విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన స్థానికతపై సీమాంధ్ర మంత్రులతో సహా ఇక్కడి వారు కూడా కొందరు విచిత్రంగా అరుస్తున్నారు. అదేదో సునామీ వచ్చినట్లు, విద్యార్థుల చదువు ఆగిపోయినట్లు నటిస్తున్నారు. కానీ వాస్తవంగా చెప్పాలంటే ఇది కేవలం ఫీజులు, ఉపకార వేతనాలకు సంబంధించిన అంశం మాత్రమే. అడ్మిషన్లలో ఈ సూత్రం అమలు చేయడం లేదు కదా. అయినా ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలు అనేవి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించుకునే పథకాలు. అందుకే వాటిపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. అందుకే పూర్తిగా, నిండు స్వార్థంతో తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ పుట్టిన తెలంగాణ బిడ్డల సంతానానికే చేయూత ఇవ్వాలనుకుంటుంది. ఇందులో తప్పేముంది?.. కొందరు కోర్టుకు వెళతమంటారు. ఇంకొందరు మానవతా దృక్ఫథం అంటారు. సంక్షేమ పథకంలో భాగంగా ఇచ్చే ఈ ఆర్థిక చేయూతలో రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుందనేది నా భావన. అయినా సర్కారు ప్రకటించిన స్థానికత వర్తించని విద్యార్థులు ఎలాగూ ఇక్కడి వారు కాదంటే ఏపీ వారనేగా అర్థం. మరి ఆ ప్రభుత్వం కూడా ఇక్కడే ఉంది. వారు సాయం చేయవచ్చు కదా. అది అడగాల్సిన సోకాల్డ్ మానవతావాదులు తెలంగాణ ప్రభుత్వంపైనే ఎందుకు ఒత్తిడి తెస్తున్నారు. ఏపీ సర్కారును ఇవ్వమనవచ్చు కదా. వీరికి విద్యార్థుల శ్రేయస్సు ముఖ్యమా?. కేసీఆర్‌ను ఇరుకున పెట్టడం ముఖ్యమా?. ముందు తేల్చుకుంటే బాగుంటుంది.
No comments:
Post a Comment