అసలు మ్యానిఫెస్టోలపై ప్రజలకు అవగాహన ఉందా?. నిన్నటివరకు ఇదే అనుమానం కలిగేది. అసలు ఓటర్లు ఈ అంశాన్ని పట్టించుకునేవారే కాదు. అందుకే రాజకీయ పార్టీలు కూడా తమకు నచ్చిన రీతిలో, ఇష్టం వచ్చినట్లు మ్యానిఫెస్టోలు తయారుచేసి చేతులుదులుపుకునేవి. కానీ తెలంగాణ ఉద్యమం ఈ మూఢత్వాన్ని మార్చేసింది. రాజకీయంగా ఒక విప్లవాత్మక మార్పును తీసుకువచ్చింది. అసలు మ్యానిఫెస్టోలో ఉన్న అంశాన్ని నెరవేర్చాలంటూ పట్టుబట్టిన వైనం తెలంగాణ రాష్ట్ర డిమాండు నుంచి గణనీయంగా తెరపైకొచ్చింది. కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో పెట్టిన ఈ అంశాన్ని నెరవేర్చాలంటూ తెలంగాణ సమాజం పట్టుబట్టింది... దానిని సాకారం చేసుకుంది. అదే స్ఫూర్తితో ఇప్పుడు చూడండి. ఇటు తెలంగాణ అటు ఏపీ... జనంలో పార్టీల మ్యానిఫెస్టోలపై విపరీతమైన అవగాహన వచ్చింది. రైతుల రుణమాఫీగానీ, ఇతర ఏ అంశమైనాగానీ నువ్వు మ్యానిఫెస్టోలో ఏం పెట్టావ్... ఇప్పుడేం చెబుతున్నావ్... అని అధికార పార్టీలను ప్రశ్నించేతత్వం వచ్చింది. ఈ అవగాహన ఇలాగే వర్థిల్లాలి.
No comments:
Post a Comment