నేను చిన్నప్పుడు పుస్తకాల్లో చదివాను.. విదేశీయులు మన దేశంలో వర్తకం చేసుకోవడానికి వచ్చారని.. తర్వాత మనల్ని బానిసలుగా మార్చుకున్నారని... అప్పుడు వాళ్లను మనం పిలవకుండానే వచ్చారు.. వచ్చి మనల్ని మోసం చేశారు.. మనపై వందల ఏళ్లు పెత్తనం చెలాయించారు.. మరి మనం ఇప్పుడు రండి బాబు రండి... మా దేశానికి రండి అంటూ ఆహ్వానిస్తున్నాం... ఇక్కడ వర్తకం చేసుకోండి.. ఇక్కడ పెట్టుబడులు పెట్టండి అంటూ విదేశీయులకే ఎర్ర తివాచీ పరుస్తున్నాం...
ఏ చీకటి కోసమో వెలుగుల కోసమో ఈ ప్రస్థానం...నాకు అర్థం కావడం లేదు...!!!
ఏ చీకటి కోసమో వెలుగుల కోసమో ఈ ప్రస్థానం...నాకు అర్థం కావడం లేదు...!!!
No comments:
Post a Comment