1

1

Thursday, 4 June 2015

ఈనాడు వాడి ఆరాటం ఎప్పుడు ఆంధ్రా వారి కోస‌మే


హైద‌రాబాద్‌ను అభివృధ్ధి చేశాం.. అభివృద్ధి చేయ‌డానికే హైద‌రాబాద్‌కు వ‌చ్చామ‌న్న‌ట్లు మాట్లాడారు ఏడాది క్రితం దాకా.. ఇప్పుడేమో... ఫీజులు చెల్లించుకోవడానికి డబ్బులు కూడా లేవ‌ట‌... మ‌రి బ‌త‌క‌డానికి హైద‌రాబాద్‌కు వ‌చ్చామ‌ని చెప్పుకోకుండా... తెలంగాణోళ్ల‌ను బ‌తికించ‌డానికి వ‌చ్చిన‌ట్లు బిల్డ‌ప్‌లు ఇచ్చి ఇప్పుడేమో.. మా ఫీజుల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం క‌ట్టాల‌న‌డం ఏంటో...
*******
ఇక ఇక్క‌డికి వ‌చ్చి స్థిర ప‌డిన వారి కులాల‌ను కూడా తెలంగాణ బీసీల జాబితాలో చేర్చితే.. మ‌రి ముంబ‌యిలో స్థిర‌ప‌డిన‌, బెంగ‌ళూరులో స్థిర‌ప‌డిన‌, చెన్నైలో స్థిర‌ప‌డిన, ఢిల్లీలో స్థిర‌ప‌డిన తెలుగు, తెలంగాణ వారి కులాల‌ను అక్క‌డ బీసీల జాబితాలో చేర్చి ఏమైనా ఉద్యోగాలు, ఉపాధి అవ‌కాశాల్లో ప్రాధాన్యం ఇస్తున్నారా? ఇవ్వ‌డం లేదు క‌దా... అలాంట‌ప్పుడు తెలంగాణ‌లో స్థిర‌ప‌డిన వారంద‌రి కులాల‌ను బీసీల జాబితాలో చేర్చితే ఇక్క‌డ ఉన్న బీసీల‌కు న‌ష్టం జ‌ర‌గ‌దా?
*********
ఈనాడు వాడి ఆరాటం ఎప్పుడు ఆంధ్రా వారి కోస‌మే త‌ప్ప‌.. తెలంగాణ వారి కోసం కాద‌ని మ‌రోమారు రుజువ‌వుతోంది.. ఆంధ్రాలో అవ‌మానానికి గురైన‌, అవ‌కాశాలు నిరాక‌రించ‌బ‌డిన తెలంగాణ వారి గురించి మాత్రం ఇలాంటి క‌థ‌నాలు ఎప్పుడు రాయ‌డానికి చేతులు రాలేదు... ఎంతైన ఆంధ్రా ప‌త్రిక క‌దా... తెలంగాణ గురించి ఏం ప‌డుతుంది...!!!

No comments:

Post a Comment