1

1

Friday 10 July 2015

మ‌న వ‌ద్ద వ్యాపం త‌ర‌హా కేసులు లేవా?


గురివిరెడ్డి అనే మెడిక‌ల్ కాలేజీ విద్యార్థి ఎంసెట్‌లో హైటెక్ కాపీయింగ్ చేసి అన‌ర్హులంద‌రికీ మెడిక‌ల్‌, ఇంజినీరింగ్ సీట్లు వ‌చ్చేలా చేశాడు.. ఎంత మంది అన‌ర్హులు ఇలా మెడిక‌ల్ కాలేజీల్లో చేరారో ఇప్ప‌టికీ లెక్క తేల‌లేదు... ఆ గురివిరెడ్డి కేవ‌లం ఒక్క తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనే కాకుండా పంజాబ్‌, హ‌ర్యానాలోనూ ఇలాగే చేస్తూ పోలీసుల‌కు చిక్కాడు.. ఆ కేసు ఏమైందో ఎవ‌రికీ తెలియ‌దు... అందులో రాజ‌కీయ ప్ర‌మేయం ఉందా? అత‌డి వెన‌క ఎవ‌రున్నారు? ఇలా అనే అంశాలు మిస్ట‌రీగానే మిగిలిపోయాయి.. ఈ కేసును సీబీఐ ద‌ర్యాప్తు చేస్తుంద‌ని విన్నాను.. వీలైనంత త్వ‌ర‌గా ద‌ర్యాప్తు చేసి ఎవ‌రైతే దొంగ‌దారిలో మెడిక‌ల్ సీట్లు పొందారో వాళ్లంద‌రిపైనా క్రిమిన‌ల్ చ‌ర్య‌లు తీసుకోవాలి... వారి వ‌ల్ల న‌ష్ట‌పోయిన వారికి న‌ష్ట‌ప‌రిహారం చెల్లించేలా చేయాలి.. అస‌లు ఎంతో క‌ష్ట‌ప‌డి చ‌దివిన విద్యార్థుల‌కు అన్యాయం చేసి అన‌ర్హుల‌కు ల‌బ్ధి చేకూర్చే ఇలాంటి వారికి కూడా మ‌ర‌ణ‌దండ‌న విధించాల్సిందే..!!
****
ఇక ఏపీపీఎస్సీలో చోటుచేసుకున్న అక్ర‌మాలు అన్నీ ఇన్నీ కానేకావు క‌దా... ఇంట‌ర్వ్యుల పేరిట ఎంద‌రో అభ్య‌ర్థుల భ‌విత‌వ్యాన్ని నాశ‌నం చేసిన ఏపీపీఎస్సీ ఛైర్మ‌న్లు ఎంద‌రో ఉన్నారు..

No comments:

Post a Comment