కేసీఆర్ గారికి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రత్యేక విజ్ఞప్తి....
తెలంగాణ పర్యాటకానికి బ్రాండ్ అంబాసిడర్‌ను పెట్టండి...
తెలంగాణలో టూరిజం రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.. పర్యాటక రంగం ద్వారానే మన చరిత్రను ప్రపంచానికి చాటేందుకు అవకాశం దక్కుతుంది.. సాంస్కృతిక ఔన్నత్యాన్ని చాటేందుకుకే కాకుండా ఆర్థిక పరిపుష్టికి ఇది దోహద పడుతుంది.. గుజరాత్ రాష్ట్రం టూరిజంపై విస్తృత ప్రచారం చేసేందుకు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టుకుంది... ఇది సత్ఫలితాన్ని ఇచ్చింది.. జాతీయ సగటుతో పోల్చుకుంటే ఆ రాష్ట్రంలో టూరిజం వృద్ది రేటు రెట్టింపు అయింది... కేరళ కూడా అమితాబ్‌ను అంబాసిడర్‌గా పెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది...
ఒక్క గుజరాత్, కేరళాలే కాదు.. మహారాష్ట్ర హృతిక్ రోషన్‌ను, బెంగాల్‌కు షారూక్, ఉత్తరాఖండ్‌కు హేమామాలిని, గోవాకు ప్రాచీ దేశాయి, హిమాచల్ ప్రదేశ్‌కు ప్రీతీజింటా తదితరులు బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేశారు... చాలా చోట్ల టూరిజం వృద్ధికి ఇది దోహదపడింది...
నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలోని విశేషాలపై ఎవరైన సెలబ్రిటీతో ప్రచారం చేయించడం వల్ల అంతర్జాతీయ పర్యాటకుల దృష్టిని ఆకర్షించొచ్చు... హైదరాబాద్‌లోని చరిత్రాత్మక కట్టడాలు... హిందూ, ముస్లింల ఐక్యతను చాటిచెప్పే విధంగా ప్రకటనలు రూపొందించాలి.. కాకతీయుల వైభవాన్ని చాటే ఓరుగల్లు కోట, అలనాటి శిల్ప కళా వైభవానికి ప్రతిరూపంగా నిలిచే రామప్ప గుడి ఇంకా అనేక కట్టడాల విశేషాలను ప్రపంచానికి తెలియజేయాలి...
తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్, లేదా బాలీవుడ్ నటులు అమీర్ ఖాన్, అమితాబ్, రణబీర్‌కపూర్ తదితరుల్లో ఎవరినైనా లేక ఇంకా పాపులర్ వ్యక్తులను ఎవరినైనా ఎంపిక చేసి తెలంగాణ పర్యాటకానికి బ్రాండ్ అంబాసిటర్లుగా పెట్టాలి..
తెలంగాణ ప్రాంతానికి చెందిన సెలబ్రిటీలైన దియామిర్జా, సానియా మిర్జా, సైనా నెహ్వాల్, వీవీఎస్ లక్ష్మణ్, టబు, శ్యామ్ బెనగల్ తదితరులతోనూ టూరిజం వృద్ధి కోసం ప్రచారాన్ని నిర్వహించాలి... ఒక్కసారి టూరిజం రంగంలో తెలంగాణకు మంచి గుర్తింపు లభిస్తే అది దీర్ఘకాలం కొనసాగుతుంది... సెలబ్రిటీలను ఎంపిక చేయడం ఒక ఎత్తు అయితే.. నాణ్యమైన అడ్వర్టైజ్‌మెంట్‌ను రూపొందించడం మరో ఎత్తు...
ఈ రెండు సక్రమంగా ఉంటేనే ప్రచారం విజయవంతం అవుతుంది...
పర్యాటక అభివృద్ధితో సిరుల పంట....
పర్యాటక రంగంలో ప్రత్యక్ష, పరోక్షంగా లక్షలాది మందికి ఉద్యోగాల కల్పన జరుగుతుంది...
పర్యాటక అభివృద్ధికి కేంద్రం చర్యలు తీసుకునే వరకు వేచిచూడొద్దు....
వీలైనంత త్వరగా తెలంగాణలోని పర్యాటక ప్రాంతాల జాబితాను రూపొందించండి..
పర్యావరణ అనుకూల పర్యాటకం(ఎకో ఫ్రెండ్లీ) అభివృద్ధికి ఏం చేయాలో జాబితా రూపొందించండి..
విదేశీ, స్వదేశీ పర్యాటకుల రక్షణ కోసం ప్రత్యేక పోలీసులను ఏర్పాటు చేయండి...
శిథిలావస్థలో ఉన్న పర్యాటక ప్రదేశాల్లో పునరుద్ధరణ పనులు చేపట్టండి...
వీలైనంత త్వరగా పర్యాటక శాఖ వెబ్‌సైట్‌ను ఆధునికీకరించి... సమగ్ర సమాచారాన్ని అందజేయాలి...
No comments:
Post a Comment