1

1

Friday 24 July 2015

రిషితేశ్వ‌రి త‌ల్లిదండ్రుల‌కు న్యాయం చేయాలి...


http://picsture.com/rishikeshwari-ragging-case-drunken-principal-dance-with-students-tv5-news_6cb961102.html

రిషితేశ్వ‌రి త‌ల్లిదండ్రుల‌కు న్యాయం చేయాలి...
రిషితేశ్వ‌రి ఆత్మ‌కు శాంతి చేకూరేలా బాధితుల‌ను శిక్షించాలి..
****
యథా రాజా.. త‌థా ప్ర‌జా.. అని విన్నాం.. కానీ య‌థా ప్రిన్సిప‌ల్.. త‌థా స్టుడెంట్స్ అన్న మాట కొత్త‌గా వినాల్సి వ‌స్తోంది... ఆచార్య నాగార్జున యూనివ‌ర్సిటీ ఆర్కిటెక్చ‌ర్ కాలేజీ ప్రిన్సిప‌ల్‌గా ప‌నిచేసిన బాబూరావు మ‌ద్యం తాగి విద్యార్థుల‌తో చిందులేసిన వీడియోలు బ‌య‌ట‌కొచ్చాయి.. ఈయ‌న ఇలాంటి ప‌నులు ఇంకెన్ని చేశాడో... బ‌హుషా సీనియ‌ర్ల‌కు ఈయ‌న‌తో ఉన్న చ‌నువు వ‌ల్లే వాళ్ల‌పై ఎవ‌రు ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోలేద‌న్న‌ది వాస్త‌వం... లేక ఈయ‌న ఆదేశాల మేర‌కే సీనియ‌ర్లు రెచ్చిపోయారా? అన్న‌ది తేలాల్సి ఉంది... ఇలాంటి వాళ్లు గురువులుగా చెలామ‌ణి కావ‌డం వ‌ల్లే విద్యావ్య‌వ‌స్థ భ్ర‌ష్టుప‌ట్టిపోతోంది.. వీళ్ల‌ను క‌ఠినంగా శిక్షించాలి.. త‌ప్పు చేయాలంటే ప్ర‌తీ ఒక్క‌రూ భ‌య‌ప‌డే ప‌రిస్థితి తీసుకురావాలి...

ర్యాగింగ్ భూతాన్ని నిరోధించాలి.. మ‌న విద్యార్థుల‌ను కాపాడుకోవాలి..





ఆచార్య వృత్తికే క‌ళంకం తెచ్చిన బాబూరావు..
దారి త‌ప్పిన సీనియ‌ర్లు.. వెర‌సి
అభం శుభం తెలియ‌ని అమాయ‌కురాలు రిషితేశ్వ‌రిని బ‌లిగొన్న ఆచార్య నాగార్జున వ‌ర్సిటీ ర్యాగింగ్ భూతం...!!
దోషులు తేలుతారా? శిక్ష‌లు ప‌డ‌తాయా?
సీనియ‌ర్ల వికృత చేష్ట‌ల‌కు ఇంకెన్ని విద్యాకుసుమాలు రాలిపోతాయో?
ర్యాగింగ్ భూతాన్ని నిరోధించాలి.. మ‌న విద్యార్థుల‌ను కాపాడుకోవాలి..
**************
ధూమ‌పానం, మ‌ద్య‌పానం ఆరోగ్యానికి హానిక‌రం అని సినిమాల ముందు ప్రొమోలు వేస్తారు..
అలాగే ర్యాగింగ్ చేస్తే జీవితాంతం జైలే అన్న సందేశంతో ప్రోమోలు తీసి సినిమాల్లో త‌ప్ప‌నిస‌రిగా వేయాల్సిందే..
సినిమాల్లో క‌ళాశాల స‌న్నివేశాల్లో ర్యాగింగ్ సీన్లు పెట్టిన వ‌చ్చే ప్ర‌తీసారి... ర్యాగింగ్ చ‌ట్ట వ్య‌తిరేకం.. అది చేసే వారిపై క్రిమిన‌ల్ చ‌ర్య‌లు ఉంటాయ‌ని హెచ్చ‌రిక‌లు కింద రాయాలి..

Thursday 23 July 2015

ప్ర‌శాంత్‌రెడ్డి గారు పోలీసుల‌కు బేష‌ర‌త్ క్ష‌మాప‌ణ చెప్పాలి


ఎమ్మెల్యే ప్ర‌శాంత్‌రెడ్డి అనుచితంగా మాట్లాడి ఉంటే ముమ్మాటికీ అది త‌ప్పే.. దీనికి ఆయ‌న క్ష‌మాప‌ణ చెప్పాల్సిందే.. పుష్క‌రాల్లో వీఐపీలైనా, సామాన్యులైనా ఒక‌టే.. అందులో కాన్వాయ్‌కి అడ్డుగా వాహ‌నం వ‌చ్చింద‌ని ఆవేశానికి లోనుకావ‌డం మంచిది కాదు.. వీలైతే పోలీసుల‌కు మ‌ద్ద‌తుగా ట్రాఫిక్ కంట్రోలింగ్ చేయాలి.. అస‌లే ఇరుకైన రోడ్ల‌లో వీఐపీల మాదిరిగా తిరిగితే అంద‌రికీ ఇబ్బందే క‌దా... తొలిసారి ఎన్నికైన వాళ్లు త‌మ సుస్థిర రాజ‌కీయ భ‌విష్య‌త్ కోసం ఎంతో అనుకువ‌గా, హుందాగా ప్ర‌వ‌ర్తిస్తే రానున్న రోజుల్లో జ‌నం గుండెల్లో శాశ్వ‌తంగా చోటుద‌క్కుతుంది.. దాదాపు 10 రోజులుగా ఎలాంటి వివాదాలు లేకుండా సాఫీగా పుష్క‌రాలు సాగుతున్నాయి.. అలాంట‌ప్పుడు చిన్న అంశం దొరికినా ప‌తాక శీర్షిక‌లో వేయ‌డానికి ఎల్లో మీడియా కాచుకు కూర్చుంది.. మ‌రి ఈ స‌మ‌యంలో ఎంత సంయ‌మ‌నంతో ఉండాలో విజ్ఞ‌త క‌లిగిన ఎమ్మెల్యే గారు ఆలోచించుకోవాలి... అంకిత‌భావంతో విధులు నిర్వ‌హిస్తున్న పోలీసుల‌కు క్ష‌మాప‌ణ చెబితే ప‌రువేం పోదు.. అది గ‌ర్వ‌కార‌ణంగానే ఉంటుంది..
***************
గ‌తంలో కేటీఆర్ పోలీసుల‌పై దురుసుగా మాట్లాడి త‌ర్వాత క్ష‌మాప‌ణ చెప్పాడు.. ఆంధ్రాలో ప‌లువురు నేత‌లు ఇంత‌క‌న్నా ప‌రుషంగా మాట్లాడార‌ని స‌మ‌ర్థించుకోవ‌డానికి ప్ర‌య‌త్నించొద్దు.. ప్ర‌శాంత్‌రెడ్డి గారు పోలీసుల‌కు బేష‌ర‌త్ క్ష‌మాప‌ణ చెబితే తెలంగాణ స‌మాజానికి అది గ‌ర్వ‌కార‌ణంగా నిలుస్తుంది..

మిస్ట‌రీగా రిషితేశ్వ‌రి మ‌ర‌ణం..


మిస్ట‌రీగా రిషితేశ్వ‌రి మ‌ర‌ణం..
ఆత్మ‌హ‌త్య కాదంటున్న ప్ర‌జాస్వామ్య హ‌క్కుల సంస్థ స‌భ్యులు..
ప్రిన్సిప‌ల్ తీరుపై, పోస్టుమార్టం జ‌రిగిన విధానంపై, క్లూస్‌టీం రాక‌లో ఆల‌స్యంపై ప‌లు సందేహాలు...
మ‌రో అయేషా మీరా త‌ర‌హా కేసు కానుందా?
అస‌లు దోషుల‌కు శిక్ష ప‌డుతుందా?
*********
గుంటూరులో సీనియ‌ర్ల వేధింపుల వ‌ల్ల ఆత్మ‌హ‌త్య కేసుకున్న రిషితేశ్వ‌రి కేసులో వాస్త‌వాల‌ను అధ్య‌య‌నం చేసేందుకు ప్ర‌జాస్వామ్య హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ సంస్థ స‌భ్యులు బుధ‌వారం ఆచార్య నాగార్జున వ‌ర్సిటీకి వ‌చ్చింది. రిషితేశ్వ‌రి మ‌ర‌ణం ఓ మిస్ట‌రీగా ఉంద‌ని, ఆమెది ఆత్మ‌హ‌త్య కాక‌పోవ‌చ్చ‌ని వాళ్లు అనుమానాలు వ్య‌క్తం చేశారు. ప్రిన్సిప‌ల్ కు గ‌తంలో ర్యాగింగ్‌పై ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోలేద‌ని వారు పేర్కొన్నారు..
ప్ర‌స్తుతం ప్రిన్సిప‌ల్ సెల‌వులో ఉన్నాడ‌ని, అయితే అన‌ధికారికంగా విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌తో స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నార‌ని, అస‌లు వాస్త‌వాలు బ‌య‌ట‌కు రాకుండా వారిని భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తున్న‌ట్లు ఆరోపించారు.. ఈ కేసులో ప్రిన్సిప‌ల్ కూడా దోషే అని వారు పేర్కొన్నారు.. అర్కిటెక్చ‌ర్ విద్యార్థుల‌కు రాత్రి 2, 3 గంట‌ల‌కు త‌ర‌గ‌తులు నిర్వ‌హిస్తున్న విష‌యం కూడా త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని చెప్పారు..

పార్ల‌మెంట్ ముఖ‌చిత్రం..

యూపీఏ విధానాల‌ను ఎన్టీఏ అనుస‌రిస్తుంది..(ల‌లిత్ మోదీ అయితేనేం, వేరేదైతేనేం)
బీజేపీ బాట‌లో కాంగ్రెస్ న‌డుస్తోంది...(స‌భ‌ను అడ్డుకోవ‌డంలో)

రిషితేశ్వ‌రికి త‌ల్లిదండ్రుల‌కు న్యాయం చేయండి బాబు గారూ..

వరంగ‌ల్ జిల్లాకు చెందిన‌ ఆర్కిటెక్చ‌ర్ విద్యార్థిని రిషితేశ్వ‌రి ఆత్మ‌హ‌త్య కేసులో ఆచార్య నాగార్జున విశ్వ‌విద్యాల‌యం ఆర్కిటెక్చ‌ర్ క‌ళాశాల ప్రిన్సిప‌ల్ బాబూరావును స‌స్పెండ్ చేసిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ విద్యాశాఖ‌.. ద‌య‌చేసి నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని, అస‌లు దోషుల‌ను గుర్తించాల‌ని ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడికి, విద్యా. మాన‌వ వ‌న‌రుల శాఖ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు గారికి విజ్ఞ‌ప్తి... భ‌విష్య‌త్‌లో ఏ విద్యార్థినికీ ఇలాంటి అన్యాయం జ‌ర‌గకుండా నిరోధించాలి..!!

Wednesday 22 July 2015

కాలేజీల్లో కీచ‌కులు..!! విశ్వ‌విద్యాల‌యం కాద‌ది విష‌కీట‌కాల‌యం.. విద్రోహుల నిల‌యం...!!



కాలేజీల్లో కీచ‌కులు..!!
విశ్వ‌విద్యాల‌యం కాద‌ది విష‌కీట‌కాల‌యం.. విద్రోహుల నిల‌యం...!!
*************
గుంటూరులో సీనియ‌ర్ల ర్యాగింగ్ వ‌ల్ల బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డిన వ‌రంగ‌ల్ జిల్లా విద్యార్థిని రిషికేశ్వ‌రి కేసులో మ‌రిన్ని వాస్త‌వాలు బ‌య‌ట‌కొస్తున్నాయి.. ర్యాగింగ్ పేరిట రిషికేశ్వ‌రిని అర్థ‌న‌గ్నంగా తిప్పిన సీనియ‌ర్లు, వీడియోను సెల్‌ఫోన్ల‌లో అప్‌లోడ్ చేశార‌ట‌.. ఆమె ఆత్మ‌హ‌త్య‌కు ఒక‌రోజు ముందు ఆమెను సినిమాకు తీసుకెళ్లి న‌డుముపై చేయివేసి అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించార‌ట‌.. రిషికేశ్వ‌రికి డైరీ రాసుకునే అల‌వాటు ఉండ‌టంతో ఇవ‌న్నింటినీ రాసుకున్న‌ట్లు తేలింది... ఈ కేసులో నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాలి.. తెలంగాణ ప్ర‌భుత్వం కూడా జోక్యం చేసుకోవాలి... బాధిత కుటుంబానికి అండ‌గా నిల‌వాలి.. భ‌విష్య‌త్‌లో ఏ విద్యార్థినికి ఈ ప‌రిస్థితి రాకుండా చూడాలి... ఈ కేసులో సాక్షి ప‌త్రిక క‌నీసం గుంటూరు జిల్లా ఎడిష‌న్ వ‌ర‌కైనా స‌రే పూర్వాప‌రాల‌ను ఇస్తోంది.. మిగిలిన ప‌త్రిక‌లు ప‌ట్టించుకోవ‌డం మానేశాయి.. !

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స‌మ్మె చేస్తూ పారిశుద్ధ్య కార్మికుడి మృతి...

ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌నీసం కార్మికులు రిలే దీక్ష‌లు చేస్తూ చ‌నిపోతున్నా ప‌ట్టించుకునే వాళ్లు లేరు... అస‌లు బంద్‌లు జ‌ర‌గాల్సింది ఎక్క‌డో బంద్ పిలుపులు ఇచ్చేవాళ్లు ఆలోచించుకుంటే బాగుంటుంది... అనంత‌పురంలో రిలే దీక్ష చేస్తూ గుండెపోటుతో కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికుడు క‌నీసం  ప్రాధాన్యం కూడా ద‌క్క‌ని వార్త ఇది..  

Tuesday 21 July 2015

మ‌హిళ‌ల‌కు సీట్లు ఇవ్వ‌ని మంద‌కృష్ణ గారు..

మ‌హిళ‌ల‌కు తెలంగాణ క్యాబినెట్‌లో చోటు ఇవ్వాల‌ని మ‌హిళా గ‌ర్జ‌న‌లు నిర్వ‌హించే మంద‌కృష్ణ గారు.. మొన్న అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న స్థాపించిన మ‌హాజ‌న సోష‌లిస్టు పార్టీ త‌ర‌ఫున ఎన్ని సీట్లు ఇచ్చారో ఎవ‌రికైనా తెలుసా?
12 స్థానాల్లో ఆ పార్టీ పోటీ చేస్తే ఒక్క మ‌హిళా అభ్య‌ర్థి కూడా లేదు..!!

వాళ్లు చేస్తే దేశ‌ద్రోహం.. వీళ్తు చేస్తే..?

మాలెగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలైన ప్ర‌జ్ఞాసింగ్‌తో ఎమ్మెల్యే రాజాసింగ్‌.. ఇలాగే ఎంఐఎం వాళ్లు మ‌రో పేలుళ్ల కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వాళ్ల‌ను క‌లుస్తారు.. ఇక పంజాబ్‌లోనూ ఇదే ప‌రిస్థితి, త‌మిళ‌నాడులో స‌రేస‌రి.. ఒక‌రిని మ‌రొక‌రు దేశ‌ద్రోహులు అంటారు.. చూస్తుంటే అంద‌రూ దేశ‌ద్రోహులుగానే మారారు.. స‌మాజానికి విద్రోహులుగానే త‌యార‌వుతున్నారు..!!

కేసీఆర్ పండుగ‌ల‌కు పబ్బాల‌కు డ‌బ్బులు ఇవ్వ‌కుండా దోచుకుంటే బాగుంటుందేమో..

బతుకమ్మ కు 10 కోట్లు 
క్రిస్టమస్ కు 25 కోట్లు 
రంజాన్ కు 25 కోట్లు 
పుష్కరాలకు 650కోట్లు 
బోనాలకు 10కోట్లు 
సానియా మిర్జాకు 2 కోట్లు
స్వచ్చ హైదరాబాద్ కు 200 కోట్లు
యాదగిరి గుట్టకు 100 కొట్లు
తిరుప‌తికి 5 కొట్లు...
ఎవ‌డ‌బ్బ సొమ్మ‌ని కేసీఆర్ ఇస్తున్నాడ‌ని కొంద‌రు మేధావులు ప్ర‌శ్నిస్తున్నారు..
బ‌తుక‌మ్మ ఆడేది మ‌హిళ‌లే... తెలంగాణ‌లో 1.5 కోట్ల మంది మ‌హిళ‌లు ఉన్నారు.. కేసీఆర్ కుటుంబ‌మే కాదు.. రంజాన్ జ‌రుపుకునేది ముస్లింలే కేవ‌లం కేసీఆర్ ఒక్క‌టే కాదు.. తెలంగాణ‌లో దాదాపు 70-80 ల‌క్ష‌ల మంది ముస్లింలు ఉన్నారు... పుష్క‌రాల‌కు ఇప్ప‌టికే 3 కోట్ల మంది వ‌చ్చారు.. బోనాల‌కు ల‌క్ష‌ల మంది వ‌స్తారు.. హైద‌రాబాద్‌లో ఉన్న ప్ర‌తీ తెలంగాణ వ్య‌క్తి బోనాలు చేసుకుంటారు.. ఇన్ని కోట్లు ఖ‌ర్చు చేయ‌డం వ‌ల్ల దాదాపు తెలంగాణ‌లో 5 కోట్ల మందికి అసౌక‌ర్యాలు క‌ల‌గ‌కుండా ఉన్నాయి..
మీరే అంటున్నారు ఈ సొమ్మును కేసీఆర్ ఇస్తున్నాడ‌ని... మ‌రి కేసీఆర్ ఇస్తున్నాడు కానీ జేబులో వేసుకోవ‌డం లేదు క‌దా...
ల‌క్ష‌ల కోట్ల అవినీతితో తెలంగాణ సొమ్మును గ‌త పాల‌కులు కాజేస్తే నిల‌దీయ‌ని వాళ్లు.. ఇప్పుడు పండుగ‌ల‌కు, క్రీడాకారుల‌కు, పేద‌ల‌కు ప్ర‌భుత్వం నిధులు ఇస్తుంటే తెగ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.. చూస్తుంటే కేసీఆర్ కూడా రాజ‌శేఖ‌రెడ్డిలాగా, చంద్ర‌బాబులాగా ల‌క్ష‌ల కోట్ల
కుంభ‌కోణాలు చేసి లోట‌స్ పాండ్‌ల‌ను క‌ట్టించుకుంటేనే వీళ్లు ప్ర‌శ్నించ‌డం ఆపేస్తారేమో...!!

ఆల్ ద బెస్టు బాబు గారు..

ఆల్ ద బెస్టు బాబు గారు..
అమ‌రావ‌తిని అతి త‌క్కువ స‌మ‌యంలో నిర్మించాల‌ని ఆకాంక్షిస్తున్నాను..
**********
నా మ‌ట్టుకైతే అమ‌రావ‌తి నిర్మాణం వీలైనంత త్వ‌ర‌గా మొద‌లు కావాల‌ని ఆకాంక్షిస్తున్నా... ఆ న‌గ‌రాన్ని సింగ‌పూర్ నిర్మిస్తుందా? జ‌పాన్ నిర్మిస్తుందా? లేక అమెరికా నిర్మిస్తుందా? అన్న‌ది అన‌వ‌స‌రం.. అది వారి అంత‌ర్గ‌త వ్య‌వ‌హార‌మే... వ‌చ్చే ఏడాది నాటికైనా ఆంధ్రా అసెంబ్లీ, సెక్ర‌టేరియెట్ అక్క‌డికి త‌ర‌లిపోవాల‌ని కోరుకుంటున్నా.. ఒక్కొక్క‌టికీ అక్క‌డి త‌ర‌లిపోతే ఇక అక్క‌డి నుంచే పాల‌న చేయాల్సి ఉంటుంది.. అక్క‌డ భ‌వ‌న నిర్మాణాలు పూర్త‌యినా హైద‌రాబాద్‌లో మ‌కాం వేస్తే ఆంధ్రా ప్ర‌జ‌లు కూడా ఆగ్ర‌హిస్తారు.. అక్క‌డే మ‌కాం వేస్తే అక్క‌డి వారి గురించే ఆలోచిస్తారు త‌ప్ప పొరుగు రాష్ట్రాల గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోర‌ని నా భావ‌న‌.. మ‌న‌కూ ఓ పెద్ద బాధ నుంచి విముక్తి ల‌భిస్తుంది.. లేక‌పోతే ప‌క్క‌లో బ‌ళ్లెంలా.. ఇంటి ప‌క్క‌నే గోతులు తీసే శ‌త్రువుతో దిన‌దిన‌మూ అప్ర‌మ‌త్తంగా ఉంటూ వారి క‌ద‌లిక‌ల‌పైనే క‌న్నేసే ప‌రిస్థితి ఉంటుంది.. దీని వ‌ల్ల ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కూ మేలు జ‌ర‌గ‌దు.. అమ‌రావ‌తి కోసం చేప‌ట్టిన భూ సేక‌ర‌ణ కొంత బాధించిన‌ప్ప‌టికీ అమ‌రావ‌తికి భూమి పూజ చేసిన‌ప్పుడు సంతోషించాను.. అమ‌రావ‌తికి శంకుస్థాప‌న చేసే రోజు కోసం ఎదురు చూస్తున్నాను.. వీలైనంత త్వ‌ర‌గా రాజ‌ధాని నిర్మాణం పూర్తి చేసుకుని చంద్ర‌బాబునాయుడు అండ్ కో గృహ‌ప్ర‌వేశం చేయాల‌ని కోరుకుంటున్నాను.. మీ రాజ‌ధానిని వీలైనంత త్వ‌ర‌గా పూర్తిచేసి మిమ్మ‌ల్ని త్వ‌ర‌గా అక్క‌డికి పంపేందు కోసం అమ‌రావ‌తి నిర్మాణంలో రాళ్లెత్తెందుకూ నేను రెడీ బాబు గారు.... ఆల్ ద బెస్టు... !

బాబు గాల్లో మేడ‌లు క‌ట్ట‌డం లేదంటారా?

కేసీఆర్ హైద‌రాబాద్‌లో ఉన్న ర‌వీంద్ర భార‌తి స్థానంలో అద్భుత న‌మూనాతో అధునాత‌న ర‌వీంద్ర భార‌తిని నిర్మిస్తామ‌ని డిజైన్ చూపించారు..
ఇక ఎన్టీఆర్ స్టేడియంలో క‌ళాభార‌తి నిర్మిస్తామ‌ని న‌మూనా చూపారు.. హుస్సేన్ సాగ‌ర్ చుట్టుప‌క్క‌ల ఆకాశ హ‌ర్మ్యాల‌ను నిర్మిస్తామ‌ని చూపితే..
గాల్లో మేడ‌లు క‌డుతున్నాడ‌ని వెట‌కారంగా మాట్లాడారు... 
ఇప్పుడేమో ఆంధ్రా రాజ‌ధాని అమ‌రావ‌తి ఊహా చిత్రాల‌ను చూపితే అద‌ర‌హో అమ‌రావ‌తి అంటూ కీర్తిస్తున్నారు.. 
తెలంగాణ స‌మాజం వీళ్ల తీరును అర్థం చేసుకోవాలి.. వీళ్ల ఉచ్చులో చిక్కుకోవ‌ద్దు..

Monday 20 July 2015

ఇళ్లు క‌ట్టించాలంటారు.. మ‌ళ్లా అక్క‌డ క‌ట్టొద్దంటారు..

జీహెచ్ఎంసీ కార్మికుల‌కు జీతం పెంపుతోపాటు డ‌బుల్ బెడ్ రూం ఇళ్లులు క‌ట్టించాల‌ని మొన్న వామ‌ప‌క్ష నేత‌లు స‌మ్మె చేశారు..
మ‌ళ్లా అదే కార్మికుల‌కు ఉస్మానియా వ‌ర్సిటీలో 11 ఎక‌రాల ఖాళీ భూమి తీసుకొని ఇళ్లు క‌డ‌తామంటే మ‌ళ్లా స‌మ్మెలు, బంద్‌లు చేస్తారు...
ఇదే వారి తీరు...!!

ఈ దోపిడీని ప్ర‌శ్నించ‌రెందుకు?

హైద‌రాబాద్ నుంచి రాజ‌మండ్రికి బ‌స్సులో టికెట్ అక్ష‌రాలా రూ.4500.. దోపిడీ అంటే ఇది... ఈ దోచుకున్న వాళ్ల పేర్ల‌ను ఏ ప‌త్రికా బ‌య‌ట‌పెట్ట‌దు.. ఎందుకంటే ఆ ట్రావెల్స్ అన్నీ అధికార పక్షానివే క‌దా.. !!

సుమోటోగా ఎందుకు స్వీక‌రించిందో ఏంటో?

ఆరు రోజుల క్రితం రాజ‌మండ్రి పుష్క‌రాల్లో జ‌రిగిన తొక్కిస‌లాట కేసును హైకోర్టు ఇప్పుడు సుమోటోగా ఎందుకు స్వీక‌రించిన‌ట్లు... ప‌త్రిక‌ల్లో బాబు వ‌ల్లే వైఫ‌ల్యం అని వ‌స్తుంటే.. హైకోర్టు ఏం తేల్చాల‌నుకుంటుంది? వారం రోజుల్లో నివేదిక ఇవ్వ‌మ‌ని ఆదేశించింద‌ట‌.. ప్ర‌మాదాల నివార‌ణ‌కు తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను నివేదిక రూపంలో అందించ‌మ‌ని పేర్కొంద‌ట‌...

ఆంధ్రా పుష్క‌రాల‌కు తెలంగాణ ఎడిష‌న్ల‌లో పేజీలు..

పుష్క‌రాలు మ‌హారాష్ట్ర‌, తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో జ‌రుగుతున్నాయి క‌దా..
మ‌రి మ‌హారాష్ట్ర‌లోని ఛానెళ్లు, పేప‌ర్ల‌లో తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పుష్క‌రాలు జ‌రుగుతున్న తీరుపై ప్ర‌త్యేక క‌థ‌నాలు ఇస్తారా? ముమ్మాటికీ ఇవ్వ‌రు క‌దా...
మ‌రి ఈటీవీ తెలంగాణ‌లో, ఈనాడు, సాక్షి, ఆంధ్ర‌జ్యోతి తెలంగాణ ఎడిష‌న్ల‌లో ఆంధ్రా పుష్క‌రాల వార్త‌లు ఎందుకు ప్రాముఖ్యంగా వేస్తున్నారు..
మ‌రి ఇదే ప్రాధాన్య‌త క్ర‌మంలో తెలంగాణ పుష్క‌రాల వార్త‌ల‌ను ఆంధ్రా ఎడిష‌న్ల‌లో ఎందుకు వేయ‌డం లేదు?
***************
నోట్‌: తెలంగాణ ఎడిష‌న్ల పేరుతో ఆంధ్రా వార్త‌ల‌ను మ‌న‌పై రుద్దుతున్న ప‌త్రిక‌ల‌కు ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ‌డాన్ని ప్ర‌భుత్వం నిలిపేయాల‌ని విజ్ఞ‌ప్తి...

మిత్రులంద‌రికీ ఈద్ ముబార‌క్‌..

అంద‌రూ సుఖ సంతోషాల‌తో ఉండాలి.. స‌మ‌ష్టిగా తెలంగాణ స‌మాజ అభివృద్ధిలో భాగ‌స్వాములు కావాలి.. జై తెలంగాణ‌.. జై జై తెలంగాణ‌..

Friday 17 July 2015

రిషితేశ్వ‌రిని బ‌లిగొన్న ఈ ముగ్గురు విద్యార్థుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలి...!!


గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివ‌ర్సిటీలో ర్యాగింగ్ వ‌ల్ల ఆత్మ‌హ‌త్య చేసుకున్న రిషితేశ్వ‌రి(14) కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.. హ‌నీషా అనే ద్వితీయ సంవ‌త్స‌రం విద్యార్థిని నాలుగో సంవ‌త్స‌రం చ‌దువుతున్న చ‌ర‌ణ్‌, శ్రీ‌నివాస్‌ల‌ను ప్రేమించాలంటూ రిషితేశ్వ‌రిపై ఒత్తిడి తెచ్చింద‌ట‌.. వీళ్లు ముగ్గురూ మాన‌సికంగా వేధిస్తున్నార‌ని రిషితేశ్వ‌రి త‌న డైరీలో రాసుకుంది... పాపం ఆ అమ్మాయి త‌న అవ‌య‌వాల‌ను పేద‌ల‌కు దానం చేయాల్సిందిగా ఆత్మ‌హ‌త్యా లేఖ‌లోనూ రాసింది.. ఎంత సున్నిత మ‌న‌స్కురాలు.. ఆమెను బ‌లిగొన్న ఈ ముగ్గురు విద్యార్థుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలి...!!

వాళ్ల‌కు త్రిపుర‌లో ఉద్యోగాలు ఇప్పించండి...

వామ‌ప‌క్ష నేత‌ల వెంట ఉన్న జీహెచ్ఎంసీ తొల‌గింపు కార్మికుల్లారా.. బాధ‌ప‌డ‌కండి.. మీ ఉపాధిని దెబ్బ‌కొట్టిన వామ‌ప‌క్ష నేత‌లు మీకు ఉపాధిని చూపుతారు.. వాళ్లు పాలిస్తున్న త్రిపుర‌లో మీకు పారిశుధ్య కార్మికులుగా ఉద్యోగాలు ఇప్పిస్తారు... అక్క‌డ నెల‌కు రూ.5 వేల జీతం ఇస్తున్నారు. మీకూ అంతే జీతం ఇప్పించ‌గ‌ల‌రేమో... అక్క‌డ 15 వేల జీతం అడ‌గొద్దు.. ఈ ఉద్య‌మాల ఊసు అక్క‌డ తీయొద్దు..!!

గివ్ ఇట్ అఫ్ విఫ‌లం ఎవ‌రి ఖాతాలోకి...

జ‌న ధ‌న యోజ‌న ఖాతాల కోసం కొట్ల‌మంది ప్ర‌జ‌లు క్యూ క‌డితే అది మోడీ గారి క్రెడిట్ అన్నారు కొంద‌రు మిత్రులు..
మ‌రి గివ్ ఇట్ ఆప్ అంటూ గ్యాస్ రాయితీని వ‌దులుకోవాల‌ని కోట్ల రూపాయ‌ల‌తో ప్ర‌చారం చేసినా స్పంద‌న లేక‌పోయింది క‌దా.. ఇది మోడీ గారి వైఫ‌ల్యం అనొచ్చంటరా?
**********
ప్ర‌జ‌లు ఎప్పుడైనా ఏదైనా వ‌స్తుందంటే లైన్ క‌డ‌తారు.. వ‌దిలేయాలంటే రాజ‌కీయ నాయ‌కుల మాదిరిగా ప్ర‌జ‌ల కూడా ఇష్ట‌ప‌డ‌రని తెలుసుకోవాలి..
జ‌న ధ‌న యోజ‌న ఖాతాలు తెరిస్తే ప్ర‌మాద బీమా, రూ.5 వేల అప్పులాంటి స‌దుపాయాలున్నాయన్నందుకు జ‌నం వ‌చ్చారు..
కానీ అర‌కొర జీతాల‌తో ఉన్న వాళ్లు చ‌మురు రాయితీని ఎలా వ‌దులుకుంటారు చెప్పండి..

బోల్తా ప‌డ్డ న‌యా కామ్రేడ్లు...

డ్యామిడ్ క‌థ అడ్డం తిరిగిందే..
బోల్తా ప‌డ్డ న‌యా కామ్రేడ్లు...
**********
వాళ్ల‌కు ఎరుపంటే ఇష్టం.. మ‌నుషుల ర‌క్తం చూడ‌టం స‌ర‌దా కావొచ్చు అందుకేనేమో.. వాళ్లు ఉద్య‌మాలు చేస్తారు.. స‌ర్కారు కాల్పులు జ‌ర‌పాలి.. వాళ్ల ఉద్య‌మాలు విజ‌య‌వంత‌మైన‌యని ప్ర‌క‌టించుకోవ‌డ‌మే వారికి తెలుసు.. పాపం జీహెచ్ఎంసీ కార్మికుల‌ను అడ్డం పెట్టుకుని అలాంటి డ్రామానే ఆడాల‌ని చూశారు.. విద్యుత్ కాల్పులు, ముదిగొండ కాల్పుల త‌ర‌హాలో ఏమైనా కాల్పులు జ‌రిగితే మైలేజ్ పొందాల‌నుకున్నారు.. స‌ర్కారు స‌మ్మెపై ఉక్కుపాదం మోప‌కుండానే ఇచ్చిన హామీ మేర‌కు వేత‌నాలు పెంచింది.. పాపం లాఠీఛార్జీలు, కాల్పులు, ఇంకేమైనా జ‌రిగితే బాగుండు.. ఒక‌రిద్ద‌రైనా చ‌నిపోతే బాగుండ‌ని భావించే మ‌నుషుల కోరిక తీర‌లేదు.. 90 శాతం కార్మికులు హాయ్‌గా ఉద్యోగం చేసుకుంటుంటే.. ఇక ఈ న‌యా కామ్రేడ్ల ఉచ్చులో చిచ్చుకున్న 10 శాతం మంది ల‌బోదిబో అంటున్నారు...
**********
నోట్‌: నేను నిజ‌మైన‌, నిఖార్సైయిన‌ కామ్రేడ్ల‌ను కామెంట్ చేయ‌ను.. వాళ్లంటే గౌర‌వం.. నియోలిబ‌రిజం త‌ర‌హా న‌యా కామ్రేడ్ల‌ను మాత్ర‌మే విమ‌ర్శిస్తున్నాను..

వామ‌ప‌క్ష పాలిత రాష్ట్రంలో పారిశుద్ధ్య కార్మికుడికి రోజుకు ఇచ్చే వేత‌నం ఎంతో తెలుసా?

వామ‌ప‌క్ష నేత‌లు చెప్పినంత జీతాలు ఇవ్వాలంటున్నారు క‌దా.. ఇంత‌కీ వామ‌ప‌క్ష పాలిత రాష్ట్రంలో పారిశుద్ధ్య కార్మికుడికి రోజుకు ఇచ్చే వేత‌నం ఎంతో తెలుసా?
అక్ష‌రాలా 180 రూపాయాలు మాత్ర‌మే...!!
అక్క‌డ పారిశుద్ధ్య కార్మికులు మ‌నుషులు కాదా? వాళ్లు చేసేది పారిశుధ్య ప‌ని కాదా?
కామ్రేడ్స్ స్పందించండి... అక్క‌డ మీ అవ‌స‌రం ఎక్కువ‌గా ఉంద‌నుకుంటాను.. త‌మ్మినేని గారు అక్క‌డ బంద్‌లు చేయండి.. ఇక్క‌డ కాదు..

క‌మ్యూనిస్టుల కోట‌లో పారిశుద్ధ్య కార్మికుల కోసం స‌మ్మె చేసేది ఎవ‌రు?



మ‌న‌ది ధ‌నిక రాష్ట్ర‌మే.. మ‌న వ‌ద్ద ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు, ఔట్ సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగుల‌కు చెల్లిస్తున్న జీతాలు అధిక‌మే..
క‌మ్యూనిస్టు పార్టీలు గ‌గ్గోలు పెడుతున్న‌ట్లు ఇక్క‌డ కార్మికుల హ‌క్కుల‌ను ఎవ‌రూ కాల‌రాయ‌లేదు... ఇచ్చిన హామీ ప్ర‌కారం పాల‌కులు జీతాల‌ను పెంచుతున్నారు.. మ‌రి క‌మ్యూనిస్టు పాలిత ఏకైక రాష్ట్ర‌మైన త్రిపుర‌లో వామ‌ప‌క్షాలు స‌ఫాయి కార్మికుల‌కు ఎంత జీతం ఇస్తుందో తెలుసుకోవాల‌ని ఆస‌క్తి క‌లిగింది.. నిజంగానే క‌మ్యూనిస్టులు కార్మికుల ప‌క్ష‌పాతులే క‌దా.. క‌నీసం ఓ రూ.20 వేలో లేక రూ.15 వేల జీతాన్నో స‌ఫాయి కార్మికుల‌కు ఇస్తున్నారేమో అన్న అనుమానం మ‌న‌సులో ఉండే... ఒక‌సారి చూద్దామ‌ని వెబ్‌సైట్ చూస్తే క‌ళ్లు బైర్లు క‌మ్మాయి... అక్క‌డ రోజుకు రూ.180 వేత‌నాన్ని స‌ఫాయి కార్మికుల‌కు ఇస్తున్నార‌ట‌...
ఇక గ‌తేడాది అక్క‌డ కార్మిక శాఖ వెబ్‌సైట్లో నైపుణ్య‌వంతులైన కార్మికులు, కొంచెం నైపుణ్యం ఉన్న కార్మికుల‌కు, నైపుణ్యం లేని కార్మికుల ఇచ్చే క‌నీస వేత‌నాల‌ను చూస్తే ఆశ్చ‌ర్యం వేసింది... రూ.4 వేలు నైపుణ్యం లేని వాళ్ల‌కు, రూ.4400 కొంచెం నైపుణ్యం ఉన్న వారికి, ఇక నైపుణ్యులైన కార్మికుల‌కు రూ.4900 జీతం ఇస్తున్నారు...
అంగ‌న్వాడీ కార్య‌క్త‌ల‌కు ఇచ్చే గౌర‌వ‌వేత‌న‌మూ అంతంతే...
మ‌రి ఈ వామ‌ప‌క్ష నేత‌ల‌కు ఇత‌ర రాష్ట్రాల్లో ఇంత జీతం ఇవ్వాలి.. అంత జీతం ఇవ్వాల‌ని డిమాండ్లు పెడుతున్నారు క‌దా..
మ‌రి వాళ్లు పాలించే త్రిపుర‌లో ఇవే జీతాల‌ను అమ‌లు చేయ‌డం లేదు ఎందుకు?
త్రిపుర రాష్ట్రం దాకా ఎందుకు... మీ ప‌త్రిక‌లైన మ‌న తెలంగాణ‌, న‌వ తెలంగాణ‌, ప్ర‌జాశ‌క్తి, విశాలాంధ్ర‌లో మ‌జిథియా వేత‌న స‌వ‌ర‌ణ సంఘం సిఫార్సులు అమ‌లు చేయండి చాలు... ఆ త‌ర్వాత ఎన్నైనా స‌మ్మెలు, బంద్‌లు చేసుకుని చావండి బాబు..!!

బీటెక్ విద్యార్థుల‌ను త‌ల‌ద‌న్నే వేత‌నాలు పొందుతున్న పారిశుధ్య కార్మికులు..

నాలుగేళ్ల క్రితం అనుకుంటా.. ఓ తెలుగు దిన ప‌త్రిక‌లో ఓ స్టోరీ చ‌దివాను.. చాలా ఆస‌క్తిగా అనిపించింది..
***********
సాఫ్ట్‌వేరు రంగం ప‌తాక‌స్థాయిలో ఉన్న స‌మ‌యంలో ఓ బీటెక్ చేసిన కుమార్తెకు నెల‌కు రూ.30 వేల జీతం వ‌చ్చేది.. అదే స‌మ‌యంలో ప్ర‌భుత్వ ఉద్యోగం చేసే తండ్రికి రూ.20 వేల జీత‌మే వ‌చ్చేది.. తండ్రిని మించిన త‌న‌యులు అంటూ ఆ ప‌త్రిక‌లో క‌థ‌నం రాశారు..
తండ్రి 30 ఏళ్లు క‌ష్ట‌ప‌డి ప్ర‌స్తుతం ఎంత జీతం సంపాదిస్తున్నారో.. కుమారులు, కుమార్తెలు తొలి వేత‌నం అంత క‌న్నా ఎక్కువ పొందుతున్నార‌ని ఆ క‌థ‌నం సారాంశం...
****************
ఇప్పుడు బీటెక్ నిరుద్యోగులు ఎక్కువ‌య్యారు.. ఐదారు వేల‌కు ప‌నిచేసే వాళ్ల సంఖ్య వేల‌ల్లో ఉంది... చ‌దువుకున్న వారి క‌న్నా ఎక్కువ సంపాదిస్తున్న జీహెచ్ఎంసీ కార్మికులు అని క‌థ‌నం రాస్తే బాగుంటుంది...
ఇంకో విశేషం చెప్పాలంటే ఆ క‌థ‌నం రాసే రిపోర్ట‌ర్ క‌న్నా జీహెచ్ఎంసీ కార్మికుడి జీత‌మే రెట్టింపు ఉంటుంది..
ఉన్న‌త విద్యాభ్యాసం చేసి అర‌కొర జీతంలో బ‌తుకీడుస్తున్న నిరుద్యోగుల వెత‌లను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపేలా క‌థ‌నం రాయాలి.. ఏ ప‌త్రికా ఆ సాహ‌సం చేయ‌క‌పోవ‌చ్చునేమో... ఎందుకంటే వాళ్ల ప‌త్రిక‌ల్లోనే వెట్టి చాకిరిలో మ‌గ్గుతున్న స‌బ్ ఎడిట‌ర్లు, రిపోర్ట‌ర్లు ఎంద‌రో ఎంద‌రెంద‌రో?

జ‌ర్న‌లిస్టుల‌కు క‌నీస వేత‌నాలు ఇప్పించాలి..

తెలంగాణ ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి...
***********
ప‌త్రిక‌ల్లో ప‌నిచేసే జ‌ర్న‌లిస్టుల‌కు వేత‌న స‌వ‌ర‌ణ సంఘం సిఫార్సులు అమ‌లు కావ‌డం లేదు.. సుప్రీంకోర్టు ఆదేశించినా స‌రే ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు.. కేంద్ర కార్మిక శాఖ కూడా రాష్ట్రాల‌దే బాధ్య‌త అని చెప్పి చేతులు దులుపుకుంది... ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ మ‌జిథియా వేత‌న స‌వ‌ర‌ణ సంఘం సిఫార్సుల‌ను ప‌టిష్టంగా అమ‌లు చేయిస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.. దాదాపు 15 ఏళ్లుగా జ‌ర్న‌లిస్టుల‌కు వేత‌న స‌వ‌ర‌ణ జ‌ర‌గ‌లేదు.. మ‌జిథియా సిఫార్సుల‌ను అమ‌లు చేస్తున్నామ‌ని కొన్ని ప‌త్రిక‌లు అర‌కొర జీతాలు పెంచి చేతులు దులుపుకున్నాయి.. రాష్ట్ర ప్ర‌భుత్వం ఇన్‌స్పెక్ట‌ర్ల‌ను నియ‌మించి ప్ర‌తీ ప‌త్రిక‌లోనూ వేత‌న స‌వ‌ర‌ణ సంఘం సిఫార్సుల‌ను ఎలా అమ‌లు చేస్తున్నారో బ‌హిరంగం విచార‌ణ చేయించాల‌ని విజ్ఞ‌ప్తి.. జ‌ర్న‌లిస్టుల జీవితాల్లో వెలుగులు నింపండి..!!
నోట్‌: ప్రైవేటు సంస్థ‌ల్లో రోజంతా ప‌నిచేసినా క‌నీస వేత‌నానికి నోచుకోని సిబ్బందిని ఆదుకోండి.. కార్మిక చ‌ట్టాల‌ను ప‌టిష్ఠంగా అమ‌లు చేయాల‌ని విజ్ఞ‌ప్తి...

జ‌ర్న‌లిస్టుల కోసం వామ‌ప‌క్షాలు ధ‌ర్నాలు, బంద్‌లు చేస్తారా?

వామ‌ప‌క్ష ప‌త్రిక‌ల‌లో ప‌నిచేస్తున్న జ‌ర్న‌లిస్టుల జీవితాల్లో వెలుగులు ఎప్పుడో... వారికి జీతాల పెంపుద‌ల ఉండ‌దు.. వేత‌న చ‌ట్టాల అమ‌లు ఉండ‌దు.. వారి కోసం స‌మ్మెలు, బంద్‌లు చేస్తారా కామ్రేడ్స్‌...!!

Thursday 16 July 2015

వామ‌ప‌క్ష ఊస‌ర‌వెల్లుల‌తో జాగ్ర‌త్త‌..

అస్తిత్వం కోసం వామ‌ప‌క్షాల ఆరాటం.... తెలంగాణ ఉద్య‌మంలో మాయ‌మైన పార్టీలు మ‌నుగ‌డ కోసం పోరాటం.. పారా హుషార్ తెలంగాణ‌...!!

హిందువుల‌, ముస్లింల మ‌నోభావాలు దెబ్బ‌తిన‌వా?

హిందువులు అతి ప‌విత్రంగా భావించే పుష్క‌రాల స‌మ‌యంలో, ముస్లింల‌కు అతి ప‌విత్ర‌మైన రంజాన్ మాసం ఆఖ‌రి శుక్ర‌వారం రోజున వామ‌ప‌క్షాలు తెలంగాణ‌ బంద్ కు పిలుపునివ్వ‌డంలో ఆంత‌ర్యం ఏంటి? 
వీటి వ‌ల్ల హిందువుల‌, ముస్లింల మ‌నోభావాలు దెబ్బ‌తిన‌వా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మున్సిప‌ల్ కార్మికుల‌కు సంఘీభావం తెల‌ప‌రా?

తెలంగాణ‌లో మున్సిప‌ల్ కార్మికుల‌కు సంఘీభావంగా బీజేపీ వాళ్లు ఈ రోజు హైద‌రాబాద్‌లో ధ‌ర్నా చేస్తున్నారు..
మ‌రి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మున్సిప‌ల్ కార్మికుల‌కు సంఘీభావం తెల‌ప‌రా?

అమ‌ర గాయ‌కుడు రామ‌కృష్ణ ఇక‌లేరు..

జయ జయహే తెలంగాణ పాట పాడిన ప్రముఖ గాయకుడు రామకృష్ణ కన్నుమూశారు. కొంత కాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన జూబ్లీహిల్స్‌ లోని ఆయన నివాసంలో ఈ తెల్లవారుజూమున మృతి చెందారు. 1947 ఆగస్ట్ 20న విజయనగరంలో ఆయన జన్మించారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాలి..

వారిపై నిర్భ‌య కేసు న‌మోదు చేయాలి...!!

గుంటూరులో జ‌రిగిన‌ ర్యాగింగ్ ఘ‌ట‌న‌లో యూనివ‌ర్సిటీ వీసీ ఇద్ద‌రు విద్యార్థుల‌పై చ‌ర్య‌లు తీసుకున్నారు.. వారిని స‌స్పెండ్ చేశాడు..
మ‌రో ముగ్గురు నిందితులు ప‌రారీలో ఉన్నారు.. విద్యార్థిని బ‌ల‌వ‌న్మ‌రాణానికి కార‌ణ‌మైన విద్యార్థుల‌ను క‌ఠినంగా శిక్షించాలి... వారిపై నిర్భ‌య కేసు న‌మోదు చేయాలి...!!

ఇఫ్తార్ విందు ఇచ్చి బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ‌...

మైనారిటీల‌ కోసం ప్ర‌త్యేక ప‌థ‌కం... 
కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ న‌ఖ్వీ వెల్ల‌డి..
ఇఫ్తార్ విందు ఇచ్చి బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ‌...

Wednesday 15 July 2015

ఆంధ్రాలో చ‌దువుకునే తెలంగాణ విద్యార్థుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించండి..



ఆంధ్రాలో చ‌దువుకునే తెలంగాణ విద్యార్థుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించండి.. ఆచార్య నాగార్జున విశ్వ‌విద్యాల‌యంలో ర్యాగింగ్ భూతానికి తెలంగాణ విద్యార్థిని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది.. ఆమె మ‌ర‌ణానికి కార‌ణ‌మైన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలి.. తెలంగాణ ప్ర‌భుత్వం ఈ అంశాన్ని గ‌వ‌ర్న‌ర్ దృష్టికి తీసుకెళ్లాల‌ని విజ్ఞ‌ప్తి...

రెస్ట్ ఇన్ పీస్ ఎల్లో జ‌ర్న‌లిజం... రెస్ట్ ఇన్ పీస్ ఈనాడు జ‌ర్న‌లిజం... !!

నిన్న గుంటూరు జిల్లాలో నాగార్జున యూనివ‌ర్సిటీలో ర్యాగింగ్ వ‌ల్ల వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన విద్యార్థిని ఆత్మ‌హ‌త్య చేసుకుంది... ఈ వార్త‌ను ఈనాడు ప‌త్రిక‌లో మంగ‌ళ‌గిరి జోన్ పేజీలో అప్రాధాన్యంగా వేశారు.. మ‌రి ర్యాగింగ్ వ‌ల్ల ఓ తెలంగాణ విద్యార్థి చ‌నిపోయింది క‌దా.. అదే ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యంలో ర్యాగింగ్ వ‌ల్ల ఎవ‌రైనా గుంటూరు విద్యార్థి చ‌నిపోతే ఇలాగే వేస్తుందా రామోజీ రావు ప‌త్రిక‌...!!
ఎంత దారుణం.. రెస్ట్ ఇన్ పీస్ ఎల్లో జ‌ర్న‌లిజం... రెస్ట్ ఇన్ పీస్ ఈనాడు జ‌ర్న‌లిజం... !!

నిజంగా ఎంత మంది సంద‌ర్శించారు.. సంద‌ర్శిస్తున్నారు.. శాస్త్రియ లెక్క ఉందా?

నిన్న తెలంగాణ‌లో 30 ల‌క్ష‌ల మంది పుష్క‌ర స్నానాలు ఆచ‌రించార‌ని సాక్షి ప‌త్రిక‌లో వ‌చ్చింది..
ఇక తెలంగాణ‌లోని ప్ర‌ధాన ఘాట్ల‌లో 11 ల‌క్ష‌ల మంది పుష్క‌ర స్నానాలు ఆచ‌రించార‌ని న‌మ‌స్తే తెలంగాణ‌లో వ‌చ్చింది..
ఇక తెలంగాణ‌లో 8 ల‌క్ష‌ల మంది పుష్క‌ర స్నానాలు ఆచ‌రించార‌ని ఈనాడులో వ‌చ్చింది... ఆంధ్రాలో 16 ల‌క్ష‌ల మందికి పైగా పుణ్య‌స్నానాలు చేసిన‌ట్లు ఈనాడు రాసింది...

ఆయ‌న‌కు ప‌రువు ఉందంటారా?

ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని ప‌రువు పోగొట్టుకున్న పెద్ద‌మ‌నిషికి ఇంకా ప‌రువు ఉందంటారా?
పుష్క‌ర వైఫ‌ల్యంపై అధికారుల‌పై చంద్ర‌బాబు నాయుడు అస‌హ‌నం ఇది... 
ఈ మాట‌ అనే అర్హ‌త ఆయ‌న‌కు ఉందంటారా?

బాస్‌ను నిర్దోశిగా ప్ర‌క‌టించిన ఈనాడు..

అధికారుల వైఫ‌ల్యం వ‌ల్లే... రాజ‌మండ్రి అప‌శృతి...
ఈనాడు ప‌త్రిక తేల్చేసింది..
బాస్‌ను నిర్దోశిగా ప్ర‌క‌టించేసింది...
ఇంకా న్యాయ విచార‌ణ‌కు ఆదేశించ‌డం ఎందుకో బాబు గారు...?

ప్ర‌తీ దేవుడు, మ‌త ప్ర‌వ‌క్త‌, గురువుల చ‌ల్ల‌ని ఆశీస్సుల‌తో తెలంగాణ వ‌చ్చింద‌న్న‌ది సుష్ప‌ష్టం...

మొన్న ఏడుకొండల‌ వెంక‌న్న‌, బెజ‌వాడ దుర్గ‌మ్మ ఆశీస్సుల‌తో తెలంగాణ సాధించాడ‌న్నాడు..
మ‌ళ్లా క్రిస్మ‌స్ నాటికి ఏసుక్రీస్తు ఆశీర్వాదంతో తెలంగాణ వ‌చ్చిందన్నాడు..
ఇప్పుడేమో అల్లా ద‌య‌తో వ‌చ్చిందంటున్నాడు...
**************
కొంద‌రు మ‌త‌త‌త్వ వాదులేమో అల్లా ద‌య‌తో తెలంగాణ వ‌చ్చింద‌ని కేసీఆర్ అన్నాడు.. ఇది ఎంఐఎంను ప్ర‌స‌న్నం చేసుకోవ‌డానికే అంటూ హ‌డావుడి చేస్తున్నారు..

రేపు గురునాన‌క్ జ‌యంతి కార్య‌క్ర‌మానికి కేసీఆర్ వెళితే.. గురునాన‌క్ చ‌ల్ల‌ని చూపుతో తెలంగాణ వ‌చ్చింద‌ని కేసీఆర్ అంటాడ‌న్న విష‌యం వారికి అర్థం కావ‌డం లేదు..
*********
ప్ర‌తీ దేవుడు, మ‌త ప్ర‌వ‌క్త‌, గురువుల చ‌ల్ల‌ని ఆశీస్సుల‌తో తెలంగాణ వ‌చ్చింద‌న్న‌ది సుష్ప‌ష్టం... వాళ్ల ఆశీస్సులు ఉండ‌గా.. మానవ ప్ర‌య‌త్నం మ‌నం చేశాం.. సాధించుకున్నాం... ఐక్య‌మ‌త్యంతో తీర్చిదిద్దుకోవాల‌నుకుంటున్నాం..!!

వామ‌ప‌క్ష నేత‌ల్లారా... మీ మీడియా సంస్థ‌ల్లో మ‌జీథియా సిఫార్సులు అమ‌ల‌వుతున్నాయా...

జీహెచ్ఎంసీలోని ఔట్ సోర్సింగ్‌ కార్మికుల‌కు రూ.15 వేల నెల జీతం ఇచ్చే వ‌ర‌కూ స‌మ్మె కొన‌సాగుతుంద‌ని వామ‌ప‌క్ష పార్టీల నేత‌లు అంటున్నారు..
వాళ్ల జీతం రూ.15 వేలు ఇప్పించేందుకు స‌మ్మె జ‌రిపిస్తున్నారు బాగుంది... 
*************
మ‌రి మీ ప‌త్రిక‌లైన మ‌న తెలంగాణ‌, న‌వ తెలంగాణ‌, ప్ర‌జా శ‌క్తి, విశాలాంధ్ర‌, 99 టీవీ, 10 టీవీలో కార్మిక చ‌ట్టాలు ఎలా అమ‌ల‌వుతున్నాయి... స‌బ్ ఎడిట‌ర్ల‌కు, రిపోర్ట‌ర్ల‌కు క‌నీస వేత‌నాన్ని ఎంత ఇస్తున్నారు... మ‌జిథియా వేత‌న స‌వ‌ర‌ణ సంఘం సిఫార్సులు అమ‌లు అవుతున్నాయా? లేదా?
సుప్రీంకోర్టు ఆదేశానుసారం మ‌జిథియా వేత‌న స‌వ‌ర‌ణ సంఘం సిఫార్సుల అమ‌ల కోసం స‌బ్ ఎడిట‌ర్లు, రిపోర్ట‌ర్ల‌తో స‌మ్మె చేయించండి... వారికి న్యాయం జ‌రిగేలా కొట్లాడండి... అలా కొట్లాడేందుకు సిద్ధ‌మేనా?

బీజేపీలో ఇఫ్తార్ విందుల‌కు ఆద్యుడు అత‌నే...

బీజేపీలో ఇఫ్తార్ విందుల‌కు ఆద్యుడు.. ప్ర‌ధాని అయిన త‌ర్వాత ఘ‌న‌మైన ఇఫ్తార్ ఇచ్చిన మ‌హ‌నీయుడు ఎవ‌రో కాదు.. భార‌త ర‌త్న అట‌ల్ బిహారి వాజ్‌పేయి...!!

ఇఫ్తార్ విందులు ఇచ్చిన మాజీ ప్ర‌ధాని వాజ్‌పేయి




ఈ విష‌యాలు కొంద‌రి కోసం...
***********
అమెరికా అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా వైట్‌హౌస్‌లో దీపావ‌ళి జ‌రిపాడు.. ఇఫ్తార్ విందు ఇచ్చాడు..
ఎలా ఇస్తావు... అని ఎవ‌రూ ప్ర‌శ్నించ‌లేదు.. ప్ర‌పంచం స్వాగ‌తించింది.. అన్ని ప‌త్రిక‌ల్లో ప్ర‌ముఖంగా వార్త‌లు వ‌చ్చాయి...
*************
భార‌త రాష్ట్ర‌ప‌తి కూడా ఇఫ్తార్ విందులు ఇస్తూ ఉంటారు.. దీన్ని ఎవ‌రూ ప్ర‌శ్నించ‌లేదు.. వ‌చ్చే వాళ్లు వ‌స్తారు.. రాని వాళ్లు ఏదో సాకులు చెప్పి రాకుండా ఉంటారు...
భార‌త ప్ర‌ధాన మంత్రిగా అట‌ల్ బిహార్ వాజ్‌పేయి గారు ఇఫ్తార్ విందు ఇచ్చారు.. అంద‌రూ హ‌ర్షించారు..
ఇక బీజేపీ ముఖ్య‌మంత్రులు వ‌సుంధ‌రా రాజే, శివ‌రాజ్ సింగ్ చ‌వాన్‌లు ఘ‌నంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు.. జ‌నం సంతోషించారు..

సేవ్ ఐపీఎల్‌... సేవ్ ఇండియ‌న్ క్రికెట్‌...!!

దేశంలో ఐపీఎల్ క‌న్నా ముందు ప్ర‌వేశించిన ఇండియ‌న్ క్రికెట్ లీగ్‌కు కూడా బీసీసీఐ అండ‌దండ‌లు ల‌భించి ఉంటే బాగుండేది... ఈ దేశంలోని యువ క్రికెట‌ర్ల‌కు మ‌రింత ప్రోత్సాహం ల‌భించేది... రెండు లీగ్‌లు ఉంటే కాంపిటీష‌న్ ఎక్కువ‌య్యేది.. పోటీ కూడా ఆస‌క్తిక‌రంగా ఉండేదేమో... కానీ ఐసీఎల్‌కు బీసీసీఐ అండ‌దండ‌లు ల‌భించ‌క‌పోగా... ల‌లిత్ మోడీ లాంటి వాళ్ల క‌నుస‌న్న‌ల్లో సాగిన ఐపీఎల్ కుంభ‌కోణాలమ‌యం, ఫిక్సింగ్ ఉచ్చులో చిక్కుకుపోయింది... ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌ను మ‌రింత ప్ర‌క్షాళ‌న చేయాలి... లేక‌పోతే భార‌త రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌ను మించిన అవినీతికి బీసీసీఐ కేంద్ర బిందువుగా మార‌డం ఖాయం...!!

Tuesday 14 July 2015

త‌న మీడియా త‌న శ‌త్రువు...!


త‌న మీడియా త‌న శ‌త్రువు...!
**********
నిజంగా పుష్క‌ర ఏర్పాట్ల‌లో ఏ ప్ర‌భుత్వం కూడా పూర్తిగా ప‌నులు చేయ‌లేదు.. అది తెలంగాణ అయినా స‌రే.. ఆంధ్రా అయినా స‌రే.. ఎందుకంటే కోట్ల మంది భ‌క్తులు వ‌చ్చే పెద్ద వేడుక ఇది.. ఇందులో లోటు పాట్లు ఉంటాయి.. అయితే రాజ‌మండ్రిలో జ‌రిగిన ఉదంతంలో ఆంధ్రా ప్ర‌భుత్వం త‌ప్పు క‌న్నా ఆంధ్రా మీడియా త‌ప్పే ఉంది.. ఎందుకంటే ప‌నులు పూర్తికాలేదు.. త‌గిన ఏర్పాట్లు లేవ‌ని ముందే జ‌నాల‌ను హెచ్చిరించే క‌థ‌నాలు రాసి ఉంటే బాగుండేది.. కానీ బ్ర‌హ్మాండం బ‌ద్ధ‌ల‌య్యేలా ఏర్పాట్లు జ‌రిగాయి.. అహో.. ఒహో అంటూ గ‌త వారం రోజులుగా క‌థ‌నాలు రాస్తూ వ‌స్తుంది.. ఇక తెలంగాణ విష‌యానికి వ‌స్తే ఇక్క‌డ ఏర్పాట్లు లేవు.. ఇక నీళ్లు లేవ‌ని క‌థ‌నాలు రాసింది... దీంతో ప్ర‌తీ ఒక్క‌రూ రాజ‌మండ్రికి పుష్క‌ర స్నానానికి వెళ్లే వాతావ‌ర‌ణాన్ని క్రియేట్ చేసింది... కానీ అధికారులు, ప్ర‌భుత్వం చేసిన ఏర్పాట్లు భ‌క్తుల సంఖ్య‌కు స‌రిపోలేదు.. వారిని క‌ట్ట‌డి చేయ‌డంలో అంద‌రూ చేతులెత్తేశారు.. ఫ‌లితంగా ఇంత మంది అమాయ‌కులు ప్రాణాలు కోల్పోయారు...
త‌న కోపం త‌న శ‌త్రువు అన్న మాట విన్నాం కానీ... చంద్ర‌బాబునాయుడు ప్ర‌భుత్వానికి మాత్రం త‌న మీడియా త‌న శ‌త్రువుగా త‌యారైంది...
వీళ్లు చేసిన అతి వ‌ల్ల పెద్ద‌సంఖ్య‌లో జ‌నాలు వ‌చ్చి ప్రాణాల‌ను కోల్పోయారు..
త‌గిన ఏర్పాట్లు చేయ‌క‌పోయినా భారీ ఏర్పాట్లు చేసిన‌ట్లు త‌ప్పుడు క‌థ‌నాలు రాసిన మీడియా కూడా బాధిత కుటుంబాల‌కు న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల‌ని స‌గ‌టు నెటిజ‌న్‌గా నేను డిమాండ్ చేస్తున్నా...!!

మ‌న‌కేం న్యాయం చేస్తారు..!!

ఒక్క టీఎంసీ నీళ్లు ఇప్పించ‌లేని వాళ్లు.. హైకోర్టు ఏం ఇప్పిస్తారు... మ‌న‌కేం న్యాయం చేస్తారు..!!
ఆలోచించండి తెలంగాణ మేధావుల్లారా...!!

ప్ర‌తీ తిర‌స్కార‌మూ మ‌న పురోగ‌మ‌నానికి నాంది కావాలి..

ఒక‌డు క‌రెంట్ ఇవ్వ‌న‌న్నాడు... మ‌నం క‌రెంట్ ఉత్ప‌త్తి దిశ‌గా అడుగులు వేశాం...
మ‌రొక‌డు పుష్క‌రాల‌కు ఒక్క టీఎంసీ నీళ్లు ఇవ్వ‌మంటే.. ఇవ్వ‌న‌న్నాడు.. మ‌నం మ‌న ప్రాంతంలో భూగ‌ర్భ జ‌లాలు పెంచుకునే దిశ‌గా అడుగులు వేయాలి... ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడుకుని నీటి నిల్వ‌ల‌ను పెంచుకోవాలి...
ప్ర‌తీ తిర‌స్కార‌మూ మ‌న పురోగ‌మ‌నానికి నాంది కావాలి... జై తెలంగాణ‌.. జై జైతెలంగాణ‌..

ఒక్క టీఎంసీ నీళ్లు ఇప్పించ‌లేక‌పోయింది ఎందుకు?

శ్రీ‌శైలంలో నీళ్లు లేక‌పోయినా, నాగార్జున సాగ‌ర్‌లో నీళ్లు లేక‌పోయినా స‌రే... ఆంధ్రాలో మూడో పంట‌కు నీళ్లు ఇప్పించేలా కేంద్ర ప్ర‌భుత్వం తెలంగాణ‌పై ఒత్తిడి చేసింది... వేస‌విలో దాదాపు 10 టీఎంసీల‌కు పైగా నీటిని ఆంధ్రాకు ఇప్పించింది..
మ‌రి తెలంగాణ‌లో కోట్లాది హిందువుల మ‌నోభావాలు కాపాడేందుకు మ‌హారాష్ట్ర స‌ర్కారుతో మాట్లాడి ఒక్క టీఎంసీ నీళ్లు ఇప్పించ‌లేక‌పోయింది ఎందుకు?
**********
మ‌హారాష్ట్ర‌లో ఎన్టీయే ప్ర‌భుత్వ‌మే... ఆంధ్రాలో ఎన్డీయే ప్ర‌భుత్వ‌మే.. న‌డుమ‌న ఉన్న‌ది ఎన్డీయేత‌ర ప్ర‌భుత్వం.. అవ‌స‌రానికి తెలంగాణ‌ను బెదిరించో ఇంకేదో చేసో నీళ్లు తీసుకుపోతారు త‌ప్ప‌.. మ‌న అవ‌స‌రం వ‌చ్చే స‌రికి నీళ్లు ఇప్పించ‌లేరు.. !!

గోదావ‌రి నీళ్లు కావాల‌నుకుంటే త‌పాలా శాఖ‌ను సంప్ర‌దించొండి..

గోదావ‌రి నీళ్లు కావాల‌నుకుంటే త‌పాలా శాఖ‌ను సంప్ర‌దించొండి.. 20 రూపాయాల‌కు అర లీట‌ర్ గోదావ‌రి పుష్క‌ర జ‌లాన్ని మీ ఇంటికి బ‌ట్వాడా చేస్తుంది...ఈ నీటిని కూడా రాజ‌మండ్రి నుంచే తెప్పిస్తున్నారు.. ఆన్‌లైన్లో కూడా ఆర్డ‌ర్ చేయొచ్చు... అన‌వ‌స‌రంగా పుష్క‌ర స్నానం అని వెళ్లి ప్రాణాల మీద‌కు తెచ్చుకోకండి... వృద్ధులు, విక‌లాంగులు, మ‌హిళ‌లు, చిన్నారులు త‌పాలా శాఖ ద్వారా గాడ్ జ‌ల్‌(దైవ జ‌లం)ను పొందండి..!!

రేపు ఎల్లో మీడియా విచార‌ణ‌లో తేలే అంశం ఇదే.. !!

తెలంగాణ నుంచి ఎక్కువ మంది భ‌క్తులు రాజ‌మండ్రికి రావ‌డం వ‌ల్లే ర‌ద్దీ పెరిగి తొక్కిస‌లాట జ‌రిగింది.. 
రేపు ఎల్లో మీడియా విచార‌ణ‌లో తేలే అంశం ఇదే.. !!
***********
నేరం ఆంధ్రా సీఎంది కాదు.. ఆంధ్రా పోలీసుల‌ది కాదు... తెలంగాణ‌లో గోదావ‌రి ఉన్నా స‌రే రాజ‌మండ్రికి ఎక్కువ భ‌క్తులు రాకుండా నిరోధించ‌లేని సీఎం కేసీఆర్ దే అన్నా ఆశ్చ‌ర్యం లేదేమో...!!

ఆ పుష్క‌ర అప‌శృతి తెలంగాణ‌లో జ‌రిగి ఉంటే

ఇంకా న‌యం ఆ పుష్క‌ర అప‌శృతి తెలంగాణ‌లో జ‌రిగి ఉంటే ఈ రామ భ‌క్తులు ఎంత గ‌గ్గోలు పెట్టేవాళ్లో... ఇఫ్తార్ ఇస్తారు కానీ హిందువుల‌ను ప‌ట్టించుకోర‌ని తెగ ఆందోళ‌న వ్య‌క్తం చేసేవారు.. ఇప్పుడు ఆంధ్రాలో పుష్క‌ర ఏర్పాట్ల‌లో ప్ర‌భుత్వం ఘోరంగా విఫ‌లమైనా స‌రే అది అధికారుల త‌ప్పిదం అయిపోయింది... ప్ర‌భుత్వ వైఫ‌ల్యానికి అమాయ‌క భ‌క్తులు ప్రాణాలు కోల్పోయారు.. ఒక్క రైలు ప్ర‌మాదం జ‌రిగితే రైల్వే మంత్రి ప‌ద‌వికి లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి రాజీనామా చేసిన చ‌రిత్ర ఉంది... మ‌రి ఈ వైఫ‌ల్యానికి ఎవ‌రైనా రాజీనామాలు చేస్తారా? ఎవ‌రిపైన నెపం వేస్తారో... బ‌లికావ‌డానికి వ‌న‌జాక్షి లాంటి అధికారుల‌ను వెతుకుతారేమో... వేచిచూడాలి..!

జ‌మైన సెల‌బ్రిటీలు నిఖార్సైయిన స్వ‌చ్ఛ భార‌త్‌, స్వ‌చ్ఛ తెలంగాణ‌, స్వ‌చ్ఛ ఆంధ్ర‌ప్ర‌దేశ్ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకుంటే

ఎంద‌రు సెల‌బ్రిటీలు స్వ‌చ్ఛ భార‌త్ అని, స్వ‌చ్ఛ తెలంగాణ అని, స్వ‌చ్ఛ ఆంధ్ర‌ప్ర‌దేశ్ అని చేసినా స‌రే... నిజ‌మైన సెల‌బ్రిటీలు నిఖార్సైయిన స్వ‌చ్ఛ భార‌త్‌, స్వ‌చ్ఛ తెలంగాణ‌, స్వ‌చ్ఛ ఆంధ్ర‌ప్ర‌దేశ్ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకుంటే ప‌రిస్థితి ఎంత ద‌య‌నీయంగా ఉంటుందో తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల ప్ర‌స్తుత దుస్థితిని చూస్తే తెలిసిపోతుంది... రెండు రాష్ట్రాల్లోనూ మున్సిప‌ల్ కార్మికుల స‌మ్మెతో రోడ్ల‌పై చెత్త పేరుకుపోయింది.. రెండు రాష్ట్రాల్లో పారిశుద్ధ్యం లోపించింది.. !!

Monday 13 July 2015

బీజేపీ వాళ్లు.. ఆ మాత్రం చొర‌వ తీసుకోలేరా?

తెలంగాణ బీజేపీ వాళ్లు మ‌హారాష్ట్ర సీఎంతో మాట్లాడి పుష్క‌రాల‌కు నీళ్లు ఇప్పించొచ్చు క‌దా..
తెలంగాణ ముఖ్య‌మంత్రి మ‌హారాష్ట్ర‌తో మాట్లాడుతున్నాడు.. మీరూ మాట్లాడొచ్చు క‌దా... 
హిందువుల కోసం ఆ మాత్రం చేయ‌లేరా? ఆ మాత్రం చొర‌వ తీసుకోలేరా?

ఈ ఉత్తుత్తి కిడ్నాప్‌ల‌తో పోలీసుల‌కు త‌ల‌నొప్పి..

రంగారెడ్డి జిల్లా రాజేంద్ర న‌గ‌ర్‌లో ఓ వివాహిత కిడ్నాప్ అయిన‌ట్లు టీవీల్లో వార్త‌లు రావ‌డం, అంద‌రూ పోలీసులు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆరోపించ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి.. చివ‌ర‌కు ఆ వివాహిత మ‌రో యువ‌కుడితో ఇష్ట‌పూర్వ‌కంగా వెళ్లిన‌ట్లు పోలీసులు ఈ రోజు ప్ర‌కటించారు.. మొన్నామ‌ధ్య ఓ యువ‌తిని కూక‌ట్‌ప‌ల్లిలో కిడ్నాప్ చేశార‌ని వార్త‌లు వ‌చ్చాయి.. తీరా ద‌ర్యాప్తులో మ‌రో యువ‌కుడితో గుంటూరులో ప్రేమ పెళ్లి చేసుకున్న‌ట్లు తేలింది.. ఇలాంటి కేసుల వ‌ల్ల నిజ‌మైన కిడ్నాప్ కేసుల‌కు అవ‌రోధం ఏర్ప‌డుతోంది.. పోలీసులు టీవీల్లో సెన్సెష‌న్ అవుతున్న ఇలాంటి కేసుల‌పై ఎక్కువ దృష్టి కేంద్రీక‌రించ‌డంతో నిజ‌మైన అప‌హ‌ర‌ణ కేసుల్లో బాధితుల‌కు న్యాయం జ‌ర‌గ‌డం లేదు.. ఇలాంటి కేసుల్లో దొరికిన వారిపైనా క‌ఠినమైన కేసులు న‌మోదు చేయాలి.. భ‌విష్య‌త్ లో ఎవ‌రూ కూడా ఇలా ఉత్తుత్తి కిడ్నాప్ డ్రామాలు ఆడ‌కుండా హెచ్చ‌రిక‌లు పంపాలి..!!

ఆ బ‌స్సుల్లో హిందువులు మాత్ర‌మే ఎక్కుతారా?

పుష్క‌రాల సంద‌ర్భంగా ప్ర‌త్యేక బ‌స్సులు వేస్తున్నారు క‌దా.. ఆ బ‌స్సుల్లో హిందువులు మాత్ర‌మే ఎక్కుతారా?
ముస్లింలు, క్రైస్త‌వులు ఎక్క‌రా? నిజామాబాద్‌లో దిగే ముస్లిం సోద‌రుడిపై పెంచి ఛార్జీల ప్ర‌భావం ఉండ‌దా?
అలాగే క్రైస్త‌వులపై బ‌స్సు భారం ప‌డ‌దా?
మ‌రి హిందువుల పుష్క‌రాల కోసం ప్ర‌త్యేక బ‌స్సులు వేసుకోవ‌డం, ఛార్జీలు పెంచ‌డం, దాన్ని త‌మ‌పై రుద్ద‌డం ఏంట‌ని వాళ్లంతా ఆందోళ‌న చేస్తే?
ఎక్క‌డ న‌డిచే బ‌స్సు అక్క‌డే న‌డిస్తే మ‌రి హిందూ భ‌క్తులు ఏం కావాలి...? పుష్క‌రాల‌కు ఎలా వెళ్లాలి..?
స‌మాజంలో ప్ర‌జ‌లు ప‌ర‌మ‌త స‌హ‌నంతో, సోద‌ర భావంతో క‌ల‌సి మెల‌సి ఉంటుండ‌టం వ‌ల్లే శాంతియుతంగా మ‌నం వినాయ‌క చ‌వితి చేసుకుంటున్నాం, రంజాన్ జ‌రుపుకుంటున్నాం, దీపావ‌ళి చేసుకుంటున్నాం, క్రిస్‌మ‌స్ జ‌రుపుకుంటున్నాం..!!

రైల్వే ఛార్జీలు పెంచితే నోరు మెద‌ప‌రు.. బ‌స్సు ఛార్జీల‌పై భ‌గ్గుమంటారు...

పుష్క‌రాల కోసం ఆర్టీసీ వాళ్లు ప్ర‌త్యేక బ‌స్సుల‌ను న‌డుపుతున్నారు... అలాగే బ‌స్సు ఛార్జీల‌ను పెంచారు..
పుష్క‌రాల కోసం కేంద్ర ప్ర‌భుత్వం ఆధీనంలోని రైల్వేలు ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డుపుతున్నాయి.. అలాగే ఛార్జీల‌ను పెంచింది...
మ‌రి రాష్ట్ర ప్ర‌భుత్వం పుష్క‌రాల కోసం వేసి ఆర్టీసీ ఛార్జీల‌ను పెంచితే బీజేపీ వాళ్లు గ‌గ్గోలు పెడుతున్నారు..
మ‌రి రైల్వే వాళ్లు పుష్క‌రాల పేరిట ప్ర‌యాణికుల‌పై భారం వేశారు క‌దా.. మ‌రి దానిపై గ‌గ్గోలు పెట్ట‌రా?
కేంద్రానికి నివేదించ‌రా?
కేంద్ర రైల్వే మంత్రికి చెప్పి హిందువుల పండుగ‌ల‌కు ఇలా ఛార్జీల‌ను పెంచ‌డం ఏంటని నిల‌దీయ‌రా?

తెలంగాణ‌లో చేస్తే త‌ప్పు.. ఆంధ్రాలో చేస్తే ఒప్పు.. ఇది బీజేపీ తీరు..


తెలంగాణ‌లో మైనారిటీల కోసం ఏమైనా చేస్తే అది బీజేపీకి త‌ప్పు అని అనిపిస్తుంది.. ఆంధ్రాలో మాత్రం ఎన్టీయే కూట‌మి(టీడీపీ-బీజేపీ) మైనారిటీల మెప్పు పొందేందుకు సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేస్తున్నాయి.. ఇక్క‌డేమో మ‌త‌త‌త్వాన్ని రెచ్చ‌గొట్టాల‌ని చూస్తున్నాయి.. అక్క‌డేమో గుట్టుచ‌ప్పుడు కాకుండా త‌మ ప‌ని తాము చేసుకుంటూ పోతున్నాయి... దీనిపై కిష‌న్‌రెడ్డి చూసి తెలంగాణ ప్ర‌భుత్వం కూడా మైనారిటీల కోసం సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేస్తే బాగుంటుంది...

Friday 10 July 2015

నాస్తికులైన క‌మ్యూనిస్టులు కేర‌ళాను పాలించినా అక్క‌డ శ‌బ‌రిమ‌ల‌ ద‌ర్శ‌నానికి ఏర్పాట్లు చేయ‌కుండా ఉన్నారా?

రంజాన్‌కు ప్ర‌భుత్వం ఇఫ్తార్ విందులు ఇవ్వొద్దు.. :  ఓ పార్టీ
పుష్క‌రాల‌కు ప్ర‌భుత్వం ప్ర‌చారం చేయొద్దు  :  ఇంకో పార్టీ
భ‌ద్రాద్రి రాముడికి ప‌ట్టు వ‌స్త్రాలు, త‌ల‌బ్రాల‌ను సీఎం తీసుకెళ్ల‌ద్దు : ఓ పార్టీ
అజ్మీర్ ద‌ర్గాకు ప్ర‌ధాని చాద‌ర్ స‌మ‌ర్పించొద్దు  : మ‌రో పార్టీ
************
వీళ్లు అన్నంత మాత్రాన ఆగుతాయా?   నాస్తికులైన క‌మ్యూనిస్టులు కేర‌ళాను పాలించినా అక్క‌డ శ‌బ‌రిమ‌ల‌ ద‌ర్శ‌నానికి ఏర్పాట్లు చేయ‌కుండా ఉన్నారా?

దేవాల‌యాల‌ను కూల్చేస్తున్న బీజేపీ

బీజేపీ అధికారంలోకి వ‌స్తే రామ‌మందిరం నిర్మించ‌డం మాట అటు ఉంచితే ఉన్న దేవాల‌యాల‌ను కూల్చేస్తుంద‌డీ బాబు...
ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా 100 దేవాలాయాల‌ను కూల్చేసింది.. అది కూడా పొక్లెయిన్ల‌తో కూల్చేయిస్తోంది..
ఎక్క‌డ జ‌రుగుతోంద‌ని అనుకుంటున్నారా? రాజ‌స్థాన్ రాష్ట్రంలో ఇది జ‌రుగుతోంది..
మెట్రో రైలు మార్గం కోస‌మ‌ని 100 దేవాల‌యాల‌ను కూల్చేశార‌ట‌... 250 ఏళ్ల‌కు పైగా చ‌రిత్ర ఉన్న దేవాల‌యాల‌ను కూల్చేశార‌ట‌..
వీటిపై రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ భ‌గ్గుమంటోంద‌ట‌... ధ‌ర్నాలు చేస్తోంద‌ట‌..
దేవాల‌యాలు క‌ట్టిస్తామ‌నే వారు అభివృద్ధి కోసం దేవాల‌యాల‌ను తొల‌గిస్తున్నారు..
ఇదే ప‌నిని బీజేపీ యేత‌ర పాలిత రాష్ట్రంలో జ‌రిగితే ఎంత గ‌గ్గోలు జ‌రిగేది...? ఎన్ని మ‌త ఘ‌ర్ష‌ణ‌లు చోటుచేసుకునేవి...!!

గోదావ‌రి పుష్క‌రాల సంద‌ర్భంగా న‌దీ తీరంలోని ప‌విత్ర పుణ్య‌ధామాల‌ను సంద‌ర్శించండి..


బాహుబ‌లిలో రాజ‌గురువు రూ.50 కోట్లు పెట్టుబ‌డి పెట్టాడా?

బాహుబ‌లిలో రాజ‌గురువు రూ.50 కోట్లు పెట్టుబ‌డి పెట్టాడా?
అందుకే త‌న మీడియాలో బాహుబ‌లి విజ‌యీభ‌వ అంటూ గ‌త కొద్ది రోజులుగా ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నాడా?
త‌న అక్ష‌ర సైనికుల‌తో ఎలాగైన సినిమా గురించి వీలైన‌న్ని ఎక్కువ పాజిటివ్ క‌థ‌నాలు రాయించాల‌ని ఆదేశాలు ఇచ్చిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి..
అందుకే బ్లాక్ టికెట్ల ఊసు ఎత్త‌కుండా సినిమాను ఆకాశానికి ఎత్తేస్తున్నాడా?
ఇంకా ఎంత మంది ఎన్ని ర‌కాల పెట్టుబ‌డులు పెట్టారో ఏంటో?