మెల్సీ ఎన్నిక‌లు తెలంగాణ ప్ర‌భుత్వ ఫ‌లితీరుకు ద‌ర్ప‌ణంగా నిల‌వ‌డం ఖాయం. విద్యావంతులు మాత్ర‌మే త‌మ ఓటు హ‌క్కును ఉప‌యోగించుకుంటారు. సో ప్ర‌భుత్వం ప‌నితీరుపై విద్యావంతుల మ‌నోభావాల‌కు ఈ ఎన్నిక‌లు నిద‌ర్శ‌నంగా ఉంటాయి.. 

మ‌న కేబుల్ ఆప‌రేట‌ర్లు దీనిపైన కూడా కొంచెం దృష్టిపెట్టాలి.. !!!

మొన్న మ‌న పొరుగున ఉన్న ఆంద్రా రాష్ట్రంలో ఓ 10 రోజులు ప‌ర్య‌టించాను. అక్క‌డ హోట‌ల్‌లో బ‌స చేశాను.. తెలంగాణ‌ల ఏం జ‌రుగుతుందో తెలుసుకుందామ‌ని టీవీ రిమోట్ ప‌ట్టుకు చూస్తే అన్నీ ఆంధ్రా ఛానెల్స్ మాత్ర‌మే వ‌స్తున్నాయి..  మ‌న వ‌ద్ద ఈటీవీ తెలంగాణ‌, ఈటీవీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రెండూ వ‌స్తాయి... కానీ ఆంధ్రాలో ఈటీవీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాత్ర‌మే వ‌స్తుంది.. ఇక టీ న్యూస్‌, వీ6 అన్న‌వి క‌నిపించ‌లేదు.. పోనీలే టీవీ9, ఎన్టీవీలు చూద్దామ‌ని పెడితే తూళ్లూరులో కోట్ల రూపాయాలు ప‌లుకుతున్న భూమి అంటూ వార్త‌లు క‌నిపించాయి.. మ‌రి ఆంధ్రాలో కేబుల్ ఆప‌రేట‌ర్లు ఏమైనా తెలంగాణ ఛానెళ్ల‌పై బ్యాన్ విధించారా?    మ‌రి తెలంగాణ‌లో ఈటీవీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎందుకు వ‌స్తుంది?   ఆంధ్రాలో ఈటీవీ తెలంగాణ ఎందుకు రావ‌డం లేదు?   మ‌రి మ‌న కేబుల్ ఆప‌రేట‌ర్లు దీనిపైన కూడా కొంచెం దృష్టిపెట్టాలి.. !!!

ఈ వేల కోట్ల ప‌రిహారాల‌తో ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు, చెట్ల పెంప‌కానికి కృషి చేస్తారో? వేచిచూడాల్సిందే..!!!

ఇటీవ‌ల‌ నేను ఉత్త‌రాంధ్ర‌లో ప‌ర్య‌టించాను. దాదాపు ఓ 15 రోజులు..
తుపాన్ తాకిడికి దెబ్బ‌తిన్న విశాఖ చెట్ల‌ను చూశాను..తుపాన్ బాధితుల కోసం అంటూ విరాళాలు సేక‌రిస్తున్నారు. అయితే తుపాన్ వ‌ల్ల  తీవ్రంగా న‌ష్ట‌పోయింది ప‌ర్యావ‌ర‌ణం, చెట్లు.. నోరున్న ప్ర‌జ‌ల‌కే న‌ష్టం వాటిల్లితే ప‌రిహారాల‌ను మెక్కేసిన పుణ్యాత్ములు వీళ్లు.. ఇక నోరు లేని చెట్లు, చేమ‌ల‌కు వ‌చ్చే  ఆ ప‌రిహారాన్ని ఎవ‌రి ఖాతాలో వేసుకుంటారో ? అన్న సందేహం క‌లిగింది.. ప్ర‌కృతి అందాల విశాఖ తుపాన్ తాకిడికి కొంత క‌ళావిహీనంగా మారింది.. ఈ వేల కోట్ల ప‌రిహారాల‌తో ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు, చెట్ల పెంప‌కానికి కృషి చేస్తారో?  వేచిచూడాల్సిందే..!!!

చ‌రిత్ర‌లో మంచీ చెడూ రెండూ ఉంటాయి..

కాక‌తీయులు గొప్ప‌వాళ్లు.. కాక‌తీయులు చెరువులు త‌వ్వించారు అని చెబుతారు..
మ‌రి కాక‌తీయ పాల‌కుడు ప్ర‌తాప‌రుద్రుడు స‌మ్మ‌క్క‌, సార‌ల‌మ్మ‌, జంప‌న్న‌ల‌ను చంపేసింది వాస్త‌వం కాదా?
క‌ర‌వు కోర‌ల్లో ఉన్నాం.. ఈసారికి ప‌న్ను మిన‌హాయింపు ఇవ్వ‌మ‌న్నా అంగీక‌రించ‌నిది వాస్త‌వం కాదా?
గిరిజ‌నుల‌పైకి సైన్యాన్ని పంపి వారిని హ‌త‌మార్చింది చ‌రిత్ర కాదా?
మ‌ళ్లా అదే ప్ర‌తాప‌రుద్రుడు ఢిల్లీ సుల్తాన్‌ల‌తో వీరోచితంగా పోరాడిన గాథ‌ల‌ను మ‌నం చెప్పుకుంట‌లేమా?
చ‌రిత్ర‌లో మంచీ చెడు రెండూ ఉంటాయి.. ఒక త‌ప్పు జ‌రిగింద‌ని చ‌రిత్ర‌లో అత‌డికి స్థాన‌మే ఉండ‌వ‌ద్దంటే ఈ భార‌త దేశ చ‌రిత్ర‌లో అన్నీ ఖాళీ పేజీలే క‌నిపిస్తాయి...!!!

తెలంగాణ‌లో ఆంధ్రా నేత‌ల విగ్ర‌హాలు, పేర్లు అన‌వ‌స‌రం.

తెలంగాణ‌లో ఆంధ్రా నేత‌ల విగ్ర‌హాలు, పేర్లు అన‌వ‌స‌రం.. ఈ విష‌యంలో ఎన్టీఆర్‌, వైఎస్ ప్ర‌తిమ‌లు రోడ్ల‌పై కుప్ప‌లు తెప్ప‌లుగా ఉన్నాయి.. వీటిని కూడా వెన‌క్కి పంపించాలి.. అయితే టీడీపీకి చెందిన ఎన్టీఆర్ స్థానంలో తెలంగాణ టీటీపీకి చెందిన దివంగ‌త నాయ‌కులైన మాధ‌వ రెడ్డిలాంటి వారి విగ్ర‌హాలు పెట్టాలి.. అలాగే వైఎస్ విగ్ర‌హాలు ఉన్న చోట తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన దివంగ‌త నేత‌ల విగ్ర‌హాలు పెట్టాలి.. ఈ ప్ర‌తిపాద‌న ఆ రెండు పార్టీల‌ను సంతృప్తిప‌రుస్తుంది... మ‌న చెన్నారెడ్డి, మ‌న అంజ‌య్య‌, మ‌న పీవీ న‌ర‌సింహారావుల విగ్ర‌హాలు ఆంద్రా గ‌ల్లీల్లో క‌నిపిస్తాయా?   లేదు క‌దా..  మ‌రి మ‌న గ‌ల్లీల్లో మ‌న తెలంగాణ నేత‌ల విగ్ర‌హాలు లేదా జాతీయ‌, సామాజిక ఉద్య‌మ‌కారుల విగ్ర‌హాలే ఉండాల‌న్న‌ది నా డిమాండ్‌...

అమెరికా అధ్య‌క్షుడికి కూడా మ‌నం వీసా నిరాక‌రించాలేమో..!

మైనారిటీల‌పై అకృత్యాల‌ను అరిక‌ట్ట‌లేక‌పోయారంటూ అప్ప‌ట్లో మోడీ గారికి అమెరికా వీసా నిరాక‌రించింది క‌దా..
ఇప్పుడు అమెరికా అధ్య‌క్షుడికి కూడా మ‌నం వీసా నిరాక‌రించాలేమో..!  ఆ దేశంలో న‌ల్ల‌జాతీయుల‌పై అకృత్యాలు కొన‌సాగుతున్నాయి క‌దా..!!

అది... ప్రెస్ కౌన్సిల్ ఆఫ్‌ ఆంధ్ర‌

దేశ స్థాయిలో ఉండే ప్ర‌భుత్వాలు, సంస్థ‌ల‌కు అన్ని రాష్ట్రాలూ స‌మాన‌మే. కానీ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు మాత్రం ఆంధ్ర‌కు ముల్లు గుచ్చుకున్నా అది ప్ర‌పంచ బాధ‌గా మారింది. అదే తెలంగాణ‌కు భారీ గాయ‌మైనా ఏమాత్రం ప‌ట్టింపు లేకుండా ఉంది. మ‌రి ఆ కుర్చీలో కూర్చున్న వారు గ‌తంలో పెద్ద పెద్ద స్టేట్‌మెంట్ల‌తో మాన‌వ‌తావాదులుగా, మేధావులుగా కీర్తించ‌బ‌డ్డారు. కానీ మిత్రులారా... ఈ ఒక్క ఉదాహ‌ర‌ణ చూడండి. ఆత‌ర్వాత వారినేమంటో మీరే నిర్ణ‌యించండి. అంతేకాదు.... అస‌లు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియానా అది ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్ర‌నా నిర్ణ‌యించండి.
రాష్ట్ర విభ‌జ‌న‌తో తెలంగాణ‌, సీమాంధ్ర మీడియా ఏదో పానీకా పానీ... దూద్‌కా దూద్ అన్న‌ట్లు తేలిపోయింది. ఈ నేప‌థ్యంలో రెండు రాష్ట్రాల్లో కొన్ని మీడియా సంస్థ‌లు బ‌హిష్క‌ర‌ణ‌కు గుర‌య్యాయి. ఆయా రాష్ట్రాల ప్ర‌జ‌లు ఒక్కొక్క‌రి తమ కోణంలో ఒక‌టి మంచిది అనిపించ‌వ‌చ్చు. కానీ దేశ‌స్థాయిలో వెల‌గ‌బెడుతున్న ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు రెండు రాష్ట్రాలు, అన్ని మీడియా సంస్థ‌లు స‌మాన‌మే. అయినా పీసీఐ దానిని ఆచ‌ర‌ణ‌లో చూప‌కుండా ఫ‌క్తు ఆంధ్ర కౌన్సిల్‌గా వ్య‌వ‌హ‌రించింది. వాస్త‌వంగా తెలంగాణ‌లో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి, టీవీ9 నిషేధంపై పీసీఐ సెప్టెంబ‌రు 12న త్రిస‌భ్య క‌మిటీని వేసింది. అదేవిధంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు అధికారిక స‌మావేశాల‌కు న‌మ‌స్తే తెలంగాణ‌ను బ‌హిష్క‌రిస్తున్నార‌నే ఫిర్యాదుపై సెపె్టంబ‌రు 26న త్రిస‌భ్య క‌మిటీ వేశారు. మొద‌టి క‌మిటీలో తెలంగాణ వారెవ‌రూ లేరు. కానీ రెండో క‌మిటీలో ఆంధ్రకు చెందిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు స‌భ్యుడు. స‌రే... అది ప‌క్క‌న‌పెడితే మొద‌టి క‌మిటీ రోజుల వ్య‌వ‌ధిలోనే విచార‌ణ ముగించి... కేంద్ర స‌మాచార‌, బ్రాడ్‌కాస్టింగ్‌కు నివేదిక ఇచ్చింది. అందులో తెలంగాణ రాష్ట్రంలో మీడియాకు పెద్ద ఎత్తున ముప్పు ఉందంటూ వాపోయింది. కానీ రెండో క‌మిటీ విచార‌ణ ముగించి దాదాపు రెండు నెల‌లు కావ‌స్తుంది. కానీ ఇప్ప‌టివ‌ర‌కు నివేదిక ఇవ్వ‌లేదు. తెలంగాణ‌కు చెందిన ఒక యువ ఐఐటీ ప్రొఫెస‌ర్ ఈ గుట్టును స‌మాచార హ‌క్కు చ‌ట్టం ద్వారా ర‌ట్టు చేశారు. రెండు ఫిర్యాదుల‌పై వేసిన క‌మిటీల నివేదిక‌లేంటో చెప్పాలంటూ కేంద్ర ప్ర‌భుత్వానికి ఆన్‌లైన్‌లో స‌హ చ‌ట్టం ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. దీంతో ఆంధ్ర మీడియా ఆవేద‌న‌పై నివేదిక వ‌చ్చిందంటూ కేంద్ర స‌మాచార‌, బ్రాడ్‌కాస్టింగ్ ఆదేశంతో స‌మాధాన‌మిచ్చిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా న‌మ‌స్తే తెలంగాణ అంటే ఆంధ్ర స‌ర్కారు వైఖ‌రిపై మాత్రం ఇంకా విచార‌ణ నివేదిక అంద‌లేద‌ని స‌మాధాన‌మిచ్చింది. మ‌రి ఆంధ్రకైతే 20 రోజుల్లోపు వ‌చ్చిన నివేదిక‌... తెలంగాణ విష‌యంలో ఎందుకు రాలేదో కుర్చీల్లో హోదాలు వెల‌గ‌బెడుతున్న వారు విచారించాలి క‌దా... అంటే ఆంధ్ర బాధ లోకం బాధ‌... తెలంగాణ గోడు ఎవ‌రికీ ప‌ట్ట‌దా? ఇది తెలంగాణ ప్ర‌జ‌ల‌కే కాదు... వేడుక‌లు, కార్య‌క్ర‌మాల్లో బ్యాన‌ర్ల‌పై తెలంగాణ జ‌ర్న‌లిస్టు సంఘాల నేత‌ల‌మ‌ని చెప్పుకుంటున్న ప్ర‌తి ఒక్క‌రికీ అవ‌మానం. మ‌రి వారు ఒక్క‌సారి త‌మ‌ను తాము ఆత్మ ప‌రిశీల‌న చేసుకుంటే బాగుంటుందేమో?!

Thursday 27 November 2014

రేవంత్‌రెడ్డి ముఖ్య‌మంత్రి అవుతాడా?

రేవంత్‌రెడ్డి ముఖ్య‌మంత్రి అవుతాడా?
అంటే ఏ పార్టీ త‌ర‌ఫున అన్న‌ది తొలుత ఉత్ప‌న్న‌మ‌య్యే ప్ర‌శ్న‌..
2019 నాటికి ఆయ‌న సొంతంగా పార్టీ పెట్టి కేసీఆర్ మాదిరిగా ఉద్య‌మించి తెలంగాణ హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ విష‌యంలో టీఆర్ఎస్ ప్ర‌భుత్వం క‌న్నా ఎక్కువ‌గా కొట్లాడితే ప్ర‌జాభిమానాన్ని పొందుతాడు.. అయితే హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ కోసం కొట్లాడ‌టం అంటే పొరుగు రాష్ట్రం చేసే దాడుల‌ను తిప్పికొట్టాల్సి ఉంటుంది, అక్క‌డి సీఎంతో నేరుగా త‌ల‌పడాల్సి ఉంటుంది.. మ‌రి ఆ ప‌నిని రేవంత్‌రెడ్డి చిత్త‌శుద్ధితో చేస్తే 2019లో కాక‌పోయినా 2029 నాటికైనా ఆయ‌న‌ను జ‌నం అంద‌లం ఎక్కించ‌డం ఖాయం.. రేవంత్‌రెడ్డే కాదు.. ఏ నాయ‌కుడైనా స‌రే చిత్త‌శుద్ధితో పార్టీ పెట్టి న్యాయం కోసం కొట్లాడితే జ‌నం వారికి త‌గిన గౌర‌వం ఇవ్వ‌డం త‌థ్యం...
జార్ఖండ్ సాధ‌న కోసం దాదాపు 30 ఏళ్ల‌కు పైగా శిబూసోరెన్ కొట్లాడాడు.. ఆయ‌న‌ను గురూజీగా జార్ఖండ్ ప్ర‌జ‌లు గౌర‌విస్తున్నారు..
తెలంగాణ కోసం 12 ఏళ్లు కేసీఆర్ కొట్లాడాడు.. జ‌నం గుండెల్లో నిలిచాడు..
మ‌రాఠాల అస్థిత్వం కోసం కొట్లాడిన బాల్ థాక‌రేకి అక్క‌డి ప్ర‌జ‌ల్లో ప్ర‌త్యేక స్థానం ల‌భించింది..
ఏమో.. రేపు బోయ‌వాడు వాల్మీకిలా మారిన‌ట్లుగా రేవంత్‌రెడ్డి క‌ర‌డు గ‌ట్టిన తెలంగాణ వాదిగా మారిపోయి ఏకంగా చంద్ర‌బాబునాయుడిపైనా దాడికి తెగ‌బ‌డితే... ఆయ‌న క‌ల సాకారం కావొచ్చు క‌దా... రాజ‌కీయాల్లో ఏదైనా సాధ్య‌మే...!!!
మ‌రి రేవంత్‌డు అలా మారుతాడా? మారితే ఎప్పుడు మారుతాడు? అన్న‌దే మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌...!!
నోట్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ‌టం వ‌ల్ల రేవంత్ రెడ్డి క‌నీసం ముఖ్య‌మంత్రి పీఠంపై క‌ల‌లు క‌న‌గ‌లుగుతున్నాడు.. స‌మైక్య రాష్ట్ర‌మే ఉంటే మంత్రి ప‌ద‌వి కోసం క‌ల‌లు క‌నేవాడు.. క‌నీసం ఈ విష‌యంలోనైనా ఆయ‌న కేసీఆర్‌కు కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకోవాల్సిందే..!!

ఒక్కో చిట్‌ఫండ్ కేసులో ఒకోలా వీరి వ్య‌వ‌హారం..

అదేదో శార‌ద చిట్‌ఫండ్ కుంభ‌కోణం అని ఈ మ‌ధ్య అన్ని టీవీల్లో, పేప‌ర్ల‌లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది...
అస‌లు చిట్‌ఫండ్ కుంభ‌కోణాలు, మోసాలు అంటే మ‌న రాష్ట్రంలో ఏడేళ్ల క్రితం వెలుగులోకి వ‌చ్చిన ఒక‌ కేసే గుర్తొస్తుంది..
దేశంలోని ప్ర‌ముఖ‌ పారిశ్రామిక వేత్త‌, ప్ర‌ధాన విప‌క్షం, రాష్ట్రంలోని విప‌క్షాలు అన్నీ ఆ చిట్‌ఫండ్ కంపెనీకి బాస‌ట‌గా నిలిచాయి..
చివ‌ర‌కు ఆస్తుల‌ను తాక‌ట్టు పెట్టి 3 వేల కోట్లు స‌మీక‌రించుకొని డ‌బ్బులు చెల్లించాడు..
కేసులు మీద‌ప‌డ‌కుండా త‌ప్పించుకున్నాడు.. ఈ పెద్ద‌మ‌నిషికీ రాజ‌కీయ సంబంధాలు ఉన్నాయి..
అప్పుడు ఈయ‌న‌పై ప్ర‌భుత్వాలు ఏ చ‌ర్య తీసుకోవాల‌ని చూసినా.. అది క‌క్ష సాధింపుగా మీడియా స్వేచ్ఛ‌ను అడ్డుకునే చ‌ర్య‌గా క‌నిపించింది...
అప్పుడు ఎవ‌రైతే మ‌న రాష్ట్రంలోని చిట్‌ఫండ్ కంపెనీకి వ‌త్తాసు ప‌లికారో.. ఇప్పుడు వారే శార‌ద కుంభ‌కోణం కేసుపై గొంతెత్తుతున్నారు...

ఇదే స‌రైన స‌మ‌యం...

ఎలాగూ విమానాశ్ర‌యం ట‌ర్మిన‌ల్ పేరును మార్చారు.. బీజేపీ వాళ్లూ మ‌ద్ద‌తు ఇచ్చారు.. ఇది కేంద్రం చేతిలో ప‌ని కాబ‌ట్టి మ‌న వేద‌న అర‌ణ్య రోద‌న‌గానే మారుతోంది... అందుకే ఇక ట్యాంక్ బండ్ విగ్ర‌హాల‌ను న‌వ‌తా ట్రాన్స్‌పోర్టులో త‌ర‌లిస్తే బాగుంటుంది.. ఇప్పుడు అక్క‌డ మ‌న మ‌హ‌నీయుల విగ్ర‌హాలు పెట్టుకుంటే స‌రిపోతుంది.. ఏ ఒక్క నేత ప్ర‌శ్నించ‌లేడు.. !!

రిటైర్‌మెంట్ వ‌య‌సు పెంచొద్దు...

ఉద్యోగుల రిటైర్‌మెంట్ వ‌య‌సును పెంచ‌బోమ‌న్న స‌ర్కారు నిర్ణ‌యం బాగుంది..
తెలంగాణ‌లోనూ రిటైర్‌మెంట్ వ‌య‌సును 60 ఏళ్ల‌కు పెంచితే ఇక్క‌డ నుంచి ఏ ఒక్క ఉద్యోగి కూడా ఆంధ్రా ప్రాంతానికి వెళ్ల‌డానికి మొగ్గుచూప‌డు..
మ‌న నిరుద్యోగుల‌కూ న‌ష్టం వాటిల్లుతుంది.. క‌నీసం ఆంధ్రాలో రిటైర్‌మెంట్ వ‌య‌సు ఎక్కువ‌గా ఉంద‌న్న చిరు ఆశ‌తోనైనా కొంద‌రు అక్క‌డికి వెళ్ల‌డానికి ఆప్ష‌న్లు ఇస్తారేమో..!!

ఎందుకిలా ఆలోచిస్తున్నారు...?

స‌మైక్య రాష్ట్రంలో మ‌న ఉద్యోగాలను నిబంధ‌న‌లు ఉల్లంఘించి ఆంధ్రా ప్రాంతీయుల‌కు క‌ట్ట‌బెడితే వీళ్లు నోరు తెర‌వలేదు..
స‌మైక్య రాష్ట్రంలో మ‌న నీళ్లు, మ‌న నిధుల‌ను ఇత‌ర ప్రాంతాల‌కు త‌ర‌లించినా ప‌ట్టించుకోలేదు...
కానీ నేడు తెలంగాణలోని కాంట్రాక్టు ఉద్యోగాల‌ను ప‌ర్మినెంట్ చేస్తామంటే కొంద‌రు స‌హించ‌డం లేదు..
పాల‌మూరు మీదుగా కాలువ‌లు త‌వ్వి పాల‌మూరు, న‌ల్గ‌గొండ‌, రంగారెడ్డికి నీళ్లు ఇద్దామ‌ని ప్ర‌తిపాదిస్తే దానికీ అంగీక‌రించ‌డం లేదు..
మ‌న ఉద్యోగాలు, నీళ్ల‌తో ఇత‌రులు బాగుప‌డినా ఓకే కానీ.. తెలంగాణ ప్ర‌జ‌లు బాగుప‌డొద్ద‌నా వీరి ఆలోచ‌న‌...!!
ఎందుకిలా ఆలోచిస్తున్నారు...?

రేప‌టి దృశ్యం...!!

డ‌బ్బింగ్ సినిమాలు, డ‌బ్బింగ్ సీరియ‌ళ్ల‌ మూలంగా తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు న‌ష్టం వాటిల్లుతుంద‌ని చిత్ర సీమ‌లోని కొంద‌రు పెద్ద‌లు అప్ప‌ట్లో పెద్ద ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.. ఆ సినిమాల విడుద‌ల‌పై ఆంక్ష‌లు విధించ‌డం చేశారు.. వాటిపై ప‌న్నులు పెంచారు.. ఇంకొంద‌రైతే డ‌బ్బింగ్ సీరియ‌ళ్ల‌ను ఆపేయాల‌ని పెద్ద ఉద్య‌మ‌మే చేశారు... అప్పుడు దీన్ని చాలా ఛానెళ్లు త‌ప్పుప‌ట్ట‌లేదు.. సినిమాకు జాతి, మ‌త‌, కుల‌, భాష, ప్రాంతీయ భేదాలు ఉండ‌వ‌నే పెద్ద‌ల‌కు పైన చేసిన చ‌ర్య త‌ప్పుగా అనిపించ‌లేదు ఎందుకో?
రేపు తెలంగాణ‌లోనూ ప‌క్క రాష్ట్రం సినిమాల విడుద‌ల‌పై ఆంక్ష‌లు విధిస్తే వీళ్లు నోరు మూసుకు కూర్చుంటారా?
ప‌క్క రాష్ట్రం సినిమాల వ‌ల్ల తెలంగాణ సినీ ప‌రిశ్ర‌మ‌కు న‌ష్టం వాటిల్లుతుంద‌ని అంటే ఒప్పుకుంటారా?
నోట్‌: ప‌క్క రాష్ట్రాల సినిమాలు, సీరియ‌ళ్లు వ‌ద్ద‌ని వీళ్లు అనుకుంటే త‌ప్పు కాదు కానీ.. ప‌క్క రాష్ట్రం ఛానెళ్లు, వార్త‌లు వ‌ద్ద‌ని మ‌నం అనుకుంటే త‌ప్పు అవుతుందట‌.. ఇదెక్క‌డి చోద్య‌మో...!!

ఇది తెలంగాణ ప‌బ్లిక్ డిమాండ్‌!!

--------
స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ ఎయిర్‌పోర్టు.. గుజ‌రాత్‌
ఛ‌త్ర‌ప‌తి శివాజీ విమానాశ్ర‌యం.. మ‌హారాష్ట్ర‌
డాక్ట‌ర్ బాబాసాహెబ్ అంబేద్క‌ర్ విమానాశ్ర‌యం.. మ‌హారాష్ట్ర‌
నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ విమానాశ్ర‌యం.. బెంగాల్‌
లోక్‌నాయ‌క్ జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ ఎయిర్‌పోర్టు.. బీహార్‌
---------
వీళ్లంతా మ‌హ‌నీయులే... దేశానికి ఎంతో సేవ చేసిన వారే... మ‌రి స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ పేరును మ‌హారాష్ట్ర విమానాశ్ర‌యానికి పెట్ట‌లేదు ఎందుకు?
ఛ‌త్ర‌ప‌తి శివాజీ పేరును గుజ‌రాత్ లోని విమానాశ్ర‌యానికి పెట్ట‌లేదు ఎందుకు?
బాబాసాహెబ్ అంబేద్క‌ర్ పేరును బీహార్‌లోని విమానాశ్ర‌యానికి పెట్ట‌లేదు ఎందుకు?
జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ పేరును బెంగాల్ విమానాశ్ర‌యానికి పెట్టలేదు ఎందుకు?
---
వీళ్లు ఎంత మ‌హ‌నీయులు అయినా స‌రే.. వాళ్ల రాష్ట్రాల్లోని విమానాశ్ర‌యాల‌కు మాత్ర‌మే వీరి పేర్లు పెట్టి గౌర‌వించారు.. అంతేకానీ పొరుగు రాష్ట్రాల్లోని విమానాశ్ర‌యాల‌కు వీరి పేర్ల‌ను పెట్ట‌లేదు.. అలాగే మ‌న తెలంగాణ‌తో సంబంధం ఉన్న‌.. ఇక్క‌డి గ‌డ్డ‌పై పుట్టిన వారి పేరునే ఇక్క‌డి విమానాశ్రయానికి, ట‌ర్మిన‌ల్‌కు పెట్టాలి... ఇది తెలంగాణ ప‌బ్లిక్ డిమాండ్‌!!

ఈ దేశంలో మాన‌వ హ‌క్కుల సంఘం ఇంకా ఉందండోయ్‌..!


ఈ దేశంలో మాన‌వ హ‌క్కుల సంఘం ఇంకా ఉందండోయ్‌..!
తెలంగాణ‌లో రైతుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై స్పందించింది... 69 మంది రైతులు చ‌నిపోయారా? అని ఆవేద‌న వ్య‌క్తం చేసింది..
మ‌రి తెలంగాణ కోసం వంద‌ల మంది యువ‌త చ‌నిపోయిన‌ప్పుడు ఈ సంఘం ఎలా స్పందించింది?
కేంద్రానికి, రాష్ట్రానికి నోటీసులు ఇచ్చిందా?
ఏది ఏమైనా మానవ హ‌క్కుల సంఘం దేశంలోని రైతుల ఆత్మ‌హ‌త్య‌ల‌పైనా స్పందించి ఉంటే ఇంకా బాగుంటుంది..
రైతుల కోసం జాతీయ విధానాన్ని తీసుకొచ్చేలా అన్ని ప్ర‌భుత్వాల‌ను సూచ‌న‌లు చేస్తే ఎంతో సంతోషిస్తాను..
గిట్టుబాటు ధ‌ర‌ను రైతులే నిర్ణ‌యించుకునేలా ప్ర‌భుత్వాల‌కు సూచ‌న‌లు ఇవ్వాలి...
ఇవ‌న్నింటినీ మానవ హ‌క్కుల సంఘం చేస్తుందా?
నోట్‌:: మ‌హారాష్ట్ర‌లో 200 మంది రైతులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌ట‌... ఈ విష‌యాన్ని కేంద్ర‌మే ప్ర‌క‌టించింది.. మ‌రి ఆ రాష్ట్రానికి కూడా నోటీసులు జారీ చేయాలి.. దేశంలో ఏ ఒక్క రైతు ఆత్మ‌హ‌త్య జ‌ర‌గ‌కుండా అంద‌రు రైతుల హ‌క్కుల‌ను కాపాడేలా హ‌క్కుల సంఘం కృషి చేయాలి..!!

Wednesday 26 November 2014

అంజ‌య్య పేరును ఆంధ్రాలో విమానాశ్ర‌యానికి పెట్టించేంత పెద్ద మ‌న‌సు చంద్ర‌బాబునాయుడుకు ఉందా?



జానారెడ్డి, కేసీఆర్ లాంటి వారికి ఎన్టీఆర్ రాజ‌కీయ జీవితం ఇచ్చిన మ‌హనీయుడు ఎన్టీఆర్ కాబ‌ట్టి ఆయ‌న పేరును డొమిస్టిక్ ట‌ర్మిన‌ల్‌కు పెట్ట‌డంపై అభ్యంత‌రాలు చెప్పొద్ద‌ని ప‌చ్చ పార్టీ నేత‌లు అంటున్నారు.. మ‌రి చంద్ర‌బాబుకు రాజ‌కీయ జీవితం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే క‌దా.. మ‌రి మంత్రిగా అవ‌కాశం ఇచ్చిన అంజ‌య్య పేరును ఆంధ్రాలో విమానాశ్ర‌యానికి పెట్టించేంత పెద్ద మ‌న‌సు చంద్ర‌బాబునాయుడుకు ఉందా?

మ‌రి దీనిపై ఎలా స్పందిస్తారో?

సానియా మీర్జాను ఐక్య‌రాజ్య‌స‌మితి గుడ్‌విల్ అంబాసిడ‌ర్‌గా నియ‌మించింద‌ట‌...
ఇది కూడా ఓటు బ్యాంక్ రాజ‌కీయ‌మే అంట‌రా? ఇంకేమైనా అంటారా?
తెలంగాణ ప్ర‌భుత్వం అంబాసిడ‌ర్‌గా పెట్టుకుంటే త‌ప్పుప‌ట్టారు.. మ‌రి ఐక్య‌రాజ్య‌స‌మితి కూడా సానియా సేవ‌ల‌ను ఉప‌యోగించుకుంటోంది..
మ‌రి దీనిపై ఎలా స్పందిస్తారో?

Tuesday 25 November 2014

బ్రాండ్ ఇమేజ్‌కు బాంబుల మోత‌ల‌కు సంబంధం ఉంటుందా?



అయితే ముంబ‌యి బ్రాండ్ ఇమేజ్ ఎన్నిసార్లు డ్యామేజీ కావాలి... 
ఓ నిందితుడు హైద‌రాబాద్‌లో త‌ల‌దాచుకుంటే ఇది నేర‌గాళ్ల అడ్డాగా మారిందంటారు...
అదే విజ‌య‌వాడ‌లో, క‌ర్నూల్‌లో నిందితులు త‌ల‌దాచుకుంటే దాన్ని ఏమ‌నాలి..
అప్పుడు కూడా ఆ ప్రాంతాల ఇమేజ్‌లు డ్యామేజీలు అయిన‌ట్లు రాయ‌లేరా?

ఆదుకునే పెద్ద మ‌న‌సు వారికి ఉంటుందంటారా?

ఆంధ్రాలో తుపాన్ వ‌స్తే నెల రోజులుగా నిరంత‌రాయంగా తెలంగాణ ఎడిష‌న్లో రోజూ ప్ర‌త్యేక పేజీ వేస్తూ వార్తలు రాస్తూ విరాళాలు సేక‌రిస్తోంది... సాటి తెలుగు వాళ్ల‌ను ఆదుకోమ్మ‌న‌డం మంచిదే... మరి తెలంగాణ‌లో తుపానో, వ‌ర‌దో, క‌ర‌వో వ‌స్తే ఆంధ్రా ఎడిష‌న్ల‌కు ప్ర‌త్యేక పేజీ వేస్తూ విరాళాలు సేకరించి ఆదుకునే పెద్ద మ‌న‌సు వారికి ఉంటుందంటారా? అలా జ‌రుగుతుందా?

గ‌న్న‌వ‌రం, విశాఖ‌ప‌ట్నం, రాజ‌మండ్రి విమానాశ్ర‌యాల‌కు పీవీ న‌ర‌సింహారావు, అంజ‌య్య, చెన్నారెడ్డిల‌ పేర్లు ఏమైనా పెట్టి గౌర‌విస్తారా?

మొన్న ఎన్నిక‌ల స‌మ‌యంలో మోడీ గారు, చంద్ర‌బాబు గారు తెలుగు మ‌హ‌నీయులైన పీవీ న‌ర‌సింహారావు, అంజ‌య్య‌ల‌ను కాంగ్రెస్ అవ‌మానించింద‌ని చెప్పిన చోట చెప్ప‌కుండా చెప్పారు...  ఇప్పుడు శంషాబాద్ విమానాశ్ర‌యం దేశీయ టెర్మిన‌ల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టారు.. ఆ మ‌హ‌నీయుడికి మేం ఇస్తున్న గౌర‌వం అంటున్నారు.. ఓకే బాగుంది.. అలాగే ఇక గ‌న్న‌వ‌రం, విశాఖ‌ప‌ట్నం, రాజ‌మండ్రి విమానాశ్ర‌యాల‌కు పీవీ న‌ర‌సింహారావు, అంజ‌య్య, చెన్నారెడ్డిల‌  పేర్లు ఏమైనా పెట్టి గౌర‌విస్తారా?   ఈ విష‌యంలో మోడీ గారు, చంద్ర‌బాబునాయుడు గారు, అశోక గ‌జ‌ప‌తి రాజు గారే స్పందించాలి?

ఆ పేర్ల మార్పు ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి...!! L

హైద‌రాబాద్‌ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం దేశీయ టెర్మిన‌ల్ పేరును ఎన్టీఆర్ పేరు మీద‌కు మార్చుతూ నిర్ణ‌యం తీసుకున్నారు.. అది కేంద్ర విమాన‌యాన శాఖ ప‌రిధిలో తీసుకొనే నిర్ణ‌యం కాబ‌ట్టి వాళ్లు తీసుకున్నారు.. ఇక రాష్ట్రం ప‌రిధిలోనూ తీసుకోవాల్సిన నిర్ణ‌యాలు చాలా ఉన్నాయి... ఆల‌స్యం చేయ‌కుండా ఆ పేర్ల మార్పు ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి...!!
L

ఇదెక్క‌డి పైత్యం?



కొంత ఆల‌స్యంగా స్పందిస్తున్నాను. రెండ్రోజుల కింద‌ట న‌మ‌స్తే తెలంగాణ‌లో వ‌చ్చిన వార్త ఇది. తెలుగు తేజం అట‌. ఇదెక్క‌డి పైత్యం?. ఆంధ్ర ప‌త్రిక చ‌దువుతున్నమా?. తెలంగాణ ప‌త్రిక‌నా? అని అనుమానం క‌లిగింది. తెలంగాణ తేజం ఇక్క‌డి వాడు కాక‌పోతే హైద‌రాబాద్ తేజం అని పెట్టొచ్చు క‌దా. అవి మూడు అక్ష‌రాలు కాదు... తెలంగాణ పాఠ‌కుల గుండెల్లో మూడు గున‌పాలు అనే విష‌యాన్ని మ‌ర‌వ‌ద్దు. జై తెలంగాణ‌

అక్క‌డా ఇక్క‌డా లాభ‌ప‌డేది భూదందా చేసే రాజ‌కీయ నేత‌లే...!!!



తెలంగాణ‌లో భూమి అమ్ముకున్న రైతుల ల‌క్షాధికారి అయ్యాడు..
కొన్న వాడు కోటీశ్వ‌రుడ‌య్యాడు...
చివ‌ర‌కు పెరిగిన జీవ‌న ప్ర‌మాణాలు త‌ట్టుకోలేక మ‌న రైతు బికారీ అయ్యాడు..
ఇప్పుడు ఆంధ్రాలో భూమి అమ్ముకునే రైతు కోటీశ్వ‌రుడు అవుతాడు..
కొనుగోలు చేసిన వాడు బిలియ‌నీర్ అవుతాడు...
వాళ్లు పెంచే ఇత‌ర రేట్ల‌ను త‌ట్టుకోలేక ఆంధ్రా రైతు మ‌ళ్లీ కుచేలుడు కావాల్సిన ప‌రిస్థితి త‌ప్ప‌దు...!!
అక్క‌డా ఇక్క‌డా లాభ‌ప‌డేది భూదందా చేసే రాజ‌కీయ నేత‌లే...!!!

పాపం ఆ కిరాయి మ‌నుషులు చేస్తున్న‌ది అదేన‌ట‌...

టీఆర్ఎస్ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష పుణ్య‌మా? అని కొంద‌రు నేత‌ల‌కు ఆంధ్రాలో కాంట్రాక్టులు ద‌క్కుతున్న‌ట్లు తెలుస్తోంది.. ఉన్న వారిని కాపాడుకోవ‌డానికి ఒక‌రిద్ద‌రు తెలంగాణ‌ నేత‌ల‌కు గ‌త్యంత‌రం లేక కాంట్రాక్టులు ఇవ్వ‌డానికి ప‌చ్చ‌బాబు అయిష్టంగానే అంగీక‌రించార‌ట‌.. ఏది ఏమైనా అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా స‌రే తెలంగాణ స‌మాజం ఒత్తిళ్లు ఉంటే త‌ప్ప మ‌న వారికి ప‌ద‌వులు, కాంట్రాక్టులు ద‌క్క వ‌న్న విష‌యం అర్థం అవుతోంది..
అయితే ద‌క్కిన కాంట్రాక్టులను కాపాడుకోవ‌డం కోస‌మైనా స‌రే ఆ మాత్రం కొట్లాడ‌కుంటే ఎలా? కాంట్రాక్టు ఇచ్చిన పెద్ద‌మ‌నిషిని సంతోష‌పెట్టాలి క‌దా.. పాపం ఆ కిరాయి మ‌నుషులు చేస్తున్న‌ది అదేన‌ట‌... ఈ మ‌ధ్య అసెంబ్లీ లాబీల్లో ఒక‌టే గుస‌గుస‌లు..!!

అవి తాగితే ఇలాగే వాగుతారు...!!!

తెలంగాణ త‌ల్లి పాలు తాగ‌రా బాబూ? కొంచెం ఈ గ‌డ్డ‌పై ప్రేమైనా వ‌స్త‌ది అంటే.. లేదు లేదు ఆ విషం క‌లిపిన పాలే నాకు కావాలంటూ అవి తాగితే ఇలాగే వాగుతారు...!!!

ఫ‌న్ టానిక్‌..

---------
కిస్ ఆఫ్‌ ల‌వ్‌కు కేసీఆర్ మ‌ద్ద‌తా?
అంబ‌టి రాయుడిని ముద్దాడింది అందులో భాగంగానేనా..!!
----------------
ఈ రోజు కేసీఆర్ గారు ఉప్ప‌ల్ క్రికెట్ స్టేడియంలో వేల మంది ముందు క్రికెట‌ర్ అంబ‌టి రాయుడి చేతిని ముద్దాడారు.. కొంప దీసి ఆయ‌న కిస్ ఆఫ్ ల‌వ్‌ను బ‌హిరంగంగా చేశాడ‌ని కేసులు గ‌ట్రా పెట్టాల‌ని డిమాండ్ చేసే వాళ్లూ ఉంటారేమో..!!
సెంట్ర‌ల్ యూనివ‌ర్స‌టిలో ఈ కిస్ ఆఫ్ ల‌వ్ పేరిట ముద్దులు పెట్టుకున్న వారిపై కేసులు పెట్టార‌ట క‌దా.. మ‌రి ముఖ్య‌మంత్రిపైనా కేసు పెడ‌తారా? అని ప్ర‌శ్నించినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు..!!!
రేపు అసెంబ్లీలో విప‌క్షాలు ఈ ముద్దుపై ర‌చ్చ కూడా చేస్తాయేమో..!!!

Sunday 9 November 2014

సిద్ధాంత వైరుద్ధ్యాలున్నా క‌లిసి ప‌నిచేసే చ‌రిత్ర మ‌న‌దే..

తెలంగాణ ఉద్య‌మమే అంద‌కు నిద‌ర్శ‌నం..

--------------------------------
కేసీఆర్ రాష్ట్ర‌ మంత్రిగా ఉన్న‌ప్పుడు విద్యాసాగ‌ర్ గారు ఎమ్మెల్యేగా ప‌నిచేశారు...

కేసీఆర్ సొంత పార్టీ పెట్టిన‌ప్పుడు సాగ‌ర్ జీ కేంద్ర మంత్రిగా ఉన్నారు..

ఇక 2004, 2006, 2008లో విద్యాసాగ‌ర్ - కేసీఆర్‌లు ఎన్నిక‌ల బ‌రిలో ప‌ర‌స్ప‌రం త‌ల‌ప‌డ్డారు...

ఇప్పుడు కేసీఆర్ సీఎం అయ్యారు... సాగ‌ర్ జీ గ‌వ‌ర్న‌ర్ అయ్యారు..

మ‌న‌కు రాయ‌ల‌సీమ రాజ‌కీయ సంస్కృతి అంట‌లేదు..ఈ విష‌యంలో మనం ఎంతో అదృష్ట‌వంతులం..  లేక‌పోతే రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థిని ఓ శ‌త్రువుగా చూసే ప‌రిస్థితి ఉండేది. బాంబులు, వేట‌కొడ‌వ‌ళ్ల‌తో చంపుకునే దారుణ సంఘ‌ట‌న‌లు ఉండేవి.. మ‌న వ‌ద్ద చాలా మంది నేత‌లు ఎన్నిక‌ల వ‌ర‌కే ప్ర‌త్య‌ర్థులుగా ఉన్నా ఆ త‌ర్వాత మ‌ళ్లా అల‌య్ బ‌ల‌య్ అని క‌లిసిపోతారు..!!!

నోట్‌:  అంతెందుకు మ‌న సాగ‌ర్ జీ అన్న క‌మ్యూనిస్టు దిగ్గ‌జ‌మైన చెన్న‌మ‌నేని రాజేశ్వ‌ర‌రావు. ఆయ‌న వామ‌ప‌క్షం(ఇప్పుడు ఏ పార్టీలోనూ లేరు).. ఈయ‌న‌ది కాషాయం..  ఇలాంటి విభిన్న సిద్ధాంతాలు ఒకే ఇంట్లోనే క‌నిపించే భిన్న‌త్వంలో ఏక‌త్వం మ‌న తెలంగాణ‌కే సొంతం...!!

ఈ స్ఫూర్తిని కొన‌సాగించాలి...

ఉన్న‌త శిఖ‌రాలు అధిరోహించే తెలంగాణ ముద్దుబిడ్డ‌లంద‌రినీ స‌న్మానించుకోవాలి..
 పార్టీల‌క‌తీతంగా ఈ విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం చొర‌వ చూప‌డ‌టం అభినంద‌నీయం..
----------------
మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్  విద్యాసాగ‌ర్‌రావును(సాగ‌ర్ జీ) ప్ర‌భుత్వం స‌న్మానించ‌డం మంచి విష‌యం.. ఈ సంప్ర‌దాయాన్ని మ‌నం కొన‌సాగించాలి. రేపు ద‌త్త‌న్న‌ను కూడా స‌న్మానించాలి... తెలంగాణ నుంచి ఉన్న‌త శిఖ‌రాలు అధిరోహించిన అంద‌రినీ మ‌నం స‌న్మానించాలి.. ఇది తెలంగాణ ఐక్య‌త‌కు ప్ర‌తీక‌గా నిలుస్తాయి.. వేర్వేరు పార్టీల్లో ఉన్నా తెలంగాణ స‌మాజం అంతా ఒక్క‌టే అన్న భావ‌న‌ను నింప‌డంలో ఇది దోహ‌ద‌ప‌డుతుంది.

అల‌య్ బ‌లాయ్ ద‌త్త‌న్న‌కు అభినంద‌న‌లు....


మొన్న కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వ‌చ్చాక ఎంపీలంద‌రికీ ఢిల్లీలో విడిది(అకామ‌డేష‌న్‌) ఏర్పాటు చేశారు..  ఏపీ భ‌వ‌న్‌లో కొంద‌రికి, అశోకా హోట‌ల్‌లో కొంద‌రికి  రూంలు కేటాయించారు. ప్రొటోకాల్ ప్రకారం ద‌త్తన్న‌కు  ఏపీ భ‌వ‌న్‌లో రూం ఇచ్చారు. అయితే అది వేస‌వి కాలం. ఆ రూంలో ఏసీ ప‌నిచేయ‌డం లేదు.  ఢిల్లీలో వేస‌విలో ఏసీ లేకుండా ఉండ‌టం అంటే పెద్ద న‌ర‌క‌మే.. అయితే ద‌త్త‌న్న‌ గారు ఏపీభ‌వ‌న్‌లోని అదే రూంలో ఉక్క‌పోత‌తో ఉన్నారు.. అశోకా హోట‌ల్‌కు వెళ్ల‌మ‌ని అక్క‌డి అధికారులు ఆయ‌న‌కు  న‌చ్చ‌జెప్పినా విన‌లేదు   నేను ఇక్క‌డే ఉంటాన‌ని ఆయ‌న చెప్పారు. చేసేదేం లేక‌ అదే బిల్డింగ్ లో  ఖాళీగా ఉన్న మ‌రో ఏసీ రూంలో తాత్కాలికంగా బ‌స చేయాల్సింది అధికారులు చెప్పారు.. దీంతో ఆయ‌న పై అంత‌స్థుకు వెళ్లారు.

మ‌రుస‌టి రోజున ద‌త్తాత్రేయ ఉన్న రూంకు అధికారులు వ‌చ్చి సార్‌.. మీరు ఈ రూం ఖాళీ చేయాలి.. ఈ రూం  కేటాయించిన ఆయ‌న వ‌చ్చారు అని స‌మాచారం  ఇచ్చారు.. ద‌త్త‌న్న ఏమీ మాట్లాడ‌కుండా కింద రూంకు వ‌చ్చేందుకు సిద్ధ‌ప‌డ్డారు. వెంట‌నే అక్క‌డే ఉన్న పాత్రికేయులు కొంద‌రు మాజీ కేంద్ర మంత్రిని ఇలా అవ‌మానిస్తారా?  అంటూ అధికారుల‌ను నిల‌దీశారు. అశోకా హోట‌ల్‌కు వెళ్ల‌మంటే ఆయ‌న వెళ్ల‌డం లేద‌ని అధికారులు పాత్రికేయుల‌తో అన్నారు.. వెంట‌నే పాత్రికేయులు ద‌త్త‌న్న‌తో మాట్లాడుతూ... ఎందుకు సార్ ఈ వేస‌విలో ఏసీ ప‌నిచేయ‌ని రూంలో ఉండ‌టం.. అశోకా హోట‌ల్‌లో ఉండొచ్చు క‌దా అని సూచించారు. ద‌త్త‌న్న మాట్లాడుతూ.. నాతో ప‌ని మీద చాలా మంది వ్య‌య‌ప్ర‌యాస‌లతో ఈ అడ్రెస్‌కు వ‌స్తారు.. ఇక్క‌డ చ‌వ‌క‌కు భోజ‌నం చేయ‌డం, చాయ్ తాగ‌డానికి వీలుంటుంది... నేను అశోకా హోట‌ల్‌లో ఉంటే నాకోసం వ‌చ్చే ప్ర‌జ‌ల‌కు ఇబ్బందే క‌దా.. అక్క‌డ భోజ‌నానికి, టీకి వంద‌ల రూపాయ‌లు ఖ‌ర్చు చేయ‌లేరు... వాళ్లంద‌రికీ ఇదే సౌక‌ర్య‌మైన ప్ర‌దేశం. అందుకే నేను ఇక్క‌డే ఉండాల‌నుకుంటున్నా అని ఆయ‌న చెప్ప‌డంతో  విలేక‌రులంతా ఆశ్చ‌ర్య‌పోయారు..

త‌న సౌక‌ర్యం క‌న్నా త‌న కోసం వ‌చ్చే పేద‌, బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల‌ బాగు కోసం ఆలోచించే ద‌త్త‌న్న లాంటి నాయ‌కులంద‌రికీ నా వంద‌నాలు..

------------------------------------------
ద‌త్త‌న్నకు మొద‌టి విడ‌త‌లోనే అవ‌కాశం ద‌క్కాల్సింది.. ఆల‌స్య‌మైనా స‌రే ప‌ద‌వి ల‌భించినందుకు సంతోషం. ఆయ‌న‌  కేంద్ర మంత్రిగా తెలంగాణ‌కు అన్నీ కేటాయింపులు చేయాల‌న్న స్వార్థం మాకు లేదు.. న్యాయంగా ల‌భించే వాటిని కేటాయిస్తే స‌రిపోతుంది.. అన్ని రాష్ట్రాల‌ను, ప్రాంతాల‌ను స‌మానంగా చూడాల‌ని తెలంగాణ స‌మాజం త‌ర‌ఫున విజ్ఞ‌ప్తి... తెలంగాణ‌కు జ‌రుగుతున్న అన్యాయాల‌ను స‌రిదిద్దాల‌ని మా విన్నపం.. మీకు భ‌గ‌వంతుడు నిండు నూరేళ్లు, ఆయుర్ ఆరోగ్యాలు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను...!!

ద‌త్త‌న్నా అని పిలిస్తే చాలు.. ఓ వ‌త్త‌న్న వ‌త్త‌న్న అంటూ వ‌చ్చే మ‌న‌సున్న‌ జ‌న నేత మ‌న బండారు ద‌త్తాత్రేయ...

మ‌న బెర్లిన్ బాబు ఏమ‌య్యాడు?

25 ఏళ్ల క్రితం బెర్లిన్ గోడ కూలింది ఈరోజే...!!
మ‌రి మ‌న బెర్లిన్ బాబు ఏమ‌య్యాడు?
ఆనాడు చూపిన బెర్లిన్ రాయితో ఏం చేస్తున్నాడు?
కొంపదీసి దాంతో త‌ల‌ప‌గ‌ల‌గొట్టుకోవ‌డం లేదుక‌దా!!
-------------------------

బెర్లిన్ గోడ బ‌ద్ధ‌లైన‌ట్లు తెలంగాణ‌-ఆంధ్రా మ‌ళ్లా ఒక్క‌ట‌వుతాయ‌ని అప్ప‌ట‌లో బెర్లిన్ నుంచి తెప్పించిన‌ రాయి ముక్క‌ను చూపించిన పెద్ద‌ మ‌నిషి ఏమైపోయాడు... నేడో రేపో బీజేపీలో చేర‌బోతున్నాడ‌ని ప‌త్రిక‌ల్లో వార్త‌లు వ‌స్తున్నాయి.. పాపం గుట్టుచ‌ప్పుడు కాకుండా ఆ పార్టీలో చేరాల‌ని అనుకుంటున్న‌ట్లు కొంద‌రు అంటున్నారు.. ఈ ప‌త్రిక‌ల వాళ్లు ఆయ‌న‌ను వ‌దిలిపెట్ట‌డం లేదు.. అయితే బీజేపీలో చేరితే పెద్ద చిక్కే వ‌చ్చి ప‌డేట్లు ఉంది.. ఆయ‌న వ‌ద్ద డీజీపీగా ప‌నిచేసి దినేశ్ రెడ్డి ఎప్పుడో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.. ఇప్పుడు ఈయ‌న బీజేపీలో చేరితే దినేశ్‌రెడ్డి కింద జూనియ‌ర్‌గా ఉండాల్సి ఉంటుందేమో.. అస‌లు ఈయ‌న గారిపై పీక‌ల లోతు కోపంతో ఉన్న దినేశ్‌రెడ్డి ఏం చేస్తాడు?   తెలుగు సినిమాలో మాదిరిగా సీనియ‌ర్ జూనియ‌ర్ అయిన‌ప్పుడు ఎదుర్కొనే వేధింపులే ఉంటే వీళ్లిద్ద‌రి మ‌ధ్య పండే హాస్యాన్ని త‌ల‌చుకుంటే పొట్ట చెక్క‌లు కావ‌డం గ్యారెంటీ..!!

నోట్‌:  తాజా ప‌రిణామాలు చూస్తుంటే నేను ఉన్నంత కాలం ఆంధ్రా-తెలంగాణ ఏక‌మ‌య్యే ప‌రిస్థితి అయితే క‌నిపించ‌డం లేదు.  ఆంజ‌నేయుడు సంజీవ‌నీ ప‌ర్వ‌తాన్ని తీసుకెళ్లిన‌ట్లు తెలంగాణ రాష్ట్రాన్ని మోసుకెళ్లే వీలు ఉంటే.. క‌చ్చితంగా పొరుగున ఆంధ్రా రాష్ట్రం లేకుండా దానికి స్థాన‌చ‌ల‌నం క‌ల్పించాల‌న్నంత‌గా ప్ర‌జ‌లు కోరుకుంటున్నారు... తెలంగాణ‌ను తీసుకెళ్లి ఏ మ‌ధ్య ప్ర‌దేశ్ ప‌క్క‌నో.. గుజ‌రాత్ ప‌క్క‌నో.. ఢిల్లీ ప‌క్క‌నో పెడితే వీళ్ల‌తో ఏ విష‌యంలోనూ ఈ పంచాయితీలు ఉండ‌వ‌న్న భావ‌న ఉంది.. లేక‌పోతే పొద్దున లేస్తే చాలు ఏదో ఒక కిరికిరి పెడుతూ తెలంగాణ‌ను ప్ర‌శాంతంగా ఉండ‌నీయ‌డం లేదు క‌దా...

Saturday 8 November 2014

తెలంగాణ‌కు ప్ర‌త్యేక‌ సినీ ప‌రిశ్ర‌మ ఉండాల్సిందే...


తెలుగు సినీ ప‌రిశ్ర‌మ నుంచి మ‌న ప‌రిశ్ర‌మ వేరు కావాల్సిందే...

ఈ తెలుగు పేరిటే ఇన్నాళ్లు అణ‌చివేత‌లు జ‌రిగాయి.. అందుకే  మ‌న అస్థిత్వం మ‌న‌కు ఉండాలి...

మ‌న‌కు వ‌ర‌దొస్తే, మ‌న‌కు క‌ర‌వొస్తే వాళ్లు మేం సైతం అంటూ ఎప్పుడూ రాలేదు.. వ‌స్తార‌న్న న‌మ్మ‌కం లేదు..

మ‌న ప‌రిశ్ర‌మ మ‌న‌కు ఉంటే ద‌క్షిణ భార‌త సినీ ప‌రిశ్ర‌మ‌ల్లో మ‌న‌దీ ఒక‌టిగా ఉంటుంది..

అప్పుడు మ‌న రైతులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నా... మ‌నకు క‌ర‌వొచ్చినా మ‌న క‌ళాకారులు మ‌న‌వారిని ఆదుకునేందుకు ఛారిటీ షోలు చేస్తారు..

ఈ విష‌యంపై ప్ర‌భుత్వం, క‌ళాకారులు, మేధావులు చ‌ర్చించి తెలంగాణ సినీ ప‌రిశ్ర‌మ‌ను అభివృద్ధి చేయ‌డానికి చ‌ర్య‌లు తీసుకోవాలి...

నోట్‌:  తెలుగు ప‌రిశ్ర‌మకు మ‌రో కీల‌క‌ కేంద్రంగా విశాఖ మారే స‌మ‌యంలో తుపాన్ రావ‌డంతో ఆ ప్ర‌క్రియ‌కు  కొంత ఆటంకం వాటిల్లింది...

ఇప్పుడు ఆ విశాఖ‌ను అభివృద్ధి చేసేందుకు అక్క‌డి వారు తాప‌త్ర‌య ప‌డుతున్నారు... ఈ నేప‌థ్యంలో మ‌న వాళ్లంతా మ‌న సినీ ప‌రిశ్ర‌మ‌ను అభివృద్ధి చేసే దిశ‌గా కృషి చేయాలి... వీలైతే హిందీ చిత్ర నిర్మాణాల కేంద్రంగా కూడా హైద‌రాబాద్‌ను మార్చాలి.. ముంబ‌యి త‌ర్వాత మ‌న వ‌ద్ద‌కు బాలీవుడ్ వ‌చ్చేలా ప్ర‌ణాళిక‌లు ఉండాలి...

ఇక్క‌డ దేవేంద‌ర్ గౌడ్ లేడా? ఇంకా మ‌ల్లా రెడ్డి లేడా?

మా నాయ‌కుడు ఢిల్లీ వెళ్లిన ప్ర‌తీసారి ఆంధ్రా స‌మ‌స్య‌ల‌తోపాటు తెలంగాణ స‌మ‌స్య‌ల‌ను కేంద్రానికి చెబుతున్నాడ‌ని వీళ్లు తెగ ప్ర‌చారం చేసుకున్నారు..

స‌మ‌స్య‌లు చెప్పిండో లేదో తెలియదు కానీ... రెండు మంత్రి ప‌ద‌వులు ఆంధ్రాకే ద‌క్కేలా కోరిన‌ట్లు స్ప‌ష్టంగా తెలిసిపోతోంది.. తెలంగాణపై  ఆయ‌న‌కున్న‌ ప్రేమ కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది...

మ‌రి తెలంగాణ‌, ఆంధ్రా రెండు క‌ళ్లు అనే పెద్ద మ‌నిషికి.. తెలంగాణ నుంచి ఒక్క‌రినైనా కేంద్ర మంత్రిగా చూడాల‌ని అనుకోవ‌డం లేదా?

ఇక్క‌డ దేవేంద‌ర్ గౌడ్ లేడా?   ఇంకా మ‌ల్లా రెడ్డి లేడా?   

ఆ నిర్వాహ‌కుల‌కు నిజంగా ఆలోచ‌నే లేదు...


ఆలోచ‌నే  ఉంటే ల‌వ్ ఫ‌ర్ కిస్ కార్య‌క్ర‌మాన్ని ఏదైనా టీవీ స్టూడియోలో చేసే వారు.. మీడియా వాళ్లు విభిన్న యాంగిల్స్‌లో దాన్ని చూపేవారు..

అప్పుడు వాటిని ఎవ‌రూ అడ్డుకోలేరు కదా... ఎందుకంటే మీడియా స్వేచ్ఛ‌ను అడ్డుకోవ‌డం రాజ్యాంగ విరుద్ధ‌మంటారు... మీడియా ఆఫీసుల్లోకి చొర‌బ‌డి దాడులు చేస్తే ప్ర‌పంచ స‌మ‌స్య‌గా చిత్రీక‌రించేస్తారు కదా...

ఉల్టా, జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టుకునే వారు...


ఇక ముందు ఇలాంటివి చేస్తే... కొన్ని టీవీల‌కు చెప్పండి.. పండ‌గ చేసుకుంటాయి.. రోజంతా చూపిందే చూపి శున‌కానందాన్ని పొందుతాయి...!!

సామాజిక నేప‌థ్యాల‌ను రాస్తారా?

-----------------------

మామూలుగా అయితే ఎవ‌రైనా మంత్రి ప‌ద‌వికి ఎంపికైతే ప‌త్రిక‌ల్లో ఆయ‌న‌ సామాజిక వ‌ర్గం ఏంటి?  అన్న‌ది ప్ర‌స్తావిస్తారు.. ఆ సామాజిక వ‌ర్గాన్ని ఎందుకు ఎంపిక చేశారో చెబుతారు... అన్ని వ‌ర్గాల‌కు మంత్రివ‌ర్గంలో స‌మ‌ప్రాధాన్యం ద‌క్కిందా?  అని విశ్లేషిస్తారు... ఇప్పుడు ఆ విశ్లేష‌ణ‌లు జ‌ర‌గ‌డం లేదు.. ముఖ్యంగా ఆంధ్రా నుంచి ఉన్న న‌లుగురు(రేప‌టి వ్య‌క్తిని క‌లుపుకుంటే) మంత్రుల సామాజిక నేప‌థ్యంను ఎవ‌రూ ప‌త్రిక‌ల్లో రాయ‌డం లేదు.. అస‌లు సామాజిక న్యాయం జ‌ర‌గ‌డం లేద‌ని విశ్లేష‌ణ‌లు గానీ, స్టేట్ మెంట్లు గానీ రావ‌డమే లేదు...

బ‌హుషా సామాజిక న్యాయాల‌నే ష‌ర‌తులు తెలంగాణ రాష్ట్రానికి వ‌ర్తిస్తాయేమో.....

రేప‌టి ప‌చ్చ ప‌త్రిక‌ల ప్ర‌ధాన వార్త‌లివే..

రేపు మోడీ క్యాబినెట్ విస్త‌ర‌ణ ఉన్న‌ప్ప‌టికీ శ్రీ‌శైలంలో  తెలంగాణ ప్ర‌భుత్వం విద్యుత్ ఉత్ప‌త్తి చేస్తుంద‌న్న వార్తే ప‌చ్చ ప‌త్రిక‌ల‌కు మొద‌టి పేజీలో ప్రాధాన్య అంశం అయ్యే అవ‌కాశం ఉంది... ఈసారి ఏమ‌ని రాస్తాయో...!

ఇక పింఛ‌న్ల ప‌థ‌కంలో గంద‌ర గోళం అంటారేమో....!!

ధ‌ర్నాలు, నిర‌స‌న‌లు అని రాసినా ఆశ్చ‌ర్యం లేదు.. చూసి న‌వ్వుకోవాలంతే...

మా భూమి తీసుకోండి... ఆంధ్రా రాజధాని కోసం బారుతు తీరిన రైతులు...

మీరు విన్నారా... !

ఆంధ్రాలో రాజ‌ధాని నిర్మాణానికి స్వ‌చ్ఛందంగా త‌మ ప‌చ్చ‌ని పంట‌పొలాల‌ను ఇచ్చేందుకు రైతులు క్యూ క‌డుతున్నారు...మా భూమి తీసుకోండి... ఆంధ్రా రాజధాని కోసం బారులు తీరిన రైతులు...
33 వేల ఎక‌రాల భూ స‌మీక‌ర‌ణ‌ను ఆపాలంటూ విప‌క్షాలు పెట్టే మీటింగ్‌లను అక్క‌డి రైతులే వ‌చ్చి అడ్డుకుంటున్నారు....
ఈ రోజే ఈటీవీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చూశాను... ఇంత‌కీ ఎందరు రైతులు అని లెక్క అడ‌గ‌కండీ...!

---------------------

తెలంగాణ‌లో ఏదైనా విద్యుత్ ప్రాజెక్టుకో, లేదా ఐటీ ప్రాజెక్టుకో ఓ వెయ్యి ఎక‌రాలు సేక‌రించాల్సి వ‌స్తే.. అప్పుడు చూడాలి వార్త‌ల శైలి ఎలా మారుతుందో...
ఒక్క‌రు ఆందోళ‌న చేసినా మొద‌టి పేజీ వార్తే...

మావోయిస్టుల బంద్ విజ‌య‌వంత‌మైతే వార్తలు ఇలా ఉంటాయి..

ఈ రోజు మావోయిస్టుల బంద్‌కు టీడీపీ, ఒక‌టి రెండు ప‌చ్చ మీడియా సంస్థ‌లు మ‌ద్ద‌తు ఇచ్చాయి... రేపు బంద్ విజ‌య‌వంతం అయితే.. మ‌ళ్లా వీళ్లే  తెలంగాణ‌లో మావోయిస్టులు పాగా వేస్తున్నారు..  శాంతిభ‌ద్ర‌త‌లు అదుపు త‌ప్పుతున్నాయి... అసాంఘిక శ‌త్రుల‌కు అడ్డాగా తెలంగాణ మారుతోంది.. అంటూ క‌థ‌నాలు, విమ‌ర్శ‌లు చేస్తారు...!!!

మావోయిస్టుల బంద్ పిలుపుతో హైద‌రాబాద్‌లోని ఐబీఎం కంపెనీ బెంగ‌ళూరుకు త‌ర‌లిపోయింది... హైద‌రాబాద్ బ్రాండ్ ఇమేజీకి డ్యామేజీ అని రేపు ఆ ఎల్లో మేధావి అంటాడేమో....!!!

మేం స‌క్ర‌మ కేసు పెడితే మీకు క‌క్ష సాధింపుగా అనిపిస్తుందా?

గుంటూరులో తెలంగాణ‌కు చెందిన గ్రూప్ -1 అధికారిని ఆయ‌న రిలీవ్ అయి సొంత రాష్ట్రానికి వ‌చ్చే ఒక రోజు ముందే ఏసీబీ కేసులో అక్ర‌మంగా ఇరికించిన‌ప్పుడు  మ‌న ప్ర‌భుత్వం సైలెంట్‌గా ఉంది...

కానీ 400 కోట్ల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ చీఫ్ సెక్ర‌ట‌రీ ఆదేశాల మేర‌కు ఆంద్రా ఖాతాల‌కు అక్ర‌మంగా మ‌ళ్లించిన విష‌యంపై తెలంగాణ‌ పోలీసులు విచార‌ణ చేయ‌డం మాత్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి త‌ప్పుగా క‌నిపిస్తుంది...

మా అధికారిపై గుంటూరులో కేసు పెట్టి వేధిస్తారు.. అది కూడా అక్ర‌మ కేసు. మ‌రి మీ లూటీపై మేం స‌క్ర‌మ కేసు  పెడితే మీకు క‌క్ష సాధింపుగా అనిపిస్తుందా?

ఈ విష‌యం తెలిస్తే మావోయిస్టులు కూడా బంద్ ను ఉప‌సంహ‌రించుకుంటారేమో..

ఈ రోజు తెలంగాణ‌లో మావోయిస్టుల బంద్‌... టీడీపీ మ‌ద్ద‌తు...!!!

టీడీపీ మ‌ద్ద‌తు ఇచ్చింద‌న్న విష‌యం తెలిస్తే మావోయిస్టులు కూడా బంద్‌ను ఉప‌సంహ‌రించుకుంటారేమో...!!

ఇది మ‌న విపక్షం తీరు..

ఆంధ్రా అసెంబ్లీ స‌జావుగా సాగ‌డానికి అక్క‌డి ప్ర‌తిప‌క్షం అధికార ప‌క్షానికి స‌హ‌క‌రించింది...   మ‌రి మ‌న వ‌ద్ద విప‌క్షం మ‌న తెలంగాణ‌లో విప‌క్షం ఆంధ్రాకు స‌హ‌క‌రిస్తోంది...

ఓ చిన్న క‌థ‌....!!!


సార్‌... మేం మొన్న 400 కోట్ల రూపాయ‌ల దోపిడీకి పాల్ప‌డ్డాం... వెంట‌నే హైద‌రాబాద్ పోలీసులు మావోళ్ల‌ను ప‌ట్టుకెళ్లి విచారించారు.. ఇలా మేం దోపిడీకి పాల్ప‌డినా మ‌మ్మ‌ల్ని చూసీ చూడ‌న‌ట్లు వ‌దిలేసేలా... హైద‌రాబాద్ పోలీసులను క‌ట్ట‌డి చేసేందుకు చ‌ర్య‌లు తీసుకోండి.... అని కోరితే ఎదుటి వాళ్లు ముఖం మీద ఉమ్మేస్తార‌న్న ఉద్దేశంతో....  హైద‌రాబాద్ పోలీసుల‌ను గ‌వ‌ర్న‌ర్ ప‌రిధిలోకి తీసుకురండి.. అంటూ కేంద్రాన్ని కోర‌డానికి బ‌య‌లు దేరార‌ట‌....!!!

ఒకే నేత మూడు పాత్ర‌ల్లో...

అత‌డు ఒక రాష్ట్రంలో ప్ర‌తిప‌క్ష నేత‌గా... ఒక రాష్ట్రంలో ముఖ్య‌మంత్రిగా, కేంద్రంలో మంత్రిగా...
అభిన‌వ ద‌శావ‌తారిలాగా ఒక్కో పాత్ర పోషిస్తున్నాడు...!!

రాజ‌కీయాలు నేర్పే యూనివ‌ర్సిటీ కావాలి...

జైరాం ర‌మేశ్‌, మ‌నోహ‌ర్ పారిక‌ర్ ఇద్ద‌రూ ఐఐటీయ‌న్లేన‌ట‌.. అర‌వింద్ కేజ్రీవాల్ కూడా ఐఐటియ‌నే.... అంద‌రూ క‌ళంక‌ర‌హితులే...

అయితే వీళ్లు చ‌దివిన చ‌దువులేంది.. చేస్తున్న ప‌నులేంది.... వీరి విజ్ఞానంతో ప‌రిశ్ర‌మ‌లు స్థాపించొచ్చు క‌దా.. నూత‌న ఆవిష్క‌ర‌ణ‌లు చేయొచ్చు క‌దా...

కొంప‌దీసి బొమ్మ‌రిల్లు సినిమా త‌ర‌హాలో త‌ల్లిదండ్రుల కోసం ఉన్న‌త చ‌దువులు చ‌దివి చిర‌కు వారి మ‌న‌సుకు న‌చ్చిన రంగాల్లోకి వ‌చ్చారా?

ఇలా ఐఐటియ‌న్లంతా రాజ‌కీయాల్లోకి వ‌స్తే  దేశంలో నూత‌న ఆవిష్క‌ర‌ణ‌లు చేసే వాళ్లు క‌ర‌వ‌వుతారు క‌దా...!!

అందుకే రాజ‌కీయాల్లో చేరే వారి కోసం ప్ర‌త్యేక యూనివ‌ర్సిటీ ఉండాలి.. అందులో రాజ‌కీయాల‌కు ప‌నికి వ‌చ్చే చ‌దువే ఉండాలి... ఇంకే కోర్సూ ఉండొద్దు...

వారికి దేశంలోని నాయ‌కులంతా క్లాస్‌లు తీసుకోవాలి... ఉత్తమ పార్ల‌మెంటేరియ‌న్ల జీవిత పాఠాల‌ను బోధించాలి....!!

ప్ర‌తీ రాష్ట్రంలోనూ అలాంటి యూనివ‌ర్సిటీలు ఉండాలి.. పార్టీల‌న్నీ కూడా ఆ యూనివ‌ర్సిటీల నుంచే నాయకుల రిక్రూట్‌మెంట్ చేప‌ట్టాలి...111

స్వ‌చ్ఛ భార‌త్ స్ఫూర్తిని దెబ్బ‌తీయొద్దు..

స్వ‌చ్ఛ భార‌త్ చేయ‌కున్నా ప‌ర్వాలేదుకానీ.. చెత్త పోయించుకొని స్వ‌చ్ఛ భార‌త్ చేసి మోడీ గారి ఆశ‌యానికి తూట్లు పొడ‌వ‌కండి... మీ చేష్ట‌లు చూస్తే మ‌హాత్ముడి ఆత్మ ఘోషిస్తుంది...

మ‌న వాటా ఇప్పించి ఉంటే ఈ క‌ష్టాలు ఉండేవి కాదు కదా...

మేం చెబితేనే మా పార్టీకి చెందిన ఆ రాష్ట్ర సీఎం విద్యుత్ ఇస్తున్నార‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లుకుతున్నారు.. ఆయ‌న ఏమైనా పుక్కెడుకు విద్యుత్ ఇస్తున్నాడా?   లేక యూనిట్‌కు రెండు రూపాయ‌ల్ క‌న్సెష‌న్ ఇచ్చాడా?  ఇదంతా వాణిజ్య‌మే క‌దా... !!
అయినా మీరు చెబితే మీ పార్టీ అగ్ర‌నేత‌లు నిజంగా వినేవారైతే... న్యాయంగా ఆంధ్రా నుంచి రావాల్సిన వాటాను ఇప్పించి ఉంటే ఈ విద్యుత్ కొనుగోలు అవ‌స‌రాలే ఏర్ప‌డేవి కాదు క‌దా...!!!

Friday 7 November 2014

స్విస్ బ్యాంకుల్లో జన్ ధ‌న్ ఖాతాలు ఎప్పుడో ఓపెన్ అయిన‌ట్లు ఉన్నాయి...

స్విస్ బ్యాంకుల్లో జన్ ధ‌న్ ఖాతాలు ఎప్పుడో ఓపెన్ అయిన‌ట్లు ఉన్నాయి...  ఈ అభిన‌వ బీద‌లు విదేశాల్లో జీరో బ్యాలెన్సు అకౌంట్ల‌తో దేశాభివృద్ధికి దోహ‌ద‌ప‌డుతున్న‌ట్లు ఉన్నారు.. !!
----------
పాపం దేశం కాని దేశంలో జీరో బ్యాలెన్సుతో జ‌న్ ధ‌న్ ఖాతాల‌ను ఓపెన్ చేసిన వారి ఖాతాల్లోకి న‌గ‌దు బ‌దిలీ సొమ్మును జ‌మ చేసి ఆదుకోరా?

ఎల్లో మీడియా హృద‌య చోరుడు ఎవ‌రో?


ఈసారి అసెంబ్లీలో ఆ ఎల్లో మేధావి లేడు... ఒక‌వేళ ఆయ‌న ఉండి ఉంటే కేసీఆర్‌, ఇత‌ర నేత‌లంద‌రి క‌న్నా ఆ ఏక్ నిరంజ‌న్ మాట‌ల‌కే ఎల్లో మీడియాలో మొద‌టి పేజీలో చోటు ద‌క్కేది... ఇప్పుడు ఎల్లో మీడియా మ‌రో ఏక్ నిరంజ‌న్‌ను వెతికే ప‌నిలో ఉన్న‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి... ఈ నేప‌థ్యంలో ప‌చ్చ పార్టీకి చెందిన ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య తీవ్ర పోటీ నెల‌కొంద‌ట‌...  ఇద్ద‌రూ అదే ప‌నిగా సీఎంను విమ‌ర్శిస్తూ ప‌చ్చ ప‌త్రిక‌ల ప్రియ నాయ‌కుడిగా ఎదిగేందుకు త‌హ‌త‌హ‌లాడుతున్న‌ట్లు స‌మాచారం... సంద‌ట్లో స‌డేమియాలా ఇంకో పార్టీ నేత కూడా వీరికి పోటీ ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు.. మ‌రి ప‌చ్చ ప‌త్రికల  హృద‌య చోరుడు ఎవ‌రవుతారో రాబోయే రోజులే మ‌న‌కు స‌మాధానం చెబుతాయి... అప్ప‌టి వ‌ర‌కూ వీరి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను ఆస్వాదించండి..!!!

తెలంగాణ‌లో ర‌హదారుల అభివృద్ధికి కేంద్రం నిధుల‌ను కోరండి...

తెలంగాణ ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి...

తెలంగాణ‌లో ర‌హదారుల అభివృద్ధికి కేంద్రం నిధుల‌ను కోరండి...

ఈ ఏడాది మే నెల‌లో సీమాంధ్ర ప్ర‌గ‌తికి బాట‌లు అంటూ చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి సూచ‌న‌లు ఇస్తూ ఈనాడు ప‌త్రిక రాసిన ఈ క‌థ‌నాన్ని మ‌న‌కూ అన్వ‌యించుకోవాలి(ఎలాగూ ఇలాంటివి మ‌న కోసం రాయ‌రు కాబ‌ట్టి)...  కేంద్రం నుంచి 40 వేల కోట్లు తెచ్చుకుని ర‌హదారుల‌ను అభివృద్ధి చేసుకోవ‌చ్చ‌ని ఆ క‌థ‌నం సారాంశం... ఈ నేప‌థ్యంలో మ‌న నిధుల‌ను ఇతర సంక్షేమ ప‌థ‌కాల‌కు కేటాయించి.. కేంద్రం నుంచి ర‌హ‌దారుల కోసం రావాల్సిన నిధుల‌ను రాబ‌ట్టుకుంటే బాగుంటుంది.. అన్ని మంత్రిత్వ శాఖ‌ల నుంచి మ‌నం ఏఏ విధంగా ల‌బ్ధి పొంద‌వ‌చ్చో నిపుణులు, ఐఏఎస్‌ల ద్వారా స‌ల‌హాలు తీసుకొని కేంద్రానికి ప్ర‌తిపాద‌న‌లు పంపించాలి... వీలైనంత వ‌ర‌కు ఒత్తిడి పెంచాలి.. ఒక‌వేళ మ‌న‌కు నిధులు ఇవ్వ‌ని ప‌క్షంలో కేంద్రం తీరును ఎండ‌గ‌ట్టాలి.. ఈ విష‌యంలో కొంత అప్ర‌మ‌త్తంగా ఉంటే సంక్షేమ ప‌థ‌కాల‌కు ఎలాంటి నిధుల కొర‌త ఉండ‌దు...

ఈ విష‌యంలో వ‌రంగ‌ల్ పోలీసులు నాకు బాగా న‌చ్చుతారు.. వారి పంథాలో తీర్పులు ఉండాలి..!!

మొన్న ఇఫ్లూలో ఢిల్లీ విద్యార్థినిపై అత్యాచారం జ‌రిగిన ఘ‌ట‌న‌లో ఆంధ్రా రాజ‌కీయ నేత‌ల కుమారులున్నార‌ని మొద‌టి రోజు ఏదో ప‌త్రిక‌లో చ‌దివాను... ఆ త‌ర్వాత అన్ని ప‌త్రిక‌ల్లోనూ ఆ ఘ‌ట‌న విచార‌ణ‌, నిందితులు వివ‌రాలు అంత ప్ర‌ముఖంగా రాయ‌డం లేదు ఎందుకు?
దీనిపై విప‌క్షాలు అసెంబ్లీలో ఆందోళ‌న చేస్తాయా?  నిందితుల‌ను ఉరి తీయాల‌ని మీడియాలో జ‌న వాణి రావాలి క‌దా.. అవేం రావ‌డం లేదు ఎందుకు?
---------------------
ఎవ‌రు డిమాండ్ చేసినా చేయ‌క‌పోయినా స‌రే రాష్ట్ర ప్ర‌భుత్వం మాత్రం నిందితుల‌కు క‌ఠిన మైన శిక్ష ప‌డేలా చూడాలి.. ఆడోళ్ల జోలికి వెళితే  అవేవో కోసేయ‌డ‌మో పీకేయ‌డ‌మో చేస్తామ‌ని అప్ప‌ట్లో కేసీఆర్ గారు అన్నారు క‌దా...  వాటిని త‌క్ష‌ణ‌మే అమ‌లు చేయాలి...
తెలంగాణ‌లో అయేషా మీరా, ప్ర‌త్యూష‌లాంటి ఉదంతాలు జ‌ర‌గ‌కూడ‌దు... నిందితులెవ‌రైనా శిక్ష‌లు క‌ఠినంగా ప‌డాల్సిందే.. ఈ విష‌యంలో వ‌రంగ‌ల్ పోలీసులు నాకు బాగా న‌చ్చుతారు..  వారి పంథాలో తీర్పులు ఉండాలి..!!

వాళ్ల‌ది త‌ప్పు అయితే.. వీరిది ఒప్పా..?

మొన్న కాశ్మీర్ లో వ‌ర‌ద‌లు వ‌చ్చిన‌ప్పుడు  సై న్యం సాయం చేసింది... గ‌తంలో అక్క‌డి ప్ర‌జ‌లు సైన్యం రాళ్లు వేశార‌ని.. ఇప్పుడు ఆ సైన్య‌మే వారి ప్రాణాల‌ను కాపాడుతోంద‌ని ఫేసుబుక్‌లో చాలా మంది పోస్టులు పెట్టారు...

------------------------------------
స‌మైక్యాంధ్ర ఉద్య‌మ స‌మ‌యంలో తాము దేశం నుంచే విడిపోతామని, ఈ దేశంతో త‌మ‌కు సంబంధం లేద‌న్న‌ట్లు మాట్లాడిన‌ ఆంధ్రా నాయకులు మ‌రి మొన్న హుదూద్ తుపాన్ వ‌చ్చిన స‌మ‌యంలో సాయం చేయమ‌ని అదే కేంద్రాన్ని, తెలంగాణ‌ను, ఇత‌ర రాష్ట్రాల‌ను అర్థించారు క‌దా...   ఎందుకిలా?

థాంక్ గాడ్‌... ఆ విమానంలో కేసీఆర్ లేడు కాబ‌ట్టి బ‌తికి పోయాం..

థాంక్ గాడ్‌... ఆ విమానంలో కేసీఆర్ లేడు కాబ‌ట్టి బ‌తికి పోయాం.. లేక‌పోతేనా ఎయిర్ హోస్టెస్ చేయి ప‌ట్టుకున్న కేసీఆర్ అని కూడా రాస్తారు... కీచ‌క కేసీఆర్ అని కూడా హెడ్డింగ్ లు పెడ‌తారు...

ఇప్పుడు చూశారా... ఎలా వెన‌కేసుకు వ‌స్తున్నారో... ఆయ‌న‌ను ఆమె చికాకు పెట్ట‌డంతో విసుక్కున్నార‌ట‌... ఉల్టా ఆమెపై త‌మ పార్టీకి చెందిన కేంద్ర మంత్రికి ఫిర్యాదు కూడా చేశార‌ట‌... ప్ర‌తికూల వార్త‌ల‌ను కూడా అనుకూలంగా రాయించుకోవ‌డంలో వీళ్ల త‌ర్వాతే ఎవ‌రైనా...!!!

నేను వీరి క‌న్నా చాలా బెట‌ర‌ని అనిపిస్తుంది..

రాష్ట్ర బ‌డ్జెట్‌లో 43 వేల కోట్లు కేంద్రానివే....

కేంద్రానివే అంటే ప్ర‌ధాని గారి జేబులోనివి కాదు క‌దా... సంఘ్ ప‌రివార్ కార్యాల‌యం నుంచి ఇస్తున్న‌వి కాదు క‌దా...

అవ్వ‌... కేంద్రానికి మ‌న రాష్ట్రం నుంచి వెళ్తున్న నిధులు ఎన్ని ల‌క్ష‌ల కోట్లో ఆ పెద్ద మ‌నిషికి తెలియ‌దా?

మ‌న ద‌గ్గ‌ర ట్యాక్సీల రూపంలో కేంద్రానికి వెళ్తున్న దాంట్లో కొంత మొత్త‌మే క‌దా మ‌న‌కు ఇచ్చేది...

మోడీ గారు సీఎంగా ఉన్న‌ప్పుడు కూడా కేంద్రం నిధులు ఆ రాష్ట్రానికి వెళ్లిన విష‌యం ఆయ‌న‌కు తెలియ‌దా?   అప్పుడు అక్క‌డి కాంగ్రెస్ వాళ్లు ఇలాగే విమ‌ర్శ‌లు చేశారా?

ఈ మాత్రం ప‌రిజ్ఞానం లేకుండా విచ్ఛ‌ల విడిగా విమ‌ర్శ‌లు చేసే నాయ‌కుల‌ను చూస్తుంటే నేను వీరి క‌న్నా చాలా బెట‌ర‌ని అనిపిస్తుంది..

Thursday 6 November 2014

స‌మైక్యాంధ్ర కోసం చ‌నిపోయిన వారు 500 మంది... మ‌రి వారి కుటుంబాల‌ను ఆదుకున్నారా? లేదా?

----------------------------------------
స‌మైక్యాంధ్ర కోసం చ‌నిపోయిన వారు 500 మంది...
మ‌రి వారి కుటుంబాల‌ను ఆదుకున్నారా?  లేదా?
వారికి చంద్ర‌బాబునాయుడు ప‌రిహారం ఇచ్చారా?
లేక ప‌చ్చ ప‌త్రిక‌లు రాసిన‌ ఈ మ‌ర‌ణాల‌న్నీ బోగ‌స్‌వేన‌ని ప‌ట్టించుకోలేదా?
----------------------------------------
సీడ‌బ్ల్యుసీ తెలంగాణ‌కు అనుకూలంగా నిర్ణ‌యం తీసుకున్న త‌ర్వాత తెలంగాణ బిల్లు ఆమోదంపొందేవ‌ర‌కు (దాదాపు 8 నెల‌ల వ్య‌వ‌ధిలో) ఆంధ్రా,రాయ‌ల‌సీమ‌లో స‌మైక్యాంధ్ర కోసం చ‌నిపోయిన వారి సంఖ్య 500ల‌కు పైనే.. ఈ మ‌ర‌ణాల వార్త‌ల‌న్నీ ఆయాప‌త్రిక‌ల్లో మొద‌టి పేజీలో వ‌చ్చాయి... ప్ర‌తీ రోజుకు రెండు మూడు మ‌ర‌ణాలు న‌మోద‌వుతున్న‌ట్లు అప్ప‌ట్లో పేర్కొన్నారు.. మ‌రి ఈ స‌మైక్యాంధ్ర కోసం చ‌నిపోయిన వారి కుటుంబాల‌కు ఏమైనా ప‌రిహారం అందిందా?   ఆయా ప‌త్రిక‌లు ఏమైనా రాశాయా?   అమ‌రుల కుటుంబాల‌ను ఆదుకోవాల‌ని చంద్ర‌బాబునాయుడును డిమాండ్ చేశాయా?

---------------------------------------

ప‌చ్చ ప‌త్రిక‌లు స‌మైక్యాంధ్ర కోసం జ‌రిగిన ఉద్య‌మానికి ఊత‌మివ్వ‌డానికి 500 మందిని చంపేశాయి..  మ‌నుషుల‌ను చంప‌డం వాటిని వీరికి న‌చ్చిన ఖాతాలో వేయ‌డం వెన్నెతో పెట్టిన విద్యే... వీటి కుట్ర రాత‌ల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండ‌టం అత్య‌వ‌స‌రం !!

మేం చెప్పే నీతి సూత్రాలు మాకు వ‌ర్తించ‌వ్‌...

ఇదీ సంగ‌తి..

లంచం ఇవ్వ‌డం నేరం...

కానీ మా ప్ర‌సారాలు మొద‌లు కావ‌డం కోసం ఏం చేసినా త‌ప్పుకాదు... మేం చెప్పే నీతి సూత్రాలు మాకు వ‌ర్తించ‌వ్‌... మేం రాజ్యాంగానికి అతీతులం..!!

మిన్నాగుల‌తో జ‌ర‌ భ‌ద్రం కొడుకో...!

మిన్నాగుల‌తో జ‌ర‌ భ‌ద్రం కొడుకో...!
అవి న‌టిస్తున్నాయి.. అద‌ను దొరికితే కాల‌కూట విషాన్ని చిమ్ముతాయి...

---------------------------
మిత్రులారా.. మీ ఇంట్లో గోడ‌ల‌కు త‌గిలించి ఉన్న‌ అంద‌మైన రంగుల టీవీల్లో అవి రోజూ మిమ్మ‌ల్ని రంజింప జేస్తాయి.. మిమ్మ‌ల్ని మెప్పించేలా ఆ మిన్నాగులు నాట్య‌మాడుతున్నాయి..  మీ ఇంటి వాకిలిలో ఆపై టీపాయి చేరి పై పొద్దున్నే మిమ్మ‌ల్ని ప‌ల‌క‌రిస్తుంది రంగురంగుల  మిన్నాగు. అబ్బా.. మ‌న‌ల్ని రంజింప జేస్తున్నాయ‌ని మీరు అనుకొని వాటిని అదేప‌నిగా చూస్తుంటే అద‌ను చూసి మీ పై విషం చిమ్ముతాయి..  విష స‌ర్పాల స‌హ‌జగుణం కాటేయ‌డ‌మే.. అయ్యో ఇన్నేళ్లు మ‌న స‌ర్క్యులేష‌న్ పెర‌గ‌డానికి కార‌ణం వీరే.. మ‌నం ఎద‌గ‌డానికి వీళ్లు రోజూ పాలుపోశార‌ని అవి ఆలోచించ‌వు.. బుస‌లు కొడుతూ కాటేయ‌డ‌మే వాటికి తెలిసిన గుణం... అందులో ఈ మిన్నాగులు మ‌రీ తెలివి మీరాయి... స‌రైన స‌మ‌యం కోసం ఎదురుచూస్తున్నాయి..
------------------------
భ‌ద్రం కొడుకో.. కొంచెం వాటిని దూరంగా ఉండు.. అడ‌విలో పారేయ‌డ‌మో.. ఆంధ్రాకు పంపించడ‌మో చేయండి... !!

నోట్‌: చిన్న పామునైనా పెద్ద క‌ర్ర‌తో కొట్ట‌మ‌న్నారు పెద్ద‌లు.. వాళ్లు ఊరికే చెప్ప‌లేదు.. అనుభ‌వంతో చెప్పారు.. మ‌నం ఆచ‌రించాలి... !!!

యాసిన్ భ‌త్క‌ల్ ఎవ‌రి హ‌యాంలో త‌యార‌య్యాడో తెలియ‌దా?

హైద‌రాబాద్ అంటే చాలు ఉగ్ర‌వాద కేంద్రం అన్న‌ట్లు ఒక నేత ప‌దేప‌దే మాట్లాడుతుంటాడు...
మ‌రి ఆయ‌నకు రియాజ్ భ‌త్క‌ల్ ఎక్క‌డ పుట్టిండో తెలియ‌దా?  యాసిన్ భ‌త్క‌ల్  ఎవ‌రి హ‌యాంలో త‌యార‌య్యాడో తెలియ‌దా?
దావూద్ ఇబ్ర‌హీం, చోటా ష‌కీల్‌, చోటా రాజ‌న్‌లు ఎక్క‌డ మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించారో తెలియ‌దా?
అసీమానంద‌, సాధ్వీ ప్ర‌జ్ఞాసింగ్‌లు ఏ రాష్ట్రం వారు...?
బింద్ర‌న్ వాలా ఎక్క‌డి వాడు?
ఎల్టీటీఈ వాళ్లు ఎవ‌రు?

ఈ లెఫ్ట్ అండ్ రైట్ త‌ర్కాలు నా చిన్న మెద‌డుకు అస్సలు అర్థం కావు.

ఈ లెఫ్ట్ అండ్ రైట్ త‌ర్కాలు నా చిన్న మెద‌డుకు అస్సలు అర్థం కావు.
-------------------------------------

స్వామీజీలు భ‌క్తుల‌కు ముద్దులు పెడితే వాళ్ల‌కు అశ్లీలంగా క‌నిపిస్తుంది...
మంత్రులో..రాజ‌కీయ నేత‌లు ఎవ‌రితోనైనా ముద్దులు పెడుతూ క‌నిపిస్తే అదీ అశ్లీల‌తే అంటూ ర‌చ్చ చేస్తారు..

మ‌రి యువ‌త ముద్దులు పెట్టుకుంటే అది ప్రేమ వ్య‌క్తీక‌ర‌ణ అంటారు...
ఇందులో అశ్లీల‌తే లేదంటారు...

ఈ లెక్క‌న ఇక రాజ‌కీయ నేత‌లు, స్వామీజీలు, ఎవ‌రైనా స‌రే బ‌హిరంగంగా ముద్దుల్లో తేలిపోవ‌చ్చ‌న్న మాటే క‌దా...
పాఠ‌శాల‌ల్లో మాస్టార్లు పాఠాల‌కు బ‌దులు యువ‌త‌కు ముద్దుల‌తో ప్రేమ‌ను పంచుకోవ‌డం ఎలాగో నేర్పిస్తే స‌రిపోతుందేమో..!!

కిస్ ఫ‌ర్ ల‌వ్ కార్య‌క్ర‌మాన్ని నిత్యానంద‌నో ఇంకో స్వామో చేస్తే మీరు ఆమోదిస్తారా?

ఆ నిర్వాహ‌కుల‌కు నిజంగా ఆలోచ‌నే  లేదు...

ఆలోచ‌నే  ఉంటే ల‌వ్ ఫ‌ర్ కిస్ కార్య‌క్ర‌మాన్ని ఏదైనా టీవీ స్టూడియోలో చేసే వారు.. మీడియా వాళ్లు విభిన్న యాంగిల్స్‌లో దాన్ని చూపేవారు..

అప్పుడు వాటిని ఎవ‌రూ అడ్డుకోలేరు కదా... ఎందుకంటే మీడియా స్వేచ్ఛ‌ను అడ్డుకోవ‌డం రాజ్యాంగ విరుద్ధ‌మంటారు... మీడియా ఆఫీసుల్లోకి చొర‌బ‌డి దాడులు చేస్తే ప్ర‌పంచ స‌మ‌స్య‌గా చిత్రీక‌రించేస్తారు కదా...

ఉల్టా, జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టుకునే వారు...

ఇక ముందు ఇలాంటివి చేస్తే... కొన్ని టీవీల‌కు చెప్పండి.. పండ‌గ చేసుకుంటాయి.. రోజంతా చూపిందే చూపి శున‌కానందాన్ని పొందుతాయి...!!


ఇక రాంగోపాల్ వ‌ర్మ ఏకంగా కిస్‌ ఆఫ్ ల‌వ్ అంటూ సినిమానే మొద‌లు పెడ‌తాడు..బ‌హుశా ఆయ‌న‌కు ఐడియా రాలేదో.. మ‌రి సావిత్రి సారీ సారీ శ్రీ‌దేవి సినిమాతో బిజీ బిజీగా ఉన్నాడో తెలీదు.. !!!

మీడియా ఛానెళ్లు ఇష్టారీతిన చూపినా వాటి ప్ర‌సారాల‌ను అడ్డుకోవ‌ద్ద‌ట‌....

మీడియా ఛానెళ్లు ఇష్టారీతిన చూపినా వాటి ప్ర‌సారాల‌ను అడ్డుకోవ‌ద్ద‌ట‌....

కానీ హైద‌రాబాద్ కేంద్రీయ విద్యాల‌యంలో ముద్దులు పెట్టుకునే కార్య‌క్ర‌మాన్ని మాత్రం బ‌ల‌వంతంగా అడ్డుకుంటారు...

అశ్లీల కార్య‌క్ర‌మ‌మ‌ని కేసు పెడ‌తారు....  పాల్గొన్న వారిపై కేసు పెడ‌తారు...

మ‌రి మీడియాలో రోజూ వ‌చ్చే జుగుప్సాక‌ర‌మైన క‌థ‌నాలు, వార్త‌లు, ప్రొగ్రామ్‌లు అశ్లీల‌త కింద‌కు రావా?

దీనిపైన ఎందుకు కొట్లాడ‌రు.... ఆయా ఛానెళ్ల‌పై కేసులు పెట్టి, ఆయా ప్రొగ్రామ్‌ల డైరెక్ట‌ర్ల‌ను ఎందుక బొంక‌లో వేయ‌రు?

ఉల్టా.. ఇలాంటి ఛానెళ్ల‌ను ప్ర‌సారం చేయాలంటూ కేంద్రం ద్వారా ఒత్తిళ్లు చేయిస్తారు... ఏమిటో వీరి వింత ధోర‌ణి...

మంచి ఎవ‌రు చెప్పినా మంచే

తెలంగాణ‌లో క‌రెంటు క‌ష్టాలు ఇప్ప‌టికిప్పుడు తీరేవి కావు. కేసీఆర్ అన్న‌ట్లు అది దుకాణంల దొరికేది కాదు. అయితే ఈ విష‌యంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధ్య‌క్షుడు జ‌గ‌న్ ఒక మంచి స‌ల‌హా ఇచ్చాడు. మ‌న ఎన్‌టీపీసీలో కేంద్రానికి 75 శాతం క‌రెంటు వాటా ఉంది. ఆ వాటా కింద వ‌చ్చే క‌రెంటును కేంద్రం ప‌లు రాష్ట్రాల‌కు ఇస్తుంది. మ‌నం చ‌త్తీస్‌గ‌డ్‌తో వెయ్యి మెగా వాట్ల‌కు ఒప్పందం చేసుకున్నా లైను వేయ‌డానికి క‌నీసంగా సంవ‌త్స‌రం, సంవ‌త్స‌రంన‌ర ప‌డుతుంది. అందుకే కేంద్రాన్ని ఒప్పించి... ఎన్‌టీపీసీలో దాని వాటా ఉన్న క‌రెంటును ఇక్క‌డే మనం స‌ర్దుబాటు చేసుకుంటె... చ‌త్తీస్‌గ‌డ్‌కు కేంద్రం ఇచ్చే వాటా, అక్క‌డి నుంచి లైన్లు ఉన్న రాష్ట్రానికి ఇచ్చే వాటా ఎంత‌నో చూసుకొని అక్క‌డ వెయ్యి మె.వాట్లు స‌ర్దుబాటు చేస్తే బాగుంటుంది. ఎన్‌టీపీసీ నుంచి కాబ‌ట్టి మ‌నం తొంద‌ర‌గ అవ‌స‌ర‌మైతె కొత్త లైన్లు వేసుకోవ‌చ్చు. మంచి ఎవ‌రు చెప్పినా మంచే క‌దా.

Waheguru Ji Ka Khalsa, Waheguru Ji Ki Fateh!

సిక్కు మ‌త వ్య‌వ‌స్థాప‌కుడు, సిక్కుల తొలి గురువు గురునాన‌క్ దేవ్ జీ 545వ జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌జ‌లంద‌రికీ శుభాకాంక్ష‌లు... ప్ర‌తి ఏటా కార్తీక పౌర్ణ‌మి రోజున ఆయ‌న జ‌యంతిని ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న సిక్కు మ‌త‌స్థులు భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకుంటారు..
పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రాంతంలో 1469లో జ‌న్మించిన‌ గురునాన‌క్ దేవ్ ప్ర‌భోదించిన ప్ర‌వ‌చ‌నాలు మాన‌వాళికి ఆద‌ర్శం. మాన‌వుల‌ను మాన‌వ‌త్వం వైపు న‌డిపే ధ‌ర్మ‌సందేశాల‌వి..

Waheguru Ji Ka Khalsa, Waheguru Ji Ki Fateh!

ఏమున్నా లాంత‌ర్లు ప‌ట్టుకోవ‌డం మిన‌హా చేసేదేముంది...

ఇప్పుడు ఆ నేత‌లు ఎడ్ల బండ్ల‌పై అసెంబ్లీకి రారు...

ఎందుకంటే పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల పెంపు రాష్ట్రం ప‌రిధిలో లేదు క‌దా...
వంట గ్యాస్ ధ‌ర పెరిగినా డ‌మ్మీ సిలిండ‌ర్ల‌తో అసెంబ్లీకి రారు..
--------------------------
ఎందుకంటే కేంద్రంలో యూపీఏ లేదు క‌దా...

ఏమున్నా లాంత‌ర్లు ప‌ట్టుకోవ‌డం మిన‌హా చేసేదేముంది...

Wednesday 5 November 2014

ఆత్మ‌గౌర‌వ ప్ర‌తీక ఈ బ‌డ్జెట్‌..!!

ఆత్మ‌గౌర‌వ ప్ర‌తీక ఈ బ‌డ్జెట్‌..!!
ఏ ఈటెల రాజేంద‌ర్‌ను అసెంబ్లీలో అవ‌మానించారో.. అదే ఈటెల ఈరోజు బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టాడు..

-------------------

బ‌డ్జెట్ కేటాయింపులు, అంకెల గారెడీలు, విప‌క్షాల విమ‌ర్శ‌లు అన్నీ ప‌క్క‌న పెట్టి సాధార‌ణ కోణంలో చూస్తే ఈ రోజు తెలంగాణ చ‌రిత్ర‌లో మ‌రో అద్భుత ఘ‌ట్టం ఆవిష్కృతం అయిన‌ట్లే...

మేం లేక‌పోతే మీరు ఒక్క రోజు కూడా బ‌త‌క‌లేరు.. మీకు ప‌రిపాలించుకోవ‌డం రాదు.. మీకు వ్య‌వ‌సాయం చేత‌కాదు.. మాట్లాడ‌టం రాదు.. మీకు చిల్లి గ‌వ్వ ఇవ్వం అని ఎన్నో మాట‌లు అన్న వాళ్ల నోళ్ల‌న్నీ మూత‌ప‌డిన రోజుది.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవ‌డ‌మే కాదు.. దాదాపు 4 నెల‌లుగా ఎవ‌రి మ‌ద్ద‌తు లేకుండా స్వ‌తంత్రంగా స్వీయ రాజ‌కీయ శ‌క్తి ఇక్క‌డ పాలిస్తోంది.. ఇప్పుడు రాష్ట్ర తొలి బ‌డ్జెట్‌ను స‌గ‌ర్వంగా ప్ర‌వేశ‌పెట్టింది....

అన్నింటి క‌న్నా ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం ఏంటంటే... 2009 ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌కు 10 ఎమ్మెల్యే సీట్లు మాత్ర‌మే వ‌చ్చిన స‌మ‌యంలో ఆ పార్టీ శాస‌న‌స‌భా ప‌క్ష నేత‌గా ఉన్న ఈటెల రాజేంద‌ర్‌ను ప‌ట్టుకుని అప్ప‌టి సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విక‌టాట్ట‌హాసంతో... ఏం రాజేంద‌ర్‌.. త‌ల‌కాయ ఎక్క‌డ పెట్టుకుంటావ‌ని అత్యంత వ్యంగ్యంగా అన్నారు...

ఇప్పుడు అదే ఈటెల రాజేంద‌ర్ తెలంగాణ రాష్ట్రంలో స‌గ‌ర్వంగా త‌ల ఎత్తుకుని బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టారు... అప్ప‌ట్లో అవ‌హేళ‌న చేసిన వాళ్లు సిగ్గుంటే త‌ల‌దించుకోవాల్సిన రోజులివి... ఇది తెలంగాణ చ‌రిత్ర‌ల్లో సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించ‌ద‌గిన‌ ఘ‌ట్టం..!!

ఇది చ‌రిత్రాత్మ‌క ఘ‌ట్టం...

ఇది చ‌రిత్రాత్మ‌క ఘ‌ట్టం...

నాకు ఈ బ‌డ్జెట్ లెక్క‌లు అంత‌గా తెలియ‌వు.. జేబులో ఉన్న‌వి ఖ‌ర్చుచేయ‌డ‌మే త‌ప్ప‌ పొదుపు తెలియ‌ని మ‌నిషిని.. నా సొంత బడ్జెట్‌పైనే స‌రైన అవ‌గాహ‌న లేదు.. ఇక రాష్ట్ర బ‌డ్జెట్‌పై టీవీలో చూసి విశ్లేష‌ణ‌లు రాసేంత  స్థాయి నాకు లేదు.. అది ఎలా ఉందో నిమిషాల్లో తేల్చిచెప్ప‌డానికి సీమాంధ్ర మీడియా ఛానెల్‌నో, పేప‌ర్నో ఎంత మాత్రం కాను...
---------------------------

 ఈ స్వ‌తంత్ర భార‌తావ‌నిలో ఎంద‌రో  బ‌డ్జెట్‌లు ప్ర‌వేశ‌పెట్టారు.. అయితే ప‌రిపాల‌న అనుభ‌వం లేని, ఉద్య‌మ అనుభ‌వం టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన తొలి బ‌డ్జెట్  అంద‌రినీ పూర్తిగా సంతృప్తిప‌రుస్తుంద‌ని నేను అనుకోను...  ఒక‌టి మాత్రం నిజం.. గ‌త పాల‌కులు తెలంగాణ‌కు పైసా ఇవ్వ‌మ‌ని నిండు స‌భ‌లో చెప్పారు.. వివ‌క్ష కూడా చూపారు.. ఇప్పుడు తెలంగాణ ప్ర‌భుత్వం బ‌డ్జెట్‌లో కేటాయించే ప్ర‌తి పైసా తెలంగాణ అభివృద్ధి కోస‌మే ఖ‌ర్చ‌వుతుంది.. గ‌తంలో మాదిరిగా ఇక్క‌డి నిధుల‌ను ఆంధ్రాకు మ‌ళ్లించ‌డం చేయ‌రు.. ఎస్సీ స‌బ్ ప్లాన్ నిధుల‌తో నెక్లెస్‌రోడ్‌లో రోడ్లు వేయ‌డం లాంటివి చేయ‌ర‌ని న‌మ్ముతున్నాను..
-----------------------------

ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో ఏ ప్ర‌భుత్వం నుంచైనా స‌రే ప్ర‌జ‌లు అతిగా ఏమీ కోరుకోవ‌డం లేదు.. పాల‌కులు అవినీతికి దూరంగా ఉంటే చాలని వేడుకుంటున్నారు.. ఉన్న ప‌థ‌కాల‌ను స‌మ‌ర్థంగా అమ‌లు చేస్తూ అవినీతికి దూరంగా ఉండేవారికి అంద‌రూ జై కొడ‌తారు...!!

త‌ప్పు వీళ్ల‌ది కాదు...!!

త‌ప్పు వీళ్ల‌ది కాదు...!!
ప్రాజెక్టు అంటే కాంట్రాక్టు అని..
ఒప్పందం అంటే క‌మీష‌న్ అని నేర్పించిన వీరి బాస్‌దే త‌ప్పు..

అప్పుడే దీనిపై ర‌చ్చ చేసి ఉంటే ప‌రిస్థితి ఇంత‌దాకా వ‌చ్చేది కాదు క‌దా...

2006లోనే వీళ్లు(వ‌సుంధ‌రా రాజె, కిరణ్ మ‌జుంద‌ర్ షా) బ‌హిరంగంగా ప్రేమ‌ను వ్య‌క్తీక‌రించుకున్నారు..
ఇలా మీడియా ముందే ఛుంబించుకున్నారు...
బ‌హుశా నేటి యువ‌త‌కు వీళ్లు ఆద‌ర్శంగా మారారేమో..!!
అప్పుడే దీనిపై ర‌చ్చ చేసి ఉంటే ప‌రిస్థితి ఇంత‌దాకా వ‌చ్చేది కాదు క‌దా...

మీ ప్రేమ త‌గ‌ల‌డ‌..

మీ ప్రేమ త‌గ‌ల‌డ‌.. ఈ చుంబ‌నాల‌తోనే దాన్ని వ్య‌క్తీక‌రించ‌డం ఏంటో?
విశ్వ‌మాన‌వాళిని ప్రేమించమ‌ని చెప్పిన మ‌హ‌నీయులు దాన్ని వ్య‌క్తీక‌రించేందుకు ప్ర‌పంచంలోని మ‌హిళ‌లంద‌రినీ ముద్దాడారా?(స‌్వామి నిత్యానంద‌, అసారాం బాపూజీల‌కు మిన‌హాయింపండోయి)
మ‌ద‌ర్ థెరిస్సా పేద‌ల‌ను ముద్దాడిందా?(ఒక్క  అమృతానంద మ‌యికి మిన‌హాయింపండోయ్‌)
మీ ఫిలాస‌ఫీ నాకు అర్థం కాలేదు...

ముందున్న వాహ‌నానికి ఏమీ కాలేదా? ఏం జ‌రిగిందో నాకు తెలియాలి...?

తెలంగాణ టీడీపీ అధ్య‌క్షుడి వాహ‌నం నిన్న‌రాత్రి ఆయ‌న ముందు వెళ్తున్న వాహ‌నాన్ని ఢీకొట్టింద‌ట‌.. మ‌రి ఆయ‌న వాహ‌నం దెబ్బ‌తిన్న‌ది.. ఆయ‌న‌కు స్వ‌ల్ప గాయాల‌ని, త‌ప్పిన ముప్పు అని మాత్ర‌మే వార్త‌లో రాశారు.. ఈయ‌న వాహ‌నం ఢీకొట్ట‌డంతో ముందున్న వాహ‌నానికి ఏమీ కాలేదా?  అందులో ఉన్న వారికి గురించి ఏమీ రాయ‌లేదు ఎందుకు?
అస‌లు ఇలా నేను నా వాహ‌నంతో ముందున్న వాహ‌నాన్ని ఢీకొడితే కేసు కాకుండా ఉంటుందా?  న‌న్ను జైలుకు తీసుకెళ్ల‌కుండా ఉంటారా?  ఈ వార్త అస‌మ‌గ్రంగా ఉంది... ఏం జ‌రిగిందో నాకు తెలియాలి...?

ఎందుకిలా?


తెలంగాణ భారీ నీటిపారుద‌ల శాఖ మంత్రి హ‌రీశ్‌రావు ఢిల్లీ వెళ్లే వార్త నిన్న‌ మూడు ముక్క‌ల్లో రాసిన ప‌త్రిక‌... అదే ఆంధ్రా మంత్రి దేవినేని ఢిల్లీ వెళ్లే వార్త‌ను ఆంధ్రా ఎడిష‌న్లో మొద‌టి పేజీలో వేయ‌డం.. ఎందుకిలా?

ద‌త్తాత్రేయ గారికి కృత‌జ్ఞ‌త‌లు...


బీజేపీ నేత ద‌త్తాత్రేయ గారు విద్యుత్ స‌మ‌స్య విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయ‌కుండా నిర్మాణాత్మ‌క పాత్ర పోషిస్తున్నారు... కేంద్రానికి లేఖ రాయ‌డం, ఛ‌త్తీస్‌గ‌ఢ్ సీఎంను క‌ల‌వ‌డం, పీయూష్ గోయ‌ల్‌తో మాట్లాడ‌టం ఇవ‌న్నీ మంచి విష‌యాలే.. ఆయ‌న వంతు పాత్ర‌ను ఆయ‌న పోషిస్తున్నారు.. ఎర్ర‌బెల్లి అండ్ కోలాగా ఊరికే విమ‌ర్శ‌ల‌తో కాలం వెల్ల‌దీయ‌డం లేదు.. స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నారు.. ఆయ‌న పెద్ద‌మ‌నిషి మాదిరిగానే వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది... పార్టీలక‌తీతంగా నిర్మాణాత్మ‌కంగా తెలంగాణ స‌మాజం మేలు కోసం పాటుప‌డే అంద‌రికీ నా పాదాభివంద‌నం.... అలాంటి వాళ్లంతా తెలంగాణ‌కు ఆత్మ‌బంధువులే.. వాళ్లంద‌రూ నా అభిమాన నేత‌లే..

భూసేక‌ర‌ణ బిల్లుకు తూట్లు...?



యూపీఏ తీసుకొచ్చిన కొన్ని మంచి బిల్లుల్లో భూసేక‌ర‌ణ బిల్లు ఒక‌టి... ఇష్టారాజ్యంగా రైతుల నుంచి భూములు లాక్కోకుండా చూసే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ బిల్లుకు స‌వ‌ర‌ణ‌లు చేయాల‌ని కేంద్రం యోచిస్తోంది... ఈ స‌వ‌ర‌ణ‌ల‌కు అన్ని పక్షాలూ అంగీక‌రం తెలుపుతాయి కావొచ్చు.. కానీ ఇది జ‌రిగితే ద‌గా ప‌డేది రైతులు మాత్ర‌మే... బ‌హుషా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌ధాని నిర్మాణానికి ఈ స‌వ‌ర‌ణ‌లు ప‌నికి వ‌స్తాయి..  గ‌తంలో రైతుల నుంచి ఇష్టానుసారం భూములు లాక్కుంటుంటే కొంద‌రు మేధావుల సూచ‌న‌ల మేర‌కు భూసేక‌ర‌ణ బిల్లును తెచ్చారు.. ఇప్పుడు ఈ బిల్లుకు స‌వ‌ర‌ణ‌లు అంటే రైతుల కంట్లో మట్టికొట్ట‌డ‌మే అవుతుంది... ఈ బిల్లులో తెచ్చే స‌వ‌ర‌ణ‌ల‌కు ఏ రాజ‌కీయ పార్టీ కూడా మ‌ద్ద‌తు ఇవ్వొద్ద‌నేది నా విజ్ఞ‌ప్తి..

అసెంబ్లీ ప్రివిలేజెస్‌ను గౌర‌వించి బాధ్య‌తాయుతంగా వార్త‌ల‌ను రాయండి...

మీడియాకు సూచ‌న‌...
రేప‌టి నుంచి అసెంబ్లీ స‌మావేశాలు...
మ‌ళ్లా రెచ్చిపోయి పిచ్చి కార్య‌క్ర‌మాలు ప్ర‌సారం చేయ‌కండి..
అసెంబ్లీ ప్రివిలేజెస్‌ను గౌర‌వించి బాధ్య‌తాయుతంగా వార్త‌ల‌ను రాయండి...

-------------------
అసెంబ్లీలో నేత‌లు మాట్లాడిన మాట‌ల‌కు, చేసిన ప‌నుల‌కు సొంత భాష్యాలు అద్దుతూ క‌థ‌నాలు రాయొద్దు...వ్యంగ్య‌  కార్య‌క్ర‌మాలు రూపొందించొద్దు.. ఇదంతా అసెంబ్లీ ప్రివిలేజెస్ కింద‌కు వ‌స్తాయి... మీడియా ఈ విష‌యాన్ని గుర్తెరిగి బాధ్య‌త‌గా ప్ర‌వ‌ర్తించాలి...  లేనిప‌క్షంలో  గ‌తంలో పార్ల‌మెంట్ ప్రివెలేజెస్ ను ఉల్లంఘిస్తూ క‌థ‌నాలు రాసిన ఎడిట‌ర్ల‌ను పార్ల‌మెంట్‌లో విచారించి జైలుకు పంపిన తీరుగానే ఇక్క‌డా జ‌రుగుతుంది...
ఇక్క‌డ టీడీపీ ప్ర‌భుత్వం లేదు కాబ‌ట్టి ప్రివిలేజెస్‌ను విస్మ‌రించి వార్త‌లు రాయ‌డానికి ఓ వ‌ర్గం మీడియా ప్ర‌తినిధులు ఉవ్విళ్లూరుతారు... త‌స్మాత్ జాగ్ర‌త్త పిచ్చి రాత‌ల‌తో మీ గోతిని మీరే త‌వ్వుకోవ‌ద్దు...
గ‌తంలో పెద్ద‌ల స‌భ‌లో గ‌లాట అంటూ రాసి మీరు ఎదుర్కొన్న విచార‌ణ‌ను గుర్తుకుతెచ్చుకోండి....

ద‌య్యాలు వేదాలు వ‌ల్లించిన‌ట్లే క‌నిపిస్తోంది...!!!

కృష్ణా నీటి కేటాయింపుల‌పై గ‌త ఏడాది బ్ర‌జేష్ కుమార్ ట్రిబ్యూన‌ల్ ఆదేశాల‌పై దుమ్మెత్తిపోసిన పెద్ద‌మ‌నుషులు ఇప్పుడు మ‌న‌కు నీతులు చెప్ప‌డానికి వ‌స్తున్నారు...
అన్ని అధికారాలు ఉన్న బ్ర‌జేష్ కుమార్ ట్రిబ్యూన‌ల్ ఆదేశాల‌ను గౌర‌వించ‌లేని వాళ్లు... ఎలాంటి అధికారాలు లేని ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తున్న కృష్ణా బోర్డు ఆదేశాల‌ను పాటించాల‌ని మ‌న‌కు నీతిసూత్రాలు వ‌ల్లిస్తుంటే ద‌య్యాలు వేదాలు వ‌ల్లించిన‌ట్లే క‌నిపిస్తోంది...!!!

Monday 3 November 2014

క‌థ‌నాలందు రైతుల‌ ఆత్మ‌హ‌త్య‌ల క‌థ‌నాలే వేర‌యా?

ఇది ఓ ఎల్లో మీడియా తీరు...
తెలంగాణ యువ‌త ఆత్మ‌హ‌త్య‌ల‌పై ఎఫ్ఐఆర్ ఉంటేనే వార్త‌లు...
రైతుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై ఎఫ్ఐఆర్ లేకున్నా వార్త‌లే...
ఎందుకీ తేడా...
--------------
తెలంగాణ ఉద్య‌మంలో ఓ విద్యార్థి కిరోసిన్ పోసుకొని ఆత్మాహుతి చేసుకున్నాడు.. వార్త డెస్కుకు వ‌చ్చింది... అంతే ఆ డెస్కు ఇన్‌ఛార్జిగారు.. అస‌లు ఎఫ్ఐఆర్ న‌మోదు అయిందా?   అందులో తెలంగాణ కోస‌మే చ‌నిపోయిన‌ట్లు రాసి ఉందా?   కుటుంబ క‌ల‌హాలు, అప్పులు, ప్రేమ‌లాంటివ్య‌క్తిగ‌త కార‌ణాలు ఏమైనా ఉన్నాయా?  అంటూ స‌వాల‌క్ష ప్ర‌శ్న‌లు అడిగాడు... ఒక‌వేళ ఎఫ్ఐఆర్‌లో తెలంగాణ కోసం అని లేకుంటే దాన్ని తెలంగాణ కోసం జ‌రిగిన ఆత్మ‌హ‌త్య‌గా ప‌రిగ‌ణించేవారు కాదు... ఇలా చాలా కేసులు జ‌రిగాయి.. ఒక‌వేళ ఎవ‌రైనా విద్యార్థి లేఖ రాసి చ‌నిపోయినా.. ఆ లేఖ ఆయ‌న స్వ‌ద‌స్తూరితో రాసిందేనా?  అంటూ వంద‌లాది ప్ర‌శ్న‌లు వేసేవారు... తెలంగాణ కోసం యువ‌త చ‌నిపోతే ఎఫ్ఐఆర్ చూస్తారు.. అందులో పేర్కొన్న కార‌ణాల‌ను చూసి వార్త‌లు వేశారు...

---------------
మ‌రి ఇప్పుడు తెలంగాణ‌లో రైతుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై ఎఫ్ఐఆర్‌లు చూడ‌టం లేదు...  క‌నీసం కేసు న‌మోదైందా?  అన్న‌ది ఆరా తీయడం లేదు... రైతు ఆత్మ‌హ‌త్య అంటూ వేసేస్తున్నారు..  మ‌రి తెలంగాణ యువ‌త సూసైడ్ లేఖ‌లు రాసి చనిపోయిన‌ప్పుడు మీరు ఎఫ్ ఐఆర్‌లు కావాల‌న్న‌ప్పుడు నేడు రైతు ఆత్మ‌హ‌త్య‌ల విష‌యంలోనూ ఎఫ్ ఐఆర్‌లూ, అందులో పేర్కొన్న కార‌ణాలు అన్వేషించి రాయాలి క‌దా.. ఎందుకు రాయ‌డం లేదో?
----------------------------

మీరు ప్ర‌స్తుతం రైతు ఆత్మ‌హ‌త్య‌ల‌పై రాస్తున్న ప‌ద్ధ‌తిలోనే 2009 డిసెంబ‌రు 9 నుంచి 2014 ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కు తెలంగాణ‌లో జ‌రిగిన యువ‌త బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల కేసుల‌ను రాసి ఉంటే ఆ సంఖ్య 10 వేలు దాటేది... మ‌రి అప్పుడు ఈ ప‌ద్ధ‌తిలో ఎందుకు రాయ‌లేదు.. ఇప్పుడెందుకు రాస్తున్నారు..?  

రైతుల‌పై ప్రేమ‌తోనా... స‌ర్కారుపై అక్క‌సుతోనా... మీ అంత‌రాత్మ‌ల‌నే ప్ర‌శ్నించుకోండి!!

ఇలాంటి ప‌త్రిక‌లు త‌మిళ‌నాడులో ఉన్నాయా?

-------------------------
కావేరి జ‌లాల విష‌యంలో త‌మిళ‌నాడు త‌ప్పు చేస్తుం ద‌ని... ముళ్లైపెరియార్ విష‌యంలోనూ త‌మిళ‌నాడు వైఖ‌రి త‌ప్ప‌ని రాసే ప‌త్రిక‌లు అక్క‌డ ఉన్నాయా?   అస‌లు ఆ రాష్ట్రంలో ఉంటూ  పొరుగున ఉన్న క‌ర్ణాక‌ట‌, కేర‌ళ‌ల‌కు వ‌త్తాసు ప‌లుకుతూ న్యాయాన్ని సమాధి చేసే ప‌త్రికలు అక్క‌డ ఉన్నాయా?
అస‌లు ఇలాంటి ప‌త్రిక‌లు భార‌త దేశంలో కేవ‌లం ఒక తెలంగాణ‌లోనే ఉన్నాయ‌నుకుంటా... లేక‌పోతే తెలంగాణ ప్ర‌యోజ‌నాల‌ను దెబ్బ‌తీస్తూ క‌థ‌నాలు రాస్తూ ఆంధ్రా పాల‌కుల‌కు వ‌త్తాసు ప‌లుకుతున్న ఈ మీడియా సంస్థ‌ల‌ను ఏం చేయాలి... ?

ఏమిరా బాల‌రాజు... ఏమిటీ దౌర్బాగ్యం!

మ‌న తిండి తిని ఈనాడు ఆంధ్ర పాట‌ను గొంతెత్తి పాడుతుంది. శ్రీ‌శైలం విద్యుత్ ఉత్ప‌త్తికి సంబంధించి కృష్ణా రివ‌ర్ బోర్డు ఆదేశాల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం బేఖాత‌రు చేసి 5.3 టీఎంసీల నీళ్లు వాడుకుంద‌ని ఈనాడు ఈరోజు గ‌గ్గోలు పెట్టింది. ఇది తెలంగాణ‌కు వ్య‌తిరేక వార్త కాబట్టి మొద‌టి పేజీలో కాస్త కింద పెట్టింది. ఆంధ్ర‌కు అనుకూలం కావ‌డంతో ఏపీ ఎడిష‌న్‌లో బ్యాన‌ర్ క‌ట్టింది. అంటే 5.3 టీఎంసీల నీళ్లు వాడుకోవ‌డం వ‌ల్ల ఆంధ్ర అన్యాయం జ‌రిగింద‌నేది ఈనాడు పెద్ద‌ల బాధ‌. స‌రే బాగానే ఉంద‌నుకుందాం. ఈ వార్త‌ను ఏపీ ఎడిష‌న్‌లో వేస్తే ఒకే.
మ‌రి........... ఇదే వార్త‌లో తెలంగాణ స‌ర్కారు కృష్ణా రివ‌ర్ బోర్డుకు ఫిర్యాదు చేసినా ఏపీ ప్ర‌భుత్వం నిస్సిగ్గుగా ఎలాంటి కేటాయింపులు లేని హంద్రీనీవాకు 1350 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడుకు మ‌రో 800 క్యూసెక్కుల వ‌ర‌కు నీళ్లు తీసుకుపోతున్న‌ట్లు రాశారు. (ఇది పైకి మాత్ర‌మే... కానీ నిజంగా ఎంత త‌ర‌లించుకుపోతున్నారో చంద్ర‌బాబు, రామోజీల‌కే తెలుసు) అలాంట‌ప్పుడు క‌నీసం తెలంగాణ ఎడిష‌న్‌లో !!! తెలంగాణ ప్ర‌భుత్వం ఫిర్యాదు చేసినా హంద్రీనీవాకు ఏపీ స‌ర్కారు జ‌ల దోపిడీతో నీళ్లు త‌ర‌లించుకుపోతుంద‌ని హెడ్డింగులో రాయొచ్చు క‌దా. అక్క‌డి ప్ర‌జ‌ల‌కు అది న్యాయ‌మైన‌పుడు, ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు ఇది న్యాయం క‌దా. తెలంగాణ వాళ్లు జేబులో నుంచి డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టుకొని, స‌మ‌యాన్ని కేటాయించి, వాళ్ల‌కు వ్య‌తిరేక‌మైన వార్త‌లు చ‌ద‌వాల్నా?
పైగా ఈ వార్త‌లో తెలంగాణ స‌ర్కారేమో కృష్ణా రివ‌ర్ బోర్డు ఆదేశాలు బేఖాత‌రు అనే ప‌దాల‌ను వాడారు. కానీ హంద్రీనీవాకు మాత్రం ఏపీ ప్ర‌భుత్వం నీటిని తీసుకెళ్లింది... అనే సాఫ్ట్ ప‌దాల‌ను వాడారు. ఇదేం దిక్కుమాలిన జ‌ర్న‌లిజం? మ‌రోవైపు మూడు ద‌శాబ్దాల లెక్క‌లివీ... అంటూ ఈనాడు యాజ‌మాన్యం త‌న ఆవేద‌న‌ను వెల్ల‌గ‌క్కింది. అయినా అవి ఉమ్మ‌డి రాష్ట్రంలోని లెక్క‌లు. అప్పుడు అన్ని ప్రాంతాలు క‌లిసున్నందున సీమాంధ్ర నుంచి వ‌చ్చే క‌రెంటు ఉన్నందున శ్రీ‌శైలం ఎడ‌మ గ‌ట్టు వద్ద విద్యుత్ ఉత్ప‌త్తి చేయ‌కోవ‌డ‌మో్, త‌క్కువ చేయ‌డ‌మో ఉంట‌ది. మ‌రి ఇప్పుడు రెండు రాష్టాలు, దిక్కుమ‌లిన ఏపీ ప్ర‌భుత్వం ఇచ్చిన క‌రెంటు కొర‌త వార‌స‌త్వం, చంద్ర‌బాబు ఫ్యూజులు పీకేసీ న్యాయంగా రావాల్సిన క‌రెంటును అడ్డుకుంటున్న స‌మ‌యం... ఇప్పుడు కూడా గ‌తంలో లెక్క శ్రీ‌శైలం ఎడ‌మ గ‌ట్టు ద‌గ్గ‌ర విద్యుత్తు ఉత్ప‌త్తి చేయాలంటె ఎట్ల కుదుర్త‌ది?. ఇదంతా ఈనాడుకు తెల్వ‌దా.... బ‌ట్టెబాజి త‌నం. తామేం రాసినా చెల్లుతుంద‌నే దిక్కుమాలిన అమాయ‌క‌త్వం. ఛీ ఛీ... ఇదేం జ‌ర్న‌లిజం?

నువ్వు నేర్పిన విద్య‌నే క‌దా...

కార్మిక శాఖ‌లో వంద‌ల కోట్ల రూపాయ‌ల ఆంధ్ర లూఠీ విష‌యం బ‌య‌టికి రాగానే సిగ్గుతో బాత్‌రూంకు ప‌రిమితం కావాల్సిన ఆంధ్ర నాయ‌కులు, సోకాల్్డ మేధావులు సిగ్గు లేకుండా ఎదురుదాడి చేస్తున్న‌రు. దీనిపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ అధికార ప్ర‌తినిధి ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ రెండ్రోజుల కింద‌ట ప్రెస్‌మీట్ పెట్టార‌ట‌. అందులో ఎందీ రాద్దాంతం... తెలంగాణ సీఎస్‌, ఏపీ సీఎస్‌కు ఒక్క ఫో్న్ కాల్ చేస్తే స‌రిపోయేది క‌దా అని అన్నాడ‌ట‌. మ‌రి... లూఠీ చేసే ముందు ఏపీ సీఎస్ చొర‌వ తీసుకొని తెలంగాణ సీఎస్‌కు ఫోన్ చేసి.. మా స‌ర్కారు చెప్పిన‌ట్లు మేం లూఠీ చేస్తున్నం అంటే స‌రిపోయేది క‌దా. అయినా తెలంగాణ ప్ర‌భుత్వం వ‌చ్చినందుకు ఈ లూఠీ బ‌య‌ట‌ప‌డింది. 57 ఏండ్ల దోపిడీ ఇట్ల రెడ్‌హ్యాండెడ్‌గా ఎప్పుడైన బ‌య‌ట‌ప‌డిందా?. ఈ విష‌యాన్ని అదే ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్‌తో అడిగెటోడెవ‌డు?. రాసెటోడెవ‌డు?

ఇదేం కావ‌ర‌మో...!!

నిన్న‌టికి నిన్న ఈనడులో డాల్డా మ‌రుగుతున్న సంగ‌తి మిత్రులంద‌రికీ తెలుసు. ఇంత పెద్ద త‌ప్పు చేసి... క‌నీస ప‌రిజ్ఙానం లేకుండా రాసి.. ఈనాడు చ‌రిత్ర‌లో ఎన్న‌డూలేని విధంగా నిస్సిగ్గుగా వివ‌ర‌ణ వేయ‌డానికి కార‌ణ‌మైన ఆంధ్ర జ‌ర్న‌లిస్టును మిడిల్ మేనేజ్‌మెంట్ , కిర‌ణ్‌తో స‌హా (అంద‌రూ ఆంధ్రోళ్లే) ఎలాంటి చ‌ర్య‌లు లేకుండా కాపాడుతున్నారు. కానీ ఎలాంటి త‌ప్పు చేయ‌ని తెలంగాణ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు, నిజామాబాద్ బిడ్డ దిలీప్‌ను మాత్రం నిర్దాక్షిణ్యంగా బ‌య‌టికి పంపారు. ఈనడు ఆంధ్ర కావ‌రానికి ప‌రాకాష్ట‌గా మారిన ఈ సంఘ‌ట‌న‌ను మిత్రులంద‌రి దృష్ట‌కి తేవాల‌న్న‌దే నా ఉద్దేశం. బిజినెస్ బ్యూరోలో దిలీప్ అనే తెలంగాణ జ‌ర్న‌లిస్టు దాదాపు 15 ఏండ్ల‌కు పైగా ఈనాడులో ప‌ని చేస్తున్నారు. మంచి నైపుణ్యం, మంచి త‌నం ఉన్న ఆయ‌న ఈ వారంలోనే ఒక‌రోజు స‌త్య నాదేండ్ల జీతంపై ఒక వార్త రాశారు. దానిని బిజినెస్ పేజీలో వేశారు. ఇదేందీ... ఇది మొద‌టి పేజీ వార్త క‌దా అని ఛైర్మ‌న్ రామోజీ కామెంట్ రాశార‌ట‌. దీంతో్ వాస్త‌వంగా డెస్్క బాధ్య‌లుగానీ, బిజినెస్ బ్యూరో ఇన్‌ఛార్జిగానీ, చివ‌ర‌కు సెంట్ర‌ల్ డెస్క్ ఇన్‌ఛార్జి రాహుల్ (మంచి జ‌రిగితే అంతా నా క్రెడిట్... లేకుంటే చేతులు దులుపుకునే ఘ‌నుడు)నుగానీ బాధ్యులు చేయాలి. జ‌ర్న‌లిజంలో్ ఇది నైతిక‌త‌. కానీ వీరంతా ఆంధ్రోళ్లు కావ‌డంతో దిలీప్‌ను బాధ్యుడిని చేశారు. ఎలాగంటే... ఆయ‌న రాసిన వార్త మొద‌టి పేజీలో వేసే స్థాయిలో లేద‌ట‌. మ‌రి వార్త రాసిన రోజు... చూసిన డెస్క్ వాళ్లు, ఎడిష‌న్‌ను ఆమోదించిన సెంట్ర‌ల్ డెస్క్ ఇన్‌ఛార్జి అప్ప‌డేం చేసిండ్రు?. వాస్త‌వంగా వాళ్ల‌కు అది మొద‌టి పేజీలో వేయాల‌నే ఆలోచ‌నే రాలేదు. తీరా రామోజీ అన‌గానే త‌మ‌కు మ‌ట్టి అంట‌కుండా ఉండేందుకు ఆత‌ర్వాత వార్త రాసిన స్థాయి స‌రిగాలేద‌నే సాకును తెర‌పైకి తెచ్చి... దిలీప్‌ను అవ‌మానించారు. తెలంగాణ బిడ్డ క‌దా... ర‌క్తంలో రో్షం ఉంటుంది. అందుకే ఎహ‌పో... అంటూ రాజీనామా లేఖ ప‌డేసి వ‌చ్చేశారు. నిజంగా దిలీప్‌తో నాకు ముఖ ప‌రిచయం కూడా లేదు. కానీ ఒక తెలంగాణ బిడ్డ‌, నైపుణ్యం ఉన్న జ‌ర్న‌లిస్టు గురించి తెలుసుకోవ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు. అదేవిధంగా ఆయ‌న‌కు జ‌రిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటేందుకు నాకు ఎలాంటి భ‌యం లేదు.

ఇక కొన్నేళ్ల‌కు స‌మైక్య తెలుగు రాష్ట్ర ఉద్య‌మ‌మూ మొద‌ల‌య్యేదేమో.. !!!

తెలంగాణ‌లో టీఆర్ఎస్ ప్ర‌భుత్వం కాకుండా  టీడీపీ వ‌చ్చి ఉంటే  ఈ కృష్ణా బోర్డు స‌మ‌స్య‌లు, కార్మిక నిధి మ‌ళ్లింపు గొడ‌వ‌లు, క‌మ‌ల్ నాథ‌న్ మార్గ‌ద‌ర్శ‌కాల‌పై ర‌చ్చ త‌దిత‌రాలు అస‌లు ఉండేవే కావు..

ఒకే సచివాల‌యం నుంచి అన్ని ఆదేశాలు వెళ్లేవి... నిజ‌మే క‌దా... అవి ఎవ‌రికి అనుకూల‌మైన ఆదేశాలో నేను ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌ర‌మే లేదు.. ఇక కొన్నేళ్ల‌కు స‌మైక్య తెలుగు రాష్ట్ర ఉద్య‌మ‌మూ మొద‌ల‌య్యేదేమో.. !!!

వెంట‌నే ఆ లైన్ ప‌నులేవో మొద‌లు పెడితే బాగుంటుంది...

ఛ‌త్తీస్ గ‌ఢ్ నుంచి లైన్ మార్గం వేస్తే మావోయిస్టుల స‌మ‌స్య అని అప్ప‌ట్లో అన్నారు..
ఇప్పుడు మావోయిస్టులే క‌రెంట్ స‌మ‌స్య‌ల‌పై బంద్ పిలుపునిస్తున్నారు...
అంటే లైన్ వేసినా వారికి అభ్యంత‌రం లేద‌న్న సంకేతం ఇస్తున్న‌ట్టే...

అయినా సెల్ ట‌వ‌ర్లు పేల్చారంటే దానికో అర్థం ఉంటుంది... క‌రెంట్ స్తంభాల‌ను మావోయిస్టులు పేల్చిన ఘ‌ట‌న‌ల‌ను నేనెప్పుడూ విన‌లేదు..
వెంట‌నే ఆ లైన్ ప‌నులేవో మొద‌లు పెడితే బాగుంటుంది...

వీళ్ల జ‌యంతి రోజుల‌ను ఎలా నిర్వ‌హిస్తారో?

మొన్న సెప్టెంబ‌రులో భ‌గ‌త్‌సింగ్ జ‌యంతి జ‌రిగింది... ఈ వీరుడి జ‌యంతి రోజున అధికారిక కార్య‌క్ర‌మం ఏదైనా ప్రారంభించి ఉంటే బాగుండేది...
అక్టోబ‌రు 2న స్వ‌చ్ఛతా దినోత్స‌వంగా, అక్టోబ‌రు 31న ఏక‌తా దినోత్స‌వంగా జ‌రిపారు..
అలాగే భ‌గ‌త్‌సింగ్ జ‌యంతికీ విస్తృత ప్రాధాన్యం క‌ల్పించాలి...
లోక‌మాన్య తిల‌క్ లాంటి మ‌హ‌నీయుల‌కూ స‌ముచిత గౌర‌వం ల‌భించాలి...

జ‌న‌వ‌రిలో నేతాజీ, స్వామి వివేక‌నంద‌ జ‌యంతి ఉంది...  ఈ న‌వంబ‌రులో నెహ్రూ, ఇందిరాగాంధీ జ‌యంతి ఉంది..  
వీళ్ల జ‌యంతి రోజుల‌ను ఎలా నిర్వ‌హిస్తారో?

Sunday 2 November 2014

ఒక్క‌సారైనా ఇలాంటి వ్యంగ్య కార్టూన్లు వ‌చ్చాయా?

ఒక‌వేళ కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ రాకుండా చంద్ర‌బాబునాయుడు మ‌ద్ద‌తుతో ప్ర‌భుత్వం ఏర్ప‌డే ప‌రిస్థితి ఉంటే...  చంద్ర‌బాబును రింగ్ మాస్ట‌ర్‌గా చూపేవారేమో...!!

అయినా మోడీని తిట్టి మ‌ళ్లా ఆయ‌న‌ను పొగిడిన చంద్ర‌బాబు వాల‌కంపై ఒక్క‌సారైనా ఇలాంటి వ్యంగ్య కార్టూన్లు వ‌చ్చాయా?

మ‌రి విటుల‌ను ఊరికే వ‌దిలేస్తారు ఎందుకు?

వ్య‌భిచారం కేసులో ప‌ట్టుబ‌డిన త‌ర్వాత మ‌హిళ‌ల‌ను కౌన్సిలింగ్ కేంద్రాల‌కు పంపుతారు...

మ‌రి విటుల‌ను ఊరికే వ‌దిలేస్తారు ఎందుకు?    వారికి కూడా కౌన్సిలింగ్ ఇవ్వొద్దా?  వాళ్ల మాన‌సిక ప‌రిస్థితిని స‌రిచేయాలి క‌దా..  ఇది మంచి ప‌ద్ధ‌తి కాద‌ని హిత‌బోధ చేయొద్దా?   లేక‌పోతే మ‌ళ్లీ అదే దారిలో ప‌య‌నిస్తే....?

ఇదే ప‌నిని ఒక‌వేళ తెలంగాణ ప్ర‌భుత్వం చేసిఉంటే ఏం జ‌రిగేది...


కార్మిక నిధిని ఆంధ్రాకు త‌ర‌లించ‌డం పెద్ద‌వార్త‌...
ఇదే ప‌నిని ఒక‌వేళ తెలంగాణ ప్ర‌భుత్వం చేసిఉంటే ఏం జ‌రిగేది...
ఏముంది చంద్ర‌బాబునాయుడు ఏకంగా ఢిల్లీకి వెళ్లేవాడు..
మోడీని క‌లిసేవాడు... చూశారా ఈ అన్యాయం అంటూ తెగ ఆవేద‌న వ్య‌క్తం చేసేవాడు..
ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా ఆ రెండు ప‌త్రిక‌ల‌ త‌మ కుట్ర‌ క‌థ‌నాల‌ను రాసేవి...
----------------
కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం చేసిన చ‌ర్య‌ను స‌మ‌ర్థించేలా నిన్న ఈనాడు ప‌త్రిక వార్త‌ను రాసింది..
కార్మిక నిధి త‌ర‌లింపు చ‌ట్ట‌వ్య‌తిరేకం కాదంటూ హెడ్డింగ్ పెట్టింది..
దీనికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ‌ర్గాలు అభిప్రాయం అంటూ జోడించింది...
అస‌లు వార్త క‌న్నా ఇదే ఎక్కువ‌గా ఉండ‌టం విచిత్రం...

మీడియాకు ఐటీ చ‌ట్టాన్ని అమ‌లు చేయాలి....


అవును.. ఇప్పుడు అంతా డిజిట‌ల్ మ‌యం అయిపోయింది... ఆన్ లైన్ ఎడిష‌న్లు వ‌చ్చాయి... ప్ర‌తి పేప‌ర్ ఇంట‌ర్నెట్‌లో ఉంటుంది... అలాంట‌ప్పుడు ప‌త్రిక‌ల్లో వ‌చ్చే క‌థ‌నాల‌కు కూడా ఐటీ చ‌ట్టాన్ని వ‌ర్తింప‌జేయాలి.. ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసే రాత‌లు రాసిన వాడిని జైలులో వేయాలి...
ఐటీ చ‌ట్టాన్ని కేవ‌లం సోష‌ల్ మీడియాకే వ‌ర్తింప‌జేయ‌డం ముమ్మాటికీ త‌ప్పే... అన్ని మీడియాల మాదిరిగానే సోష‌ల్ మీడియాను ప‌రిగ‌ణించాలి... ప‌త్రిక‌ల్లో ఇష్టానుసారం రాసే వారికి, టీవీల్లో ఇష్టానుసారం చూపేవారిని కూడా క‌ట్ట‌డి చేయాలి....

ఐటీ చ‌ట్టాన్ని ప్రింట్‌, ఎల‌క్ట్రానిక్ మీడియాకు వ‌ర్తింప‌జేస్తే ఏ ఒక్క మీడియా అధిప‌తి కూడా ఇంట్లో ఉండ‌డు.. అంద‌రూ జైలులోనే ఉంటారు.. ఎందుకంటే ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టే వార్త‌ల‌ను వాళ్లే ఎక్కువ‌గా రాయిస్తున్నారు కాబ‌ట్టి....

ఈ అల్ల‌ర్ల వ‌ల్ల ఢిల్లీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ‌తిన‌దా?

మొన్న ఢిల్లీలో అల్ల‌ర్లు జ‌రిగిన‌ట్లు విన్నాను.... ఈ అల్ల‌ర్లు ఎందుకు జ‌రుగుతున్నాయి...?
ఈ అల్ల‌ర్ల వ‌ల్ల ఢిల్లీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ‌తిన‌దా?

గాడ్సేను ఆరాధించే వాళ్లు ఈదేశంలో ఇప్ప‌టికీ ఉన్నారు....

స‌ర్దార్ ప‌టేల్ మ‌రో ఐదేళ్లు బ‌తికి ఉంటే దేశ చ‌రిత్ర మ‌రోలా ఉండేది.... ఇది మోడీగారి మాట‌...
----------------
అస‌లు మ‌హాత్మాగాంధీని నాథూరాం గాడ్సే కాల్చి చంప‌క‌పోయి ఉంటే  ఈ దేశ చ‌రిత్ర ఇంకోలా ఉండేది... ఇది నా మాట‌....
--------------

మోడీ గారు అత్యంత అమితంగా ఇష్ట‌ప‌డే మ‌హాత్ముడి లాంటి మ‌హనీయుడిని పొట్ట‌న‌బెట్టుకున్న గాడ్సేను ఆరాధించే వాళ్లు ఈదేశంలో ఇప్ప‌టికీ ఉన్నారు.... వాళ్ల‌కు వాళ్లు దేశ‌భ‌క్తులుగా చెప్పుకు తిరుగుతారు....!!!

మ‌త ఘ‌ర్ష‌ణ‌ల బాధితుల‌కు ప‌రిహారం ఇవ్వాల‌ని విజ్ఞ‌ప్తి....

సిక్కుల ఊచ‌కోత బాధిత కుటుంబాల‌కు రూ.5 ల‌క్ష‌ల ప‌రిహారం ప్ర‌క‌టించ‌డం హ‌ర్ష‌ణీయ‌మే..
అలాగే గోద్రా, కొంథ‌మాల్‌, అస్సాం, ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్‌, జ‌మ్మూకాశ్మీర్‌లో జ‌రిగిన మ‌త ఘ‌ర్ష‌ణ‌ల బాధితుల‌కు ప‌రిహారం ఇవ్వాల‌ని విజ్ఞ‌ప్తి....

పాపం ఇందిరాగాంధీ గారు..

పాపం ఇందిరాగాంధీ గారు..

స‌మైక్యాంధ్ర ఉద్య‌మం కోసం ఆమె పేరును, ఆమె ప్ర‌సంగాల‌ను వాడుకున్నారు.. ఆమె గొప్ప స‌మైక్య‌తా వాది అన్నారు..
తెలంగాణ ప్ర‌క‌ట‌న రాగానే ఇందిరాగాంధీ విగ్ర‌హాలు కూల్చిపారేశారు..
ఇక నిన్న ఆమె వ‌ర్థంతిని విస్మ‌రించారు...
--------------------------------

రైతుల‌ను ఆదుకోవ‌డం ఎలా?

రైతుల‌ను ఆదుకోవ‌డం ఎలా?
ఈ ఆత్మ‌హ‌త్య‌లు ఆగేదెలా?
ఏళ్ల త‌ర‌బ‌డి కొన‌సాగుతున్న ఈ తంతును నిరోధించాలి..
అన్న‌దాత‌కు భ‌రోసానివ్వాలి..
కేంద్ర‌, రాష్ట్రాలు రైతుకు గిట్టుబాటు ధ‌ర‌ను క‌ల్పించాలి...

అన్ని వ‌స్తువుల ధ‌ర‌ల నిర్ధార‌ణ‌ను ఆయా కంపెనీలు నిర్ధారించుకుంటాయి..
మ‌రి  రైతు పండించే ధాన్యం క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌ను ప్ర‌భుత్వాలు నిర్ధారించ‌డం ఏంటో?http://www.indiatribune.com/index.php?option=com_content&id=5389%3Aevery-12-hours-one-farmer-commits-suicide-in-india

శ్రీ‌ధ‌ర్ గారి కుంచె నుంచి ఇలాంటి కార్టూన్లు జారువాల‌లేదు ఎందుకో....

యూపీఏ హ‌యాంలోనూ ఇలాంటి నిబంధ‌న‌లే ఉన్నాయి క‌దా.. మ‌రి అప్పుడు శ్రీ‌ధ‌ర్ గారి కుంచె నుంచి ఇలాంటి కార్టూన్లు జారువాల‌లేదు ఎందుకో....
-------------
అయినా విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డుల నిబంధ‌న‌లు చాలా క‌ష్టంగా ఉంటే వాటిని స‌ర‌ళ‌త‌రం చేస్తున్న ప్ర‌భుత్వాలు... మ‌రి  న‌ల్ల‌ధ‌నం నిబంధ‌న‌ల‌ను స‌ర‌ళ‌త‌రం చేసుకోవ‌డంపై శ్ర‌ద్ధ పెట్ట‌డం లేదు ఎందుకో?