మిస్టరీగా రిషితేశ్వరి మరణం..
ఆత్మహత్య కాదంటున్న ప్రజాస్వామ్య హక్కుల సంస్థ సభ్యులు..
ప్రిన్సిపల్ తీరుపై, పోస్టుమార్టం జరిగిన విధానంపై, క్లూస్‌టీం రాకలో ఆలస్యంపై పలు సందేహాలు...
మరో అయేషా మీరా తరహా కేసు కానుందా?
అసలు దోషులకు శిక్ష పడుతుందా?
*********
గుంటూరులో సీనియర్ల వేధింపుల వల్ల ఆత్మహత్య కేసుకున్న రిషితేశ్వరి కేసులో వాస్తవాలను అధ్యయనం చేసేందుకు ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ సభ్యులు బుధవారం ఆచార్య నాగార్జున వర్సిటీకి వచ్చింది. రిషితేశ్వరి మరణం ఓ మిస్టరీగా ఉందని, ఆమెది ఆత్మహత్య కాకపోవచ్చని వాళ్లు అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ కు గతంలో ర్యాగింగ్‌పై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వారు పేర్కొన్నారు..
ప్రస్తుతం ప్రిన్సిపల్ సెలవులో ఉన్నాడని, అయితే అనధికారికంగా విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహిస్తున్నారని, అసలు వాస్తవాలు బయటకు రాకుండా వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు ఆరోపించారు.. ఈ కేసులో ప్రిన్సిపల్ కూడా దోషే అని వారు పేర్కొన్నారు.. అర్కిటెక్చర్ విద్యార్థులకు రాత్రి 2, 3 గంటలకు తరగతులు నిర్వహిస్తున్న విషయం కూడా తమ దృష్టికి వచ్చిందని చెప్పారు..
No comments:
Post a Comment