http://www.imd.gov.in/
భారత వాతావరణ విభాగం వెబ్‌సైట్లో ఇప్పటికీ తెలంగాణ పేరు లేదు.. భౌగోళికంగా తెలంగాణ ఎక్కడ ఉందో సూచించలేదు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిత్రమే వారు తమ వెబ్‌సైట్లో పెట్టుకున్నారు.. కేంద్ర భూ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ పరిధిలోని వాతావరణ విభాగం సత్వరమే స్పందించాలి.. అలాగే వాతావరణ సమాచారాన్ని టీవీ ఛానెళ్లో చెప్పే సమయంలోనూ తెలంగాణ రేఖా చిత్రాన్ని, ఆంధ్రప్రదేశ్ చిత్రాన్ని వేరువేరుగా చూపాలని విజ్ఞప్తి.. నిన్న రాత్రి హెచ్ఎంటీవీలో వాతావరణ సమాచారం వింటున్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బొమ్మనే ఉంచి వారు సమాచారాన్ని ఇస్తున్నారు..
ఇవే కాకుండా బ్యాంకులు, ఎల్ఐసీ, ఐఆర్ సీటీసీ తదితర సంస్థల సేవల్లోనూ తెలంగాణ కనిపించడమే లేదు.. రాష్ట్రం ఏర్పడి ఏడాది గడిచినా ఇంకా మా అస్తిత్వాన్ని గుర్తించకపోతే ఎలా? దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తి..

No comments:
Post a Comment