1

1

Wednesday 25 June 2014

త‌న‌కి మాలిన ధ‌ర్మం ప‌నికిరాదు

తెలంగాణ రాష్ట్ర స్వ‌రాష్ట్ర ప్ర‌స్థానంలో ఈరోజు కీల‌క‌మైన‌దిగా నేను భావిస్తున్నాను. అటు ఆర్థికంగా, ఇటు ఒక విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యం తీసుకునేందుకు కేసీఆర్ ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. మ‌న రాష్ట్రంలోని విద్యార్థుల బో్ధ‌న రుసుము చెల్లింపు విధానంపై ఇప్ప‌టికే ప్రాథ‌మిక నిర్ణ‌యం తీసుకున్న ప్ర‌భుత్వం దానిపై అఖిల‌ప‌క్షం ఏర్పాటు చేసింది. నిజ‌మే... మ‌న రాష్ట్రంలో చ‌దువుతున్న ఇత‌ర రాష్ట్ర (ఏపీ కూడా) విద్యార్థుల‌కు మ‌న ం ఎలా ఫీజులు, ఉప‌కార వేత‌నాలు చెల్లిస్తాం?. ఈ అంశంపై ఈరో్జు టీవీ చ‌ర్చ‌ల్లో కొంద‌రు (ప్ర‌త్యేకంగా టీడీపీ నాయ‌కులు అటువారు, ఇటువారు) తెగ బాధ‌ప‌డిపో్తున్నారు. మ‌నంద‌రం అన్నదమ్ములం, మాన‌వ‌తా దృక్ఫ‌థంతో ఆలోచించాల‌ని సెల‌విచ్చారు. నిజ‌మే... ఇందులో రెండు విష‌యాలున్నాయి. ఒక‌టి... క‌నీసం ఇక్క‌డ స‌బ్బు కూడా కొనుక్కోవాలంటే మ‌న‌సు ఒప్ప‌డం లేదు. టాక్స్ తెలంగాఇణ ప్ర‌భుత్వానికి పోతుంద‌నే బాధ ఉంది... అని అంటున సీమాంధ్రుల పిల్ల‌లకు తెలంగాణోడి చ‌మ‌ట చుక్క‌ను ఎందుకు పంచాలి?. పో్నీ... మాన‌వ‌తా దృక్ఫ‌థంతో ఆలోచిద్దామంటే ఇచ్చి పుచ్చుకునే ధోర‌ణిలు రెండువైపులా ఉండాలి. కానీ ఒక‌వైపు ఉంటే అది మూర్ఖ‌త్వం అవుతుంది. ఒక‌వేళ తెలంఆణ ప్ర‌భుత్వం ఆ దృక్ఫ‌థాన్ని అందిపుచ్చుకుంటే మూర్ఖ‌త్వం కాక‌త‌ప్ప‌దు. ఇవ‌న్నీ ఒక ఎత్త‌యితే... రుణ మాఫీ, కేజీ టు పీజీ విద్య‌... ఇలాంటివి స‌ర్కారుకు ఆర్థికంగా స‌వాళ్లుగా మారుతున్నాయి. ఈ నేప‌థ్యంలో న‌యా పైసా కూడా చాలా విలువైనది. మన‌కు ఉన్న‌పుడు ప‌క్క‌వాడికి ఇవ్వ‌డం వివేకం... కానీ మ‌న‌మే క‌ష్టాలు ప‌డుతున్న‌పుడు అలా ఇవ్వ‌డం అమాయ‌క‌త్వం, ముందుచూపులేని త‌నం అవుతుంది. ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ఓ్ నిర్ణ‌యానికి వ‌చ్చింద‌ని భావిస్తున్నాం. ఇందుకు ప్ర‌తిప‌క్షాలు, ప్ర‌తి పార్టీ ఆమోదం తెల‌పాలి. క‌చ్చితంగా మ‌న పిల్ల‌ల‌కు మాత్ర‌మే ఫీజులు, ఉప‌కార వేత‌నాలు ఇచ్చే విధానాన్ని క‌ఠినంగా అమ‌లు చేసేందుకు స‌హక‌రించాలి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయ‌కులు ఇప్ప‌టికైనా మీ డ్రామాలు ఆపండి, తెలంగాణ త‌గ‌ల‌బ‌డినా ప‌ర‌వాలేదు... మేం, మా బాబు, మా రాజ‌కీయం స‌ల్ల‌గుండాలి అనే మీ కుటిల నీతి ఇప్ప‌టికే అర్థ‌మైంది. గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో సీమాంధ్ర ఓట్ల‌కు గాలం వేసేందుకుగాను మీరు ఆ విద్యార్థుల‌కు కూడా మ‌న స‌ర్కారుతో ఫీజులు, ఉప‌కార వేత‌నాలు ఇప్పించేందుకు సిద్ధ‌ప‌డుతున్న‌ట్లు తెలుస్తుంది. అలాంటి దిక్కుమాలిన ప్ర‌య‌త్నాలు విర‌మించుకోండి. లేక‌పోతే మీ ఖ‌ర్మ‌. తెలంగాణ ప్ర‌జ‌లు మ‌రోసారి బుద్ధి చెబుతారు.
ఇక‌... కేసీఆర్‌గారూ... ఇది కీల‌క స‌మ‌యం. ఈ విధానంపై నిర్ణ‌యం తీసుకోవ‌డంలో భ‌విష్య‌త్తు ఆధార‌ప‌డి ఉంది. అస‌లు స్థానికులు ఎవ‌రు? అనేది కూడా ఇందులో తేలే అవ‌కాశం ఉంది. 4-10 వ త‌ర‌గ‌తి వ‌ర‌కు ఇక్క‌డే చ‌దువుకున్న‌వారు స్థానికులు అవుతార‌ని నిబంధ‌న‌లు చెబుతున్నాయి. మ‌రి ఈ క్ర‌మంలో విద్యార్థుల‌ను అక్క‌డి వారిని ఈ ప్రాతిప‌దిక‌న స్థానికులుగా గుర్తిస్తే వారి త‌ల్లిదండ్రులు ఉద్యోగ‌స్తులైతే దీనిని అస్ర్తంగా ఎంచుకునే ప్ర‌మాద‌మూ లేకపోలేదు. ఇలా ఎన్నో చిక్కుముడులు ఉన్నాయి. అందుకే ఈ విధాన నిర్ణ‌యాన్ని కేవ‌లం బోధ‌న ఫీజులు, ఉప‌కార వేత‌నాల కోణంలోనే చూడ‌కుండా... ప్ర‌తి రంగంలోనూ స్థానిక అనే దానికి ఈ నిర్ణ‌యాన్ని ముడిపెట్టే ప్ర‌మాదం ఉంది. అందుకే దూర‌, దీర్ఘ దృష్టితో ఈ నిర్ణ‌యం తీసుకోవాల‌ని కోరుతున్నాం. ఇందులో టీడీపీలాంటి ప్ర‌తిప‌క్ష పార్టీలు క‌లిసి రాకున్నా... ప‌ర్వాలేదు. తెలంగాణ జాతి మీ వెంట ఉంది. అందుకే మీరు ఇలాంటి స‌మ‌యాల్లో క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకోవాలి. లేదంటే మ‌నం రాష్ట్రం వ‌చ్చినంక కూడా సీమాంధ్రుల పెత్త‌నం ప‌రోక్షంగా, చాప‌కింద నీరులా విస్త‌రించే ప్ర‌మాదం ఉంది.

No comments:

Post a Comment