1

1

Thursday, 4 June 2015

రేవంత్ రెడ్డి స్థానంలో టీఆర్ఎస్ నేత ఉండి ఉంటే?

అప్ప‌ట్లో ఒడిశా పోలీసులు టీఆర్ఎస్‌కు చెందిన జూబ్లీహిల్స్ ఇన్‌ఛార్జి స‌తీష్‌రెడ్డిని ఏదో సెటిల్‌మెంట్ కేసులో అరెస్టు చేస్తే... సెటిల్‌మెంట్ దందాలో కేటీఆర్‌కు ప్ర‌మేయం అంటూ ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతిలో పుంఖాను పుంఖానులుగా స్టోరీలు వ‌చ్చాయి.. కేటీఆర్‌తో స‌తీష్‌రెడ్డి దిగిన ఫొటోలు పెట్టి అనుంగు అనుచ‌రుడైన స‌తీష్‌రెడ్డి కేటీఆర్ చెప్పిన‌ట్లు చేశాడ‌న్న‌ట్లుగా వార్త‌లు రాసి చూపింది... ఈ కేసులో కేటీఆర్ ప్ర‌ధాన నిందితుడ‌న్న‌ట్లుగా రాసింది..
ఇక మ‌రో కేసులో ఎవ‌డో ముక్కూ ముఖం తెలియ‌ని వ్య‌క్తి ఓ హోట‌ల్‌లో కూర్చుని పిచ్చా పాటిగా బ్లాక్ మ‌నీ గురించి మాట్లాడుతూ సినీ హీరో సూర్య‌, టీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు బ్లాక్ మ‌నీ ఖాతాలున్నాయ‌న్న‌ట్లు మాట్లాడిన మాట‌ల‌ను చూపి పెద్ద‌గా బ్రేకింగ్ న్యూస్‌లు వేశారు ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో...
****************
మ‌రీ సాక్ష్యాత్తు అవినీతి నిరోధ‌క శాఖ‌కు ప‌ట్టుబ‌డిన టీడీపీ ఎమ్మెల్యే రేవంతుపై, ఆయ‌న బాస్‌పై క‌థ‌నాలు రావ‌డం లేదు ఎందుకు?
మ‌రోవైపు స్టింగ్ ఆప‌రేష‌న్ల‌కు విలువ ఉండ‌దంటూ టీడీపీ ఎమ్మెల్యేలు మాట్లాడ‌టం, వాటిని ప్ర‌చురించ‌డం చేస్తున్నారు..
మ‌రి ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతిలో వ‌చ్చే బూతు స్టింగ్ ఆప‌రేష‌న్ల‌న్నీ బూట‌క‌మే అనుకోవ‌చ్చా?
*********************
రెండేళ్ల క్రితం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముగ్గురు కాంగ్రెస్ అభ్య‌ర్థికి ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఓటేస్తే డ‌బ్బు తీసుకొని కేసీఆరే ఓటు వేయించాడ‌ని ప్ర‌చారం చేశారు.. మ‌రి అప్పుడు ఆ ముగ్గురు ఎమ్మెల్యేల‌పై కేసీఆర్ క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకుని స‌స్సెండ్ చేశాడు క‌దా...
అక్క‌డ ఆధారాలు లేకున్నా కేసీఆర్‌ను దోషి అన్నారు...
మ‌రి రేవంతుడి వ్య‌వ‌హారంలో డ‌బ్బుతో దొంగ దొరికాడు.. మ‌రోవైపు పార్టీ జాతీయ అధ్య‌క్షుడేమో ఇది త‌ప్పు అని రేవంతుడిపై క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు ఇంత వ‌ర‌కూ తీసుకోలేదు.. అంటే ఈ నేరంలో అధినేత‌కు భాగ‌స్వామ్యం ఉంద‌ని తేట‌తెల్లం అవుతోంది క‌దా.. !!
*********************
చివ‌ర‌గా ఒక్క ప్ర‌శ్న‌... ఒక‌వేళ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో డ‌బ్బుతో ఒక టీఆర్ఎస్‌లో అనామ‌క నేత ఏసీబీకి చిక్కి ఉంటే ఇప్పుడు ప‌రిస్థితి ఎలా ఉండేది?
మీడియా ఒక జ‌డ్జి పాత్ర‌ను పోషించి తీర్పును కూడా వెలువ‌రించేది...
కానీ ఏసీబీకి చిక్కింది రేవంతురెడ్డి కాబ‌ట్టి... మీడియా ఇప్పుడు ఒక క్రిమిన‌ల్ లాయ‌ర్ పాత్ర‌ను పోషిస్తు... నిందితుడిని ఎలా బ‌య‌ట ప‌డేయాలి? అన్న రీతిలో ప్ర‌య‌త్నాలు చేస్తోంది... ఇక్క‌డ బాధితుడైన స్టీఫెన్‌స‌న్‌ను దోషిగా.. దోషైన రేవంతుడిని నిర‌ప‌రాధిగా చూపించ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌నిచేస్తోంది... ఇదంతా చూస్తుంటే మ‌రో స‌ల్మాన్ ఖాన్‌, జ‌య‌ల‌లిత‌, రామ‌లింగ‌రాజు కేసుల మాదిరిగా రేవంతుడి కేసు మారుతుందేమో అన్న అనుమానం క‌లుగుతోంది... !!

No comments:

Post a Comment