1

1

Tuesday, 25 November 2014

ఇదెక్క‌డి పైత్యం?



కొంత ఆల‌స్యంగా స్పందిస్తున్నాను. రెండ్రోజుల కింద‌ట న‌మ‌స్తే తెలంగాణ‌లో వ‌చ్చిన వార్త ఇది. తెలుగు తేజం అట‌. ఇదెక్క‌డి పైత్యం?. ఆంధ్ర ప‌త్రిక చ‌దువుతున్నమా?. తెలంగాణ ప‌త్రిక‌నా? అని అనుమానం క‌లిగింది. తెలంగాణ తేజం ఇక్క‌డి వాడు కాక‌పోతే హైద‌రాబాద్ తేజం అని పెట్టొచ్చు క‌దా. అవి మూడు అక్ష‌రాలు కాదు... తెలంగాణ పాఠ‌కుల గుండెల్లో మూడు గున‌పాలు అనే విష‌యాన్ని మ‌ర‌వ‌ద్దు. జై తెలంగాణ‌

5 comments:

  1. ఆ విషయాన్ని చెప్పడానికి మీరు రాసింది తెలుగు నుడికట్టు!
    ఆ లెక్కన మీ గుండెల్ల మీరెన్ని గునపాలు దించుకున్నట్టు?
    మొత్తం 47.

    ReplyDelete
  2. తెలంగాణ ఉద్య‌మానికి ముందు ఎవ‌రైనా ఆంధ్రా వాసి అమెరికాలో స‌త్తా చాటితే.. ఆంధ్రా మీడియాలో స‌త్తా చాటిన ఆంధ్రుడు అని వ‌చ్చేది.. తెలంగాణ వాళ్లు స‌త్తాచాటినా అలాగే రాసేవాళ్లు.. 2009లో తెలంగాణ ఉద్య‌మం ప‌తాక స్థాయికి చేరాక‌.. ఆంధ్రుడి స్థానంలో తెలుగు తేజం అన్న ప‌దం వ‌చ్చి చేరింది.. ఈ తెలుగు తేజం బ‌దులు ఈ తెలంగాణ తేజం అని పెడితే అభ్యంత‌రం ఏంటి? అన్న‌ది నా ప్ర‌శ్న‌..
    హిందీ తేజాలు, త‌మిళ‌న తేజాలు ఉంటాయా? కేవ‌లం వాళ్లు పుట్టిన గ‌డ్డ పేరు మీద‌నే గుర్తింపు క‌దా...

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. హిందీ సంగతి తర్వాత చూద్దాం,అందులోనూ డయలెక్టులు చాలా వున్నాయి,లింకు లాంగ్వేజిగా తప్ప జాతీయ భాష అంటే యెవరూ వొప్పుకోవదం లేదు.మిగిలిన అందరికీ ముఖ్యంగా తమిళ తేజం గురించి మీరే ప్రస్తావించారు, యెవరి తేజాలు వాళ్ళకి వున్నారు.ఆ రాష్త్రాల్లో వాళ్ళ్ళకి రాష్ట్రం పేరూ భాష పేరూ కామనే - గుజరాతీలు మాట్లాదేది గుజరాతీ, మరాఠీలు మట్లదేది మరాఠీ - ఇట్లాగ.సానియా మీర్జా తెలంగాణా బ్రాండ్ యెంబాసిడర్ హోదా ఇచ్చినప్పుడు నాకు గానీ మరెవరికయిన్నా గుచ్చుకుందా!లేదే?మరి తెలుగు తేజం అనగానే మీకు యెందుకు కలుక్కుమంది?అక్కడి వార్త చదివి ఆంధ్రాలో వాళ్ళు యేమయినా యేడ్వాలా?రెండు రాష్త్రాల్లోని వాళ్ళూ మన తెలుగువాడు సాధించాడు అని చెప్పుకుంటే మీకు అభ్యంతరమా?

      Delete
    3. అస్థిత్వం, ఆత్మ‌గౌర‌వ‌పు నినాదాల‌తో కొట్లాడినోళ్లం... ఈ గ‌డ్డ పేరును నిత్యం స్మ‌రించుకోవాల‌న్న‌ది మా ఆలోచ‌న‌... ఈ గ‌డ్డ‌ను స్మ‌రించుకుంటే తెలుగు, ఉర్డూ, హిందీ, అన్ని భాష‌లు మాట్లాడే వారంద‌రినీ గుర్తు చేసుకున్న‌ట్లే..

      Delete