1

1

Wednesday, 25 June 2014

తెలంగాణ వాస‌న‌లేని ఛానెల్‌...!!

ఈనెల 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భ‌వించింది. దానికి కొన్ని రోజుల ముందు స‌వ‌తి త‌ల్లి ప్రేమ‌లా రామోజీరావు ఈటీవీ-3 అంటూ తెలంగాణ‌కు అంకితం చేసిన‌ట్లుగా ఒక ఛానెల్‌ను ప్రారంభించారు. కానీ ఇప్పుడు అది అటు తెలంగాణ వాస‌న‌లేక‌... ఇటు పూర్తిగా ఆంధ్ర‌వాదాన్ని మోయ‌లేక అటుఇటుగాకుండా ఉంద‌నుకోండి. ఆ ఛానెల్ ఏర్పాటు సంద‌ర్భంగా ప్ర‌త్యేక క‌థ‌నాలు త‌యారుచేశారు. వారెవ‌రో కాదు... ఆ బాధ్య‌త ఆరుగురికి అప్ప‌గిస్తే అందులో ఒక్క తెలంగాణ జ‌ర్న‌లిస్టు లేడు. అందుకే అక్ష‌రాలా ఆ ఆరుగురి మ‌ధ్య క‌థ‌నాలు త‌యారుచేసిన‌పుడు ఒక సందేహం వ‌చ్చింది. అదేంతో తెలుసా... తెలంగాణ రాష్ట్రం కోసం చ‌నిపో్యిన యువ‌కుల‌ను అమ‌ర‌వీరులు అనాలా?. లేదా?. తెలంగాణ అమ‌ర‌వీరులు అంటే వారిని పొగిడిన‌ట్లుగా ఉంటుంద‌నేది వారి భావ‌న‌. మ‌రి తెలంగాణోడు బ‌తికినా, స‌చ్చినా... వారికి చిన్న చూపే. అందుకే ఆ ప‌దాన్ని నిషేధించారు. తెలంగాణ కోసం చ‌నిపోయిన విద్యార్థులు అని రాసారు. అందుకే తెలంగాణ పేరిట ఈ స‌మాజానికి ఏమాత్రం మేలు చేయ‌ని ఆ ఛానెల్‌లో వ‌చ్చిన క‌థ‌నాల‌న్నింటిలోనూ ఎక్క‌డా తెలంగాణ అమ‌ర‌వీరులు అనే ప‌దం విన‌ప‌డ‌దు, క‌న‌ప‌డ‌దు. తెలంగాణ కోసం చ‌నిపోయిన విద్యార్థులు అని స‌రిపెట్టారు. ఇక‌ముందూ స‌రిపెడ‌తారు.
నోట్‌: అనేక రంగాలు, వ్య‌క్తుల మ‌ధ్య అంత‌ర్గ‌తంగా జ‌రిగిన చ‌ర్చ‌ల‌ను ప‌త్రిక‌లు బ‌య‌ట‌పెడ‌తాయి. త‌మ పైత్యంతో రాస్తాయి. మ‌రి ప‌త్రిక‌ల వెన‌క జ‌రిగిన వాస్త‌వాల‌ను ఎలాంటి పైత్యం లేకుండా అప్పుడ‌ప్పుడూ ఇలా అందిస్తాం. ఎందుకంటే భావ స్వేచ్ఛ అంద‌రికీ స‌మానం క‌దా.

No comments:

Post a Comment