1

1

Tuesday, 3 March 2015

సీపీఎం జ‌న జాత‌ర‌లో అమ‌రుల‌ను యాదికి తెచ్చుకుందా?

సీపీఎం జ‌న జాత‌ర‌లో అమ‌రుల‌ను యాదికి తెచ్చుకుందా?
నిజాంకు వ్య‌తిరేకంగా కొట్లాడిన చ‌రిత్ర మాదే అని చెప్పుకుందా?
అలాగే 1969, 2009లో తెలంగాణ ఉద్య‌మానికి అడ్డుప‌డిన చ‌రిత్ర మాదే అని చెప్పుకుందా?
క‌నీసం ప్ర‌జా ఉద్య‌మాల‌ను గుర్తించ‌లేక‌పోయాం మ‌న్నించండి  అని తెలంగాణ‌ను కోరిందా?
------------------
తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన‌ప్ప‌టి నుంచి మ‌న వ‌ద్ద క‌మ్యూనిస్టు పార్టీలు ఏదో ఒక కార్య‌క్ర‌మాన్ని పెడుతూ తెగ హ‌డావుడి చేస్తున్నాయి.. ముఖ్యంగా సీపీఎం పార్టీ అయితే చాలా హుషార్ చేస్తోంది... విచిత్రం ఏంటో కానీ తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ఈ పార్టీ మౌనంగా ఉండ‌ట‌మే కాకుండా బిల్లుకు అడ్డుప‌డింది.. సీతారాం ఏచూరి అయితే ప్రాణాలు అడ్డుపెట్టి మ‌రీ విశాలాంధ్ర‌ను కాపాడాల‌ని చూశాడు.. ఒక‌ప్పుడు మా భుజంపై తుపాకీ పెట్టి తెలంగాణ‌ను అడ్డుకోవాల‌ని చూడొద్దు అన్న వారి రంగ ఏడాది క్రితం బ‌య‌ట‌ప‌డింది.. పోనీలే వీళ్ల కుప్పిగంతులు మ‌న రాష్ట్రం మ‌న‌కు వ‌చ్చింద‌ని మ‌నం సంబ‌రాల్లో ఉంటే వీళ్లు తెలంగాన‌లో పాగా వేసేందుకు ఎత్తులు వేస్తున్నారు.. తెలంగాణ‌ను అడ్డుకున్న వీరి కార్య‌క్ర‌మాల్లోకి గ‌ద్ద‌ర్, ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి త‌దిత‌రులు వెళ్తుండ‌టం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది.. ప్ర‌జా ఉద్య‌మాల పార్టీ కాబ‌ట్టి వెళుతున్నార‌ని అనుకుంటే మ‌రి తెలంగాణ ప్ర‌జా ఉద్య‌మ‌మే క‌దా.. వెయ్యి మంది బ‌లిదానం ప్ర‌జా ఉద్య‌మం కోస‌మే కదా.. వారి బ‌లిదానాల‌కు క‌రిగిపోని సీపీఎం పార్టీని ప్ర‌జా ఉద్య‌మాల పార్టీ అని అనుకోవ‌చ్చా?  
వీళ్ల కార్య‌క్ర‌మాలు ఎప్పుడు జ‌రిగినా స‌రే నిజాంకు, రజాకార్ల‌కు వ్య‌తిరేకంగా కొట్లాడినం అని చెప్పుకుంటారు.. నిజ‌మే నిజాంకు, రజాకార్ల‌కు వ్య‌తిరేకంగా కొట్లాడినం అని ఎంత గ‌ర్వంగా చెప్పుకుంటున్నారో అంతే గ‌ర్వంగా తెలంగాణ బిల్లుకు అడ్డుప‌డ్డామ‌ని ఎందుకు చెప్పుకోవ‌డం లేదు...  అసలు 60 ఏళ్ల పాటు ఆంధ్రాతో తెలంగాణ క‌లిసి ఉండ‌టానికి మా క‌మ్యూనిస్టు పార్టీలే కార‌ణం... తెలంగాణ 60 ఏళ్ల పాటు న‌ర‌క‌యాత‌న అనుభ‌వించ‌డానికి మా విశాలాంధ్ర ఉద్య‌మ‌మే కార‌ణం అని గ‌ర్వంగా చెప్పుకోండి.. క‌నీసం 1969, 2009 ప్ర‌జా ఉద్య‌మాల‌ను గుర్తించ‌లేద‌ని క్ష‌మాప‌ణ కూడా కోర‌లేదు మీరు.. రేప‌టి తెలంగాణ యువ‌త‌రానికి సీపీఎం పార్టీ  ఏంటో, దాని చ‌రిత్ర ఏంటో తెలుసుకొనేందుకు వీలుగా మొత్తం చ‌రిత్ర‌ను చెప్పండి.. కేవ‌లం నిజాం వ్య‌తిరేక పోరాటాన్ని చెప్పి, 1969, 2009 తెలంగాణ పోరాటంలో శూన్యంగా ఉన్న మీ చ‌రిత్ర‌ను చెప్ప‌కుండా ఎన్ని జ‌న జాత‌ర‌లు చేసినా ప్ర‌యోజ‌నం ఉండ‌దు.. !!

No comments:

Post a Comment