May 17, 2014
ఇలాంటి వారి పట్ల కొంత అప్రమత్తంగా ఉండాలి... హైదరాబాద్‌లో జర్నలిస్టుల కోసం గత ప్రభుత్వం కేటాయించిన భూమిని తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి... ఆంధ్రా ప్రాంత జర్నలిస్టులకు తెలంగాణలో ఇళ్ల స్థలాలు ఇవ్వడం తగదు.. వాళ్లకు ఆంధ్రా ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయిస్తుంది.. తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులకు స్థలాలు ఇవ్వనవసరం లేదు.. కేవలం బలహీన వర్గాల కేటగిరీలో జర్నలిస్టులకు ఇల్లులు కట్టించాలి... ఈ హామీని కేసీఆర్ గారు గతంలో ఇచ్చారు.. తెలంగాణ జర్నలిస్టు సంఘం ఆవిర్భావ సభలో ఆయన ఇచ్చిన హామీలను నిలుపుకోవాలి.. హైదరాబాద్‌లో అత్యద్భుతమైన మీడియా సెంటర్‌ను నెలకొల్పాలి... మంచి గ్రంథాలయం ఉండాలి... పాత పత్రికల సంచికలను డిజిటలీకరించాలి.. తెలంగాణ ఉద్యమాన్ని ఆంధ్రా పత్రికలు ఎలా అణచాలని చూశాయో భవిష్యత్తు తరాలకు తెలిసేలా చేయాలి.... అలాగే తెలంగాణ ఉద్యమం సమయంలో మౌనంగా ఉండి... ఇప్పుడు పదవుల కోసం ముందుకు వచ్చే జర్నలిస్టు సంఘాల నేతల పట్ల కొంత అప్రమత్తంగా ఉండాలి.. వీళ్లు కింద స్థాయి జర్నలిస్టుల కోసం ఎప్పుడూ కొట్లాడింది లేదు... కనీసం ఎందరో జర్నలిస్టులు చనిపోయినా వారి కుటుంబాల కోసం ఏమీ చేయలేదు... ఇక పత్రికల్లో వేజ్‌బోర్డు సిఫార్సులను అమలు చేయాలని సుప్రీంకోర్టు చెప్పినా మన పత్రికలు అమలు చేయడం లేదు... దీనిపై కేసీఆర్ ప్రభుత్వం దృష్టి సారించాలి.... పాత్రికేయుల సమస్యలను పరిష్కరించాలి... |
1
Sunday, 21 September 2014
తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టు సంఘం నాయకుడు దేవులపల్లి అమర్ గారి పాత్ర ఉందా?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment