1

1

Tuesday 31 March 2015

ఆంధ్రా వాహ‌నాల‌పై ప‌న్నులు వ‌ద్దు అంటూ కోర‌డం ఏంటి కిష‌న్‌రెడ్డి గారూ...

ఆంధ్రాకు కోడలుగా వెళ్లిన తెలంగాణ ఆడ‌ప‌డుచుల‌కు, తెలంగాణ‌లో పుట్టిన ఆంధ్రా మూలాలున్న వారికి ఆంధ్రా డీఎస్సీలో అవ‌కాశం ఇవ్వ‌న‌ప్పుడు కిష‌న్ రెడ్డి గారు ఎక్క‌డున్నారు...?
వారికి అవ‌కాశం ఇవ్వండి.. పాపం ఆంధ్రాకు కోడలుగా వెళ్ల‌డ‌మే త‌ప్పా... నాన్ లోకల్ కేట‌గిరీలో 15 శాతం పోస్టుల‌కు వారికి అవ‌కాశం ఇవ్వండి అని విజ్ఞ‌ప్తి చేశారా?   చేయ‌నే చేయ‌లేదు...
మ‌రి ఇప్పుడేమో.. ఆంధ్రా వాహ‌నాల‌పై ప‌న్నులు వ‌ద్దు అంటూ కోర‌డం ఏంటి కిష‌న్‌రెడ్డి గారూ...

తెలంగాణ‌కు రాబ‌డి అని హెడ్డింగ్ పెట్టాలి క‌దా...


ఎవ‌రికి భారం.. ఆంధ్రా నుంచి వ‌చ్చే వాహ‌నాల‌కు భారం..
మ‌రి తెలంగాణ ప్ర‌జ‌ల‌కు భారం అన్న‌ట్లుగా వార్త‌లు రాయ‌డం ఏంటి?
ఇక్క‌డి ప‌త్రిక అయి ఉంటే ఇలాంటి హెడ్డింగ్ పెడుతుందా?
తెలంగాణ‌కు రాబ‌డి అని హెడ్డింగ్ పెట్టాలి క‌దా...
ఇదొక‌టే కాదు... బోధ‌న రుసుముల స‌మ‌యంలోనూ ఈనాడు ప‌త్రిక ఆంధ్రా ప‌త్రిక‌గానే, ఆంధ్రా ప్ర‌యోజ‌నాల కోసం ప‌రిత‌పించే ప‌త్రిక‌గానే వ్య‌వ‌హ‌రించింది..
ఈ విష‌యాన్ని ప్ర‌భుత్వ పెద్ద‌లు గ‌మ‌నిస్తున్నారో లేదో..?
ఆంధ్రాకు నీరు ఇప్పించేందుకు కొట్లాడుతుంది.. ఆంధ్రా విద్యార్థుల‌కు బోధ‌న రుసుముల కోసం ప‌రిత‌పిస్తుంది.. ఇప్పుడు ఆంధ్రా వాహ‌నాల‌పై ప‌న్నులు ఎత్తేయించేందుకు ఆరాట‌ప‌డుతుంది.. వీరి ఆత్మ మొత్తం ఆంధ్రా ప్ర‌భుత్వ‌మే అయిన‌ప్పుడు కేసీఆర్ రామోజీరావును ఎన్నిసార్లు క‌లిసినా ఏముంటుంది...!!

ఎల్లో జ‌ర్న‌లిజం చ‌రిత్ర‌లో మీ పేరు సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించాల్సిందే..!!

సోమేశ్ కుమార్ ఆంధ్ర‌జ్యోతితో ఏం శ‌త్రుత్వం పెట్టుకున్నాడో కానీ... రోజూ ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా రాసేదే రాస్తున్నాడు..
బ‌హుషా ఆంధ్ర‌జ్యోతి రిపోర్ట‌ర్‌కు ఏమైనా ప‌నిచేసిపెట్ట‌లేదో.. మ‌రి ఆంధ్ర‌జ్యోతి పెద్ద‌మ‌నుషుల‌కు ఏమైనా న‌ష్టం క‌లిగించాడో అర్థం కావ‌డం లేదు..
మొన్న‌టికి మొన్న ఆస్తి ప‌న్ను బ‌కాయిల వ‌సూలుకు జీహెచ్ఎంసీ క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటే.. అయ్యో ఇదేం చోద్యం.. ప‌న్ను వ‌సూలుకు చెత్త డ‌బ్బాలు పెడ‌తారా? అంటూ ఆంధ్ర‌జ్యోతే రాసింది... చివ‌ర‌కు ఆ డ‌బ్బాలు తీయించేలా ఒత్తిడి తెచ్చింది..
మొండి బ‌కాయిదారులు ప‌న్నులు క‌ట్ట‌కుండా కోర్టుకు వెళితే వారి వార్త‌ల‌కు ప్రాధాన్యం ఇచ్చింది..
ఇప్పుడు జీహెచ్ఎంసీ ఆదాయం పెరిగినా కూడా అందులో సోమేశ్ కుమార్ కృషి ఏమాత్రం లేదు..
అంతా బ‌డాయి కొట్టాడు కానీ ప‌న్నులు వ‌సూలులో ఏమీ చేయ‌లేదు అంటూ క‌థ‌నం వ‌డ్డించింది...
ఆయ‌న చేస్తున్న ప‌నికి ఆటంకం క‌లిగించి.. ఆ ప‌నుల‌ను అడ్డుకోవ‌డం.. చివ‌రికి ఏమీ చేయ‌లేని వాడిగా చిత్రీక‌రించ‌డం... మీ జ‌ర్న‌లిజం విలువ‌ల‌కు హ్యాట్సాఫ్‌... ఎల్లో జ‌ర్న‌లిజం చ‌రిత్ర‌లో మీ పేరు సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించాల్సిందే..!!
నోట్‌: అస‌లు లోగుట్టు తెల‌వ‌కుండా ప‌త్రిక చ‌దివే వాళ్లను వెర్రి వెంగ‌ల‌ప్ప‌ల‌ను చేయ‌డంలో వీరు దిట్ట‌...

న‌క్స‌లైట్ల‌తో ఆంధ్ర‌జ్యోతికి పంచాయితీ రాలేదు కానీ... ఒక‌వేళ పంచాయితీ వ‌చ్చి ఉంటేనా...

ఒక ఊహా...
*****

న‌క్స‌లైట్ల‌తో ఆంధ్ర‌జ్యోతికి పంచాయితీ రాలేదు కానీ... ఒక‌వేళ పంచాయితీ వ‌చ్చి ఉంటేనా... ఊహించుకోండి ఎలాంటి వార్త‌లు వ‌చ్చేవో...!!
************
అడ‌విలో మావోల అరాచ‌కం...!!
అడ‌వి బిడ్డ‌ల హ‌క్కుల‌ను కాల‌రాస్తున్న మావోయిస్టులు..
ఆడ‌బిడ్డ‌ల మాన‌, ప్రాణాల‌తో ఆట‌లు...
భూ దందాలు, మైనింగ్ మాఫియాల‌తో మావోయిస్టుల కుమ్మ‌క్కు..
సెటిల్‌మెంట్ దందాలో గ‌ణ‌ప‌తి...
కార్పొరేట్ల క‌నుస‌న్న‌ల్లో న‌క్స‌ల్స్‌..
ఐఎస్ఐతో మిలాఖ‌త్ అయిన మావోయిస్టులు..
అభివృద్ధి నిరోధ‌కులు న‌క్స‌లైట్లు..
ఇసుక దందాలో మావోయిస్టు అగ్ర‌నేత‌లు..
ప‌ద‌వుల‌న్నీ ఒక కుటుంబానికేనా(భార్యా భ‌ర్త‌లు ఉద్య‌మంలో ఉండి ఉంటే)...?

****************
ఆంధ్ర‌జ్యోతికి మావోయిస్టుల‌కు మ‌ధ్య పంచాయితీ వ‌చ్చి ఉంటే ఆ ప‌త్రిక‌లో ద‌ర్శ‌నం ఇచ్చే హెడ్డింగ్‌లు ఇలాగే ఉంటాయి... ఇంకా ఘాటుగా కూడా ఉండొచ్చు.. ఈ హెడ్డింగ్‌ల‌ను చూసిన మావోయిస్టులు ఆ ప‌త్రిక‌ను, ఛానెల్‌ను బ‌హిష్క‌రించండి అంటూ లేఖ‌లు రాసేవారేమో.. ఇంకా వీన‌క‌పోతే ఆంధ్ర‌జ్యోతి అధిప‌తుల‌ను అడ‌వికి తీసుకొచ్చి  ప్ర‌జా కోర్టు నిర్వ‌హించి శిక్షించే వారేమో.. అంతేనా కాదా?!!
ఎవ‌రికైనా స‌రే వారి దాకా వ‌చ్చే వ‌ర‌కు ఏమీ తెలియ‌దు క‌దా...!!

అలా అనుకోవ‌చ్చు క‌దా..!!!

న‌ల్ల‌గొండ‌, వ‌రంగ‌ల్‌, ఖ‌మ్మంలో నిజాం వార‌సుల పార్టీని గెలిపించార‌ట‌(ఓ మిత్రుడి వ్యాఖ్య‌)...!
మ‌రి రంగారెడ్డి, హైద‌రాబాద్‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో దేశ‌ద్రోహ పీడీపీతో చేతులు క‌లిపిన పార్టీని గెలిపించారు క‌దా...!!
మొత్త‌మ్మీద‌ తెలంగాణ‌లో నిజాం వార‌సుల‌కు, దేశ‌ద్రోహుల‌తో సోప‌తి చేసే వాళ్ల‌కు అనుకూలంగా జ‌నం తీర్పు చెప్పారు అనుకోవ‌చ్చు క‌దా..!!!

శ్రీ‌రాముడిని గుర్తించారు సంతోష‌మే..!!

వామ‌ప‌క్ష పార్టీల‌కు చెందిన 99 టీవీ, 10 టీవీ ఛానెళ్లు కూడా ఘ‌నంగా శ్రీ‌రామ న‌వ‌మి వేడుక‌లు జ‌రిపించాయి.. వీక్ష‌కుల‌కు శ్రీ‌రామ న‌వ‌మి శుభాకాంక్ష‌లు చెప్పాయి.. మొత్తానికి శ్రీ‌రాముడిని గుర్తించారు సంతోష‌మే..!!

కేంద్రాన్ని కూడా ఇంతే స్థాయిలో చీవాట్లు పెట్టలేదు ఎందుకు?


సోమేశ్ కుమార్ హైద‌రాబాద్ నిజామా?
హైకోర్టు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది... ఓకే మంచిదే..
మ‌రి కేంద్ర ప్ర‌భుత్వం ఆధార్ లేకుంటే సంక్షేమ ప‌థ‌కాల ప్ర‌యోజ‌నాలు ల‌బ్ధిదారుల‌కు అందించ‌డంల లేదు క‌దా...
ఆధార్ లేకుంటా గ్యాస్ స‌బ్సిడీ ఇవ్వ‌డం లేదు క‌దా..
కేంద్రాన్ని కూడా ఇంతే స్థాయిలో చీవాట్లు పెట్టలేదు ఎందుకు?

Friday 27 March 2015

చెల్ల‌ని నాణెలు చెల్లుతున్న రోజులివి...

చెల్ల‌ని నాణెలు చెల్ల‌డం ఏంట‌ని ఆశ్చ‌ర్య‌పోకండి.. మామూలుగా ఎవ‌రైనా నేత ఎన్నిక‌ల్లో ఓడిపోతే ఆయ‌న మ‌రో చోట పోటీ చేస్తే... ఫ‌లానా చోట చెల్ల‌ని నాణెం ఇక్క‌డ చెల్లుతుందా?  అంటూ కేసీఆర్ గారు అప్ప‌ట్లో తెగ దెప్పిపొడిచారు..ముఖ్యంగా పీసీసీ మాజీ అధ్య‌క్షుడు డి.శ్రీ‌నివాస్‌ను అయితే ఈ మాట‌తోనే ఓడించేశాడు... ఈ సూత్రాన్ని ఇప్పుడు కేసీఆర్ గారు మ‌ర‌చిపోయారు.. మొన్న ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయిన వారికి మ‌రో చోట అవ‌కాశం ఇచ్చి వారిని గెలిపించుకుంటున్నారు...
ప‌ల్లా రాజేశ్వ‌ర‌రెడ్డి న‌ల్ల‌గొండ ఎంపీగా ఓడిపోయినా.. ఆయ‌న‌ను ప‌ట్ట‌భ‌ద్రుల సెగ్మెంట్ నుంచి మ‌ళ్లా శాస‌న మండ‌లికి పంపిస్తున్నారు.. ఇక తుమ్మ‌ల నాగేశ్వ‌రరావు కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయినా... నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీ అయి మంత్రి కూడా అయ్యారు... ఇంకా ఎన్ని చెల్ల‌ని నాణెల‌ను కేసీఆర్ గారు చెల్లిపిస్తారో వేచిచూడాలి...!!

నోట్‌:   చెప్ప‌డం మ‌ర‌చిపోయాను.. బీజేపీ త‌ర‌ఫున గెలిచిన రాంచంద‌ర్‌రావు గారైతే మూడో ద‌ఫాలో చెల్లారు.. గ‌తంలో ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఓడిపోయిన ఆయ‌న మూడో ద‌ఫాలో ఎమ్మెల్సీ అయి మొత్తానికి చ‌ట్ట‌స‌భ‌ల్లో అడుగు పెడుతున్నారు..!!

Thursday 26 March 2015

మీరు కూడా క్రియాశీల రాజ‌కీయాల్లో ముమ్మ‌రంగా పాల్గొనండి..


ఆరేళ్ల క్రితం ఫొటో.. నిన్న‌టి ఫొటో.. మ‌రో ఆరేళ్ల త‌ర్వాత ఫొటోలో దేవీప్ర‌సాద్ ఉంటారా?
ఉండాలి... ఓట‌మితో నిరాశ చెందొద్దు.. అలా నిరాశ చెంది ఉంటే... రాంచంద‌ర్‌రావు గారు.. 2009లో, 2014లో రెండుసార్లు ఓడిపోయారు.. అయినా ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా పోటీచేశారు.. విజేత‌గా నిలిచారు... మీరు కూడా క్రియాశీల రాజ‌కీయాల్లో ముమ్మ‌రంగా పాల్గొనండి.. ఏ అవ‌కాశాన్ని వ‌దులుకోవ‌ద్ద‌ని విజ్ఞ‌ప్తి..!!

ధోనీ గ్యాంగ్‌కు ధ‌న్య‌వాదాలు..

ధోనీ గ్యాంగ్‌కు ధ‌న్య‌వాదాలు..
మ్యాచ్‌లో ప‌రాజ‌యాన్ని ముందే అంచ‌నా వేసేలా చేశారు..
ఒక‌వేళ ద‌క్షిణాఫ్రికా మాదిరిగా చివ‌రి బంతి వ‌ర‌కు తీసుకొచ్చి ఓడిపోయి ఉంటే..
మైదానంలో మీరూ ద‌క్షిణాఫ్రికా ఆటగాళ్ల మాదిరిగా వెక్కివెక్కి ఏడ్చి ఉంటే(1996లో వినోద్ కాంబ్లీ క‌న్నీళ్ల‌ను ఇప్పటికీ మ‌ర‌వ‌లేదు)....
మా జీవితాంతం అది పీడ‌క‌ల‌లాగా వెంటాడుతుండేది.. రాత్రి నిద్ర కూడా ప‌ట్టేది కాదు..
ఇక అస‌లే క్రీడ‌ను మ‌తం క‌న్నా ఎక్కువ‌గా ప్రేమించే క్రీడాభిమానుల గుండెలు బ‌ల‌హీన‌మైన‌వి.. వాళ్లు త‌ట్టుకునే వారే కాదు..
ఈ ఒక్క ఓట‌మిని మిన‌హాయిస్తే... మొత్తం మీద ఏడు మ్యాచ్‌ల‌ను గెలవ‌డ‌మే కాకుండా చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాక్‌ను మ‌రోమారు చిత్తుచేసిన మీకు అభినంద‌న‌లు... అంచ‌నాలే లేని జ‌ట్టుతో సెమీ ఫైన‌ల్ వ‌ర‌కు తీసుకొచ్చి సంచ‌ల‌న‌మే సృష్టించారు..!!
స్వ‌దేశంలోకి మీకు హృద‌య‌పూర్వ‌క స్వాగతం...!!

ఏం ప‌ట్ట‌భ‌ద్రులో ఏమో...!!

ఏమ‌న్నా అంటే డిగ్రీలు చ‌దువుకున్నాం అంటారు.. మేధావులుగా ఫోజులు కొడ‌తారు... తెలియ‌ని విష‌యాల‌ను తెలుసుకోవాల‌న్న కూతూహ‌లం ఉండ‌దు.. త‌మ‌కు తెలిసిందే వేదం అనుకుంటారు కాబోలు... ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఫ‌లితాలు చూస్తే  ప‌ట్ట‌భ‌ద్రుల‌కు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌పై అవ‌గాహ‌న కొర‌వ‌డిన‌ట్లు క‌నిపిస్తోంది.. ముఖ్యంగా ఎలా ఓటేయాలో స‌రిగా తెలియ‌క‌పోవ‌డంతో దాదాపు 28 వేల ఓట్లు చెల్ల‌కుండా పోయాయి... అస‌లే పోలింగ్ శాతం త‌క్కువ‌గా న‌మోదైంది.... ఇందులో రంగారెడ్డిలో దాదాపు 9 వేల ఓట్లు, న‌ల్ల‌గొండ ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గంలో 19 వేల ఓట్లు చెల్ల‌కుండా పోయాయి... ఇంట‌ర్నెట్‌లో ఎన్నో సైట్లు చూసే ప‌ట్ట‌భ‌ద్రులు.. ఎన్నిక‌ల సంఘం సైట్‌ను చూసి ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఎలా ఓటేయాలో తెలుసుకుంటే బాగుండేది... ఎన్నిక‌ల సంఘం కూడా వీలైనంత ఎక్కువ అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాలి... ప‌ట్ట‌భ‌ద్రుల్లో చైత‌న్యం క‌లిగించాలి...

తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకోవాల్సిందే..!!


తీన్మార్ మ‌ల్ల‌న్న న‌ల్ల‌గొండ ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గంలో దాదాపు 13 వేల‌కు పైగా ఓట్ల‌ను సాధించ‌డం గొప్ప విష‌య‌మే.. నిజంగా ఆయ‌న ఈ మాత్రం ఓట్ల‌ను సాధించ‌కపోయి ఉంటే అది టీఆర్ఎస్‌కు న‌ష్టాన్ని మిగిల్చేది... రంగారెడ్డి ప‌ట్ట‌భ‌ద్రుల సెగ్మెంట్‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థికి కేవ‌లం 2800 ఓట్ల‌ను మాత్రమే సాధించ‌గ‌లిగాడు.. ఆ అభ్య‌ర్థి మాదిరిగానే మ‌ల్ల‌న్న‌కు ఓట్లు వ‌చ్చి ఉంటే మిగిలిన ఓట్లు బీజేపీ ఖాతాలో జ‌మ అయ్యేవి...  అప్పుడు  టీఆర్ఎస్ అభ్య‌ర్థికే న‌ష్టం క‌లిగేది.. మ‌ల్ల‌న్న ఉత్తుత్తిగా పోటీ చేయ‌కుండా నిజంగానే పోటీ చేయ‌డం వ‌ల్ల  ఆ మాత్రం ఓట్ల‌ను రాబ‌ట్టుకున్నాడు.. మొద‌టిసారి ఎన్నిక‌ల్లో పోటీ చేసి 13 వేల ఓట్ల‌ను పొందిన ఆయ‌న‌కు అభినంద‌న‌లు.. ప‌రోక్షంగా టీఆర్ఎస్ అభ్య‌ర్థి గెలుపున‌కు కార‌ణం అవుతున్నందుకు టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు కూడా కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకోవాలి...!!

అక్క‌డ ఎదురుదెబ్బ త‌గిలిన‌ట్లు ఎందుకు రాయ‌లేక‌పోయారు...

టీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బ‌, టీఆర్ఎస్‌కు ముకుతాడు, కారుకు ఓట‌మి అంటూ ఈనాడు, ఆంధ్ర‌జ్యోతిలు రాశాయి...
నిజ‌మే ఈ ఎన్నిక‌లు టీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బే.... నిజంగా ముకుతాడు వేసిన‌ట్లే..
*************
మ‌రి ఆంధ్రాలో టీడీపీకి కూడా ఎదురుదెబ్బ‌తాకింది క‌దా...
మ‌రి ఇలాంటి హెడ్డింగ్‌లు పెట్ట‌కుండా చెరో గెలుపు అని ఈనాడు వాడు హెడ్డింగ్ పెట్టాడు..
ఆంధ్రజ్యోతి వాడు టీడీపీకి ఒక‌టే ఎమ్మెల్సీ అని పెట్టాడు...
మ‌రి అధికార ప‌క్షానికి అక్క‌డ ఎదురుదెబ్బ త‌గిలిన‌ట్లు ఎందుకు రాయ‌లేక‌పోయారు...
**************
ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఓట‌మికి ఆ పార్టీ స్వ‌యంకృత అప‌రాధాలు కార‌ణ‌మే.. అయితే ఇదే అద‌నుగా రెచ్చిపోతున్న ఆంధ్రా మీడియా ఎప్ప‌టికీ మ‌న‌కు శ‌త్రువే అన్న విష‌యాన్ని అంద‌రూ గుర్తుంచుకోవాలి.. ముఖ్యంగా కేసీఆర్ గారు ఈ విష‌యాన్ని గ‌మ‌నించాలి.. ప‌త్రికాధినేత ను పొగిడితే మీ ఫొటోలు పెద్ద‌గా వేస్తారేమో కానీ.. మ‌న ప్రాంతానికి అనుకూలంగా వారు రాయ‌రు.. అద‌ను చూసి దెబ్బ‌కొట్టేలా ప్ర‌వ‌ర్తిస్తారంతే...!!
NOTE: సాక్షి ప‌త్రిక‌లో ఆంధ్రా ఎడిష‌న్లో టీడీపీ ఝ‌ల‌క్‌, తెలంగాణ ఎడిష‌న్లో టీఆర్ఎస్ కు ఝ‌ల‌క్ అని క‌రెక్టు హెడ్డింగ్‌లు పెట్టారు....

Wednesday 25 March 2015

అజీర్తి ప్ర‌మాద‌క‌రంగా మారింది...

ఎన్నికల నుంచి గుణ‌పాఠాలు నేర్చుకోవాలి...
త‌ప్పుల‌పై ఆత్మ‌విమ‌ర్శ చేసుకోవాలి...
అజీర్తి ప్ర‌మాద‌క‌రంగా మారింది...
మీ క‌డుపులో ప‌ట్టేంత తినండి కానీ.. పొట్ట ప‌గిలేలా తింటే ఇలాగే ఉంటుంది..
ప‌క్క పార్టీల నుంచి అవ‌స‌రం ఉన్నా.. లేకున్నా అర‌వు తెచ్చుకున్నారు..
మ‌రి అద్దెకు వ‌చ్చిన వాళ్లు ఎంత మేరకు ప్ర‌భావం చూపించారు?
కంటోన్మెంట్ ఎన్నిక‌ల్లో గెలిపిస్తే త‌ల‌సాని క్రెడిట్ అన్నారు..
మ‌రి ఈ రోజు ఓట‌మి ఎవ‌రి ఖాతాలో వేయాలి...?
వ‌ద్దురా మొర్రో అంటే ఆంధ్రోళ్ల కాలికి ముళ్లు గుచ్చుకుంటే పంటితో తీస్తా అంటివి...
హైద‌రాబాద్‌లో నేనూ సెటిల‌ర్‌నే అని చెప్పుకుంటివి...
వ‌ద్దంటే రామోజీరావు గొప్పోడు అంటూ కితాబులు, స‌ర్టిఫికేట్లు ఇస్తివి..
ఎవ‌రో ఒత్తిళ్లు చేస్తున్నార‌ని ఫాస్టు ప‌థ‌కంపై వెన‌క్కి పోయారు...
మీ మూల సిద్ధాంతాన్ని ప‌క్క‌న పెట్టి ఆంధ్రా వ్యాపార‌వేత్త‌లతో సోప‌తి మంచిదంటిరి...
మ‌రి సెటిల‌ర్ల‌లో మీరు విశ్వాసాన్ని నింప‌గ‌లిగారా?
ఉన్న తెలంగాణ‌వాదుల విశ్వాసాన్ని కోల్పోయారు త‌ప్ప‌...
ఎప్ప‌టికైనా నిఖార్సైన తెలంగాణ వాదుల విశ్వాసాన్ని చూర‌గొనేలా ప‌నిచేయండి..
ఇప్ప‌టికీ ఆంధ్రా పార్టీల‌కు ఓటేయలేక‌, ప్ర‌త్యామ్నాయం లేక గ‌త్యంత‌రం లేక టీఆర్ఎస్‌కు ఓటేసిన ప‌ట్ట‌భ‌ద్రులు ఎంద‌రో ఉన్నారు..
అందుకే ఆ మేర‌కు ఓట్లు టీఆర్ఎస్‌కు వ‌చ్చాయి...
ఉన్నంత‌లో బీజేపీలో ప్ర‌త్యామ్నాయాన్ని చూసుకున్నారు..
రేపు మంచి ప్ర‌త్యామ్నాయం వ‌స్తే భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది..
మేలుకొన‌క‌పోతే పుట్టి మున‌గ‌డం ఖాయం...


ఆరేళ్ల క్రితం ఫొటో.. మ‌రి ఈ రోజు దేవీ ప్ర‌సాద్‌, రాంచంద‌ర్‌రావులు ఇలాగే ఆలింగ‌నం చేసుకుంటే చూడాల‌ని ఉంది...!!

ఆరేళ్ల క్రితం ఫొటో.. మ‌రి ఈ రోజు దేవీ ప్ర‌సాద్‌, రాంచంద‌ర్‌రావులు ఇలాగే ఆలింగ‌నం చేసుకుంటే చూడాల‌ని ఉంది...!!

ఓట‌మి ఓట‌మే.. ప్ర‌తీ ఓట‌మి పాల‌న‌కు ఓ నిద‌ర్శ‌న‌మే..

జ‌స్ట్ ఫ‌ర్ ఫ‌న్‌

మొన్న ఢిల్లీ ఎన్నిక‌ల్లో మా ఓట్లు మాకొచ్చాయి...
కాంగ్రెస్ వాళ్ల ఓట్ల‌ను ఆమ్ ఆద్మీకి మ‌ళ్లించార‌ని బీజేపీ నేతలు ఆరోపించారు..
ఈ రోజు రంగారెడ్డి ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లోనూ  కాంగ్రెస్ ఓట్లు బీజేపీకి మ‌ళ్లిన‌వి అని అనుకోవ‌చ్చా?
ఓట‌మి ఓట‌మే.. ప్ర‌తీ ఓట‌మి పాల‌న‌కు ఓ నిద‌ర్శ‌న‌మే..

యాగం ఉంటే చేయొచ్చు క‌దా...!!

సినిమా న‌టులు అకాలంగా మృత్యువాత ప‌డుతున్నార‌ని యాగం చేశారు.. మ‌రి సినీ న‌టుల మ‌ధ్య వ‌ర్గ విభేదాల‌తో మా ఎన్నిక‌ల జ‌రుగుతున్నాయి క‌దా.. సినీ న‌టులు సంఘ‌టితంగా ఉండేందుకు కూడా ఏదైనా యాగం ఉంటే చేయొచ్చు క‌దా...!!

తెలంగాణ‌లో విద్యుత్ రంగంలో వెలుగులు విర‌జిమ్మాలి...!



తెలంగాణ‌లో ఇప్పుడు కొంత విద్యుత్ కోత‌లు త‌గ్గాయి.. అయితే విద్యుత్‌ను మ‌నం ఇత‌ర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయ‌డం క‌న్నా... మ‌న‌మే స్వ‌యంగా విద్యుత్ ఉత్ప‌త్తి చేయ‌డంపై దృష్టి కేంద్రీక‌రించాలి..ముందు మ‌న అవ‌స‌రాలు తీరేలా విద్యుత్ ప్రాజెక్టులు చేప‌ట్టాలి.. త‌ర్వాత విద్యుత్‌ను విక్ర‌యించ‌డంపై దృష్టిసారించాలి... కొనుగోలుకు వెచ్చించే సొమ్మును ఉత్ప‌త్తికి కేటాయిస్తే స‌రిపోతుంది... దేశం తెలంగాణ వైపు చూసేలా మ‌నం ఎద‌గాలి..

తప్పు చేసిన కాలేజీల త‌ర‌ఫున‌ వ‌కాల్తా పుచ్చుకోవ‌డం ఎందుకు?

వ‌స‌తుల కొర‌త సాకుతో 163 ఇంజినీరింగ్ కాలేజీల‌ను మూసివేయ‌డం త‌గ‌ద‌ని బీజేపీ ఎమ్మెల్యే చింత‌ల రాంచంద‌ర్‌రెడ్డి అన్నారు.. ఆ కాలేజీల‌కు  ఒక్క అవ‌కాశం ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు.. లేక‌పోతే వాటిపై ఆధార‌ప‌డ్డ 2 ల‌క్ష‌ల మంది నిరుద్యోగులుగా మారుతార‌ట‌...
మ‌రి ఆ కాలేజీల‌ను కొన‌సాగిస్తే ఏటా దాదాపు 4 ల‌క్ష‌ల మంది నిరుద్యోగులు త‌యారు కారా?;
*************

అయినా తప్పు చేసిన కాలేజీల త‌ర‌ఫున‌ వ‌కాల్తా పుచ్చుకోవ‌డం ఎందుకు?
ఇన్నేళ్లు ప్ర‌భుత్వం అందించిన బోధ‌న రుసుంల‌ను అప్ప‌నంగా తిన్న ఆ కాలేజీల నుంచి సొమ్ము వ‌సూలు చేయ‌మ‌ని డిమాండ్ చేయొచ్చు క‌దా..
ల‌క్ష‌ల మంది విద్యార్థుల‌ను నిరుద్యోగులుగా మార్చిన కాలేజీలు న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వాల‌ని కోరాలి క‌దా...
అలా చేయ‌డం లేదు ఎందుకు?

ఉమ్మ‌డిగా ఎంసెట్‌ను నిర్వ‌హించ‌లేదు ఎందుకు?

ఎంసెట్‌ను ఉమ్మ‌డిగా నిర్వ‌హించాల‌ని నారాయ‌ణ‌, శ్రీ‌చైత‌న్య‌లు ఒత్తిడి చేశాయి క‌దా..
మ‌రి అప్ప‌టి విద్యాశాఖ మంత్రికి ఎంతో కొంత డ‌బ్బు కూడా ఇవ్వాల‌ని చూసి ఉంటాయి క‌దా..
డ‌బ్బు తీసుకొని ఉమ్మ‌డిగా నిర్వ‌హించి విభ‌జ‌న చ‌ట్టంలో ఉంద‌ని అంటే న‌మ్మేవాళ్ల‌మే క‌దా...
మ‌రి ఉమ్మ‌డిగా నిర్వ‌హించ‌లేదు ఎందుకు?

Tuesday 24 March 2015

తెలంగాణ ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి... ఫ్లెక్సీల‌ను తొల‌గించండి...



తెలంగాణ ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి...
ఫ్లెక్సీల‌ను తొల‌గించండి...
విశ్వ‌న‌గ‌రం దిశ‌గా తొలి అడుగువేయండి..
********
హైద‌రాబాద్‌ను విశ్వ‌న‌గ‌రంగా తీర్చిదిద్దుతామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ గారు ప్ర‌క‌టించారు.. విశ్వ‌న‌గ‌రంలో ప్ర‌తీ వీధిలోనూ ఫ్లెక్సీలు విచ్చ‌ల విడిగా ఉంటాయా?   హైకోర్టు చీవాట్లు పెట్టినా స్పందించ‌రా?
విశ్వ‌న‌గ‌రం దిశ‌లో తొలి అడుగుగా... హైద‌రాబాద్‌లో అనుమ‌తి లేకుండా ఏర్పాటు చేసే ఫ్లెక్సీలు, క‌టౌట్ల‌ను తొల‌గించండి... ముఖ్యంగా అధికార పార్టీగా ఉన్న మీపై ఎక్కువ బాధ్య‌త ఉంటుంది..ఏ నాయ‌కుడు టీఆర్ఎస్‌లో చేరినా స‌రే మొత్త ఫ్లెక్సీల మ‌యంగా మారుతోంది న‌గ‌రం... ఇది ఒక్క తెలంగాణ‌లోనే కాకుండా అన్ని రాష్ట్రాల్లోనూ కొన‌సాగుతుంది.. గ‌తంలో ఒక మ‌తం వారు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల‌ను ఎవ‌రో కింద వేసి తొక్కార‌ని, త‌గల‌బెట్టార‌ని వ‌ల్ల మ‌త ఘ‌ర్ష‌ణ‌లు జ‌రిగాయి.. న‌ర‌గంలో అస‌లు ఫ్లెక్సీలు లేకుండా చేస్తే ఎలా ఉంటుంది... దీనిపై అఖిల‌ప‌క్ష, అన్ని మ‌తాల పెద్ద‌ల‌తో మాట్లాడి హైకోర్టు ఆదేశాల మేర‌కు చ‌ర్య‌లు తీసుకుంటే బాగుంటుంది... ఫ్లెక్సీల త‌యారీ రంగంపై ఆధార‌ప‌డే వారికి ప్ర‌త్యామ్నాయ అవ‌కాశాలు చూపాలి.. న‌గ‌రాన్ని అందంగా మార్చాలి...
నోట్‌:  హైకోర్టు రెండు రాష్ట్రాల‌కు చీవాట్లు పెట్టింది... ప‌క్క రాష్ట్రం వాళ్లు స్పందించినా స్పందించ‌క‌పోయినా స‌రే మ‌నం స్పందించాలి...

ఆ పూజిత తెలంగాణ అమ్మాయి అయి ఉంటే...

మొన్న ఉద్యోగం రాలేద‌ని పూజిత అనే అమ్మాయి చ‌నిపోయిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి క‌దా.. ఆ అమ్మాయి ఆంధ్ర‌ప్ర‌దేశ్ వాసి అంట క‌దా..
నిజంగానే ఉద్యోగం రాక‌నే చ‌నిపోయిందా?   అలా అయితే అది ముఖ్య‌మంత్రి వైఫ‌ల్యం కాదా?

ఆ పూజిత తెలంగాణ అమ్మాయి అయి ఉంటే... వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో చ‌నిపోయినా స‌రే నిరుద్యోగ స‌మ‌స్య‌ల‌తో చ‌నిపోయింద‌ని గ‌గ్గోలు పెట్టేవారు కాదా?   ఇప్పుడేమో రిజ‌ర్వేష‌న్ల వ‌ల్ల ఆమె చ‌నిపోయింది.. రిజ‌ర్వేష‌న్ల‌ను ఎత్తేయాలంటూ ఒక ప్ర‌చారం మొద‌లైంది...

స్పీక‌ర్‌కు ఆ అధికారాలు ఉన్నాయి..

స‌మైక్య రాష్ట్రంలో అసెంబ్లీలో జ‌రిగిన ఫుటేజీని బ‌య‌ట‌పెట్ట‌లేదు.. ముఖ్యంగా వైఎస్ వివేక‌, గాలి ముద్దుకృష్ణ‌మ నాయుడు ఇద్ద‌రూ అసెంబ్లీ లోప‌ల త‌న్నుకున్న దృశ్యాల‌ను అప్ప‌టి స్పీక‌ర్ నాదెండ్ల మ‌నోహ‌ర్ బ‌య‌ట పెట్ట‌లేదు... అది స్పీక‌ర్ విచ‌క్ష‌ణ‌పై ఆధార‌ప‌డి ఉంటుంది.. స్పీక‌ర్‌కు ఆ అధికారాలు ఉన్నాయి.. 

హుస్సేన్ సాగ‌ర్‌లో వినాయ‌క విగ్ర‌హ నిమ‌జ్జ‌నాన్ని ఆపొద్దు..హుస్సేన్ సాగ‌ర్ ప్ర‌క్షాళ‌న‌కు మాత్రం మేం వ్య‌తిరేకం కాదు...

ఇందిరా పార్కును చెరువుగా మార్చొద్దు..
అలాగే హుస్సేన్ సాగ‌ర్‌లో వినాయ‌క విగ్ర‌హ నిమ‌జ్జ‌నాన్ని ఆపొద్దు...

--------------
హుస్సేన్ సాగ‌ర్ ప్ర‌క్షాళ‌న‌కు మాత్రం మేం వ్య‌తిరేకం కాదు...
బీజేపీ ఎమ్మెల్యే ల‌క్ష్మ‌ణ్‌....
__________
ఇందిరా పార్కును చెరువుగా మార్చితే వాక‌ర్స్‌కు ఇబ్బంది అటా...
మ‌రి హుస్సేన్ సాగ‌ర్‌ను అలాగే ఉంచితే వేల మంది వాహ‌న‌దారుల‌కు ఇబ్బంది కాదా?
చుట్టుప‌క్క‌ల జ‌నానికి ఇబ్బందిగా ఉండ‌దా?
***************
గంగాన‌ది ప్ర‌క్షాళ‌న చేస్తే మాత్రం గొప్ప విష‌యం అవుతుంది కానీ.. హుస్సేన్ సాగ‌ర్ ప్ర‌క్షాళ‌న జ‌రిగితే ఊరుకోరా?
ఇందిరా పార్కు బ‌చావో  పేరిట మీరు 5 వేల మందితో యాత్ర చేస్తే...
హుస్సేన్ సాగ‌ర్ బ‌చావో పేరిట మేం 50 వేల మందితో యాత్ర చేస్తాం...!!!

రేపు అప్పులు కూడా మాఫీ చేస్తాయ‌ని ఏమ‌న్నా భావించాడా?

రూ.2,500 కోట్ల‌కు మా టీవీ అమ్ముడుపోయింది..
అందులో నాగార్జున‌కు 10 శాతం వాటా ఉంది క‌దా..
ఈ లెక్క‌న ఆయ‌న‌కు రూ.250 కోట్లు వ‌స్తుంది క‌దా..
మ‌రి ఆ డ‌బ్బుతో బ్యాంకుల‌కు బాకీ ప‌డిన 62 కోట్ల అప్పులు తీర్చొచ్చు క‌దా..
ఎందుకు తీర్చ‌లేదు?
ప్ర‌భుత్వాలు చ‌వ‌క‌గా భూములు ఇచ్చి ఆదుకున్నట్లు.. రేపు అప్పులు కూడా మాఫీ చేస్తాయ‌ని ఏమ‌న్నా భావించాడా?



అవ‌కాశం ఇచ్చిన గ‌డ్డ రుణం తీర్చుకున్నాడు..

ద‌క్షిణాఫ్రికాలో జ‌న్మించిన గ్రాంట్ ఎలియ‌ట్ త‌న మాతృదేశం ఓట‌మికి కార‌ణ‌మ‌య్యాడు... 2001లో మాతృదేశాన్ని వీడి న్యూజిలాండ్‌లో  అడుగు పెట్టిన ఆయ‌న‌కు 2008లో న్యూజిలాండ్ జ‌ట్టులో చోటు ల‌భించింది.. ఈ రోజు న్యూజిలాండ్‌ను ద‌క్షిణాఫ్రికాపై గెలిపించి ఫైన‌ల్‌కు చేర్పించాడు..

దుబారా చేయొద్దు ప్లీజ్‌...

క‌రెంట్ కోత‌లు త‌గ్గాయి క‌దా అని దుబారా చేయొద్దు ప్లీజ్‌...
బాధ్య‌త‌గా మెల‌గాలి... రైత‌న్న‌లు ఆరుత‌డి పంట‌లు వేసుకొని డిమాండ్‌ను త‌గ్గించారు..
కేంద్రం నుంచి కొంత క‌రెంట్ వ‌చ్చింది... ఇప్పుడు కోత‌లు లేవ‌ని చెప్పి విచ్చ‌ల విడిగా వాడితే మ‌ళ్లా డిమాండ్ పెరుగుతుంది మ‌ళ్లా క‌ష్టాలు మొద‌ల‌వుతాయి.. విద్యుత్ పొదుపుతోనే భ‌విత‌...!!

Monday 23 March 2015

ఎన్నిక‌ల ఫ‌లితాలతో పాల‌కులు మార‌తారా?

ఎన్నిక‌ల ఫ‌లితాలతో పాల‌కులు మార‌తారా?
అలాగైతే ఢిల్లీ ఫ‌లితాల‌తో మోడీ గారి స్పీడ్‌కు బ్రేకులు ప‌డాల్సిందే... కానీ ప‌డ్డాయా?
రేప‌టి ఫ‌లితాలు అంతే..
ఉద్య‌మం తార‌స్థాయిలో ఉన్న‌ప్పుడు వ‌ర‌దారెడ్డికి సీటు ఇచ్చి దెబ్బ‌తిన్నారు..
ఇప్పుడు కూడా అలాంటి పొర‌పాటే చేశారు...
నా దృష్టిలో దేవీప్ర‌సాద్ గారు ఓడిపోతే సాధార‌ణ విష‌యం అవుతుంది.. గెలిస్తే  సంచ‌ల‌న‌మే అవుతుంది..

కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌ల తీరుతో హైద‌రాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కు డ్యామేజీ కాదా?




**************************
అన్న‌పూర్ణ స్టూడియో ఆస్తుల జ‌ప్తు వార్త పెద్ద వార్తా చిన్న వార్త‌..
దాస‌రి ఆస్తుల జ‌ప్తున‌కు రంగం సిద్ధం.. ఇది పెద్ద వార్తా చిన్న వార్తా..
మ‌రి ఇదే టీఆర్ఎస్‌లోనో, తెలంగాణ‌లో ఇంకో గ‌ల్లీ లీడ‌ర్ విష‌యంలో జ‌రిగితే గ‌గ్గోలు పెట్టేవారు కారా..?
మ‌రి వీరి ఆస్తుల జ‌ప్తు చేస్తే హైద‌రాబాద్ బ్రాండ్ ఇమేజ్ డ్యామేజీ కాదంటారా?
హైద‌రాబాద్‌లోని సీమాంధ్రులు అభ‌ద్ర‌త‌కు గురి కారంటారా?
హైద‌రాబాద్ నుంచి పెట్టుబ‌డులు, సినీ ప‌రిశ్ర‌మ వెన‌క్కి వెళ్ల‌దంటారా?
మ‌రి కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌లు త‌ప్పు చేసిన వ్య‌క్తుల ఆస్తుల‌ను జ‌ప్తు చేసేందుకు పూనుకుంటే అది చ‌ట్టం త‌న‌ప‌ని తాను చేసుకుపోవ‌డం అవుతుంది..
మ‌రి అదే ప‌నిని తెలంగాణ ప్ర‌భుత్వం చేయాల‌నుకుంటే క‌క్ష సాధింపు చ‌ర్య‌గా క‌నిపిస్తుంది ఎందుకు?
ఈ రెండు ఉదంతాల‌ను చూసైనా తెలంగాణ ప్ర‌భుత్వం ఆక్ర‌మిత స్థ‌లాల విష‌యం క‌ఠినంగా ముందుకు వెళ్లాల‌ని విజ్ఞ‌ప్తి..
నాగార్జునకు చెందిన ఎన్ క‌న్విన్ష‌న్ సెంట‌ర్‌పై చ‌ర్య‌లు ఎందుకు ఆగిపోయాయి...?
కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌లు చూపిస్తున్న దూకుడునే తెలంగాణ ప్ర‌భుత్వ‌మూ చూపించాల‌ని ఆశిస్తున్నా..

అస‌లు విష‌యాన్ని దాస్తున్నారు..!

2022 నాటికి దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 4 కోట్ల మంది పేద‌ల‌కు ఇళ్లు..
అలాగే ప‌ట్ట‌ణ ప్రాంతాల్లోని 2 కోట్ల మందికి ఇళ్లు నిర్మిస్తుందట కేంద్ర ప్ర‌భుత్వం...
ఈ ముచ్చ‌ట‌ను నిన్న వెంక‌య్య‌నాయుడు గారు చెప్పారు..
అంటే ఏడేళ్ల‌లో 6 కోట్ల ఇళ్ల నిర్మాణ చేప‌డ‌తారు..  ఈ ఇళ్ల నిర్మాణం కోసం కూడా స్థ‌లం అవ‌స‌రం అవుతుంది కాబ‌ట్టి దాని కోసం కూడా భూ సేక‌ర‌ణ చ‌ట్టం అవ‌స‌రం అని ఆయ‌న గారు సెల‌విచ్చారు..
----------
చివ‌ర‌కు భూ సేక‌ర‌ణ చ‌ట్టాన్ని ఆమోదింప జేసుకోవ‌డం కోసం రోడ్లు, రైళ్లు, పేద‌ల‌కు ఇళ్లు కావాలంటే భూ సేక‌ర‌ణ చ‌ట్టం అవ‌స‌రం అన్న సంకేతాల‌ను ఇస్తున్నారు.. కానీ అస‌లు విష‌యాన్ని దాస్తున్నారు..!

ఆంధ్ర ప‌త్రిక తీరును అర్థం చేసుకోవాలి..




 

ప్ర‌స్తుత హైకోర్టు భ‌వ‌నం తెలంగాణ ఆస్తి అని విభ‌జ‌న చ‌ట్టంలో ఉంద‌ని, హైకోర్టును ఏర్పాటు చేయాల్సింది ఆంధ్రాకేన‌ని హైకోర్టు న్యాయ‌మూర్తులు నిన్న వ్యాఖ్యానించారు.. దీనిపై ఈనాడు ప‌త్రిక‌లో ఎక్క‌డా కూడా హెడ్డింగ్‌లోనూ, డెక్‌లోనూ ప్ర‌స్తుత హైకోర్టు భ‌వ‌నం తెలంగాణ ఆస్తి అని పేర్కొన‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.. ఇది తెలంగాణ‌కు అనుకూల‌మైన వ్యాఖ్యా కాబ‌ట్టి వేయ‌డానికి రామోజీ ప‌త్రిక‌కు మ‌న‌సొప్ప‌లేదు.. అదే వ్య‌తిరేకంగా ఏ చిన్న మాట అని ఉన్నా స‌రే దాన్ని ప్ర‌ధాన శీర్షిక‌గా పెట్టి క‌థ‌నాన్ని రాసేది... ఇప్ప‌టికైనా అధికారంలో ఉన్న వారు ఆంధ్ర ప‌త్రిక తీరును అర్థం చేసుకోవాలి.. మీరు ఎంత పొగిడినా వాళ్లు మార‌డం అసంభ‌వ‌మే.. అధికారం ఉన్న మీ చుట్టూ వాళ్లు తిర‌గాలి కానీ.. మీరు వారిని ఆకాశానికి ఎత్తేయ‌డం మానుకోవాలి... తెలంగాణ ఆత్మ‌గౌర‌వాన్ని హిమాల‌య శిఖ‌రం అంత ఎత్తుకు తీసుకెళ్లాలి త‌ప్ప తెలంగాణ‌కు వ్య‌తిరేకంగా కుయుక్తులు ప‌న్నేవారి పాదాల చెంత తాక‌ట్టు పెట్టొద్దు !!


నిజంగా రైతుల‌కే ప్ర‌యోజ‌న‌మా?

ఔట‌ర్ రింగ్ రోడ్‌తో వైఎస్ చేసింది భూ దోపిడీ కాదు.. అభివృద్ధి... ఔట‌ర్ రింగ్ రోడ్ తో చుట్టు ప‌క్క‌ల భూముల ధ‌ర‌లు పెరిగాయ‌ట‌.. మ‌రి ఆ భూములు కొనుగోలు చేసింది ఎవ‌రు?
ఇప్పుడు భూ సేక‌ర‌ణ చ‌ట్టంతో భూములు సేక‌రిస్తే.. చుట్టు ప‌క్కల భూములు కొనేది ఎవ‌రు అవుతారు.. నిజంగా రైతుల‌కే ప్ర‌యోజ‌న‌మా?

వీళ్లు తీసింది నిజంగా కాక‌తీయ వీర‌నారి రుద్ర‌మ చ‌రిత్రేనా

రాణి రుద్ర‌మదేవి సినిమా ఆడియో ఫంక్ష‌న్ నిర్వ‌హించారు..
క‌నీసం కాక‌తీయుల వార‌సులు బ‌స్త‌ర్‌లో ఉన్నారు.. వారిని  పిలిస్తే బాగుంటుంద‌ని ఆలోచించ‌లేదు.. అస‌లు వీళ్లు తీసింది నిజంగా కాక‌తీయ వీర‌నారి రుద్ర‌మ చ‌రిత్రేనా అన్న అనుమాన‌మూ క‌లుగుతోంది...

పంట పొలాలే ఎందుకు?

ఈ దేశంలో ఉన్న బంజ‌రు భూముల‌ను అభివృద్ధి చేసి ప‌రిశ్ర‌మ‌ల‌కు ఇవ్వొచ్చు క‌దా.. ప‌చ్చ‌ని పంట‌లు పండే పొలాలపైనే వీరి క‌న్ను ఎందుకు?

ఇక దేశంలో ప్ర‌తీ చోటా కోకాపేట‌లే..

కోకా పేట కొట్ల గొట్టారు..
పెద్ద‌లా గ‌ద్ద‌లా... లాంటి వార్త‌ల‌న్నీ పేద‌ల భూముల‌ను ప్ర‌భుత్వం లాక్కున్న‌ప్పుడు ప్ర‌ధాన ప‌త్రిక రాసింది..
అప్పుడు రైతుల‌కు ఎంతో కొంత ఇచ్చి భూములు లాక్కున్నందుకు అది భూ మాఫియా అయింది... వైఎస్ భూ భ‌కాసురుడు అయ్యాడు..
మ‌రి భూ సేక‌ర‌ణ చ‌ట్టంతో రైతుల స‌మ్మ‌తి లేకుండా భూముల‌ను సేక‌రిస్తే అది భూ మాఫియా కాదా?

స‌మ‌స్య‌లున్న రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇవ్వాలి క‌దా..


ఆంధ్ర‌జ్యోతి లెక్క ప్ర‌కారం రైతు ఆత్మ‌హ‌త్య‌లు తెలంగాణ‌లో ఎక్కువ ఉన్నాయి..
క‌రెంట్ క‌ష్టాలు తెలంగాణ‌లో ఉన్నాయి..
నిరుద్యోగ స‌మ‌స్య తెలంగాణ‌లో ఎక్కువ‌గా ఉంది..
ఇంకా అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయి..
ఇన్ని స‌మ‌స్య‌లున్న తెలంగాణ‌కు ప్ర‌త్యేక హోదా ఇవ్వాలా?
లేక ఆత్మ‌హ‌త్య‌లు లేని, క‌రెంట్ క‌ష్టాలు లేని ఆంధ్రాకు ప్ర‌త్యేక హోదా ఇవ్వాలా?
---------------------------
ప్ర‌త్యేక హోదా పేరు ఎత్తితే చాలు ఆంధ్రాలో స‌మ‌స్య‌లున్న‌ట్లు వార్త‌లొస్తాయి.. ఇత‌ర విష‌యాల ప్ర‌స్తావ‌న వ‌స్తే తెలంగాణ‌లో స‌ర్వ స‌మ‌స్య‌ల‌కు నిలయంగా క‌నిపిస్తుంది.. ఎందుకో ఈ తేడా?

రైతు ఆత్మ‌హ‌త్య‌లు త‌గ్గాయా? పెరిగాయా?

కేంద్ర ప్ర‌భుత్వ‌మో దేశంలో రైతుల ఆత్మ‌హ‌త్య‌లు గ‌ణ‌నీయంగా త‌గ్గిపోయాయ‌ని సుప్రీంకోర్టులో ప్ర‌మాణ ప‌త్రం దాఖ‌లు చేస్తుంది.. మ‌రోవైపు ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌లో మాత్రం ఒక్క తెలంగాణ‌లో ఈ 9 నెల‌ల్లో 500 మందికి పైగా చ‌నిపోయిన‌ట్లు లెక్క‌లు చెబుతున్నారు.. ఈ ప‌త్రిక‌ను దేశ‌వ్యాప్తంగా రైతు ఆత్మ‌హ‌త్య‌ల‌పై స‌ర్వే చేయ‌మ‌ని చెబితే అసలు కేంద్రం అబ‌ద్దం ఆడుతోందో తేలిపోతుంది క‌దా... సుప్రీంకోర్టును కూడా కేంద్రం ప‌క్క‌దారి ప‌ట్టించిన విష‌యం అర్థం అవుతుంది క‌దా..!!

రైతును కార్మికుడిగా మార్చే ఆలోచ‌న మార్చుకుంటే చాలు..!!

రైతుల జీవితాన్ని మెరుగు ప‌రిచేందుకే కొత్త‌ భూ సేక‌ర‌ణ చ‌ట్టం.. 
రైతు ఎప్పుడూ రైతుగానే ఉండాలా? రైతు కుటుంబం అంతా మట్టినే న‌మ్ముకోవాలా? 
వాళ్ల‌కు మెరుగైన జీవితం ఉండొద్దా?
- హైద‌రాబాద్ లో వెంక‌య్య‌నాయుడు వ్యాఖ్య‌లు...
ఔట‌ర్ రింగ్ రోడ్‌, బెంగ‌ళూరు హైవేల‌తో చుట్టుప‌క్క‌ల భూముల విలువ పెర‌గ‌లేదా? అంటూ ప్ర‌శ్న‌లు
నూత‌న భూసేక‌ర‌ణ చ‌ట్టంతోనే రైతు వికాసం సాధ్య‌మంటూ నినాదం...
____________
రైతును రైతుగా ఉండ‌నియ్యండి సార్‌.. కార్మికుడిగా మార్చే ఆలోచ‌న మార్చుకుంటే చాలు..!!

Friday 20 March 2015

ఒక్క సీటు బీజేపీకి ఇస్తే..?

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థి గెలిస్తే తెలంగాణ‌లో డ్రైపోర్టు, హైకోర్టు, విద్యుత్ ప్రాజెక్టుల‌కు ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు కేవ‌లం రెండు నెల‌ల్లో వ‌స్తాయి.. తెచ్చే బాధ్య‌త ఆయ‌న‌దే.. ఇదే కాకుండా కేంద్రం నుంచి భారీగా నిధులు తెప్పిస్తారు... ఇవ‌న్నీ హామీల‌ను ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో బీజేపీ కేంద్ర మంత్రులు గుప్పించారు.. మ‌రి ఓడిపోతే ఇవ‌న్నీ వ‌స్తాయో రావో.. నాకు తెలిసి ఆయ‌న‌ను గెలిపిస్తే ఇన్ని వ‌స్తాయి కాబ‌ట్టి ఓ సీటు బీజేపీకి ఇస్తే త‌ప్పు లేదేమో... ఆయ‌న గెలిచిన త‌ర్వాత ఇవి రాక‌పోతే రోజూ మండ‌లిలో నిల‌దీయొచ్చు క‌దా....!!

Thursday 19 March 2015

పొరుగు రాష్ట్రంలో మీ పార్టీ చేసేది క‌రెక్టే అయిన‌ప్పుడు ఈ రాష్ట్రంలోనూ అదే క‌రెక్టు అవుతుంది క‌దా...

ఎమ్మెల్సీ జూపూడి ప్ర‌భాక‌ర్ ఏ పార్టీ..
ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు..
ఆయ‌న పార్టీలో చేరిన వెంట‌నే అధికార ప్ర‌తినిధిగా ఎలా చేశారు..
తెలంగాణ‌లో ఉన్న టీడీపీ ఎమ్మెల్సీ అరికెల న‌ర్సారెడ్డి ఆలోచించుకోవాలి...
పొరుగు రాష్ట్రంలో మీ పార్టీ చేసేది క‌రెక్టే అయిన‌ప్పుడు ఈ రాష్ట్రంలోనూ అదే క‌రెక్టు అవుతుంది క‌దా...

ఆంధ్రా అసెంబ్లీలో ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ధ‌స్తు...!!

************

ఈటీవీలో మాత్ర‌మే వ‌చ్చే జ‌బ‌ర్ద‌స్తు ప్రోగ్రామ్‌(బూతు ప్రోగ్రాం).. ఇప్పుడు ఆంధ్రా అసెంబ్లీలోనూ వ‌స్తోంది...
ఈటీవీ జ‌బ‌ర్ద‌స్తు కేవ‌లం గంట సేపు మాత్ర‌మే వ‌స్తే.. ఆంధ్రా అసెంబ్లీలో వ‌చ్చే ఎక్స్‌ట్రా జ‌బ‌ర్థ‌స్తు రోజంతా తెలంగాణ‌, ఆంధ్రా ప్రేక్ష‌కుల‌ను రంజింప‌జేస్తోంది..
జ‌బ‌ర్థ‌స్తు కార్య‌క్ర‌మంలో నాలుగైదు టీంలు, ప‌దుల సంఖ్య‌లో క‌ళాకారులుంటే.. ఆంధ్రా అసెంబ్లీలో ప్ర‌ద‌ర్శిస్తున్న జ‌బ‌ర్ధ‌స్తులో వంద‌ల మంది స‌హ‌జ న‌టులు ఉన్నారు..
వారి నోటి వెంట డైలాగులు ఆశువుగా వ‌చ్చేస్తున్నాయి..
ఏమో ఆంధ్రా అసెంబ్లీ జ‌బ‌ర్ద‌స్తు ఇలాగే కొన‌సాగితే ఈటీవీ జ‌బ‌ర్ద‌స్తు రేటింగ్‌లు ప‌డిపోతాయేమో...!!

లేచింది మ‌హిళా లోకం.. నిద్ర లేచింది మ‌హిళా లోకం అనుకోవ‌చ్చేమో...!!




ఒక్క 10 రోజుల వ్య‌వ‌ధిలో...
-----------
కేర‌ళ అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేని కొరికిన వామ‌ప‌క్ష మ‌హిళ ఎమ్మెల్యే..
ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీలో బూతు పురాణాలు వినిపించిన రోజా..,  ఎమ్మెల్యేలు..
టీఆర్ఎస్ ఎమ్మెల్యేని నోరుమూసుకో అని హెచ్చ‌రించిన డీకే అరుణ‌...
తెలంగాణ అసెంబ్లీలో డీ కే అరుణ‌ను ఈవ్ టీజింగ్ చేశార‌న్న భ‌ట్టి విక్ర‌మార్క‌...
ఏం జ‌రుగుతోంది...!!

***********
మ‌హిళా బిల్లు రాక‌ముందే ఇంత మ‌హిళా సాధికార‌తను చూస్తున్నాన‌నంటే.. మ‌హిళా బిల్లును తీసుకొస్తే పురుష ఎమ్మెల్యేలు ఒక్క మాట అంటే చాలు.. చీపురు క‌ట్ట‌ల‌తో అసెంబ్లీలోనే కొట్టేస్తార‌ని అనిపిస్తోంది..
లేచింది మ‌హిళా లోకం.. నిద్ర లేచింది మ‌హిళా లోకం అనుకోవ‌చ్చేమో...!!

తెలంగాణ ఉద్యోగ నియామ‌కాల్లోనూ ఆంధ్రా నుంచి వ‌చ్చిన వారికి అవ‌కాశం ఇవ్వొద్దు..


 తెలంగాణ ఉద్యోగ నియామ‌కాల్లోనూ ఆంధ్రా నుంచి వ‌చ్చిన అమ్మాయిల‌కు, అబ్బాయిల‌కు అవ‌కాశం ఇవ్వొద్దు..
అలాగే ఆంధ్రాకు కోడ‌ళ్లుగా వెళ్లిన వారికి అవ‌కాశం ఇవ్వొద్దు..
ఒక‌వేళ ఇచ్చినా.. వారు ఉద్యోగాల‌కు ఎంపికైనా.. భ‌ర్త ఆంధ్ర రాష్ట్రంలో, భార్య తెలంగాణ‌లో ఉంటూ ఉద్యోగం నిర్వ‌హించ‌డం క‌ష్టం అవుతుంది..
ఆ స‌మ‌యంలో రెండింటికీ న్యాయం చేయ‌లేదు...
ఆంధ్రా ప్ర‌భుత్వం తీసుకున్న రీతిలోనే మ‌న‌మూ క‌ఠిన‌మైన నిబంధ‌న‌లు రూపొందించాలి..
ఆంధ్రాలో డీఎస్సీ నోటిఫికేష‌న్ స‌మ‌యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నా ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు..
ఇక్క‌డ కూడా విప‌క్షాలు గ‌గ్గోలు పెట్టినా స‌రే ప్ర‌భుత్వం దృఢ నిర్ణ‌యంతో ఉండాలి..

Wednesday 18 March 2015

నిజంగా ప్రిపేర్ అయిన వ్య‌క్తికి ప్ర‌తీదీ అవ‌కాశ‌మే...!!

ఎఫ్‌సీఐలో 4వేల పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌...
సింగ‌రేణిలో 5 వేల పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌..
ఎన్ఎండీసీలో ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌...
సికింద్రాబాద్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ...
తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నోటిఫికేష‌న్‌...
ఇంకా అనేక నోటిఫికేష‌న్లు...
ఇవ‌న్నీ క‌నిపించ‌డం లేదా?
నిజంగా ప్రిపేర్ అయిన వ్య‌క్తికి ప్ర‌తీదీ అవ‌కాశ‌మే...!!

మీ తెలుగు మాకొద్దు బాబూ...!! మీ సంస్కృతీ మాకొద్దు...




ఆంధ్రా అసెంబ్లీలో నిన్న చీక‌టి ప‌ర్వం కాదా?
ప్రజాస్వామ్యానికి చీక‌టి రోజు కాదా?
వారి భాషా ప్ర‌జాస్వామిక‌మేనా..
అస‌లైన తెలుగు వారిదేనా...
అదే సిస‌లైన తెలుగైతే.. అదే తెలుగు సంస్కృతైతే ఆ సంస్కృతి మాకొద్దు బాబు..
మా తెలంగాణ యాస‌, భాషే మాకు ముద్దు...
కేసీఆర్ చిన్న  మాట అంటేనే తెగ హ‌డావుడి చేసే వాళ్లు..
ఆంధ్రా అసెంబ్లీ సాక్షి సాగించిన బూతు పురాణాన్ని ఏమ‌ని వ‌ర్ణించాలి...
నిజ‌మైన భాషా ప‌రిర‌క్ష‌కులు మీరేనేమో...!!
ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌లు నిర్వ‌హించిన వారికి అసెంబ్లీలో ఆంధ్రా నేత‌లు మాట్లాడిన మాట‌లు సుమ‌ధురంగా అనిపించాయా?
తెలంగాణ నేత‌లు ఏది మాట్లాడిన బూతుగా వినిపించే మీకు ఆంధ్రా నేత‌ల బూతు పురాణం వినిపించ‌లేదా...
ఎందుకు ఎవ‌రూ నోరు మెద‌ప‌డం లేదు..
స్వ‌యం ప్ర‌క‌టిత మేధావి ఎక్క‌డికి పోయాడు...?

Tuesday 17 March 2015

ఇప్పుడు ఉత్త‌ర‌, ద‌క్షిణ భార‌తాల మ‌ధ్య చిచ్చు మొద‌లు పెడుతున్నారు..

ఇప్పుడు ఉత్త‌ర‌, ద‌క్షిణ భార‌తాల మ‌ధ్య చిచ్చు మొద‌లు పెడుతున్నారు..
ద‌క్షిణాది రాష్ట్రాల నుంచి భారీగా నిధులొస్తుంటే... వాటిని ఉత్త‌ర భార‌తంలోవెన‌క‌బ‌డిన ప్రాంతాల‌కు ఖ‌ర్చు చేస్తున్నారట‌..
ద‌క్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్ర‌ణ పాటించి దేశ అభివృద్ధికి కృషి చేస్తుంటే..
ఉత్త‌రాది రాష్ట్రాల్లో ఇబ్బ‌డి ముబ్బ‌డిగా పిల్ల‌ల్ని క‌ని పేద‌రికాన్ని పెంచిపోషిస్తున్నారు..
ఇక లోక్‌స‌భ సీట్లు కూడా ద‌క్షిణాదిలో త‌క్కువ‌గా ఉండ‌టం వ‌ల్లే ఉత్త‌రాది రాష్ట్రాల‌కు అధిక నిధులు ఇస్తున్నారు..
ఇవ‌న్నీ నా మాట‌లు కాదు... ఎన్నో ఏళ్లుగా జ‌రుగుతున్న చ‌ర్చే ఇది...
ప‌రిస్థితిని మార్చాలి.. లేక‌పోతే ప్ర‌మాద‌మే...!!

దేశంలో ఇంజినీరింగ్ కాలేజీలు ఇబ్బ‌డి ముబ్బ‌డిగా రావ‌డంపై రాష్ట్ర‌ప‌తి ఆవేద‌న‌.. నాణ్య‌తా ప్ర‌మాణాలు దెబ్బ‌తిన్నాయ‌ని బాధ‌ప‌డ్డ పెద్దాయ‌న‌..


మోడీకి షాక్ ట్రీట్‌మెంట్‌గా ఎందుకు భావించ‌లేదు..

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌ను ఓడించి కేసీఆర్‌కు షాక్ ట్రీట్‌మెంట్ ఇవ్వాలి అని బీజేపీ నేత ఎవ‌రో అన్నారు..
ఒక్క ఎమ్మెల్సీ ఎన్నిక‌లో బీజేపీ గెలిస్తే అది కేసీఆర్‌కు షాక్ ట్రీట్‌మెంట్ అవుతుంద‌నుకుంటే..
మ‌రి ఢిల్లీలో 67 స్థానాల‌తో పాటు పీఠాన్ని కోల్పోవ‌డం మోడీకి షాక్ ట్రీట్‌మెంట్‌గా ఎందుకు భావించ‌లేదు..

Monday 16 March 2015

ఒక్క మోడీ త‌ప్ప‌.. అంద‌రూ వ‌స్తారేమో..!!

తెలంగాన‌లో జ‌రుగుతున్న రెండు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌చారానికి కేంద్ర మంత్రులు  ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్‌, నిర్మ‌లా సీతారామ‌న్‌, వెంక‌య్య‌నాయుడు, సదానంద గౌడ‌లు వ‌చ్చారు.. ఇంకెంత మంది వ‌స్తారో తెలియ‌దు... ఇన్ని రోజులు విశాఖ విద్యుత్‌లో తెలంగాణ‌కు వాటా ఉందా అంటే నోరు మెద‌ప‌ని వారు ఇప్పుడు తెలంగాణ‌కు వాటా ఉందంటున్నారు.. విద్యుత్ క‌ష్టాలు తీరుస్తామంటున్నారు... హైకోర్టును రెండు నెల‌ల్లో ఏర్పాటు చేస్తామంటున్నారు... దామ‌ర‌చ‌ర్ల విద్యుత్ ప్రాజెక్టుకు రెండు రోజుల్లో ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు ఇస్తామంటున్నారు... నిజంగా ఒక్క హైద‌రాబాద్ ఎమ్మెల్సీ సీటు కోసం బీజేపీ వాళ్లు ఇన్ని హామీలు ఇస్తున్నారు... మ‌రి ఇన్ని రోజులు ఈ హామీలు ఎందుకు ఇవ్వ‌లేదు...?
వీళ్ల‌ను క‌ల‌వ‌డానికి కేసీఆరే ఢిల్లీ వెళ్లే ప‌రిస్థితి ఉండేది.. ఎమ్మెల్సీ ఎన్నిక పుణ్య‌మా అని వచ్చి మ‌రీ హామీలు ఇస్తున్నారు..!!
వీళ్ల‌ను న‌మ్మొచ్చా?

Sunday 15 March 2015

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల వ‌ర‌కు ఈ హామీ ఉంటుందా?



ఎమ్మెల్సీ ఎన్నిక‌ల వ‌ర‌కు ఈ హామీ ఉంటుందా?
ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత ప‌త్తాలేకుండా పోతారేమో?
హైకోర్టు కోసం స్థ‌లం చూపించాల‌ని స‌దానంద గౌడ గారు తెలంగాణ సీఎంను కోరారు.. ఓ లేఖ ఇవ్వాల‌ని అంటున్నారు..
అప్ప‌ట్లో కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్‌ను క‌ల‌వ‌డం, అప్ప‌ట్లో న్యాయ శాఖ మంత్రిగా ఉన్న వేరే అత‌డిని(బ‌హుషా ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ అయి ఉండొచ్చు) క‌ల‌వ‌డం జ‌రిగింది..
ఆ త‌ర్వాత కింగ్‌కోఠి లోని నిజాం ప్యాలెస్‌ను ప‌రిశీలించ‌డం జ‌రిగింది.. అంటే న్యాయ మంత్రి మారిన ప్ర‌తీసారి ఢిల్లీకి వెళ్లి కొత్త విజ్ఞ‌ప్తులు ఇవ్వాలేం.. స‌దానంద గౌడ గారి భాష చూస్తే అలాగే అనిపిస్తోంది...
హైకోర్టు కోసం ఉద్య‌మిస్తున్న న్యాయ‌వాదులు కేంద్రంపై ఆగ్ర‌హంగా ఉండ‌టంతో వారిని శాంతింప‌జేయ‌డానికి బీజేపీ వాళ్లు ఈ మాట‌లు మాట్లాడించిన‌ట్లు తెలుస్తోంది..
లేక‌పోతే ర‌విశంక‌ర్ ప్ర‌సాద్‌ను క‌లిసి ఆరు నెల‌లు గ‌డిచింది క‌దా.. ఇప్ప‌టికీ హైకోర్టు విష‌యంలో చిన్న ముంద‌డుగు కూడా ప‌డ‌లేదు ఎందుకో?

ఇది ఆంధ్ర‌జ్యోతి విచిత్ర జ‌ర్న‌లిజం...!!

డిజైన్ మార్చ‌కుండా నిర్మాణం సాగిస్తే అయ్యో నిర్వాసితుల గోస ప‌ట్టేదెవ‌రికీ...
మ‌హారాష్ట్ర‌ను ఒప్పించ‌డం ఎలా?
ప్రాణ‌హిత అసాధ్య‌మే...అంటూ రాత‌లు రాస్తుంది..
మ‌హారాష్ట్ర డిమాండ్ మేర‌కు డిజైన్ మార్చితే.. జాతీయ హోదా ద‌క్కుతుందా?
నిర్వ‌హ‌ణ వ్య‌యం పెరిగిపోదా?
ఇదేం వైఖ‌రి అంటూ రాస్తుంది...
ఇది ఆంధ్ర‌జ్యోతి విచిత్ర జ‌ర్న‌లిజం...!!
-------------------
నోట్‌:  వాట‌ర్ గ్రిడ్ క‌న్నా ముందు పేలియో ఛానెల్ ప‌ద్ధ‌తిలో నీరు ఇద్దామ‌ని స‌ర్కారు ప్ర‌తిపాదించి ఉంటే.. అయ్యో.. వాటర్ గ్రిడ్ లాంటి విజ‌య‌వంత‌మైన ప‌థ‌కం ఉండ‌గా పేలియో ఛానెల్ దండ‌గా అని రాసేదేమో... ప్ర‌భుత్వం వాట‌ర్ గ్రిడ్ అన‌డంతో పేలియో ఛానెల్ బెస్టు అని నిపుణుల అభిప్రాయం అన్న‌ట్లు రాసింది... 

ఇది మ‌రో ఫాస్టు ప‌థ‌కంగా మారుతుందా?

ఆంధ్రా ప్రాంతానికి చెందిన 26 కులాల‌ను బీసీ కులాల జాబితా నుంచి తొల‌గించిన తెలంగాణ స‌ర్కారు..
ఇక ఆంధ్రా అనుకూల పార్టీలు ఆందోళ‌న చేయ‌డం ఖాయం...
ఆ కులాల వారిని బీసీల జాబితాలో చేర్చాలి... భ‌విష్య‌త్తులో ఆంధ్రా నుంచి ఇక్క‌డ‌కు వ‌లస వ‌చ్చే వారికి ఇక్క‌డ బీసీ ప్ర‌యోజ‌నాల ద‌క్కాలి.. మ‌న వారి నోట్లో మ‌ట్టి కొట్టినా ప‌ర్వాలేదు అన్న రీతిలో ఆందోళ‌న జ‌ర‌గ‌డం ఖాయ‌మేమో...!!
ఇది మ‌రో ఫాస్టు ప‌థ‌కంగా మారుతుందా?  ఎవ‌డ‌న్నా కోర్టుకు వెళ‌తాడా వేచిచూడాలి...!!

సీఎం ర‌మ‌ణ్‌సింగ్ ఇలాగే అభ్యంత‌రం చెబుతాడా?

మొన్నామ‌ధ్య ప్రాణ‌హిత ప్రాజెక్టు కోసం సీఎం కేసీఆర్ మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో భేటీ అయ్యారు.. ప్రాణ‌హిత వ‌ల్ల మ‌హారాష్ట్ర‌లోని కొంత భూమి ముంపున‌కు గుర‌వుతుంద‌ని ఆ రాష్ట్ర సీఎం అన్నారు.. అంతే... ప్రాజెక్టు డిజైన్ మార్చుతామ‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు..
మ‌రి పోల‌వ‌రం వ‌ల్ల తెలంగాణ‌, ఒడిశా, ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ట్రాల్లోని వేల ఎక‌రాలు ముంపున‌కు గుర‌వుతున్నాయి క‌దా... మ‌రి చంద్ర‌బాబు నాయుడు డిజైన్ మార్చ‌డానికి సిద్ధం అవుతలేడు ఎందుకు?
ప్రాణ‌హిత క‌డితే మ‌హారాష్ట్ర‌కు న‌ష్ట‌మ‌ని బీజేపీ సీఎం వాదించాడు.. మ‌రి పోల‌వ‌రం క‌డితే ఛ‌త్తీస్‌గ‌ఢ్‌కు న‌ష్ట‌మ‌ని బీజేపీ సీఎం ర‌మ‌ణ్‌సింగ్ ఇలాగే అభ్యంత‌రం చెబుతాడా?

సీమాంధ్ర‌కు అనుకూల టీడీపీకి వేసిన‌ట్లు అవుతుందా? కాదా?

టీఆర్ఎస్‌కు ఓటేస్తే ఎంఐఎంకు వేసిన‌ట్లే..
బీజేపీకి వేస్తే.. పాకిస్థాన్ అనుకూల పీడీపీకి, సీమాంధ్ర‌కు అనుకూల టీడీపీకి వేసిన‌ట్లు అవుతుందా?  కాదా?

విష్ యూ ఆల్ ద బెస్టు... తెలంగాణ‌లోని వ‌నిత‌ల‌కు మీరు స్ఫూర్తిప్ర‌దాత కావాల‌ని ఆకాంక్షిస్తున్నా..!!


Monday 9 March 2015

అలా చేయ‌గ‌లిగిదే అది ప్ర‌తిపక్షాల విజ‌య‌మే..

భూసేక‌ర‌ణ బిల్లులో కీల‌క స‌వ‌ర‌ణ‌లు చేయించ‌గ‌లిగితే అది ప్ర‌తిప‌క్షాల స‌మ‌ష్టి విజ‌యం అవుతుంది... ముఖ్యంగా కాంగ్రెస్ విజ‌యం అవుతుంది.. భూ సేక‌ర‌ణ బిల్లులో స‌వ‌ర‌ణ‌లు అత్యంత అవ‌స‌రం.. వీలైతే పాత చ‌ట్టాన్ని కొన‌సాగించేలా చూడాలి... ఎన్డీయే తెచ్చిన చ‌ట్టం వ‌ల్ల భూ య‌జ‌మాని హ‌క్కుల‌ను కోల్పోయే ప్ర‌మాదం ఉంది...

సంఘ్ ప‌రివార్ ఎందుకు మౌనంగా ఉంది?

అప్ప‌ట్లో ఓ అనుమానిత తీవ్ర‌వాది ఇంటికి ష‌బ్బీర్ అలీ వెళితే తెగ హ‌డావుడి చేశారు..
డీజేఎస్ అధినేత‌ను ఎంఐఎం ఎంపీ త‌న కారులో తీసుకెళితే త‌ప్పు ప‌ట్టారు...
మ‌రి న‌ర‌న‌రానా భార‌త వ్య‌తిరేక‌త‌ను పెంచుకున్న కాశ్మీర్ వేర్పాటు వాద నాయ‌కుడిని బీజేపీ సంకీర్ణ సర్కారు విడుద‌ల చేస్తే  సంఘ్ ప‌రివార్ మౌనంగా ఉంది ఎందుకు?

మ‌హిళా బిల్లు పేరు ఎత్తితే చాలు వీళ్లంతా ఎందుకు అగ్గి మీద గుగ్గిలాలు అవుతారు...?

మొన్న అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వాన్ని పార్టీల‌కు అతీతంగా అంద‌రూ ఘ‌నంగా చేశారు.. ఘ‌న‌మైన ఉప‌న్యాసాలు ఇచ్చారు.. మ‌రి మ‌హిళ సాధికార‌త కోసం వీరు ఇంత‌గా తాప‌త్ర‌య‌ప‌డే వారే అయితే పార్ల‌మెంట్‌లో మ‌హిళా బిల్లు ఎందుకు పాస్ అవ‌డం లేదు... మ‌హిళా బిల్లు పేరు ఎత్తితే చాలు వీళ్లంతా ఎందుకు అగ్గి మీద గుగ్గిలాలు అవుతారు...?

Wednesday 4 March 2015

ఈ బాబేంది రో.. వాడి రుబాబేంది రా?

ఈ ఊరు మ‌న‌ది రా.. ఈ వాడ మ‌న‌ది రా...
ఈ భూమి మ‌న‌దిరా.. ఈ భుక్తి మ‌న‌దిరా..

ఈ దొర ఏందిరా.. వాడి పీకుడేంది రా అన్న పాట‌ను స్ఫూర్తిగా తీసుకోవ‌డం లేదా ఆంధ్రా రైతులు..
ఈ బాబేంది రో.. వాడి రుబాబేంది రా? అని బాణీ మార్చి పోరాటాలు చేయొచ్చు క‌దా..!!

-----
చూస్తుంటే బాబు గారి తెలంగాణ ప్ర‌జ‌ల‌కే రాజ‌కీయ చైత‌న్యాన్ని ఇచ్చిన‌ట్లు ఉన్నారు..
ఆంధ్రా ప్ర‌జ‌ల‌కు ఆయ‌న ఆ చైత‌న్యాన్ని ఇవ్వ‌లేదేమో పాపం...!!

కొంప‌దీసి ఈ *క‌మ్మ‌*టి భూ స‌మీక‌ర‌ణ మీకు న‌చ్చిందా?

తెలంగాణ‌లో పేదోడి గుంట భూమిని స‌ర్కారు గుంజుకుంటే ఎర్ర జెండాలు పాత‌డం...
అక్క‌డ క‌ట్ట‌బోయే నిర్మాణాల పునాదుల‌ను కూల్చ‌డం...
వీలైతే పోలీసుల తుపాకీ తూటాల‌కు అమాయ‌కుల‌ను బ‌లిచేసి ప్ర‌జా ఉద్య‌మాల‌ను విజ‌య‌వంతం చేసే ఎర్ర పార్టీలు ఏమ‌య్యాయి..
పొరుగు రాష్ట్రంలో 32 వేల ఎక‌రాల‌ను సేక‌రిస్తే ఒక్క ప్ర‌జా ఉద్య‌మ‌మూ లేదా?
అప్పుడెప్పుడో ర‌ష్యాలో వ‌ర్షం ప‌డితే ఇక్క‌డ గొడుగులు ప‌ట్టేవార‌ని విన్నాం..
ఇప్పుడేమో ఆంధ్రాలో భూముల‌ను లాక్కుంటుంటే తెలంగాణ‌లో ప్ర‌జా ఉద్య‌మాలకు సిద్ధం అవుతుండ‌టం చూస్తున్నాం.. జ‌న జాత‌ర‌లు చేసుకుంటున్నార‌ని తెలుస్తుంది...
కొంప‌దీసి ఈ *క‌మ్మ‌*టి భూ స‌మీక‌ర‌ణ మీకు న‌చ్చిందా?
అందుకే మౌనంగా అన్నా హ‌జారే త‌ర‌హా ఉద్య‌మాన్ని  చేసుకుంటున్నారా?
-------------------------------------

చీక‌ట్లో జైట్లీ సారును క‌ల‌వాల్సిన ప‌రిస్థితి ఉంటుంది జాగ్ర‌త్త‌.

బీజేపీ మోసం చేసింది అని ప‌దేప‌దే మోడీనో లేదా వెంక‌య్య‌నో ఇంకెవ‌రిపైనో విమ‌ర్శ‌లు చేస్తే మ‌ళ్లా మీ అధినేత చీక‌ట్లో జైట్లీ సారును క‌ల‌వాల్సిన ప‌రిస్థితి ఉంటుంది జాగ్ర‌త్త‌... గ‌తంలో ఇలాగే సోనియాను మీరు తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిడితే మీ సారు చీక‌ట్లో చిదంబ‌రాన్ని క‌లిసి మ‌రీ రాజీ చేసుకొచ్చారు.. త‌న‌ను తాను కాపాడుకున్నారు.. మీ అత్యుత్సాహానికి బాబు గారిని బ‌లి చేయొద్దు... ఇది వాజ్‌పేయి జ‌మానా కాద‌ని.. ఎగిరెగిరి ప‌డితే క‌ష్ట‌మ‌ని... ఇప్పుడు త‌గ్గి ఉంటేనే త‌న‌కు శ్రీ‌రామ ర‌క్ష అన్న విష‌యం ఆయ‌న‌కు తెలుసు...ఇంకా తెలుసుకోవాల్సింది మీరే.. !!

Tuesday 3 March 2015

సీపీఎం జ‌న జాత‌ర‌లో అమ‌రుల‌ను యాదికి తెచ్చుకుందా?

సీపీఎం జ‌న జాత‌ర‌లో అమ‌రుల‌ను యాదికి తెచ్చుకుందా?
నిజాంకు వ్య‌తిరేకంగా కొట్లాడిన చ‌రిత్ర మాదే అని చెప్పుకుందా?
అలాగే 1969, 2009లో తెలంగాణ ఉద్య‌మానికి అడ్డుప‌డిన చ‌రిత్ర మాదే అని చెప్పుకుందా?
క‌నీసం ప్ర‌జా ఉద్య‌మాల‌ను గుర్తించ‌లేక‌పోయాం మ‌న్నించండి  అని తెలంగాణ‌ను కోరిందా?
------------------
తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన‌ప్ప‌టి నుంచి మ‌న వ‌ద్ద క‌మ్యూనిస్టు పార్టీలు ఏదో ఒక కార్య‌క్ర‌మాన్ని పెడుతూ తెగ హ‌డావుడి చేస్తున్నాయి.. ముఖ్యంగా సీపీఎం పార్టీ అయితే చాలా హుషార్ చేస్తోంది... విచిత్రం ఏంటో కానీ తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ఈ పార్టీ మౌనంగా ఉండ‌ట‌మే కాకుండా బిల్లుకు అడ్డుప‌డింది.. సీతారాం ఏచూరి అయితే ప్రాణాలు అడ్డుపెట్టి మ‌రీ విశాలాంధ్ర‌ను కాపాడాల‌ని చూశాడు.. ఒక‌ప్పుడు మా భుజంపై తుపాకీ పెట్టి తెలంగాణ‌ను అడ్డుకోవాల‌ని చూడొద్దు అన్న వారి రంగ ఏడాది క్రితం బ‌య‌ట‌ప‌డింది.. పోనీలే వీళ్ల కుప్పిగంతులు మ‌న రాష్ట్రం మ‌న‌కు వ‌చ్చింద‌ని మ‌నం సంబ‌రాల్లో ఉంటే వీళ్లు తెలంగాన‌లో పాగా వేసేందుకు ఎత్తులు వేస్తున్నారు.. తెలంగాణ‌ను అడ్డుకున్న వీరి కార్య‌క్ర‌మాల్లోకి గ‌ద్ద‌ర్, ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి త‌దిత‌రులు వెళ్తుండ‌టం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది.. ప్ర‌జా ఉద్య‌మాల పార్టీ కాబ‌ట్టి వెళుతున్నార‌ని అనుకుంటే మ‌రి తెలంగాణ ప్ర‌జా ఉద్య‌మ‌మే క‌దా.. వెయ్యి మంది బ‌లిదానం ప్ర‌జా ఉద్య‌మం కోస‌మే కదా.. వారి బ‌లిదానాల‌కు క‌రిగిపోని సీపీఎం పార్టీని ప్ర‌జా ఉద్య‌మాల పార్టీ అని అనుకోవ‌చ్చా?  
వీళ్ల కార్య‌క్ర‌మాలు ఎప్పుడు జ‌రిగినా స‌రే నిజాంకు, రజాకార్ల‌కు వ్య‌తిరేకంగా కొట్లాడినం అని చెప్పుకుంటారు.. నిజ‌మే నిజాంకు, రజాకార్ల‌కు వ్య‌తిరేకంగా కొట్లాడినం అని ఎంత గ‌ర్వంగా చెప్పుకుంటున్నారో అంతే గ‌ర్వంగా తెలంగాణ బిల్లుకు అడ్డుప‌డ్డామ‌ని ఎందుకు చెప్పుకోవ‌డం లేదు...  అసలు 60 ఏళ్ల పాటు ఆంధ్రాతో తెలంగాణ క‌లిసి ఉండ‌టానికి మా క‌మ్యూనిస్టు పార్టీలే కార‌ణం... తెలంగాణ 60 ఏళ్ల పాటు న‌ర‌క‌యాత‌న అనుభ‌వించ‌డానికి మా విశాలాంధ్ర ఉద్య‌మ‌మే కార‌ణం అని గ‌ర్వంగా చెప్పుకోండి.. క‌నీసం 1969, 2009 ప్ర‌జా ఉద్య‌మాల‌ను గుర్తించ‌లేద‌ని క్ష‌మాప‌ణ కూడా కోర‌లేదు మీరు.. రేప‌టి తెలంగాణ యువ‌త‌రానికి సీపీఎం పార్టీ  ఏంటో, దాని చ‌రిత్ర ఏంటో తెలుసుకొనేందుకు వీలుగా మొత్తం చ‌రిత్ర‌ను చెప్పండి.. కేవ‌లం నిజాం వ్య‌తిరేక పోరాటాన్ని చెప్పి, 1969, 2009 తెలంగాణ పోరాటంలో శూన్యంగా ఉన్న మీ చ‌రిత్ర‌ను చెప్ప‌కుండా ఎన్ని జ‌న జాత‌ర‌లు చేసినా ప్ర‌యోజ‌నం ఉండ‌దు.. !!

ఆ బీబీసీ జ‌ర్న‌లిస్టుకు మ‌న రాధాకృష్ణ గారే స్ఫూర్తి ప్ర‌దాత కావొచ్చు..

నిర్భ‌య కేసులో శిక్ష అనుభ‌విస్తున్న నేర‌స్తుడిని ఇంట‌ర్వ్యూ చేయడం.. దాన్ని ప్ర‌ముఖంగా ప్ర‌చురించ‌డం ముమ్మాటికీ త‌ప్పే... జ‌ర్న‌లిస్టుగా ఉన్న స్వేచ్ఛ‌ను ఉప‌యోగించుకోవాల‌ని నేర‌స్తుడి మ‌న‌సులో మాట‌ను(మ‌న రాధాకృష్ణ గారి ఓపెన్ హార్ట్) బ‌య‌ట పెట్టే ప్ర‌య‌త్నాన్ని ఆ పాత్రికేయుడు చేశాడు...   మ‌న రాధాకృష్ణ గారు అప్ప‌ట్లో సినీ న‌టుడు చ‌ల‌ప‌తిరావు గారి ఇంట‌ర్వ్యూ చేస్తూ మీకు నిజంగా రేప్ చేయాల‌ని అనిపించ‌లేదా?
అంటూ టీవీ ఛానెల్ లోనే అడిగిన విష‌యాన్ని ఎలా మ‌ర‌చిపోతాం... పాపం ఆ బీబీసీ పాత్రికేయుడు ఇలాంటి రాధాకృష్ణ‌ల‌ను స్ఫూర్తిగా తీసుకొనే నిర్భ‌య హంత‌కుడి ఇంట‌ర్వ్యూ చేశాడ‌ని అనిపిస్తోంది...
--------------
ఏది ఏమైనా జ‌ర్న‌లిజం రంగంలోకి అడుగుపెట్టేవారికి, మీడియా సంస్థ‌ల‌ను స్థాపించే వారికి డ‌బ్బు, దూకుడు క‌న్నా నైతిక విలువ‌లు, విచ‌క్ష‌ణ ఉంటే ఎంతో బాగుంటుంది.. స‌మాజానికి ఏది మంచి ఏది చెడో చెప్పాల్సిన వాళ్లు చెడ్డ‌వారిని మంచివారిగా చిత్రీక‌రించే వార్త‌లు రాస్తే స‌మాజ ప‌య‌నం అధోగ‌తి వైపే...

తెలంగాణ‌కు ప్ర‌త్యేక హైకోర్టు ఆవ‌శ్య‌క‌త ఎంతైనా ఉంద‌ని అనిపిస్తుంది..

తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ఎమ్మెల్యేలు రాజీనామా చేసినా ఆమోదించ‌మంటే ఆమోదించ‌లేదు... నెల‌ల నెల‌లు పెండింగ్ లో ఉంచారు..
వైసీపీలోకి అధికార పార్టీ ఎమ్మెల్యేలు జంప్ అయిన‌ప్పుడు అన‌ర్హ‌త వేటు వేయ‌కుండా ఏళ్ల త‌ర‌బ‌డి పెండింగ్ లో ఉంచారు.. ఆ స‌మ‌యంలో హైకోర్టు జోక్యం చేసుకుందా?
స్పీక‌ర్‌కు విచ‌క్ష‌ణాధికారాలుంటాయ‌ని మేధావులు టీవీ చ‌ర్చ‌ల్లో కూడా వాదించారు.. ఇప్పుడేమో ఉమ్మ‌డి హైకోర్టు స్పీక‌ర్‌కు, మండలి ఛైర్మ‌న్‌కు నోటీసులు ఇచ్చింది...
మ‌రి ఆంధ్రాలోనూ ఇలాగే కొంద‌రు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధికార పార్టీలో చేరారు క‌దా వారికి కూడా నోటీసులు ఇస్తుందా?
ఇవ‌న్నీ చూస్తుంటే తెలంగాణ‌కు ప్ర‌త్యేక హైకోర్టు ఆవ‌శ్య‌క‌త ఎంతైనా ఉంద‌ని అనిపిస్తుంది..

Monday 2 March 2015

అలా చేస్తే గ్రేట‌ర్ పీఠం బీజేపీదే..!!

కొద్ది నెల‌ల్లో జ‌రిగే గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ఎంఐఎం-బీజేపీలు పొత్తుపెట్టుకుంటే ముమ్మాటికీ గ్రేట‌ర్ పీఠం వారిదే అవుతుంది.. మ‌రి అమిత్ షా వ‌చ్చి మంత్రాంగం న‌డిపిస్తారా?  లేక వెంక‌య్య‌నాయుడు గారొచ్చి చ‌ర్చ‌లు జ‌రుపుతారా?  లేక కిష‌న్‌రెడ్డే వెళ్లి చర్చ‌లు చేస్తారా?  ఆలోచించుకోవాలి... హైద‌రాబాద్‌లోనూ కొత్త మిత్రుల‌తో స‌రికొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు మంచి అవ‌కాశం ఇది..అలాగే గ్రేట‌ర్ పీఠాన్ని ద‌క్కించుకునేందుకు స‌రికొత్త వ్యూహ‌మిది...  గ్రేట‌ర్‌లో పాగా వేసిన త‌ర్వాత మేయ‌ర్ ప్ర‌మాణ స్వీకారానికి మోడీ గారు వ‌స్తారు.. బీజేపీ అధినాయ‌క‌త్వం త‌ర‌లివ‌స్తుంది... 
నోట్‌: ఒక‌వేళ బీజేపీ ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్న త‌ర్వాత ఎంఐఎం నేత‌లు ఎలాంటి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసినా బీజేపీ సైలెంట్‌గా ఉంటుంది... వీలైతే స‌మ‌ర్థిస్తుంది కూడా..