1

1

Tuesday 7 July 2015

పుష్క‌రాల్లో మీరేం చేస్తారు...?

పుష్క‌రాల్లో మీరేం చేస్తారు...?
*********
తెలంగాణ యువ‌త‌, ప్ర‌జ‌ల‌కు మ‌హ‌త్త‌ర అవ‌కాశం..
భ‌క్తుల‌కు సేవ చేయండి... తెలంగాణ సంస్కృతి గొప్ప‌త‌నాన్ని వివ‌రించండి... మ‌న ఆత్మీయ‌త‌ను పంచండి..
ఈ 12 రోజులూ మ‌న‌మే తెలంగాణకు బ్రాండ్ అంబాసిడ‌ర్లం...
**********
తెలంగాణ‌ ప్ర‌భుత్వ‌మూ వీరి సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవాల‌ని విజ్ఞ‌ప్తి..
వీళ్లంద‌రికీ ధ్రువ‌ప‌త్రాలు అందించాలి..
***********
మ‌రో వారం రోజుల్లో పుష్క‌రాలు అట్ట‌హాసంగా మొద‌ల‌వుతున్నాయి.. ప్ర‌భుత్వ ప‌రంగా ఎన్ని సౌక‌ర్యాలు క‌ల్పించినా స‌రే ఏదో ఒక లోపం ఉంటుంది.. ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌లు వ‌చ్చే కార్య‌క్ర‌మంలో సంపూర్ణ సౌక‌ర్యాల క‌ల్ప‌న క‌ష్ట‌మే.. అయినా స‌రే మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న అత్య‌వ‌స‌రం. అయితే ప్ర‌భుత్వ‌మే కాకుండా ప్ర‌జ‌లు, యువ‌త‌రం కూడా గోదావ‌రి పుష్క‌రాల‌కు దేశ విదేశాల నుంచి వ‌చ్చే భ‌క్తుల‌కు ఉడ‌తా భ‌క్తిగా సేవ‌ను అందించాలి... ప్ర‌భుత్వం కూడా ఎన్ఎస్ఎస్‌, నెహ్రూయువ కేంద్ర‌, ఇత‌ర స్వ‌చ్ఛంద సంస్థ‌లు, స్థానిక యువ‌జ‌న సంఘాలు, ఇత‌ర యువ‌కుల సేవ‌ల‌ను తీసుకోవాలి.. ఇలా పుష్క‌రాల్లో నిస్వార్థంగా సేవ‌లు అందించే వారికి ప్ర‌భుత్వం త‌ర‌ఫున ధ్రువ‌ప‌త్రాల‌ను అందించాలి... పుష్క‌రాలు జ‌ర‌గ‌కున్న గ్రామాలు, న‌గ‌రాల్లోని యువ‌త పాత్ర ఎంతో ఉంటుంది.. ఎందుకంటే వారు అక్క‌డ స్థానికులు కాబ‌ట్టి భ‌క్తుల‌కు మార్గ‌ద‌ర్శ‌నం చేసే అవ‌కాశం ఉంటుంది... పుష్క‌రాల‌కు వ‌చ్చే ప్ర‌జ‌ల కోసం యువ‌త ఈ కింది ప‌నులు చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నా...
*****************
వైద్య సేవ‌లు : ఎంబీబీఎస్ పూర్తి చేసిన వైద్యులు త‌మ వంతుగా వైద్య శిబిరాల‌ను ఏర్పాటు చేయాలి. రోజుకు క‌నీసం 2 గంట‌ల చొప్పున కేటాయించాలి. విడ‌త‌ల వారీగా సేవ‌లు అందిస్తే బాగుంటుంది. ప్ర‌భుత్వ వైద్య శిబిరాలే కాకుండా ప్రైవేటు ఆసుప‌త్రులు కూడా త‌మ వంతు బాధ్య‌త‌గా సేవ‌లు అందించాలి.. 
ఆహార పంపిణీ పుష్క‌రం సంద‌ర్భంగా ర‌ద్దీ ఎక్కువ‌గా ఉంటుంది.. ఈ స‌మ‌యంలో స్వ‌చ్ఛంద సంస్థ‌లు ఆహార పొట్లాల‌ను, ప్ర‌సాదాల‌ను పంపిణీ చేస్తాయి. అయితే తొక్కిస‌లాట జ‌ర‌గ‌కుండా చూసే బాధ్య‌త‌ను యువ‌త భుజ‌స్కందాల‌పై వేసుకోవాలి..
*******************
ట్రాఫిక్ నియంత్ర‌ణ : మ‌న వ‌ద్ద ట్రాఫిక్ కానిస్టేబుళ్ల కొర‌త ఉంది. ల‌క్ష‌ల మంది పుష్క‌రాల‌కు వ‌స్తారు కాబ‌ట్టి రోడ్ల‌న్నీ కిక్కిరిసిపోతాయి.. ప్ర‌తీ ఒక్క‌రూ ఇష్టం ఉన్న‌ట్లు రోడ్ల‌పై వెళ్తుంటారు. దీని వ‌ల్ల భ‌క్తుల‌కు ఇబ్బందిగా ఉంటుంది. అందుక‌ని ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ట్రాఫిక్ నియంత్ర‌ణ‌ చేయాలి.. 
***********
విక‌లాంగులు, వృద్ధుల‌ కోసం ప్ర‌త్యేక ఏర్పాట్లు ఉండాలి. వీరికి కూడా యువ‌త సాయం అందించాలి. పుష్క‌ర స్నానం చేయాల‌ని ఎన్నో వంద‌ల కిలోమీట‌ర్లు ప్ర‌యాణం చేసి వ‌చ్చే వీరికి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా చూడాలి..
***************
ఆత్మీయ ప‌ల‌క‌రింపే అతి కీల‌కం : పుష్క‌రానికి వ‌చ్చే ప్ర‌తీ భ‌క్తుడు మ‌న అతిథే.. మ‌న అతిథిని మ‌నం గౌర‌వించుకోవాలి.. మ‌న ఊరికి వ‌చ్చిన అతిథికి మ‌న ఊరి విశేషాల‌ను తెలియ‌జెప్పాలి. బ‌స్టాండ్‌లు, ఇత‌ర ప్రాంతాల్లో వారికి తెలియ‌ని విష‌యాల‌ను చెప్పేందుకు ప్ర‌తీ పౌరుడు ముందుండాలి. వీలైతే నా సాయం తీసుకోండి అని బోర్డును ఏర్పాటు చేసుకుని స్థానిక యువ‌కులు బ‌స్టాండ్‌లో కూర్చుంటే బాగుంటుంది. విడ‌త‌ల వారీగా వారు 24 గంట‌లు సేవ‌లు అందించాలి. 
ఆటో వాలా దోపిడీని అరిక‌ట్టాలి. మ‌న అతిథుల‌ను, ముఖ్యంగా మ‌హిళ‌లు, యువ‌తుల‌ను జాగ్ర‌త్త‌గా కాపాడాలి. వారి ప‌ట్ల ఎవ‌రైనా అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తే
త‌క్ష‌ణం స్పందించాలి. పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వాలి.
**************
నీళ్ల స‌ర‌ఫ‌రా చేయాలి : పుష్క‌రాల‌కు వ‌చ్చే భ‌క్తుల‌కు మంచినీటిని స‌ర‌ఫ‌రా చేయాలి. ఇవే కాకుండా మీకు తోచిన ఏ మంచి సాయ‌మైనా స‌రే చేయండి.
ఈ 12 రోజులు మీరు చేసే సాయాన్ని మ‌న తెలంగాణ‌కు వ‌చ్చే అతిథులు వారి జీవితాల్లో మ‌ర‌వ‌లేరు. మీరు చేసే ఉడ‌తా భ‌క్తి సాయం వ‌ల్ల మీపైనే కాకుండా తెలంగాణ ప్రాంతంపైనా వారికి మ‌రింత ఎక్కువ గౌర‌వ భావం క‌లుగుతుంది..
పుష్క‌రాల్లో మన‌మూ భాగ‌స్వామ్యం అవుదాం.. మ‌న అతిథుల‌ను గౌర‌వించుకుందాం.. 
జై తెలంగాణ‌.. జై జై తెలంగాణ‌..

No comments:

Post a Comment