* గ్రామీణ పాత్రికేయులకు మీడియా యాజమాన్యాలు జీతాలు ఇవ్వనప్పుడు... నో మార్కండేయ కట్జూ...!
* మీడియాకు చెల్లింపు వార్తల రోగం వచ్చినప్పుడు నో కుల్దీప్ నయ్యర్, నో రాజ్‌దీప్ సర్దేశాయి...!
* నీరా రాడియాతో బర్కా దత్తా, వీర్ సంఘ్విలు రాజకీయ పైరవీలు చేస్తున్నప్పుడు నో వినోద్ మెహతా, నో అర్నాబ్ గోస్వామి..!
* జర్నలిస్టులకు అమలు చేయాల్సిన మజిథియా వేతన సంఘం సిఫార్సులను యాజమాన్యాలు తొక్కిపెట్టినప్పుడు నో ప్రకాశ్ జవదేకర్.....!
* టీవీ ఛానెళ్ల నుంచి వందల మంది జర్నలిస్టులను అన్యాయంగా తొలగిస్తున్నప్పుడు నో కిషన్‌రెడ్డి,
* తెలంగాణ ఉద్యమం సమయంలో ఆంధ్రా మీడియా నిరంకుశంగా మారినప్పుడు నో వెంకయ్యనాయుడు...
* సెన్సేషన్, టీఆర్పీ రేటింగ్‌ల కోసం మీడియా యాజమాన్యాలు దారితప్పినప్పుడూ ఏ గొంతూ ప్రశ్నించలేదు..
కానీ, ఈ రోజు రెండు ఛానెళ్ల ప్రసారాలు నిలిచిపోతే వీళ్లంతా గగ్గోలు పెడుతున్నారు.. నియమ, నిబంధనలను గుర్తుచేస్తున్నారు.. గొంతు చించుకు అరుస్తున్నారు.. హూంకరిస్తున్నారు.. హెచ్చరిస్తున్నారు... బెదిరిస్తున్నారు.. భయపెడుతున్నారు... ప్రజాస్వామ్యానికి చీకటి రోజంటున్నారు...
మరి నిజంగా ఈ మేధావులందరూ జర్నలిజం బతికుండాలి, జర్నలిస్టులు బాగుండాలని ఆశించే వారే అయితే తెలంగాణలో జర్నలిజం అంపశయ్యపై ఉన్న దశలో వీళ్ల గొంతులు ఎందుకు మూగబోయాయి... పాత్రికేయులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా ఎందుకు నిలబడలేదు.... ? అప్పుడు నియమ, నిబంధనలు గుర్తుకురాలేదా? ఇదేం పెద్దరికం.. మీరేం పెద్ద మనుషులు....!!!
మీడియా యాజమాన్యాలు దారితప్పిన ప్రతీసారి మీరు వహించిన మౌనమే ప్రజాస్వామ్యానికి నిజమైన చీకటి రోజు..!! అలాంటి చీకటి రోజులు ఎన్నో ఉన్నాయి...!!!
thanks for post....the truth....
ReplyDelete