సోమేశ్ కుమార్ ఆంధ్రజ్యోతితో ఏం శత్రుత్వం పెట్టుకున్నాడో కానీ... రోజూ ఆయనకు వ్యతిరేకంగా రాసేదే రాస్తున్నాడు..
బహుషా ఆంధ్రజ్యోతి రిపోర్టర్‌కు ఏమైనా పనిచేసిపెట్టలేదో.. మరి ఆంధ్రజ్యోతి పెద్దమనుషులకు ఏమైనా నష్టం కలిగించాడో అర్థం కావడం లేదు..
మొన్నటికి మొన్న ఆస్తి పన్ను బకాయిల వసూలుకు జీహెచ్ఎంసీ కఠిన చర్యలు తీసుకుంటే.. అయ్యో ఇదేం చోద్యం.. పన్ను వసూలుకు చెత్త డబ్బాలు పెడతారా? అంటూ ఆంధ్రజ్యోతే రాసింది... చివరకు ఆ డబ్బాలు తీయించేలా ఒత్తిడి తెచ్చింది..
మొండి బకాయిదారులు పన్నులు కట్టకుండా కోర్టుకు వెళితే వారి వార్తలకు ప్రాధాన్యం ఇచ్చింది..
ఇప్పుడు జీహెచ్ఎంసీ ఆదాయం పెరిగినా కూడా అందులో సోమేశ్ కుమార్ కృషి ఏమాత్రం లేదు..
అంతా బడాయి కొట్టాడు కానీ పన్నులు వసూలులో ఏమీ చేయలేదు అంటూ కథనం వడ్డించింది...
ఆయన చేస్తున్న పనికి ఆటంకం కలిగించి.. ఆ పనులను అడ్డుకోవడం.. చివరికి ఏమీ చేయలేని వాడిగా చిత్రీకరించడం... మీ జర్నలిజం విలువలకు హ్యాట్సాఫ్... ఎల్లో జర్నలిజం చరిత్రలో మీ పేరు సువర్ణాక్షరాలతో లిఖించాల్సిందే..!!
నోట్: అసలు లోగుట్టు తెలవకుండా పత్రిక చదివే వాళ్లను వెర్రి వెంగలప్పలను చేయడంలో వీరు దిట్ట...

No comments:
Post a Comment