1

1

Wednesday 25 June 2014

మీడియా సంస్థ‌ల‌కు సోష‌ల్ మీడియాకున్న చ‌ట్టాల‌ను వ‌ర్తింప‌జేయాలి...!!!



ఓ పార్టీ పెద్ద మ‌నిషికి వ్య‌తిరేకంగా ఫేసుబుక్‌లో అస‌భ్యంగా రాసిన వాళ్ల అకౌంట్ల‌ను బ్లాక్ చేస్తారు...
రాసిన వాళ్ల‌ను అరెస్టు చేసి నెల‌ల త‌ర‌బ‌డి జైలులో ఉంచుతారు...
అస‌భ్యంగా రాయ‌క‌పోయినా కొంద‌రిని జైలుపాలు  చేశారు....
ఫేసుబుక్‌లో వ్యంగ్య‌ కార్టూన్లు వేస్తే క‌ట‌క‌టాల వెన‌క్కి పంపుతారు..




మ‌రి తెలంగాణ స‌మాజానికి వ్య‌తిరేకంగా న్యూస్ ఛానెళ్లు, ప‌త్రిక‌లు మాత్రం అస‌భ్యంగా ఏమైనా రాయొచ్చు... ఎవ‌రినైనా అవ‌మానించొచ్చా...
అస‌భ్యంగా రాసిన మీడియా సంస్థ‌ల‌ను ఎందుకు బ్యాన్ చేయొద్దు....
రాసిన వాళ్ల‌ను ఎందుకు అరెస్టు చేయొద్దు....
ప‌త్రిక‌ల్లో ఇష్టానుసారం వ‌చ్చే వ్యంగ్య కార్టూన్ల‌కు ఎందుకు మిన‌హాయింపు....?



ఫేసుబుక్ పోస్టుల‌ను బ్యాన్ చేయాలంటూ పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తారు కానీ మీడియా సంస్థ‌ల తీరును మాత్రం వెన‌కేసుకొస్తారు... ఎందుకు?


ముమ్మాటికీ సోష‌ల్ మీడియాకు ఎలాంటి చ‌ట్టాలు అయితే ఉన్నాయో... మీడియా సంస్థ‌ల‌కు కూడా అలాంటి చ‌ట్టాలే పెట్టాలి... లేదంటే...
మీడియా సంస్థ‌ల‌కు ఇస్తున్న స్వేచ్ఛ‌ను సోష‌ల్  మీడియాకు ఇవ్వాల్సిందే....!!!!

No comments:

Post a Comment