1

1

Tuesday 30 June 2015

స్మితా స‌బ‌ర్వాల్ ఔట్‌లుక్‌కు నోటీసులు ఇవ్వ‌డ‌మూ ప‌త్రిక స్వేచ్ఛ‌కు భంగం అంటారేమో...

ఔట్‌లుక్‌కు స్మితా స‌బ‌ర్వాల్ గారు లీగ‌ల్ నోటీసు ఇవ్వ‌డం జ‌ర్న‌లిస్టుల హ‌క్కుల‌ను, ప‌త్రికా స్వేచ్ఛ‌ను హ‌రించ‌డ‌మే అని అంటాడేమో ఆర్కే గారు..
దీనిపై జాతీయ స్థాయి ఉద్య‌మం చేయిస్తాడేమో.. ఇలాంటి క‌థ‌నాలు రాయ‌డం, ఇలాంటి జుగుప్సక‌ర కార్టూన్లు వేయించ‌డం మా హ‌క్కు అని వాదించినా వాదిస్తాడు.. !!

సంఘ‌టితంగా ఈ కుట్ర‌ల‌ను తిప్పికొట్టాలి..

టార్గెట్ కేసీఆర్‌... గురి కుద‌ర‌క‌పోతే ఆయ‌న చుట్టూ ఉన్న అధికారుల‌ను టార్గెట్ చేయాలి... మాన‌సికంగా దెబ్బ‌తీయాలి... తెలంగాణ స‌మాజాన్ని బ‌ల‌హీన ప‌ర‌చాలి.. ఇదే జ‌రుగుతున్న కుట్ర‌.. సంఘ‌టితంగా ఈ కుట్ర‌ల‌ను తిప్పికొట్టాలి.. మ‌న ఐక్య‌తే మ‌న‌కు శ్రీ‌రామ‌ర‌క్ష‌.. !!

త‌క్కువ రోజుల్లో బెయిల్ మీద బ‌య‌ట‌కొస్తే అంత గొప్పోడిగా చెప్పుకుంటారన్న మాట‌..!!

ఇది సంగ‌తీ..
అరే జ‌గ‌న్ జైల్లో ప‌డితే ఏడాది దాకా బెయిలే రాలేదు... మా నాయ‌కుడిని చూశారా నెల రోజుల్లోనే బెయిల్ తెచ్చుకున్నాడు.. ఇది మా గొప్ప‌త‌నం.. రానున్న రోజుల్లో ఎంత త‌క్కువ రోజుల్లో బెయిల్ మీద బ‌య‌ట‌కొస్తే అంత గొప్పోడిగా చెప్పుకుంటారన్న మాట‌..!!

అస‌లు ప్ర‌భుత్వాన్ని మొత్తాన్ని వాళ్ల‌కే అప్ప‌గిస్తే స‌రిపోతుందేమో..

జీహెచ్ఎంసీ ఆస్తిప‌న్ను వ‌సూలు చేస్తే క‌న్నెర్ర జేస్తుంది.. సోమేష్ కుమార్‌కు అక్షింత‌లు వేస్తుంది
తెలంగాణ ప్ర‌భుత్వం సిస‌లైన తెలంగాణ బిడ్డ‌ల‌కు మాత్ర‌మే బోధ‌న రుసుంలు వ‌ర్తింప‌జేయాల‌ని ఫాస్టు ప‌థ‌కం చేస్తే ఒప్పుకోదు..
నెంబ‌ర్ ప్లేట్ల విష‌యంలోనూ స‌హించ‌బోదు..
నిందితుడికి బెయిల్ ఇస్తే కేసుకు న‌ష్ట‌మంటే సంతృప్తి చెంద‌దు..
అస‌లు ప్ర‌భుత్వాన్ని మొత్తాన్ని వాళ్ల‌కే అప్ప‌గిస్తే స‌రిపోతుందేమో..

తెలంగాణ కేబుల్ ఆప‌రేట‌ర్ల‌కు శ‌త కోటి వంద‌నాలు..

మ‌న కేబుల్ ఆప‌రేట‌ర్ల‌కు నిజంగా కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకోవాల్సిందే క‌దా... లేక‌పోతే ఈ రోజు ఏబీఎన్‌, టీవీ9 ఛానెళ్లు చూసి ఎంత మంది అమాయ‌కులు ప్రాణాలు తీసుకునే వారో ఏమో.. నిజంగా తెలంగాణ మ‌నోధైర్యాన్ని దెబ్బ‌తీసే ఈ ఛానెళ్ల‌కు గుణ‌పాఠం చెప్పిన కేబుల్ ఆప‌రేట‌ర్ల‌కు ఎప్పుడూ రుణ‌ప‌డి ఉండాల్సిందే...

రేపో మాపో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో రేవంతుడు...

రేపో మాపో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో రేవంతుడు...
అప్ప‌ట్లో ఇలాగే అరెస్ట‌యిన తారా చౌద‌రిని కూడా పుణ్యాత్మురాలిగా చూపించాడు క‌దా.. ఇప్పుడు రేవంతుడిని ఇమేజ్‌ను పెంచ‌డానికి రేపో మాపో ఓపెన్ హార్ట్ అని పెట్ట‌డం ఖాయం.. కేబుల్ ఆప‌రేట‌ర్ల పుణ్య‌మా అని మ‌నం ఆ నేరాన్ని చూడ‌కుండా త‌ప్పించుకోగ‌లుగుతున్నాం..

ఇదే క‌దా మ‌ర్మం.. !!

మీరు ముగ్గురూ వెళ్లండి వెళ్లి ఒక్క ఎమ్మెల్యేని కాదు మొత్తం ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేయండి... మీకు మా అండ ఎప్పుడూ ఉంటుంది... ఈసారి జాగ్ర‌త్త‌గా డీల్ చేసుకోండి.. వీలైతే ఆంధ్రా భూ భాగం నుంచి లావాదేవీలు న‌డిపించండి.. ఆంధ్రాకు ర‌ప్పించుకొని సొమ్ములు ఇచ్చుకోండి.. ఇదే క‌దా మ‌ర్మం.. !!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కోర్టులో తెలంగాణ హైకోర్టు అంశం ఉంద‌ట‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కోర్టులో తెలంగాణ హైకోర్టు అంశం ఉంద‌ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి స‌దానంద గౌడ అంటున్నాడు... మ‌రి ఆంధ్ర‌ప్ర‌దేశ్ కోర్టులో ఉంటే తెలంగాణ‌కు న్యాయం జ‌రుగుతుందా? ఈ విష‌యంలో మాత్రం కేంద్రం ఎందుకు స్పందించ‌దు? చంద్ర‌బాబునాయుడు సెక్ష‌న్ 8 అన‌డంతోనే గ‌వ‌ర్న‌ర్‌ను పిలిపించి మాట్లాడ‌టం చేస్తున్న కేంద్ర పెద్ద‌లు... హైకోర్టు విష‌యంలోనూ స్పందించ‌డానికి అభ్యంత‌రాలు ఏంటో? మ‌రి ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కొద్ది రోజుల్లో హైకోర్టు వ‌స్తుంద‌ని ఎందుకు ప్ర‌చారం చేశారు...?http://timesofindia.indiatimes.com/city/hyderabad/Separate-Telangana-HC-issue-in-AP-court/articleshow/47872017.cms

బాధితులపై కేసు.. నిందితుల‌కు బెయిల్..

మ‌త్త‌య్య‌కు ర‌క్ష‌ణ‌, సండ్ర‌కు ర‌క్ష‌ణ‌, రేవంతుడికి ర‌క్ష‌ణ‌.. అంద‌రినీ ర‌క్షించే వ్య‌వ‌స్థ అది... చివ‌ర‌కు స్టీఫెన్ స‌న్‌ను నేర‌స్థుడిని చేస్తుందేమో.!!
మంచి సినిమా తీయొచ్చు..!!

ఆశల ప‌ల్ల‌కీలో జేపీ, శ‌శిధ‌ర్‌రెడ్డి..

స‌న‌త్ న‌గ‌ర్ సీటు మీద శ‌శిధ‌ర్‌రెడ్డి... కూక‌ట్‌ప‌ల్లి సీటు కోసం జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ తీవ్రంగా క‌ష్ట‌ప‌డుతున్నారు.. ఎట్లైనా స‌రే పార్టీ మారిన‌ ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేయించి ఎన్నిక‌లు జ‌రిపించి పోటీలో నిలిచి గెల‌వాల‌ని తెగ ఆరాట‌ప‌డుతున్నారు.. మీరు వీరి కోరిక తీరుతుందా?

కోర్టు కోర్టుకు, బెంచ్ బెంచ్‌కు మారుతున్న తీర్పులు..

ఒక ధ‌ర్మాసనంలో నేరస్తుడిగా మ‌రో ధ‌ర్మాస‌నానికి వెళితే నిర్దోషిగా బ‌య‌ట‌ప‌డిన ఉదంతాలు ఎన్నో.. ఎన్నెన్నో.. ఇంకా ఏం న‌మ్ముతాం ఈ న్యాయ వ్య‌వ‌స్థ‌ను.. నిర్దోషిని దోషిగా ప్ర‌క‌టించిన న్యాయ‌మూర్తిని శిక్షిస్తారా?

Thursday 25 June 2015

ఆంధ్రాలో తెలంగాణ వారికి ర‌క్ష‌ణ లేదు...


తెలంగాణ నిర్మాత‌ దిల్ రాజు బృందంపై శ్రీ‌కాకుళంలో కోడిగుడ్ల‌తో దాడి చేశారు..
ఉత్త‌రాంధ్ర యాస‌ను కేరింత సినిమాలో అవ‌హేళ‌న చేసేలా వాడార‌ని విద్యార్థి జేఏసీ ఆరోపించింది.. తెలంగాణ యాస‌ను కించ‌ప‌రిచేలా సినిమా తీశార‌ని ఓ ఆంధ్రా నిర్మాత‌పై హైద‌రాబాద్‌లోనో క‌రీంన‌గ‌ర్‌లోనో చేసి ఉంటే తాటికాయంత అక్ష‌రాల‌తో మొద‌టి పేజీలో వేసేవే క‌దా ఆంధ్రా ప‌త్రిక‌లు... ఇదే సాకుతో సెక్ష‌న్ 8ను ప‌టిష్టంగా అమ‌లు చేయాల‌ని కూడా డిమాండ్ చేసేవే క‌దా.. మ‌రి ఆంధ్రాలోనూ తెలంగాణ వారికి ర‌క్ష‌ణ లేదు క‌దా.. ఆంధ్రా మొత్తం సెక్ష‌న్ 8 అమ‌లు చేయాలా? వ‌ద్దా?

అక్క‌డ ఉన్న‌ది మీ ప్ర‌జ‌లు కాదా?

ఎర్ర‌చంద‌నం కేసులో త‌మిళ‌నాడు పౌరుల‌ను కాల్చిచంపినందుకు నిర‌స‌న‌గా చెన్నైలో ఆంధ్రోళ్ల‌పై దాడులు జ‌రిగిన‌ప్పుడు కనీసం మా వాళ్ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌మ‌ని కేంద్రాన్ని ఎందుకు కోర‌లేదు చంద్ర‌బాబు నాయుడు గారూ...!!
అక్క‌డ ఉన్న‌ది మీ ప్ర‌జ‌లు కాదా? దాడులు జ‌రిగింది మీ బ‌స్సుల‌పైనే క‌దా... మ‌రి కేంద్రం స‌హాయం కోర‌లేదు ఎందుకు? సెక్ష‌న్ 8 త‌ర‌హా చ‌ట్టాల‌ను చెన్నైలో చేయాల‌ని డిమాండ్ చేయ‌లేదు ఎందుకు?
ఒక‌వేళ చెన్నైలో మీపై ఏదైనా ఏసీబీ కేసు న‌మోదైతే చేసేవారేమో క‌దా...!!

వివాదాల్లో బీజేపీ మ‌హిళా నేత‌లు...

బీజేపీలోని మ‌హిళా నేత‌ల‌పై అవినీతి ఆరోప‌ణ‌లు, అక్ర‌మాల ఆరోప‌ణ‌లు ఒక్క‌సారిగా చుట్టుముట్టాయి.. ఇదంతా కాక‌తాళీయంగా జ‌రిగిందో లేక ఎవ‌రైనా బీజేపీలోని పురుష నేత‌లు వీరంద‌రినీ ఇరికిస్తున్నారో అర్థం కావ‌డం లేదు... విద్యార్హ‌త‌ల విష‌యంలో త‌ప్పుడు స‌మాచారాన్ని ఇచ్చిన కేసులో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, ఇక ల‌లిత్ మోడీకి స‌హ‌క‌రించిన కేసులో కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌, రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి వ‌సుంధ‌ర రాజే, ఇక రూ.206 కోట్ల‌ ప‌ల్లీ చిక్కిల కుంభ‌కోణంలో మ‌హారాష్ట్ర మంత్రి పంక‌జా ముండేలు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు.. మ‌రి వీళ్లంతా స‌చ్చీలురుగా బ‌య‌ట‌కు వ‌స్తారో లేక ఇరుక్కుపోతారో కాల‌మే స‌మాధానం చెబుతుంది.. ఏది ఏమైనా అవినీతి, అక్ర‌మాల కేసులో పురుషుల‌కు తీసిపోమ‌ని నిరూపిస్తున్న‌ట్లు ఉన్నారు వీరంతా..!!

ఆంధ్రా పార్టీలకు అవ‌కాశం ఇచ్చే ప్ర‌స‌క్తే లేదు..!!

ప‌దేళ్ల‌పాటు తెలంగాణ‌లో స్వీయ రాజ‌కీయ పార్టీలే ఉండాల‌న్న విష‌యం మ‌రోమారు నిరూపితం అవుతోంది... కృష్ణా జలాల వివాదం, విద్యుత్ సమ‌స్య‌లు, ఉద్యోగుల విభ‌జ‌న‌, సెక్ష‌న్ 8 ఇంకా అనే అంశాల్లో ఆంధ్రాతో చిక్కు ముళ్లు కొన‌సాగుతూనే ఉన్నాయి.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికైనా తెలంగాణ‌లో మ‌రిన్ని ఇంటి పార్టీలు రావాల్సిన అవ‌స‌రం ఉంది... లేనిప‌క్షంలో ఇష్టం ఉన్నా లేక‌పోయినా ఉన్న పార్టీకే ప‌ట్టం క‌ట్ట‌డం ఖాయం... ఆంధ్రా పార్టీలకు అవ‌కాశం ఇచ్చే ప్ర‌స‌క్తే లేదు..!!

Tuesday 23 June 2015

సెక్ష‌న్ 8పై పోరాటంలో భాగ‌స్వాముల‌వుతారా?

మొన్న‌ హైద‌రాబాద్ లో నిర్వ‌హించిన‌ స్వ‌చ్ఛ భార‌త్‌లో మాకు భాగ‌స్వామ్యం క‌ల్పించ‌డం లేదు అంటూ కిష‌న్ రెడ్డి అండ్ కో తెగ ఆందోళన చేసింది...
సెక్ర‌టేరియ‌ట్‌లో ధ‌ర్నా చేసింది... మోడీ ప్రారంభించిన స్వ‌చ్ఛ భార‌త్ క్రెడిట్‌ను కేసీఆర్ కొట్టేయాల‌ని చూస్తున్నాడ‌ని ఆరోప‌ణ‌లు చేసింది...
అయ్యా కిష‌న్‌రెడ్డి గారూ... మ‌రి సెక్ష‌న్ 8పై పోరాటానికి తెలంగాణ స‌మాజం స‌న్న‌ద్ధం అవుతుంది.. మీరు భాగ‌స్వాముల‌వుతారా?  సెలెంట్‌గా ఉంటారా?

ల‌లిత మోడీకి మీరు అందించిన స‌హ‌కారం మీరు సాధించిన విజయాల్లో ఒక‌టి క‌దా..

మా భార‌త దేశంలో ఉద్యోగులు స‌మయానికి వ‌చ్చేవారు కాదు.. కానీ నేను వ‌చ్చిన త‌ర్వాత ఉద్యోగులంతా స‌మ‌యానికి వ‌స్తున్నారు.. అంటూ ప్ర‌పంచ వేదిక‌ల‌పై గ‌ర్వంగా చెప్పుకున్న ప్ర‌ధాని మోడీ గారు.... సుష్మా స్వరాజ్ ఉదంతాన్ని కూడా ప్ర‌పంచ వేదిక‌ల్లో ఘ‌నంగా చెప్పుకుంటే బాగుంటుంది... పేరు మోసిన నిందితుడు ల‌లిత్ మోడీకి మాన‌వ‌తా దృక్ప‌థంతో స‌హ‌కారం అందించిన ఘ‌న‌త కూడా మా ప్ర‌భుత్వానిదే అని చెప్పుకుంటే బాగుంటుందేమో...!!
మీరు ఈ ఏడాది సాధించిన ఘ‌న విజ‌యాల్లో ల‌లిత్ మోడీకి మీ ప్ర‌భుత్వం అందించిన స‌హ‌కారాన్ని చేర్చండి....

మీరు ఇవ‌న్నీ చేస్తామ‌ని లిఖిత‌పూర్వ‌కంగా రాసి ఇస్తే బీజేపీ ప్ర‌భుత్వం సెక్ష‌న్ 8 ఊసు ఎత్తనే ఎత్త‌దు...

తెలంగాణ పోలీసుల‌కు, ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి...
************
మీరు ఇవ‌న్నీ చేస్తామ‌ని లిఖిత‌పూర్వ‌కంగా రాసి ఇస్తే బీజేపీ ప్ర‌భుత్వం సెక్ష‌న్ 8 ఊసు ఎత్తనే ఎత్త‌దు... 
***************
హైద‌రాబాద్‌లో చంద్ర‌బాబునాయుడు ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేస్తే సెలెంట్‌గా ఉంటాం..
ఓటుకు నోటు కేసును మూసేస్తాం...
చంద్ర‌బాబు నాయుడు నుంచి తెలంగాణ ఎమ్మెల్యేల‌కు డ‌బ్బు ఆఫ‌ర్ వ‌చ్చింద‌ని ఫిర్యాదులు వ‌చ్చినా ప‌ట్టించుకోం..
చంద్ర‌బాబునాయుడు అక్ర‌మంగా ఇల్లు క‌ట్టుకుంటే క‌ల్లు మూసుకుని కూర్చుంటాం...
హైద‌రాబాద్‌లో ఆంధ్రా నేత‌లు అవినీతికి పాల్ప‌డినా చూసిచూడ‌న‌ట్లు వ‌దిలేస్తాం..
హైద‌రాబాద్‌లో ప‌చ్చ పార్టీ రౌడీలు హ‌త్య‌లు చేసినా ప‌ట్టించుకోం..
హైద‌రాబాద్‌లో అక్ర‌మ క‌ట్ట‌డాలు క‌ట్టిన వారి జోలికి(ముఖ్యంగా సీమాంధ్ర పెద్ద‌ల‌) పోనేపోం..

ఇది సంగ‌తి....

హైద‌రాబాద్‌లో చంద్ర‌బాబునాయుడు కాలికి ముల్లు గుచ్చుకుంటే త‌న పంటితో తీస్తున్న బీజేపీ

సుష్మ‌కు సొంత పార్టీలోనే వ్య‌తిరేకులు..

తెలంగాణ చిన్న‌మ్మ సుష్మా స్వ‌రాజ్‌కు బ‌య‌ట శ‌తృవుల క‌న్నా పార్టీలోని వ్య‌తిరేకులే ఎక్కువ న‌ష్టం చేకూరుస్తున్నారు.. అప్ప‌ట్లో గాలి జ‌నార్ద‌న్ రెడ్డికి ఆమె అండ‌దండ‌లు ఉన్నాయ‌ని పార్టీలోని సీనియ‌రే మీడియాకు లీకులు ఇవ్వ‌డం, ఇప్పుడు ల‌లిత్ మోడీ విష‌యంలోనూ సీనియ‌ర్ నేతే మీడియాకు స‌మాచారం ఇవ్వ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌నంగా క‌నిపిస్తుంది.. ఏది ఏమైనా ల‌లిత్ మోడీ, గాలి బ్ర‌ద‌ర్స్ లాంటి వారికి స‌హ‌క‌రించ‌డం కూడా సుష్మ స్వ‌రాజ్ చేసిన త‌ప్పే...

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో గెలిపిస్తే హైకోర్టు వ‌స్తుంద‌న్నారు.. మ‌రి వ‌చ్చిందా?

రంగారెడ్డి ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థిని గెలిపిస్తే తెలంగాణ‌కు ప్ర‌త్యేక హైకోర్టు వ‌స్తుంద‌ని తెగ ఊద‌ర‌గొట్టి ప్ర‌చారం చేశారు... కేంద్ర మంత్రిని ర‌ప్పించి ప్ర‌చారం చేయించారు... మ‌రి ప్ర‌త్యేక హైకోర్టు రాక‌పోగా సెక్ష‌న్ 8ని మాత్రం తెలంగాణ నెత్తిన బీజేపీ వాళ్లు బాగా రుద్దుతున్నారు..
ప‌క్కోడు ఎప్పుడైనా ముంచెటోడే త‌ప్ప తేల్చెటోడు కాద‌ని మ‌రోమారు నిరూపితం అయింది.. తెలంగాణ‌కు స్వీయ రాజ‌కీయ అస్థిత్వాలు మ‌రిన్ని రావాలి... త‌మిళ‌నాడు త‌ర‌హా పార్టీలు రావాల్సిందే.. భూమి పుత్రుల హ‌క్కుల‌ను కాపాడాల్సిందే...!!

రేపు బీజేపీ మాట్లాడే తీరు ఇదే..

సెక్ష‌న్ 8ని అమ‌లు పాపం మాది కాదు.. విభ‌జ‌న బిల్లును రూపొందించిన‌ కాంగ్రెస్ దే...: తెలంగాణ బీజేపీ 
ఇది మా ఘ‌న‌తే..: ఆంధ్రా బీజేపీ మాట‌...
మొన్న పోల‌వ‌రం ముంపు మండ‌లాలు ఆంధ్రాలో క‌ల‌ప‌డం మా ఘ‌న‌తే అని ఆంధ్రా బీజేపీ వాళ్లు అంటే.. ఆ పాపం కాంగ్రెస్ దే అని కిష‌న్‌రెడ్డి అన్నాడు...
****************
విభ‌జ‌న బిల్లులో లోపాల‌ను మొన్న స‌రిచేశారు క‌దా... మ‌రి సెక్ష‌న్ 8 అన్యాయ‌మ‌ని పార్ల‌మెంట్‌లో వాదించిన బీజేపీ మొన‌గాళ్లు దాన్ని కూడా స‌రిచేయొచ్చు క‌దా.. చేయ‌రు.. ఎందుకంటే వారి అధినాయ‌క‌త్వం చంద్ర‌బాబునాయుడు క‌దా... ఇంకేం చేస్తారు...

ఇదేనా విశాల హృద‌యం... ఇది సంకుచిత మ‌న‌స్త‌త్వం కాదా?

యోగా దినోత్స‌వాన్ని ప్ర‌పంచ దేశాలు పాటిస్తున్నాయ‌ని గొప్ప‌లు చెప్పుకుంటున్నారు స‌రే... మ‌రి ప్రేమికుల దినోత్స‌వం అన్న ఇంకేదైనా దినోత్స‌వం అంటే చాలు ఇవి మ‌న సంస్కృతి కాదు మ‌న‌ది కాదు అంటూ రెచ్చిపోతారే... మ‌రి వాళ్ల‌ది కాని యోగాను ప్ర‌పంచ దేశాలు స్వాగ‌తించి పాటిస్తుంటే మ‌న‌ది కాని దినోత్స‌వాల‌ను మ‌న వాళ్లు జ‌రుపుకుంటే మీరు స‌హించ‌రేం? ఇదేనా విశాల హృద‌యం... ఇది సంకుచిత మ‌న‌స్త‌త్వం కాదా?

సిట్ ను ప్ర‌.ద‌.బృ.(ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం) అని రాయ‌డం లేదు ఎందుకు?

ఓటుకు నోటు కేసులో అ.ని.శా. అని రాస్తున్న ఈనాడు వాడు... ఆంధ్ర‌ప్ర‌దేశ్ వేసిన సిట్ ను ప్ర‌.ద‌.బృ.(ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం) అని రాయ‌డం లేదు ఎందుకు?
***************
ఇక తెలుగు వినియోగాన్ని అంత‌గా ప్రోత్స‌హించే రామోజీ గారు... రామోజీ ఫిల్మ్‌సిటీ అని ఎందుకు రాస్తున్నారు.. రామోజీ చిత్ర న‌గ‌రం అని రాయొచ్చు క‌దా... త‌న వాటి విష‌యంలో ఇవ‌న్నీ కుద‌ర‌వు గానీ ఇత‌రుల‌కు మాత్రం నీతులు చెప్ప‌చూస్తున్నాడెందుకు?

జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు, వరంగ‌ల్ ఎన్నిక‌ల్లో కీల‌కం కానున్న సెక్ష‌న్ 8...!!!

సెక్ష‌న్ 8ని అమ‌లు చేస్తే చేసేది ఏముంది.. బీజేపీ, టీడీపీల‌ను భూస్థాపితం చేయ‌డం త‌ప్ప‌...!! 
తెలంగాణ‌ను సంకెళ్ల‌లో బంధించాల‌నుకుంటే తెలంగాణ స‌మాజం మీ రాజ‌కీయ జీవితాల‌కు శాశ్వ‌త సంకెళ్లు వేస్తుంది.. త‌స్మాత్ జాగ్ర‌త్త‌...!!!
రానున్న జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు, వరంగ‌ల్ ఎన్నిక‌ల్లో కీల‌కం కానున్న సెక్ష‌న్ 8...!!!

ఆవేశం ఎక్కువ‌.. ఆలోచ‌న త‌క్కువ‌...

పాపం బీజేపీ వాళ్ల‌కు ముస్లిం నేత‌లంటే చాలా చుల‌క‌నేమో... స‌మ‌యం చిక్కితే చాలు ఉప రాష్ట్ర‌ప‌తి హ‌మీద్ అన్సారీపై విరుచుకుప‌డాల‌ని చూసి త‌ప్పులో కాళ్లేసి చివ‌ర‌కు లెంప‌లేసుకుంటారు... తాజాగా యోగా దినోత్స‌వం విష‌యంలోనూ బీజేపీ నేత రాంమాధ‌వ్ హ‌మీద్ అన్సారీపై విమ‌ర్శ‌లు చేయ‌డంతో ప్ర‌భుత్వం క్ష‌మాప‌ణ‌లు చెప్పింది.. ప్రొటోకాల్ ప్ర‌కారం తామే ఉప రాష్ట్ర‌ప‌తిని యోగా కార్య‌క్ర‌మానికి ఆహ్వానించ‌లేద‌ని వివ‌ర‌ణ ఇచ్చింది..
మొన్నా మ‌ధ్య స్వాతంత్ర దినోత్స‌వం రోజు హ‌మీద్ అన్సారీ జాతీయ ప‌తాకానికి సెల్యూట్ చేయ‌లేద‌ని రామ‌భ‌క్తులు చేసిన హ‌డావుడి త‌ర్వాత ప్రొటోకాల్ విష‌యం తెలిసి నాలుక క‌ర‌చుకున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే...

డొంక క‌దిలిండ‌ట‌...

ట్యాపింగ్ తీగ లాగితే డొంక క‌దిలింద‌ట‌... నిన్న రాత్రి ఈటీవీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ బులెటిన్‌లో వ‌చ్చిన క‌థ‌నం... ఏం లాగారు.. ఏం క‌దిలింది...
మ‌రి ఇక్క‌డ కూడా ఓట్ల‌కు కోట్ల కేసు తీగ లాగితే డొంకంతా క‌దిలింది అన్న‌ట్లు బులెటిన్‌లు ఎందుకు ఇవ్వ‌డం లేదు?

తెలంగాణ మీడియాను అణ‌చివేసే కుట్ర‌..

టీ న్యూస్‌కు నోటీసులు ఇవ్వ‌డం అంటే తెలంగాణ మీడియా సంస్థ‌ల‌ను అణ‌గ‌దొక్క‌డ‌మే ముఖ్య ల‌క్ష్యంగా క‌నిపిస్తుంది.. తెలంగాణ‌కు ఉన్న‌వే రెండు మూడు ఛానెళ్లు, ఒక‌టి రెండు పేప‌ర్లు.. వీటి అడ్డుతొల‌గించుకోవాల‌ని రాజ‌గురువు, రాధాకృష్ణ‌లు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు అర్థం అవుతోంది.. చంద్ర‌బాబు ప్ర‌తీ ఎత్తుగ‌డ వెన‌కాల వీరి హ‌స్త‌మే ఉంటుంది.. ఈ కుట్ర‌ను తిప్పికొట్టాలి..తెలంగాణ లో ఆంధ్రా మీడియాను భూస్థాపితం చేయ‌డం ద్వారా వారికి గుణ‌పాఠం చెప్పాలి.. తెలంగాణ సంఘ‌టిత శ‌క్తిని చాటాలి...

టేపులు ప్ర‌సారం చేయ‌డం నేర‌మా...

ఆంధ్రాలో ప్రసారాలు రాని టీ న్యూస్ కు నోటీసులు ఇవ్వ‌డం నిజంగా హాస్యాస్ప‌ద‌మే.. ఇక టేపులు ప్ర‌సారం చేయ‌డ‌మే నేర‌మైతే ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతికి ఎన్ని నోటీసులు ఇవ్వాలి.. అందులోనూ బూతు వీడియోలు త‌ప్ప ఇంకే వీడియోలు ప్ర‌సారం చేయ‌ని ఆ ఛానెల్‌పై అంత‌ర్జాతీయ నేరాలు మోపాలేమో... ఇక కుట్ర క‌థ‌నాల‌కు పెట్టింది పేరైన రామోజీ ప‌త్రిక‌, ఛానెళ్ల సంగ‌తి ఏం చేయాలి.. తెలంగాణ‌లో ఈ ఆంధ్రా ఛానెళ్లు, పేప‌ర్లు ఉన్నంత కాలం మ‌న ప్ర‌యోజ‌నాల‌కు విఘాత‌మే... ఇవి ఆంధ్రా నేత‌ల ప్ర‌యోజ‌నాల కోస‌మే కొట్లాడుతాయి... టీ న్యూస్‌కు ఆంధ్రాప్ర‌భుత్వం ఒక్క ప్ర‌క‌ట‌న ఇవ్వ‌దు క‌దా.. మ‌రి మ‌నం ఎందుకు ఆంధ్రా ఛానెల్‌కు ప్ర‌క‌ట‌న‌లు ఇస్తున్నాం... న‌మ‌స్తే తెలంగాణ‌కు ఆంధ్రా స‌ర్కారు ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ‌దు క‌దా.. మ‌రి మ‌నం ఈనాడుకు ఎందుకు ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చి వారిని ఆర్థికంగా ఎదిగేలా చేస్తున్నాం.. ఆత్మ విమ‌ర్శ చేసుకోవాలి... ఆంధ్రాలో మ‌న మీడియా అస్తిత్వాన్ని లేకుండా చేసిన వారికి, వారికి అండ‌గా ఉన్న రామోజీ, రాధాకృష్ణ ల‌కు గుణ‌పాఠం చెప్పాల్సిందే.. జై తెలంగాణ జై జై తెలంగాణ‌

Friday 19 June 2015

ఆంధ్రాలోనూ నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా ఉన్న ఇంట్లోనే ఉంటాడు..

ఇది నిన్న‌టి ముచ్చ‌టే...
తెలంగాణ‌లోనూ నిబంధ‌న‌ల విరుద్ధంగా ఇళ్లు క‌ట్టుకుంటాడు..
ఆంధ్రాలోనూ నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా ఉన్న ఇంట్లోనే ఉంటాడు..
ఇది బాబు గారి నైజామండీ...
***********
సార్ నిబంధ‌న‌లు ఉల్లంఘించి ఇళ్లు క‌ట్టుకుంటాడ‌ని, నిబంధ‌న‌ల ప్ర‌కారం లేని ఇళ్ల‌లోనే ఉండ‌టం సారుకు అచ్చివ‌చ్చే వాస్తు అని న‌మ్మిన ఆంధ్రా అధికారులు కూడా నిబంధ‌న‌ల ప్ర‌కారం లేని ఇంటినే ముఖ్య‌మంత్రి విడిది గృహంగా ఎంపిక చేశారు.. దీనిపై బాబు గారు కూడా అభ్యంత‌రాలు చెప్ప‌క‌పోవ‌డం మ‌రో విశేషం... ఆంధ్రాలో మీ ఇష్టం ఉన్న‌ట్లు ఉండండి కానీ తెలంగాణ‌లో మాత్రం నిబంధ‌న‌ల ప్ర‌కారమే న‌డుచుకోవాలి బాబు గారు.. ఎందుకంటే ఇది మా జాగీర్‌...!!

ఆంధ్రాలో ఘ‌ట‌న‌కు తెలంగాణ‌లో క‌థ‌నం అవ‌స‌రమా?


ఆంధ్రాలో మంత్రుల ప‌ర్య‌ట‌న‌ల కోసం లంచాలు తీసుకుంటూ ఓ అధికారిణి పోలీసుల‌కు ప‌ట్టుబ‌డింది... కానీ తెలంగాణ‌లో ఇంత వ‌ర‌కు అలాంటి ఉదంతం న‌మోదు కాలేదు.. అయితే ఆంధ్రా ఉదంతాన్ని ఆస‌రాగా చేసుకుని ఇక్క‌డ కూడా ప్ర‌జ‌ల సొమ్ముతో మంత్రుల‌కు మ‌ర్యాద‌లు చేస్తున్నార‌ని ఈనాడు వాడు క‌థ‌నం రాశాడు.. మ‌రి మ‌హారాష్ట్ర‌లో ఉదంతం జ‌రిగితే దాన్ని తెలంగాణ‌కు ఆపాదిస్తూ రాస్తాడా? ముందుగాల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌రిస్థితిపై క‌థ‌నం రాయాలి.. తెలంగాణ‌లో ప‌రిస్థితిపై క్షేత్ర‌స్థాయి ప‌రిశీల‌న చేయాలి.. ఒక‌వేళ నిజంగా వీళ్లు మంత్రుల ప‌ర్య‌ట‌న‌ల కోస‌మే కాసులు తింటున్నార‌ని నిరూపించే ఆధారాలుంటే క‌థ‌నాలు రాయాలి... ఒక్క అధికారి కూడా మంత్రుల ప‌ర్య‌ట‌న‌ల కోసం లంచాలు తీసుకుంటూ దొరికిన ఉదంత‌మే లేన‌ప్పుడు ఈనాడు వాడు ఎలా రూడీ చేసేస్తాడు...!!
రేపు తెలంగాణ‌లో ఏదైనా బియ్యం స‌ర‌ఫ‌రాలో అవినీతి జ‌రిగిదే.. ఆంధ్రాలోనూ అలాగే జ‌రుగుతుంద‌ని రాస్తుందా ఈనాడు?
కింది క‌థ‌నాల్లో ఒక‌టి ఆంధ్రాకు రాసింది. ఒక‌టి తెలంగాణ‌కు రాసింది...

జ‌నాల్ని ఏమార్చే రాత‌లు..

ఈనాడు ఆంధ్రా ఎడిష‌న్లో ఎంత మంచి అలంక‌ర‌ణ చేశారు.. ఫోన్ ట్యాపింగ్‌, సెక్ష‌న్ 8 అంటూ పేజీపైన ఇలా లోగో డిజైన్ చేశారు.. ఇది మొన్నటి ఎడిష‌న్లో చూశాను.. మ‌రి తెలంగాణ ఎడిష‌న్లో ఓటుకు నోటు కేసు అని లోగో ఏమైనా డిజైన్ చేసి వేశారా? అని వెతికితే క‌నిపించ‌లేదు... అంటే ఆంధ్ర ప్ర‌జ‌ల దృష్టి నుంచి ఓటుకు నోటును మ‌రిపించాల‌ని.. రామోజీ ప‌త్రిక ప‌డుతున్న తాప‌త్ర‌యం ఇది...

ఆ శ‌క్తుల్లో బాబు గారు ఉన్నారా?

బ‌హుషా ఢిల్లీ లో గ‌వ‌ర్న‌ర్ దూకుడు, హైద‌రాబాద్‌లోనూ గ‌వ‌ర్న‌ర్‌కు అధికారాలు క‌ట్ట‌బెట్టాలంటూ పొరుగు రాష్ట్రం ఎత్తుగ‌డ‌ల‌ను చూసి అద్వానీ నోట ఎమ‌ర్జెన్సీ మాట వ‌చ్చి ఉంటుందేమో... ఆయ‌న దృష్టిలో ప్ర‌జాస్వామ్యాన్ని అణ‌చివేసే శ‌క్తుల్లో బాబు గారూ ఒక‌రేమో అని నాక‌నిపిస్తుంది..!!

అంద‌రి నేత‌ల డిగ్రీ ప‌ట్టాల‌ను త‌నిఖీ చేస్తే బెట‌రేమో..

 కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ డిగ్రీ ప‌ట్టాల‌ను ప‌రిశీలించాల‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ సోద‌రుడు ప్ర‌హ్లాద్ మోడీ అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి న‌కిలీ ప‌ట్టాల కేసులో అరెస్ట‌యిన నేప‌థ్యంలో స్మృతి ఇరానీ ప‌ట్టాల‌ను ప‌రిశీలించాల‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు...

యోగాకు చేస్తున్న ప్ర‌చారం సంక్షేమ ప‌థ‌కాల‌కు చేస్తే బాగుండును..

 
యోగాను ఎలాగైతే జ‌నంలోకి తీసుకెళ్లాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తుందో అదే స్థాయిలో ప్ర‌భుత్వ సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను తీసుకెళితే గ్రామీణ స్థాయి ప్ర‌జ‌ల‌కు ఎంతో మేలు చేకూరుతుంది.. అవ‌గాహ‌న లేక ఎంద‌రో సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను ప‌థ‌కాల‌ను ఉప‌యోగించుకోలేక‌పోతున్నారు.. యోగాకు చేస్తున్న భారీ ప్ర‌చారాన్ని ఆ ప‌థ‌కాల‌ను జ‌నంలోకి తీసుకెళ్ల‌డంలో చేసి ఉంటే సామాన్యుల‌కు ఎంతో ల‌బ్ధి చేకూరుతుంది...

మావోయిస్టు ఉద్య‌మంలో స‌మిధ‌లు బ‌డుగులే అని ప్ర‌శ్నించ‌రెందుకు?

మావోయిస్టు ఉద్య‌మంలో పాల్గొని ఎన్‌కౌంట‌ర్ల‌లో చ‌నిపోతున్న వారి కులాలు ఏంట‌ని మంద‌కృష్ణ గారు ప్ర‌శ్నించ‌డం లేదు... మ‌రి మావోయిస్టు ఉద్య‌మంలో ఎంత‌మంది అణ‌గారిన వ‌ర్గాల వారు చ‌నిపోయారు.. ఎంత మంది అగ్ర‌వ‌ర్ణాల వారు చ‌నిపోయారు.. నాయ‌క‌త్వం ఎవ‌రి చేతిలో ఉంది..? స‌మిధ‌ల‌వుతున్న ఏ కులాల వారు అని ప్ర‌శ్నించలేదు? అంటే అక్క‌డ సామాజిక న్యాయం ఉన్నట్టేనా...?

ఇంట‌ర్నెట్‌పై ఆంక్ష‌లుంటే బాగుండు అనుకుంటున్న ఆర్కే..

 
సెక్ష‌న్ - 8ని హైద‌రాబాద్‌లో అమ‌లు చేయ‌డం మాటేమిటో గాని ముందుగాల‌ ఫేసుబుక్‌కు వ‌ర్తింప జేయాల‌ని ఆంధ్ర‌జ్యోతి రాధాకృష్ణ విప‌రీతంగా కోరుకుంటున్న‌ట్లు ఉన్నాడు.. పాపం ఫేసుబుక్‌లో దాడులు ఎక్కువైపోయాయి క‌దా... ర‌క్ష‌ణ క‌రవైంది నిందితుడికి... నెటిజ‌న్లు చ‌ట్టాన్ని చేతుల్లోకి తీసుకోవ‌డంతో త‌ట్టుకోలేక‌పోతున్నాడ‌ని స‌మాచారం...

పోలీసుల యూనిఫాం మార్చాలి..

తెలంగాణ పోలీసుల యూనిఫాం మార్చి ఉంటే బాగుండేది... మ‌నోడు ఎవ‌డో.. ప‌రాయి వాడెవ‌డో ఇట్టే తెలిసిపోయేది...!!

Thursday 18 June 2015

ప‌ట్టిసీమ నుంచి ప్ర‌త్యేక పైపులైన్ వేయించుకున్నావా ఏంటి?


కృష్ణా బేసిన్‌లో ఉన్న హైద‌రాబాద్‌కు తాగునీరు రావొద్ద‌ని కుట్ర‌లు ప‌న్నుతున్న చంద్ర‌బాబు, రామోజీ కుట్ర‌ల‌ను చీల్చి చెండాలుతూ న‌మ‌స్తే తెలంగాణ‌లో వ‌చ్చిన క‌థ‌న‌మిది...
రామోజీ ఫిల్మ్ సిటీ కోసం రోజుకు అర టీఎంసీ నీరు ఇవ్వాల్సిందిగా రాజ‌గురువు జ‌ల మండ‌లికి ద‌ర‌ఖాస్తు చేసుకున్నాడ‌ట‌.. అయితే నీటి కొర‌త వ‌ల్ల ఇవ్వ‌లేమ‌ని వాళ్లు తిర‌స్క‌రించార‌ట‌.. మ‌రి విశ్వ‌న‌గ‌ర‌మైన హైద‌రాబాద్‌కు కృష్ణా నుంచి నీళ్లు తేకుంటే నీ ఫిల్మ్ సిటీకి, ఓం సిటీకి నీళ్లు ఎవ‌రిస్తారు రామోజీ గారు... కొంప‌దీసి ప‌ట్టిసీమ నుంచి ప్ర‌త్యేక పైపులైన్ వేయించుకున్నావా ఏంటి?
ఏ బేసిన్‌లో లేని మ‌ద్రాసుకు మ‌న నీళ్ల‌ను ధార‌ద‌త్తం చేస్తే అహో ఒహో అంటూ ఎన్టీఆర్‌ను కీర్తిస్తారు.. మ‌రి న్యాయంగా హైద‌రాబాద్‌కు రావాల్సిన నీటిని పాల‌మూరు నుంచి ఇస్తే ఎందుకు నిట్టూర్పులు.. అంటే హైద‌రాబాద్‌లోని ఆంధ్రా సీఎంకు, మంత్రుల‌కు, మీర‌న్న 40 ల‌క్ష‌ల మంది సీమాంధ్ర జ‌నానికి నీళ్లు అవ‌స‌రం లేదంటారా?

Wednesday 17 June 2015

ఓటుకు నోటు కేసు చూశాం.. రేపు బెయిల్‌కు నోటు కేసు కూడా వ‌స్తుందేమో...!!

***
ఏడాది క్రితం క‌ర్ణాట‌క మాజీ మంత్రి గాలి జ‌నార్ద‌న్ రెడ్డి అరెస్ట‌యి జైలులో ఉన్న త‌ర్వాత బెయిల్ కోసం తీవ్రంగా ప్ర‌య‌త్నించిన విష‌యం తెలిసిందే.. పాపం బెయిల్ దొర‌క్క‌పోవ‌డంతో ఏకంగా జడ్జిగారినే ప్ర‌లోభ పెట్టి ప‌ట్టుబ‌డ్డాడు.. మ‌రి ఇప్పుడు ఓటుకు నోటు కేసులో రేవంతుడికి బెయిల్ రాక‌పోతే రేపు బాస్ బెయిల్‌కు నోటు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌తాడేమో అన్న అనుమానాలున్నాయి.. దీనిపైనా కొంతం ద‌ర్యాప్తు అధికారులు దృష్టిసారించాలి.. ఎందుకంటే అంద‌రూ స్టీఫెన్‌స‌న్లు కాదు క‌దా...!!

బీజేపీ వాళ్లు బాబుకు రుణ‌ప‌డాల్సిందే..

చంద్ర‌బాబు పుణ్య‌మా అని బీజేపీ చిన్న‌మ్మ వ్య‌వ‌హారంపై తెలుగు రాష్ట్రాల్లో చ‌ర్చే జ‌ర‌గ‌డం లేదు.. దేశమంతా చిన్న‌మ్మ లొల్లే న‌డుస్తోంది... మొత్తానికి ఓటుకు నోటు కేసు బీజేపీ వాళ్ల‌ను బ‌తికించింది...

సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌కు ఇచ్చిన ప్రాధాన్య‌త ఏకే ఖాన్‌కు ఇవ్వ‌క‌పోవ‌డం వివ‌క్ష కాదా?

జ‌గ‌న్ కేసును విచారించిన సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ అవినీతిప‌రుల పాలిట సింహ స్వ‌ప్న‌మ‌ని.. ఆయ‌న గొప్ప నిజాయ‌తీప‌రుడైన అధికార‌ని, ఆయ‌న జీవిత చరిత్ర తెలిసేలా ఆంధ్రా ఎల్లో మీడియా పాఠ‌కుల‌కు అందించింది.. మ‌రి ఓటుకు నోటు కేసును ఛేదించిన ఏసీబీ డీజీపీ ఏకే ఖాన్‌... అవినీతి ప‌రుల గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తిస్తున్నార‌ని.. ఆయ‌న‌ది ఆంధ్రా ప్రాంత‌మే అయినా ప‌క్ష‌పాతం లేకుండా విధులు నిర్వ‌హిస్తున్నార‌ని ఏ ఒక్క ఆంధ్రా ప‌త్రిక రాయ‌డం లేదు ఎందుకు? రెండు అవినీతి కేసులే క‌దా.. జ‌గ‌న్‌, చంద్ర‌బాబు ఇద్ద‌రూ వీఐపీ నిందితులే క‌దా... మ‌రి సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌కు ఇచ్చిన ప్రాధాన్య‌త ఏకే ఖాన్‌కు ఇవ్వ‌క‌పోవ‌డం వివ‌క్ష కాదా? మీ ప‌క్ష‌పాత జ‌ర్న‌లిజానికి నిద‌ర్శ‌నం కాదా?

బాబు ఫ్ర‌స్టేష‌న్ సీఎం ర‌మేశ్ ముఖంలో...

అవునా ? కాదా?
*******
ఫేసు ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్‌..!
సీఎం ర‌మేశ్ ఫ్ర‌స్ట్రేష‌న్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ బాస్‌...!!

జైలు కెళితే బాబుకు సానుభూతి వ‌స్తుందా?

ఓటుకు నోటు కేసులో చంద్ర‌బాబునాయుడిని అరెస్టు చేస్తే ఆయ‌న‌కు సానుభూతి పెరుగుతుంద‌ట‌.. కేసీఆర్ ఇమేజు డ్యామేజీ అట‌.. ఈ విశ్లేష‌ణ‌లు చూస్తే న‌వ్వొస్తుంది... అవినీతి కేసులో జ‌గ‌న్‌ను ఏడాది జైలులో ఉంచారు.. ఎంత సానుభూతి వ‌చ్చింది. ఎన్ని ఓట్లు పెరిగాయి.. మ‌రి జైల్లో ఉన్న జ‌గ‌న్‌కు సానుభూతి ఓట్లు వ‌చ్చి ఉంటే అధికారం ద‌క్కేదే క‌దా.. ఇక క‌ర్ణాట‌క‌లో య‌డ్యూర‌ప్ప జైలులో ఉంటే ఆయ‌న పార్టీకి ఓట్లు ప‌డ‌లేదు ఎందుకు? వీళ్లంతా ఉద్య‌మాలు చేసి జైలుకు వెళ్ల‌డం లేద‌ని గుర్తుంచుకోవాలి.. జైలు కెళ్లే ప్ర‌తీ ఒక్క‌రూ మ‌హాత్ములు కాదండోయ్‌.. ఆ రోజులు పోయాయి...!!

భారీ చిత్రాల విడుద‌ల వాయిదా వేసుకోండి...

 భారీ బ‌డ్జెట్‌తో రూపొందించిన బాహుబ‌లి, రుద్ర‌మ‌దేవి, ఇత‌ర సినిమాల విడుద‌ల ఏమైనా ఈ నెల‌లో పెట్టుకుంటే కొంచెం పున‌రాలోచించుకోండి.. ఎందుకంటే ర‌స‌వ‌త్త‌ర రియ‌ల్ క‌థా చిత్రం న‌డుస్తోంది టీవీల్లో.. ఇప్పుడు విడుద‌లైతే మీ డ‌బ్బులు తిరిగివ‌స్తాయే లేదో చెప్ప‌డం క‌ష్ట‌మే..!!

ప‌బ్లిక్ వాయిస్‌... ఆంధ్రానాడుకు ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వొద్దు..

పాల‌మూరు ఎత్తిపోత‌ల ప‌థ‌కంపై కుట్ర‌లు చేస్తున్న ఈనాడు ప‌త్రిక‌కు మొన్న పేజీల‌కు పేజీలు ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ‌డం ముమ్మాటికీ త‌ప్పే.. ఆంధ్రానాడుగా రాత‌లు రాస్తున్న ఈనాడుకు తెలంగాణ ప్ర‌భుత్వ ప‌త్రికా ప్ర‌క‌టన‌లు ఇవ్వొద్దు...

నేరం చేసి త‌ప్పించుకోవ‌డానికి ఇది స‌మైక్య రాష్ట్రం కాదండోయ్‌...

నిర్మాత‌పై కాల్పులు జ‌రిపి ఆరోగ్యం బాగా లేద‌ని నిమ్స్‌లో చేర‌డానికి ఇది స‌మైక్య‌ ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాదు క‌దా... అప్ప‌టి లాగా స‌హ‌క‌రించ‌డానికి ఇక్క‌డ వైద్యులు, పోలీసులు కూడా సిద్ధంగా లేరాయే...!!

ఓ సీమాంధ్ర మిత్రుడి మ‌నోగ‌తం..

బ‌ట్ట‌లిప్పి బ‌రివాత ప్ర‌పంచం ముందు నిలిపినంత ప‌నిజేస్తిరి... ఇంక భౌతిక అరెస్టు ఒక్క‌టే మిగిలింది.. పాపం మాన‌సికంగా ఆయ‌న ఎప్పుడో అరెస్ట‌యిపోయాడు..!!

కేసీఆర్‌తో స‌ర్కార్ సినిమా తీయాల‌నుకుంటున్నాడా?

రాంగోపాల్ వ‌ర్మ గ‌త కొంత కాలంగా కేసీఆర్ గారిని తెగ పొగిడేస్తున్నాడు.. ఓటుకు నోటు కేసులో చంద్ర‌బాబు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కే క‌ళంకం తెచ్చాడ‌ని ట్విట్ట‌ర్‌లో అన్నాడు.. ఇక కేసీఆర్ ముక్కుసూటిత‌నానికి శిర‌స్సు వ‌చ్చి ప్ర‌ణామాలు చేస్తున్న‌ట్లు చెప్పాడు.. ఈయ‌న ఇంత‌గా కేసీఆర్‌ను కీర్తించ‌డం వెన‌క అంతరార్థం అర్థం కావ‌డం లేదు.. కొంపదీసి కేసీఆర్ జీవితంపై తెలంగాణ స‌ర్కార్‌-1, తెలంగాణ స‌ర్కార్‌-2 సినిమాలు ఏమైనా ప్లాన్ చేసిండో అర్థం కావ‌డం లేదు...

తెలంగాణ ప్రాజెక్టుల‌కు అడ్డుప‌డుతున్న న‌ల్ల పిల్లి ఈనాడు...

ఆ రామోజీరావును మ‌రోమారు తెలంగాణ సెక్ర‌టేరియ‌ట్‌లోకి రానియొద్దు.. అలాగే కేసీఆర్ గారు ఫిల్మ్ సిటీ పోవ‌ద్దు..
ఊస‌ర‌వెల్లి అవ‌స‌రం మేర‌కే రంగులు మార్చుతుంది.. మొన్న ఉద్యోగుల‌ను అన్యాయంగా తొల‌గించిన స‌మ‌యంలో తెలంగాణ కార్మిక శాఖ ఈనాడుకు నోటీసులు ఇచ్చింది. దీంతో గండం గ‌ట్టెక్క‌డానికి రామోజీ స‌ఖ్య‌త‌ను ప్ర‌ద‌ర్శించారు.. ఓ రెండు మూడు రోజులు తెలంగాణ‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు న‌టించాడు.. కానీ కుక్క తోక వంక‌రే.. అనువ‌నువూ ఆంధ్రా ప‌క్ష‌పాత వైఖ‌రే ఉన్న ఈనాడు మారుతుంది అనుకోవ‌డం మ‌న అవివేక‌మే క‌దా.. ఇప్పుడు ఆంధ్రోడు ప‌ట్టిసీమ క‌డితే అద్భుతం అంటూ సంపాద‌కీయాలు రాసింది.. తెలంగాణ‌లో పాల‌మూరు ప్రాజెక్టు క‌ట్ట‌బోతుంటే న‌ల్ల పిల్లిలా ఎదురుప‌డి అడ్డుకోవాల‌ని చూస్తోంది.. మ‌రి దీనిపై ఈ రోజు న‌మ‌స్తే తెలంగాణ‌లో ఈనాడును ఏకిపాడేశారు.. ఇదే రీతిగా ఆ ప‌త్రిక అధినేత‌కు గ‌ట్టి సందేశం పంపితే త‌ప్ప దారికి వ‌చ్చేలా లేడు..

ఇది అక్క‌డి ప‌త్రికే.. ఇక్క‌డి ప‌త్రిక కాదు..



ఇన్‌ఛార్జిలు అక్క‌డోళ్లే.. ప్ర‌తీ అక్ష‌రం ప‌క్ష‌పాత‌ర‌హిత‌మే...
జ‌ల దోపిడీలో ఆంధ్రాకు స‌హ‌క‌రిస్తున్న ఈనాడు..
మేలుకోకుంటే తీర‌ని న‌ష్ట‌మే..
*******************
తెలంగాణ‌లోని పాల‌మూరు, న‌ల్ల‌గొండ‌లో చేప‌ట్ట‌నున్న ప్రాజెక్టుల‌ను ఎలాగైనా ఆపించాల‌న్న కుట్ర‌ల‌తో ఆంధ్రా ప్ర‌భుత్వం చేస్తున్న ప‌నుల‌కు వ‌త్తాసు ప‌లుకుతూ, వెన‌క‌నుండి న‌డిపిస్తున్న ఈనాడు ప‌త్రిక రాత‌ల‌పై నిన్న టీ న్యూస్‌లో ఆంధ్రా నాడు అంటూ చ‌ర్చ‌పెట్టారు.. రామోజీరావు ప‌త్రిక ఎప్పుడూ ఆంధ్రా ప్ర‌యోజ‌నాల కోస‌మే పాకులాడుతుంద‌ని ఎప్ప‌టి నుంచో మొత్తుకుంటున్నాం.. ద‌య‌చేసి దీనిపై తెలంగాణ స‌ర్కారు దృష్టిసారించాలి.. తెలంగాణ‌లో ప్రాజెక్టుల‌ను అడ్డుకోవాల‌ని, హైద‌రాబాద్‌పై మ‌రిన్ని ఆంక్ష‌లు రావాల‌ని ఆకాంక్షిస్తున్నా ఆ ప‌త్రిక‌ను, ఆ ప‌త్రికాధినేత‌ను దూరంగా ఉంచ‌డ‌మే మేలు.. ఓం సిటీకి భూములు ఇవ్వ‌డం, రాయితీలు ఇవ్వ‌డం లాంటివి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ చేయొద్దు... లేక‌పోతే మ‌న వేలితో మ‌న కంటిని పొడుచుకున్న చందంగా త‌యారు కావ‌డం త‌థ్యం.. ముఖ్యంగా తెలంగాణ ఎడిష‌న్‌కు ఆంధ్రా ప్రాంతీయుల‌ను ఇన్‌ఛార్జిలుగా పెట్టి తెలంగాణ ప్ర‌యోజ‌నాల‌కు తూట్లు పొడిచేలా క‌థ‌నాలు రాయిస్తున్న ఈ ప‌త్రిక‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టాలి... దీనిపై రామోజీరావుకు నిర‌స‌న‌ను తెలియ‌జేయాల్సిన అవ‌స‌రం ఉంది..

ఎల్లో మీడియాకు వ‌ణుకుపుట్టిస్తున్న సోష‌ల్ మీడియా...

పాపం రాధాకృష్ణ గారు సోష‌ల్ మీడియా పోస్టుల‌ను ఆస‌క్తిగా చ‌దువుతున్న విష‌యం ఈ రోజు ఆయ‌న ప‌త్రిక‌లో వ‌చ్చిన వార్త‌ను బ‌ట్టి అర్థం అవుతోంది... దీన్ని బ‌ట్టి సోష‌ల్ మీడియాలో పోస్టుల‌పై స‌ర్వత్రా ఆస‌క్తి నెల‌కొన్న విష‌యం సుస్ప‌ష్టం... పాపం ప్రింట్ మీడియా విశ్వ‌స‌నీయ‌త‌ను కోల్పోతుంద‌ని తేట‌తెల్ల‌మ‌వుతోంది... ప్రింట్ మీడియాలో వ‌చ్చే త‌ప్పుడు, అస‌త్య , అభూత క‌ల్ప‌న‌ల‌ను ప్ర‌పంచానికి చాటి చెప్పి ప్ర‌పంచం ముందు వారిని దోషులుగా నిల‌బెట్ట‌డాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నారు... సోష‌ల్ మీడియాను అంద‌రూ ఫాలో అవుతున్న‌ర‌న్న బాధ‌తో ఆయ‌నసోష‌ల్ మీడియాపై అక్క‌సును వెల్ల‌గ‌క్కుతున్నారు.. ఇది మ‌న నైతికి విజ‌యం.. సోష‌ల్ మీడియా వ‌ర్థిల్లాలి.. జై తెలంగాణ‌... జై జై తెలంగాణ‌..!!

ఓ రామోజీరావు గారూ....ఇంత‌కీ అనిశా ఏంటిరా... అనుష్క చెల్లెలా?

క‌నీసం వార్త‌లో అవినీతి నిరోధ‌క శాఖ అని పూర్తిగా రాయ‌డానికి చేతులు రావ‌డం లేదా? లేక అవినీతి అన్న ప‌దాన్ని ప‌దేప‌దే పాఠ‌కుల మ‌దిలోకి వెళ్ల‌కుండా చేయ‌డ‌మే మీ ల‌క్ష్య‌మా?
**************
జ‌గ‌న్ కేసులో ఇలాగే కేం.ద‌.బృ. అని రాయ‌లేదు ఎందుకు... సీబీఐ అని సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్(కేంద్ర ద‌ర్యాప్తు బృందం) అని అంద‌రికీ అర్థ‌మ‌య్యేలా రాశారు క‌దా...

కాదేది బెట్టింగ్‌కు అన‌ర్హం...


చంద్ర‌బాబుకు నోటీసులిస్తారా?
ఈ రోజు ఇస్తారా? రేపు ఇస్తారా?
చంద్ర‌బాబును అరెస్టు చేస్తారా?
అరెస్టు అయితే చంద్ర‌బాబుకు బెయిల్ వ‌స్తుందా?
ఏపీ సీఎం మార‌తారా?
మారితే ఎవ‌రు?
మార‌క‌పోతే ప్ర‌భుత్వం కూలుతుందా?
పై విష‌యాల‌పై ఆంధ్రా, తెలంగాణ‌లో ఐపీఎల్ క‌న్నా ఎక్కువ మొత్తంలో బెట్టింగ్‌లు క‌డుతున్నారట‌...

ఆ న‌ల్లారి కిర‌ణ్‌కుమార్ రెడ్డి ఎక్క‌డ‌?

తెలంగాణ వ‌స్తే అంధ‌కార‌మే అన్నావు..? 
మ‌రి అంధ‌కార‌మైంది తెలంగాణ‌నా.. నీ బ‌తుకా? 
మ‌నుగ‌డ సాగించ‌లేద‌న్నావ్‌...
నీ మ‌నుగ‌డే ప్ర‌శ్నార్థ‌క‌మైంది వాస్త‌వ‌మా కాదా...
**********
రాష్ట్రాన్ని విభ‌జిస్తే తెలంగాణ మ‌నుగ‌డ సాగించ‌లేద‌ని బ‌ల్ల గుద్ది గ‌ణాంకాల‌తో వాదించిన మాజీ ముఖ్య‌మంత్రి న‌ల్లారి కిర‌ణ్‌కుమార్ రెడ్డి ఇప్పుడు ఎక్క‌డ‌... తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత కొద్ది రోజులు విద్యుత్ సంక్షోభం రావ‌డంతో... న‌ల్లారి కిరణ్ న‌త్తిన‌త్తి మాట‌ల‌తో అప్పుడే చెప్పిండు.. ఆయ‌న కాల‌జ్ఞానిలా నీతులు చెప్పినా వీళ్లు విన‌లేదు.. అనుభ‌విస్తున్నారు.. నాశ‌నం అయిపోతార‌ని అన్న నోళ్లు ఎన్నో.. మ‌రి మొన్న వేస‌వితో క‌రెంట్ కోత‌లు లేకుండా క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో స‌ర‌ఫ‌రా చేసింది తెలంగాణ స‌ర్కారే క‌దా... మ‌రి న‌ల్లారి మాట‌లు అవాస్త‌వ‌మ‌ని తేలిపోయింది క‌దా... క‌ష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతుంది ఆంధ్ర‌ప్ర‌దేశ్ కానీ తెలంగాణ కాద‌ని ప్ర‌పంచానికి తెలిసిపోయింది క‌దా.. మ‌రి త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేసిన న‌ల్లారి క్ష‌మాప‌ణ‌లు చెబుతాడా? ముక్కు నేల‌కు రాస్తాడా?

Monday 15 June 2015

స‌త్యంబాబు లాంటి అమాయకుడిని వెతికుతున్నారేమో..

అయేషా మీరా హ‌త్య కేసులో స‌త్యం బాబు లాంటి వ్య‌క్తిని బ‌లిప‌శువును చేసిన‌ట్లే ఇప్పుడు కూడా జీవితంలో ఎప్పుడూ సెల్ ఫోన్ వాడ‌ని వ్య‌క్తిని బాస్‌గా ప‌రిచ‌యం చేస్తారేమో ప‌చ్చ పార్టీ నేత‌లు...!!

న‌వ తెలంగాణ‌లో యువ కిశోరాల‌ను తీర్చిదిద్దడం ప్ర‌తీ ఒక్క‌రి బాధ్య‌త‌..

తెలంగాణ ఉద్య‌మంలో అమాయ‌కుల‌ను రెచ్చ‌గొట్టి ఆత్మాహుతుల‌కు పురిగొల్పిన కేసీఆర్ అని నిల‌దీసిన‌ పెద్ద మ‌నుషులు ఇప్పుడు అమాయ‌క‌, ఆవేశ‌ప‌రులైన‌ యువ‌త‌ను సాయుధ బాట వైపు న‌డిపించే కుట్ర‌లు చేస్తున్నారా?
************
ఉద్య‌మ స‌మ‌యంలో కేసీఆర్ ఇంట్లో ఎవ‌రు చావ‌లేద‌ని ప్ర‌శ్నించారు.. మీ ఆ మాట‌లు చాలా మందిని ఆలోచ‌న‌లో ప‌డేశాయి.. నిజ‌మే క‌దా అన్న‌ట్లు కొంద‌రు సందేహించారు... మ‌రి ఇప్పుడు మిమ్మ‌ల్ని అదే ప్ర‌శ్న అడుగుతున్నాం.. మీ ఇంట్లో ఎవ‌డైనా సాయుధ బాట ప‌ట్టిండా? ఎన్‌కౌంట‌ర్‌లో చ‌చ్చిండా...
*************
అభం శుభం తెలియ‌ని ప‌సిమొగ్గ‌ల‌ను చిదిమేయ‌కండి.... స‌ల్వాజుడుం పేరుతో ఛ‌త్తీస్‌ఘ‌ఢ్ స‌ర్కారు ఎలాగైతే అమాయ‌క గిరిజ‌నుల‌కు ఆయుధాలు ఇచ్చిందో.. మీరూ కూడా ఆవేశ‌ప‌రులైన‌, న‌వ య‌వ్వ‌న యువ‌కులకు ఆయుధాలు ఇచ్చి వారి జీవితాల‌ను ఆహుతి చేయొద్దు...
**************
తెలంగాణ పౌర స‌మాజం కూడా దీనిపై దృష్టి సారించాలి... ఇలాంటి చురుకైన యువ‌త‌కు మార్గ‌నిర్దేశ‌నం చేయాలి..
లేక‌పోతే ఒక‌డు విప్ల‌వ స‌మాజం అంటూ అడ‌వుల బాట ప‌డ‌తాడు... ఇంకొక‌డు ఇస్లామిక్ రాజ్య‌మంటూ అర‌బ్ బాట ప‌డ‌తాడు... ఇంకొక‌డు కాషాయ రాజ్య‌మంటూ ఎటో పోతాడు...
***************
ఇది వాంఛ‌నీయం కాదు.. తెలంగాణ‌కు ప్ర‌మాద‌క‌ర ఘంటిక‌లు... మ‌న యువ‌త‌ను మ‌నం కాపాడుకుందాం... ప్ర‌జాస్వామ్యంలోని అవ‌ల‌క్ష‌ణాల‌పై ప్రజాస్వామ్య పంథాలో పోరాడ‌టం నేర్పుదాం... న‌వ తెలంగాణ‌లో యువ కిశోరాల‌ను తీర్చిదిద్దడం ప్ర‌తీ ఒక్క‌రి బాధ్య‌త‌... జై తెలంగాణ‌... జై జై తెలంగాణ‌...!!

ఎన్టీవీ ప్ర‌సారాల నిలిపివేత‌పై న‌ల్ల గుడ్డ‌ల‌తో నిర‌స‌న తెలుపుతారా?

తెలంగాణ ప్ర‌జాప్ర‌తినిధుల‌ను, అసెంబ్లీ స‌మావేశాల‌ను అవ‌మానించార‌ని, తెలంగాణ సంస్కృతిని అవ‌హేళ‌న చేశార‌న్న ఆగ్ర‌హంతో తెలంగాణ ఎంఎస్‌వోలు ఆ ఛానెళ్ల‌పై నిషేధం విధించారు.. మ‌రి ఆంధ్రాలో ఎన్టీవీని ఎందుకు బ‌హిష్క‌రించారు? ఎవ‌రిని అవ‌హేళ‌న చేసింది? 
మ‌రి ఇప్పుడు సో కాల్డ్ మీడియా పెద్ద మ‌నుషులు నోటికి న‌ళ్ల గుడ్డ‌లు క‌ట్టుకుని నిర‌స‌న తెలుపుతారా? క‌నీసం చంద్ర‌బాబునాయుడు ఇంటి గేటు వ‌ద్ద ఆందోళ‌న చేస్తారా? ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేస్తారా? కేంద్ర స‌మాచార మంత్రికి విన‌తులు పంపుతారా? ఆంధ్రా రాజ‌ధానిలో ఆందోళ‌న చేస్తారా? బీజేపీ స‌హా ప్ర‌తిప‌క్షాలు ఏమంటాయో?

ఓటుకు నోటు కేసు 'బాస్‌'ను బొక్క‌లో వేసే రోజు కోసం నిరీక్ష‌ణ‌...

కోరిక తీరితే కొబ్బ‌రి కాయ‌లు కొడ‌తామ‌ని మొక్కుకుంటున్న తెలంగాణ‌వాదులు..
***
సోమ‌వారం రాజ్‌భ‌వ‌న్‌లో గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌తో స‌మావేశ‌మైన కేసీఆర్‌... 
పాపం కేసీఆర్ గ‌వ‌ర్న‌ర్ క‌లిసిండ‌న్న మాట వింటేనే ఏదో భ‌యం క‌లుగుతున్న‌ట్లు ఉంది ఓటుకు నోటు నిందితుల గుండెల్లో... ఏ నిమిషానికి ఏమి జ‌రుగునో అన్న‌ట్లుగా ఉంది వారి ప‌రిస్థితి.. ఉత్కంఠ‌కు తెర‌ప‌డేది ఎప్పుడో... బాస్‌ను బొక్క‌లో వేసేది ఎన్న‌డో... తెలంగాణ స‌మాజం ఆ రోజు కోసం వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్న‌ది...!!

మేక‌పోతు గాంభీర్యం...

జ‌ర‌గ‌ని ఫోన్ ట్యాపింగ్ జ‌రిగిన‌ట్లుగా తెగ బిల్డ‌ప్ ఇచ్చి కేంద్రానికి ఫిర్యాదులు చేసిన బాబుగారి మాట‌ల‌కు మోడీ గారు బుట్ట‌లో ప‌డిపోయిన‌ట్లు ఈనాడు, ఆంధ్ర‌జ్యోతుల క‌థ‌నాలు రాశాయి... ట్యాపింగ్‌పై కేంద్రం విచార‌ణ జ‌ర‌గ‌బోతుంది అన్న‌ట్లు ఈనాడు, ఆంధ్ర‌జ్యోతిలో క‌థ‌నాల‌ను వండివార్చారు.... పాపం కేంద్రం వ‌ద్ద వీరికి మొండి చేయి ల‌భించింద‌న‌డానికి ఈ రోజు ఆంధ్ర‌జ్యోతి పేప‌ర్ చూస్తే అర్థం అవుతోంది... ట్యాపింగ్ ఆరోప‌ణ‌ల‌పై కేంద్రం ఏమీ మాట్లాడ‌క‌పోయే స‌రికి వీళ్ల‌కు వీళ్లే విచార‌ణ చేయించుకునేందుకు ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు.. ఇది చాల‌దా వీరికి ఢిల్లీలో భంగ‌పాటు ఎదురైంద‌న‌డానికి...!!

ఈ కేటుగాళ్ల ఆట‌క‌ట్టించ‌మ‌ని ఒత్తిడి తేవ‌డం లేదు ఎందుకు?

హైద‌రాబాద్‌లో సిమి ఉగ్ర‌వాదుల క‌ద‌లిక‌లు అంటూ అప్ప‌ట్లో గొంతు చించుకు అర‌చి, కేంద్రం వ‌ద్ద‌కు వెళ్లి నానా యాగీ చేసిన పెద్ద మ‌నుషులు ఇప్పుడు.. సిమి ఉగ్ర‌వాదుల‌ను మించిన నేర‌గాళ్లు ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం పాలు చేస్తుంటే నోరు మూసుకున్నారు ఎందుకో?
సిమి ఉగ్రవాదులు స‌మాజానికి ఎంత ప్ర‌మాద‌క‌ర‌మో... ఈ ఓటుకు నోటు కేటుగాళ్లు తెలంగాణ‌కు అంత‌క‌న్నా ఎక్కువ ప్ర‌మాద‌క‌ర‌మ‌ని వీళ్లు మ‌ర‌చిపోయారా? కేంద్రం ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఈ కేటుగాళ్ల ఆట‌క‌ట్టించ‌మ‌ని ఒత్తిడి తేవ‌డం లేదు ఎందుకు?

తెలంగాణ యువ‌ కెర‌టం వివేక్‌కు అశ్రునివాళి...

తెలంగాణ‌లో మ‌రే పౌరుడు కూడా ఇలా సాయుధ పంథాను అనుస‌రించొద్ద‌ని విజ్ఞ‌ప్తి...
తెలంగాణ స్వ‌ప్నాన్ని అహింసా మార్గంలో సాధించి ప్ర‌పంచానికి ఆదర్శంగా నిలిచాం మ‌నం...

నూనూగు మీసాల పొర‌గాడిని పొట్ట‌న‌బెట్టుకున్న పోలీసుల‌దీ త‌ప్పే.. ఆ పొర‌గాడిని దారిత‌ప్పేలా చేసిన వారిదీ త‌ప్పే...
నిజంగా ఆయుధంతోనే అన్నీ సాధించుకోగ‌లిగితే...ఈ సానుభూతిప‌రులు ఆయుధాలు ప‌ట్ట‌రెందుకు?
అంద‌రూ ఆయుధాలు ప‌ట్టి అడ‌విలో ఉండాలి క‌దా.. కొంద‌రేమో ద‌ర్జాగా జీవిస్తారు.. కొంద‌రేమో వీళ్ల సాహిత్యానికి ఆక‌ర్షితులైన స‌మిధ‌లవుతారు...
అహింసాయుత పంథాలో న‌వ స‌మాజం కోసం ఉద్య‌మించే తెలంగాణ యువ కెర‌టాల‌ను చూడాలి.. అంతే కానీ అడ‌వుల బాట ప‌ట్టి అమ్మ‌ల‌కు గ‌ర్భ‌శోకం క‌లిగించే త‌మ్ముళ్ల‌ను, అక్క‌ల‌ను, చెల్లెల‌ను చూడ‌లనుకోవ‌డం లేదు... 
ప్ర‌జాస్వామ్యంలో లోపాలుంటే ప్ర‌శ్నించ‌మ‌ని చెప్పండి, అహింసాయుత పంథాలో పోరాటం చేయ‌మ‌ని బోధించండి.. అంతే కానీ ఆయుధాల‌తోనే అన్నీ సాధ్య‌మ‌న్న‌ భ్ర‌మ‌లు క‌ల్పించొద్దు....!!
తెలంగాణ ఉద్య‌మ ప్ర‌స్తానంలో వెయ్యి మంది చురుకైన యువ‌త‌ను మ‌నం కోల్పోయాం... ఇంకా వివేక్ లాంటి ఏ ఒక్క బిడ్డ‌ను కోల్పోయినా మ‌నం సాధించుకున్న తెలంగాణ‌కు అర్థం ఉండ‌దు.. !!

అక్క‌డ ప్ర‌లోభ ప‌ర్వం..

ఇక్క‌డ ఎమ్మెల్యేల‌ను ప్ర‌లోభ పెట్టిన‌ట్లు ఆంధ్రాలో స‌ర్పంచుల‌ను ప్ర‌లోభ పెట్టేందుకు సిద్ధ‌మైన‌ట్లు ఉన్నారు..
మ‌రి అక్క‌డ స్టీఫెన్‌స‌న్ లాంటి స‌ర్పంచులు ఉంటారంటారా?

తెలుగు సినిమాల్లో తెలంగాణ పోలీసుల‌ను చూపిస్తున్నారా?

గ‌తంలో స‌మైక్య ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో తెలుగు సినిమాల్లో సంద‌ర్భోచితంగా హైద‌రాబాద్‌లో పోలీసుల‌కు సంబంధించి చిత్రీక‌రించాల్సి వ‌స్తే ఏపీ పోలీసు అంటూ చూపేవారు.. మ‌న హీరో కూడా ఏపీ పోలీసు అన్న‌ట్లు లోగోలు, బ్యాడ్జిలు పెట్టేవారు.. మ‌రి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వ‌చ్చాక వ‌స్తున్న సినిమాల్లో హీరోల‌కు తెలంగాణ పోలీసు లోగో వాడుతున్నారా? లేక ఎవ‌రూ గుర్తించ‌డం లేద‌ని ఆంధ్రా లోగోతోనే సినిమాలు తీసేస్తున్నారా?
నోట్‌: తెలంగాణ పోలీసోళ్ల‌ను విల‌న్లుగా, ఆంధ్ర‌ప్ర‌దేశ్ పోలీసుల‌ను హీరోలుగా మ‌ల‌చే క‌థాంశాల‌ను కూడా ఎంచుకోవ‌ద్ద‌ని ద‌ర్శ‌కుల‌కు సుతిమెత్త‌ని హెచ్చ‌రిక‌తో కూడిన విన‌తి...!

గుస‌గుస‌...

ఓటుకు నోటు దెబ్బ‌తో బాబు గారు అస‌లు ఫోన్లు మాట్లాడ‌ట‌మే బంద్ చేశార‌ట‌... నిజ‌మేనా...!!

మాన‌వ‌తా దృక్ప‌థంతో డ‌బ్బు పంపినా అని అంటాడేమో...

ఓ నిందితుడికి కేంద్ర మంత్రి సుష్మా స్వ‌రాజ్ సాయం చేయ‌డంపై దేశ‌మంతా పెద్ద గ‌గ్గోలు... ఆమె రాజీనామా చేయాలంటూ విప‌క్షాల‌న్నీ ఆందోళ‌న బాట ప‌డుతున్నాయి..
మ‌రి ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేసేలా రూ.5 కోట్ల‌తో ఎమ్మెల్యేని కొనుగోలు చేయ‌డానికి ప్ర‌య‌త్నించిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎంను రాజీనామా చేయ‌మ‌ని కూడా జాతీయ స్థాయి ఉద్య‌మం జ‌ర‌గాల్సిన అవ‌స‌రం ఉంది క‌దా... నేను కూడా మాన‌వ‌తా దృక్ప‌థంతోనే ఎమ్మెల్యేకు డ‌బ్బులు పంపాన‌ని మ‌న బాబు గారు చెప్పుకుంటారేమో...!!

ఈ ఫొటోలో ఉన్న‌ది నేను కాద‌ని అన్నా అంటాడు..

ఎన్ని కోట్లు ఇచ్చి వైసీపీ ఎంపీని మీరు కొన్నారు.. క‌నీసం ప్ర‌మాణ స్వీకారం జ‌ర‌గ‌క‌ముందే కొనుగోళ్ల ప‌ర్వానికి తెర‌తీసింది ఎవ‌రు? ఆ దేశంలో ఎన్నిక‌లు జ‌రిగాక ఏ పార్టీ మొద‌లు పెట్ట‌క‌ముందే మీరే ఈ కొనుగోళ్ల ప‌ర్వానికి శ్రీ‌కారం చుట్టింది వాస్త‌వం కాదా? అలాంటి మీరు ఇప్పుడు మా ఎమ్మెల్యేల‌ను గొర్రెల్లా కొన్నార‌ని ఆరోపించడాన్ని ఏమ‌నాలి...? ఇక మీ పార్టీలో ఇత‌ర పార్టీ ఎంపీ చేరితే అది ఆ పార్టీకి గ‌ట్టి ఎదురుదెబ్బ అని స‌మ‌ర్థించిన మీ విష పుత్రిక రాత‌ల‌ను ఓ సారి గుర్తుకు తెచ్చుకోండి బాబు గారూ...!! వైసీపీ ఎంపీకి టీడీపీ కండువా కప్పిన ఈ దృశ్యాన్ని ఒక సారి మోడీ గారికి వాట్స‌ప్‌లో పంపితే మీరేంటో మీ చ‌రిత్ర ఏంటో ఆయ‌న‌కు ఇట్టే తెలిసిపోతుంది బాబు గారూ.. గ‌జ‌నీగా మారిన మీకు గ‌తాన్ని గుర్తుకు తెచ్చేందుకే ఈ పేప‌ర్ క్లిప్పింగ్‌.. బ‌హుషా ఇందులో ఉన్న‌ది నేను కాద‌ని అన్నా అంటారేమో.. !!

మేల్ చంద్ర‌ముఖి... మ‌న బాబుగారే..!!

చంద్ర‌ముఖి సినిమాను మేల్ ఓరియెంటెడ్‌గా తీసేదుంటే దానికి బాబును మించిన మ‌హా న‌టుడు దొర‌క‌డేమో... సినిమా పేరు కూడా చంద్ర‌బాబు అని పెడితే స‌రిపోతుంది.. మేక‌ప్ అవ‌స‌రం లేకుండానే స‌హ‌జ న‌ట‌న‌తో అంద‌రినీ మెప్పిస్తాడేమో..!!

Friday 12 June 2015

అద్బుతంగా న‌టిస్తున్న అప‌రిచితుడు బాబు..

జ‌రిగిన ఓటుకు నోటు వ్య‌వ‌హారం జ‌ర‌గ‌న‌ట్లు.. జ‌రగ‌ని ఫోన్ ట్యాపింగ్ జ‌రిగిన‌ట్లు న‌టిస్తున్న అప‌రిచితుడు బాబు..
ఇదో ర‌కం మాన‌సిక జ‌బ్బు అంటున్న వైద్యులు
******************
మాములుగానే చంద్ర‌బాబుకు అనుమానం ఎక్కువ‌.. త‌న నీడ‌ను చూసి తానే భ‌య‌ప‌డి పోతాడు.. పాపం అలాంటి పెద్ద మ‌నిషి ఒక ఏడాది పాటు హైద‌రాబాద్‌లో తీవ్ర అభ‌ద్ర‌తా భావంలోనే జీవించిన‌ట్లు ప్ర‌స్తుత ప‌రిణామాల‌తో అర్థం అవుతోంది... ముఖ్యంగా దక్షిణ భార‌తంలో బ‌హుషా తొలిసారి ఈయ‌నే ఫోన్ ట్యాపింగ్‌కు ఆద్యుడి(1990 ద‌శ‌కాల్లో)గా చెప్పుకోవ‌చ్చేమో.. ఎన్టీఆర్ ను గ‌ద్దె దించి ఆయ‌న‌పై ఇంటెలిజెన్సు నిఘాను, ఫోన్ల ట్యాపింగ్‌ను చేయించిన ఘ‌నుడు చంద్ర‌బాబు.. ఈ నేప‌థ్యంలోనే త‌న‌పైనా ఎవ‌రైనా ఇలా చేయొచ్చ‌న్న అనుమానాలు ఆయ‌న‌ను వెంటాడుతూ ఉన్నాయి.. పాపం ఓటుకు నోటు కేసులో రూ.50 ల‌క్ష‌ల‌తో త‌న అనుంగు అనుచ‌రుడు ప‌ట్టుబ‌డ‌టం, అందులో త‌న సంభాష‌ణ‌ల టేపులు విడుద‌ల కావ‌డంతో గ‌తంలో ఎన్టీఆర్‌పై తాను ఎలాగైతే ట్యాపింగ్‌లు చేయించానో అలాగే ఇప్పుడు త‌న‌పై జ‌రుగుతున్న‌ట్లుగా చంద్ర‌బాబు ఒక‌ర‌క‌మైన భ్ర‌మ‌లోకి వెళ్లిన‌ట్లుగా లేదా అలా న‌టిస్తున్న‌ట్లుగా(అప‌రిచితుడిగా) అర్థం అవుతోంది.. ఇదో ర‌క‌మైన మాన‌సిక జ‌బ్బు అని న‌గ‌రంలోని ప‌లువురు ప్ర‌ముఖ వైద్యులు విశ్లేషిస్తున్నారు.. జ‌రిగిన ఓటుకు నోటు వ్య‌వ‌హారాన్ని జ‌ర‌గ‌ని విష‌యంగా.. జ‌ర‌గ‌ని ఫోన్ ట్యాపింగ్ జ‌రిగిన‌ట్లుగా ఒక ర‌క‌మైన వింత ప్ర‌వ‌ర్త‌న‌కు ఆయ‌న గుర‌వుతున్న‌ట్లు, మీడియాతోనూ, రాత్రి ప‌డుకున్న స‌మ‌యంలోనూ ఇలాగే క‌ల‌వ‌రిస్తుంటార‌ని, ఇది ఈ వ్యాధి ముఖ్య‌ల‌క్ష‌ణాల‌ని వారు అంటున్నారు.. ఒక‌వేళ ఓటుకు నోటు కేసులో జైలులో ప‌డ్డ‌ప్పుడు అనుభ‌వించే దానిక‌న్నా ఎక్కువ శిక్ష‌ను ఇప్పుడు ఆయ‌న అనుభ‌విస్తున్నట్లు వాళ్లు గుస‌గుస‌లాడుతున్నారు..

ఈనాడులో ప‌సందైన కార్టూన్లు త‌గ్గిపోయాయి...

ఈనాడులో ప‌సందైన కార్టూన్లు త‌గ్గిపోయాయి...
ఏసీబీ కేసులో బాబు గారు వ‌ణికిపోతున్న‌ట్లు, నిద్ర‌లో క‌ల‌వ‌రిస్తున్న‌ట్లు కార్టూన్లు వేయ‌డం లేదు ఎందుకు?
***********
ఈనాడు ప‌త్రిక‌లో ఇదీ సంగ‌తి పేరుతో కార్టూనిస్టు శ్రీ‌ధ‌ర్ గారు అద్భుత‌మై కార్టూన్లు వేస్తారు... ముఖ్యంగా జ‌గ‌న్ గారి విష‌యంలో సీబీఐ విచార‌ణ జ‌రుగుతున్న‌ప్పుడు ఆయ‌న చాలా అభ్యంత‌ర‌క‌ర రీతిలో(వ‌ల్ట‌ర్‌గా) కార్టూన్లు వేశాడు... రాత్రి భార్య‌తో క‌లిసి జ‌గ‌న్ ప‌డుకునే స‌మ‌యంలో తెగ టెన్ష‌న్ ప‌డుతాడ‌ని, ఎప్ప‌డు సీబీఐ వాళ్లు అరెస్టు చేస్తారో అని వాపోతాడ‌న్న‌ట్లు, నిద్ర‌లో క‌ల‌వ‌రిస్తున్న‌ట్లు ఇలా ఎన్నో వేశాడు.. అప్పుడు కార్టూన్ల‌లో జ‌గ‌న్‌ను ఆయ‌న స‌తీమ‌ణి ఓదార్చిన‌ట్లుగా, ఇప్పుడు బాబు గారిని ఆయ‌న స‌తీమ‌ణి ఓదార్చుతున్న‌ట్లు, బాబు గారు నిద్ర‌ల్లో ఉలిక్కిప‌డి లేచిన‌ట్లు కార్టూన్లు వేసేలా ఆయ‌న కుంచ క‌దులుతుందా?

ఆంధ్రా నేత‌లు చేసే త‌ప్పులు ప్ర‌జాస్వామ్యానికి చీక‌టి రోజులు కావు..

అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో జేపీ ఒంటి మీద తెలంగాణోడి చేయి ప‌డితే అది ఈనాడు స‌హా ఆంధ్రా ప‌త్రిక‌ల దృష్టిలో ప్ర‌జాస్వామ్యానికి చీక‌టి రోజ‌యింది...
పార్ల‌మెంట్‌లో ఓటుకు నోటు వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడూ ప్ర‌జాస్వామ్యానికి చేటు అయింది...
కానీ రూ.50 ల‌క్ష‌ల న‌గ‌దుతో ఓ ఎమ్మెల్యేను ప్ర‌లోభ‌పెట్టేందుకు జ‌రిగిన ప్ర‌య‌త్నం ప్ర‌జాస్వామ్యానికి చీక‌టి రోజు కాక‌పోయే... 
ఇది ఉదంతంలో టీడీపీ త‌ప్ప ఇంకే పార్టీ నేత‌ల ప్ర‌మేయం ఉన్నా స‌రే మ‌ళ్లా అది ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేయ‌డ‌మే అంటూ రాసే వాళ్లు..

అంటే మ‌న రైతులు చావాలి... మ‌న తెలంగాణ ఎడారి కావాలి.. ఇదే వారి తీరు..

జాగో తెలంగాణ జాగో...
-----------
మ‌న‌కు క‌రెంట్ లేక‌పోతే శ్రీ‌శైలంలో మ‌న వాటా నీటితో విద్యుత్ ఉత్ప‌త్తి చేసుకుంటే అడ్డుప‌డ్డారు... మ‌న రైతుల పొలాలు ఎండి చ‌నిపోతున్నా క‌రుణ చూప‌లేదు... అయినా స‌హించాం...
*************
ఆ త‌ర్వాత నెల‌లోనే హుదుద్ తుపాన్ వ‌చ్చి ఆంధ్రా అత‌లాకుత‌లం అయితే వెల‌క‌ట్ట‌ని విద్యుత్ ప‌రిక‌రాలు, తీగ‌లు, స్తంభాల‌ను పంపి మాన‌వ‌త్వం చాటుకున్నాం...
***************
తెలంగాణ‌లో క‌రెంట్ క‌ష్టాలున్నాయి.. కృష్ణ‌ప‌ట్నంలో రావాల్సిన వాటా విద్యుత్ ఇవ్వ‌మంటే స‌సేమిరా అన్నారు.. అయినా ఊరుకున్నాం..
****************
వేస‌విలో తెలంగాణ‌లో తాగునీటికి క‌ష్టాలు ఉన్నా స‌రే.. కృష్ణా డెల్టా ఎండిపోతుంది.. మా రైతుల‌ను ఆదుకోండి అని అడిగితే పాపం పోనీ అని సాగ‌ర్ నీళ్లిచ్చి ఆదుకున్నాం...
***********************
ప‌ట్టిసీమ క‌ట్టుకుంటున్నామ‌న్నా, సీలేరు విద్యుత్ ప్రాజెక్టును ఆంధ్రాలో క‌లుపుకున్నా రాద్ధాంతం చేయ‌లేదు...
***************
ఇప్పుడు మ‌న ప్రాజెక్టులు క‌ట్టుకోవ‌ద్ద‌ని, కృష్ణా ప్రాజెక్టుల‌పై మ‌న‌కు హ‌క్కులు ఉండొద్దంటూ కేంద్రానికి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తున్నారు...
*******************
అంటే మ‌న రైతులు చావాలి... మ‌న తెలంగాణ ఎడారి కావాలి.. దేశంలో ప్రాజెక్టుల‌పై హ‌క్కులు లేని రాష్ట్రంగా తెలంగాణ మారాల‌న్న‌దే వీరి కుట్ర‌... దీనిపై తెలంగాణ‌లోని అన్ని రాజ‌కీయ ప‌క్షాలు ఏకం కావాలి... త‌గిన బుద్ది చెప్పాల్సిందే..!!

ఇది ప్రజాస్వామ్యానికి ప్ర‌మాద‌క‌ర‌మైన ప‌రిణామ‌మే..!!

ఢిల్లీలో దొంగ స‌ర్టిఫికేట్ల‌తో అరెస్ట‌యిన ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి కేంద్రంపైనో ఇంకెవ‌రిపైనో ఫోన్ ట్యాపింగ్‌ ఆరోప‌ణ‌లో లేదా ఇంకేదైనా ఆరోప‌ణ‌లో చేస్తే.. దానిపై ప్ర‌ధాని ద‌ర్యాప్తులు చేయిస్తాడా?
గృహ హింస కేసులో ఇరుక్కున్న మ‌రో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే త‌న‌పై కుట్ర జ‌రిగిందంటే దానిపై విచార‌ణ చేయిస్తారా?
*****
కేసుల్లో ఇరుక్కున్న నిందితుల ఆరోప‌ణ‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని విచార‌ణ చేయించే కొత్త సంస్కృతిని ప్ర‌వేశ‌పెడితే ఈ దేశంలో నిందితులు నిర్దోషులుగా, బాధితులు దోషులుగా మార‌డం త‌థ్యం... ఇది ప్రజాస్వామ్యానికి ప్ర‌మాద‌క‌ర‌మైన ప‌రిణామ‌మే..!!

తెలంగాణ స‌మాజం ఎటుపోయినా ప‌ర్వాలేద‌నుకుంటారా?

మొన్న పంట‌లు ఎండిపోతున్నాయి నీళ్లు ఇవ్వండ‌ని బ‌తిమాలితే పోనీలే అని ద‌య‌ద‌లిచి సాగ‌ర్ నీటిని ఇచ్చాం..
ప‌ట్టిసీమ క‌ట్టుకుంటుంటే.. చూసీ చూడ‌నట్టు వ‌దిలిపెట్టాం...
ఇప్పుడు పాల‌మూరులో మ‌నం ప్రాజెక్టులు క‌డితే హూంక‌రిస్తున్నారు..
న‌ల్ల‌గొండ‌లో ఎత్తిపోత‌ల చేప‌ట్టొద్ద‌ని బెదిరిస్తున్నారు..
కృష్ణా ప్రాజెక్టుల‌ను బోర్డు ప‌రిధిలోకి తీసుకుర‌మ్మ‌న్ని మ‌ళ్లా కేంద్రానికి డిమాండ్లు చేస్తున్నారు..
పాల‌మూరు రేవంతుడు త‌న ప్ర‌యోజ‌నాల కోస‌మే త‌ప్ప జిల్లా ప్ర‌యోజ‌నాల కోసం నోరు విప్పుతాడా?
న‌ల్ల‌గొండ మోత్కుప‌ల్లి దీనికేం స‌మాధానం చెబుతాడు...?
మాకు వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలే కానీ.. తెలంగాణ స‌మాజం ఎటుపోయినా ప‌ర్వాలేద‌నుకుంటారా?

Thursday 11 June 2015

బాబుకు తెలంగాణ వంట‌కాల రుచి చూపాలి...

జైళ్ల‌లోనూ తెలంగాణ వంట‌కాల‌ను వడ్డించాల‌నే జీవోను ఏమైనా ప్ర‌భుత్వం జారీ చేసిందా?
రేపో మాపో ప్ర‌త్యేక అతిథి రాబోతున్నాడు క‌దా... జైలులో తెలంగాణ మ‌ర్యాద‌ల రుచిచూపాలి క‌దా..!!

గాలి కో నీతి... బాబు కో నీతా?

క‌ర్ణాట‌క‌లో మంత్రిగా ప‌నిచేసిన‌ గాలి జ‌నార్థ‌న్‌రెడ్డిని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నెల‌ల త‌ర‌బ‌డి జైలులో ఉంచ‌గా లేనిది... చంద్ర‌బాబును ఉంచితే త‌ప్పు అవుతుందా? ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గాలి నేరం చేశాడు కాబ‌ట్టి అప్ప‌ట్లో ఏపీ జైలులో ఉంచారు.. మ‌రి ఇప్పుడు తెలంగాణ‌లో బాబు నేరంచేశాడు కాబ‌ట్టి తెలంగాణ జైలులో ఉంచాల్సిందే క‌దా...
నాది పొరుగు రాష్ట్రం, నేను ముఖ్య‌మంత్రిని, మంత్రిని అని అంటే చెల్లుతుందా?

స్టింగ్ ఆప‌రేష‌న్ల‌ను నిషేధిస్తే మొద‌ట మూత ప‌డే ఛానెల్ ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి...

నిజ‌మా? కాదా?
ఈ రాష్ట్రంలో స్టింగ్ ఆప‌రేష‌న్ల‌ను నిషేధిస్తే మొద‌ట మూత ప‌డే ఛానెల్ ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి... బూతు వీడియోల‌ను, స్టింగ్ ఆప‌రేష‌న్ వీడియోల‌తోనే రోజుల త‌ర‌బ‌డి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డంలో ఆ ఛానెల్‌ను మించిన‌ది లేదు.. ఓ బూతు వీడియో చూప‌డం, బాధితుల ముఖానికి గుడ్డ‌లు క‌ట్టి ఇంట‌ర్వ్యులు వేయ‌డం.. త‌ర్వాత మ‌ళ్లా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అంటూ నిందితుల‌తో మాట్లాడించ‌డం... అన్నీ వారికే చెల్లుతాయి...!!
స్టింగ్ ఆప‌రేష‌న్లు మా హ‌క్కు.. వాటిని నిషేధించ‌డం ఎల‌క్ట్రానిక్ మీడియా స్వేచ్ఛ‌కు భంగ‌క‌ర‌మ‌ని ఎన్నాళ్లీ సంకెళ్లు అంటూ మ‌ళ్లా వాళ్లే గ‌గ్గోలు పెడ‌తారు...

ఏం క‌మ్యూనిస్టులో ఏమో...

గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా న‌రేంద్ర మోడీ ఉన్న స‌మ‌యంలో జ‌రిగిన త‌ప్పుల‌పై క‌మ్యూనిస్టులు తెగ పోరాటం చేశారు... ఓ రోజు ఏ పేప‌ర్ చూసినా వారి హెడ్‌లైన్లే క‌నిపించేవి... ముఖ్య‌మంత్రి హ‌యాంలో త‌ప్పులు జ‌రిగితే ఎత్తిచూపే ప్ర‌య‌త్నం చేశార‌ని సంతోషించారు చాలా మంది.. మ‌రి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రే త‌ప్పు చేసి అడ్డంగా ఏసీబీకి దొరికిపోతే ఈ క‌మ్యూనిస్టు నేత‌లు ఎక్క‌డికి వెళ్లారు.. వీళ్ల గొంతులు లేవ‌డం లేదు ఎందుకు?
ముఖ్య‌మంత్రిని జైలులో వేయాల‌ని ప్ర‌శ్నించ‌రా? ముఖ్య‌మంత్రిని అరెస్టు చేయాల‌ని అడ‌గ‌రా?
మోడీని జైలులో పెట్టాల‌ని ప‌దేప‌దే అప్ప‌ట్లో డిమాండ్ చేసిన పెద్ద మ‌నుషులారా.. ఇప్పుడు మీ నోళ్ల‌కు తాళాలు ప‌డ్డాయా? లేక‌పోతే ఇరుక్కుపోయిన వ్య‌క్తి కులాన్ని చూసి భ‌య‌ప‌డుతున్నారా?

తింటే గారెలే తినాలి.. వింటే కేసీఆర్ గారి స్పీచే వినాలి...

నిన్న ఆయ‌న చేసిన ప్రసంగంలో ఈ రెండు పాయింట్లు వింటే చాలు బాబు ఏంటో బాబు బ‌తుకేంటో అంద‌రికీ అర్థం అవుతుంది...
*****************
నేను ఎవ‌రి పార్టీని గుంజుకొని ముఖ్య‌మంత్రిని కాలేదు...
ఇంకా న‌యం నేను చంద్ర‌బాబు నాయుడి శిష్యుడిని కాలేదు కాబ‌ట్టి బ‌తికిపోయాను.. లేక‌పోతే నేనూ క‌ట‌క‌టాల వెన‌క్కి వెళ్లే వాడిని...

రేవంతుడిపై చ‌ర్య‌లు లేవెందుకు?

స్టాంప్‌ల కుంభ‌కోణంలో అప్ప‌టి మంత్రి కృష్ణా యాద‌వ్ పేరు రావ‌డంతో వెంట‌నే ప‌ద‌విని నుంచి తొల‌గించి నేను పునీతుడిన‌ని చెప్పుకునే ప్ర‌య‌త్నం చేశాడు బాబు గారు..
మ‌రి నేడు రేవంత్‌రెడ్డి ఏసీబీకి అడ్డంగా దొరికితే ఎందుకు పార్టీ నుంచి స‌స్పెండ్ చేయ‌లేదు...?
స‌స్పెండ్ చేస్తే ఆయ‌న అప్రూవ‌ర్‌గా మార‌తాడ‌ని, బాస్ పేరును భ‌య‌ట‌పెడ‌తాడ‌న్న భ‌య‌మా?

రెండు రాష్ట్రాల స‌మ‌స్య‌గా ఎలా చిత్రీక‌రిస్తారు...?

త‌మిళ‌నాడుకు చెందిన‌ ఎర్ర చంద‌నం దొంగ‌ల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కాల్చేస్తే త‌మిళ‌నాడులోని నాయకులు ఆందోళ‌న చేసిన స‌మ‌యంలో ఇది రెండు రాష్ట్రాల ప్ర‌జ‌ల మ‌ధ్య వివాదం కాదని చంద్ర‌బాబు అండ్ కో వాదించింది... దొంగ‌లు ఎదురుతిరిగారు కాబ‌ట్టే మా పోలీసులు కాల్చేశార‌ని చెప్పుకొచ్చారు....
మ‌రి తెలంగాణ రాష్ట్రంలో దొంగ‌త‌నంగా ఎమ్మెల్యేని ప్ర‌లోభ‌పెట్టే కేసులో ఇరుక్కున్న చంద్ర‌బాబునాయుడిపై కేసు పెడితే అది ఐదు కోట్ల మంది ఆంధ్రుల‌ను అవ‌మానించిన‌ట్లు ఎలా అవుతుంది... ఎర్ర చంద‌నం దొంగ‌ల మాదిరిగానే చంద్ర‌బాబునాయుడు, రేవంత్‌రెడ్డిలు ఏసీబీకి చిక్కారు క‌దా...
మ‌రి ఎర్ర చంద‌నం దొంగ‌ల‌ను కాల్చేయ‌డం స‌బ‌బే అయిన‌ప్పుడు బాబు అండ్ కోను అరెస్టు చేయ‌డం చ‌ట్ట విరుద్ధం ఎలా అవుతుంది... రెండు రాష్ట్రాల స‌మ‌స్య‌గా ఎలా చిత్రీక‌రిస్తారు...?

ఆంధ్రా ప‌న్నీరు సెల్వం ఎవ‌ర‌వుతార‌బ్బా....!!

ఎర్ర చంద‌నం స్మ‌గ్ల‌ర్లు త‌ప్పించుకున్న‌ట్లు త‌ప్పించుకు తిరిగితే వ‌దిలిపెడ‌తారా?
దొర‌క‌బ‌ట్టి జైలులో పెట్టే రోజు కోసం తెలంగాణ స‌మాజం ఎదురుచూస్తుంది...!!
మ‌రి తెలంగాణలో జైలులో ఉంటే ఆంధ్రాలో ప‌న్నీరు సెల్వం లాంటి మ‌నుషులు ఉన్నారా?
లేక నీ శిష్యులంతా నీ మాదిరిగానే మామ‌కు వెన్నుపోటు పొడిచిన‌ట్లుగా గురువుకు పంగ‌నామాలు పెట్టేవాళ్లేనా?

ఈ విష‌యాన్ని గ‌వ‌ర్న‌రే కేంద్రానికి నివేదిస్తాడేమో...!!

గ‌వ‌ర్న‌ర్‌ను చెప్పుచేతుల్లో ఉంచుకోవ‌డానికి త‌న‌కు అనుకూల ప‌త్రిక‌ల్లో గ‌వ‌ర్న‌ర్‌కు వ్య‌తిరేకంగా రాసిన రాత‌ల‌ను ప్ర‌తుల‌ను ఢిల్లీ పెద్ద‌ల‌కు ఇస్తే బాగుంటుంది... ఎవ‌రు ఎవ‌రిపై పెత్త‌నం చెలాయించాల‌ని చూస్తున్నారో తెలుస్తుంది.. ఈ విష‌యాన్ని గ‌వ‌ర్న‌రే కేంద్రానికి నివేదిస్తాడేమో...!!

Wednesday 10 June 2015

సంక్రాంతికి పోయే ఆంధ్రా వారిని ఏమైనా అడ్డుకున్నామా? ఆంధ్రా ప్ర‌జ‌లు, సామాజిక ఉద్య‌మకారుల‌ స‌మావేశాల‌కు ఆటంకాలు క‌లిపించామా?

మొన్న తెలంగాణ‌లో ఆవిర్భావ సంబురాల‌ను ట్యాంక్ బండ్‌పై ఘ‌నంగా జ‌రుపుకున్నాం... అయితే అక్క‌డ ఉన్న ఆంధ్రా మ‌హ‌నీయుల విగ్ర‌హాల‌ను ఎవ‌రూ కూడా క‌నీసం ముట్టుకోను కూడా ముట్టుకోలేదు.. గ‌త ఏడాది స‌మ‌యంలో దాదాపు రెండు మూడు సార్లు ట్యాంక్ బండ్‌పై ల‌క్ష మంది వ‌ర‌కు తెలంగాణ పౌరులు సంబురాలు చేసుకున్నారు.. అయినా ఏ విగ్ర‌హం జోలికి పోలేదు.. నిజంగా తెలంగాణ పౌరులు త‌ల‌చుకుంటే అవ‌న్నీ ఎప్పుడో క‌నుమ‌రుగు కావాల్సి ఉంది... క‌నీసం వాటి జోలికి కూడా పోలేదు...
మ‌రి ఇప్పుడేమో బాబు గారు ఓటుకు నోటు కేసులో ఇరుక్కునే స‌రికి హైద‌రాబాద్‌లో శాంతిభ‌ద్ర‌త‌లకు విఘాతం, పౌరుల హ‌క్కుల‌కు న‌ష్టం అంటూ దీర్ఘాలు తీస్తున్నాడు..
ఈ ఏడాది కాలంలో సంక్రాంతికి పోయే ఆంధ్రా వారిని ఏమైనా అడ్డుకున్నామా? ఆంధ్రా ప్ర‌జ‌లు, సామాజిక ఉద్య‌మకారుల‌ స‌మావేశాల‌కు ఆటంకాలు క‌లిపించామా?
ముంబ‌యిలో ముస్లింల‌కు ఇళ్లులు ఇవ్వ‌మ‌ని నిరాక‌రించిన‌ట్లు... మీమేమైనా ఆంధ్రుల‌కు ఇళ్లు అద్దెకు ఇవ్వ‌మ‌ని బోర్డులు పెట్టామా? ఇక్క‌డ ఇల్లులు క‌ట్టుకోవ‌ద్ద‌ని ష‌ర‌తులు విధించామా?
ఎందుకు త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తారు బాబు గారు...?

ఢిల్లీకి పోయింది ప్ర‌త్యేక హోదా కోస‌మా... కేసు మాఫీ కోస‌మా?

ఇప్పుడు త‌న కేసు మాఫీయే ముఖ్యం కానీ... ప్ర‌త్యేక హోదా కాదండీ...
ప్ర‌త్యేక హోదా కోసం ఆఘ‌మేఘాల మీద ఢిల్లీకి వెళ్లిన దాఖ‌లాలు లేవు కానీ... తాను కేసు నుంచి త‌ప్పించుకునేందుకు మాత్రం హ‌స్తిన బాట ప‌ట్టారు..
ఈ కేసు నుంచి బ‌య‌ట ప‌డేందుకు వీలైతే ప్ర‌త్యేక హోదా ఊసును భ‌విష్య‌త్తులో ఎత్త‌బోన‌ని కూడా కేంద్రానికి మాట ఇచ్చినా ఆశ్చ‌ర్యం లేదు..
ఈ ఒక్క ఉదంతం చాలదా... ఆయ‌న ఆంధ్రా ప్ర‌జ‌ల కోసం కాదు త‌న కోస‌మే ఆరాట ప‌డుతున్నార‌న‌డానికి...!!