1

1

Wednesday, 25 June 2014

ప్ర‌ధాన ప‌త్రిక పాత్రికేయుడి అంత‌రంగం..

ఈరోజు ఉద‌యం నాకు ఒక తెలంగాణ జ‌ర్న‌లిస్టు ఫేస్‌బుక్‌లో మెసేజ్ చేయ‌డంతో ఫోన్ చేశాను. ఆత‌ర్వాత అత‌ని సూచ‌న మేర‌కు వారి కొలీగ్స్‌తో మాట్లాడాను ఒక ప్ర‌ధాన ప‌త్రిక‌లో ప‌ని చేస్తున్న వారిపై కొన‌సాగుతున్న వివ‌క్ష‌, అణ‌చివేత వింటుంటే గుండె త‌రుక్కుపోతుంది. అదే స‌మ‌యంలో వారి మాట‌ల్లో ఆశ్చ‌ర్యం క‌లిగించే అంశాలూ ఏమీ లేవు. ఎందుకంటే మ‌న‌కు రాష్ట్రం వ‌చ్చిందేగానీ ఇంకా సంపూర్ణ అస్థిత్వం రాలేద‌ని వారి మాట‌ల్లో స్ప‌ష్టంగా అర్థ‌మైంది. అంతేకాదు ముఖ్యంగా సీమాంధ్ర మీడియా రాష్ట్ర విభ‌జ‌న‌తో మ‌రింత ప్ర‌తీకారంతో ర‌గిలిపోతుంద‌నే విష‌యం వెల్ల‌డ‌వుతుంది. దీనికితోడు తెలంగాణ‌లో వాళ్ల‌కు మింగుడుప‌డ‌ని టీఆరెస్ అధికారాన్ని చేప‌ట్ట‌డంతో ఒక‌వైపు టీఆరెస్ ప్ర‌భుత్వంతో నేరుగా ఢీకొన‌కుండా తెలంగాణ జ‌ర్న‌లిస్టుల‌పై త‌మ ప్ర‌తాపాన్ని చూపుతున్న‌ట్లు అర్థం అవుతుంది. మ‌రి ఈ ప‌రిస్థితులు మారాలన్నా, తెలంగాణ స‌మాజంలోని అనేక రంగాల‌కు క‌లిగిన విముక్తి తెలంగాణ జ‌ర్న‌లిస్టుల‌కు కూడా క‌ల‌గాలంటే మ‌న స‌మాజం మ‌రోసారి చైత‌న్యాన్ని ప్ర‌ద‌ర్శించాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ఇందుకు మ‌న జ‌య‌శంక‌ర్‌సార్ చూపిన మూడు ద‌శ‌ల మార్గాలు నా క‌ళ్ల‌ముందు క‌నిపించాయి. వాటిని మీతో పంచుకుంటున్నాను.

! భావ‌జాల వ్యాప్తి... ఇందులో తెలంగాణ స‌మాజంలో్ని ప్ర‌జ‌ల‌ది ఎంత భాగ‌స్వామ్యం ఉందో అంత‌కుమించి మ‌న ఉద్యోగులు కీల‌క పాత్ర పోషించాల్సిన అవ‌స‌ర‌ముంది. ఉద్య‌మంలో తెలంగాణ‌లోని అన్ని రంగాల వారు ఉద్యోగుల‌కు అండ‌గా నిలిచారు. ఆ బ‌లంతోనే ఉద్యోగ సంఘాల నాయ‌కులు చివ‌ర‌కు రాజ‌కీయ నేత‌ల‌ను సైతం బ‌హిరంగంగా బ‌హిష్క‌రించేలా ప్ర‌క‌ట‌న‌లు చేయ‌గ‌లిగారు. జ‌నం వారి వెంట నిల‌వ‌డంతో అధికారంలో ఉన్న నాయ‌కులు సైతం ఉద్యోగ నేత‌ల‌ను ప‌ల్లెత్తు మాట అన‌లేక‌పోయారు. మ‌రి మ‌న రాష్ట్రంలో తెలంగాణ ఉద్యోగులే ప‌ని చేయాల‌ని ఉద్యోగులు ఇప్ప‌టికీ నిన‌దిస్తున్న ఉద్యోగులు ఆ నినాదాన్ని తెలంగాణ జ‌ర్న‌లిస్టుల విష‌యంలో ఎందుకు అమ‌లు చేయ‌డం లేదు. దీనికి బ‌హిరంగంగా ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు చేయాల‌ని నేను చెప్ప‌డం లేదు. కానీ తెలంగాణ ప్ర‌భుత్వం, స‌మాజంలో ఇక్క‌డి జ‌ర్న‌లిస్టులే భాగ‌స్వాములు కావాల‌నే భావ‌జాలాన్ని ప్ర‌తి ఒక్క ఉద్యోగిలో్ నింపితే చాలు. ఇప్పుడు ఉద్యోగులు ఆ బాధ్య‌త‌ను నెర‌వేర్చాల్సిన స‌మ‌యం వ‌చ్చింది. సీమాంధ్ర జ‌ర్న‌లిస్టుల‌కు స‌మాచారాన్ని పంచుకోవ‌డం స‌హాయ నిరాక‌ర‌ణ చేస్తే మీడియా సంస్థ‌లు కూడా ఏమీచేయ‌లేని నిస్స‌హాయ‌స్థితిలో ప‌డిపోతాయి. ఎలాగూ మ‌న ప్ర‌భుత్వ‌మే ఉన్నందున ఆ సంస్థ‌ల‌కు త‌లొగ్గాల్సిన అవ‌స‌రం కూడా ఉద్యోగుల‌కు ఉండ‌దు. దీంతో ఆ సంస్థ‌లు కేవ‌లం ఇక్క‌డ తెలంగాణ జ‌ర్న‌లిస్టుల‌నే ప‌ని చేయించాల్సిన అనివార్య‌త ఏర్ప‌డుతుంది. మ‌రి మ‌న ఉద్యోగులు ఈ ద‌శ అమ‌లుకు ఎంతవ‌ర‌కు స‌హ‌కరిస్తార‌నేది వారి మీదే ఆధార‌ప‌డి ఉంది. ఒక్కో ఉద్యోగి త‌న‌కు తాను ఈ నిర్ణ‌యం తీసుకుంటే ప‌ది జిల్లాల్లో వ‌చ్చే పెను ఉద్య‌మం సీమాంధ్ర మీడియాను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అంతేకాదు ఒక ప్రాంత గ‌డ్డ‌పై ఉండి, ఆ గ‌డ్డ‌కు వ్య‌తిరేకంగా ప‌నిచేసే మీడియాను తెలంగాణ ఉద్యోగులు స‌మ‌ర్ధంగా ఎదుర్కొన్నార‌నే స్ఫూర్తిని ప్ర‌పంచానికి చాటిన‌ట్ల‌వుతుంది. దీనికి అనుగుణంగానే జ‌నం కూడా ఆ సీమాంధ్ర అహంకారానికి కార‌ణ‌మైన స‌ర్క్యులేష‌న్‌, ప్ర‌క‌ట‌న‌ల‌పైనా దెబ్బ తీయాల్సిన అవ‌స‌ర‌ముంది. కాక‌పో్తే ఇందుకు కొంత స‌మ‌యం ప‌డుతుంది. ఫేస్‌బుక్‌లోని మిత్రులు ఒక్క‌రు ప‌దిమందితో మ‌న‌కు వ్య‌తిరేకంగా కొన‌సాగుతున్న సీమాంధ్ర మీడియా కుట్ర‌ల‌పై అవగాహ‌న క‌ల్పించ‌డం ద్వారా కాల‌క్ర‌మంలో సీమాంధ్ర మీడియా ఆధిప‌త్యం కూక‌టివేళ్ల‌తో నేల‌రాలే క్ష‌ణం క‌చ్చితంగా వ‌స్తుంది. ఎందుకంటే అంత‌రిక్ష యాన‌మైనా మొద‌టి కిలోమీట‌రుతోనే మొద‌ల‌వుతుంది.

!! రెండోది... ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు. ఇప్ప‌టికే చైత‌న్యాన్ని నింపుకున్న మ‌న తెలంగాణ స‌మాజంలో తెలంగాణ జ‌ర్న‌లిస్టులు ఒక వేదిక‌పైకి వ‌చ్చారు. కానీ ఆ స్ఫూర్తి స‌మ‌ర్ధ‌వంతంగా కొన‌సాగ‌డం లేదు. సంఘాల్లోని విబేధాలు కావ‌చ్చు, నాయ‌క‌త్వ అల‌స‌త్వ‌మూ కావ‌చ్చు. కానీ ఒక రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత కూడా మీడియా తెలంగాణ అస్థిత్వాన్ని అంగీక‌రించ‌డంపై ఏఒక్క‌రూ ప్ర‌శ్నించ‌డం లేదు. రాష్ట్రం రాక‌ముందు సీమాంధ్ర మీడియాపై నిప్పులు చెర‌గిన జ‌ర్న‌లిస్టు సంఘ నాయ‌కులు కూడా ఇప్పుడు ఆ స్ఫూర్తిని ప్ర‌ద‌ర్శించ‌డం లేదు. ఇదేమంటే ఆ సంస్థ వ్య‌క్తిగ‌త విష‌యాలు, ఆ జ‌ర్న‌లిస్టులు బ‌య‌టికి రాక‌పోవ‌డం వంటి కార‌ణాలు చూపుతున్నారు. కానీ మ‌నం ఓసారి తెలంగాణ ఉద్య‌మాన్ని గుర్తు చేసుకుంటే ఇలాంటి ఎన్నో అవాంత‌రాలు, ఆంక్ష‌ల గోడ‌ల‌ను బద్ద‌లుకొట్టి జ‌ర్న‌లిస్టులు చైత‌న్యాన్ని ప్ర‌ద‌ర్శించారు. మ‌రి ఇప్పుడు ఆ చొర‌వ ఏమైంది?. వెసులుబాటు ఉన్న వారు ముందు ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌ల‌కు శ్రీ‌కారం చుడితే క్ర‌మ‌క్ర‌మంగా అది ఓ పెను ఉప్పెన‌గా మారుతుంది. నేనొక్క‌డినే, నాకేం అవ‌స‌రం అని అనుకుంటే మ‌న జ‌య‌శంక‌రు సారు ఇప్పుడు తెలంగాణ స‌మాజ జాతిపిత‌గా మారేవారు కాదు, కో్ట్లాదిమందిలో స్ఫూర్తి నింపిన ప్ర‌దాత‌గా మారేవారూ కాదు.

!!! మూడోది... రాజ‌కీయ నిర్ణ‌యం. మొద‌టి రెండు ద‌శ‌లు మొద‌లైతే ఆటోమెటిక్‌గా రాజ‌కీయ రంగం ప్ర‌వేశించ‌డం అనివార్యంగా మారుతుంది. ఇందుకు తెలంగాణ ఉద్య‌మ ప్ర‌స్థాన‌మే ఓ చ‌క్క‌టి ఉదాహ‌ర‌ణ‌. ఇప్పుడు నేరుగా టీఆరెస్ ప్ర‌భుత్వం జోక్యం చేసుకోవ‌చ్చు. కానీ చేసిన త‌ప్పును ఎత్తి చూపితేనే ఈ సో కాల్డ్ మీడియా టీఆరెస్ స‌ర్కారు ప‌త్రికా స్వేచ్ఛ‌ను హ‌రిస్తుందంటూ మొగ‌సాల‌కు ఎక్కుతుంది. పైగా మ‌న ప్ర‌భుత్వానికి అనేక ల‌క్ష్యాలు ఉన్నాయి. ఆదిలో ఇలాంటి అంశాల్లో త‌ల‌దూరిస్తే సీమాంధ్ర మీడియాకు అవ‌కాశం ఇచ్చిన‌ట్ల‌వుతుంది. అందుకే ముందుగా తెలంగాణ స‌మాజం, తెలంగాణ ఉద్యోగులు, జ‌ర్న‌లిస్టుల సంఘాలు త‌మ చైత‌న్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తే రాజ‌కీయ నిర్ణ‌యం దానంత‌ట అదే జ‌రుగుతుంది. ఆ అనివార్య‌త కూడా ఏర్ప‌డుతుంది.

ఆలోచించండి... స్వ‌రాష్ట్రంలోనూ అంత‌ర్గ‌తంగా మ‌న బిడ్డ‌లు ఎదుర్కొంటున్న అణచివేత‌పై మ‌రో ఉద్య‌మానికి బీజం ప‌డాల్సిన అవ‌స‌ర‌ముంది. త‌ద్వారా తెలంగాణ జ‌ర్న‌లిస్టుల‌కు ప్ర‌యోజ‌నంతో పాటు బంగారు తెలంగాణ సాకారానికి కూడా ఇది దోహద‌ప‌డుతుంది. లేదంటే బంగారు తెలంగాణ‌పై ఎప్పుడు తేజాబ్ చ‌ల్లుదామ‌ని ఈ సీమాంధ్ర గోతికాడ న‌క్క‌ల్లా కాచుకుకూర్చుని ఉంటుంది. ముందుగానే ఆ న‌క్క న‌డ్డిని విరిస్తేగానీ భావి తెలంగాణ‌లో సంపూర్ణ స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవ‌చ్చు.

No comments:

Post a Comment