1

1

Sunday, 21 September 2014

ఉద్యోగుల స్థానిక‌త నిర్ధ‌ర‌ణ‌కు వేసిన క‌మిటీలో ఇద్ద‌రు విద్యార్థి నేత‌ల‌కు చోటివ్వాల్సింది...

May 22, 2014
చిన్న విజ్ఞ‌ప్తి...


ఉద్యోగుల స్థానిక‌త నిర్ధ‌ర‌ణ‌కు వేసిన క‌మిటీలో ఇద్ద‌రు విద్యార్థి నేత‌ల‌కు చోటివ్వాల్సింది...
నిరుద్యోగ యువ‌త‌కు భ‌రోసా క‌లుగుతుంది...



ఉద్యోగుల స్థానిక‌త నిర్ధ‌రించ‌డానికి కేసీఆర్ గారు ఒక క‌మిటీని ఏర్పాటు చేశారు... ఇది సంతోష‌క‌ర‌మైన వార్తే.. కానీ క‌మిటీలు అంటేనే కాల‌యాప‌న కోసం అన్న అనుమానం తెలంగాణ స‌మాజంలో మొద‌టి నుంచి ఉంది... అది కేసీఆర్ గారికి కూడా అనుభ‌వ‌మే.. ఇప్పుడు ఆయ‌నే క‌మిటీ వేశారు కాబ‌ట్టి క‌చ్చితంగా జాప్యం లేకుండా నివేదిక వ‌చ్చేలా చూస్తార‌ని న‌మ్మ‌కం ఉంది...
అయితే ఆంధ్రా ఉద్యోగులు తెలంగాణ‌లో ప‌నిచేస్తే అది ప్ర‌భుత్వంతోపాటు ఇక్క‌డి నిరుద్యోగికి కూడా న‌ష్టాన్ని మిగుల్చుతుంది... ఈ నేప‌థ్యంలో మీరు ఆరుగురు స‌భ్యుల‌తో క‌మిటీని ఏర్పాటు చేశారు.. అందులో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, ఇద్ద‌రు ఉన్న‌తాధికారులు ఉంటార‌ని చెప్పారు.. నాకు తెలిసి ఆంధ్రా ఉద్యోగులు తెలంగాణలో ఉండ‌టం వ‌ల్ల ఎక్కువ‌గా న‌ష్ట‌పోయేది తెలంగాణ నిరుద్యోగులేకాబ‌ట్టి.. క‌మిటీలో తెలంగాణ విద్యార్థి ఐకాస నాయ‌కుల‌ను ఇద్ద‌రిని ఉంచితే బాగుంటుదేమో.. విద్యార్థుల‌కు కూడా న‌మ్మ‌కం క‌లుగుతుంది... పార‌ద‌ర్శ‌క‌తంగానే ఉద్యోగుల పంపిణీ జ‌రిగింద‌న్న భ‌రోసా ఉంటుంది... వారి అసంతృప్తిని దూరం చేయొచ్చు... అయితే క‌మిటీలోకి విద్యార్థి నేత‌ల‌ను తీసుకోవ‌డం సాధ్యం కాక‌పోతే వ‌దిలేయొచ్చు.. ఒక‌వేళ అవ‌కాశం ఉంటే తీసుకోవ‌డంలో త‌ప్పు లేదేమో...!!

No comments:

Post a Comment