1

1

Wednesday 25 June 2014

కేసీఆర్ గారికో విన‌తి



జ‌య‌శంక‌ర్‌సార్ వ‌ర్ధంతి సంద‌ర్బంగా టీవీల్లో (టీ, వీ6) వ‌చ్చిన చ‌ర్చ‌లు, మీ ప్ర‌సంగం విన్నాను. నాకు సో్యి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి జ‌య‌శంక‌ర్‌సార్ పేరు విడిగా విన‌లేదు. ముందు ప్రొఫెస‌ర్ అని ఉన్నా, లేకున్నా అంద‌రూ ఆయ‌న్ని సార్ అని పిల‌వ‌డం తెలంగాణ స‌మాజ అదృష్టం. చివ‌ర‌కు ఆయ‌న‌కు స‌న్నిహితుడిగా ఉన్న ప్రొఫెస‌ర్ హ‌ర‌గోపాల్‌గారు వంద సార్లు సార్ పేరు ప్ర‌స్తావించినా క‌చ్చితంగా జ‌య‌శంక‌ర్‌గారు అని సంబోధించారు. అంత‌టి ఉన్న‌త వ్య‌క్తి అయినందున మీరు వ‌రంగ‌ల్ ఏక‌శిలా పార్కుకు పేరు పెట్టినా, మ‌రో స్మార‌క ట్ర‌స్టు ఏర్పాటు చేసినా క‌చ్చితంగా జ‌య‌శంక‌ర్‌సార్ అని చేర్చాల‌ని విన‌తి. కేవ‌లం జ‌య‌శంక‌ర్ అని పెట్ట‌డం వ‌ల్ల రానున్న త‌రాల్లో పేరు విన‌గానే ఆయ‌న గొప్ప‌త‌నం వెంట‌నే తెల‌వ‌దు. కానీ జ‌య‌శంక‌ర్‌సార్ అని ఉండ‌టం వ‌ల్ల ముందు త‌రాల పిల్ల‌లు కూడా అరె సార్‌... అట అని ఆక‌ర్షితులై, ఆయ‌న జీవిత చ‌రిత్ర‌ను తెలుసుకోవాల‌నే త‌పన క‌లుగుతుంది. సార్ అని లేక‌పోవ‌డం వ‌ల్ల ఆయ‌న‌కు త‌క్కువ గౌర‌వం ఇచ్చిన‌ట్లుకాదుగానీ... ప‌ది కాలాల పాటు అంద‌రి మ‌దిలో ఉన్న సార్‌గా నిలిచిపోయిన ఆయ‌న్ని ముందు త‌రాల వారి నోటి నుంచి ఆ పేరు వ‌చ్చిన స‌మ‌యంలోనే సార్ అని వ‌స్తే ఇప్ప‌టి త‌రాల వారికి చూడ‌ముచ్చ‌ట‌గా ఉంటుంది. మ‌న‌లాంటి వారికి ఆనందంగా ఉంటుంది.

No comments:

Post a Comment