తెలంగాణలో కొన్ని ఛానెళ్ల ప్రసారాలు నిలిపేయడంపై కొన్ని యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నాయి... మా ప్రసారాలు నచ్చకపోతే మీ చేతిలో రిమోట్ ఉంటుంది కదా.. ఛానెల్ మార్చుకోండని సలహాలు ఇస్తున్నాయి..
నాదో ప్రశ్న....
అరే ఆంధ్రలో తెలంగాణ ఛానెళ్ల ప్రసారాలను ఎందుకు ఇవ్వడం లేదు... అంటే మీ వాళ్లకు తెలంగాణ ఛానెల్ల ప్రసారాలు నచ్చనంత మాత్రాన
వాటిని శాశ్వతంగా నిలిపేస్తారా? అంటే మీకు నచ్చని తెలంగాణ ఛానెల్‌ను చూడకుండా రిమోట్తో మార్చుకోవచ్చు కదా... మీ వద్ద రిమోట్లు లేవా?
నోట్: జర్నలిస్టులకు స్వతంత్రత ఇచ్చే మీడియా యాజమాన్యాలను నేను గౌరవిస్తాను.. స్వచ్ఛమైన పాత్రికేయ విలువలు పాటించే మీడియా యాజమాన్యాలకు పాదాభివందనం చేస్తాను..
కానీ జర్నలిస్టులను అవసరానికి అడ్డుపెట్టుకునే యాజమాన్యాలు ఎప్పటికీ కూడా జర్నలిస్టుల సంక్షేమాన్ని పట్టించుకునేవి కావు... అవసరానికి వాడుకొని తర్వాత బయటకు గెంటేసేవే.. ఇందుకు ఓ పత్రికా యాజమాన్యం ఇటీవల అవలంభించిన వైఖరే ఉదాహరణ... ఎన్నికల వరకు వాడుకొని తర్వాత మూకుమ్మడిగా గెంటేసే కుతంత్రం చేసింది.. అదే ఎన్నికల్లో సీమాంధ్రలో జగన్ గెలిచినా... కేంద్రంలో యూపీఏ వచ్చినా ఇంత బరితెగింపునకు పాల్పడేది కాదని ఆ సంస్థ ఉద్యోగులే అంటున్నారు..!!
No comments:
Post a Comment