తెలుగు సినీ పరిశ్రమ నుంచి మన పరిశ్రమ వేరు కావాల్సిందే...
ఈ తెలుగు పేరిటే ఇన్నాళ్లు అణచివేతలు జరిగాయి.. అందుకే మన అస్థిత్వం మనకు ఉండాలి...
మనకు వరదొస్తే, మనకు కరవొస్తే వాళ్లు మేం సైతం అంటూ ఎప్పుడూ రాలేదు.. వస్తారన్న నమ్మకం లేదు..
మన పరిశ్రమ మనకు ఉంటే దక్షిణ భారత సినీ పరిశ్రమల్లో మనదీ ఒకటిగా ఉంటుంది..
అప్పుడు మన రైతులు ఆత్మహత్య చేసుకున్నా... మనకు కరవొచ్చినా మన కళాకారులు మనవారిని ఆదుకునేందుకు ఛారిటీ షోలు చేస్తారు..
ఈ విషయంపై ప్రభుత్వం, కళాకారులు, మేధావులు చర్చించి తెలంగాణ సినీ పరిశ్రమను అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవాలి...
నోట్: తెలుగు పరిశ్రమకు మరో కీలక కేంద్రంగా విశాఖ మారే సమయంలో తుపాన్ రావడంతో ఆ ప్రక్రియకు కొంత ఆటంకం వాటిల్లింది...
ఇప్పుడు ఆ విశాఖను అభివృద్ధి చేసేందుకు అక్కడి వారు తాపత్రయ పడుతున్నారు... ఈ నేపథ్యంలో మన వాళ్లంతా మన సినీ పరిశ్రమను అభివృద్ధి చేసే దిశగా కృషి చేయాలి... వీలైతే హిందీ చిత్ర నిర్మాణాల కేంద్రంగా కూడా హైదరాబాద్‌ను మార్చాలి.. ముంబయి తర్వాత మన వద్దకు బాలీవుడ్ వచ్చేలా ప్రణాళికలు ఉండాలి...
No comments:
Post a Comment