ప్రస్తుత హైకోర్టు భవనం తెలంగాణ ఆస్తి అని విభజన చట్టంలో ఉందని, హైకోర్టును ఏర్పాటు చేయాల్సింది ఆంధ్రాకేనని హైకోర్టు న్యాయమూర్తులు నిన్న వ్యాఖ్యానించారు.. దీనిపై ఈనాడు పత్రికలో ఎక్కడా కూడా హెడ్డింగ్‌లోనూ, డెక్‌లోనూ ప్రస్తుత హైకోర్టు భవనం తెలంగాణ ఆస్తి అని పేర్కొనకపోవడం గమనార్హం.. ఇది తెలంగాణకు అనుకూలమైన వ్యాఖ్యా కాబట్టి వేయడానికి రామోజీ పత్రికకు మనసొప్పలేదు.. అదే వ్యతిరేకంగా ఏ చిన్న మాట అని ఉన్నా సరే దాన్ని ప్రధాన శీర్షికగా పెట్టి కథనాన్ని రాసేది... ఇప్పటికైనా అధికారంలో ఉన్న వారు ఆంధ్ర పత్రిక తీరును అర్థం చేసుకోవాలి.. మీరు ఎంత పొగిడినా వాళ్లు మారడం అసంభవమే.. అధికారం ఉన్న మీ చుట్టూ వాళ్లు తిరగాలి కానీ.. మీరు వారిని ఆకాశానికి ఎత్తేయడం మానుకోవాలి... తెలంగాణ ఆత్మగౌరవాన్ని హిమాలయ శిఖరం అంత ఎత్తుకు తీసుకెళ్లాలి తప్ప తెలంగాణకు వ్యతిరేకంగా కుయుక్తులు పన్నేవారి పాదాల చెంత తాకట్టు పెట్టొద్దు !!
No comments:
Post a Comment