తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈ ఐదేళ్ల పాటు కాపలా కుక్కల్లా ఉంటామని, టీఆరెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని గత కొన్నిరోజుల కిందటి వరకు టీటీడీపీ నాయకులు మైకులు పగిలిపోయేలా చెప్పారు. రుణ మాఫీ విషయంలో టీఆరెస్‌ను గట్టిగా నిలదీశామని జబ్బలు చరుసుకున్నారు. నిన్న రేవంత్ రెడ్డి సిమెంటు ధర పెరుగుదలపై రంకెలు వేశాడు. అదేదో ఒక్క తెలంగాణలోనే పెరిగినట్లు గగ్గోలు పెట్టాడు. మరి ఏపీలోనూ ఆ విషయానికొస్తే దేశవ్యాప్తంగా ఒక్కసారిగా ధర పెరిగితే దానికేదో కేసీఆర్ బాధ్యడు అయినట్లు ఆరోపణలు గుప్పించాడు. మరి... పీపీఏల రద్దుపై ఈ కాపలా కుక్కలు ఎందుకు మొరగడం లేదో?. భారీఎత్తున విద్యుత్తు సరఫరా తగ్గి, తెలంగాణ జనం అంధకారంలో ఉండే ప్రమాదం ఉందని తెలిసినా వీరు ఎందుకు బయటికి రావడం లేదు. కేవలం టీఆరెస్ సర్కారుపై ఆరోపణలు చేసేందుకే వీరికి నోరు మెదులుతుందా?. లేకపోతే అందుకు సంబంధించిన రెన్యుమరేషన్ మాత్రమే ముడుతున్నందున అక్కడికే పరిమితం అవుతున్నారా? ఇంతకీ... ఇవి తెలంగాణ కాపలా కుక్కలా, సీమాంధ్ర నాయకుల పెంపుడు కుక్కలా?.
No comments:
Post a Comment