1

1

Monday 30 June 2014

తెలంగాణ ప‌ర్యాట‌కానికి బ్రాండ్ అంబాసిడ‌ర్‌ను పెట్టండి...







కేసీఆర్ గారికి, టీఆర్ఎస్ ప్ర‌భుత్వానికి  ప్ర‌త్యేక‌ విజ్ఞ‌ప్తి....


తెలంగాణ ప‌ర్యాట‌కానికి బ్రాండ్ అంబాసిడ‌ర్‌ను పెట్టండి...





తెలంగాణ‌లో టూరిజం రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవాలి..  ప‌ర్యాట‌క రంగం ద్వారానే మ‌న చ‌రిత్ర‌ను ప్ర‌పంచానికి చాటేందుకు అవ‌కాశం ద‌క్కుతుంది.. సాంస్కృతిక ఔన్న‌త్యాన్ని చాటేందుకుకే కాకుండా ఆర్థిక ప‌రిపుష్టికి ఇది దోహ‌ద ప‌డుతుంది.. గుజ‌రాత్ రాష్ట్రం టూరిజంపై విస్తృత ప్ర‌చారం చేసేందుకు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్‌ను బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా పెట్టుకుంది... ఇది స‌త్ఫ‌లితాన్ని ఇచ్చింది.. జాతీయ స‌గ‌టుతో పోల్చుకుంటే ఆ రాష్ట్రంలో టూరిజం వృద్ది రేటు రెట్టింపు అయింది... కేర‌ళ కూడా అమితాబ్‌ను అంబాసిడ‌ర్‌గా పెట్టుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది... 
ఒక్క గుజ‌రాత్‌, కేర‌ళాలే కాదు.. మ‌హారాష్ట్ర హృతిక్ రోష‌న్‌ను, బెంగాల్‌కు షారూక్‌, ఉత్త‌రాఖండ్‌కు హేమామాలిని, గోవాకు ప్రాచీ దేశాయి, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌కు ప్రీతీజింటా త‌దిత‌రులు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా ప‌నిచేశారు...  చాలా చోట్ల టూరిజం వృద్ధికి ఇది దోహ‌ద‌ప‌డింది... 



నూత‌నంగా ఏర్ప‌డిన తెలంగాణ రాష్ట్రంలోని విశేషాల‌పై ఎవ‌రైన సెల‌బ్రిటీతో ప్ర‌చారం చేయించ‌డం వ‌ల్ల అంత‌ర్జాతీయ ప‌ర్యాట‌కుల దృష్టిని ఆక‌ర్షించొచ్చు... హైద‌రాబాద్‌లోని చ‌రిత్రాత్మ‌క క‌ట్ట‌డాలు... హిందూ, ముస్లింల ఐక్య‌త‌ను చాటిచెప్పే విధంగా ప్ర‌క‌ట‌న‌లు రూపొందించాలి.. కాక‌తీయుల వైభ‌వాన్ని చాటే ఓరుగల్లు కోట‌, అల‌నాటి శిల్ప క‌ళా వైభవానికి ప్ర‌తిరూపంగా నిలిచే రామ‌ప్ప గుడి ఇంకా అనేక క‌ట్ట‌డాల విశేషాల‌ను ప్ర‌పంచానికి తెలియ‌జేయాలి... 




త‌మిళ‌నాడు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌, లేదా బాలీవుడ్ న‌టులు అమీర్ ఖాన్‌, అమితాబ్‌, ర‌ణ‌బీర్‌క‌పూర్‌ త‌దిత‌రుల్లో ఎవ‌రినైనా లేక ఇంకా పాపుల‌ర్ వ్య‌క్తుల‌ను ఎవ‌రినైనా ఎంపిక చేసి తెలంగాణ ప‌ర్యాట‌కానికి బ్రాండ్ అంబాసిట‌ర్లుగా పెట్టాలి..   


తెలంగాణ ప్రాంతానికి చెందిన సెల‌బ్రిటీలైన దియామిర్జా, సానియా మిర్జా, సైనా నెహ్వాల్, వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్, ట‌బు, శ్యామ్ బెన‌గ‌ల్‌ త‌దిత‌రుల‌తోనూ టూరిజం వృద్ధి కోసం ప్ర‌చారాన్ని నిర్వ‌హించాలి...  ఒక్క‌సారి టూరిజం రంగంలో తెలంగాణ‌కు మంచి గుర్తింపు ల‌భిస్తే అది దీర్ఘ‌కాలం కొన‌సాగుతుంది... సెల‌బ్రిటీల‌ను ఎంపిక చేయ‌డం ఒక ఎత్తు అయితే.. నాణ్య‌మైన అడ్వ‌ర్టైజ్‌మెంట్‌ను రూపొందించ‌డం మ‌రో ఎత్తు...
ఈ రెండు స‌క్ర‌మంగా ఉంటేనే ప్ర‌చారం విజ‌య‌వంతం అవుతుంది...







ప‌ర్యాట‌క అభివృద్ధితో సిరుల పంట‌....

ప‌ర్యాట‌క రంగంలో ప్ర‌త్య‌క్ష‌, ప‌రోక్షంగా ల‌క్ష‌లాది మందికి ఉద్యోగాల క‌ల్ప‌న జ‌రుగుతుంది...
ప‌ర్యాట‌క అభివృద్ధికి కేంద్రం చ‌ర్య‌లు తీసుకునే వ‌ర‌కు వేచిచూడొద్దు....
వీలైనంత త్వ‌ర‌గా తెలంగాణ‌లోని ప‌ర్యాట‌క ప్రాంతాల జాబితాను రూపొందించండి..
ప‌ర్యావ‌ర‌ణ అనుకూల ప‌ర్యాట‌కం(ఎకో ఫ్రెండ్లీ) అభివృద్ధికి ఏం చేయాలో జాబితా రూపొందించండి..
విదేశీ, స్వ‌దేశీ ప‌ర్యాట‌కుల ర‌క్ష‌ణ కోసం ప్ర‌త్యేక పోలీసుల‌ను ఏర్పాటు చేయండి...
శిథిలావ‌స్థ‌లో ఉన్న ప‌ర్యాట‌క ప్ర‌దేశాల్లో పున‌రుద్ధ‌ర‌ణ ప‌నులు చేప‌ట్టండి...
వీలైనంత త్వ‌ర‌గా ప‌ర్యాట‌క శాఖ వెబ్‌సైట్‌ను ఆధునికీక‌రించి... స‌మ‌గ్ర స‌మాచారాన్ని అంద‌జేయాలి...


స్థానిక‌త‌పై ఎందుకో ఈ అరుపులు!

విద్యార్థుల‌కు ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌, ఉప‌కార వేత‌నాల విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన స్థానిక‌త‌పై సీమాంధ్ర మంత్రుల‌తో స‌హా ఇక్క‌డి వారు కూడా కొంద‌రు విచిత్రంగా అరుస్తున్నారు. అదేదో సునామీ వ‌చ్చిన‌ట్లు, విద్యార్థుల చ‌దువు ఆగిపోయిన‌ట్లు న‌టిస్తున్నారు. కానీ వాస్త‌వంగా చెప్పాలంటే ఇది కేవ‌లం ఫీజులు, ఉప‌కార వేత‌నాల‌కు సంబంధించిన అంశం మాత్ర‌మే. అడ్మిష‌న్ల‌లో ఈ సూత్రం అమ‌లు చేయ‌డం లేదు క‌దా. అయినా ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌, ఉప‌కార వేత‌నాలు అనేవి ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు రూపొందించుకునే ప‌థ‌కాలు. అందుకే వాటిపై ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. అందుకే పూర్తిగా, నిండు స్వార్థంతో తెలంగాణ ప్ర‌భుత్వం ఇక్క‌డ పుట్టిన తెలంగాణ బిడ్డ‌ల సంతానానికే చేయూత ఇవ్వాల‌నుకుంటుంది. ఇందులో త‌ప్పేముంది?.. కొంద‌రు కోర్టుకు వెళ‌త‌మంటారు. ఇంకొంద‌రు మాన‌వ‌తా దృక్ఫ‌థం అంటారు. సంక్షేమ ప‌థ‌కంలో భాగంగా ఇచ్చే ఈ ఆర్థిక చేయూత‌లో రాష్ట్ర ప్ర‌భుత్వానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంద‌నేది నా భావ‌న‌. అయినా స‌ర్కారు ప్ర‌క‌టించిన స్థానిక‌త వ‌ర్తించ‌ని విద్యార్థులు ఎలాగూ ఇక్క‌డి వారు కాదంటే ఏపీ వార‌నేగా అర్థం. మ‌రి ఆ ప్ర‌భుత్వం కూడా ఇక్క‌డే ఉంది. వారు సాయం చేయ‌వ‌చ్చు క‌దా. అది అడ‌గాల్సిన సోకాల్డ్ మాన‌వ‌తావాదులు తెలంగాణ ప్ర‌భుత్వంపైనే ఎందుకు ఒత్తిడి తెస్తున్నారు. ఏపీ స‌ర్కారును ఇవ్వ‌మ‌న‌వ‌చ్చు క‌దా. వీరికి విద్యార్థుల శ్రేయ‌స్సు ముఖ్య‌మా?. కేసీఆర్‌ను ఇరుకున పెట్ట‌డం ముఖ్య‌మా?. ముందు తేల్చుకుంటే బాగుంటుంది.

Friday 27 June 2014

మాతృభాష‌ను మ‌ర‌వ‌కండి.. ఆంగ్లాన్ని కూడా ఆద‌రించండి...



భాష నేర్చుకోండి.. తెలుగులోనే మాట్లాడండి.. మాతృభాష గొప్ప‌త‌నం ఇది అనే పెద్ద మ‌నుషులు కొంద‌రు ఆంగ్లంలో ఈ పోస్టులు రాస్తుంటారు.. ఈ భాషాభిమాన కుహానా మేధావుల తీరును చూస్తే న‌వ్వొస్తుంది..  వారి పిల్ల‌లు ఆంగ్ల మాధ్యమ కాన్వెంట్‌లో చ‌దువుతారు... వారి ఇంట్లో అంద‌రూ అమెరికాకు వెళ్లాల‌ని ఉవ్విళ్లూరుతుంటారు.. కానీ బీద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి పిల్ల‌లు మాత్రం తెలుగులోనే చ‌ద‌వాలా?
నేను తెలుగు మీడియాలో చ‌దివాను.. ఆంగ్ల భాష‌పై ప‌ట్టు లేక కొంత‌ అవ‌స్థ‌లు ప‌డుతున్నా... మ‌న ఎదుగుద‌ల‌కు మ‌న భాష కూడా అవ‌రోధం కావొద్దు...  మిత్రులారా.. మాతృభాష‌ను మ‌ర‌వ‌కండి.. అలాగ‌ని ఆంగ్లాన్ని దూరం పెట్ట‌కండి...  వీలైతే మ‌న తెలంగాణ మేధావి, భార‌త దివంగ‌త ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు మాదిరిగా బ‌హుభాషా కోవిదులం అవుదాం...!!!

తెలంగాణ క‌ల‌ల సాగ‌రం..!

60 ఏళ్ల సీమాంధ్ర కుట్ర‌ల‌ను భ‌గ్నం చేసే జూరాల‌-పాకాల ప్రాజెక్టు డిజైన్ ఇది. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, న‌ల్గొండ జిల్లాల్లో సుదీర్ఘంగా ప్ర‌వ‌హించే కృష్ణాన‌దిపై దిగువ‌న ప్రాజెక్టుల‌ను రూపొందించి, ఎగువ ప్రాంతాల‌కు ఎత్తిపోత‌ల ప‌థ‌కాల ద్వారా సాగునీటిని అందించ‌డం సీమాంధ్ర ఇంజినీర్ల కుట్ర‌ల సూత్రం. ఎగువ ప్రాంతంలో ప్రాజెక్టుల‌ను డిజైన్ చేస్తే కేవ‌లం గ్రావిటీ (భూమ్యాక‌ర్ష‌ణ శ‌క్తిపై... కాలువ‌ల ద్వారా)పై నీళ్లొస్తాయి. త‌ద్వారా ఒక్క‌సారి కాలువ‌లు త‌వ్వితే తెలంగాణ జ‌నం త‌ర‌త‌రాలుగా నీటిని పొందేది. ఈ భూములు స‌స్య‌శ్యామ‌లం అయ్యేవి. అందుకే ఇందుకు విరుద్ధంగా దిగువ ప్రాంతంలో ప‌థ‌కాల‌ను డిజైన్ చేసి, ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌కు ఎక్కువ ఖ‌ర్చ‌వుతుందంటూ ద‌శాబ్దాలు నాన‌బెట్టి, ఒక‌వేళ అవి పూర్తి చేసినా ఒక్క టీఎంసీ నీటిని తీసుకోవాల‌న్నా రూ.కోట్ల క‌రెంటు బిల్లుల భారం ప‌డేలా కుట్ర‌లు ప‌న్నారు. ఇప్పుడు తెలంగాణ సాకార‌మైంది. మ‌న ఇంజినీర్ల‌కు స్వేచ్ఛ వ‌చ్చింది. సీమాంధ్ర పాల‌కులు బుట్ట‌దాఖ‌లు చేసినా ప్ర‌తిపాద‌న‌ల‌కు ఇప్పుడు రెక్క‌లొచ్చాయి. అందులో భాగంగానే ఈ జూరాల‌-పాకాల ప్రాజెక్టుకు జీవం వ‌చ్చింది. మ‌న మేథో సంప‌త్తి అయిన రిటైర్డ్ ఇంజినీర్లు రూపొందించిన డిజైన్ ఇది. తెలంగాణ మిత్రుల‌తో పంచుకునేందుకు నేను ఈ పోస్టు పెడుతున్నాను. అందులోని కొన్ని వివ‌రాలు మీకు అందిస్తున్నాను.

జూరాల‌-పాకాల ప్రాజెక్టు అంచ‌నా వ్య‌యం - రూ.3వేల కోట్లు
ఎక్క‌డా కూడా నీటిని ఎత్తిపోయాల్సిన అవ‌స‌రం లేదు. అంతా గ్రావిటీపైనే వ‌స్తుంది. 405 కిలోమీట‌ర్ల కాలువ‌లు ఉంటాయి. ఇందులో 70 కిలోమీట‌ర్ల ట‌న్నెల్ (సొరంంగ‌మార్గం) ఉంటుంది.
ఈ ప్రాజెక్టు ద్వారా మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, న‌ల్గొండ‌, వ‌రంగ‌ల్ జిల్లాల్లోని 700 చెరువుల‌కు కూడా నీరు అందుతుంది.

! మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోని జూరాల రిజ‌ర్వాయ‌ర్ వ‌ద్ద నీటిని సేక‌రించేందుకు ఒక హెడ్‌రెగ్యులేట‌ర్ ఏర్పాటు చేస్తారు. దీనిని 24వేల క్యూసెక్కుల డిశ్చార్జితో నిర్మిస్తారు.
! అక్క‌డ నుంచి ఓపెన్ కాలువ 85 కిలోమీట‌ర్ల ద్వారా మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోని కొత్తాపూర్ వ‌ర‌కు నీళ్లు వ‌స్తాయి.
! అక్క‌డి నుంచి 70 కిలోమీట‌ర్ల ట‌న్నెల్ (సొరంగ మార్గం) ఉంటుంది. దీని వ్యాసం 15 మీట‌ర్లు. అంటే హైద‌రాబాద్ తాగునీటి కృష్ణాజ‌లాల‌ను త‌ర‌లించేందుకు వేసిన పైప్‌లైన్ సుమారు రెండున్న‌ర మీట‌ర్ల‌లోపు. అదే క‌రీంన‌గ‌ర్ నుంచి గోదావ‌రి నీటిని తెచ్చేందుకు వేస్తున్న పైపులైన్లు మూడు మీట‌ర్ల‌వి. అంటే వీటికంటే ఐదు రెట్ట‌కుపైగా పెద్ద‌గా ఉంటుంది.
! ఈ సొరంగ మార్గం న‌ల్గొండ జిల్లాలోని చందంపేట మండ‌లం (సాగునీటికి నోచుకోకుండా, అత్యంత వెనుక‌బ‌డిన మండ‌లం ఇది) వ‌ర‌కు ఉంటుంది.
అక్క‌డి నుంచి మ‌రో మూడు కిలోమీట‌ర్ల వ‌ర‌కు ఒపెన్ కాలువ ద్వారా నీటిని తీసుకుపోతారు.
! ఈ కాలువ ద్వారా వ‌చ్చిన నీటిని చందంపేట మండ‌ల కేంద్రం స‌మీపంలో నిర్మించే మిడ్ డిండి రిజ‌ర్వాయ‌ర్‌లోకి వెళ‌తాయి. ఈ రిజ‌ర్వాయ‌ర్ సామ‌ర్థ్యం 11 టీఎంసీలు.
! ఇగ అక్క‌డి నుంచి న‌ల్గొండ జిల్లాలోని దేవ‌ర‌కొండ‌, మునుగోడు (ఫ్లోరైడ్ భూతం ఉన్న ప్రాంతాలు) మీదుగా న‌ల్గొండ ద‌గ్గ‌ర ఉన్న బ్రాహ్మణ‌వేలం ఆపై హైద‌రాబాద్‌-విజ‌య‌వాడ జాతీయ ర‌హ‌దారి (ఎన్‌హెచ్‌-9)ను దాటుకొని వెళుతుంది. అక్క‌డి నుంచి వ‌రంగ‌ల్ జిల్లాలోకి ప్ర‌వేశిస్తుంది.
! చివ‌ర‌కు పాకాల రిజ‌ర్వాయ‌ర్ వ‌ర‌కు ఈ కాలువ ఉంటుంది. పాకాల రిజ‌ర్వాయ‌ర్ 3.4 టీఎంసీల సామ‌ర్థ్యంతో బ‌లోపేతం చేస్తారు.

ఇదీ... తెలంగాణ అస్థిత్వ‌మంటే?!
సీమాంధ్ర పాల‌న‌లో మ‌న‌కు దోపిడీకి గుర‌వ‌డానికి కార‌ణం సాంకేతిక‌మైన సాకులు కూడా. ఏదైనా ఒక న‌దికి సంవ‌త్స‌రంలో ఎన్ని రోజులు వ‌ర‌ద వ‌స్తుంది... (ఫ్ల‌డ్‌డేస్‌) అనేది లెక్కిస్తారు. దాని ద్వారానే ప్రాజెక్టుల డిజైన్‌ను త‌యారు చేస్తారు. సీమాంధ్ర పాల‌న‌లో రూపొందించిన శ్రీ‌శైలం ఎడ‌మ గ‌ట్టు కాలువ (ఎస్ఎల్‌బీసీ)కి ఫ్ల‌డ్‌డేస్ ఎంత పెట్టారో తెలుసా... 90 రోజులు. అంటే కృష్ణాన‌దికి 90 రోజుల పాటు వ‌ర‌ద వ‌స్తున్నందున నింపాదిగా నీళ్లు తీసుకోవ‌చ్చ‌ని హెడ్‌రెగ్యులేట‌ర్ సామ‌ర్థ్యం (ఒక‌విధంగా న‌ది నుంచి నీటిని తీసుకునేందుకు ఏర్పాటు చేసే రంధ్రం) త‌క్కువ పెట్టారు. కానీ శ్రీ‌శైలం కుడి కాల్వ (ఎస్ఆర్‌బీసీ-రాయ‌ల‌సీమ‌కు నీళ్లిచ్చేది)కు మాత్రం 45 రోజులు పెట్టారు. అంటే 45 రోజులు మాత్ర‌మే వ‌ర‌ద వ‌స్తున్నందున తొంద‌ర‌గా నీళ్లు తీసుకోవాల‌ని రంధ్రం పెద్ద‌ది పెట్టారు. మ‌రి మ‌న తెలంగాణ కొంప ముంచే పోతిరెడ్డిపాడుకు ఎంత లెక్కించారో తెలుసా... కేవ‌లం 30 రోజులు. అంటే ఏడాదిలో కృష్ణాన‌దికి 30 రోజులే వ‌ర‌ద వ‌స్తున్నందున తొంద‌ర తొంద‌ర‌గా ఎక్కువ నీళ్లు తీసుకోవాల‌ని రంధ్రం చాలా పెద్ద‌ది పెట్టారు. ఇదీ... సీమాంధ్ర పాల‌న‌లో ఒకే న‌దికి వ‌చ్చే వ‌ర‌ద రోజుల‌ను వారికైతే అలా... మ‌న‌కైతే ఇలా లెక్కించి కుట్ర‌లు ప‌న్నారు. అయితే ఈ కుట్ర‌లో మ‌న స‌న్నాసులు కూడా భాగ‌స్వాములే. మ‌రి... మ‌న రాష్ట్రం సిద్ధించింది. అందుకే వ‌ర‌ద రోజుల‌ను 35గా నిర్ద‌రించుకున్నాం. ఏకంగా 24వేల క్యూసెక్కుల డిశ్చార్జితో హెడ్‌రెగ్యులేట‌ర్ ఏర్పాటు చేయాల‌ని డిజైన్ రూపొందించుకున్నం.

Thursday 26 June 2014

ఫేసుబుక్‌లో హైద‌రాబాద్‌, తెలంగాణ అని చూసేదెప్పుడు?




కేసీఆర్ గారికి, కేంద్రానికి విజ్ఞ‌ప్తి.....


తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డి దాదాపు 23 రోజులు పూర్త‌య్యాయి.. అయినా ఇప్ప‌టికీ ఫేసుబుక్‌, కొన్ని మాధ్య‌మాలు తెలంగాణ రాష్ట్రాన్ని గుర్తించ‌డం లేదు.. ఫేసుబుక్ మిత్రులు కొంద‌రు ఇప్ప‌టికే మార్కు జుక‌ర్ బ‌ర్గ్‌కు కూడా విజ్ఞ‌ప్తులు పంపారు.. అయినా తెలంగాణ రాష్ట్రం అన్న ప‌దం ఫేసుబుక్‌లో క‌నిపించ‌డం లేదు... హైద‌రాబాద్ తెలంగాణ‌లో ఉంద‌న్న విష‌యాన్ని ఇప్ప‌టికీ గుర్తించ‌డం లేదు...

ఈ విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం, కేంద్ర ప్ర‌భుత్వాలు స్పందించాలి... ఫేసుబుక్ యాజ‌మాన్యానికి లేఖ రాసి.. మ‌న దేశంలో నూత‌న రాష్ట్రం ఆవిర్భ‌వించిన విష‌యాన్ని చెప్పాలి...

ఫేసుబుక్‌లో క‌రెంట్ సిటీ  హైద‌రాబాద్‌, తెలంగాణ అన్న ప‌దాన్ని చూడ‌టానికి ఉవ్విళ్లూరుతున్న నాలాంటి వాళ్లు ఎంద‌రో ఉన్నారు... మ‌రి దీనిపై కూడా కేసీఆర్ గారు చొర‌వ తీసుకోవాలి.... స‌మ‌స్య ఏంటో హైద‌రాబాద్‌లోని ఫేసుబుక్ కార్యాల‌య వ‌ర్గాల‌ను అయినా అడిగి తెలుసుకోవాలి...!!

చూడండి ఎంత‌టి అహంకారం?!


అటెండ‌ర్‌గానీ... ఆ మాట‌కొస్తే ఐఏఎస్‌గానీ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేస్తే తూ.చ‌. త‌ప్ప‌కుండా అమ‌లు చేయాలి. 60 ఏళ్ల పాటు పాపం... మ‌న అధికారులు మ‌న‌సొప్ప‌కున్నా స‌మైక్య స‌ర్కారు క‌ర్క‌శంగా తెలంగాణ‌కు వ్య‌తిరేకంగా ఆదేశాలు జారీ చేసినా అమ‌లు చేశారు. మ‌న వారినీ బాధ‌పెట్టారు. కానీ ఇప్పుడు తెలంగాణ వ‌చ్చింది. అయినా సీమాంధ్ర ఐఏఎస్‌ల‌కు మ‌న స‌ర్కారు ఇచ్చిన ఆదేశాలు అంటే చుల‌క‌న‌. స‌రిగ్గా ఆ అహంకారం మీద మ‌న ప్ర‌భుత్వం ఉక్కుపాదం మోపింది. తెలంగాణ స‌ర్కారింటే ఇలా ఉంటుంద‌ని దిమ్మ‌తిరిగే చ‌ర్య తీసుకుంది. కొన్నిరోజులుగా మాదాపూర్‌లోని గురుకుల్ ట్ర‌స్ట్ భూముల్లోని అక్ర‌మ నిర్మాణాలు కూల్చుతున్న సంగ‌తి మ‌నందరికి తెలిసిందే. దీనిపై ప్ర‌భుత్వం ముందుగా కొన్ని ఆదేశాలు జారీ చేసింది. అక్ర‌మ నిర్మాణాల‌కు క‌రెంటు, నీళ్ల స‌ర‌ఫ‌రా బంద్ చేయ‌మంది. క‌రెంటు ఆగింది... కానీ నీళ్లు ఆగ‌లేదు. ఆ నిర్మాణాల పూర్వాప‌రాలు వాట‌ర్ వ‌ర్క్స్ అధికారుల‌కు అన‌వ‌స‌రం. ప్ర‌భుత్వం చెప్పిన‌ట్లు నీటి స‌ర‌ఫ‌రా ఆప‌డం వారి విధి. కానీ వాట‌ర్ వ‌ర్క్్స ఎండీ శ్యామ‌ల‌రావు సీమాంధ్ర అహంకారం ప్ర‌ద‌ర్శించారు. స‌మైక్య ప్ర‌భుత్వం త‌ప్పులు చేయ‌మ‌న్నా క్ష‌ణాల్లో అమ‌లు చేసే వీళ్లు తెలంగాణ ప్ర‌భుత్వం నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా న‌డుచుకోమ‌న్నా... వారి ప్రాంత ప్ర‌జ‌ల కోసం బేఖాత‌రు చేస్తారు. క‌రెంటు ఆగినా నీటి స‌ర‌ఫ‌రా మాత్రం ఆగ‌లేదు. ఎలాగూ సీమాంధ్ర ఆప్ష‌న్ పెట్టుకున్న ఈ ఐఏఎస్ ప్ర‌భుత్వ ఆదేశాలు బేఖాత‌రు చేశారు. అందుకే మ‌న స‌ర్కారు స‌రైన గుణ‌పాఠం చెప్పింది. వెంట‌నే ఆ స్థానంలో మ‌న తెలంగాణ ఐఏఎస్‌కు అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గించింది. హ్యాట్సాఫ్ టు తెలంగాణ స‌ర్కార్‌. ప్ర‌స్తుతం ఐఏఎస్ అధికారుల మ‌ద్య హాట్‌టాపిక్‌గా మారింది ఈ అంశం.

పారాహుషార్‌.... మా... మ‌న‌.... తేడా చాలా ఉంటుంది....మీరు అర్థం చేసుకోండి.. ఎవ‌రేంటో!!!




ఇక్క‌డ మూడు ప‌త్రిక‌ల హెడ్డింగుల‌ను చూడండి.. ఏ ప‌త్రిక‌లు తెలంగాణ స‌మాజాన్ని త‌న‌దిగా భావిస్తుంది.. ఏ ప‌త్రిక తెలంగాణ స‌మాజాన్ని వేరుగా భావిస్తుందో మీకు అర్థం అవుతుంది... ఇక్క‌డ మార‌ని మ‌నుషులు.. కుట్ర‌లు చేసే పెద్ద మ‌నుషుల స్వ‌భావం తెలుస్తుంది.... !!!

రెండు రాష్ట్రాల‌కు రెండు ఛానెళ్లు పెట్టండి

నేను ఎప్పుడో చెప్పాను...
ప్ర‌తీ ఛానెల్ రెండు రాష్ట్రాల్లో వేర్వేరుగా ప్ర‌సారాలు చేయాల‌ని...
ఒక ఛానెల్‌తో రెండు రాష్ట్రాల‌ను సంతృప్తి ప‌ర‌చ‌డం అసాధ్యం...
ఒక‌రిని కించ‌ప‌రిచి ఇంకొక‌రిని రంజింప‌జేసే ఎత్తుగ‌డ‌లు చిత్తు అవుతాయి....

రెండు రాష్ట్రాల్లో ఒకే ఛానెల్ ను పెట్టి మీరు లాభాలు గ‌డించాల‌నుకుంటే క‌ష్టం.. ఒక ప్రాంతాన్ని సంతృప్తిప‌ర‌చ‌డ‌మే మీ అజెండా ఉంటుంది... అదే రెండు రాష్ట్రాల‌కు రెండు ఛానెళ్లు   పెట్టండి.... టీవీ9 తెలంగాణ‌, ఏబీఎన్ తెలంగాణ పెట్టండి... తెలంగాణ విలేక‌రుల‌ను పెట్టండి.. పూర్తిగా తెలంగాణ వార్త‌లు ఇవ్వండి... అప్పుడు మీరు నిర్మాణాత్మ‌క విమ‌ర్శ‌లు చేసినా జ‌నం స్వీక‌రిస్తారు.. అలా కాకుండా రెండు రాష్ట్రాల‌కు ఒకే ఛానెల్‌ను పెట్టి తెలంగాణ‌ను కించ‌ప‌రుస్తూ ఆంధ్రా నేత‌ల‌ను ఆనందింప‌జేయాల‌నే మీ ఆలోచ‌న‌ను ఎప్పుడూ తిర‌స్క‌రిస్తారు.....

అయితే తెలంగాణ కోసం ప్ర‌త్యేక ఛానెల్‌ను ప్రారంభించినా కూడా మీకు చిత్త‌శుద్ధి కూడా అవ‌స‌ర‌మే.. ఎందుకంటే ఈటీవీ తెలంగాణ ప్రారంభ‌మైంది..
ఆ ఛానెల్ ప్ర‌సారాల్లో చంద్ర‌బాబునాయుడికి ప్రాధాన్యం ద‌క్కుతోంది... ఇలా కాకుండా పూర్తిగా తెలంగాణ అంశాలు, తెలంగాణ అభివృద్ధి
ప్ర‌ధానంగా ప‌నిచేయాలి... లేక‌పోతే అది తెలంగాణ ఛానెల్ అని అనిపించుకోదు....

మీడియాకు విజ్ఞ‌ప్తి... ఈ కోడ్ భాష వ‌ద్దు....


తె.ప్ర‌భుత్వం...
టీటీడీపీ...
టీబీజేపీ...
టీపీసీసీ..

ఈ ప‌దాలు ఈ మధ్య ఈనాడు పేప‌ర్‌లో నేను చూశాను.. ఇప్పుడు తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రం... ద‌య‌చేసి తెలంగాణ ప్ర‌భుత్వం అని రాయండి.. అంతే కానీ తె.ప్ర‌భుత్వం అని రాసి మ‌మ్మ‌ల్ని అవ‌మానించొద్దు...

తెలంగాణ ప్రాంత ఎడిష‌న్ల‌లో వ‌చ్చే వార్త‌లో టీటీడీపీ, టీబీజేపీలు కూడా మానేసి... తెలంగాణ టీడీపీ అనో లేక తెలంగాణ బీజేపీ అనో రాయండి...

ఇదే నీతిని ఆంధ్రాకు మీరు అప్ల‌యి చేయ‌డం లేదు ఎందుకు?
అక్క‌డ ఏటీడీపీ, ఏబీజేపీ అని మీరు రాయ‌డం లేదు క‌దా.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ టీడీపీ అని రాస్తున్నారు.. మ‌రి ఇక్క‌డ మాత్రం ఎందుకు ఈ షార్టు క‌ట్ భాష‌...

కేసీఆర్ త‌మ్ముడూ... న‌న్ను ప‌ట్టించుకోవా?.

తమ్ముడు... చంద్ర‌శేఖ‌ర‌రావు త‌మ్ముడూ... అని నోరారా గీ అక్క న‌గ‌రం న‌డిబొడ్డున అందునా ఆటలాడే మైదానంల స్టేజీ ఎక్కి పిలిచింది. కానీ సీఎం కేసీఆర్ మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. ఈ అక్క తెలంగాణ భూములు ఆక్ర‌మించుకుంద‌ని, కోట్ల రూపాయ‌లు వెన‌కేసుకుంద‌ని అంద‌రూ ఆరోపిస్తున్నారు. గ‌తంలో శేరిలింగంప‌ల్లి త‌హ‌సిల్దార్ విచార‌ణ చేస్తే కొంత నిజం బ‌య‌ట‌ప‌డింది. మ‌రి గీ అక్క తమ్ముడు ఏకంగా సీఎం అయ్యారు. మ‌రి గామె రుణం తీర్చుకోవాలి క‌దా. అంద‌రూ ఆరోపిస్తున్న‌ట్లు అస‌లు ఆమె నిజంగా ఆక్ర‌మించిందా?. లేదా?. తేల్చండి ఒక అధికారుల బృందాన్ని అక్క‌డికి పంపండి. నిజంగా ఆమె ఆక్ర‌మిస్తే వెంట‌నే ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకోండి. ఏమైనా రిక‌వ‌రీలు ఉంటే ఉన్న ఆస్తులు కూడా జ‌ఫ్తు చేయండి. మొత్తంగా ఆమె త‌ప్పు చేస్తే శిక్షించండి. ఆత‌ర్వాత గిన్ని ఆక్ర‌మించింది, గింత తిన్న‌ది అంత స‌ర్కారు తీసుకుంది. ఇక ఆమె వ‌ద్ద ఏం లేదు... అని క్లీన్‌చీట్ ఇయ్యండి. అంతేగానీ... తెలంగాణ స‌ర్కారు ఏర్ప‌డి ఇర‌వై రోజులు దాటుతున్నా... కేసీఆర్ త‌మ్ముడు గీ అక్క‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డం ఏం బాగా లేదు.

Wednesday 25 June 2014

పారా హుషార్ తెలంగాణ సినీ ప్ర‌ముఖులారా..

సినీ ప‌రిశ్ర‌మ‌ను ముక్క‌లు చేసింది ఎవ‌రో మీకు తెలియ‌దా త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ గారు..
నాలుగు కుటుంబాల క‌బంధ హ‌స్తాల్లో చిక్కుకున్న ప‌రిశ్ర‌మ‌ను అలాగే ఉంచాల‌ని మీరు చూస్తున్నారా?
రెండు రాష్ట్రాలుగా విడిపోయాం... ముమ్మాటికీ రెండు రాష్ట్రాల‌కు వేర్వేరుగా ఫిల్మ్ ఛాంబ‌ర్లు కొన‌సాగాల్సిందే
లేక‌పోతే సినీ రంగంలో తెలంగాణ‌పై ఉన్న వివ‌క్ష అలాగే కొన‌సాగుతుంది...
హైద‌రాబాద్‌లో సినీ పెద్ద‌లు కొంద‌రు ఆక్ర‌మించిన భూ క‌బ్జాల‌పై విచార‌ణ జ‌ర‌గాలి..
ఇది జ‌ర‌గాలంటే రెండు రాష్ట్రాల‌కు వేర్వేరుగా ఫెడ‌రేష‌న్లు ఉండాలి...
అయినా మీకు తెలుగుపై ఇంత ప్రేమ ఎలా పుట్టుకొచ్చిందో అర్థం కాలేదండీ..
ఇంత‌కాలం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఫిల్మ్ ఫెడ‌రేష‌న్‌గా కొన‌సాగిన దాన్ని ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఫెడ‌రేష‌న్‌గా మార్చ‌డం వెన‌క మ‌త‌లబు ఏంటి..
అంటే తెలంగాణ‌కు వేరు ఫెడ‌రేష‌న్ రావొద్ద‌న్న కుట్రే క‌దా...
ఒక‌వేళ మీకు తెలుగుపై అంత మ‌మ‌కార‌మే ఉండిఉంటే ఇంత‌కాలం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఫిల్మ్ ఫెడ‌రేష‌న్ అని వాడేవారే కాదు..
హైద‌రాబాద్‌లో అక్ర‌మ ఆస్తులు కాపాడుకునేందుకు కొంద‌రు సినీ పెద్ద‌లే తెలుగు ఫిల్మ్ ఫెడ‌రేష‌న్‌గా మార్చే ప్ర‌తిపాద‌న తెచ్చారు..
దీన్ని ముమ్మాటికి తిప్పి కొట్టాలి...

పారా హుషార్ తెలంగాణ సినీ ప్ర‌ముఖులారా..
మీ అస్తిత్వాన్ని, ఆత్మ‌గౌర‌వాన్ని కాపాడుకోండి...

---------------------------------------------------------------

తెలుగు సినీ పరిశ్రమను ముక్కలు చేయవద్దు : తమ్మారెడ్డి

హైదరాబాద్, జూన్ 14 : తెలుగు సినీ పరిశ్రమలు ఎవరూ ముక్కలు చేసే ప్రయత్నాలు చేయవద్దని దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విజ్ఞప్తి చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ పరిశ్రమను విభజించడం వల్ల ఇరు ప్రాంతాల వారికి నష్టం చేకూరుతుందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణకు ప్రత్యేక మూవీ ఫెడరేషన్ అవసరం లేదని తమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు. ఇరు ప్రాంతాల ప్రజలకు నచ్చేలా సినిమా తీసినప్పుడు పరిశ్రమల అభివృద్ధి జరుగుతుందని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు.

త‌న‌కి మాలిన ధ‌ర్మం ప‌నికిరాదు

తెలంగాణ రాష్ట్ర స్వ‌రాష్ట్ర ప్ర‌స్థానంలో ఈరోజు కీల‌క‌మైన‌దిగా నేను భావిస్తున్నాను. అటు ఆర్థికంగా, ఇటు ఒక విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యం తీసుకునేందుకు కేసీఆర్ ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. మ‌న రాష్ట్రంలోని విద్యార్థుల బో్ధ‌న రుసుము చెల్లింపు విధానంపై ఇప్ప‌టికే ప్రాథ‌మిక నిర్ణ‌యం తీసుకున్న ప్ర‌భుత్వం దానిపై అఖిల‌ప‌క్షం ఏర్పాటు చేసింది. నిజ‌మే... మ‌న రాష్ట్రంలో చ‌దువుతున్న ఇత‌ర రాష్ట్ర (ఏపీ కూడా) విద్యార్థుల‌కు మ‌న ం ఎలా ఫీజులు, ఉప‌కార వేత‌నాలు చెల్లిస్తాం?. ఈ అంశంపై ఈరో్జు టీవీ చ‌ర్చ‌ల్లో కొంద‌రు (ప్ర‌త్యేకంగా టీడీపీ నాయ‌కులు అటువారు, ఇటువారు) తెగ బాధ‌ప‌డిపో్తున్నారు. మ‌నంద‌రం అన్నదమ్ములం, మాన‌వ‌తా దృక్ఫ‌థంతో ఆలోచించాల‌ని సెల‌విచ్చారు. నిజ‌మే... ఇందులో రెండు విష‌యాలున్నాయి. ఒక‌టి... క‌నీసం ఇక్క‌డ స‌బ్బు కూడా కొనుక్కోవాలంటే మ‌న‌సు ఒప్ప‌డం లేదు. టాక్స్ తెలంగాఇణ ప్ర‌భుత్వానికి పోతుంద‌నే బాధ ఉంది... అని అంటున సీమాంధ్రుల పిల్ల‌లకు తెలంగాణోడి చ‌మ‌ట చుక్క‌ను ఎందుకు పంచాలి?. పో్నీ... మాన‌వ‌తా దృక్ఫ‌థంతో ఆలోచిద్దామంటే ఇచ్చి పుచ్చుకునే ధోర‌ణిలు రెండువైపులా ఉండాలి. కానీ ఒక‌వైపు ఉంటే అది మూర్ఖ‌త్వం అవుతుంది. ఒక‌వేళ తెలంఆణ ప్ర‌భుత్వం ఆ దృక్ఫ‌థాన్ని అందిపుచ్చుకుంటే మూర్ఖ‌త్వం కాక‌త‌ప్ప‌దు. ఇవ‌న్నీ ఒక ఎత్త‌యితే... రుణ మాఫీ, కేజీ టు పీజీ విద్య‌... ఇలాంటివి స‌ర్కారుకు ఆర్థికంగా స‌వాళ్లుగా మారుతున్నాయి. ఈ నేప‌థ్యంలో న‌యా పైసా కూడా చాలా విలువైనది. మన‌కు ఉన్న‌పుడు ప‌క్క‌వాడికి ఇవ్వ‌డం వివేకం... కానీ మ‌న‌మే క‌ష్టాలు ప‌డుతున్న‌పుడు అలా ఇవ్వ‌డం అమాయ‌క‌త్వం, ముందుచూపులేని త‌నం అవుతుంది. ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ఓ్ నిర్ణ‌యానికి వ‌చ్చింద‌ని భావిస్తున్నాం. ఇందుకు ప్ర‌తిప‌క్షాలు, ప్ర‌తి పార్టీ ఆమోదం తెల‌పాలి. క‌చ్చితంగా మ‌న పిల్ల‌ల‌కు మాత్ర‌మే ఫీజులు, ఉప‌కార వేత‌నాలు ఇచ్చే విధానాన్ని క‌ఠినంగా అమ‌లు చేసేందుకు స‌హక‌రించాలి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయ‌కులు ఇప్ప‌టికైనా మీ డ్రామాలు ఆపండి, తెలంగాణ త‌గ‌ల‌బ‌డినా ప‌ర‌వాలేదు... మేం, మా బాబు, మా రాజ‌కీయం స‌ల్ల‌గుండాలి అనే మీ కుటిల నీతి ఇప్ప‌టికే అర్థ‌మైంది. గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో సీమాంధ్ర ఓట్ల‌కు గాలం వేసేందుకుగాను మీరు ఆ విద్యార్థుల‌కు కూడా మ‌న స‌ర్కారుతో ఫీజులు, ఉప‌కార వేత‌నాలు ఇప్పించేందుకు సిద్ధ‌ప‌డుతున్న‌ట్లు తెలుస్తుంది. అలాంటి దిక్కుమాలిన ప్ర‌య‌త్నాలు విర‌మించుకోండి. లేక‌పోతే మీ ఖ‌ర్మ‌. తెలంగాణ ప్ర‌జ‌లు మ‌రోసారి బుద్ధి చెబుతారు.
ఇక‌... కేసీఆర్‌గారూ... ఇది కీల‌క స‌మ‌యం. ఈ విధానంపై నిర్ణ‌యం తీసుకోవ‌డంలో భ‌విష్య‌త్తు ఆధార‌ప‌డి ఉంది. అస‌లు స్థానికులు ఎవ‌రు? అనేది కూడా ఇందులో తేలే అవ‌కాశం ఉంది. 4-10 వ త‌ర‌గ‌తి వ‌ర‌కు ఇక్క‌డే చ‌దువుకున్న‌వారు స్థానికులు అవుతార‌ని నిబంధ‌న‌లు చెబుతున్నాయి. మ‌రి ఈ క్ర‌మంలో విద్యార్థుల‌ను అక్క‌డి వారిని ఈ ప్రాతిప‌దిక‌న స్థానికులుగా గుర్తిస్తే వారి త‌ల్లిదండ్రులు ఉద్యోగ‌స్తులైతే దీనిని అస్ర్తంగా ఎంచుకునే ప్ర‌మాద‌మూ లేకపోలేదు. ఇలా ఎన్నో చిక్కుముడులు ఉన్నాయి. అందుకే ఈ విధాన నిర్ణ‌యాన్ని కేవ‌లం బోధ‌న ఫీజులు, ఉప‌కార వేత‌నాల కోణంలోనే చూడ‌కుండా... ప్ర‌తి రంగంలోనూ స్థానిక అనే దానికి ఈ నిర్ణ‌యాన్ని ముడిపెట్టే ప్ర‌మాదం ఉంది. అందుకే దూర‌, దీర్ఘ దృష్టితో ఈ నిర్ణ‌యం తీసుకోవాల‌ని కోరుతున్నాం. ఇందులో టీడీపీలాంటి ప్ర‌తిప‌క్ష పార్టీలు క‌లిసి రాకున్నా... ప‌ర్వాలేదు. తెలంగాణ జాతి మీ వెంట ఉంది. అందుకే మీరు ఇలాంటి స‌మ‌యాల్లో క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకోవాలి. లేదంటే మ‌నం రాష్ట్రం వ‌చ్చినంక కూడా సీమాంధ్రుల పెత్త‌నం ప‌రోక్షంగా, చాప‌కింద నీరులా విస్త‌రించే ప్ర‌మాదం ఉంది.

టీ న్యూస్‌, వీ6, టీఎన్ఎన్ ఛానెళ్ల‌ను అక్క‌డి ప్ర‌జ‌లు చూశారా?

ఆంధ్ర‌లో టీ న్యూస్‌, వీ6, టీఎన్ఎన్ లాంటి ఛానెళ్ల‌ను అక్క‌డి ప్ర‌జ‌లు చూశారా? కొన్నిప్రాంతాల్లో వీ6పై నిషేధం విధించిన‌ప్పుడు ఎవ‌రైన స్పందించారా? ప్ర‌జ‌లు చూసినా చూడ‌కున్నా రాష్ట్రంలో ఉన్న అన్ని ఛానెల్స్‌ను ఇవ్వాల్సిన బాధ్య‌త ఎంఎస్‌వోల‌ది క‌దా.. మ‌రి ఆంధ్రా ఎమ్మెస్వోలు గ‌తంలో వ్య‌వ‌హ‌రించిన విధంగానే ఇప్పుడు తెలంగాణ ఎంఎస్‌వోలు వ్య‌వ‌హ‌రిస్తే త‌ప్పేముంది...?

మాకు ఒక హామీ ఇవ్వ‌గ‌ల‌రా?

టీవీ9, ఏబీఎన్ ఛానెళ్ల ప్ర‌సారాలు ఆపితే తెలంగాణ ఉద్యోగులు న‌ష్ట‌పోతారు అంటున్నారు... కొంద‌రు కుహానా జ‌ర్న‌లిస్టు సంఘం నాయ‌కులు తెగ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.. మ‌రి స్టూడియో ఎన్‌లో 70 మంది తెలంగాణ ఉద్యోగుల‌ను నిర్దాక్షిణ్యంగా తొల‌గిస్తే మీరేమైనా స్పందించారా?
ఆ 70 మందిలో క‌నీసం ఒక్క‌రికైనా ఉద్యోగం ఇప్పించారా?
ఇప్పుడు ఈనాడులో తెలంగాణ‌లో ప‌నిచేస్తున్న ఉద్యోగుల్లో చాలా మంది ఆంధ్రోళ్లే ఉన్నారు....
ఇక టీవీ9లో కూడా చాలా మంది ఆంధ్రోళ్లు తెలంగాణ‌లో ప‌నిచేస్తున్నారు..
ఏబీఎన్‌లో కూడా అదే ప‌రిస్థితి...

మీరు మాకు ఒక హామీ ఇవ్వ‌గ‌ల‌రా?
తెలంగాణ‌లో ఏబీఎన్‌, టీవీ9 , ఈనాడులో మొత్తం తెలంగాణ ఉద్యోగుల‌ను మాత్ర‌మే తీసుకుంటామ‌ని చెబుతారా?
ముమ్మాటికి చెప్ప‌రు.... ఇప్పుడు మీ ప్ర‌సారాలు పున‌ప్రారంభించినంత మాత్రాన మీ సంస్థ‌ల్లో ఉన్న తెలంగాణ ఉద్యోగుల ఉద్యోగాలు భ‌ద్రంగా ఉంటాయ‌ని హామీ ఇస్తారా?

అప్పుడు మాట్లాడ‌లేదు ఎందుకు?

చంద్ర‌బాబునాయుడు ప్రెస్ మీట్ల‌కు సాక్షి ఛానెల్ విలేక‌రుల‌ను అనుమ‌తించ‌కుండా గెంటేయించిన‌ప్పుడు ఎవ‌రైనా స్పందించారా?

ఉల్టా దాన్ని స‌మ‌ర్థించిన వాళ్లు చాలా మంది ఉన్నారు... పాత్రికేయుల హ‌క్కులు, ప‌త్రికా స్వేచ్ఛ గురించి అప్పుడు మాట్లాడ‌లేదు ఎందుకు?

టీవీ9 ప్ర‌సారాలు పున‌రుద్ధ‌రించండి.... అయితే ఒక్క ష‌ర‌తు...


టీవీ9 ర‌వి ప్ర‌కాశ్‌ను శిక్షించండి....
దీనికి కుహాన జ‌ర్న‌లిస్టు సంఘాల నాయ‌కులు ఒప్పుకుంటారా?

గ‌తంలో అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో ఏక్‌స‌త్తా పార్టీ అధినేత జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ చౌద‌రి అలియాస్‌ జేపీ అనే శాస‌న‌స‌భ్యుడిపై మ‌ల్లేశ్ అనే కారు డ్రైవ‌రు ఒక దెబ్బ కొట్టినందుకే ఆయ‌న‌ను 49 రోజుల పాటు జైలులో పెట్టారు...

మ‌రి మొన్న‌ అసెంబ్లీలోని మొత్తం 119 మంది స‌భ్యుల వ్య‌క్తిత్వాన్ని దెబ్బ‌తీసేలా దాడి చేసిన టీవీ9 ర‌విప్ర‌కాశ్‌కు శిక్ష విధించ‌రా?

కేవ‌లం ఛానెల్ ప్ర‌సారాలు ఆపితే స‌రిపోతుందా?

ఒక్క ఎమ్మెల్యేపై దాడి చేసిన వ్య‌క్తికి 49 రోజుల జైలు శిక్ష విధించారు... మ‌రి 119 మంది ఎమ్మెల్యేల‌పై మాన‌సిక దాడి చేసి, శాస‌న‌స‌భ‌ను అగౌర‌వ‌ప‌రిచిన ర‌విప్ర‌కాశ్‌ను ఎన్నేళ్లు జైలులో ఉంచాలి....?

49*119=5831 రోజులు జైలుకు పంపాలి.....(దాదాపు 16 ఏళ్లు)

ఈ జ‌ర్న‌లిస్టు సంఘం నాయ‌కులు కొంద‌రున్నారే.. వీళ్లు మ‌హా ముదుర్లండోయ్‌....!!!


చంద్ర‌బాబునాయుడు పాల‌న‌లో ఆయ‌న‌కు ఊడిగం చేశారు... ఇక వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి వ‌చ్చాక‌.. ఆయ‌న చేసిన ప‌నుల‌ను స‌మ‌ర్థించారు.. సాక్షి ఛానెల్ చ‌ర్చ‌ల్లో మ‌హాద్భుతంగా ఉప‌న్యాసాలు ఇచ్చారు.. ఇక జ‌ర్న‌లిస్టు స్థ‌లాల కోసం బినామీల‌ను కొంద‌రిని జాబితాలో చేర్చిన ఘ‌నులు వీళ్లే..
ఇక వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌ఠాత్తుగా చ‌నిపోయాక ఏం చేయాలో తెలియ‌క కొన్నాళ్లు రోశ‌య్య పంచ‌న చేరారు.. త‌ర్వాత జ‌గ‌న్ ప‌క్క‌కు చేరి స‌మ‌ర్థించారు... తెలంగాణ వ‌చ్చాక కేసీఆర్‌ను వీళ్లే అంద‌రి క‌న్నా ముందు క‌లిశారు...

తెలంగాణ ఉద్య‌మ కాలంలో మీడియా రెచ్చిపోయిన‌ప్పుడు నోళ్లు మూసుకున్నారు... మొన్న‌టికి మొన్న టీవీ9 ఛానెల్‌లో జుగుప్సాక‌రమైన‌
రీతిలో ప్రొగ్రామ్ వ‌చ్చిన‌ప్పుడు ఏ బారులో మందు కొడుతూ చూశారో నాకు తెలియ‌దు.. జ‌నం గ‌గ్గోలు పెట్టి... కేసీఆర్ స‌హా శాస‌న‌స‌భ టీవీ9 చేష్ట‌ల‌ను ఖండించిన‌ప్పుడు కూడా నోరు తెర‌వ‌ని పెద్ద‌మ‌నుషులు వీళ్లు... ఎంఎస్‌వోలు ధైర్యంగా ఆ ఛానెళ్ల ప్ర‌సారాల‌ను ఆపేస్తే మాత్రం వీళ్లు మేల్కొన్నారు.. మీడియా భావ ప్ర‌క‌ట‌న హ‌క్కులు వీరికి గుర్తొచ్చాయి...

తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ఉస్మానియాలో విద్యార్థుల‌ను చిత‌క బాదుతున్న‌ప్పుడు... పోలీసుల మార్గ‌దర్శకాలు ఉన్నాయి అని చెప్పి ఆ దృశ్యాల‌ను చూప‌ని మీడియా సంస్థ‌ల‌ను ఎందుకు ప్ర‌శ్నించ‌లేదు...? మీడియా స్వేచ్ఛ‌కు కళ్లెం వేసిన పోలీసుల‌పై ఎందుకు ఉద్య‌మించ‌లేదు?

ఉస్మానియాలో విద్యార్థుల‌పై ద‌మ‌న‌కాండ‌ను నిర‌సిస్తూ హైకోర్టులో కేసు వేసిన అప్ప‌టి ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి విలేక‌రి రెహ్మాన్‌ను ఉద్యోగం నుంచి తొల‌గించిన‌ప్పుడు ఎక్క‌డికి పోయింది మీ పెద్ద‌రికం...... అప్పుడు పాత్రికేయుల హ‌క్కులు గుర్తుకు రాలేదా?
తెలంగాణ ఉద్యోగిని అన్యాయంగా తొల‌గించార‌న్న విష‌యాన్ని ఎందుకు విస్మ‌రించారు...?

నేను మీకిచ్చేది ఒక్క‌టే స‌ల‌హా....

జ‌రుగుతున్న వాట‌న్నింటినీ ప‌ట్టించుకోకుండా... య‌థావిధిగా టీవీ చూస్తూ మందుకొట్టి పండుకోండి...! అంత‌క‌న్నా ఎక్కువ‌గా మీరు చేయ‌లేరు.. ప‌త్రికా స్వేచ్చ‌, మీడియా స్వేచ్చ‌ల గురించి మీరు మాట్లాడితే దెయ్యాలు వేదాలు వ‌ల్లించిన‌ట్లే ఉంటాయి....

నా ప్ర‌శ్న‌కు బ‌దులివ్వండి....


టీవీ9 ప్ర‌సారాల‌ను పున‌రుద్ధ‌రించ‌మ‌ని కోరే నేత‌ల్లారా... మీరు ఆలోచించండి...
టీవీ9 అనేది శాస‌న‌స‌భ‌లో సీఎం, విప‌క్షాల ఒత్తిడి వ‌ల్ల క్ష‌మాప‌ణ చెప్పింది..
దాదాపు అభ్యంత‌ర‌క‌ర‌మైన ప్రోగ్రామ్ ప్ర‌సార‌మైన త‌ర్వాత రెండు రోజుల పాటు జ‌నాగ్ర‌హాన్ని చూసి కూడా స్పందించ‌లేదు..
ఒక‌వేళ కేసీఆర్, అసెంబ్లీ స్పందించ‌క‌పోయి ఉంటే ఇంకా దారుణ‌మైన ప్ర‌సారాలు వ‌చ్చేవి...
శాస‌న‌స‌భ ఆవ‌ర‌ణ‌లో జేపీని కొట్టిన ఈటెల రాజేంద‌ర్ కారు డ్రైవ‌రు మ‌ల్లేశ్‌ను 49 రోజులు జైలులో ఉంచితే ఒక్క‌డైనా మాట్లాడాడా?
ఆయ‌న‌కు కుటుంబం ఉంది.. మాన‌వ‌తా దృక్ప‌థంతో విడిచిపెట్టాల‌ని ఒక్కడైనా గొంతెత్తాడా?
ఇప్పుడు రెండు రోజులు ఆంధ్రా భ‌జ‌న ఛానెల్ ప్ర‌సారాలు నిలిచిపోతే ఏదో విప‌త్తు వ‌చ్చిన‌ట్లు గ‌గ్గోలు పెడుతున్న మీకు సిగ్గుందా?
ఛానెళ్ ప్ర‌సారాలు పున‌రుద్ధ‌రించి.. ర‌విప్ర‌కాశ్‌ను జైలులో పెట్ట‌మ‌ని డిమాండ్ చేసే స‌త్తా మీకు ఉందా?

అన్ని నిషేధాలను నిషేధించేలా చ‌ట్టం చేస్తారా?

గుజ‌రాత్ రాష్ట్రంలో ప‌ర్జానియా, ఫ‌నా, ఫిరాక్‌లాంటి చిత్రాలు నిషేధానికి గుర‌య్యాయి... ఇక ఇత‌ర రాష్ట్రాల్లోనూ కొన్ని సినిమాలు నిషేధానికి గుర‌య్యాయి.. గుర‌వుతూనే ఉంటాయి...
ఇక స‌మైక్య రాష్ట్రంలో ఆంధ్రా ఫిల్మ్ ఛాంబ‌ర్ వాళ్లు కొన్ని నిర్ణ‌యాలు తీసుకున్నారు.. డ‌బ్బింగ్ చిత్రాల విడుద‌ల విష‌యంలో నిషేధాలు విధించ‌డం, వాటిని ఆడ‌నివ్వొద్ద‌న‌డం.. డ‌బ్బింగ్ సీరియ‌ళ్ల‌ను నిలిపేయాల‌ని కొంద‌రు ద‌ర్శ‌కులు ఆందోళ‌న చేయ‌డం జ‌రిగింది...

సినిమా కూడా ఒక ర‌క‌మైన మీడియానే.... దానిపైన నిషేధాలు విధించిన‌ప్పుడు ఆయా రాష్ట్రాల్లో ఉన్న మీ పార్టీ శాఖ‌లు ఏం చేశాయి...
ఇప్పుడు మీరు అదే చేయండి...!!!

వీళ్ల బాధంతా అదే...!!!

మంద‌కృష్ణ మాదిగ ఇచ్చిన ట్రీట్‌మెంట్ ఇస్తేనే దారికి వ‌స్తాయి

ఇన్నాళ్లు తెలంగాణ‌ను అవ‌మానించాం... కుట్ర‌లు చేశాం.. దోచుకున్నాం.. అంద‌రం క‌లిసే ఇందులో పాలుపంచుకున్నాం.. కానీ ఇప్పుడు అన్యాయంగా మా రెండు ఛానెళ్ల‌ను మాత్రమే శిక్షించ‌డం స‌రికాద‌ని వాటి య‌జ‌మానులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్న‌ట్లు స‌మాచారం.. మాతో క‌లిసి కుట్ర‌లు చేసిన ఇత‌ర మీడియా సంస్థ‌ల ప్ర‌సారాలు ఆపి ఉంటే స‌మ‌న్యాయం జ‌రిగి ఉండేద‌ని వాళ్లు లోలోన మ‌థ‌న‌ప‌డుతున్నార‌ట‌...!!

నాకు తెలిసి ఈ ఛానెల్ల ప్ర‌సారాల‌ను ఆప‌డం వ‌ల్ల బుద్ధి వ‌స్తుంద‌న్న న‌మ్మ‌కం అయితే లేదు... 
ఈ ఆంధ్రా ఛానెళ్ల‌కు మంద‌కృష్ణ మాదిగ ఇచ్చిన ట్రీట్‌మెంట్ ఇస్తేనే దారికి వ‌స్తాయి....!!

తెలుగు తేజాలు ఏంటో


తెలుగు తేజాలు ఏంటో నాకు ఇంకా అర్థం కావ‌డం లేదు...
హిందీ మాట్లాడే రాష్ట్రాలు ఎనిమిది ఉన్నాయి...
ఆ రాష్ట్రాల్లో ఎవ‌రైనా ప్ర‌తిభ క‌న‌బ‌రిస్తే రాష్ట్రం పేరుతోనే గుర్తిస్తారు కానీ.. హిందీవారి హ‌వా అని రాస్తారా?
ఇంకా ఎందుకు తెలుగు తేజాలంటూ మ‌భ్య‌పెట్ట‌డం...!!
తెలంగాణ విద్యార్థులు స‌త్తా చాటారు.. ఆ ముక్క చెప్ప‌డానికి ఎందుకో అంత బాధ‌...

బాబుగారు మాట నిలుపుకోవాలి..

ఇచ్చిన హామీని నిల‌బెట్టుకుంటాన‌ని చంద్ర‌బాబు ప‌దేప‌దే చెబుతున్నారు. నిజ‌మే ఆయ‌న క‌చ్చితంగా చేస్తారు. ఎందుకంటే ఆయ‌న మారిన మ‌నిషి. కానీ కొన్ని ప‌త్రిక‌లు అన‌వ‌స‌రంగా లీకులు ఇచ్చి రైతాంగాన్ని అయోమ‌యానికి గురి చేస్తున్నాయి. మ్యానిఫెస్టోలో అక్ష‌రాలా పేర్కొన్న‌ట్లు అన్ని ర‌కాల‌, రైతుల మొత్తం రుణాన్ని మాఫీ అమలు అయ్యేలా చ‌ర్య‌లు తీసుకోవాల్సిన బాధ్య‌త చంద్ర‌బాబుగారిపై, అలా కాప‌లాకాయాల్సిన బాధ్య‌త ప‌త్రిక‌ల‌పై ఉంది. కానీ ఓ రెండు ప‌త్రిక‌లు ఇందుకు విరుద్ధంగా వ్య‌వ‌హ రిస్తున్నాయి. లీకుల పేరిట‌... ల‌క్ష రూపాయ‌లు, ల‌క్ష‌న్న‌ర‌, ఇలా ష‌ర‌తులతో్ రుణ మాఫీ అమ‌లుకు రంగం సిద్ధం అవుతుంద‌ని క‌థ‌నాలు ఇస్తున్నాయి. నిన్న‌టిదాకా తెలంగాణ రాష్ట్రంలో రుణ మాఫీపై ఓ మంత్రి చేసిన వ్యాఖ్య‌ల‌పై దీర్ఘాలు తీసిన మీడియా ఇప్పుడు రైతుల‌కు వ్య‌తిరేకంగా ష‌ర‌తుల‌తో కూడిన మాఫీపై గ‌ళం విప్ప‌కుండా... అదేదో వ‌రం అన్న‌ట్లుగా రాస్తున్నాయి. ష‌ర‌తుల‌పై అవి ఎందుకు నోరు మెద‌ప‌డం లేదు?. ల‌క్ష‌, ల‌క్ష‌న్న‌ర అంటూ కోత‌లు పెట్ట‌డ‌మేంటి?. అందునా బంగారు రుణాల‌పై మహిళ‌ల పేరిట ఉన్న రుణాలు మాత్ర‌మే మాఫీ చేస్తార‌ట‌. ఇదెక్క‌డి న్యాయం?. భూమి పాసు పుస్త‌కాలు ఎవ‌రి పేరుమీద ఉంటే రుణం వారి పేరు మీద ఇస్తారు. మ‌న దేశంలో త‌ర‌త‌రాలుగా వార‌స‌త్వంగా వ‌చ్చే భూముల‌ను ఆ ఇంటి కొడుకుల పేరిట ప‌ట్టా చేస్తారు. కానీ కోడ‌లు పేరు మీద ఎవ‌రూ చేయ‌రు. మ‌రి ఇలాంట‌ప్పుడు ఆ నిరుపేద రైతు కుటుంబాల్లో ఉన్న నాలుగైదు ఎక‌రాల పొలం కోసం బంగారం తాక‌ట్టు పెడితే ఇంటి పెద్ద పేరు మీద ఉన్న భూమిపైనే పెడ‌తారు. మ‌హిళ పేరు మీద భూమి ఎలా ఉంటుంది?. క‌ట్నంగా భూములు ఇచ్చే సంప్ర‌దాయం ఉన్నా... ఆ కేసులు చాలా అరుదు. ఇవ‌న్నీ రెండెక‌రాల ఆస్తి ఉన్న కుటుంబంలో పుట్టిన చంద్ర‌బాబు తెలియ‌నిది కాదు. ఇంత తెలిసిన వ్య‌క్తి ఇలా పిత‌లాట‌కం పెట్ట‌డం, రైతుల ఆశ‌ల‌పై ఈ వ‌ర్షాభావ ప‌రిస్థితుల్లోనూ నీళ్లు చ‌ల్ల‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌సం?
బాబు గారూ... రైతు క్షేమంగా ఉంటేనే ఏపీ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. అన్న‌పూర్ణ‌గా పేరు తెచ్చుకున్న ప్రాంతంలో అన్న‌దాత‌లు క్రాప్ హాలిడేను ప్ర‌క‌టించి, ప్ర‌పంచంలోనే ఓ వినూత్న త‌ర‌హాలో త‌మ నిస్ప‌హాయ‌త‌ను వ్య‌క్తం చేసిన చ‌రిత్ర ఉంది. ఆ స‌మ‌యంలో రైతుల ప‌క్షాన ఢిల్లీదాకా గ‌ట్టిగా వాదించిన మీరు ఇలా పిత‌లాట‌కాల‌తో అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైత‌న్న‌ను స‌గం అప్పులు తీర్చి... న‌డివీధిలో ప‌డేయ‌డం ఎంత‌వ‌ర‌కు ప‌ద్ధ‌తి. ప్ర‌పంచానికే సాంకేతిక పాఠాలు నేర్పిన మీరు ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం త‌గ‌దు. అందునా ఓ నిర్ణ‌యం తీసుకున్నా... మ్యానిఫెస్టో త‌యారు చేసినా అంత ఆషామాషీగా మీరు చేయ‌రు. చాలా క‌స‌ర‌త్తు, మేథో మ‌థ‌నం చేస్తారు. ఓ రెండు ప‌త్రిక‌ల ద్వారా ఈ విష‌యం మా క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లుగా తెలిసింది. అందుకే మీరు మ్యానిఫెస్టోలో పెట్టిన‌ట్లు అక్ష‌రాలా అమ‌లు చేయాల్సిన నైతిక బాధ్య‌త మీపై ఉంది. ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌లో చూశాను... ల‌క్ష రూపాయ‌ల వ‌ర‌కు మాఫీ చేస్తే 96 శాతం మంది రైతుల‌కు ల‌బ్ధి చేకూరుతుంద‌ట‌. మీరు నూరు శాతం రైతుల‌కు మేలు చేస్తాన‌న్నారు. మ‌రి ఆ నాలుగు శాతం (చాలా త‌క్కువ‌) రైతులు ఏం పాపం చేశారు చెప్పండి. అందుకే మీరు విశాల హృద‌యంతో నూరు శాతం మంది రైతుల‌కు లబ్ధి చేకూరేలా రుణ మాఫీని అమ‌లు చేయాల‌ని అన్న‌దాత‌ల త‌ర‌పున మేం కోరుతున్నాం. ఎందుకంటే రైత‌న్న విష‌యంలో ప్రాంతాలు, కులాలు, మ‌తాలు చూసుకోవ‌డం స‌రికాదు. అన్న‌దాత ఎక్క‌డ ఉన్నా ప‌ది మందికి అన్నం పెట్టేవాడే. అందుకే ఎంత భార‌మైనా మీరు రుణ మాఫీ చేస్తే చ‌రిత్ర‌లో మీ పేరు నిలిచిపోతుంది. అంతేకాదు వ్య‌వ‌సాయం దండ‌గ అన్న మీరు కాదు పండ‌గ చేసేందుకే వంద శాతం రుణ మాఫీ చేశాన‌ని నిరూపించుకోవాలి. విమ‌ర్శ‌కుల నోర్లు మూయించాలి. రైతు వ్య‌తిరేకి అన్న మీ ప్ర‌త్య‌ర్థుల మాట‌ల‌ను అక్షారాలా త‌ప్పు అని రుజువు చేయాలి. అలా మీరు చేస్తారు... చేయ‌గ‌ల‌రు. మీకు వంత పాడే ప‌త్రిక‌లు కోత‌ల‌తో ఎలా అమ‌లు చేయాలో అని లేనిపోని త‌ప్పుడు స‌ల‌హాలు ఇచ్చి, మిమ్మ‌ల్ని త‌ప్పుదోవ ప‌ట్టించేందుకు ప్ర‌య‌త్నిస్తాయి. వాటిని కాద‌ని మీరు ముందుకు వెళ్లాలి.

తెలంగాణ కాప‌లా కుక్క‌లు ఎక్క‌డికి పోయాయో..?.

తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఈ ఐదేళ్ల పాటు కాప‌లా కుక్క‌ల్లా ఉంటామ‌ని, టీఆరెస్ ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తామ‌ని గ‌త కొన్నిరోజుల కింద‌టి వ‌ర‌కు టీటీడీపీ నాయ‌కులు మైకులు ప‌గిలిపోయేలా చెప్పారు. రుణ మాఫీ విష‌యంలో టీఆరెస్‌ను గ‌ట్టిగా నిల‌దీశామ‌ని జ‌బ్బ‌లు చ‌రుసుకున్నారు. నిన్న రేవంత్ రెడ్డి సిమెంటు ధ‌ర పెరుగుద‌ల‌పై రంకెలు వేశాడు. అదేదో ఒక్క తెలంగాణ‌లోనే పెరిగిన‌ట్లు గ‌గ్గోలు పెట్టాడు. మ‌రి ఏపీలోనూ ఆ విష‌యానికొస్తే దేశవ్యాప్తంగా ఒక్క‌సారిగా ధ‌ర పెరిగితే దానికేదో కేసీఆర్ బాధ్య‌డు అయిన‌ట్లు ఆరోప‌ణ‌లు గుప్పించాడు. మ‌రి... పీపీఏల ర‌ద్దుపై ఈ కాప‌లా కుక్క‌లు ఎందుకు మొర‌గ‌డం లేదో?. భారీఎత్తున విద్యుత్తు స‌ర‌ఫ‌రా త‌గ్గి, తెలంగాణ జ‌నం అంధ‌కారంలో ఉండే ప్ర‌మాదం ఉంద‌ని తెలిసినా వీరు ఎందుకు బ‌య‌టికి రావ‌డం లేదు. కేవ‌లం టీఆరెస్ స‌ర్కారుపై ఆరోప‌ణ‌లు చేసేందుకే వీరికి నోరు మెదులుతుందా?. లేక‌పోతే అందుకు సంబంధించిన రెన్యుమ‌రేష‌న్ మాత్ర‌మే ముడుతున్నందున అక్క‌డికే ప‌రిమితం అవుతున్నారా? ఇంత‌కీ... ఇవి తెలంగాణ కాప‌లా కుక్క‌లా, సీమాంధ్ర నాయ‌కుల పెంపుడు కుక్క‌లా?.

రుణ మాఫీని మ‌రుగున‌ ప‌డేయ‌డ‌మే ముఖ్యోద్దేశం....!!


ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందాల‌ను ర‌ద్దు చేసుకోవాల‌ని అనుకుంటోంది... ఏ రాష్ట్రంలో ఉత్ప‌త్తి అయిన విద్యుత్ ఆ రాష్ట్రంలోనే ఉప‌యోగించుకోవాల‌ని చంద్ర‌బాబునాయుడు అంటున్నాడు... దీన్ని ఈనాడు ప‌త్రిక‌, ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక బాగా స‌మ‌ర్థిస్తూ క‌థ‌నాలు రాస్తున్నాయి... ఇది ఒక‌వేళ చంద్ర‌బాబునాయుడు అన్న‌ట్లుగానే జ‌రిగితే తెలంగాణ‌కు విద్యుత్ విష‌యంలో కొంత న‌ష్టం చేకూరుతుందేమో... కానీ ఇత‌ర చాలా విష‌యాల్లో ప్ర‌యోజ‌నం చేకూరుతుంది...
నాకు తెలిసినంత వ‌ర‌కు ఒక‌వేళ చంద్ర‌బాబునాయుడు విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని ర‌ద్దు చేయించ‌డంలో స‌ఫ‌లం అయితే... ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ మ‌ధ్య అంత‌ర్యుద్ధం జ‌ర‌గ‌డం త‌థ్యం..... ఎందుకంటే విభ‌జ‌న బిల్లులో పేర్కొన్న ఒక్క అంశాన్ని చంద్ర‌బాబు ఉల్లంఘించి ఆంధ్రాకు ప్ర‌యోజ‌నం చేకూర్చాల‌ని అనుకుంటున్నాడు... వాస్త‌వానికి ఆయ‌న ఉద్దేశం, ఆందోళ‌న సీమాంధ్ర‌లో విద్యుత్ కోత‌ల‌పై కాదు... రుణ మాఫీ నుంచి ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చ‌డానికి ప‌నికి వ‌చ్చే ఒక దీర్ఘకాలిక అంశం కావాలి.... అందుకే ఈ అంశాన్ని ఎంచుకున్నాడు... ఇప్పుడు రెండు రాష్ట్రాలు దీనిపై కొట్లాడుకుంటాయి... సీమాంధ్ర ప్ర‌జ‌లు రుణ మాఫీని మ‌ర‌చిపోతారు.... తెలంగాణ నాయ‌కులు చంద్ర‌బాబును ప‌దేప‌దే తిడుతుంటారు కాబ‌ట్టి ఇక ప్ర‌జ‌లు రుణ మాఫీపై త‌న‌ను ప్ర‌శ్నించ‌ర‌న్న ఆలోచ‌న‌లో ఆయ‌న ఉన్నారు...

ఒక‌వేళ‌ చంద్ర‌బాబు విద్యుత్ ఒప్పందాల‌ను ర‌ద్దు చేయించ‌డంలో స‌ఫ‌లం అయితే తెలంగాణ ప్ర‌భుత్వం చాలా ఘాటుగా స్పందించే అవ‌కాశం ఉంది... నాకు తెలిసి తెలంగాణ ప్ర‌భుత్వం ఈ కింది ప‌నుల‌ను చేయొచ్చని.. చేయాల‌ని నేను బ‌లంగా కోరుకుంటున్నా....

1. ఆంధ్రాలో పుట్టిన వాడు ఆంధ్రాలోనే ప‌నిచేయాల‌న్న సూత్రాన్ని తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకొస్తుంది...
2. ఆంధ్రాలో పుట్టి తెలంగాన‌లో రిటైర్డు అయిన ఉద్యోగికి పింఛ‌న్లు కాదు క‌దా.. పైసా కూడా ఇవ్వ‌బోమ‌ని మొండికేస్తుంది....
3. తెలంగాణ‌లో పారుతున్న కృష్ణా, గోదావ‌రి జ‌లాల‌ను తెలంగాణ వాళ్లే వాడుకుంటార‌ని స్ప‌ష్టం చేస్తుంది....
4.తెలంగాణ‌కు సాగు, తాగు నీటి అవ‌స‌రాలు తీరాకే ఆంధ్రాకు నీళ్లు విడుద‌ల చేస్తామ‌ని తేల్చిచెబుతారు.....
5.తెలంగాణ‌లో ఉండే ఆంధ్రా ఉద్యోగులు, ఆంధ్రా మంత్రుల నివాసాల‌కు విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిపివేస్తుంది...
6.తెలంగాణ‌లో ఉన్న మీడియా సంస్థ‌ల్లో తెలంగాణ ఉద్యోగులే ఉండాల‌న్న నిబంధ‌న వ‌చ్చినా ఆశ్చ‌ర్యం లేదు...
7.పోల‌వ‌రం ముంపు మండ‌లాలు, గ్రామాల‌న్నింటినీ తెలంగాణ‌లోనే ఉంచుకోవ‌డం త‌థ్యం...
8.సీలేరు జ‌ల‌విద్యుత్ కేంద్రాన్ని స్వాధీనం చేసుకుంటుంది...
9.సీమాంధ్ర థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రాల‌కు బొగ్గు స‌ర‌ఫ‌రా నిలిపివేస్తుంది...
10.హైద‌రాబాద్‌ను ఉమ్మ‌డి రాజ‌ధానిగా ప‌దేళ్లు ఉంచొద్ద‌ని న్యాయ‌పోరాట‌మూ చేస్తుంది....

ఇంకా చాలా చేయొచ్చేమో... ఇంకా తెలంగాణ ప్ర‌భుత్వం, కేసీఆర్ ఏం చేయ‌గ‌లుగుతారో.. ఊహించి రాయండి....

ఈ ఏడుపుగొట్టు ఐడియాలేంటో..!


గ‌త కొన్నిరోజులుగా ఖాళీ స‌మ‌యం దొర‌క‌డంతో మా టీవీలో మీలో ఎవ‌రు ల‌క్షాధికారి ప్రోగ్రాంను ఫాలో అయ్యాను. మొద‌టిసారిగా అక్కినేని నాగార్జున నిర్వ‌హిస్తున్న ఇది బాగుంది. ముఖ్యంగా జీకే పెంచేదిగా ఉంది. కానీ ఇలాంటి కార్య‌క్ర‌మంలోనూ సాధార‌ణంగా తెలుగు టీవీ ఛానెళ్లు రేటింగ్ పెంచుకునేందుకు చేసే దిక్కుమాలిన పంథా ఒక‌టి పాటిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. గ‌తంలో చూశాం... ఓంకార్ అనే వ్య‌క్తి త‌న ప్రోగ్రాంల ద్వారా రేటింగ్ పెంచుకుని, తాను డ‌బ్బులు సంపాదించుకునేందుకు పార్టిసిపెంట్ మ‌ధ్య గొడ‌వ పెట్ట‌డం, వారితో ఏడ్పించ‌డం ఇలా జుగుప్సాక‌ర‌మైన విధానాలు పాటించేవారు. మరి ఈ ల‌క్షాధికారి ప్రోగ్రాంలో అంతా బాగుంది. కానీ నాగార్జున హాట్ సీట్‌పై వ‌చ్చిన ప్ర‌తి వ్య‌క్తిని ఒక ప్ర‌శ్న వేస్తున్నారు. *మీ జీవితంలో అత్యంత విషాద‌క‌ర‌మైన (బ్యాడ్ మూమెంట్‌) ఏమిటి* అని అడుగుతున్నారు. చాలామంది త‌మ త‌ల్లిదండ్రులు చ‌నిపోయిన విష‌యాన్ని, వైనాన్ని వివ‌రిస్తూ క‌న్నీటి ప‌ర్యంతం అవుతున్నారు. నాగార్జున అయ్యో.. అన‌డం కొంత‌సేపు ఒక‌ర‌క‌మైన మ్యూజిక్‌!. నిన్న‌టికి నిన్న సుజాతా రాణి అనే న‌ల్లొండ మ‌హిళ త‌న తండ్రి ఆత్మ‌హ‌త్య‌పై మాట‌లు రాక చెప్ప‌లేక‌పోయింది. నాగార్జున ఇష్టం లేకుంటే చెప్పొద్దు అంటూనే దానిని తాత్కాలికంగా వాయిదా వేశారు. ఆమె క‌న్నీళ్ల‌ను నియంత్ర‌ణ చేసుకోలేక లేట‌ర్ అంది. అంటే ఆమెకు చెప్ప‌డం ఇష్టం లేద‌ని సులువుగా తెలుస్తుంది. అలాంట‌ప్పుడు ఆ విష‌యాన్ని వ‌దిలివేయ‌వ‌చ్చు క‌దా... ఒక ప్ర‌శ్న త‌ర్వాత మ‌ళ్లీ త‌ర్వాత చెబుతాన‌న్నారు క‌దా... మీ నాన్న‌గారు ఎలా చ‌నిపోయారు?. అంటూ తెలివిగా ఆమెతో చెప్పించే ప్ర‌య‌త్నం చేశారు. చెప్పేదాకా వ‌ద‌ల్లేదు. ఇదేంది?. వాళ్లు ఏడిస్తే రేటింగ్ ఇంకా పెరుగుతుందా?.. క‌న్నీళ్ల‌తోనే కార్య‌క్ర‌మాలు ర‌క్తి క‌డ‌తాయ‌నే పొరంబోకు ఐడియా ఎవ‌రిచ్చారోగానీ ఇది చాలా బాధాక‌రం. ఏం... పార్టిసిపెంట్‌ను మీ జీవితంలో అత్యంత హ్యాపీడే ఏంటి? అని అడ‌గ‌వ‌చ్చు క‌దా. నెగెటివ్‌గానే ఎందుకు ప్ర‌శ్నించాలి. స్ఫూర్తివంత‌మైన విష‌యాలు ఏమైనా చేశారా?.. అని ప్ర‌శ్నించ‌వ‌చ్చు క‌దా. ఒక‌రిని ఏడిపించ‌డం ద్వారా చూసే వారి సంఖ్య పెరుగుతుంది... ఎవ‌రూ ఛానెల్ మార్చ‌రు అనే భ్ర‌మ‌ల నుంచి నిర్వాహ‌కులు ఇప్ప‌టికైనా బ‌య‌టికి రావాలి.

నీవు చూసేది నీ వార్త కాదు...


ఒక‌ప్పుడు ఈనాడు పేప‌ర్ టీఆర్ఎస్ వార్త‌ల‌ను పెద్ద‌గా వేసుకునేది కాదు...
ఎందుకు వేసుకోవ‌డం లేదు అంటే... ఆ పార్టీకి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు..
అదే టీడీపీకి 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు...
ఎమ్మెల్యేల సంఖ్య‌ను బ‌ట్టి స్థ‌ల ప్రాధాన్యం ఇవ్వాల‌ని నీతులు చెప్పేది....
అయితే జేపీ విష‌యానికి వ‌స్తే ఆ సూత్రాన్ని ప‌క్క‌కు పెట్టింద‌నుకోండి.... అది వేరే విష‌యం....

ఇక ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ కు 63 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు...
ఇక టీడీపీకి 15 మంది మాత్ర‌మే ఉన్నారు...
అయినా కూడా ఇప్ప‌టికీ తెలంగాణ ప్రాంత ఈనాడు ఎడిష‌న్‌లో టీడీపీ వార్త‌లు వ‌స్తున్నాయి..
విచిత్రం ఏంటంటే.. ఈ వార్త‌ల‌న్నీ కూడా సీమాంధ్ర టీడీపీ వార్త‌లు కావ‌డం గ‌మ‌నార్హం...
క‌నీసం ఇక్క‌డ ఉన్న 15 మంది టీడీపీ నేత‌ల వార్త‌లు వ‌చ్చినా ఈ ప‌త్రిక టీడీపీ ప‌క్ష పాతి అని అనుకునే వాన్ని...
కానీ మొత్తం ఆంధ్రా నేత‌ల ఫొటోలు, చంద్ర‌బాబు బొమ్మ‌ల‌తో తెలంగాణ ఈనాడు ఎడిష‌న్ కంపుకొడుతోంది...
విచిత్రం ఏంటంటే లోకేశ్ వార్త‌ను ఆంధ్రాలో చిన్న‌గా వేసి తెలంగాణ‌లో పెద్ద‌గా వేయ‌డం....
ఎమ్మెల్యేల సంఖ్య‌ను బ‌ట్టి స్థ‌ల ప్రాధాన్యం ద‌క్కుతుందా?
లేక వాళ్ల ప్రాంతాల‌ను, కులాల‌ బ‌ట్టి ద‌క్కుతుందా? అన్న‌ది పాఠ‌కులే ఆలోచించుకోవాలి....
ఒక‌వేళ ఆంధ్రా ప్ర‌భుత్వం వార్త‌లు తెలంగాణ‌లో వేస్తున్న‌ప్పుడు.. తెలంగాణ ప్ర‌భుత్వం వార్త‌ల‌ను
ఆంధ్రాలో అంతే మొతాదులో వాడాలి క‌దా.. మ‌రి ఎందుకు వేయ‌డం లేదు?

అంతా మాయ‌... తెలంగాణ జ‌నాన్ని నిత్యం మోసం చేయాల‌న్న ఆలోచ‌నే... తెలంగాణ పాఠ‌కుడు మేలుకునే వ‌ర‌కూ ఈ ఆగ‌డాలు ఇలాగే కొన‌సాగుతాయి....

ఓహో మేధావి... ఎక్క‌డ దాక్కున్నావ్‌?!.

జ‌య‌ప్ర‌కాశ్‌నారాయ‌ణ‌... మ‌న రాష్ట్రంలో ఈయ‌న ఒక్క‌డే మేధావి అని సోకాల్డ్ ప‌త్రిక‌లు ఘోషించాయి... ఇక ముందు కూడా ఘోషిస్తాయి. మ‌రి జ‌నం కోసం స‌ర్కారు స‌ర్వీసును వ‌దిలిన ఈ అప‌ర మేధావి ఎక్క‌డ ఉన్నాడు?. మోడీని బ‌ల‌ప‌రిచిన ఈయ‌న ఇప్పుడు అదే మోడీ సామాన్య జ‌నంపై న‌డ్డివిరిచేలా రైల్వే ఛార్జీల‌తో భారం మోపాడు. సామాన్య జ‌నంపై భారం మోపాడు. కానీ స‌ద‌రు జేపీ గంట‌లు గ‌డిచినా ఇప్ప‌టికీ నోరు మెద‌ప‌లేదు. కానీ ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ కొన్ని గంట‌లు పలు చానెళ్ల‌లో గొంతు పోయేలా ఈ నిర్ణ‌యాన్ని ఖండిస్తున్నారు. చూశారా... మేధావులు అంటే జ‌నం బాగు కోరాలి. కానీ ఈ ఇద్ద‌రి మేధావుల మ‌ధ్య ఎంత తేడా?.. పోనీ మొన్న ఓడిపోయిందుకు నైరాశ్యంలో జేపీ బ‌య‌టికి రాలేద‌నుకుందాం. మ‌రి నాగేశ్వ‌ర్ కూడా అదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపో్యారు క‌దా. సూత్రం ప్ర‌కారం ఈయ‌న కూడా నైరాశ్యంలోకి పోవాలి. అందుకే ఎవ‌రు జ‌న‌ప‌క్షం, ఎవ‌రు పెట్టుబ‌డిదారుల కాప‌లాకుక్క‌నో జ‌నానికి అర్థం అయింది. కాక‌పోతే సోకాల్డ్ మీడియా సిగ్గు తెచ్చుకొని జేపీకి బాజా ఊద‌డం మానేయాలి. ఆయ‌నో అప‌ర మేధావి, ఆయ‌న వ‌స్తే జ‌నానికి స్వ‌ర్గం చూపుతార‌ని పేజీల‌కు పేజీలు ప్ర‌చారం క‌ల్పించిన ఈనాడు ఇప్పుడు త‌న త‌ల‌కాయ ఎక్క‌డ పెట్టుకుంటుంది?. రేపోమాపో నిస్సిగ్గుగా జేపీ నామ‌మాత్రంగా ఒక ప్రెస్‌మీట్ పెట్టి ఎవ‌రికీ అర్థంకాని రీతిలో ఒక‌విధంగా ఆయ‌న‌కూ స్ప‌ష్టంలేని రీతిలో ప్ర‌క‌ట‌న చేస్తాడు. ఇలా చేస్తే అంద‌రూ ఖండించాలి. జేపీ వెంట‌నే లోక్‌స‌త్తా త‌ర‌పున రైల్వే ఛార్జీల‌కు వ్య‌తిరేకంగా కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించాలి. ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేసిన విధంగా ఈనాడు కూడా ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మాల‌ను పేజీల‌కు పేజీలు వేయాలి. లేక‌పోతే బ‌ట్టెబాజ్ గాండ్ల‌ను రాళ్ల‌తో కొట్టాలి.

ప్ర‌త్యేకంగా దీనిపై టీడీపీ నాయ‌కుడు, ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడు అసెంబ్లీ వేదిక‌గా త‌న వైఖ‌రి ప్ర‌క‌టించాలి. మోడీని ఆకాశానికి ఎత్తిన ఆయ‌న ఈ ఛార్జీల పెంపును వ్య‌తిరేకిస్తున్నారా?. లేదా?. అని స్ప‌ష్టం చేయాలి. లేక‌పోతే న‌క్క‌జిత్తులోడు మ‌ళ్లోసారి సీఎం అయ్యిండ‌ని జ‌నం రోధించ‌క త‌ప్ప‌దు.

ఎవ‌రున్నా ఛార్జీల మోత కామ‌న్‌..


2012, 2013లో రైల్వే ఛార్జీలను యూపీఏ ప్ర‌భుత్వం పెంచిన‌ప్పుడు బీజేపీ వాళ్లు యూపీఏ ప్ర‌భుత్వం ప్ర‌జా వ్య‌తిరేక విధానాలు అవ‌లంబిస్తోంద‌న్నారు... రైలు ఛార్జీల పెరుగుద‌ల‌ను నిర‌సిస్తూ అప్ప‌టి గుజ‌రాత్, ప్ర‌స్తుత ప్ర‌ధాని ముఖ్య‌మంత్రి న‌రేంద్ర మోడీ కూడా అప్ప‌టి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ కు ఘాటైన లేఖ రాశారు... రైలు ఛార్జీల పెంపు వ‌ల్ల నిత్యావ‌స‌రాల ధ‌ర‌ల‌పైనా ప్ర‌భావం ప‌డుతుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు...

మరి ఇప్పుడు ఎన్డీయే రైలు ఛార్జీలు పెంచింది.. ఇక విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించాల్సింది విప‌క్షాలు... డైలాగులు అవే ఉంటాయి.. య‌థావిధిగా ప్ర‌జ‌ల‌కు ఒరిగేది ఏమీ ఉండ‌దు... వంట గ్యాస్ ధ‌ర‌లు పెరుగుతాయి.. పెట్రోల్ ధ‌ర‌లు పెరుగుతాయి.. కూర‌గాయల ధ‌ర‌లూ పెరుగుతాయి... మనం చూస్తూ ఉండాల్సిందే.. పాల‌కులు ఎవ‌రైనా ఏళ్ల త‌ర‌బ‌డి జ‌రుగుతున్న‌ది తంతు ఇదే... మ‌రో ఐదేళ్ల వ‌ర‌కూ ఇలాగే చ‌ల్తా హే....

మ‌నోళ్ల‌కు క‌ష్ట‌మొస్తే ప‌ట్టించుకోరు...

ఇరాక్‌లో వెయ్యి మందికి పైగా తెలంగాణ వాళ్లు ఉన్నార‌ట‌...
ఇద్ద‌రు మాత్ర‌మే ఆంధ్రులు ఉన్నార‌ట‌...
ఒక‌వేళ ఇరాక్‌లో వెయ్యి మంది ఆంధ్రులు చిక్కుకుని ఉంటే..
ఈ వార్త ఈనాడులో ఇంత చిన్న‌గా.. నిన్న వ‌చ్చిన‌ట్లు లాస్టు పేజీలో వ‌చ్చేదా?
ముమ్మాటికీ తెలంగాణ‌, ఆంద్రాలో మొదటి పేజీలో వేసే వాళ్లు... వాళ్లంతా తెలుగు వాళ్ల‌ని రాసి జాతీయ స‌మ‌స్య చేసే వాళ్లేమో...
ఇప్పుడు ఇరాక్‌లో చిక్కుకున్న‌ది తెలంగాణోళ్లు.. అందుకే ఇది మొద‌టి పేజీకి రాలేదేమో..
ఆంధ్రా అసెంబ్లీ ప్రారంభ‌మైంద‌న్న‌ వార్త క‌న్నా తెలంగాణ‌కు ఇదే ఎక్కువ ప్రాధాన్య‌మైన వార్త‌...
కానీ మీరు ఆంధ్రా అసెంబ్లీ మొద‌లైంద‌న్న వార్త‌కు మొద‌టి పేజీలో 30 శాతం స్థ‌లం కేటాయించారు..

కేసీఆర్ గారికో విన‌తి



జ‌య‌శంక‌ర్‌సార్ వ‌ర్ధంతి సంద‌ర్బంగా టీవీల్లో (టీ, వీ6) వ‌చ్చిన చ‌ర్చ‌లు, మీ ప్ర‌సంగం విన్నాను. నాకు సో్యి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి జ‌య‌శంక‌ర్‌సార్ పేరు విడిగా విన‌లేదు. ముందు ప్రొఫెస‌ర్ అని ఉన్నా, లేకున్నా అంద‌రూ ఆయ‌న్ని సార్ అని పిల‌వ‌డం తెలంగాణ స‌మాజ అదృష్టం. చివ‌ర‌కు ఆయ‌న‌కు స‌న్నిహితుడిగా ఉన్న ప్రొఫెస‌ర్ హ‌ర‌గోపాల్‌గారు వంద సార్లు సార్ పేరు ప్ర‌స్తావించినా క‌చ్చితంగా జ‌య‌శంక‌ర్‌గారు అని సంబోధించారు. అంత‌టి ఉన్న‌త వ్య‌క్తి అయినందున మీరు వ‌రంగ‌ల్ ఏక‌శిలా పార్కుకు పేరు పెట్టినా, మ‌రో స్మార‌క ట్ర‌స్టు ఏర్పాటు చేసినా క‌చ్చితంగా జ‌య‌శంక‌ర్‌సార్ అని చేర్చాల‌ని విన‌తి. కేవ‌లం జ‌య‌శంక‌ర్ అని పెట్ట‌డం వ‌ల్ల రానున్న త‌రాల్లో పేరు విన‌గానే ఆయ‌న గొప్ప‌త‌నం వెంట‌నే తెల‌వ‌దు. కానీ జ‌య‌శంక‌ర్‌సార్ అని ఉండ‌టం వ‌ల్ల ముందు త‌రాల పిల్ల‌లు కూడా అరె సార్‌... అట అని ఆక‌ర్షితులై, ఆయ‌న జీవిత చ‌రిత్ర‌ను తెలుసుకోవాల‌నే త‌పన క‌లుగుతుంది. సార్ అని లేక‌పోవ‌డం వ‌ల్ల ఆయ‌న‌కు త‌క్కువ గౌర‌వం ఇచ్చిన‌ట్లుకాదుగానీ... ప‌ది కాలాల పాటు అంద‌రి మ‌దిలో ఉన్న సార్‌గా నిలిచిపోయిన ఆయ‌న్ని ముందు త‌రాల వారి నోటి నుంచి ఆ పేరు వ‌చ్చిన స‌మ‌యంలోనే సార్ అని వ‌స్తే ఇప్ప‌టి త‌రాల వారికి చూడ‌ముచ్చ‌ట‌గా ఉంటుంది. మ‌న‌లాంటి వారికి ఆనందంగా ఉంటుంది.

నేరం మాది కాదు...


పోల‌వ‌రం ముంపు మండ‌లాల‌ను ఆంధ్రాలో క‌ల‌ప‌డం యూపీఏ నిర్ణ‌యం.... రైలు ఛార్జీల‌ను పెంచ‌డం యూపీఏ నిర్ణ‌యం... న‌ల్ల‌ధ‌నంపై సిట్ వేయ‌మ‌ని ఆదేశించ‌డం సుప్రీంకోర్టు నిర్ణ‌యం... మ‌రి వీళ్ల నిర్ణ‌యాలు ఎప్పుడుంటాయి...?

తెలంగాణ వాస‌న‌లేని ఛానెల్‌...!!

ఈనెల 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భ‌వించింది. దానికి కొన్ని రోజుల ముందు స‌వ‌తి త‌ల్లి ప్రేమ‌లా రామోజీరావు ఈటీవీ-3 అంటూ తెలంగాణ‌కు అంకితం చేసిన‌ట్లుగా ఒక ఛానెల్‌ను ప్రారంభించారు. కానీ ఇప్పుడు అది అటు తెలంగాణ వాస‌న‌లేక‌... ఇటు పూర్తిగా ఆంధ్ర‌వాదాన్ని మోయ‌లేక అటుఇటుగాకుండా ఉంద‌నుకోండి. ఆ ఛానెల్ ఏర్పాటు సంద‌ర్భంగా ప్ర‌త్యేక క‌థ‌నాలు త‌యారుచేశారు. వారెవ‌రో కాదు... ఆ బాధ్య‌త ఆరుగురికి అప్ప‌గిస్తే అందులో ఒక్క తెలంగాణ జ‌ర్న‌లిస్టు లేడు. అందుకే అక్ష‌రాలా ఆ ఆరుగురి మ‌ధ్య క‌థ‌నాలు త‌యారుచేసిన‌పుడు ఒక సందేహం వ‌చ్చింది. అదేంతో తెలుసా... తెలంగాణ రాష్ట్రం కోసం చ‌నిపో్యిన యువ‌కుల‌ను అమ‌ర‌వీరులు అనాలా?. లేదా?. తెలంగాణ అమ‌ర‌వీరులు అంటే వారిని పొగిడిన‌ట్లుగా ఉంటుంద‌నేది వారి భావ‌న‌. మ‌రి తెలంగాణోడు బ‌తికినా, స‌చ్చినా... వారికి చిన్న చూపే. అందుకే ఆ ప‌దాన్ని నిషేధించారు. తెలంగాణ కోసం చ‌నిపోయిన విద్యార్థులు అని రాసారు. అందుకే తెలంగాణ పేరిట ఈ స‌మాజానికి ఏమాత్రం మేలు చేయ‌ని ఆ ఛానెల్‌లో వ‌చ్చిన క‌థ‌నాల‌న్నింటిలోనూ ఎక్క‌డా తెలంగాణ అమ‌ర‌వీరులు అనే ప‌దం విన‌ప‌డ‌దు, క‌న‌ప‌డ‌దు. తెలంగాణ కోసం చ‌నిపోయిన విద్యార్థులు అని స‌రిపెట్టారు. ఇక‌ముందూ స‌రిపెడ‌తారు.
నోట్‌: అనేక రంగాలు, వ్య‌క్తుల మ‌ధ్య అంత‌ర్గ‌తంగా జ‌రిగిన చ‌ర్చ‌ల‌ను ప‌త్రిక‌లు బ‌య‌ట‌పెడ‌తాయి. త‌మ పైత్యంతో రాస్తాయి. మ‌రి ప‌త్రిక‌ల వెన‌క జ‌రిగిన వాస్త‌వాల‌ను ఎలాంటి పైత్యం లేకుండా అప్పుడ‌ప్పుడూ ఇలా అందిస్తాం. ఎందుకంటే భావ స్వేచ్ఛ అంద‌రికీ స‌మానం క‌దా.

ప్ర‌ధాన ప‌త్రిక పాత్రికేయుడి అంత‌రంగం..

ఈరోజు ఉద‌యం నాకు ఒక తెలంగాణ జ‌ర్న‌లిస్టు ఫేస్‌బుక్‌లో మెసేజ్ చేయ‌డంతో ఫోన్ చేశాను. ఆత‌ర్వాత అత‌ని సూచ‌న మేర‌కు వారి కొలీగ్స్‌తో మాట్లాడాను ఒక ప్ర‌ధాన ప‌త్రిక‌లో ప‌ని చేస్తున్న వారిపై కొన‌సాగుతున్న వివ‌క్ష‌, అణ‌చివేత వింటుంటే గుండె త‌రుక్కుపోతుంది. అదే స‌మ‌యంలో వారి మాట‌ల్లో ఆశ్చ‌ర్యం క‌లిగించే అంశాలూ ఏమీ లేవు. ఎందుకంటే మ‌న‌కు రాష్ట్రం వ‌చ్చిందేగానీ ఇంకా సంపూర్ణ అస్థిత్వం రాలేద‌ని వారి మాట‌ల్లో స్ప‌ష్టంగా అర్థ‌మైంది. అంతేకాదు ముఖ్యంగా సీమాంధ్ర మీడియా రాష్ట్ర విభ‌జ‌న‌తో మ‌రింత ప్ర‌తీకారంతో ర‌గిలిపోతుంద‌నే విష‌యం వెల్ల‌డ‌వుతుంది. దీనికితోడు తెలంగాణ‌లో వాళ్ల‌కు మింగుడుప‌డ‌ని టీఆరెస్ అధికారాన్ని చేప‌ట్ట‌డంతో ఒక‌వైపు టీఆరెస్ ప్ర‌భుత్వంతో నేరుగా ఢీకొన‌కుండా తెలంగాణ జ‌ర్న‌లిస్టుల‌పై త‌మ ప్ర‌తాపాన్ని చూపుతున్న‌ట్లు అర్థం అవుతుంది. మ‌రి ఈ ప‌రిస్థితులు మారాలన్నా, తెలంగాణ స‌మాజంలోని అనేక రంగాల‌కు క‌లిగిన విముక్తి తెలంగాణ జ‌ర్న‌లిస్టుల‌కు కూడా క‌ల‌గాలంటే మ‌న స‌మాజం మ‌రోసారి చైత‌న్యాన్ని ప్ర‌ద‌ర్శించాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ఇందుకు మ‌న జ‌య‌శంక‌ర్‌సార్ చూపిన మూడు ద‌శ‌ల మార్గాలు నా క‌ళ్ల‌ముందు క‌నిపించాయి. వాటిని మీతో పంచుకుంటున్నాను.

! భావ‌జాల వ్యాప్తి... ఇందులో తెలంగాణ స‌మాజంలో్ని ప్ర‌జ‌ల‌ది ఎంత భాగ‌స్వామ్యం ఉందో అంత‌కుమించి మ‌న ఉద్యోగులు కీల‌క పాత్ర పోషించాల్సిన అవ‌స‌ర‌ముంది. ఉద్య‌మంలో తెలంగాణ‌లోని అన్ని రంగాల వారు ఉద్యోగుల‌కు అండ‌గా నిలిచారు. ఆ బ‌లంతోనే ఉద్యోగ సంఘాల నాయ‌కులు చివ‌ర‌కు రాజ‌కీయ నేత‌ల‌ను సైతం బ‌హిరంగంగా బ‌హిష్క‌రించేలా ప్ర‌క‌ట‌న‌లు చేయ‌గ‌లిగారు. జ‌నం వారి వెంట నిల‌వ‌డంతో అధికారంలో ఉన్న నాయ‌కులు సైతం ఉద్యోగ నేత‌ల‌ను ప‌ల్లెత్తు మాట అన‌లేక‌పోయారు. మ‌రి మ‌న రాష్ట్రంలో తెలంగాణ ఉద్యోగులే ప‌ని చేయాల‌ని ఉద్యోగులు ఇప్ప‌టికీ నిన‌దిస్తున్న ఉద్యోగులు ఆ నినాదాన్ని తెలంగాణ జ‌ర్న‌లిస్టుల విష‌యంలో ఎందుకు అమ‌లు చేయ‌డం లేదు. దీనికి బ‌హిరంగంగా ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు చేయాల‌ని నేను చెప్ప‌డం లేదు. కానీ తెలంగాణ ప్ర‌భుత్వం, స‌మాజంలో ఇక్క‌డి జ‌ర్న‌లిస్టులే భాగ‌స్వాములు కావాల‌నే భావ‌జాలాన్ని ప్ర‌తి ఒక్క ఉద్యోగిలో్ నింపితే చాలు. ఇప్పుడు ఉద్యోగులు ఆ బాధ్య‌త‌ను నెర‌వేర్చాల్సిన స‌మ‌యం వ‌చ్చింది. సీమాంధ్ర జ‌ర్న‌లిస్టుల‌కు స‌మాచారాన్ని పంచుకోవ‌డం స‌హాయ నిరాక‌ర‌ణ చేస్తే మీడియా సంస్థ‌లు కూడా ఏమీచేయ‌లేని నిస్స‌హాయ‌స్థితిలో ప‌డిపోతాయి. ఎలాగూ మ‌న ప్ర‌భుత్వ‌మే ఉన్నందున ఆ సంస్థ‌ల‌కు త‌లొగ్గాల్సిన అవ‌స‌రం కూడా ఉద్యోగుల‌కు ఉండ‌దు. దీంతో ఆ సంస్థ‌లు కేవ‌లం ఇక్క‌డ తెలంగాణ జ‌ర్న‌లిస్టుల‌నే ప‌ని చేయించాల్సిన అనివార్య‌త ఏర్ప‌డుతుంది. మ‌రి మ‌న ఉద్యోగులు ఈ ద‌శ అమ‌లుకు ఎంతవ‌ర‌కు స‌హ‌కరిస్తార‌నేది వారి మీదే ఆధార‌ప‌డి ఉంది. ఒక్కో ఉద్యోగి త‌న‌కు తాను ఈ నిర్ణ‌యం తీసుకుంటే ప‌ది జిల్లాల్లో వ‌చ్చే పెను ఉద్య‌మం సీమాంధ్ర మీడియాను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అంతేకాదు ఒక ప్రాంత గ‌డ్డ‌పై ఉండి, ఆ గ‌డ్డ‌కు వ్య‌తిరేకంగా ప‌నిచేసే మీడియాను తెలంగాణ ఉద్యోగులు స‌మ‌ర్ధంగా ఎదుర్కొన్నార‌నే స్ఫూర్తిని ప్ర‌పంచానికి చాటిన‌ట్ల‌వుతుంది. దీనికి అనుగుణంగానే జ‌నం కూడా ఆ సీమాంధ్ర అహంకారానికి కార‌ణ‌మైన స‌ర్క్యులేష‌న్‌, ప్ర‌క‌ట‌న‌ల‌పైనా దెబ్బ తీయాల్సిన అవ‌స‌ర‌ముంది. కాక‌పో్తే ఇందుకు కొంత స‌మ‌యం ప‌డుతుంది. ఫేస్‌బుక్‌లోని మిత్రులు ఒక్క‌రు ప‌దిమందితో మ‌న‌కు వ్య‌తిరేకంగా కొన‌సాగుతున్న సీమాంధ్ర మీడియా కుట్ర‌ల‌పై అవగాహ‌న క‌ల్పించ‌డం ద్వారా కాల‌క్ర‌మంలో సీమాంధ్ర మీడియా ఆధిప‌త్యం కూక‌టివేళ్ల‌తో నేల‌రాలే క్ష‌ణం క‌చ్చితంగా వ‌స్తుంది. ఎందుకంటే అంత‌రిక్ష యాన‌మైనా మొద‌టి కిలోమీట‌రుతోనే మొద‌ల‌వుతుంది.

!! రెండోది... ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు. ఇప్ప‌టికే చైత‌న్యాన్ని నింపుకున్న మ‌న తెలంగాణ స‌మాజంలో తెలంగాణ జ‌ర్న‌లిస్టులు ఒక వేదిక‌పైకి వ‌చ్చారు. కానీ ఆ స్ఫూర్తి స‌మ‌ర్ధ‌వంతంగా కొన‌సాగ‌డం లేదు. సంఘాల్లోని విబేధాలు కావ‌చ్చు, నాయ‌క‌త్వ అల‌స‌త్వ‌మూ కావ‌చ్చు. కానీ ఒక రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత కూడా మీడియా తెలంగాణ అస్థిత్వాన్ని అంగీక‌రించ‌డంపై ఏఒక్క‌రూ ప్ర‌శ్నించ‌డం లేదు. రాష్ట్రం రాక‌ముందు సీమాంధ్ర మీడియాపై నిప్పులు చెర‌గిన జ‌ర్న‌లిస్టు సంఘ నాయ‌కులు కూడా ఇప్పుడు ఆ స్ఫూర్తిని ప్ర‌ద‌ర్శించ‌డం లేదు. ఇదేమంటే ఆ సంస్థ వ్య‌క్తిగ‌త విష‌యాలు, ఆ జ‌ర్న‌లిస్టులు బ‌య‌టికి రాక‌పోవ‌డం వంటి కార‌ణాలు చూపుతున్నారు. కానీ మ‌నం ఓసారి తెలంగాణ ఉద్య‌మాన్ని గుర్తు చేసుకుంటే ఇలాంటి ఎన్నో అవాంత‌రాలు, ఆంక్ష‌ల గోడ‌ల‌ను బద్ద‌లుకొట్టి జ‌ర్న‌లిస్టులు చైత‌న్యాన్ని ప్ర‌ద‌ర్శించారు. మ‌రి ఇప్పుడు ఆ చొర‌వ ఏమైంది?. వెసులుబాటు ఉన్న వారు ముందు ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌ల‌కు శ్రీ‌కారం చుడితే క్ర‌మ‌క్ర‌మంగా అది ఓ పెను ఉప్పెన‌గా మారుతుంది. నేనొక్క‌డినే, నాకేం అవ‌స‌రం అని అనుకుంటే మ‌న జ‌య‌శంక‌రు సారు ఇప్పుడు తెలంగాణ స‌మాజ జాతిపిత‌గా మారేవారు కాదు, కో్ట్లాదిమందిలో స్ఫూర్తి నింపిన ప్ర‌దాత‌గా మారేవారూ కాదు.

!!! మూడోది... రాజ‌కీయ నిర్ణ‌యం. మొద‌టి రెండు ద‌శ‌లు మొద‌లైతే ఆటోమెటిక్‌గా రాజ‌కీయ రంగం ప్ర‌వేశించ‌డం అనివార్యంగా మారుతుంది. ఇందుకు తెలంగాణ ఉద్య‌మ ప్ర‌స్థాన‌మే ఓ చ‌క్క‌టి ఉదాహ‌ర‌ణ‌. ఇప్పుడు నేరుగా టీఆరెస్ ప్ర‌భుత్వం జోక్యం చేసుకోవ‌చ్చు. కానీ చేసిన త‌ప్పును ఎత్తి చూపితేనే ఈ సో కాల్డ్ మీడియా టీఆరెస్ స‌ర్కారు ప‌త్రికా స్వేచ్ఛ‌ను హ‌రిస్తుందంటూ మొగ‌సాల‌కు ఎక్కుతుంది. పైగా మ‌న ప్ర‌భుత్వానికి అనేక ల‌క్ష్యాలు ఉన్నాయి. ఆదిలో ఇలాంటి అంశాల్లో త‌ల‌దూరిస్తే సీమాంధ్ర మీడియాకు అవ‌కాశం ఇచ్చిన‌ట్ల‌వుతుంది. అందుకే ముందుగా తెలంగాణ స‌మాజం, తెలంగాణ ఉద్యోగులు, జ‌ర్న‌లిస్టుల సంఘాలు త‌మ చైత‌న్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తే రాజ‌కీయ నిర్ణ‌యం దానంత‌ట అదే జ‌రుగుతుంది. ఆ అనివార్య‌త కూడా ఏర్ప‌డుతుంది.

ఆలోచించండి... స్వ‌రాష్ట్రంలోనూ అంత‌ర్గ‌తంగా మ‌న బిడ్డ‌లు ఎదుర్కొంటున్న అణచివేత‌పై మ‌రో ఉద్య‌మానికి బీజం ప‌డాల్సిన అవ‌స‌ర‌ముంది. త‌ద్వారా తెలంగాణ జ‌ర్న‌లిస్టుల‌కు ప్ర‌యోజ‌నంతో పాటు బంగారు తెలంగాణ సాకారానికి కూడా ఇది దోహద‌ప‌డుతుంది. లేదంటే బంగారు తెలంగాణ‌పై ఎప్పుడు తేజాబ్ చ‌ల్లుదామ‌ని ఈ సీమాంధ్ర గోతికాడ న‌క్క‌ల్లా కాచుకుకూర్చుని ఉంటుంది. ముందుగానే ఆ న‌క్క న‌డ్డిని విరిస్తేగానీ భావి తెలంగాణ‌లో సంపూర్ణ స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవ‌చ్చు.

చూశారా... ఈ న‌క్కజిత్తులు!.

చూశారా... ఈ న‌క్కజిత్తులు!. తెలంగాణ‌కు అన్యాయం జ‌రుగుతున్న పీపీఏ అంశంలో ఈనాడు మ‌డ‌త‌పేచీతో క‌థ‌నం ఇచ్చింది. స్పష్టంగా ఏపీ ప్రభుత్వం పున‌ర్విభ‌జ‌న చ‌ట్టానికి తూట్లు పొడుస్తూ పీపీఏలు ర‌ద్దు చేసినా.. ఆ విష‌యాన్ని ఎక్కడా ప్రస్తావించ‌లేదు. ఇదేదో వివాదం అంటూ గ‌వ‌ర్నర్ పేరిట ఏపీ ప్రభుత్వ త‌ప్పిదాన్ని ఏమాత్రం ఎత్తిచూప‌కుండా రాసింది. కానీ కృష్ణాజ‌లాల విష‌యంలో మాత్రం తెలంగాణ ఇంజినీర్లు ఒప్పుకున్నా తెలంగాణ ప్రభుత్వం కావాల‌ని ప‌ది టీఎంసీల నీటి విడుద‌ల‌కు ఒప్పుకోవ‌డంలేద‌ని చెప్పే ప్రయ‌త్నం చేసింది. అందుకే నామ‌మాత్రంగా ఈ అంశంపై వివాదం నెల‌కొంద‌ని రాసి... నాటి నిర్ణయం మేర‌కే... అంటూ త‌న పైత్యాన్ని వండి వార్చింది. ఇది నిజ‌మే అయితే పీపీఏ విష‌యంలోనూ నాటి పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం మేర‌కే అని ఒక పేరాతో అస‌లు వాస్తవాలు రాసి, దానికి వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం పీపీఏల‌ను ర‌ద్దు చేసింద‌ని రాస్తే జ‌ర్నలిజం విలువ‌ల‌కు వ‌న్నె వ‌చ్చేది. కానీ ఏపీ విష‌యంలో ఒక‌లా.. తెలంగాణ విష‌యంలో మ‌రోలా త‌న పైత్యాన్ని బ‌య‌ట‌పెట్టింది. ముమ్మాటికీ ఇది మీ పేప‌ర్ కాద‌ని తెలంగాణ ప్రజ‌ల‌కు మ‌రోలా స్పష్టం చేసింది.

అందుకే అప్రమ‌త్తత అవస‌రం...
కృష్ణా డెల్టాకు ప‌ది టీఎంసీల విడుద‌ల విష‌యంలో మ‌న ఇంజినీర్లు ముందుచూపుతో వ్యవ‌హ‌రించ‌లేదా?. అనే అనుమానం క‌లుగుతుంది. అస‌లు సాగ‌ర్‌లో ఉన్నవే 13-14 టీఎంసీలు (డెడ్‌స్టోరేజీ మిన‌హా) అలాంట‌ప్పుడు డెల్టాకు ల‌భ్యత ఉన్న నీటిలో 77 శాతం ఎలా ఇస్తారు?. అందుకు మ‌న ఇంజినీర్లు ఎలా అంగీక‌రించారు. ప‌ద్నాలుగేండ్ల సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానం, ప్రతి అంశంపై నిశిత‌మైన అవ‌గాహ‌న ఉన్నందున కేసీఆర్ వెంట‌నే ఆ ప్రతిపాద‌న‌కు ప‌చ్చజెండా ఊప‌కుండా ఆప‌గ‌లిగారు. అదే ఇత‌ర నేత‌లు (వారి త‌ప్పిదం కాక‌పోవ‌చ్చుగానీ... అధికారులు చెప్పిందే త‌డ‌వుగా పాల‌కులు త‌ల ఊప‌డం స‌హ‌జం)ఉంటే ప‌రిస్థితి ఎలా ఉండేది?. వెంట‌నే ప‌ది టీఎంసీల నీళ్లు ఇస్తే క‌నీసం హైద‌రాబాద్ తాగునీటికి కూడా ఇబ్బంది త‌లెత్తేది. ఈలోగా డెల్టా ప్రాంతం వారు నారుమ‌ళ్లు పోసుకొని, సాగ‌ర్‌లో ఉన్న నీళ్లను ఎత్తులో ఉన్న తెలంగాణ‌కు ఎలాగూ వినియోగించ‌లేం... క‌నీసం దిగువ‌న ఉన్న రైతులు ఇప్పటికే పంట చేతికొచ్చే ద‌శ‌లో ఉన్నందున వ‌ద‌లాలంటూ ఎక్కడ‌లేని మాన‌వ‌తా
దృక్ఫథాన్ని ఒక‌ల‌బోసేవారు. ఈ ప‌రిస్థితిని మ‌న ఇంజినీర్లు ముందుగానే గుర్తిస్తే అస‌లు ఆ ప్రతిపాద‌న ప్రభుత్వం దాకా కూడా వ‌చ్చ‌ది కాదు. అంతేకాదు ఇటీవల‌ ‌జ‌రిగిన సాగునీటి పారుద‌ల స‌మీక్షలో కేసీఆర్ కృష్ణాన‌దిపై ప‌లు ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రస్తావించిన‌పుడు అస‌లు నీళ్లెక్కడున్నాయ్ అని మ‌న ఇంజినీర్లు అన్నార‌ని, అంటే ఇంకా మ‌న‌వారు స‌మైక్య రాష్ట్రంలో ఉన్నట్లుగానే భావిస్తున్నట్లు ఒక సీనియ‌ర్ ఇంజినీర్ చెప్పారు. ఇంజినీర్ల అభిప్రాయాన్ని తోసిపుచ్చిన కేసీఆర్‌... సాగ‌ర్‌లో నీళ్లుండ‌గాలేనిది పైన క‌ట్టే ప్రాజెక్టుల్లో ఎలా ఉండ‌వు?. అని వ్యాఖ్యానించార‌ట‌. అంటే... రాష్ట్రం ఏర్పడిందేగానీ ఇంకా మ‌న‌లో మా తెలంగాణ రాష్ట్రం అన్న భావ‌న వేళ్లూనుకుపోలేదు. 60 ఏళ్ల అణ‌చివేత క‌దా... మ‌రికొన్ని రోజుల్లోనే మ‌న ఆలోచ‌లనూ ఆ సంకెళ్లు వీడ‌తాయ‌ని ఆశిద్దాం. ఏదేమైనా సాగునీటి పారుద‌ల విష‌యంలో మ‌న ఇంజినీర్లు చాలా అప్రమ‌త్తంగా, దూర‌దృష్టితో అడుగులు వేయాల‌ని తెలంగాణ స‌మాజం కోరుతుంది. ఎందుకంటే వాళ్లు ఏమాత్రం మాన‌వ‌తా దృక్ఫథాన్ని చూపినా అంతిమంగా అది మ‌న తెలంగాణ‌కు న‌ష్టం చేసేదిగా ఉంటుంద‌నేది వారికి తెలియ‌నిది కాదుగానీ ఎమ‌రుపాటు వ‌ద్దనేది సూచ‌న‌.

గ్రావిటీ త్వరిత‌గ‌తిన సాక్షాత్కరించాల్సిందే!
ఈరోజు ఆంధ్రజ్యోతి ప‌త్రిక‌లో చూడండి. తెలంగాణ ప్రభుత్వం కాద‌న్నా ఏపీ స‌ర్కారు కుడి కాలువ గేట్లు ఎత్తివేసేందుకు సిద్ధమైంద‌ని మ‌న‌కు హెచ్చరిక‌లు జారీ చేశారు. అంతేకాదు ఏపీ ప్రభుత్వం ప‌ది టీఎంసీలు విడుద‌ల చేయాలంటూ రెండు రాష్ట్రముల అధికారుల ఆదేశించింద‌ట‌. అస‌లు చంద్రబాబు, ఆయ‌న తాబేదారు ప‌త్రిక‌ల‌కు తెలంగాణ రాష్ట్రం విడిపోయింద‌ని, దానికి కేసీఆర్ సీఎంగా ఉన్నార‌నే ధ్యాస లేకుండా పోయింది. లేకుంటే ఏపీ సీఎం తెలంగాణ అధికారుల‌ను ఆదేశించ‌డానికి ఎవ‌రు?. వాళ్లకు లేకున్నా, ఈ ప‌త్రిక‌ల‌క‌యినా సోయి ఉండాలి క‌దా. ఈ విష‌యం పక్కన‌పెడితే ఎప్పటికైనా సాగ‌ర్ మ‌న‌కు ముప్పే. ఎలాగూ కుడికాల్వ వాళ్ల ప‌రిధిలో ఉన్నందున మ‌నం ఎంత నియంత్రించినా డ్యాం డెడ్‌స్టోరేజీ కంటే త‌క్కువలో ఏర్పాటు చేసిన కుడికాల్వ ద్వారా వాళ్లు నీళ్లు తీసుకుపోయే వెసులుబాటు ఉంది. అందుకే మ‌నం ఎంత వీలైంత అంత త్వర‌లో ఎగువ‌న ప్రాజెక్టులు నిర్మిస్తేనే దిగువ అహంకారానికి చెక్ పెట్టిన‌ట్లవుతుంది. అందుకే అసెంబ్లీలో కేసీఆర్ చెప్పిన జూరాల‌-పాకాల ఎంత త్వర‌గా సాకారమైతే అంత త్వర‌గా పూర్తి చేయాలి. అప్పుడే మ‌న‌కు స్వీయ సాగునీటి పారుద‌ల వ్య వ‌స్థ ఏర్పడుతుంది. అంతేకాదు ఇన్నాళ్లూ వ‌ల‌స పాల‌కులు తెలంగాణ‌కు ఎత్తిపోత‌ల త‌ప్ప గ్రావిటీ వీలు కాద‌నే హేయ‌మైన ప్రచారానికి, అబ‌ద్దానికి చెంప పెట్టులా గ్రావిటీపై కృష్ణమ్మ మ‌న బీళ్లలో గ‌ల‌గ‌లా పారుతుంది. జై తెలంగాణ జైజై తెలంగాణ‌


ఉద్యమం అందించిన స్పూర్తి అది...

అస‌లు మ్యానిఫెస్టోల‌పై ప్రజ‌ల‌కు అవ‌గాహ‌న ఉందా?. నిన్నటివ‌ర‌కు ఇదే అనుమానం క‌లిగేది. అస‌లు ఓట‌ర్లు ఈ అంశాన్ని ప‌ట్టించుకునేవారే కాదు. అందుకే రాజ‌కీయ పార్టీలు కూడా త‌మ‌కు న‌చ్చిన రీతిలో, ఇష్టం వ‌చ్చిన‌ట్లు మ్యానిఫెస్టోలు త‌యారుచేసి చేతులుదులుపుకునేవి. కానీ తెలంగాణ ఉద్యమం ఈ మూఢ‌త్వాన్ని మార్చేసింది. రాజ‌కీయంగా ఒక విప్లవాత్మక మార్పును తీసుకువ‌చ్చింది. అస‌లు మ్యానిఫెస్టోలో ఉన్న అంశాన్ని నెర‌వేర్చాలంటూ ప‌ట్టుబ‌ట్టిన వైనం తెలంగాణ రాష్ట్ర డిమాండు నుంచి గ‌ణ‌నీయంగా తెర‌పైకొచ్చింది. కాంగ్రెస్ త‌న మ్యానిఫెస్టోలో పెట్టిన ఈ అంశాన్ని నెర‌వేర్చాలంటూ తెలంగాణ స‌మాజం ప‌ట్టుబ‌ట్టింది... దానిని సాకారం చేసుకుంది. అదే స్ఫూర్తితో ఇప్పుడు చూడండి. ఇటు తెలంగాణ అటు ఏపీ... జ‌నంలో పార్టీల‌ మ్యానిఫెస్టోల‌పై విప‌రీత‌మైన అవ‌గాహ‌న వ‌చ్చింది. రైతుల రుణ‌మాఫీగానీ, ఇత‌ర ఏ అంశ‌మైనాగానీ నువ్వు మ్యానిఫెస్టోలో ఏం పెట్టావ్‌... ఇప్పుడేం చెబుతున్నావ్‌... అని అధికార పార్టీల‌ను ప్రశ్నించేత‌త్వం వ‌చ్చింది. ఈ అవ‌గాహ‌న ఇలాగే వ‌ర్థిల్లాలి.

తెలంగాణ బీజేపీ తీరు సిగ్గు సిగ్గు....


తెలంగాణ మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసిన ఛానెళ్ల‌ను బ్యాన్ చేస్తే బీజేపీ వాళ్ల‌కు త‌ప్పుగా అనిపించింది...
మ‌రి ఈ బీజేపీ వాళ్లు బ్రాహ్మ‌ణుల మ‌నోభావాల‌ను దెబ్బ తీసేలా ఉంద‌ని మోహ‌న్ బాబు న‌టించిన దేనికైనా రెడీ చిత్రాన్ని బ్యాన్ చేయాల‌ని ఆందోళ‌న చేసిన‌ప్పుడు వారికి భావ ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ గుర్తుకు రాలేదా?

ఇంకా అనేక సినిమాలు, పుస్త‌కాల‌ను బ‌హిష్క‌రించేందుకు బీజేపీ వాళ్లు ఉద్య‌మించిన‌ప్పుడు ఈ బుద్ది ఎక్క‌డికి పోయింది...

అంటే వాళ్ల‌కు బ్రాహ్మ‌ణుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీస్తేనే బ్యాన్ చేయ‌మంటారా?

ఛానెల్ ఒక మాధ్య‌మ‌మే.. సినిమా కూడా ఒక  మాధ్య‌మ‌మే.. రెండు ప్ర‌జ‌ల‌కు సందేశాల‌ను పంపుతాయి.. మ‌రి రెండిటి మీద భిన్న ధోర‌ణి ఎందుకో...?   ఒక దాన్ని బ్యాన్ చేసినా త‌ప్పు లేదు.. ఇంకోదాన్ని బ్యాన్ చేస్తే అది ఫాసిజం అవుతుందా?   వాట్ ఏ పిటీ....!!!