1

1

Wednesday, 25 June 2014

రుణ మాఫీని మ‌రుగున‌ ప‌డేయ‌డ‌మే ముఖ్యోద్దేశం....!!


ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందాల‌ను ర‌ద్దు చేసుకోవాల‌ని అనుకుంటోంది... ఏ రాష్ట్రంలో ఉత్ప‌త్తి అయిన విద్యుత్ ఆ రాష్ట్రంలోనే ఉప‌యోగించుకోవాల‌ని చంద్ర‌బాబునాయుడు అంటున్నాడు... దీన్ని ఈనాడు ప‌త్రిక‌, ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక బాగా స‌మ‌ర్థిస్తూ క‌థ‌నాలు రాస్తున్నాయి... ఇది ఒక‌వేళ చంద్ర‌బాబునాయుడు అన్న‌ట్లుగానే జ‌రిగితే తెలంగాణ‌కు విద్యుత్ విష‌యంలో కొంత న‌ష్టం చేకూరుతుందేమో... కానీ ఇత‌ర చాలా విష‌యాల్లో ప్ర‌యోజ‌నం చేకూరుతుంది...
నాకు తెలిసినంత వ‌ర‌కు ఒక‌వేళ చంద్ర‌బాబునాయుడు విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని ర‌ద్దు చేయించ‌డంలో స‌ఫ‌లం అయితే... ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ మ‌ధ్య అంత‌ర్యుద్ధం జ‌ర‌గ‌డం త‌థ్యం..... ఎందుకంటే విభ‌జ‌న బిల్లులో పేర్కొన్న ఒక్క అంశాన్ని చంద్ర‌బాబు ఉల్లంఘించి ఆంధ్రాకు ప్ర‌యోజ‌నం చేకూర్చాల‌ని అనుకుంటున్నాడు... వాస్త‌వానికి ఆయ‌న ఉద్దేశం, ఆందోళ‌న సీమాంధ్ర‌లో విద్యుత్ కోత‌ల‌పై కాదు... రుణ మాఫీ నుంచి ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చ‌డానికి ప‌నికి వ‌చ్చే ఒక దీర్ఘకాలిక అంశం కావాలి.... అందుకే ఈ అంశాన్ని ఎంచుకున్నాడు... ఇప్పుడు రెండు రాష్ట్రాలు దీనిపై కొట్లాడుకుంటాయి... సీమాంధ్ర ప్ర‌జ‌లు రుణ మాఫీని మ‌ర‌చిపోతారు.... తెలంగాణ నాయ‌కులు చంద్ర‌బాబును ప‌దేప‌దే తిడుతుంటారు కాబ‌ట్టి ఇక ప్ర‌జ‌లు రుణ మాఫీపై త‌న‌ను ప్ర‌శ్నించ‌ర‌న్న ఆలోచ‌న‌లో ఆయ‌న ఉన్నారు...

ఒక‌వేళ‌ చంద్ర‌బాబు విద్యుత్ ఒప్పందాల‌ను ర‌ద్దు చేయించ‌డంలో స‌ఫ‌లం అయితే తెలంగాణ ప్ర‌భుత్వం చాలా ఘాటుగా స్పందించే అవ‌కాశం ఉంది... నాకు తెలిసి తెలంగాణ ప్ర‌భుత్వం ఈ కింది ప‌నుల‌ను చేయొచ్చని.. చేయాల‌ని నేను బ‌లంగా కోరుకుంటున్నా....

1. ఆంధ్రాలో పుట్టిన వాడు ఆంధ్రాలోనే ప‌నిచేయాల‌న్న సూత్రాన్ని తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకొస్తుంది...
2. ఆంధ్రాలో పుట్టి తెలంగాన‌లో రిటైర్డు అయిన ఉద్యోగికి పింఛ‌న్లు కాదు క‌దా.. పైసా కూడా ఇవ్వ‌బోమ‌ని మొండికేస్తుంది....
3. తెలంగాణ‌లో పారుతున్న కృష్ణా, గోదావ‌రి జ‌లాల‌ను తెలంగాణ వాళ్లే వాడుకుంటార‌ని స్ప‌ష్టం చేస్తుంది....
4.తెలంగాణ‌కు సాగు, తాగు నీటి అవ‌స‌రాలు తీరాకే ఆంధ్రాకు నీళ్లు విడుద‌ల చేస్తామ‌ని తేల్చిచెబుతారు.....
5.తెలంగాణ‌లో ఉండే ఆంధ్రా ఉద్యోగులు, ఆంధ్రా మంత్రుల నివాసాల‌కు విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిపివేస్తుంది...
6.తెలంగాణ‌లో ఉన్న మీడియా సంస్థ‌ల్లో తెలంగాణ ఉద్యోగులే ఉండాల‌న్న నిబంధ‌న వ‌చ్చినా ఆశ్చ‌ర్యం లేదు...
7.పోల‌వ‌రం ముంపు మండ‌లాలు, గ్రామాల‌న్నింటినీ తెలంగాణ‌లోనే ఉంచుకోవ‌డం త‌థ్యం...
8.సీలేరు జ‌ల‌విద్యుత్ కేంద్రాన్ని స్వాధీనం చేసుకుంటుంది...
9.సీమాంధ్ర థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రాల‌కు బొగ్గు స‌ర‌ఫ‌రా నిలిపివేస్తుంది...
10.హైద‌రాబాద్‌ను ఉమ్మ‌డి రాజ‌ధానిగా ప‌దేళ్లు ఉంచొద్ద‌ని న్యాయ‌పోరాట‌మూ చేస్తుంది....

ఇంకా చాలా చేయొచ్చేమో... ఇంకా తెలంగాణ ప్ర‌భుత్వం, కేసీఆర్ ఏం చేయ‌గ‌లుగుతారో.. ఊహించి రాయండి....

No comments:

Post a Comment