ఈ రెండు వార్తలు ఒకటే... కానీ...!!!ఒకటి ఆంధ్రాకు వెళ్లింది.. ఒకటి తెలంగాణకు వెళ్లింది.. ఆంధ్రాకు వెళ్లిన వార్తలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండళ్ల తప్పిదం వల్లే ఎంసెట్ విద్యార్థులకు నష్టం జరిగినట్లు రూడీ చేసినట్లు డెక్ పెట్టింది...
అదే తెలంగాణ వార్తలో వారి వల్లే నష్టం జరిగిందా? అని ప్రశ్నార్థం తో ఇచ్చింది...
రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నడిస్తే ప్రయోజనం అని సీమాంధ్ర ఎడిషన్లో బల్లగుద్ది వాదించినట్లు డెక్ ఉంది..
అదే తెలంగాణ ఎడిషన్లో మాత్రం రెండు ప్రభుత్వాలు కలిస్తే ప్రయోజనం ఉంటుందా? అని ప్రశ్నించింది...
ఎందుకు ఇలా.. ఒకే విషయం.. ఒకే వార్త.. మ్యాటరంతా సేమ్.. కానీ హెడ్డింగ్, డెక్‌లు ఎలా మారాయి...
ఎంసెట్ రెండో విడతలో తప్పెవరితో సూటిగా చెప్పొచ్చు కదా... ఓ ప్రాంతాన్ని ఓ విధంగా, మరో ప్రాంతాన్ని మరోలా మభ్యపెట్టేలా హెడ్డింగ్, డెక్‌లు పెట్టడం ఏం జర్నలిజానికి నిదర్శనమో పత్రిక యాజమాన్యమే చెప్పాలి....
No comments:
Post a Comment