1

1

Tuesday 30 September 2014

రాధాకృష్ణ గారు... ర‌విప్ర‌కాశ్ గారు.. రాజ్‌దీప్ పై దాడిని ప‌ట్టించుకోరా...

రాధాకృష్ణ గారు...
ర‌విప్ర‌కాశ్ గారు..
రాజ్‌దీప్ పై దాడిని ప‌ట్టించుకోరా...
సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టుకు అమెరికాలోనే భ‌ద్ర‌త క‌ర‌వైంద‌ని కేంద్రం దృష్టికి తీసుకుపోరా...
ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయ‌రా...
దీనిపై చ‌ర్చ‌లు పెట్ట‌రా...
ఇదే దాడిని తెలంగాణ వాళ్లు అర్నాబ్ గోస్వామిపైనో ఇంకొక‌రిపైనో చేస్తే మీరు మౌనంగా ఉండేవాళ్లా....
మీ ఛానెళ్ల ప్ర‌సారాల‌ను ఆపేస్తే ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్టు రాజ్ దీప్ స‌ర్దేశాయి గారు మీకు మ‌ద్ద‌తుగా మాట్లాడారు.. మ‌రి ఆయ‌న‌పైనే అమెరికాలో దాడి జ‌రిగింది... జ‌ర్న‌లిస్టుల‌కు స్వేచ్ఛ లేదా... దీనిపై చ‌ర్చ పెట్టండి... యాజ‌మాన్యాల‌పై దాడులు జ‌రిగితే చ‌ర్చ‌లు జ‌రుపుతారు కానీ జ‌ర్న‌లిస్టుల‌పై దాడుల‌పై స్పందించ‌రా? అయినా మోడీని ఒక జ‌ర్న‌లిస్టుగా ఎప్పుడో విమ‌ర్శించాడ‌ని ఇప్పుడు దాడి చేశారు... మ‌రి మీడియా దాన్ని పెద్ద‌గా చూప‌డం లేదు... ఎందుకో... ఇదే దాడిని ఓ కేసీఆర్ అభిమానో, తెలంగాణ అభిమానో అర్నాబ్ గోస్వామి మీద లండ‌న్ లోనో, సింగ‌పూర్ లోనో చేస్తే ఈ పాటికి ర‌చ్చ ర‌చ్చ చేసే వాళ్లు కాదా?

ప్ర‌జా చైత‌న్యం, ఆవేశాలు, అభిమానాలు హ‌ద్దులు దాటాయి...

జ‌ర్న‌లిస్టులు స్వేచ్ఛ ముసుగులో ఏమైనా చేయాల‌నుకుంటే ప్ర‌జ‌ల స‌హ‌నానికి హ‌ద్దులు ఉంటాయి... అది తెలంగాణ ప్ర‌జ‌లైనా.. ఇంకెవ‌రైనా స‌రే.. 
మీడియా సంస్థ‌లు ఈ విష‌యాన్ని గుర్తుపెట్టుకోవ‌డం ఉత్త‌మం... మీడియా సంస్థ‌లు ఏమైనా చూపుతాయి.. మీ ఇష్టం ఉంటే చూడండి లేక‌పోతే చావండి అన్న రీతిలో వ్య‌వ‌హరిస్తే కేబుల్స్ క‌ట్ చేయ‌డ‌మే ఉంటుంది... ఇక జ‌ర్న‌లిస్టులు ఏమైనా చేస్తారు.. వాళ్ల‌ను ప్ర‌శ్నించొద్దు అంటే కూడా ఎవ‌రూ ఊరుకోరు... ప్ర‌జా చైత‌న్యం, ఆవేశాలు, అభిమానాలు హ‌ద్దులు దాటాయి...

భార‌త క్రీడాకారులు ఓడిపోవాలి.. ఖ‌జానాలో సొమ్ములు మిగిలిపోవాలి...

అస‌లు క్రీడ‌లు మ‌న‌కెందుకండీ...
భార‌త క్రీడాకారులు ఓడిపోవాలి.. ఖ‌జానాలో సొమ్ములు మిగిలిపోవాలి...
ఛీ... ధోని టీం భార‌త్‌కు ప్ర‌పంచ క‌ప్‌ను ఎందుకు తీసుకొచ్చింది...?
మ‌న క‌ర్మ కొద్ది వాళ్లు ప్ర‌పంచ‌క‌ప్‌ను గెలిచినందుకు మ‌న‌ ఖ‌జానాలో రూ.100ల కోట్లు లూటీ అయ్యాయి..
ఛీ వాళ్లు ప్ర‌పంచ క‌ప్ గెల‌వ‌కుంటే బాగుండేది.. అన‌వ‌స‌రం వాళ్ల‌కు డ‌బ్బులు ఇచ్చారు.. న‌జ‌రానాలు ఇచ్చారు.. కొంద‌రికి పుర‌స్కారాలు ఇచ్చారు.. భార‌త ర‌త్న‌లు ఇచ్చారు..
ఫ‌స్ట్ రౌండ్‌లోనే భార‌త్ ఓడిపోయి ఇంటికి వ‌చ్చి ఉంటే ఖ‌జానాకు వంద‌ల కోట్లు ఆదాయ అయ్యేవి క‌దా...
ఇక్క‌డ భార‌త్ ఓడిపోయినా ప‌ర్వాలేదు... కానీ మ‌న డ‌బ్బు మిగిలేది క‌దా...
పుల్లెల గోపీచంద్ అప్పట్లో బ్యాట్మింట‌న్ టోర్నీ గెల‌వ‌క‌పోతే బాగుండు.. ఆయ‌న‌కు గ‌చ్చిబౌలిలో కోట్ల రూపాయ‌ల విలువైన భూమిని ప్ర‌భుత్వం ధారాద‌త్తం చేసేది కాకుండే... ఖ‌జానాకు డ‌బ్బు మిగిలి ఉండేది...
అప్ప‌ట్లో ఒలింపిక్స్‌లో స్వ‌ర్ణ ప‌త‌కం గెలిచిన షూట‌ర్ గెల‌వాల్సింది కాకుండే.. అన‌వ‌స‌రంగా ఆయ‌న‌కు కోట్ల రూపాయాలు ఇచ్చారు...
అస‌లు ఈ క్రీడాకారులెవ‌రూ ఏ టోర్న‌మెంట్ లోనూ గెల‌వొద్దు.. భార‌త క్రీడాకారులు అన్ని క్రీడ‌ల్లోనూ ఓడిపోవాలి.. మ‌న‌కు ఎవ‌రూ ప‌త‌కాలు తేవొద్దు.. అన‌వ‌స‌రంగా ఖ‌జానా లూటీ కావొద్దు...
మీరేం అంటారు... అస‌లు క్రీడా మంత్రిత్వ శాఖ‌నే ర‌ద్దు చేద్దాం... క్రీడ‌ల‌కు నిధులొద్దు... క్రీడాకారుల‌కు స‌న్మానాలొద్దు.. పుర‌స్కారాలొద్దు.. రివార్డులొద్దు...
మ‌ళ్లా చైనా వాడు అన్ని గెలిచాడు.. అమెరికా వాడు ఇన్ని గెలిచాడు.. చిన్న దేశం కెన్యాకు కూడా ఒలింపిక్స్‌లో స్వ‌ర్ణం వ‌చ్చింది... మ‌న ద‌గ్గ‌ర స‌న్నాసులు ఉన్నారా? అంటూ తిట్టుకోవ‌డాలూ వ‌ద్దు...

ఈనాడులో చీక‌టి రోజులొచ్చి చాల్రోజులైంది. కాక‌పోతే యాజ‌మాన్యానికి ఇవి వెన్నెల రాత్రుల‌నుకోండి.



పిల్లి క‌ళ్లు మూసుకొని పాలు తాగుతుంది...
- ఎవ‌రూ చూస్త‌లేర‌నుకుంటుందా?. చూస్తేంది... అని బ‌రి తెగించి తాగుతుందా?.
ఈనాడులో చీక‌టి రోజులొచ్చి చాల్రోజులైంది. కాక‌పోతే యాజ‌మాన్యానికి ఇవి వెన్నెల రాత్రుల‌నుకోండి. ఓ సంక‌న చంద్ర‌బాబు, ఇంకో సంక‌న మోడీ. మ‌రి తెలంగాణ సీఎం... భుజం మీదుండా, వాళ్ల నెత్తి మీదుండా... అస‌లు గాయ‌న‌కు, వీళ్ల‌కు ట‌చ్ ఉందా?. ఇవ‌న్నీ ఓ స‌గ‌టు ఈనాడు ఉద్యోగిని వేధిస్తున్న సందేహాలు. తెలంగాణ సిద్ధాంత‌ప‌రంగానైతే ఇద్ద‌రి మ‌ధ్య స‌ఖ్య‌త ఉండొద్దు. గీ స‌మీక‌ర‌ణాల‌తోనైనా చ‌ట్టం త‌న ప‌ని తాను చేస్తుంద‌ని పాపం... బ‌ల‌వంతంగా రాజీనామాలు చేసి, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో తెలియ‌ని సెక్యూరిటీ గార్డులు కార్మిక శాఖ కార్యాల‌యం చుట్టూ తిరిగిండ్రు. తొలుత గాండ్రించిన చ‌ట్టం రెండ్రోజుల్లోనే తోక ముడిచింది. మ‌రి ఇలా ఎందుకు జ‌రిగిందో తెలియ‌క భూత‌, వ‌ర్త‌మాన‌, భావి ఈనాడు బాధితులంతా అయోమ‌యంలో ప‌డిపోయారు.
ఈ స‌మ‌యంలో చ‌కాచ‌కా అడుగులు వేసిన ఈనాడు యాజ‌మాన్యం గార్డుల రాజీనామాలు ఆమోదించి, వాళ్ల అకౌంట్ల‌ళ్ల సెటిల్‌మెంట్ డ‌బ్బులు వేసింది. సెక్యూరిటీ గార్డుల‌కు అనుకున్న దానికంటే అద‌నంగా ఒక్కొక్క‌రికి రూ.2 లక్ష‌ల‌కు పైగానే అకౌంట్‌లో వేశార‌ట‌. దీంతో ఆ సెక్యూరిటీ గార్డుల్లో కొంద‌రు... స‌ర్కారు పులి గాండ్రింపున‌కు భ‌య‌ప‌డి ఎక్కువ వేశార‌ని అనుకున్నారు. ఇంకొంద‌రు అరె మా యాజ‌మాన్యంలోని అకౌంటెంట్లు త‌ప్పుడు లెక్క‌లు చేసి ఈనాడు ఖ‌జానాను ఖ‌రాబ్ చేస్తుండ్ర‌ని ఫో్న్ చేసి మ‌రీ త‌మ‌కు ఎక్కువ మొత్తం ప‌డింది... వెన‌క్కి తీసుకోండ‌ని స్వామిభ‌క్తిని చాటుకున్నార‌ట‌. కానీ క‌సాయి వాడు క‌సాయి వాడే క‌దా. వాన్లెక్క‌లు వాన్కీ ఉంట‌యి... అందుకే అదేం లేదు. మీకు వేజ్‌బోర్డు అమ‌లు చేసినందున ఏరియ‌ర్స్ ఇచ్చాం. అదే గా ఎక్కువ అని చెప్పారు. కాస్త సంతోషం కాక‌పో్తే ఐదేళ్ల‌లోపోళ్ల‌కు 2-3వేలు నెల‌కు పెరిగాయ‌ట‌. ఆపై సీనియార్టీ వాళ్ల‌కు ఒక్క పైసా కూడా పెర‌గ‌లేద‌ట‌. ఎందుకంటే రాష్ట్రంల ఎక్క‌డ కూడా ఈనాడు ఆఫీసులు న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో లేవు. అన్నీ ఎవ‌రో త‌రిమేసిన‌ట్లు గ్రామ‌పంచాయ‌తీల‌కు బైలెల్లిపోయిన‌వి. అందుకే హెచ్చార్యే, ట్రాన్స్‌పో్ర్టు అల‌వెన్స్ ఇలా అన్నీ కోత‌లు ప‌డ‌టంతో న‌యాపైసా పెర‌గ‌లేదు. కానీ యాజమాన్యం మాత్రం వేజ్‌బోర్డు అమ‌లు చేశామ‌ని జులుం చెలాయించ‌డానికి మార్గం సుగ‌మ‌మైంది.
ఇక ఎడిటోరియ‌ల్ మిత్రులు ఈ చేదు అనుభ‌వంలోనూ ఓ తీపి గుళిక‌ను వెలికి తీసి, తృప్తి ప‌డుతున్నారు. అదేంటంటే... సెక్యూరిటీ గార్డుల‌కు వేజ్‌బోర్డుతో సెటిల్ చేశారంటే మాకూ వేజ్‌బోర్డు ఇస్తారు క‌దా అని సూత్రీక‌రించుకున్నారు. ఈ స‌మ‌యంలో ఇస్తారో ఇవ్వ‌రో తెలియ‌ని బో్న‌స్ రెక్క‌లు క‌ట్టుకొని వాలింది. కాక‌పోతే అందులో చిన్న పిత‌టాకం. ఇప్పుడే కాదు రెండు, మూడేళ్ల కింద‌ట ఇచ్చిన బోన‌స్ (యాజ‌మాన్యం భాష‌లో ఎక్్స‌గ్రేషియా)ను కూడా మున్ముందు ఇచ్చే బెనిఫిట్స్‌లో స‌ర్దుబాటు చేస్తామ‌ని సావుక‌బురు స‌ల్ల‌గ చెప్పిండ్రు. అయినా ఇందులో మ‌రో సంతోషం. అదేంటంటే వేజ్‌బోర్డు అమ‌లే కాదు ఏరియ‌ర్స్ కూడా ఇస్తున్నార‌ట అని మిత్రులు చెవులు కొరుక్కుంటున్నారు. ఏదైతేనేం... పండుగ‌కు బోన‌స్‌, వేజ్‌బోర్డు అమ‌లుతో జీతం, అస‌లు రాదవ‌నుకున్న ఏరియ‌ర్స్ కోత‌ల‌తోనైనా వ‌చ్చే సంకేతాలు. ప్ర‌స్తుతానికి విరామ‌మో... మ‌రో ర‌క‌మైన అంత‌రాయ‌మో... అల్లంత దూరాన ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీకి బ‌తుకుజీవుడా... అని సోమ‌వార‌మే ప్ర‌స్థానాన్ని ప్రారంభించిన మిత్రుల‌కు కొంత ఊర‌ట‌.
సాటి మ‌నిషిగా నాకూ ఇవి తాత్కాలిక‌మైనా సంతోష‌క‌ర అంశాలే. కానీ మిత్రులు యాజ‌మాన్యం కుట్ర‌ల‌ను ముందే గుర్తించాల‌ని, దీనికి ఇత‌ర జ‌ర్న‌లిస్టు సంఘాలు కూడా తోడు రావాల‌ని ఓ ప‌రిణామాన్ని మీ ముందు ఉంచుతున్నాను. నాల్రోజుల కింద‌ట ఈనాడు యాజ‌మాన్యం బో్న‌స్ కోసం వెల్ల‌డించిన ప్ర‌క‌ట‌న‌లో *ఉషోద‌య ఎంట‌ర్‌ప్రైజెస్ ఎండీ కిర‌ణ్‌* అని ఉంది. ఇది ప్ర‌మాదానికి సంకేతంగా గోచ‌రిస్తుంది. వాస్త‌వంగా న్యూస్‌టుడే కింద ఉన్న ఎడిటోరియ‌ల్ వాళ్ల‌ను లాభాల్లో ఉన్న ఉషోద‌య ప‌బ్లికేష‌న్స్ కింద‌కు తెచ్చారు. అప్పుడు అంద‌రితో సంత‌కాలు తీసుకున్నారు. అప్పుడు ఎండీ కిర‌ణ్ అని ఉంది. మ‌రి న‌ష్టాల్లో ఉన్న ఉషోద‌య ఎంట‌ర్‌ప్రైజెస్ ఈనాడు ముంగిట‌కు ఎలా వ‌చ్చింది?. గ‌తంలో దీని ఎండీ సురేష్ ఉన్నారు. ఇప్పుడు కిర‌ణ్ అయితే కావ‌చ్చు. కానీ దానికీ, ఈనాడు ఎడిటోరియ‌ల్ ఉద్యోగ‌స్తుల‌కు ఏం సంబంధం?. ఎలాంటి పంగ‌నామాలు పెట్టేందుకు యాజ‌మాన్యం సిద్ధ‌మ‌వుతుంది?. దీనిపై జ‌ర్న‌లిస్టు మిత్రులు పో్రాడాలి. ఎందుకంటే అంద‌రి మౌన‌మే... యాజ‌మాన్యానికి బూస్టులా ప‌ని చేస్తుంది. లేకుంటే ఈనాడులో 28, 29 తేదీల్లో ప‌డే జీతం, 25 తేదీక‌ల్లా వ‌చ్చే పే స్లిప్‌లు 30 తేదీకి కూడా అతీగ‌తీ లేవంటే యాజ‌మాన్యం ఎంత పెద్ద కుట్ర చేస్తుందోన‌ని ఈనాడు వాస‌న తెలిసిన ప్ర‌తి ఒక్క‌రికీ అనుభ‌వంలోనిదే. ఒక‌వైపు మెట్రో క‌థ‌ల‌తో తెలంగాణ స‌ర్కారును ఆడించాల‌ని చూస్తున్న ఈనాడు యాజ‌మాన్యం వేగంగా ఉద్యోగుల‌ను వీధుల్లోకి నెట్టేందుకు పావులు క‌దుపుతుంది. గ‌తంలో రామోజీని ఏమ‌న్నా... వేలాది మందికి ఉపాధి ఇస్తున్నారు ఆయ‌న్ని ఎవ‌రూ ఏమ‌నొద్దు అనేవారు. మ‌రి ఇప్పుడు వేలాది మంది ఉసురు పోసుకుంటున్నాడు. ఇప్ప‌డేమ‌నాలి?. మేధావులు, ప్ర‌భుత్వాలు, జ‌ర్న‌లిస్టు సంఘాలు, క‌వులు, ర‌చ‌యిత‌లు ఎవ‌రూ మౌనాన్ని వీడ‌క‌పోతే ఎలా?. కొంద‌రికి వ్య‌తిరేక వార్త‌ల భ‌యం, మ‌రికొంద‌రికి మా వార్త‌లు క‌వ‌ర్ కావ‌నే ఆందోళ‌న‌... అంటే ఒక్క ప‌త్రిక ఉంటే తోక ఎంత‌పెద్ద శ‌రీరాన్ని అయినా ఆడించొచ్చ‌న్న మాట‌.

జ‌ర్న‌లిస్టుల జీతాలు క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో రూపాయి నుంచి 80 రూపాయ‌ల వ‌ర‌కు పెరిగిన వైనం...

బ్రేకింగ్ న్యూస్...
జ‌ర్న‌లిస్టుల‌కు మ‌జీథియా వేజ్ బోర్డు సిఫార్సుల‌ను అమ‌లు చేసిన ప‌చ్చ ప‌త్రిక‌...
జ‌ర్న‌లిస్టుల జీతాలు క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో రూపాయి నుంచి 80 రూపాయ‌ల వ‌ర‌కు పెరిగిన వైనం...
పెరిగిన జీతాల‌తో ఏం పండ‌గ చేసుకోవాలో తెలియ‌క అయోమ‌యంలో ఉద్యోగులు....
ఇంకొంత మందికి మ‌జీథియా సిఫార్సులు అమ‌లు చేస్తే జీతాల్లో కోత పెట్టాల్సి ఉంటుందంటూ ప‌రోక్ష హెచ్చ‌రిక‌లు..

అస‌లు జ‌ర్న‌లిస్టుల కోసం వేత‌న సవ‌ర‌ణ సంఘం నివేదిక ఇచ్చిన జ‌స్టిస్ మ‌జీథియా కూడా ఆశ్చ‌ర్య‌పోయేలా వాళ్ల జీతాల‌ను పెంచింది ప‌చ్చ ప‌త్రిక యాజ‌మాన్యం... త‌న మార్కు స్టైల్లో మ‌జీథియా సిఫార్సుల‌ను అమ‌లు చేసింది.. ఈ సిఫార్సులు అమ‌లు చేస్తే క‌నీసం 2 రెట్ల నుంచి గ‌రిష్టంగా 3 రెట్ల వ‌ర‌కు జ‌ర్న‌లిస్టుల జీతాలు పెరుగుతాయ‌ని నివేదిక ఇచ్చిన స‌మ‌యంలో జ‌స్టిస్ మ‌జీథియా కూడా అన్నారు... దాదాపు ప‌దేళ్లుగా వేత‌న స‌వ‌ర‌ణ లేకుండా అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్న జ‌ర్న‌లిస్టుల జీవితాల్లోకి ఈ క‌మిటీ వెలుగు తెస్తోంద‌ని పాత్రికేయులు సంబ‌ర ప‌డ్డారు.. అయితే ఈ నివేదిన అమ‌లు చేయ‌కుండా ఆదేశాలివ్వాలంటూ దాదాపు మూడేళ్లు న్యాయ‌పోరాటం చేసి ఓడిపోయిన యాజ‌మాన్యాల్లో ప‌చ్చ ప‌త్రిక కూడా ఉంది.. అయితే చాలా యాజ‌మాన్యాలు విధిలేక వేజ్‌బోర్డు సిఫార్సులను అమలు చేస్తున్నాయి...
ఎలాగైనా ఈ సిఫార్సుల అమ‌ల‌ను ఆపించాల‌ని ఒంట‌రిగానే చివ‌ర‌గా సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేసి భంగ‌ప‌డిన ప‌చ్చ ప‌త్రిక యాజ‌మాన్యం మ‌రో మ‌హ‌త్త‌ర ఎత్తుగ‌డ వేసింది... అస‌లు న‌గ‌రాల్లో సంస్థ ఆఫీసు ఉంటే హెచ్ ఆర్ ఏ, ట్రావెలింగ్ అవెన్సులు భారీగా ఇవ్వాల్సి ఉంటుంద‌ని చెప్పి... ఉద్యోగులంద‌రినీ వాళ్ల‌కున్న చిత్ర న‌గ‌రి(అదో సామాజ్ర్యం)లోకి మ‌కాం మార్చారు.. ఇప్పుడు మాది గ్రామ పంచాయ‌తీ ప‌రిధిలోకి వ‌స్తుంది కాబ‌ట్టి ఉద్యోగుల‌కు 10 శాతం హెచ్ ఆర్ ఏ ఇస్తాం, 5 శాతం ట్రావెలింగ్ అల‌వెన్సు ఇస్తాం... అని నిర్ణ‌యించింది.. ఇంకా కొన్ని అల‌వెన్సులు ఎగ్గొట్టింది... ఉద్దండ పండితులైన ఛార్టెడ్ అకౌంటెంట్‌ల‌ను ర‌ప్పించి జీతాల‌ను కుదించి, మ‌దించి అన్నీ చేసి చివ‌ర‌కు మ‌జీథియా వేత‌న స‌వ‌ర‌ణ సంఘం సిఫార్సుల‌ను అమ‌లు చేసినట్లు ఈ రోజు స‌గ‌ర్వంగా, సిగ్గులేకుండా ప్ర‌క‌టించారు...
పే స్లిప్పులు చూసిన ఉద్యోగులు ముక్కున వేలేసుకున్నారు... దాదాపు 12 వేలు క‌నీసం పెరుగుతాయ‌నుకున్న ఉద్యోగి జీతం ఒక రూపాయి పెరిగింది... 15 వేలు పెరుగుతాయ‌నుకున్న జ‌ర్న‌లిస్టుల జీతం 30 రూపాయ‌లు పెరిగింది...ఇంకొంత మందికైతే వేత‌న స‌వ‌ర‌ణ సంఘం సిఫార్సుల క‌న్నా ఎక్కువ జీతాల‌ను ఇస్తున్నామ‌ని యాజ‌మాన్యం అంటోంద‌ట‌.. భ‌విష్య‌త్తులో ఎక్క‌డ త‌మ జీతాల నుంచి కోత విధిస్తారో అన్న భ‌యంతో ఉద్యోగులు బిక్కుబిక్కుమంటున్నారు.. ఇక రూపాయి నుంచి 100 రూపాల‌య మ‌ధ్య జీతాలు పెరిగిన వాళ్లు న‌వ్వాలో ఏడ‌వాలో తెలియ‌క త‌ల‌లు ప‌ట్టుకున్నారు...
ఇదండీ ప‌త్రిక‌ల్లో కార్మిక చ‌ట్టాల అమ‌లు, వేత‌న స‌వ‌ర‌ణ సంఘం అమ‌లు తీరు... వీళ్లు జ‌నాల‌కు, ప్ర‌భుత్వాల‌కు నీతులు చెబుతారు...
వీళ్లు రాసింది భ‌గ‌వ‌ద్గీత‌లాగా లేదా ఇత‌ర ప‌విత్ర గ్రంథంలాగా మ‌న ఫీలై చ‌ద‌వాల‌న్న‌ట్లు బిల్డ‌ప్‌లు ఇస్తారు.. వీళ్ల‌ను ఆధునిక కాల‌పు దొర‌లు అంటే త‌ప్పులేదేమో...!!
నోట్‌: ఆ సంస్థ‌లో ప‌నిచేస్తున్న ఆంద్రా జ‌ర్న‌లిస్టుల‌దీ ఇదే ప‌రిస్థితి.. విజ‌య‌వాడ‌లో ఆ సంస్థ ఆఫీసును గ్రామ‌పంచాయ‌తీకి త‌రలించారు..

Sunday 28 September 2014

అమెరికా ఎన్నారైల్లో ఉత్సాహాన్ని నింపుతోన్న మోడీ ప్ర‌సంగం...



అమెరికాలో మ‌హాత్మాగాంధీని స్మ‌రించుకున్న‌ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. దేశ స్వాతంత్ర్య పోరాటంలో మ‌హాత్ముడి భూమిక అద్వితీయ‌మ‌ని కొనియాడారు... ముఖ్యంగా మ‌హాత్ముడి ప్రేర‌ణ‌తో  స్వ‌చ్ఛ్ భార‌త్ క‌ల‌ను సాకారం చేసుకోవాల‌ని పిలుపునిచ్చాడు... గంగా న‌ది ప్ర‌క్షాళ‌న‌లో ఎన్నారైలు పాలుపంచుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు... అభివృద్ధి అంటే ప్ర‌భుత్వాలు ఆసుప‌త్రులు క‌ట్టించ‌డం, పాఠ‌శాలలు క‌ట్టించ‌డం మాత్ర‌మే కాద‌ని... అభివృద్ధి లో ప్ర‌జ‌ల‌ను భాగ‌స్వాముల‌ను చేయడ‌మే  త‌న ల‌క్ష్య‌మ‌న్నారు... స్వాతంత్ర్యోద్య‌మాన్ని మ‌హాత్ముడు ఎలాగైతే జ‌న ఆందోళ‌న‌గా మార్చారో.. అలాగే అభివృద్ధిని కూడా జ‌న ఆందోళ‌న‌గా మ‌ల‌చ‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు..  పాత ప్ర‌భుత్వం మేం చాలా చ‌ట్టాలు చేశామ‌ని చెప్పుకుంద‌ని... అయితే ప‌నికి రాని చ‌ట్టాల‌ను తొల‌గించే ప‌నిలో తాను ఉన్న‌ట్లు తేల్చిచెప్పారు.. దేశంలో 40 శాతం మందికి బ్యాంకు ఖాతాలు లేవ‌ని.. జ‌న్ ధ‌న్ యోజ‌న వ‌ల్ల 4 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు వ‌చ్చాయ‌ని.. రూ.1500 కోట్ల సొమ్మును వాళ్లు ఖాతాలో జ‌మ చేసిన‌ట్లు వివ‌రించారు..  దేశంలో ఇళ్లు లేని వాళ్ల‌కు సొంతిళ్లు క‌ల‌ను నెర‌వేర్చడ‌మే ల‌క్ష్య‌మ‌న్నారు...

ఎన్నారైల‌కు ప‌లు వ‌రాలు కూడా ప్ర‌క‌టించారు... ఎన్నారైలు క‌ల‌లు గ‌నే భార‌త్‌ను నిర్మించ‌డ‌మే త‌న క‌ర్త‌వ్య‌మ‌న్నారు.. అంద‌రం క‌లిసి భార‌త మాత సేవ చేయాల‌న్నారు.. మ‌న మాతృగ‌డ్డ కోసం చేత‌నంత చేయాల‌ని పిలుపునిచ్చారు...  125 కోట్ల మంది ప్ర‌జ‌లు దేశం త‌ల‌దించుకునే ప‌ని ఎప్పుడూ చేయొద్ద‌ని విజ్ఞ‌ప్తి చేశారు...

ఈ ఫొటోలో బ‌తుక‌మ్మ‌ను ఎత్తుకున్న వ్య‌క్తి ఎవ‌రు...?


పాల‌మూరులో బ‌తుక‌మ్మ ఆడే సంప్ర‌దాయ‌మే లేద‌ని మ‌న మాజీ మంత్రివ‌ర్యులు డీకే అరుణ గారు అంటున్నారు... మ‌రి గ‌తంలో  ఈ ఫొటోలో బ‌తుక‌మ్మ‌ను ఎత్తుకున్న వ్య‌క్తి ఎవ‌రు...?   ఎక్క‌డ బ‌తుక‌మ్మ‌ను ఆడారు..?   కొంప‌దీసి ఆమె ఎత్తుకున్న‌ది బ‌తుక‌మ్మ కాదా?

తెలంగాణ రాక‌పోతే వీళ్లు తెలంగాణ ఉద్య‌మానికి వ్య‌తిరేకంగా సినిమాలు కూడా తీసేవారేమో..

ఈ ముక్క‌ను తెలంగాణ రాక‌ముందు చెప్పి ఉంటే ఇంకా సంతోషించే వాళ్లం... అప్పుడు ఆర్‌.నారాయ‌ణ మూర్తి, త‌మ్మారెడ్డి, సునీల్ లాంటి వాళ్లు మిన‌హా సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎవ‌రూ కూడా తెలంగాణ‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌లేదు... ఇప్పుడు మాత్రం తెలంగాణ గ‌డ్డ‌ను మ‌ర‌వ‌బోమ‌ని చెబుతున్నారు... అంతా అవ‌కాశ‌వాద‌మేమో... ఇప్పుడు తెలంగాణ రాక‌పోతే వీళ్లు తెలంగాణ ఉద్య‌మానికి వ్య‌తిరేకంగా సినిమాలు కూడా తీసేవారేమో..(నేనంటున్న‌ది ఈ పెద్ద‌మ‌నిషిని కాదు)...

నిజాం న‌గ‌ల‌ను హైద‌రాబాద్ లో ప్ర‌ద‌ర్శించాలి...అందుకు ఏర్పాట్లు చేయాలి...

1995లో కేంద్ర ప్ర‌భుత్వం నిజాం వార‌సుల నుంచి రూ.217 కోట్ల‌కు కొనుగోలు చేసిన‌(ఇప్పుడు దాని విలువ 10 రెట్లు ఎక్కువ‌) ఆభ‌ర‌ణాల‌ను హైద‌రాబాద్ లో ప్ర‌ద‌ర్శించాలి.. ప్ర‌స్తుతం ఢిల్లీ నేష‌న‌ల్ మ్యూజియం క‌స్ట‌డీలో ఆ న‌గ‌లు ఉన్నాయి.. వాటిని రిజ‌ర్వు బ్యాంకు లాక‌ర్ల‌లో భ‌ద్ర‌ప‌రిచారు.. ఈ ఆభ‌ర‌ణాల‌ను ఎక్క‌డ ప్ర‌ద‌ర్శించాల‌నే విష‌యంపై కేంద్రం ఎటూ తేల్చుకోలేక‌పోతోంది.. అయితే హైద‌రాబాద్‌కు వీటిని తెప్పించాల‌ని కేసీఆర్ గారు కృత‌నిశ్చ‌యంతో ఉన్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి... గ‌తంలో చిరంజీవి కేంద్ర ప‌ర్యాటక మంత్రిగా ఉన్న స‌మ‌యంలోనూ హైద‌రాబాద్‌లోనే వీటిని శాశ్వ‌తంగా ప్ర‌ద‌ర్శించాల‌ని కేంద్రానికి సూచించారు... హైద‌రాబాద్ రాజ్యానికి సంబంధించిన‌వి కాబ‌ట్టి అదే ఉత్త‌మ వేదిక అవుతుంద‌ని ఆయ‌న అన్నారు... ఏది ఏమైనా ప‌టిష్ఠ భ‌ద్ర‌త‌, అనువైన ప్రాంతంలో ఈ న‌గ‌ల‌ను ప్ర‌ద‌ర్శిస్తే అంత‌ర్జాతీయ ప‌ర్యాట‌కుల‌ను, జాతీయ ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించొచ్చు... ఈ విష‌యంలో ముఖ్య‌మంత్రి చొర‌వ తీసుకోవాలి.. కేంద్రం కూడా న‌గ‌ల‌ను ఆర్బీఐ లాక‌ర్ల‌లో ఉంచితే ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌న్న విష‌యాన్ని గుర్తించాలి...
నిజాం ఆస్తుల విలువ 12 లక్ష‌ల కోట్ల‌ని ఓ వార్త చ‌దివాను.. ఇంత‌కీ ఇవి ఎవ‌రి ఆధీనంలో ఉన్నాయి.. ? ఒక‌వేళ తెలంగాణ ప్ర‌భుత్వ ఆధీనంలో ఉంటే వీటిని ప్ర‌జా సంక్షేమ కార్య‌క్ర‌మాల కోసం వినియోగించొచ్చేమో.. కేంద్రం ఆధీనంలో ఉంటే.. వాటిని తెలంగాణ‌కు బ‌దిలీ చేసే అవ‌కాశం ఉందా? ఉంటే వీటితో సంక్షేమ కార్య‌క్ర‌మాల‌న్నీ సాఫీగా అమ‌లు చేయొచ్చు క‌దా... బంగారు తెలంగాణ ల‌క్ష్యం సులువుగా సాధించొచ్చేమో...!!

జ‌య‌ల‌లిత ఎదుగుద‌లకూ తానే కార‌ణ‌మ‌ని చెప్పుకోవ‌డం లేదు ఎందుక‌బ్బా...!!!

దేశానికి ప్ర‌ధానుల‌ను తానే ఎంపిక చేశాన‌ని చెప్పుకునే పెద్ద‌మ‌నిషి.. దేశంలో ఏ సంఘ‌ట‌న జ‌రిగినా దాని వెన‌క త‌న కృషి ఉంద‌ని బాకా కొట్టుకునే పెద్ద మ‌నిషి.. మ‌రి మొన్న‌టి దాకా త‌న కూట‌మిలో మిత్రురాలైన జ‌య‌ల‌లిత ఎదుగుద‌లకూ తానే కార‌ణ‌మ‌ని చెప్పుకోవ‌డం లేదు ఎందుక‌బ్బా...!!!

Saturday 27 September 2014

దేవుడికి కృత‌జ్ఞ‌తలు చెప్పుకోవాల్సిందే...

హైద‌రాబాద్ బిర్యానీని మించిన వంట‌కాలు ఆంధ్రాలో ఉన్నాయి ... చంద్ర‌బాబు...
దేవుడికి కృత‌జ్ఞ‌తలు చెప్పుకోవాల్సిందే... ఎందుకంటే హైద‌రాబాద్ బిర్యానీనికి గుర్తింపు తెచ్చింది నేనే చంద్ర‌బాబుగారు అనలేదు కాబ‌ట్టి..

ఆంధ్రా మ‌హ‌నీయుల విగ్ర‌హాలు విజ‌య‌వాడ‌కు త‌ర‌లింపు...?

ట్యాంక్ బండ్‌పై కొలువు దీర‌నున్న తెలంగాణ వైతాళికుల విగ్ర‌హాలు... ఆంధ్రా మ‌హ‌నీయుల విగ్ర‌హాలు విజ‌య‌వాడ‌కు త‌ర‌లింపు...
ల‌క్ష్మ‌ణ్ బాపూజీ శ‌త జ‌యంతి స‌భ‌లో సీఎం కేసీఆర్ ప్ర‌క‌ట‌న‌...

ట్యాంకు బండ్ పై మ‌న‌కు అక్క‌ర‌కు లేని విగ్ర‌హాల‌ను ఆంధ్రాకు పంపుతాం..

బిగ్ బ్రేకింగ్ న్యూస్..
మంచి మాట‌..
ట్యాంకు బండ్ పై మ‌న‌కు అక్క‌ర‌కు లేని విగ్ర‌హాల‌ను ఆంధ్రాకు పంపుతాం.. మ‌న జ‌య‌శంక‌ర్‌, ల‌క్ష్మ‌ణ్ బాపూజీ విగ్ర‌హాలు పెడ‌తాం... కేసీఆర్ మాట‌... బీజేపీ వాళ్లు స‌హ‌క‌రించాల‌ని విజ్ఞ‌ప్తి చేసిన సీఎం..
ఇది నేను కోరుకున్న‌ది... తెలంగాణ స‌మాజం కోరుకున్నది....

నోట్‌:  ఆంధ్రా మీడియాకు మ‌రో వివాదాస్ప‌ద అంశం దొరికింది.. ఇక రోజూ చ‌ర్చ‌లే..

మీవాళ్ల గురించి మా ప్ర‌జ‌ల‌కు కూడా అన‌వ‌స‌ర‌మే క‌దా...!!!





మ‌న కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ శ‌త‌జ‌యంతి సంద‌ర్భంగా  ఈనాడు, ఆంధ్ర‌జ్యోతిలు కూడా వ్యాసాలు రాశాయి... ఇది మంచి ప‌రిణామ‌మే... తెలుగు మ‌హ‌నీయుల్లో ఆయ‌న ఒక్క‌రు... మ‌రి ఇరు ప్రాంతాల‌కు ఆయ‌న మ‌హ‌నీయుడు కాదా?   నాకు ఆశ్చ‌ర్యం వేసింది.. ఆంధ్రా ప్రాంతానికి కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ అవ‌స‌రం లేద‌న్న‌ట్లుగా ఆయ‌న గురించిన వ్యాసాన్ని ఇవ్వ‌లేదు... ఇది మీ స్వేచ్ఛ‌... నేను అడ్డు చెప్ప‌ను.. కానీ తెలంగాణ‌కు కూడా మీరు ఆంధ్రా మ‌హ‌నీయుల‌పై వ్యాసాలు ఇవ్వొద్ద‌ని సూచ‌న‌... మా వాళ్ల గురించి మీవాళ్ల‌కు చెప్ప‌డం ఇష్టం లేన‌ప్పుడు... మీవాళ్ల గురించి మా ప్ర‌జ‌ల‌కు కూడా అన‌వ‌స‌ర‌మే క‌దా...!!!

ఇదేం స్టార్ మ‌హిళ‌నో...

బ‌తుక‌మ్మ పండ‌గ‌లో ఇలా ఆడ‌తారా...
వీళ్ల‌ను చూసే నేర్చుకోవాలేమో...
బ‌తుక‌మ్మ‌ల‌ను పేర్చి ఆక‌లేస్తే అన్నం పెడ‌తా... ల‌స్కు ట‌పా ల‌స్కు ట‌పా అంటూ పాట‌లు పెట్టి డ్యాన్స్ చేయిస్తారా...
అవ్వ‌... న‌వ్వుపోదురు గాక‌.....


బ‌తుక‌మ్మ‌లు పెట్టి కిస్‌లు, ఆక‌లేస్తే అన్నం పెడ‌తా.. నాటీ గ‌ర్ల్‌ను...  మూడొస్తే ముద్దులు పెడ‌తా అంటూ మ‌హిళ‌ల‌తో డ్యాన్స్‌లు చేయిస్తున్నారు.. ఇలాంట‌ప్పుడు బ‌తుక‌మ్మ పాటలు పెట్టి చేయొచ్చు క‌దా... అస‌లు బ‌తుక‌మ్మ‌లు పెట్ట‌కున్నా అయిపోతుంది క‌దా.. ఏదో మా సంస్కృతిని గౌర‌వించిన‌ట్లు బిల్డ‌ప్‌లు.. మ‌రోవైపు వెకిలి పాట‌లతో మ‌హిళ‌ల‌తో డ్యాన్స్‌లు వేయించ‌డం... ఇది మ‌రీ దారుణం.... దేవుడి బొమ్మ‌లు పెట్టి ఇలాంటి ప‌నులు చేయ‌డం ఏంటో....


ఓవైపు జ‌బ‌ర్థ‌స్తు అంటూ బూతు పురాణాల‌ను వినిపిస్తున్న ఈటీవీ వాళ్లు ఇలా బతుక‌మ్మ‌ల‌ను పేర్చి స్టార్ మ‌హిళ కార్య‌క్ర‌మంలో పిచ్చి క‌థ‌లు ప‌డ‌టం దారుణం...

http://www.youtube.com/watch?v=zf33fl9J1jw

నిన్న సెక్యూరిటీ గార్డు... నేడు ఐఏఎస్ అధికారి...


ఏదైనా సాధించాల‌నే త‌ప‌న ఉంటే ఎన్ని క‌ష్టాల‌నైనా సులువుగా అధిగ‌మించొచ్చు అన‌డానికి ఈయ‌న జీవిత‌మే ఉదాహ‌ర‌ణ‌.. ఒడిశాకు చెందిన జోతి రంజ‌న్ బ‌గార్థి 14 ఏళ్లుగా సెక్యూరిటీ గార్డుగా ప‌నిచేశాడు.. ఈయ‌న మొద‌టి సారిగా 10 ఏళ్ల క్రితం సివిల్స్ ప‌రీక్ష రాశాడు.. ఎలాగైన సివిల్స్ సాధించాల‌న్న ల‌క్ష్యాన్ని పెంచుకున్నాడు.. చివ‌ర‌కు 2 ఏళ్లపాటు స‌న్న‌ద్ధ‌మై ఈ ఏడాది సివిల్స్‌లో ఐఏఎస్ సాధించాడు.. ఇప్పుడు ఈయ‌న మ‌ధురైలో శిక్ష‌ణ పొందుతున్నాడు...

ఏ చీక‌టి కోస‌మో వెలుగుల కోస‌మో ఈ ప్ర‌స్థానం...నాకు అర్థం కావ‌డం లేదు...!!!

నేను చిన్న‌ప్పుడు పుస్త‌కాల్లో చ‌దివాను.. విదేశీయులు మ‌న దేశంలో వ‌ర్త‌కం చేసుకోవ‌డానికి వ‌చ్చార‌ని.. త‌ర్వాత మ‌న‌ల్ని బానిస‌లుగా మార్చుకున్నార‌ని... అప్పుడు వాళ్లను మ‌నం పిల‌వ‌కుండానే వ‌చ్చారు.. వ‌చ్చి మ‌న‌ల్ని మోసం చేశారు.. మ‌న‌పై వంద‌ల ఏళ్లు పెత్త‌నం చెలాయించారు.. మ‌రి  మ‌నం ఇప్పుడు రండి బాబు రండి... మా దేశానికి రండి అంటూ ఆహ్వానిస్తున్నాం... ఇక్క‌డ వ‌ర్త‌కం చేసుకోండి.. ఇక్క‌డ పెట్టుబ‌డులు పెట్టండి అంటూ విదేశీయుల‌కే ఎర్ర తివాచీ ప‌రుస్తున్నాం...
ఏ చీక‌టి కోస‌మో వెలుగుల కోస‌మో ఈ ప్ర‌స్థానం...నాకు అర్థం కావ‌డం లేదు...!!!

పాపం దీనిపై రాద్ధాంతం ఎవ‌రైనా చేస్తారా? వేచి చూడాలి...

మొన్న వ‌రంగ‌ల్‌లో నిర‌స‌న తెలుపుతున్న‌ జ‌ర్న‌లిస్టుల‌ను  కేసీఆర్ గ‌రీబోళ్లు అని సంభోదించి అవ‌మానించాడ‌ని కొంద‌రు పెద్ద రాద్ధాంతం చేశారు... మ‌రి నిన్న కేసీఆర్ మాట్లాడుతూ.. త‌న‌ను తాను గ‌రీబోన్ని అని అనుకున్నాడు... ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఇత‌ర ఇంజినీర్లు ఇంగ్లిష్‌లో మాట్లాడితే నా లాంటి గ‌రీబోనికి అర్థం కాద‌ని అన్నాడు...!!
పాపం దీనిపై రాద్ధాంతం ఎవ‌రైనా చేస్తారా?    వేచి చూడాలి...

Friday 26 September 2014

ఎఫ్‌డీఐ... విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డి.... దీనికి మోడీ గారిని నిర్వ‌చ‌నం... ఫ‌స్ట్ డెవ‌ల‌ప్ ఇండియా.... బాగుంది.. కానీ...

ఎఫ్‌డీఐ... విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డి.... దీనికి మోడీ గారిని నిర్వ‌చ‌నం... ఫ‌స్ట్ డెవ‌ల‌ప్ ఇండియా.... బాగుంది.. కానీ...
ఇదే ఎఫ్‌డీఐని కాంగ్రెస్ వాళ్లు పెద్దఎత్తున ప్రోత్స‌హిస్తున్న‌ప్పుడు... అంద‌రూ సైలెంట్‌గా లేరు... ఎందుకు?
అస‌లు స్వ‌దేశీ జాగ‌ర‌ణ్ మంచ్ ఎక్క‌డికి పోయింది...
స్వ‌దేశీ వ‌స్తువులు వాడాలి.. విదేశీ వ‌స్తువుల‌ను బ‌హిష్క‌రించాల‌న్న నినాదాన్ని వ‌దిలేశారా? లేక ఆ సంస్థ‌ను కూడా మూసేశారా?
ఏది ఏమైనా 1992లో పీవీ న‌ర‌సింహారావు సంస్క‌ర‌ణ‌లు చేస్తున్న స‌మ‌యంలో స్వదేశీ వ‌స్తువులు వాడాలి.. స్వదేశీ అంటే దేశ‌భ‌క్తి అంటూ చాలా పెద్ద పెద్ద మాట‌లు చెప్పారు... నాకు తెలిసి రామ‌జ‌న్మ భూమి అంశం త‌ర్వాత వాళ్లు పైకి తెచ్చిన అంశం దేశ‌భ‌క్తి.. స్వదేశీ వ‌స్తు వినియోగ ఉద్య‌మం..
కానీ ఆ మాట‌ల‌న్నీ ఏమ‌య్యాయి... పీవీ న‌ర‌సింహారావు సంస్క‌ర‌ణ‌లే దేశానికి దిక్క‌ని గుర్తించారా? కాంగ్రెస్ బాట‌లో ప‌య‌నిస్తున్నారా?

Thursday 25 September 2014

మీ దృష్టిలో ఇది కూడా ఓటు బ్యాంక్ రాజ‌కీయ‌మే కదా?


హిందువుల ఓట్లు కొల్ల‌గొట్ట‌డానికే యాద‌గిరి పేరును డీడీ ఛానెల్‌కు పెట్టారంటారా?
అదే యాద‌గిరి పేరు కాకుండా ఏ చార్మినార్ అనో ఇంకేదో అని పెట్టి ఉంటే...
అమ్మో... ఈ పాటికి ఛానెళ్ల‌లో, పేప‌ర్ల‌లో, అన్నింట్లోనూ మీ ర‌చ్చే క‌నిపించేది...
నిజాం వార‌సుడు కేసీఆర్ అంటూ విరుచుకుప‌డే వాళ్లు...
ఇప్పుడు మాట్లాడ‌లేరు... ఎందుకంటే ఇది మ‌త‌ప‌ర‌మైన‌దిగా మీకు క‌నిపించ‌దు....!!

మ‌న‌మూ చీపురు ప‌డ‌దాం...


సామాజిక బాధ్య‌త‌...
స్వ‌చ్ఛ్‌ తెలంగాణ‌ మ‌హోద్య‌మంలో మ‌న‌మూ భాగ‌స్వాములం అవుదాం...!!
ప‌రిశుభ్ర‌, సుంద‌ర తెలంగాణ స్వ‌ప్నాన్ని సాకారం చేసుకుందాం..
మ‌న‌మూ చీపురు ప‌డ‌దాం...
రోడ్డు ప‌క్క‌న బ‌స్టాప్‌లో చెత్త పోగై దుర్ఘందం వ‌స్తుంటే ముక్కుమూసుకొని స‌ఫాయి కార్మికుల‌ను తిట్ట‌డ‌మో, ప్ర‌భుత్వాన్ని తిట్ట‌డ‌మో చేస్తాం. కానీ ఆ చెత్త పోగు కావ‌డానికి మ‌న‌లో ఒక‌రే కార‌ణం.. ఒక స‌మ‌యంలో మ‌న‌మూ నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించి రోడ్డ‌పైనే చెత్త‌ను ప‌డేశామ‌న్న విష‌యాన్ని మ‌ర‌చిపోతాం... దేశం ఇప్పుడు ఎదుర్కొంటున్న ప్ర‌ధాన స‌మ‌స్య‌ల్లో పారిశుద్ధ్య లోప‌మూ ఒక‌టి... ఈ విష‌యం అంద‌రికీ తెలిసినా ప‌ట్టించుకోం.. ఈ ప‌రిశుభ్ర‌తను ఒక పారిశుద్ధ్య కార్మికుడే చేయాల‌ని ఏం ఉంది... మ‌న‌మూ న‌డుం బిగించొచ్చు క‌దా..
అక్టోబ‌రు 2వ తేదీన ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ చీపురు ప‌డ‌తానంటున్నాడు.. దేశ ప్ర‌ధానే చీపురు ప‌డుతున్న‌ప్పుడు మ‌న‌కు ఎందుకు మోహ‌మాటం.. ఒక‌వేళ రోడ్డుపై చెత్త‌ను ఊడ్చ‌డం ఇష్టం లేద‌నుకుంటే మ‌న ఇళ్లునే కార్య‌క్షేత్రంగా ఎంచుకుందాం... కార్యాల‌యాల‌ను ఎంపిక చేసుకుందాం.. ప‌రిశుభ్ర‌త కోసం వారంలో రెండు గంట‌లు కేటాయించాల‌ని ప్ర‌ధాని పిలుపునిస్తున్నాడు... మ‌నం వారాంతపు సెల‌వుల్లో ఒక‌రోజును కేటాయిస్తే త‌ప్పేముంది... విదేశీ యాత్రికులు మ‌న దేశంపై చేసే ఫిర్యాదులో పారిశుద్ధ్య లోప‌మూ ఒక‌టి... ఇది మ‌నం సిగ్గుప‌డాల్సిన అంశం.. మ‌న‌ది సుంద‌ర భార‌త‌మ‌ని.. ప‌రిశుభ్ర భార‌త‌మ‌ని నిరూపిద్దాం.. మ‌న స‌మాజాన్ని, మ‌న న‌గ‌రాన్ని, మ‌న ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకునే మ‌హ‌త్కార్యంలో భాగ‌స్వాముల‌వుదాం... !!
స్వ‌చ్చ్ తెలంగాణ ఉద్య‌మంలో భాగంగా నేను ప్ర‌తిజ్ఞ చేస్తున్నా..
చెత్త‌ను చెత్త డ‌బ్బాలో మాత్ర‌మే వేస్తాను.. చెత్త డ‌బ్బా క‌నిపించ‌క‌పోతే నా జేబులోనైనా పెట్టుకుని తిరుగుతాను..
రోడ్డుపై ఎక్క‌డా మూత్ర విస‌ర్జ‌న చేయ‌ను... కేవ‌లం మూత్ర‌శాల‌ల్లో మాత్ర‌మే మూత్ర విస‌ర్జ‌న చేస్తాను..
వీలైతే 10 మందికి ప‌రిశుభ్ర‌త‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తా..
నేను పాటిస్తున్నా.. మీరూ పాటించండ‌ని సూచిస్తా...
ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి...
ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త అంద‌రికీ న‌చ్చుతుంది.. అయితే త‌గిన‌న్ని చెత్త డ‌బ్బాలు పెట్ట‌డం, మూత్ర‌శాల‌లు ఏర్పాటు చేయ‌డం లాంటివి కూడా చేయండి... ప్లాస్టిక్ నిషేధాన్ని క‌ఠినంగా అమ‌లు చేయండి.. ఇంకా ఏమైనా సూచ‌న‌లు ఉన్నా పాటిచండి...

ఈ పాటికి ర‌చ్చ ర‌చ్చ చేసేవాళ్లు... !

ఇంకా న‌యం ఆంధ్రా బ‌స్సును తెలంగాణ‌లో ఎవ‌రూ అడ్డుకోలేదు.. ఈ పాటికి ర‌చ్చ ర‌చ్చ చేసేవాళ్లు... !!

Wednesday 24 September 2014

నా ఫేసుబుక్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది...

మిత్రుల‌కు విజ్ఞ‌ప్తి...
నా ఫేసుబుక్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది... ప్ర‌స్తుతం అది ఓపెన్ కావ‌డం లేదు..  అందుకే ఇక‌పై బ్లాగ్‌లోనే నా పోస్టుల‌ను రాస్తాను... వీలైతే కొత్త ఫేసుబుక్ అకౌంట్ ను ఓపెన్ చేసి మీకు ఫ్రెండ్ రిక్వెస్టులు పంపిస్తాను.. ఈ అసౌక‌ర్యానికి మ‌న్నించండి...

ఎందుకురా ఈ బ‌ట్టెబాజీ రాత‌లు..?

తెలంగాణ ఏర్ప‌డినా, ఏర్ప‌డ‌కున్నా... రాష్ట్రానికి కేసీఆర్ సీఎం అయినా, కాకున్నా... కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వ‌చ్చినా, రాకున్నా...
కేంద్ర ప్ర‌భుత్వం మెట్రో రైలుపై గెజిట్ జారీ చేసింది. ఎందుకంటే అదేదో ఈ ప్రాజెక్టును త‌న చేతుల్లోకి తీసుకునేందుకు కాదు... ఒక‌వైపు ఎల్అండ్‌టీ ప‌నులు చేస్తుంది. మ‌రి ఆ ప‌నుల‌ను సాంకేతికంగా ప‌రిశీలించి, అప్రూవ్ చేసేది ఎవ‌రు?. ఇది ఎల్అండ్‌టీకి త‌ల‌కాయ నొప్పి. మొన్న ట్ర‌య‌ల్‌ర‌న్ చేశారు. కానీ దాన్ని ధ్రువీక‌రించేది ఎవ‌రు?. వాస్త‌వంగా రైల్వే సంబంధిత నిపుణులు ప‌రిశీలించి, ధ్రువీక‌రించాలి. మ‌రి ప్ర‌భుత్వం ప్రైవేటు నిపుణుల‌ను ఎందుకు ఎంగేజ్ చేసుకుంటుంది. బాజాప్తా భార‌తీయ రైల్వేకు చెందిన నిపుణుల‌తో ప‌రిశీల‌న చేయిస్తుంది. అయితే ఇప్ప‌టివ‌ర‌కు మ‌న మెట్రో రైలు ట్రామ్‌వేస్ చ‌ట్టం ప‌రిధిలోకి వ‌చ్చింది. ఇలా ఉంటే రైల్వే నిపుణులు వ‌చ్చి ప‌రిశీలించ‌డానికి వీలులేదు. అందుకే కేంద్ర రైల్వే ప‌రిధిలోకి తీసుకువ‌స్తే ఆ వెసులుబాటు ఉంటుంది. ఇదే ప్ర‌ధాన కార‌ణంగా గెజిట్ జారీ అయింది. ఈ వాస్త‌వ‌మంతా మ‌న ప‌చ్చ ప‌త్రిక‌లు, ప‌చ్చ పార్టీకి తెలుసు. కానీ ఇదేదో ఎల్అండ్‌టీ చంద్ర‌బాబు స‌హ‌కారంతో కేంద్రం నుంచి తెప్పించుకుంద‌ని, ఇదేదో కేసీఆర్‌కు షాక్ అని బ‌ట్టెబాజ్ రాత‌లు మ‌ళ్లీ మొద‌లుపెట్టిండ్రు.
మ‌రి ఇదే నిజ‌మైతే...రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే (గ‌తంలోని స‌ర్కారైనా) కేంద్రానికి లేఖ రాసి, ప్రాజెక్టును కేంద్రంలో చేతులు పెడుతుందా?. గ‌త న‌వంబ‌రులో ఈ మేర‌కు రాష్ట్రం కేంద్రానికి లేఖ రాసింది. దీన్ని కూడా ఆంధ్ర‌జ్యోతి ఈ ఏడాది మొద‌ట్లో అని త‌ప్పు రాసింది. ఈ కించిత్తు లాజిక్ తెలుసుకోకుండా రాష్ట్ర ప్ర‌భుత్వానికేదో అయిపోయింది... అధికారాలు అన్నీ కేంద్రం చేతుల్లోకి పోయిన‌వి అని ఎందుకు రాస్తున్నారో అర్థం కావ‌డంలేదు. వాళ్ల మ‌న‌సులోని కోరిక‌ల‌ను ఈ అక్ష‌ర‌రూపంలో తీర్చుకుంటున్నారే త‌ప్ప రాజ్యాంగ‌బ‌ద్దంగా అన్ని రాష్టాల్లెక్క తెలంగాణ‌కు అన్ని ర‌కాల స‌ర్వాధికారాలు ఉన్నాయే త‌ప్ప చంద్ర‌బాబు, వెంక‌య్య‌నాయుడు, డ్రామోజీ, రాధాకృష్ణ‌ల చేతుల్లో రాజ్యాంగం ఉండ‌దు. అంత‌కుమించి కేంద్ర ప్ర‌భుత్వం కూడా ఉండ‌దు. 
ఇక‌... అలైన్‌మెంట్ మార్పు ఉండ‌ద‌ని ప‌చ్చ ప‌త్రిక సంక‌లు గుద్దుకుంటుంది. కానీ వాస్త‌వాలు తెలుసుకోకుండా, తెలిసినా కావాల‌ని త‌ప్పు రాసి ప్ర‌జ‌ల‌ను మ‌భ్య పెట్టేందుకు ప్ర‌య‌త్నించ‌డం వృథా ప్ర‌యాస‌నే. ఎందుకంటే అస‌లు అలైన్‌మెంట్‌తో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదు. కేంద్ర రైల్వే చ‌ట్టం ప‌రిధిలో ఉన్నందున ఫార్మాలిటీ ప్ర‌కారం ఏవైనా మార్పులు, పురోగ‌తి ఉంటే ఒక కాపీ కేంద్రానికి పంపుతారు. క‌థంతా రాష్ట్ర ప్ర‌భుత్వం, ఎల్అండ్‌టీకి సంబంధించిన‌దే. అందుకే ఇప్ప‌డు జారీ చేసిన గెజిట్‌లో నాగోల్‌-శిల్పారామం మార్గం అంత‌వ‌ర‌కే ఉంది. కానీ వాస్త‌వంగా దాన్ని రాయ‌దుర్గం వ‌రకు పొడ‌గించారు. ఆ మార్పు ఈ గెజిట్‌లో లేదు. గ‌తంలో పంపిన ప్ర‌తిపాద‌న‌లు బీరువాలో ఉంటే మొన్న తెలంగాణ సీఎస్‌పోయి మెట్రో పెండింగు ప‌నులుంటే త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని కోరారు. ప‌చ్చ పార్టీ, ప‌త్రిక‌ల గొడ‌వల నేప‌థ్యంలో కేంద్రం త‌న నిర్ల‌క్ష్యం ఎక్క‌డ బ‌య‌ట‌ప‌డుతుందోన‌ని పాత పైళ్ల‌ను తీసి గెజిట్ జారీ చేసింది. నిజంగా ఎల్అండ్‌టీ ఈ గెజిట్ జారీ అయ్యేలా చేసి ఉంటే, రాష్ట్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా కేంద్రం జారీ ఉంటే క‌చ్చితంగా అందులో రాయ‌దుర్గం వ‌ర‌కు మార్గం పొడ‌గించిన‌ట్లు ఉండేది. ఎందుకంటే రేవంత్‌తో స‌హా అంద‌రి గొడ‌వంతా రాయ‌దుర్గం భూముల మీద‌నే క‌దా. ఈ లాజిక్‌ను కూడా ఆంధ్ర‌జ్యోతి మిస్స‌యింది. లేక‌పోతే పాఠ‌కులు ఎవ‌రు ఇవ‌న్నీ చూస్తారులే... మాకు మా రిపోర్ట‌ర్ల‌కే ఇవ‌న్నీ తెలుస‌ని పిచ్చి పిచ్చి రాత‌లు రాస్తుంది. తెలంగాణ‌వాదులారా... ఈ గెజిట్‌తో వ‌చ్చింది లేదు, పోయింది లేదు... ఏమైనా ప్ర‌యోజ‌న‌మంటూ ఉంటే... ట్ర‌య‌ల్‌ర‌న్‌, ఇత‌ర ప‌నుల‌ను రైల్వే శాఖ నిపుణులు వ‌చ్చి చూసేందుకు ఇదో ఉత్త‌ర్వులు లాంటివి అంతే.

ఎంద‌రో శాస్త్ర‌వేత్త‌లు... అంద‌రికీ వంద‌నాలు...!!






అంత‌రిక్ష రంగంలో ప్ర‌స్తుతం భార‌త్ రాకెట్‌ స్పీడ్‌తో దూసుకెళ్ల‌డం వెన‌క ఎంద‌రో శాస్త్ర‌వేత్త‌ల కృషి దాగుంది... మార్స్ ఆర్బిట‌ర్ మిష‌న్‌(మామ్‌) విజ‌య‌వంతం కావ‌డానికి కృషి చేసిన అంద‌రు శాస్త్ర‌వేత్త‌ల‌కు శ‌త‌కోటి అభినంద‌న‌లు.. ఇంతింతై వ‌టుడింతై అన్న‌ట్లుగా 1960లో చిన్న‌గా మొద‌లైన భార‌త అంత‌రిక్ష కార్య‌క‌లాపాలు.. నేడు మంగ‌ళ్‌యాన్ విజ‌య‌వంతంతో ప‌తాక‌స్థాయికి చేరాయి..అంత‌రిక్ష రంగంలో  భార‌త్ కీర్తిప‌తాక‌ను విశ్వ‌వినువిధుల్లో స‌గ‌ర్వంగా ఎగ‌ర‌వేసేందుకు మంగ‌ళ్‌యాన్ విజ‌యం దోహ‌ద‌ప‌డింది.. ఇవన్నీ ఇస్రో రాత్రికి రాత్రే సాధించిన విజ‌యాలు కావు... దీని వెన‌క ఇస్రో శాస్త్ర‌వేత్త‌ల అంకిత‌భావం, దేశ‌భ‌క్తి, ప్ర‌తిభ దాగి ఉన్నాయి... అగ్ర‌రాజ్యాల‌కు భార‌త్ ఏ మాత్రం తీసిపోద‌ని మ‌రోమారు నిరూపించిన శాస్త్ర‌వేత్త‌లంద‌రికీ పాదాభివంద‌నాలు.. ఈ విజ‌యం మ‌రిన్ని వినూత్న ప్ర‌యోగాల‌కు నాంది కావాల‌ని ఆకాంక్షిస్తున్నాం.. దేశంలోని మ‌రింత మంది యువ, ఔత్సాహిక శాస్త్ర‌వేత్త‌ల‌కు మీరు ప్రేర‌ణ‌గా నిల‌వాల‌ని కోరుతున్నాం... !!
జ‌య‌హో ఇస్రో... భార‌త్ మాతా కీ జై...!!

Tuesday 23 September 2014

కాళోజీ బ‌తికుంటే...

నిజంగా కాళోజీ, జ‌య‌శంక‌ర్‌లు బ‌తికుంటే కుతంత్ర‌పు మీడియాపై నిషేధాన్ని స‌మ‌ర్థిస్తూ క‌విత‌లే రాసేవారు...
తెలంగాణ‌కు మ‌రిన్ని మీడియా సంస్థ‌లు రావాల‌ని ఆకాంక్షించేవాళ్లు...

కాళోజీ బ‌తికుంటే ముమ్మాటికీ ఈ కుతంత్రాల ఆంధ్రా మీడియానే ల‌క్ష్యంగా చేసుకొని విమ‌ర్శ‌లు చేసేవాడు... ఆయ‌న ఈ మీడియాను చూస్తే ఇది మీడియానా... మాఫియానా అని మౌనంగా రోధించేవాడేమో... వీళ్ల ఆగ‌డాల‌ను చూసేందుకే న‌న్ను బ‌తికించావా? అంటూ ప్ర‌శ్నించేవాడేమో...

జ‌య‌శంక‌ర్ సార్ ఎలాగూ ఆంధ్రా మీడియాను చూసే ఆయ‌న తెలంగాణ‌కు మీడియా సంస్థ‌లు రావాల‌ని పిలుపునిచ్చాడు.. న‌మ‌స్తే తెలంగాణ ప‌త్రిక ఆవిర్భావ స‌ద‌స్సులోనే ఆయ‌న ఈ విష‌యాన్ని సూటిగా చెప్పాడు...

మ‌ళ్లా ప‌టేల్ సైన్యం హైద‌రాబాద్‌ను హ‌స్తం గ‌తం చేసుకుంటుందా?

అనుమానాలు...

చివ‌ర‌కు జ‌రిగేది ఇదేనా....!!!

మ‌ళ్లా ప‌టేల్ సైన్యం హైద‌రాబాద్‌ను హ‌స్తం గ‌తం చేసుకుంటుందా?

అటు చూస్తే రైటిస్టులు... ఇటు చూస్తే లెఫ్టిస్టులు... ఇద్ద‌రికీ మ‌న ముఖ్య‌మంత్రి నిజాంలా క‌నిపిస్తున్నాడు(ఇక్క‌డ జ‌నానికి ఎలా క‌నిపిస్తున్నాడ‌నేది వారికి అన‌వ‌స‌రం)... ఓ వైపు విమోచ‌న అంటూ ఎప్పుడూ లేనంత హంగామా... ఇంకోవైపు ప్ర‌త్యామ్నాయ స‌భ‌లంటూ హ‌డావుడి... ఏమ‌వుతోంది హైద‌రాబాద్‌లో... కొంప‌దీసి ఈ అల‌జ‌డుల మ‌ధ్య హైద‌రాబాద్‌కు ర‌క్ష‌ణ క‌ర‌వైంద‌ని మ‌ళ్లా ప‌టేల్ సైన్యం మాదిరిగా మ‌రో సైన్యం(ఇది మోడీ సైన్యం లేదా కేంద్రం సైన్యం) వ‌స్తుందా? ఇప్ప‌టికే ప‌దేళ్ల పాటు ఉమ్మ‌డి చ‌క్ర‌వ్యూహంలో బంధించ‌బ‌డింది నా హైద‌రాబాద్‌... నా తెలంగాణ గుండెకాయ‌ను నా నుంచి వేరు చేసే కుట్ర‌లు జ‌రుగుతున్నాయా? శాంతిభ‌ద్ర‌త‌లు లోపించాయ‌ని హైద‌రాబాద్‌ను కేంద్రం ఆక్ర‌మించుకుంటుందా? ఇది జ‌ర‌గొద్దు.. మ‌నం జ‌ర‌గ‌నీయొద్దు... మ‌న హైద‌రాబాద్‌ను మ‌న‌మే కాపాడుకుందాం.....

ఇది కార్పొరేట్ త‌ర‌ఫున మీరు చేస్తున్న పోరాటమే...

స్టూడియో ఎన్ ఛానెల్‌లో 70 మంది తెలంగాణ ఉద్యోగుల‌ను తొల‌గించిన‌ప్పుడు వీళ్ల‌లో ఏ ఒక్క‌డూ మాట్లాడ‌లేదు... మొన్న డ్రామోజీరావు సంస్థ‌ల్లో 400 మంది ఉద్యోగుల‌ను బ‌ల‌వంతంగా రాజీనామా చేయించిన‌ప్పుడూ ఏ ఒక్క‌డూ మీడియా అరాచ‌కాల‌పై గొంతెత్త‌లేదు... ఇక ఎమ్మెల్యేల‌ను ఇష్టం ఉన్న‌ట్లు అంటూ అసెంబ్లీ గౌర‌వానికి భంగం క‌లిగేలా కార్య‌క్ర‌మాలు ప్ర‌సారాలు చేసిన‌ప్పుడూ ఈ గొంతులు మూగ‌బోయాయి... ఇప్పుడేమో మీడియా స్వేచ్ఛ అంటూ పెద్ద స‌భ‌లు పెట్టి భారీ డైలాగ్‌లు కొడుతున్నారు... న‌వ్వొస్తుంది.. వీళ్ల‌ను చూస్తే జాలేస్తోంది....!!

వీళ్లు మీడియా యాజ‌మాన్యాల కింద న‌లిగిపోతున్న జ‌ర్న‌లిస్టుల స్వేచ్ఛ కోసం గొంతెత్తితే నేనూ గొంతుక‌లిపేవాడిని... పాత్రికేయుల‌కు కార్మిక చ‌ట్టాలు వ‌ర్తింప‌జేయ‌రా? అని నిల‌దీస్తే నేనూ మీ ప‌క్షం నిలిచేవాడిని...
కానీ కార్పొరేట్ మీడియా యాజ‌మాన్యాల ప‌క్షంలో మీరు నిలిస్తే... స‌మాజంలో మీరు ఏకాకిగా మార‌డం త‌ప్ప ఇంకేం ల‌భించ‌దు...

దీన్ని ప్ర‌జా ఉద్య‌మం అంటార‌నుకుంటే మీరు త‌ప్పులో కాలేసిన‌ట్లే... ఇది కార్పొరేట్ త‌ర‌ఫున మీరు చేస్తున్న పోరాటమే...

అవునండీ ఆ ప‌త్రిక జై తెలంగాణ అంటూ గొంతెత్తింది....

అవునండీ ఆ ప‌త్రిక జై తెలంగాణ అంటూ గొంతెత్తింది....
అందుకే తెలంగాణ మ‌ద్ద‌తుదారుడైన‌ రెహ‌మాన్ అనే రిపోర్ట‌ర్ ను ఉద్యోగంలో నుంచి తీసేసింది...

నిజ‌మే... అందుకే ఆ ప‌త్రిక‌కు చెందిన ఛానెల్‌లో ప‌నిచేసిన రెహ్మాన్ తెలంగాణ గొంతును వినిపించినందుకు ఉద్యోగంలో నుంచి పీకేసింది.. ఇంత‌క‌న్నా రుజువేం కావాలి.. ఆ ప‌త్రిక మొద‌టి నుంచీ తెలంగాణ కోసం ఎంత బ‌లంగా గొంతును వినిపించింద‌న‌డానికి... పాపం ఉస్మానియాలో విద్యార్థినుల‌పై జ‌రిగిన లాఠీఛార్జిపై ఆయ‌న హైకోర్టులో కేసు వేయ‌డ‌మే పాపం అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించింది...

ఆంధ్రాలో నిషేధానికి గురైన టీ న్యూస్‌, వీ6 మ‌రికొన్ని ఛానెళ్ల గురించి వీళ్లు చ‌ర్చ‌లు జ‌ర‌ప‌రా?

ఆంధ్రాలో నిషేధానికి గురైన టీ న్యూస్‌, వీ6 మ‌రికొన్ని ఛానెళ్ల గురించి వీళ్లు చ‌ర్చ‌లు జ‌ర‌ప‌రా?
అక్క‌డ మీడియా స్వేచ్ఛ గుర్తుకు రాదా?

అక్క‌డ శ్రీ‌శ్రీ‌గారి బొమ్మ పెట్టి మీడియా స్వేచ్ఛ‌ను పాతేస్తున్న చంద్ర‌బాబు అని స‌భ‌లు పెడ‌తారా?

దానికి ఎల్లో ప‌త్రిక‌ల్లో, మీడియాలో ప్రాముఖ్య‌త ల‌భిస్తుందా?

ఏం ఆంధ్రా ప్రాంతంలో ప్ర‌జాస్వామ్యం వ‌ద్దా? తెలంగాణ‌లోనే ప్ర‌జాస్వామ్యం కావాలా?

ఆ పెద్ద‌మ‌నుషుల‌కు సందుదొర‌క‌డం లేదు...?

మొన్న రంజాన్‌కు ముస్లిం ఉద్యోగుల‌కు ముందే వేత‌నాలు వేసిన ప్ర‌భుత్వం..
ఈరోజు ద‌స‌రాకు ఉద్యోగుల‌కు ముందే వేత‌నాలు వేస్తున్న ప్ర‌భుత్వం...
అలాగే క్రిస్మ‌స్‌కు కూడా ముందే వేత‌నాలు వేస్తే బాగుంటుంది....

రంజాన్‌కు ముందే ఉద్యోగులు వెళ్ల‌డానికి అనుమ‌తి..
ఇప్పుడు బ‌తుక‌మ్మ ఆడుకోవ‌డాన‌కి ఉద్యోగుల‌కు అనుమ‌తి...

పాపం విమ‌ర్శించాల‌ని ఎదురుచూసే పెద్ద‌మ‌నుషుల‌కు సందుదొర‌క‌డం లేదు...?

స్వాతంత్ర్య దినోత్స‌వం రోజున క్రీడాకారుల‌కు రూ.5 కోట్లు పంచిన‌ కేసీఆర్‌...


క‌బ‌డ్డీ క్రీడాకారిణికి రూ.25 ల‌క్ష‌ల‌ట‌...
సైనా నెహ్వాల్‌కు రూ.70 ల‌క్ష‌లు...
పీవీ సింధుకు రూ.40 ల‌క్ష‌లు
ష‌ట్ల‌ర్ క‌ష్య‌ప్ కు రూ.50 ల‌క్ష‌లు..
షూట‌ర్ గ‌గ‌న్ నారంగ్‌కు రూ.90 ల‌క్ష‌లు..
బాక్సర్ జ‌రీన్‌కు రూ.50 ల‌క్ష‌లు..
పుల్లెల గోపీచంద్‌కు రూ.50 ల‌క్ష‌లు
కోచ్ ఆరిఫ్‌కు రూ.25 ల‌క్ష‌లు..

ఇంకా కామ‌న్వెల్త్ క్రీడ‌ల్లో పాల్గొనందుకే శ్రీ‌కాంత్(బ్యాట్మింట‌న్‌) , అరుణారెడ్డికి(జిమ్నాస్టిక్స్‌) రూ.3 ల‌క్ష‌లు ఇచ్చారు..

ఇక తెలంగాణ బ్రాండ్ అంబాసిడ‌ర్ సానియా మిర్జాకు రూ.2 కోట్లు(Separate event)...

ఏందిది... ప్ర‌జ‌ల సొమ్మును ఇలా విచ్చ‌ల‌విడిగా క్రీడాకారుల‌కు పంచిపెడ‌తారా? ప్ర‌జ‌ల సొమ్మును క్రీడాకారుల పాలు చేయ‌డం ఏంటి? అడ‌గండీ... నిల‌దీయండి...!!

మ‌రి ఒక్క ధోనికి రూ.10 కోట్లు ఇస్తే నోరు తెర‌వ‌రు... ఒక స‌చిన్ టెండూల్క‌ర్‌కు రూ.15 కోట్లు పంచిన‌ప్పుడు మాట‌లు రావు...
కానీ తెలంగాణ‌లో క్రీడాకారుల‌కు డ‌బ్బులు ఇస్తే వీళ్ల‌కు ఎక్క‌డ లేని ఆగ్ర‌హం వ‌స్తుంది... ఎందుకో...

Monday 22 September 2014

ఇది కూడా మీడియా స్వేచ్ఛ‌ను, జ‌ర్న‌లిస్టుల స్వేచ్ఛ‌ను హ‌రించ‌డం కాదా?


రేపో మాపో మ‌ళ్లా ప్రకాశ్ జ‌వ‌దేక‌ర్ గారు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వ‌స్తార‌ట‌... ఆయ‌న వ‌చ్చిన‌ప్పుడు 

చంద్ర‌బాబునాయుడు గారు చేస్తున్న త‌తంగాన్ని వివ‌రించండి... ఇది కూడా మీడియా స్వేచ్ఛ‌ను, జ‌ర్న‌లిస్టుల స్వేచ్ఛ‌ను హ‌రించ‌డం కాదా? అని ప్ర‌శ్నించండి...

ఇదే స‌త్యాన్ని కేసీఆర్‌ చెబితే...

మోడీ గారు చాలా మంచి మాట చెప్పారు... ద‌య‌చేసి ఓట్ల కోసం అని మాత్రం అనుకోవ‌ద్దు... ఎందుకంటే ముస్లింల గురించి ఎవ‌రు ఏది మాట్లాడినా ఓట్ల కోస‌మే అంటూ ఒక‌ర‌క‌మైన భావ‌న‌ను పెంచిపోషించారు కొంద‌రు.. ఇది త‌ప్పు.. భార‌త ప్ర‌ధాని మోడీ గారి నోట వ‌చ్చిన మాట‌ను అంద‌రం గౌర‌వించాలి... ఆయ‌న స‌త్యాన్ని సెల‌విచ్చారు..
నోట్‌: ఇదే స‌త్యాన్ని కేసీఆర్‌, ఇంకా ఎవ‌రైనా ఇత‌ర పార్టీల నేత‌లు సెల‌వు ఇచ్చి ఉంటే పెద్ద ర‌చ్చ అయ్యేద‌న్న‌ది వేరే విష‌యం... అది అప్ర‌స్తుతం..

తెలంగాణ‌లో దూర‌ద‌ర్శ‌న్ ప్ర‌సారాల‌న్నింటినీ ఇవ్వాలి...

కేంద్రానికి విజ్ఞ‌ప్తి...
తెలంగాణ‌లో దూర‌ద‌ర్శ‌న్ ప్ర‌సారాల‌న్నింటినీ ఇవ్వాలి...

దూరద‌ర్శ‌న్ వాళ్లు 30కిపైగా ఛానెళ్స్ ప్రసారాలు ఇస్తార‌ట‌... మ‌రి తెలంగాణ‌లో ఎన్ని వ‌స్తున్నాయి... దీనిపై ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ గారు స్పందించాలి... మాకు దూర‌ద‌ర్శ‌న్ ప్ర‌సారం చేస్తున్న 30 ఛానెల్స్ ప్ర‌సారాలు కావాలి.... దూర‌ద‌ర్శ‌న్ ఛానెల్స్ అన్ని ప్ర‌సారాలు రాక‌పోవ‌డం మీడియా స్వేచ్ఛ‌ను హ‌రించ‌డ‌మే... దీనిపై మీరు స్పందించాలి... పార్ల‌మెంట్‌లో చ‌ర్చ పెట్టాలి... ప్రెస్ క‌మిటీ ని విచార‌ణ‌కు పంపాలి... దూర‌ద‌ర్శ‌న్‌ను కాపాడాలి....!!

ప్రైవేటు సంస్థ‌ల కోసం కొట్లాడ‌టం క‌న్నా నిజాయ‌తీగా, సంచ‌ల‌నాల‌కు దూరంగా నిఖార్సైన వార్త‌ల‌ను ఇచ్చే ప్ర‌భుత్వ మీడియా సంస్థ మ‌నుగ‌డ‌ కోసం పాటుపడండి సార్‌... దూర‌ద‌ర్శ‌న్ యాంక‌ర్ చిన్న ఉచ్ఛ‌ర‌ణ దోషం చేస్తే ఉద్యోగం నుంచి తొల‌గించారు.. మ‌రి ప్రైవేటులో ఇలాంటి శిక్ష‌లు వ‌ద్దంటారా?

ఇప్పుడు ఆ ఛానెళ్ల‌కు జ‌య‌శంక‌ర్‌సార్ కూడా యాదికొస్తాడు

ఛానెళ్ల ప్ర‌సారాల నిలిపివేత‌ పుణ్యామా అని కాళోజీగారి బొమ్మ‌కు పాపులారిటీ పెరిగింది... అదే ప‌నిగా రోజూ కాళోజీణ‌ గారి బొమ్మ‌ను వేస్తున్నారు.. సంతోషం..ఇలా ప్ర‌సారాలు ఆపితే మీకు కాళోజీ క‌విత‌లు గుర్తొస్తాయి, జ‌య‌శంక‌ర్‌సార్ కూడా యాదికొస్తాడు.. అయితే ఇక్క‌డ చిక్కుంది.. 
పాపం జ‌య‌శంక‌ర్ సార్ బొమ్మ పెట్టాలంటే కుద‌ర‌దు.. ఎందుకంటే సారే ఎన్నోసార్లు ఆంధ్రా మీడియాను బొంద పెట్టాల‌ని పిలుపునిచ్చాడు క‌నుక‌....

జై కొట్టి ఏం చేశావ్‌...?

మా ప‌త్రిక తెలంగాణ‌కు జై కొట్టింది... అవును... క‌రెక్టే....జై కొట్టి ఏం చేశావ్‌...
తెలంగాణ‌పై టీడీపీ వైఖ‌రి త‌ప్ప‌ని, ఇత‌ర ప‌క్షాల వైఖ‌రి త‌ప్ప‌ని ఘాటైన ఎడిటోరియ‌ల్ రాశావా?
బాబు రెండు క‌ళ్ల విధానం ఏంట‌ని నిల‌దీశావా?
ఇంకా ఏం చేశారు మీరు...?

తెలంగాణ రావ‌డం క‌ల్లా.. హైద‌రాబాద్ యూటీ... ఇంకా రాయ‌ల తెలంగాణ‌, మ‌న్య‌సీమ‌, మ‌న్నూ మ‌శానం అంటూ కుట్ర క‌థ‌నాలు రాసింది మేమే అని చెప్పొచ్చు క‌దా.... ఏమ‌న్నా అంటే విశ్వ‌స‌నీయ వ‌ర్గాలంటూ బిల్డ‌ప్‌లు...
మ‌రి రేపు తెలంగాణ వ‌స్తుంద‌న్న‌ప్పుడు కూడా ఈ క‌థ‌నాలు ఆగ‌లేదు ఎందుకో?
మీ కుట్ర క‌థ‌నాల వ‌ల్ల చ‌చ్చిపోయిన అమ‌రుల కోసం విరాళాలు సేక‌రించారా?

ఎన్నిక‌లు ఫ‌లితాల త‌ర్వాత తెలంగాణ ప్ర‌జ‌ల‌ను ఏమ‌న్నావు.. కుడుం ఇస్తే చాలు పండ‌గ చేసుకుంటార‌ని వ్యంగ్యాస్త్రం విస‌ర‌లేదా?

ఛీ.. జ‌ర్న‌లిజానికే మాయ‌ని మ‌చ్చ‌....!!!

సీన్ రివ‌ర్స్ అయితే ఇలాగే రాస్తారా?

అప్ప‌ట్లో బాబ్లీ ప్రాజెక్టు విష‌యంలో టీడీపీ వాళ్లు మ‌హారాష్ట్ర‌కు వెళ్లి ఆందోళ‌న చేస్తే అక్క‌డి పోలీసులు చంద్ర‌బాబును అరెస్టు చేస్తే..

తెలుగోడిపై మ‌రాఠోడి దెబ్బ అంటూ హెడ్డింగ్ పెట్టిన ప‌త్రిక‌...

మొన్న ఖ‌మ్మం జిల్లాలో తెలంగాణ ఎమ్మెల్యేపై ప‌శ్చిమ‌గోదావ‌రి ఎంపీ మాగంటి బాబు దాడి చేస్తే(బ‌హుషా పోల‌వ‌రం విష‌యం అనుకుంటా)... ఆ వార్త‌ను అప్రాధాన్యంగా ఇచ్చారెందుకో?
ఒక‌వేళ తెలంగాణ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యేను కొడితే ఇలాగే ఇచ్చే వాళ్లా?

ప్ర‌భుత్వప‌రంగా అనాథ ఆశ్ర‌మాలు, వృద్ధాశ్ర‌మాలు ఏర్పాటు చేయాలి...

శాంతిభ‌ద్ర‌తలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది...
ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో లోపించింది ఇదే..
తెలంగాణ‌లో పటిష్టం చేయాల్సింది ఇదే...
ముఖ్యంగా మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌డం అతి కీల‌కం...
మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు పెద్ద‌పీట చేయాలన్న స‌ర్కారు నిర్ణ‌యం హ‌ర్ష‌ణీయం...
అయితే ఈ నివేదిక‌లోని ప్ర‌తి సిఫార్సును తూచా త‌ప్ప‌కుండా అమలు చేయాలి..
నిందితులెవ‌రైనా క‌ఠినంగా శిక్షించాల్సిందే...
వీలైతే ఈ నివేదిక‌ను కేంద్ర మ‌హిళ‌, శిశు అభివృద్ధి శాఖ‌కు పంపించాలి..
మంచి సూచ‌న‌లు ఉంటే దేశ‌వ్యాప్తంగా అమ‌లు చేసేందుకు వీలుంటుంది..

ప్ర‌భుత్వానికి చిన్న విజ్ఞ‌ప్తి..

అలాగే ప్ర‌భుత్వప‌రంగా అనాథ ఆశ్ర‌మాలు, వృద్ధాశ్ర‌మాలు ఏర్పాటు చేయాలి... త‌ల్లిదండ్రిలేని చిన్నారులను, ఎవ‌రూ లేని వృద్ధుల‌ను అందులో చేర్పించొచ్చు.. ప్ర‌జ‌లంతా రోడ్డుపై ఎవ‌రైనా అనాథ‌లు, వృద్ధులు క‌నిపిస్తే స‌త్వ‌ర‌మే స్పందించేలా హెల్ప్‌లైన్ ను కూడా ప్రారంభించాలి...

Sunday 21 September 2014

రూ.వేల కోట్లు వెన‌కేసుకుంటున్న చంద్ర‌బాబు అండ్ కో

May 24, 2014
ఎన్నిక‌లు ముగిశాయి... పీఠం ఎక్కేందుకు చంద్ర‌బాబు సిద్ధ‌మ‌వుతున్నాడు. ఆయ‌న ప‌చ్చ ప‌త్రిక‌ల్లో గుంటూరు రాజ‌ధాని కావ‌చ్చ‌ని లీకులు ఇస్తున్నారు. మ‌రి... ఈ విష‌యాన్ని చంద్ర‌బాబు ఎందుకు ప్ర‌క‌టించ‌డం లేదు. దీని వెన‌క ఓ మాఫియా త‌యారైంది. చంద్ర‌బాబు బినామీలు సీఎం ర‌మేష్‌, నామా నాగేశ్వ‌ర‌రావు, ముర‌ళీమోహ‌న్‌, రాధాకృష్ణ‌, రామోజీలు ఇలా చాలా మంది ముందుగా వంద‌ల ఎక‌రాలు కొనుగోలు చేసిన త‌ర్వాత రాజ‌ధాని ప్ర‌క‌టించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. దీని వెన‌క వేల కోట్ల రూపాయ‌లు చేతులు మారుతున్నాయి. ఈ ఆరోప‌ణలు నిజం కాక‌పోతే చంద్ర‌బాబు వెంట‌నే ప‌చ్చ ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన లీకుల‌ను ఖండించాలి... లేదంటే అధికారికంగా రాజ‌ధాని ప‌లానా ప్రాంతం కావాల‌ని ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాలి. ఇవేవీ చేయ‌కుండా త‌న అనుయాయులు అంతా భూములు కొనుగోలు చేసిన త‌ర్వాత ప్ర‌క‌టిస్తే ఈ ఆరోప‌ణలు అక్ష‌ర‌స‌త్యం అని అంగీరించిన‌ట్లే.

విరాళాల‌ను జేబులో వేసుకుంటున్నారా?

May 23, 2014
ఆంధ్రా రాజ‌ధాని నిర్మాణానికి ఎంద‌రో విరాళాలు ఇస్తున్నార‌ట‌.. మ‌రి ల‌గ‌డ‌పాటి, రాయ‌పాటి, చంద్ర‌బాబులు ఏమైనా ఇస్తున్నారా?
లేక వ‌స్తున్న‌విరాళాల‌ను జేబులో వేసుకుంటున్నారా?

ఏ ఒక్క ఉద్యోగి అయినా స‌రే లంచం తీసుకుంటే.. వారు తెలంగాణ త‌ల్లికి ద్రోహం చేసిట‌న్లే లెక్క‌...

May 23, 2014
తెలంగాణ ఉద్యోగుల‌కు విజ్ఞ‌ప్తి.....


ఎంప్లాయి ఫ్రెండ్లీ గ‌వ‌ర్న‌మెంట్ ఉంట‌ద‌ని కేసీఆర్ హామీ ఇస్తున్నారు...
ఇక్రిమెంట్లు ఇస్తామ‌ని... జీతాలు పెంచుతామ‌ని హామీ ఇస్తున్నారు...
అలాగే పీపుల్ ఫ్రెండ్లీ స‌ర్వీసును మేం ఇస్తామ‌నీ మీరూ హామీ ఇవ్వాలి....
అవినీతి... లంచ‌గొండిత‌నానికి దూరంగా ఉంటామ‌ని ప్ర‌జ‌ల‌కు భ‌రోసా ఇవ్వాలి...
ఆశ్రిత ప‌క్ష‌పాతం చూపొద్దు...


నా జీవితంలో నేను కూడా కొన్ని సంద‌ర్భాల్లో లంచం ఇచ్చి ప‌నిచేయించుకున్నాను...
ఒక బంధువు డెత్ స‌ర్టిఫికేట్ కోసం లంచం ఇచ్చాను...నా డిగ్రీ స‌ర్టిఫికేట్ తీసుకోవాడానికి లంచం ఇచ్చాను...
అది స‌మైక్య రాష్ట్రం.... గ‌తం గ‌తః...
ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం... ప‌రిస్థితి మారాలి...
తెలంగాణ‌లో అంద‌రూ స‌మాన‌మే... ఏ ఒక్క ఉద్యోగి అయినా స‌రే లంచం తీసుకుంటే.. వారు తెలంగాణ త‌ల్లికి ద్రోహం చేసిట‌న్లే లెక్క‌...
పాప‌పు కూడును తింటున్న‌ట్లే లెక్క‌...
మీరు తెలంగాణ ప్ర‌జ‌ల‌కే సేవ చేస్తున్నార‌ని గుర్తుంచుకొని ప‌నిచేయండి....

పండంటి తెలంగాణ నిర్మాణానికి 12 సూత్రాలు.... కేసీఆర్‌గారు అమ‌లు చేయాలి....

May 23, 2014
తెలంగాణ‌వాదుల‌ విజ్ఞ‌ప్తి....

పండంటి తెలంగాణ నిర్మాణానికి 12 సూత్రాలు....
కేసీఆర్‌గారు అమ‌లు చేయాలి....
ఆంధ్రా మీడియాను క‌ట్ట‌డి చేస్తేనే తెలంగాణ‌కైనా.. ఆయ‌న‌కైనా భ‌విష్య‌త్తు ఉంటుంది..
లేక‌పోతే భ‌స్మారుస హ‌స్తాన్ని ప‌క్క‌న పెట్టుకుని తిరుగుతున్న‌ట్లే లెక్క‌....

ఆంధ్రా మీడియాను క‌ట్టండి చేయండిలా....!!!

ఆంధ్రా మీడియాను క‌ట్ట‌డి చేయలేమ‌ని చాలా మంది అంటున్నారు... నా వ‌ద్ద కొన్ని సూచ‌న‌లు ఉన్నాయి... తెలంగాణ ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధితో ఉంటే ప్ర‌జాస్వామ్య‌బ‌ద్ధంగానే ఆంధ్రా మీడియాను క‌ట్ట‌డి చేయొచ్చు... నా ఆలోచ‌న‌ల‌ను మీతో పంచుకుంటున్నా.. వీటిలో చాలావ‌ర‌కు చంద్ర‌బాబునాయుడు అమ‌లు చేసిన‌వే.... సో దీన్ని ప‌చ్చ ప‌త్రిక‌లు కూడా త‌ప్పుప‌ట్ట‌బోవు.... ఎందుకంటే గ‌తంలో బాబు చేసిన‌ప్పుడు త‌ప్పుపట్ట‌లేదు కాబ‌ట్టి... ప‌త్రికా స్వేచ్ఛ‌కు, మీడియా స్వేచ్ఛ‌కు ఇది ప్ర‌తిబంధ‌కం కాబోదు....!! మీరు కూడా మీ స‌ల‌హాలు ఇవ్వండి...

ఈ ఆంధ్రా ఛానెల్స్, ప‌త్రిక‌లు మ‌న అభివృద్ధికి విఘాతంగా వ్య‌వ‌హ‌రిస్తాయి... మీరే చూశారు క‌దా... కోదండ‌రాంకు కేసీఆర్‌కు మ‌ధ్య ఈ ఛానెల్స్ ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 50 సార్లు పంచాయితీ జ‌రిగిట‌న‌ట్లుగా వార్త‌లు వేశాయి...ఈ వార్త‌లు చూసి మ‌న మ‌న‌సులు క‌ల్లోలానికి గుర‌వుతాయి.. స‌క్క‌గా ప‌నిచేసుకోలేం... అందుకే వీటిని క‌ట్ట‌డి చేయ‌డం అత్యంత కీల‌కం...

1. అన్ని మీడియా ఛానెల్స్ కూడా తెలంగాణ కోసం ప్ర‌త్యేకంగా ఛానెళ్ల‌ను ఏర్పాటు చేయాలి...ఈటీవీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఈటీవీ తెలంగాణ ఏర్పాటు జ‌రిగిన‌ట్లుగా ఉండాలి... ఈటీవీ తెలంగాణ బ్యూరోకు తెలంగాణ వాడే ఇన్‌ఛార్జిగా ఉండాలి.. అంతేకానీ ఈటీవీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌కు ఒక ఆంధ్రోడిని పెట్టిన‌ట్లు తెలిసింది.. ఇలా ఉంటే మ‌న విలేక‌రులు స్వేచ్ఛ‌గా ప‌ని చేయ‌లేరు... ఇది అన్ని ఛానెల్స్‌లోనూ అమ‌లు కావాలి... అలాగే ఛానెల్‌లో ఈటీవీ తెలంగాణ అని ఉంటుంది కానీ వార్త‌ల్లో స‌గం ఆంధ్రా ప్రాంతానికి చెందిన‌వే క‌నిపిస్తున్నాయి... జూన్ 2 త‌ర్వాత పూర్తిగా తెలంగాణ వార్త‌లే ఉండాలి...
ఉదాహ‌ర‌ణ‌కు... క‌ర్ణాట‌క వార్త‌లు, మ‌హారాష్ట్ర వార్త‌ల‌కు తెలంగాణ ఛానెల్స్‌లో ఎంత ప్రాధాన్యం ఇస్తారో అంతే ప్రాధాన్యాన్ని ఆంధ్రా వార్త‌ల‌కు ఇవ్వాలి...

టీవీ9, టీవీ1లో దేన్ని తెలంగాణ‌కు ఇస్తారో ర‌విప్ర‌కాశ్ నిర్ణ‌యించుకోవాలి....తెలంగాణ ఛానెల్‌లో కాంటెంట్‌, బ్యూరో చీఫ్‌, సిబ్బంది విష‌యంలో తెలంగాణ వారే ఎక్కువ‌గా ఉండాలి.. ఎందుకంటే ఈ ప్రాంతం గురించి ఇక్క‌డి వారికే ఎక్కువ తెలుసు గ‌నుక‌....
టీవీ 5, ఎన్‌టీవీ, సాక్షి, ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి త‌దిత‌ర ఛానెల్స్ కూడా తెలంగాన‌కు ప్ర‌త్యేక ఛానెల్‌ను ఏర్పాటు చేయాలి.... దీనికి పెద్ద‌గా ఖ‌ర్చు కాదు...

2. ఒక‌వేళ ఏదైనా ఛానెల్ తెలంగాణ కోసం ప్ర‌త్యేక ఛానెల్‌ను పెట్ట‌కుండా అలాగే ప్ర‌సారాలు కొన‌సాగిస్తే ఆ ఛానెల్‌కు ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వొద్దు...
ఆ ఛానెల్ విలేక‌రుల‌కు గుర్తింపు ఇవ్వొద్దు... ప్ర‌భుత్వ రాయితీల‌ను నిలిపివేయాలి.... కేబుల్ ఆప‌రేట‌ర్లు కూడా ఆ ఛానెల్స్ ప్ర‌సారాన్ని ఆపేయాలి... ఒక్క ఛానెల్ ద్వారా రెండు రాష్ట్రాల‌కు ఎలా స‌మ‌న్యాయం జ‌రుగుతుంది... క‌చ్చితంగా జ‌ర‌గ‌దు...

3. ఛానెల్స్ విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత ఆయా ఛానెల్స్‌లో వ‌చ్చే కాంటెంట్ పై మానిట‌రింగ్ జ‌ర‌గాలి... తెలంగాణ స‌మ‌స్య‌లు, తెలంగాణ గురించి, తెలంగాణ పార్టీల గురించి ఎంత స‌మ‌యం కేటాయిస్తున్నాయి.. జాతీయ రాజ‌కీయాల గురించి ఎంత స‌మ‌యం కేటాయిస్తున్నాయి.. ఆంధ్రా వార్త‌ల‌కు ఎంత స‌మ‌యం కేటాయిస్తున్నాయో ఎప్ప‌టిక‌ప్పుడు రికార్డు చేయాలి... ఇందుకోసం ఒక ఐదుగురు పాత్రికేయుల‌ను లేదా
స‌మాచార శాఖ అధికారుల‌ను నియ‌మించాలి... ఒక‌వేళ తెలంగాణలో ఉంటూ ఆంధ్రాకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న‌ట్లు అనిపిస్తే వాటికి ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌లు ఆపేయాలి.. వీలైతే తెలంగాణ సంఘాల ద్వారా ఆ సంస్థ‌ల కార్యాల‌యాల ముందు దండోరా వేయించాలి...

4. తెలంగాణ ఛానెళ్ల‌లో మొద‌ట‌గా మారాల్సింది యాస‌.. తెలంగాణ యాస‌లోనే వార్త‌లు రావాలి.. ఆంధ్రా వాడుక భాష మ‌న‌కు అన‌వ‌స‌రం...
మ‌న వాడుక భాష‌లోనే వార్త‌లు ఉండాలి... అలాకృషి చేసిన ఛానెల్స్‌కు అవార్డుల రూపంలో ప్రోత్సాహ‌కాలు ఇవ్వాలి...

5. తెలంగాణ‌కు వ్య‌తిరేకంగా ఉంటే ఛానెల్స్ ప్ర‌సారాల‌ను స్థానిక ఎంఎస్ వోలు నిర్మోహమాటంగా నిలిపివేయాలి...

6. ఆంధ్రా ఛానెల్స్‌లో తెలంగాణ ఉద్యోగుల‌కు స‌ముచిత ప్రాధాన్యం ద‌క్కాలి... అర్హ‌త ఉన్న తెలంగాణ వ్య‌క్తుల‌ను బ్యూరో చీఫ్‌లుగా నియ‌మించాలి... ఆంధ్రా వారిని.. అందులో తెలంగాణ‌ను పూర్తిగా వ్య‌తిరేకించే వారిని బ్యూరో చీఫ్‌లుగా కొన‌సాగించిన ప‌క్షంలో క‌చ్చితంగా
తెలంగాణ ప్ర‌జా సంఘాలు కార్యాచ‌ర‌ణ రూపొందిస్తాయి... అయితే కొన్ని ఛానెల్స్ ఖ‌మ్మం జిల్లాకు చెందిన క‌మ్మోళ్ల‌ను పెడుతున్నాయ‌ని విన్నాను.. దీన్ని త‌ప్పుప‌ట్ట‌బోం... ఎందుకంటే ఖ‌మ్మం కూడా మాదే కాబ‌ట్టి...

7. ఆంధ్రా ప‌త్రిక‌లు తెలంగాణ‌కు, ఆంధ్రాకు వేర్వేరుగా ఎడిష‌న్లు ఇవ్వాలి... తెలంగాణ వార్త‌ల‌ను, తెలంగాణ స‌మ‌స్య‌ల‌ను, తెలంగాణ ఇబ్బందుల‌ను ప్ర‌ధాన ప‌త్రిక‌లో క‌చ్చితంగా ప్ర‌తిబింబించాలి.. అంతే కానీ తూర్పుగోదావ‌రిలో రైతులు పంట‌విరామం చేస్తున్నార‌ని ఇక్క‌డ ప్ర‌త్యేక క‌థ‌నాలు వేయ‌డం మానుకోవాలి.. ఇక్క‌డ ఏళ్ల త‌ర‌బ‌డి పంట విరామాలు చేస్తూ ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్న అన్న‌దాత‌ల‌ను
ప‌ట్టించుకోండి... తెలంగాణ వాడుక భాష‌కే పెద్ద పీట వేయాలి... కాళోజీ గురించి రాయాలి కానీ గిడుగు రామ్మూర్తి గురించి అదే ప‌నిగా రాయ‌డం మంచిది కాదు...

8. ఆంధ్రా ప‌త్రిక‌లు ఇప్పుడు కొంత ప‌ద్ధ‌తి ఎంచుకున్నాయి.. తెలంగాణ వార్త‌లు మ‌నం ఎందుకు ఇవ్వాలి... మోడీ వార్త‌లు ఇద్దాం అన్న‌ట్లుగా
వ్య‌వ‌హ‌రిస్తున్నాయి.... మీరు రాష్ట్రంలో వార్త‌ల‌కు పెద్ద‌పీట వేయండి... రాష్ట్ర స‌మ‌స్య‌ల‌ను ఢిల్లీకి తీసుకెళ్లాలి... హైద‌రాబాద్ కోసం ఎడిష‌న్ల‌ను మార్చాల‌ని చూస్తే స‌హించేది లేదు.. హైద‌రాబాద్ తెలంగాణ‌లో అంత‌ర్భాగ‌మే... తెలంగాణ ప్రాంతానికి వెళ్లే ఎడిష‌న్ మాత్ర‌మే హైదరాబాద్‌లో
రావాలి....

9. ప‌త్రిక‌ల్లో ఏ పార్టీకి ఎంత స్థ‌లం కేటాయించారు... తెలంగాణ వార్త‌లు ఎన్ని ఉన్నాయి.. జాతీయ వార్త‌లు ఎన్ని ఉన్నాయి.. సీమాంధ్ర వార్త‌లు ఎన్ని ఉన్నాయి.. ఎంత చ‌ద‌ర‌పు సెంటీమీట‌ర్లు కేటాయించారు అనేది కూడా త‌యారు చేయాలి.. తెలంగాణ ప్ర‌భుత్వానికి నిర్మాణాత్మ‌క సూచ‌న‌లు ఇస్తుందా? లేక ఆంధ్రా ప్ర‌భుత్వానికి వంత‌పాడే ప‌నులు చేస్తుందా? ర‌హ‌స్య అజెండాతో ప‌నిచేస్తున్నాయా? ప‌రిశీలించేందుకు సీనియ‌ర్ పాత్రికేయుల‌తో ఒక సంఘాన్ని ఏర్పాటు చేయాలి... వీలైతే తెలంగాణ ప్రెస్ అకాడ‌మీకి ఆ బాధ్య‌త‌లు అప్ప‌గించాలి...
తెలంగాణ టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ, ఎంఐఎం నేత‌ల‌కు ప్రాధాన్యం ఇచ్చినా త‌ప్పు లేదు కానీ చంద్ర‌బాబులాంటి ఆంధ్రా నేత‌ల‌కు ప్రాధాన్యం ఇచ్చిన‌ట్లు క‌నిపిస్తే చ‌ర్య‌లు తీసుకోవాలి.... ఇవ‌న్నీ ప‌రోక్ష చ‌ర్య‌లే కావాలి...

10. ఒక‌వేళ మీ దారిలో మీరే వెళితే క‌చ్చితంగా మీకు ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌లు రావ‌డం గ‌గ‌నం అవుతుంది.. మీకు ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చే ప్రైవేటు సంస్థ‌ల‌కు కూడా ప్ర‌భుత్వ రాయితీలు ద‌క్క‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాలి...

11. ఆంధ్రా, తెలంగాణ జ‌ల, ఉద్యోగ ఇత‌ర‌ వివాదాలు వ‌చ్చిన‌ప్పుడు మీరు ముమ్మాటికి న్యాయ‌బ‌ద్ధంగా వ్య‌వ‌హ‌రించాలి.. ప‌క్ష‌పాతంతో ఆంధ్రా ప్రాంతం వైపు నిలిస్తే క‌చ్చితంగా మీకు తెలంగాణలో కొన‌సాగే అర్హ‌త ఉండ‌దు... పోల‌వ‌రం విష‌యంలోనూ మీరు ప‌క్ష‌పాతంతో వ్య‌వ‌హ‌రిస్తే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది....

12. అతి కీల‌క‌మైన‌ది ఏంటంటే... తెలంగాణ భావ‌జాల వ్యాప్తి జ‌ర‌గాలంటే తెలంగాణ ప‌త్రిక‌ల ద్వారానే అది సాధ్యం.. ఆంధ్రా ప్ర‌తిక‌లు ఉంటే
మ‌న విద్యార్థులు, ఉద్యోగుల మ‌న‌సులు క‌లుషితం అవుతాయి.. ఆ ప‌త్రిక‌ల‌ను చ‌దివి ఎంద‌రో ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నారు.. ఈ నేప‌థ్యంలో ఆంధ్రా ప‌త్రిక‌ల నైజాం మారే వ‌ర‌కు... తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్ర‌భుత్వ పాఠశాల‌ల్లో తెలంగాణ ప‌త్రిక‌ల‌ను మాత్ర‌మే వేయించుకోవాల‌ని స‌ర్కుల‌ర్ జారీ చేయాలి... ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు ఇదే స‌ర్కుల‌ర్ ఇవ్వాలి....
రేపు ఆంధ్రాలో చంద్ర‌బాబునాయుడు ఈనాడు ప‌త్రిక‌ను ప్రోత్స‌హించ‌డానికి ఎలాగూ చ‌ర్య‌లు తీసుకుంటాడు.. సాక్షిని తొక్కేస్తాడు..
అలాంప్పుడు తెలంగాణ‌లో ఆంధ్రాకు వంత‌పాడే సంస్థ‌ల‌ను బొంద పెడ‌దాం.... తెలంగాణకు వ్య‌తిరేకంగా ప‌నిచేస్తే మ‌న స‌ర్కులేష‌న్ త‌గ్గిపోయే ప్ర‌మాదం ఉంద‌న్న భ‌యానికి అయినా స‌రే అవి తెలంగాణ వార్త‌ల‌ను మాత్ర‌మే ఇస్తాయి....

NOTE: ఇవ‌న్నీ క‌చ్చితంగా జ‌ర‌గాలి... తెలంగాణ పున‌ర్నిర్మాణ ప్ర‌క్రియ నిర్విఘ్నంగా కొన‌సాగాలంటే ఆంధ్రా మీడియా కుట్ర క‌థ‌నాల‌ను క‌ట్ట‌డి
చేయాలి... మ‌రి కేసీఆర్ గారు ఏం చేస్తారో వేచిచూడాలి....