1

1

Thursday, 18 September 2014

ఈ వార్త నిజ‌మేనా...!

ఈ వార్త నిజ‌మేనా...!

ఎల్ అండ్ టీకి కేసీఆర్ ఘాటైన జ‌వాబు ఇచ్చిన‌ట్లుగా ఈ రోజు వార్త ప‌త్రిక‌లో న్యూస్ వ‌చ్చింది... మీరు కొన్ని ప‌త్రిక‌ల‌కు లీకులు ఇచ్చి ప్ర‌భుత్వంపై ఒత్తిడి పెంచుదామ‌నుకుంటే బెద‌ర‌బోమ‌న్న‌ట్లుగా ఆయ‌న అన్న‌ట్లు క‌థ‌నం వ‌చ్చింది... ప్రాజెక్టు నుంచి వైదొల‌గితే స్వాగ‌తిస్తామ‌ని గాడ్గిల్‌కు తేల్చిచెప్పిన‌ట్లు స‌మాచారం... దీంతో కంగుతిన్న గాడ్గిల్ వెనువెంట‌నే ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎన్వీఎస్ఎస్ రెడ్డితో స‌మావేశ‌మై స‌ర్కారును శాంతింపజేసే ప్ర‌య‌త్నం చేసిన‌ట్లు ఈ క‌థ‌నంలో ఉంది.. మెట్రోను నిర్వ‌హించుకునే స‌త్తా ప్ర‌భుత్వానికి ఉంద‌ని, అవ‌స‌ర‌మైతే మెట్రో సృష్టిక‌ర్త శ్రీ‌ధ‌ర‌న్‌తో స‌మావేశ‌మై ఆయ‌న నేతృత్వంలో ప్రాజెక్టును పూర్తి చేయాల‌న్న వ్యాఖ్య‌లు కూడా సీఎం చేసిన‌ట్లు ఈ క‌థ‌నంలో రాశారు...

ఒక‌వేళ ఈ వార్త‌ నిజ‌మైతే...కార్పొరేట్ మీడియా, కార్పొరేట్ ఎల్ అండ్ టీకి గ‌ట్టి షాకే..... ఒక‌వేళ హైద‌రాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టులో శ్రీ‌ధ‌ర‌న్ పాలుపంచుకునేలా చేయ‌డంలో టీఆర్ఎస్ ప్ర‌భుత్వం విజ‌య‌వంత‌మైతే అది నిజంగా గొప్ప విష‌య‌మే అవుతుంది.. అనుభ‌వ‌జ్ఞుడు, నిజాయ‌తీప‌రుడైన ఆయ‌న ప‌ర్య‌వేక్ష‌ణ ఉంటే హైద‌రాబాద్ మెట్రో కూడా ఢిల్లీ మాదిరిగా విజ‌య‌వంతం అవుతుంద‌ని నేను బ‌లంగా న‌మ్ముతున్నా... !!

1 comment:

  1. ఈ వార్త నిజమైతే కార్పొరేట్ సక్తులకు తలొగ్గని సీ.ఎం ల జాబితాలో మరో మొనగాడు వచ్చినట్లే.

    ReplyDelete