**************************
అన్నపూర్ణ స్టూడియో ఆస్తుల జప్తు వార్త పెద్ద వార్తా చిన్న వార్త..
దాసరి ఆస్తుల జప్తునకు రంగం సిద్ధం.. ఇది పెద్ద వార్తా చిన్న వార్తా..
మరి ఇదే టీఆర్ఎస్‌లోనో, తెలంగాణలో ఇంకో గల్లీ లీడర్ విషయంలో జరిగితే గగ్గోలు పెట్టేవారు కారా..?
మరి వీరి ఆస్తుల జప్తు చేస్తే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ డ్యామేజీ కాదంటారా?
హైదరాబాద్‌లోని సీమాంధ్రులు అభద్రతకు గురి కారంటారా?
హైదరాబాద్ నుంచి పెట్టుబడులు, సినీ పరిశ్రమ వెనక్కి వెళ్లదంటారా?
మరి కేంద్ర ప్రభుత్వ సంస్థలు తప్పు చేసిన వ్యక్తుల ఆస్తులను జప్తు చేసేందుకు పూనుకుంటే అది చట్టం తనపని తాను చేసుకుపోవడం అవుతుంది..
మరి అదే పనిని తెలంగాణ ప్రభుత్వం చేయాలనుకుంటే కక్ష సాధింపు చర్యగా కనిపిస్తుంది ఎందుకు?
ఈ రెండు ఉదంతాలను చూసైనా తెలంగాణ ప్రభుత్వం ఆక్రమిత స్థలాల విషయం కఠినంగా ముందుకు వెళ్లాలని విజ్ఞప్తి..
నాగార్జునకు చెందిన ఎన్ కన్విన్షన్ సెంటర్‌పై చర్యలు ఎందుకు ఆగిపోయాయి...?
కేంద్ర ప్రభుత్వ సంస్థలు చూపిస్తున్న దూకుడునే తెలంగాణ ప్రభుత్వమూ చూపించాలని ఆశిస్తున్నా..
No comments:
Post a Comment