అమెరికాలో మహాత్మాగాంధీని స్మరించుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. దేశ స్వాతంత్ర్య పోరాటంలో మహాత్ముడి భూమిక అద్వితీయమని కొనియాడారు... ముఖ్యంగా మహాత్ముడి ప్రేరణతో స్వచ్ఛ్ భారత్ కలను సాకారం చేసుకోవాలని పిలుపునిచ్చాడు... గంగా నది ప్రక్షాళనలో ఎన్నారైలు పాలుపంచుకోవాలని విజ్ఞప్తి చేశారు... అభివృద్ధి అంటే ప్రభుత్వాలు ఆసుపత్రులు కట్టించడం, పాఠశాలలు కట్టించడం మాత్రమే కాదని... అభివృద్ధి లో ప్రజలను భాగస్వాములను చేయడమే తన లక్ష్యమన్నారు... స్వాతంత్ర్యోద్యమాన్ని మహాత్ముడు ఎలాగైతే జన ఆందోళనగా మార్చారో.. అలాగే అభివృద్ధిని కూడా జన ఆందోళనగా మలచడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.. పాత ప్రభుత్వం మేం చాలా చట్టాలు చేశామని చెప్పుకుందని... అయితే పనికి రాని చట్టాలను తొలగించే పనిలో తాను ఉన్నట్లు తేల్చిచెప్పారు.. దేశంలో 40 శాతం మందికి బ్యాంకు ఖాతాలు లేవని.. జన్ ధన్ యోజన వల్ల 4 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు వచ్చాయని.. రూ.1500 కోట్ల సొమ్మును వాళ్లు ఖాతాలో జమ చేసినట్లు వివరించారు.. దేశంలో ఇళ్లు లేని వాళ్లకు సొంతిళ్లు కలను నెరవేర్చడమే లక్ష్యమన్నారు...
ఎన్నారైలకు పలు వరాలు కూడా ప్రకటించారు... ఎన్నారైలు కలలు గనే భారత్‌ను నిర్మించడమే తన కర్తవ్యమన్నారు.. అందరం కలిసి భారత మాత సేవ చేయాలన్నారు.. మన మాతృగడ్డ కోసం చేతనంత చేయాలని పిలుపునిచ్చారు... 125 కోట్ల మంది ప్రజలు దేశం తలదించుకునే పని ఎప్పుడూ చేయొద్దని విజ్ఞప్తి చేశారు...
No comments:
Post a Comment