1

1

Sunday, 21 September 2014

అక్క‌డ ఆంధ్రా మీడియా ప్ర‌భుత్వ ప‌క్షం.... ఇక్క‌డ ఆంధ్రా మీడియా ప్ర‌తిప‌క్షం...

May 22, 2014

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స‌మ‌స్య‌ల ప‌రిష్క‌రాన్ని చంద్ర‌బాబునాయుడు చేసినా చేయ‌కున్నా స‌రే ఆంధ్రా మీడియా రంగంలోకి దిగి మ‌రీ చేసేలా ఉంది... చంద్ర‌బాబునాయుడు ఇచ్చిన హామీల‌ను ఆంధ్రా మీడియా సంస్థ‌లే అమ‌లు చేసేలా ఉన్నాయి.. వీలైతే ప్ర‌జ‌లు హామీల‌ను మ‌ర‌చిపోయేలా చూసేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి... అక్క‌డ రాజ‌ధాని నిర్మాణానికి ఒక‌డు విరాళాలు సేకరించే ప‌నిలో ప‌డితే.. ఇంకొక‌డు పారిశ్రామిక వేత్త‌ల‌తో చ‌ర్చావేదిక‌లు పెడుతున్నాడు..

ఏది ఏమైనా అక్క‌డ మీడియా ఆంధ్రా ప్ర‌భుత్వానికి పూర్తిగా స‌హ‌క‌రించే ప‌నిలో ఉంది... ప్ర‌భుత్వ మీడియా సంస్థ‌గా మారింది... ప్ర‌తిప‌క్షంగా త‌ప్పుల‌ను ఎత్తిచూపే బాధ్య‌త‌ను ప‌క్క‌న‌పెట్టింది.. కేంద్రం నుంచి ఎలా నిధులు తెప్పించాలి.. చంద్ర‌బాబునాయుడికి ఇబ్బంది లేకుండా ఎలా చూడాల‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తోంది... దీన్ని అక్క‌డి ప్ర‌జ‌లు కూడా త‌ప్పుప‌ట్ట‌డం లేదు....

మ‌న తెలంగాణ‌ వ‌ద్ద‌కు వ‌చ్చే స‌రికి అదే ఆంధ్రా మీడియా ప్ర‌తిప‌క్షంలా వ్య‌వ‌హ‌రిస్తోంది... కేసీఆర్‌కు స‌వాళ్లు ఉన్నాయ‌ని.. వాటిని ఎలా అధిగ‌మిస్తాడంటూ ఇప్పుడే సందేహాలు లేవ‌నెత్తుతోంది... కేసీఆర్ ప్ర‌తి అడుగును ఎత్తిచూపేందుకు సిద్ధంగా ఉంది.. మ‌రోవైపు ఎన్నిక‌ల్లో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవ‌రూ ఓడిపోన‌ట్లు.. వారిని చంద్ర‌బాబునాయుడు ఓదార్చ‌న‌ట్లుగా.. కేవ‌లం కేసీఆర్ వ‌ద్ద‌కు మాత్రం ఓడిపోయిన టీఆర్ఎస్‌ వాళ్లు వ‌చ్చి గోడు వెళ్ల‌బోసుకుంటున్న‌ట్లుగా క‌థ‌నాలు రాస్తూ పార్టీ నైతిక స్థైర్యాన్ని త‌గ్గించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి... అస‌లు వెన‌క‌బ‌డిన తెలంగాణ అభివృద్ధి కోసం ఒక్క చ‌ర్చా వేదిక కూడా పెట్ట‌డం లేదు.. కేంద్రం తెలంగాణను ఆదుకోవ‌డానికి ఏమేం చేయాలో కూడా రాయ‌డం లేదు..

చూస్తుంటే రేపు తెలంగాణ ప్ర‌భుత్వానికి ప్ర‌తిప‌క్షాలు స‌హ‌క‌రించినా కూడా ఆంధ్రా మీడియా సంస్థ‌లు స‌హ‌క‌రించే అవ‌కాశం లేన‌ట్లే ఉంది... మీడియా ఎప్పుడూ ప్ర‌జ‌ల ప‌క్ష‌మే ఉండాలి... పూర్తిగా ప్ర‌భుత్వ ప‌క్షం ఉండాల‌ని కూడా నేను భావించ‌డం లేదు.. అయితే ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా వ్య‌వ‌హ‌రించొద్ద‌నేది నా ఉద్దేశం....

No comments:

Post a Comment