1

1

Sunday 21 September 2014

పండంటి తెలంగాణ నిర్మాణానికి 12 సూత్రాలు.... కేసీఆర్‌గారు అమ‌లు చేయాలి....

May 23, 2014
తెలంగాణ‌వాదుల‌ విజ్ఞ‌ప్తి....

పండంటి తెలంగాణ నిర్మాణానికి 12 సూత్రాలు....
కేసీఆర్‌గారు అమ‌లు చేయాలి....
ఆంధ్రా మీడియాను క‌ట్ట‌డి చేస్తేనే తెలంగాణ‌కైనా.. ఆయ‌న‌కైనా భ‌విష్య‌త్తు ఉంటుంది..
లేక‌పోతే భ‌స్మారుస హ‌స్తాన్ని ప‌క్క‌న పెట్టుకుని తిరుగుతున్న‌ట్లే లెక్క‌....

ఆంధ్రా మీడియాను క‌ట్టండి చేయండిలా....!!!

ఆంధ్రా మీడియాను క‌ట్ట‌డి చేయలేమ‌ని చాలా మంది అంటున్నారు... నా వ‌ద్ద కొన్ని సూచ‌న‌లు ఉన్నాయి... తెలంగాణ ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధితో ఉంటే ప్ర‌జాస్వామ్య‌బ‌ద్ధంగానే ఆంధ్రా మీడియాను క‌ట్ట‌డి చేయొచ్చు... నా ఆలోచ‌న‌ల‌ను మీతో పంచుకుంటున్నా.. వీటిలో చాలావ‌ర‌కు చంద్ర‌బాబునాయుడు అమ‌లు చేసిన‌వే.... సో దీన్ని ప‌చ్చ ప‌త్రిక‌లు కూడా త‌ప్పుప‌ట్ట‌బోవు.... ఎందుకంటే గ‌తంలో బాబు చేసిన‌ప్పుడు త‌ప్పుపట్ట‌లేదు కాబ‌ట్టి... ప‌త్రికా స్వేచ్ఛ‌కు, మీడియా స్వేచ్ఛ‌కు ఇది ప్ర‌తిబంధ‌కం కాబోదు....!! మీరు కూడా మీ స‌ల‌హాలు ఇవ్వండి...

ఈ ఆంధ్రా ఛానెల్స్, ప‌త్రిక‌లు మ‌న అభివృద్ధికి విఘాతంగా వ్య‌వ‌హ‌రిస్తాయి... మీరే చూశారు క‌దా... కోదండ‌రాంకు కేసీఆర్‌కు మ‌ధ్య ఈ ఛానెల్స్ ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 50 సార్లు పంచాయితీ జ‌రిగిట‌న‌ట్లుగా వార్త‌లు వేశాయి...ఈ వార్త‌లు చూసి మ‌న మ‌న‌సులు క‌ల్లోలానికి గుర‌వుతాయి.. స‌క్క‌గా ప‌నిచేసుకోలేం... అందుకే వీటిని క‌ట్ట‌డి చేయ‌డం అత్యంత కీల‌కం...

1. అన్ని మీడియా ఛానెల్స్ కూడా తెలంగాణ కోసం ప్ర‌త్యేకంగా ఛానెళ్ల‌ను ఏర్పాటు చేయాలి...ఈటీవీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఈటీవీ తెలంగాణ ఏర్పాటు జ‌రిగిన‌ట్లుగా ఉండాలి... ఈటీవీ తెలంగాణ బ్యూరోకు తెలంగాణ వాడే ఇన్‌ఛార్జిగా ఉండాలి.. అంతేకానీ ఈటీవీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌కు ఒక ఆంధ్రోడిని పెట్టిన‌ట్లు తెలిసింది.. ఇలా ఉంటే మ‌న విలేక‌రులు స్వేచ్ఛ‌గా ప‌ని చేయ‌లేరు... ఇది అన్ని ఛానెల్స్‌లోనూ అమ‌లు కావాలి... అలాగే ఛానెల్‌లో ఈటీవీ తెలంగాణ అని ఉంటుంది కానీ వార్త‌ల్లో స‌గం ఆంధ్రా ప్రాంతానికి చెందిన‌వే క‌నిపిస్తున్నాయి... జూన్ 2 త‌ర్వాత పూర్తిగా తెలంగాణ వార్త‌లే ఉండాలి...
ఉదాహ‌ర‌ణ‌కు... క‌ర్ణాట‌క వార్త‌లు, మ‌హారాష్ట్ర వార్త‌ల‌కు తెలంగాణ ఛానెల్స్‌లో ఎంత ప్రాధాన్యం ఇస్తారో అంతే ప్రాధాన్యాన్ని ఆంధ్రా వార్త‌ల‌కు ఇవ్వాలి...

టీవీ9, టీవీ1లో దేన్ని తెలంగాణ‌కు ఇస్తారో ర‌విప్ర‌కాశ్ నిర్ణ‌యించుకోవాలి....తెలంగాణ ఛానెల్‌లో కాంటెంట్‌, బ్యూరో చీఫ్‌, సిబ్బంది విష‌యంలో తెలంగాణ వారే ఎక్కువ‌గా ఉండాలి.. ఎందుకంటే ఈ ప్రాంతం గురించి ఇక్క‌డి వారికే ఎక్కువ తెలుసు గ‌నుక‌....
టీవీ 5, ఎన్‌టీవీ, సాక్షి, ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి త‌దిత‌ర ఛానెల్స్ కూడా తెలంగాన‌కు ప్ర‌త్యేక ఛానెల్‌ను ఏర్పాటు చేయాలి.... దీనికి పెద్ద‌గా ఖ‌ర్చు కాదు...

2. ఒక‌వేళ ఏదైనా ఛానెల్ తెలంగాణ కోసం ప్ర‌త్యేక ఛానెల్‌ను పెట్ట‌కుండా అలాగే ప్ర‌సారాలు కొన‌సాగిస్తే ఆ ఛానెల్‌కు ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వొద్దు...
ఆ ఛానెల్ విలేక‌రుల‌కు గుర్తింపు ఇవ్వొద్దు... ప్ర‌భుత్వ రాయితీల‌ను నిలిపివేయాలి.... కేబుల్ ఆప‌రేట‌ర్లు కూడా ఆ ఛానెల్స్ ప్ర‌సారాన్ని ఆపేయాలి... ఒక్క ఛానెల్ ద్వారా రెండు రాష్ట్రాల‌కు ఎలా స‌మ‌న్యాయం జ‌రుగుతుంది... క‌చ్చితంగా జ‌ర‌గ‌దు...

3. ఛానెల్స్ విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత ఆయా ఛానెల్స్‌లో వ‌చ్చే కాంటెంట్ పై మానిట‌రింగ్ జ‌ర‌గాలి... తెలంగాణ స‌మ‌స్య‌లు, తెలంగాణ గురించి, తెలంగాణ పార్టీల గురించి ఎంత స‌మ‌యం కేటాయిస్తున్నాయి.. జాతీయ రాజ‌కీయాల గురించి ఎంత స‌మ‌యం కేటాయిస్తున్నాయి.. ఆంధ్రా వార్త‌ల‌కు ఎంత స‌మ‌యం కేటాయిస్తున్నాయో ఎప్ప‌టిక‌ప్పుడు రికార్డు చేయాలి... ఇందుకోసం ఒక ఐదుగురు పాత్రికేయుల‌ను లేదా
స‌మాచార శాఖ అధికారుల‌ను నియ‌మించాలి... ఒక‌వేళ తెలంగాణలో ఉంటూ ఆంధ్రాకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న‌ట్లు అనిపిస్తే వాటికి ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌లు ఆపేయాలి.. వీలైతే తెలంగాణ సంఘాల ద్వారా ఆ సంస్థ‌ల కార్యాల‌యాల ముందు దండోరా వేయించాలి...

4. తెలంగాణ ఛానెళ్ల‌లో మొద‌ట‌గా మారాల్సింది యాస‌.. తెలంగాణ యాస‌లోనే వార్త‌లు రావాలి.. ఆంధ్రా వాడుక భాష మ‌న‌కు అన‌వ‌స‌రం...
మ‌న వాడుక భాష‌లోనే వార్త‌లు ఉండాలి... అలాకృషి చేసిన ఛానెల్స్‌కు అవార్డుల రూపంలో ప్రోత్సాహ‌కాలు ఇవ్వాలి...

5. తెలంగాణ‌కు వ్య‌తిరేకంగా ఉంటే ఛానెల్స్ ప్ర‌సారాల‌ను స్థానిక ఎంఎస్ వోలు నిర్మోహమాటంగా నిలిపివేయాలి...

6. ఆంధ్రా ఛానెల్స్‌లో తెలంగాణ ఉద్యోగుల‌కు స‌ముచిత ప్రాధాన్యం ద‌క్కాలి... అర్హ‌త ఉన్న తెలంగాణ వ్య‌క్తుల‌ను బ్యూరో చీఫ్‌లుగా నియ‌మించాలి... ఆంధ్రా వారిని.. అందులో తెలంగాణ‌ను పూర్తిగా వ్య‌తిరేకించే వారిని బ్యూరో చీఫ్‌లుగా కొన‌సాగించిన ప‌క్షంలో క‌చ్చితంగా
తెలంగాణ ప్ర‌జా సంఘాలు కార్యాచ‌ర‌ణ రూపొందిస్తాయి... అయితే కొన్ని ఛానెల్స్ ఖ‌మ్మం జిల్లాకు చెందిన క‌మ్మోళ్ల‌ను పెడుతున్నాయ‌ని విన్నాను.. దీన్ని త‌ప్పుప‌ట్ట‌బోం... ఎందుకంటే ఖ‌మ్మం కూడా మాదే కాబ‌ట్టి...

7. ఆంధ్రా ప‌త్రిక‌లు తెలంగాణ‌కు, ఆంధ్రాకు వేర్వేరుగా ఎడిష‌న్లు ఇవ్వాలి... తెలంగాణ వార్త‌ల‌ను, తెలంగాణ స‌మ‌స్య‌ల‌ను, తెలంగాణ ఇబ్బందుల‌ను ప్ర‌ధాన ప‌త్రిక‌లో క‌చ్చితంగా ప్ర‌తిబింబించాలి.. అంతే కానీ తూర్పుగోదావ‌రిలో రైతులు పంట‌విరామం చేస్తున్నార‌ని ఇక్క‌డ ప్ర‌త్యేక క‌థ‌నాలు వేయ‌డం మానుకోవాలి.. ఇక్క‌డ ఏళ్ల త‌ర‌బ‌డి పంట విరామాలు చేస్తూ ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్న అన్న‌దాత‌ల‌ను
ప‌ట్టించుకోండి... తెలంగాణ వాడుక భాష‌కే పెద్ద పీట వేయాలి... కాళోజీ గురించి రాయాలి కానీ గిడుగు రామ్మూర్తి గురించి అదే ప‌నిగా రాయ‌డం మంచిది కాదు...

8. ఆంధ్రా ప‌త్రిక‌లు ఇప్పుడు కొంత ప‌ద్ధ‌తి ఎంచుకున్నాయి.. తెలంగాణ వార్త‌లు మ‌నం ఎందుకు ఇవ్వాలి... మోడీ వార్త‌లు ఇద్దాం అన్న‌ట్లుగా
వ్య‌వ‌హ‌రిస్తున్నాయి.... మీరు రాష్ట్రంలో వార్త‌ల‌కు పెద్ద‌పీట వేయండి... రాష్ట్ర స‌మ‌స్య‌ల‌ను ఢిల్లీకి తీసుకెళ్లాలి... హైద‌రాబాద్ కోసం ఎడిష‌న్ల‌ను మార్చాల‌ని చూస్తే స‌హించేది లేదు.. హైద‌రాబాద్ తెలంగాణ‌లో అంత‌ర్భాగ‌మే... తెలంగాణ ప్రాంతానికి వెళ్లే ఎడిష‌న్ మాత్ర‌మే హైదరాబాద్‌లో
రావాలి....

9. ప‌త్రిక‌ల్లో ఏ పార్టీకి ఎంత స్థ‌లం కేటాయించారు... తెలంగాణ వార్త‌లు ఎన్ని ఉన్నాయి.. జాతీయ వార్త‌లు ఎన్ని ఉన్నాయి.. సీమాంధ్ర వార్త‌లు ఎన్ని ఉన్నాయి.. ఎంత చ‌ద‌ర‌పు సెంటీమీట‌ర్లు కేటాయించారు అనేది కూడా త‌యారు చేయాలి.. తెలంగాణ ప్ర‌భుత్వానికి నిర్మాణాత్మ‌క సూచ‌న‌లు ఇస్తుందా? లేక ఆంధ్రా ప్ర‌భుత్వానికి వంత‌పాడే ప‌నులు చేస్తుందా? ర‌హ‌స్య అజెండాతో ప‌నిచేస్తున్నాయా? ప‌రిశీలించేందుకు సీనియ‌ర్ పాత్రికేయుల‌తో ఒక సంఘాన్ని ఏర్పాటు చేయాలి... వీలైతే తెలంగాణ ప్రెస్ అకాడ‌మీకి ఆ బాధ్య‌త‌లు అప్ప‌గించాలి...
తెలంగాణ టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ, ఎంఐఎం నేత‌ల‌కు ప్రాధాన్యం ఇచ్చినా త‌ప్పు లేదు కానీ చంద్ర‌బాబులాంటి ఆంధ్రా నేత‌ల‌కు ప్రాధాన్యం ఇచ్చిన‌ట్లు క‌నిపిస్తే చ‌ర్య‌లు తీసుకోవాలి.... ఇవ‌న్నీ ప‌రోక్ష చ‌ర్య‌లే కావాలి...

10. ఒక‌వేళ మీ దారిలో మీరే వెళితే క‌చ్చితంగా మీకు ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌లు రావ‌డం గ‌గ‌నం అవుతుంది.. మీకు ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చే ప్రైవేటు సంస్థ‌ల‌కు కూడా ప్ర‌భుత్వ రాయితీలు ద‌క్క‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాలి...

11. ఆంధ్రా, తెలంగాణ జ‌ల, ఉద్యోగ ఇత‌ర‌ వివాదాలు వ‌చ్చిన‌ప్పుడు మీరు ముమ్మాటికి న్యాయ‌బ‌ద్ధంగా వ్య‌వ‌హ‌రించాలి.. ప‌క్ష‌పాతంతో ఆంధ్రా ప్రాంతం వైపు నిలిస్తే క‌చ్చితంగా మీకు తెలంగాణలో కొన‌సాగే అర్హ‌త ఉండ‌దు... పోల‌వ‌రం విష‌యంలోనూ మీరు ప‌క్ష‌పాతంతో వ్య‌వ‌హ‌రిస్తే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది....

12. అతి కీల‌క‌మైన‌ది ఏంటంటే... తెలంగాణ భావ‌జాల వ్యాప్తి జ‌ర‌గాలంటే తెలంగాణ ప‌త్రిక‌ల ద్వారానే అది సాధ్యం.. ఆంధ్రా ప్ర‌తిక‌లు ఉంటే
మ‌న విద్యార్థులు, ఉద్యోగుల మ‌న‌సులు క‌లుషితం అవుతాయి.. ఆ ప‌త్రిక‌ల‌ను చ‌దివి ఎంద‌రో ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నారు.. ఈ నేప‌థ్యంలో ఆంధ్రా ప‌త్రిక‌ల నైజాం మారే వ‌ర‌కు... తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్ర‌భుత్వ పాఠశాల‌ల్లో తెలంగాణ ప‌త్రిక‌ల‌ను మాత్ర‌మే వేయించుకోవాల‌ని స‌ర్కుల‌ర్ జారీ చేయాలి... ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు ఇదే స‌ర్కుల‌ర్ ఇవ్వాలి....
రేపు ఆంధ్రాలో చంద్ర‌బాబునాయుడు ఈనాడు ప‌త్రిక‌ను ప్రోత్స‌హించ‌డానికి ఎలాగూ చ‌ర్య‌లు తీసుకుంటాడు.. సాక్షిని తొక్కేస్తాడు..
అలాంప్పుడు తెలంగాణ‌లో ఆంధ్రాకు వంత‌పాడే సంస్థ‌ల‌ను బొంద పెడ‌దాం.... తెలంగాణకు వ్య‌తిరేకంగా ప‌నిచేస్తే మ‌న స‌ర్కులేష‌న్ త‌గ్గిపోయే ప్ర‌మాదం ఉంద‌న్న భ‌యానికి అయినా స‌రే అవి తెలంగాణ వార్త‌ల‌ను మాత్ర‌మే ఇస్తాయి....

NOTE: ఇవ‌న్నీ క‌చ్చితంగా జ‌ర‌గాలి... తెలంగాణ పున‌ర్నిర్మాణ ప్ర‌క్రియ నిర్విఘ్నంగా కొన‌సాగాలంటే ఆంధ్రా మీడియా కుట్ర క‌థ‌నాల‌ను క‌ట్ట‌డి
చేయాలి... మ‌రి కేసీఆర్ గారు ఏం చేస్తారో వేచిచూడాలి....

No comments:

Post a Comment