అదేదో సినిమాలో చూశాను.. ఒకడు కత్తి పట్టుకుని లాయర్ వద్దకు వచ్చి సార్ నేను ఒకరిని చంపేశాను.. మరణ శిక్ష పడొద్దు, చిన్న శిక్షతో తప్పించుకోవాలని సలహా చెప్పండి అంటాడు.. ఏముంది ఓ పది మంది కలిసి చంపేశామని చెప్పండి.. దొమ్మి కేసుగా భావించి తాలా మూడేళ్ల శిక్ష విధిస్తారని ఉచిత సలహా ఇస్తాడు లాయర్ గారు..
ఓటుకు నోటు రాజకీయంలో సూత్రధారిని కాపాడేందుకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లాయర్ పాత్రను పోషిస్తూ...ఇదేదో గల్లీ లొల్లిగా.. ఇద్దరు వ్యక్తులు లొల్లి పెట్టుకుంటున్నట్లుగా చిత్రీకరిస్తూ కథనాలు రాస్తోంది.. రూ.50 లక్షల సొమ్ముతో ఓ ఎమ్మెల్యే ఏసీబీ నిఘా కెమెరాలకు చిక్కితే ఇది ఇద్దరు చంద్రుల మధ్య లొల్లా...? సాక్ష్యాత్తూ ఓ రాష్ట్ర సీఎం పరాయి రాష్ట్రం ఎమ్మెల్యేకు ఫోన్ చేసి అన్నీ నేనూ చూసుకుంటానని చెప్పడం మామూలు విషయమా?
ఇంత పెద్ద కేసును చిల్లర కేసుగా మార్చి నీరుగార్చాలని, ప్రజల దృష్టిని ఏమార్చేందుకు చేయకూడని పనులన్నీ చేస్తున్నారు...

No comments:
Post a Comment