1

1

Sunday 21 September 2014

తెలంగాణ‌లో కొత్త‌గా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీల‌కు విజ్ఞ‌ప్తి....

May 17, 2014 


మీ నియోజ‌క‌వ‌ర్గాల్లో చెరువులు, కుంట‌ల్లో పూడిక తీత‌కు ఈ 15 రోజులు వెచ్చించండి..
మీ ఎన్నిక‌ల ఖ‌ర్చులో 5 శాతం వెచ్చిస్తే స‌రిపోతుంది...
వ‌చ్చే వేస‌విలో స‌మ‌స్య ఉండ‌దు...
జూన్ రెండోవారంలో రుతుప‌వ‌నాలు రాష్ట్రాన్ని తాకుతాయి..
నీటి సంర‌క్ష‌ణ‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి...
చెక్ డ్యాంల‌ను నిర్మించండి.. ఇంకుడు గుంత‌ల‌ను త‌వ్వండి....
భూగ‌ర్భ జ‌లాల‌ను పెంచండి...

ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన మీ అంద‌రికీ శుభాకాంక్ష‌లు.... తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధికి మీరు శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేయాలి... మీపై కీల‌క బాధ్య‌త ఉంది... అవినీతికి దూరంగా, ఆశ్రిత ప‌క్ష‌పాతానికి దూరంగా ఉండాలి...

తెలంగాణ‌లో సాగు, తాగునీటికి కొంచెం ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఉన్నాయి.. ప్రాజెక్టులు పూర్తికావ‌డానికి టైం ప‌ట్టొచ్చు.. ఈ నేప‌థ్యంలో కీల‌క‌మైన చిన్న నీటి వ‌న‌రుల‌ను మీరు పున‌రుద్ధ‌రించాలి.. చెరువులు, కుంట‌లు పూడిక‌తో నిండిపోయాయి.. ఈ నేప‌థ్యంలో మీరు ఈ 15 రోజులు ఈ నీటి వ‌న‌రుల ప‌నుల‌ను చేప‌డితే వ‌చ్చే వేస‌వి కాలంలో ఇబ్బంది ఉండ‌దు... మీ ఎన్నిక‌ల ఖ‌ర్చులో 5 శాతం వెచ్చిస్తే స‌రిపోతుంది చెరువులు, కుంటల్లో పూడిక తీత పూర్తి అవుతుంది.... పొక్లెయిన్‌తో ప‌నులు చేయిస్తే చ‌క‌చ‌క పూర్తి అవుతాయి...
మ‌రో కీల‌కమైన ప‌ని కూడా చేయాలి... చెక్ డ్యాంల‌ను నిర్మించాలి.... తెలంగాణ వ్యాస్తంగా ఇంకుడు గుంత‌ల‌ను ఎక్కువ సంఖ్య‌లో త‌వ్వాలి..
ప్ర‌తీ వ‌ర్ష‌పు బొట్టును సంర‌క్షించుకోవాలి... భూగ‌ర్భ జ‌ల మ‌ట్టాలు పైకి వ‌చ్చేలా చూడాలి... ఈ 15 రోజుల‌పాటు ఖాళీగా ఉండ‌కూడ‌దు..
చెట్ల పెంప‌కానికి ప్రాధాన్యం ఇవ్వాలి... ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు పెద్ద‌పీట వేయాలి... బంగారు తెలంగాణ‌, హ‌రిత తెలంగాణ‌, సుఖ‌సంతోషాల తెలంగాణ మ‌న ల‌క్ష్యం కావాలి....
ప్ర‌భుత్వం ఏర్పాటు అయ్యే నాటికి నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ ప‌నులు పూర్తి చేయండి... ప‌ద‌వులు వ‌చ్చినా సామాన్యుల మాదిరిగానే వ్య‌వ‌హ‌రించాల‌ని విజ్ఞ‌ప్తి...
తెలంగాణ స‌మాజానికి మీపై చాలా ఆశ‌లు ఉన్నాయి.. అవి వ‌మ్ము కావొద్దు.. అలా జ‌రిగితే మ‌న పోరాటం వృథా....

జై తెలంగాణ‌... జై జై తెలంగాణ‌...

No comments:

Post a Comment