మొన్న కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎంపీలందరికీ ఢిల్లీలో విడిది(అకామడేషన్) ఏర్పాటు చేశారు.. ఏపీ భవన్‌లో కొందరికి, అశోకా హోటల్‌లో కొందరికి రూంలు కేటాయించారు. ప్రొటోకాల్ ప్రకారం దత్తన్నకు ఏపీ భవన్‌లో రూం ఇచ్చారు. అయితే అది వేసవి కాలం. ఆ రూంలో ఏసీ పనిచేయడం లేదు. ఢిల్లీలో వేసవిలో ఏసీ లేకుండా ఉండటం అంటే పెద్ద నరకమే.. అయితే దత్తన్న గారు ఏపీభవన్‌లోని అదే రూంలో ఉక్కపోతతో ఉన్నారు.. అశోకా హోటల్‌కు వెళ్లమని అక్కడి అధికారులు ఆయనకు నచ్చజెప్పినా వినలేదు నేను ఇక్కడే ఉంటానని ఆయన చెప్పారు. చేసేదేం లేక అదే బిల్డింగ్ లో ఖాళీగా ఉన్న మరో ఏసీ రూంలో తాత్కాలికంగా బస చేయాల్సింది అధికారులు చెప్పారు.. దీంతో ఆయన పై అంతస్థుకు వెళ్లారు.
మరుసటి రోజున దత్తాత్రేయ ఉన్న రూంకు అధికారులు వచ్చి సార్.. మీరు ఈ రూం ఖాళీ చేయాలి.. ఈ రూం కేటాయించిన ఆయన వచ్చారు అని సమాచారం ఇచ్చారు.. దత్తన్న ఏమీ మాట్లాడకుండా కింద రూంకు వచ్చేందుకు సిద్ధపడ్డారు. వెంటనే అక్కడే ఉన్న పాత్రికేయులు కొందరు మాజీ కేంద్ర మంత్రిని ఇలా అవమానిస్తారా? అంటూ అధికారులను నిలదీశారు. అశోకా హోటల్‌కు వెళ్లమంటే ఆయన వెళ్లడం లేదని అధికారులు పాత్రికేయులతో అన్నారు.. వెంటనే పాత్రికేయులు దత్తన్నతో మాట్లాడుతూ... ఎందుకు సార్ ఈ వేసవిలో ఏసీ పనిచేయని రూంలో ఉండటం.. అశోకా హోటల్‌లో ఉండొచ్చు కదా అని సూచించారు. దత్తన్న మాట్లాడుతూ.. నాతో పని మీద చాలా మంది వ్యయప్రయాసలతో ఈ అడ్రెస్‌కు వస్తారు.. ఇక్కడ చవకకు భోజనం చేయడం, చాయ్ తాగడానికి వీలుంటుంది... నేను అశోకా హోటల్‌లో ఉంటే నాకోసం వచ్చే ప్రజలకు ఇబ్బందే కదా.. అక్కడ భోజనానికి, టీకి వందల రూపాయలు ఖర్చు చేయలేరు... వాళ్లందరికీ ఇదే సౌకర్యమైన ప్రదేశం. అందుకే నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నా అని ఆయన చెప్పడంతో విలేకరులంతా ఆశ్చర్యపోయారు..
తన సౌకర్యం కన్నా తన కోసం వచ్చే పేద, బడుగు, బలహీన వర్గాల బాగు కోసం ఆలోచించే దత్తన్న లాంటి నాయకులందరికీ నా వందనాలు..
------------------------------------------
దత్తన్నకు మొదటి విడతలోనే అవకాశం దక్కాల్సింది.. ఆలస్యమైనా సరే పదవి లభించినందుకు సంతోషం. ఆయన కేంద్ర మంత్రిగా తెలంగాణకు అన్నీ కేటాయింపులు చేయాలన్న స్వార్థం మాకు లేదు.. న్యాయంగా లభించే వాటిని కేటాయిస్తే సరిపోతుంది.. అన్ని రాష్ట్రాలను, ప్రాంతాలను సమానంగా చూడాలని తెలంగాణ సమాజం తరఫున విజ్ఞప్తి... తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను సరిదిద్దాలని మా విన్నపం.. మీకు భగవంతుడు నిండు నూరేళ్లు, ఆయుర్ ఆరోగ్యాలు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను...!!
దత్తన్నా అని పిలిస్తే చాలు.. ఓ వత్తన్న వత్తన్న అంటూ వచ్చే మనసున్న జన నేత మన బండారు దత్తాత్రేయ...
No comments:
Post a Comment