ఏమన్నా అంటే డిగ్రీలు చదువుకున్నాం అంటారు.. మేధావులుగా ఫోజులు కొడతారు... తెలియని విషయాలను తెలుసుకోవాలన్న కూతూహలం ఉండదు.. తమకు తెలిసిందే వేదం అనుకుంటారు కాబోలు... ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చూస్తే పట్టభద్రులకు ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన కొరవడినట్లు కనిపిస్తోంది.. ముఖ్యంగా ఎలా ఓటేయాలో సరిగా తెలియకపోవడంతో దాదాపు 28 వేల ఓట్లు చెల్లకుండా పోయాయి... అసలే పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది.... ఇందులో రంగారెడ్డిలో దాదాపు 9 వేల ఓట్లు, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గంలో 19 వేల ఓట్లు చెల్లకుండా పోయాయి... ఇంటర్నెట్‌లో ఎన్నో సైట్లు చూసే పట్టభద్రులు.. ఎన్నికల సంఘం సైట్‌ను చూసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలా ఓటేయాలో తెలుసుకుంటే బాగుండేది... ఎన్నికల సంఘం కూడా వీలైనంత ఎక్కువ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి... పట్టభద్రుల్లో చైతన్యం కలిగించాలి...
No comments:
Post a Comment