తెలంగాణ మనోభావాలను దెబ్బతీసిన ఛానెళ్లను బ్యాన్ చేస్తే బీజేపీ వాళ్లకు తప్పుగా అనిపించింది...
మరి ఈ బీజేపీ వాళ్లు బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉందని మోహన్ బాబు నటించిన దేనికైనా రెడీ చిత్రాన్ని బ్యాన్ చేయాలని ఆందోళన చేసినప్పుడు వారికి భావ ప్రకటన స్వేచ్ఛ గుర్తుకు రాలేదా?
ఇంకా అనేక సినిమాలు, పుస్తకాలను బహిష్కరించేందుకు బీజేపీ వాళ్లు ఉద్యమించినప్పుడు ఈ బుద్ది ఎక్కడికి పోయింది...
అంటే వాళ్లకు బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బతీస్తేనే బ్యాన్ చేయమంటారా?
ఛానెల్ ఒక మాధ్యమమే.. సినిమా కూడా ఒక మాధ్యమమే.. రెండు ప్రజలకు సందేశాలను పంపుతాయి.. మరి రెండిటి మీద భిన్న ధోరణి ఎందుకో...? ఒక దాన్ని బ్యాన్ చేసినా తప్పు లేదు.. ఇంకోదాన్ని బ్యాన్ చేస్తే అది ఫాసిజం అవుతుందా? వాట్ ఏ పిటీ....!!!
No comments:
Post a Comment